family

మిద్దె కూలి ముగ్గురు మృతి

Updated By ManamWed, 11/14/2018 - 09:52

Killedఅనంతపురం: జిల్లాలోని కంబాదురు మండలం తిమ్మాపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పాత మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరణించిన వారు తిమ్మక్క, రవి కుమార్, మహాలక్ష్మిలని స్థానికులు తెలిపారు. తీవ్ర గాయాలతో బయటపడ్డ ఇంటి యజమాని హనుమంత రాయుడు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అర్ధరాత్రి దాటిన తరువాత ఈ సంఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కిడారి కుటుంబానికి చంద్రబాబు పరామర్శ

Updated By ManamFri, 09/28/2018 - 14:00

Chandrababu Naiduవిశాఖపట్నం: ఇటీవల మావోల చేతిలో హతమైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు కుటుంబాన్ని సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఈ సందర్భంగా సర్వేశ్వరరావు కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ.. గిరిజనలకు సర్వేశ్వరరావు మంచి నాయకత్వం ఉన్న నేత అని, గిరిజనలకు ఆయన ఎనలేని సేవలందించారని కొనియాడారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు అని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక కిడారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, విశాఖలో నిర్మితమవుతున్న కిడారి ఇంటి నిర్మాణానికి సహకరిస్తామని చెప్పారు.ఇలా తినాలి

Updated By ManamTue, 09/04/2018 - 01:20

మీ ప్రేమకు ప్రతిరూపమైన మీ పిల్లలు ఆహారం తినే విధానాన్ని ఇతరులు అసహ్యించుకుంటే మీకు మనసు చివుక్కుమనదూ?  వీటినుంచి బయటపడాలంటే పిల్లలకు బాల్యంనుంచే ‘టేబుల్ మ్యానర్స్’ తప్పనిసరిగా నేర్పాలి.  ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే... వారిని ట్రైన్ చేయడం తరువాత.. ముందు వారితో పాటు మీరు కలిసి టిఫిన్, భోజనం చేయడాన్ని క్రమంతప్పకుండా పాటించండి. ఎందుకంటే తల్లిదండ్రులు ఏం చేస్తే ... ఎలా చేస్తే పిల్లలు అచ్చం అదే చేస్తారు!


మీరు ఫాలో అవ్వండి
DINNERTIMEటేబుల్ మ్యానర్స్ థియరెటికల్‌గా చెప్పడంకంటే ప్రయోగాత్మ కంగా రోజూ వారికంట పడేలా చేస్తుంటే చాలు అదే వారిని రైటెన్ చేస్తుంది. ఉదాహరణకు తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి పిల్లలతో భోజ నానికి కూర్చునే ముందు కాళ్లు, చేతులు కడుక్కోవడం, బట్టల మీద కారకుండా, పడకుండా తినడం, ఆహారాన్ని ప్లేట్‌లో వృథా చేయకుండా తినడం, మరీ వేగంగా, మరీ స్లోగా కాకుండా ఆహారాన్ని ఎంజాయ్ చేస్తూ సరదాగా తింటే తిన్నది ఒంటికి పడుతుంది, మీ పిల్లలకు తెలిసీ తెలియకుండా ఇదే అలవడుతుంది. భవిష్యత్‌లోనూ మీ ఆహారపు అలవాట్లన్నీ వారికి ఈజీగా వస్తాయి. ఇక డైనింగ్ టేబుల్ వద్ద భోజనానికి కూర్చోగానే అనవసరంగా వాదనలు, అల్లరి చేయకుండా సరదాగా ఎలా ఉండాలనే మ్యానరిజం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే కరకర నమిలేయడం, నచ్చకపోతే ఉమ్మేయడం, రుచి బాగాలేక పోతే అసహ్యించుకోవడం, కాకరకాయ వంటి వెరైటీలు తినమంటే ‘‘బ్యాక్కు, థూ, ఛీ’’ వంటి మాటలు వాడకుండా ఉండేలా మంచి నడవడిక అలవడాలంటే అలా చేయరాదు, ఇలా చేయకూడదు ఎందుకంటే.. అని వారికి తెలిసిన భాషలో వివరించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. పిల్లలకు అలవాటైన, అనుకూల మైన కట్లరీలనే ఎంపిక చేసుకుంటే వారు ఈజీగా, చక్కగా ఆహారాన్ని తినగలరు. ‘‘చాలు.. వద్దు, బొజ్జ నిండింది, ఫుల్ అయింది.. చాలమ్మా, చాలు నాన్నా.. ప్లీజ్, సారీ, థాంక్యూ’’ వంటి పొలైట్ పదాలను తినేటప్పుడు మీరు వాడుతూ ఉంటే వారికి అదే అలవడుతుంది.

కంపల్సరీ...
ఆటల్లో మునిగి ఉండే చిన్నారుల బట్టలు, కాళ్లు, చేతులు అపరిశుభ్రంగా ఉంటాయి కనుక వాటితో అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే ఆహారం తినేముందు, తిన్న తరువాత ఎలా చేతులను క్లీన్ చేసుకోవాలో నేర్పండి. వేళ్ల గోళ్ల మధ్య, నోట్లో పళ్ల మధ్య చిక్కుకున్న ఆహారాన్ని ఎలా తొలగించాలో వరుసగా కొన్ని రోజులపాటు స్వయంగా మీరే చూపుతూ, చేపిస్తే వారు ఆ విధానాన్ని అలవర్చుకుంటారు. నీళ్లు తాగేటప్పుడు గ్లాసుల్లోకి వేళ్లు పెట్టకుండా, బాటిల్ లేదా గ్లాసుతో ఎలా తాగాలన్న టెక్నిక్ వారు మిమ్మల్ని చూసి ఆటోమేటిక్‌గా తెలుసుకుంటారు. కనుక బరువైన గ్లాసుల్లో, గ్లాసు నిండా నీరు, జ్యూస్ వేయకుండా ముందు చిన్న కప్పుల్లాంటివి హ్యాండిల్ ఉన్నవాటిలో వేసి నీరు తాగించడం వారికి అలవాటు చేయండి. ఆతరువాత ప్లెయిన్ గ్లాసులను కూడా వారు స్వయంగా చేతపట్టుకుని నీళ్లు తాగ గలరు. సాధారణంగా ఇళ్లలో అమ్మ మ్మలు, నాన్నమ్మలు, తాతయ్య లుంటే వారే ఇవన్నీ నేర్పుతారు, కనుక తల్లిదండ్రులకు ఇవన్నీ పట్టించుకునే అవసరం ఉండేది కాదు..కానీ చిన్న కుటుంబాలు ఏర్పడం మొదలయ్యాక ఇవి తమ బిడ్డలకు ఎలా నేర్పాలో తల్లిదండ్రులు బయటివారి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం వస్తోంది. 

ఒక చేత్తో తినేలా..
ముఖ్యంగా బర్గర్లు, పిజ్జాలు, నూడుల్స్, మంచూరియా వంటి బయట ఆహారం తినే ప్పుడే పిల్లలు కాస్త ఇబ్బంది పడతారు కనుక వాటిని సింపుల్‌గా ఎలా తినచ్చో మీరు తింటూ చూపండి.. అంతేకాదు చపాతీ, పూరీ, రొట్టెలు వంటివి రెండు చేతులతో పీక్కుని తినడం, నచ్చకపోతే ముక్కలుగా పడేయడం వంటివి మీపిల్లలు చేయకూడదంటే ఒకేసారి వారి కంచెంలో ఎక్కువ క్వాంటిటీని వేయకుండా, కొంచెం వడ్డిస్తూ తినేలా చూసుకోండి. వారికోసం పూరీ, చపాతీ, రొట్టెలు మెత్తగా తయారుచేస్తే ఒకచేత్తోనే తినడం వారికి బాల్యంనుంచే హ్యాబిట్‌గా మారుతుంది.  బ్రెడ్‌పైన జామ్ లేదా వెన్న రాసుకునేందుకు నైఫ్‌ను వైనంగా ఎలా వాడాలి, పళ్లు-కూరగాయల ముక్కలు, నూడుల్స్ ఎలా ఫోర్క్‌తో తినాలి, స్పూన్‌తో సాంబారు వంటివి ఎలా లాగించాలో మీరు తినే విధానాన్నే మీ పిల్లలు కాపీ కొడతారు, వారికి చెబితే అస్సలు అర్థం కాదు, అదే మీరు శుభ్రంగా తింటున్నారనుకోండి..వాళ్లు అలాగే చేస్తారు అంతే. కుటుంబ సభ్యులందరితో కలిసి భోజనానికి కూర్చుని, భోజనం అయ్యాక అందరూ ఒకేసారి లేచి చేతులు కడుక్కోవడం రొటీన్‌గా మార్చండి.. అప్పుడు పంక్తిభేదం లేకుండా, ఓపికగా వారు అందరితో కలిసి ఆహారం తీసుకోవడం అనే నియమాన్ని క్రమంతప్పకుండా పాటిస్తారు. దైవవాణి

Updated By ManamTue, 08/07/2018 - 01:01
  • ఆదర్శ కుటుంబం  

imageకుటుంబ బంధం వల్లనే కొత్తతరం ఉనికిలోకి వస్తుంది. బంధాలు, బంధుత్వాలు ఏర్పడతాయి. కుటుంబంలోని వారు తమ తరువాతి తరం వారి కోసం విస్త తమైన బాధ్యతలను, ప్రేమను, త్యాగనిరతిని కలిగి ఉంటారు. అందుకే కుటుంబ వ్యవస్థను ఉత్తమమైన, పటిష్టమైన ఆధారాలపై నిలబెట్టాలంటుంది ఇస్లాం. కుటుంబ వ్యవస్థ పటిష్టమైతే సమాజం పటిష్టమవుతుంది. కుటుంబ వ్యవస్థకు మూలమైన నికాహ్‌ను (వివాహం) ఇస్లాం కేవలం ధర్మబద్ధం చేయడమే కాకుండా అది ఒక సత్కార్యంగా, పుణ్యప్రదమైన ఆరాధనగా పరిగణిస్తుంది. కుటుంబ సంరక్షుకుడు పురుషుడే. సంతానం తల్లిదండ్రులకు విధేయత చూపాలి. పిల్లల బాధ్యతలను తల్లి, హక్కులను తండ్రి నిర్వర్తించాలి. ఆదర్శ కుటుంబ జీవనం అనేది భార్యాభర్తల పవిత్రబంధంతో ప్రారంభమవుతుంది. భార్యపట్ల సత్ప్రవర్తనతో మెలగాలి. ఆమెను గౌరవించాలి. ఆమె ఎడల మేలును, త్యాగబుద్ధిని కలిగి ఉండాలి.

వారితో సద్వర్తనంతో సంసారం చేయండి. (నిసా) విశ్వాసులకు ఇలా బోధించబడింది : మీకు ఏ కారణం చేతనైనా, ఆమె ఇష్టం లేకపోవచ్చు. మీకు ఇష్టం లేని వస్తువులోనే అల్లాహ్ బహుశా మీ కొరకు ఎంతో మేలు పొందుపరిచి ఉండవచ్చు. (దివ్యఖురాన్ 4:19)

ప్రతివారిలో ఏదో బలహీనత ఉంటుంది. అల్లాహ్ పై భారం వేసి జీవితభాగస్వామితో సర్దుకుపోవాలి. కుటుంబంతో సుఖసంతోషాలను పంచుకోవాలి. భార్య ధార్మికత, నైతికత వంటి సుగుణాలను కలిగిఉంటే ఆమె వల్లనే కుటుంబం వర్ధిల్లుతుంది. అందుకే దైవప్రవక్త (స) ఏమన్నారంటే, ‘‘మీ నడవడిలో అందరికంటే ఉత్తములైనవారే విశ్వాసంలో పరిపూర్ణులు. తమ భార్యల ఎడల అత్యధికంగా మంచిగా మెలిగేవారే మీలో అందరి కంటే మంచి నడవడిక కలవారు’’ అని. ప్రవక్తవారి ప్రకారం తల్లిదండ్రుల హక్కులు అల్లాహ్ హక్కులతో సమానమైనవి.
- ముహమ్మద్ లియాఖత్ ఉద్దీన్కుటుంబాన్ని చంపి.. పెరట్లో పూడ్చి

Updated By ManamThu, 08/02/2018 - 12:05
Kerala

తిరువనంతపురం: ఢిల్లీ బురారీ ఘటన మరవకముందే అలాంటి మరో ఘటన కేరళలో జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇడుక్కి జిల్లాలోని తొడుపుజ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నాలుగు రోజుల క్రితం ఈ నలుగురు తప్పిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు రాగా.. విచారణ చేస్తున్న పోలీసులకు వారి మృతదేహాలు పెరట్లో దొరికాయి. ఆ మృతదేహాలను ఒకదానిపై మరొకటి పూడ్చిబెట్టారు.

ఇక ఇంట్లో అక్కడక్కడా రక్తపు మరకలు ఉండగా.. వారి శరీరాలపై బలమైన గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలం నుంచి కత్తి, సుత్తెను స్వాధీనం చేసుకున్న పోలీసులు, మృతదేహాలను పోస్ట్‌మార్టానికి తరలించారు. మృతుల్లో కె.కృష్ణన్, ఆయన భార్య సుశీల, కుమార్తె అర్ష, కుమారుడు అర్జున్ ఉన్నారు. మరోవైపు వీరి మరణంపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరి మరణం వెనుక చేతబడి కారణమా..? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే వారు ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడేవారు కాదని, కృష్ణన్‌కు రబ్బరు ప్లాంట్ ఉండగా.. ఆయన తాంత్రిక పూజలు చేస్తాడనే అనుమానాలు ఉన్నాయని ఇరుగు పొరుగు వాళ్లు పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలో ఎవరైనా గిట్టని వాళ్లు ఈ దుర్మర్గానికి తలపడి ఉండవచ్చని  పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.రేపు బెజవాడకు సీఎం కేసీఆర్

Updated By ManamWed, 06/27/2018 - 13:01

kcr హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం విజయవాడకు వెళ్లనున్నారు. తన మొక్కును సమర్పించుకునేందుకు కుటుంబంతో సహా బెజవాడకు వెళ్లనున్న కేసీఆర్ ఉదయం 11.30గంటలకు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ముక్కుపుడక సమర్పించనున్నారు కేసీఆర్. మరోవైపు ఆయన రాక నేపథ్యంలో బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని పలు దేవుళ్లకు మొక్కుకున్న కేసీఆర్.. రాష్ట్రం ఏర్పడి అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటి తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా బెజవాడకు వెళ్లనున్నారు. అయితే ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఇప్పటికే రెండు మార్లు ఏపీకి వెళ్లిన విషయం తెలిసిందే.లారీని ఢీకొన్న కారు: కుటుంబం బలి

Updated By ManamFri, 06/22/2018 - 09:29

family పెద్దపల్లి: జిల్లాలోని సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు. కాగా మంథనిలో ఒక ప్రైవేట్ స్కూల్‌ను నడుపుతున్న అరుణ్‌ కుమార్ తన భార్య సౌమ్య, పిల్లలు అఖిలేష్, శాన్విలతో కలిసి హైదరాబాద్‌ నుంచి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో రోడ్డు పక్కనే ఆగి ఉన్న లారీని గమనించక ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.మమ్మల్ని చంపేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోంది..

Updated By ManamWed, 04/11/2018 - 19:40
  • బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి ఆరోపణ..

 Family Security Pulled, Rabri Devi, Conspiracy, To Kill Lalu Yadav, Family పట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనను, భర్త లాలూ ప్రసాద్ యాదవ్ సహా కుటుంబాన్ని బీహార్ ప్రభుత్వం చంపేందుకు కుట్ర పన్నుతోందని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ తన నివాసానికి చుట్టుపక్కలా ఉన్న సెక్యూరిటీని ప్రభుత్వం అర్ధంతరంగా తొలగించినట్టు రబ్రీదేవి ఆరోపించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నఫలంగా భద్రతా సిబ్బందిని ఉపసంహరించడం వెనుక అసలు ఆంతర్యం ఏమిటో తెలియడం లేదు. భద్రతా సిబ్బందిని తొలగించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది. నన్ను, నా కుటుంబాన్ని చంపడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. అయినప్పటికీ.. నాకేం భయం లేదు. ఒంటరిగానే ప్రజల్లోకి వెళ్లగల ధైర్యం ఉంది. ప్రజలే నాకు రక్షణ కవచం. నాకు, నా కుటుంబానికి ఏమైన జరిగితే ప్రభుత్వమే కచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని రబ్రీదేవి వాపోయారు.

కాగా, అవినీతి కేసులో సీబీఐ అధికారులు మాజీ సీఎం రబ్రీదేవి నివాసంలో దాడులు జరిపిన కొద్దిగంటల్లోనే ఆమె నివాసం చుట్టూ 32మంది బీహార్ మిలిటరీ పోలీసు జవాన్లను మంగళవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించింది.గాజుపువ్వులు

Updated By ManamFri, 03/09/2018 - 20:58

విత్తనం భవిష్యత్తుకు ఇచ్చే హామీ పువ్వుగా విరబూస్తుంది. మొలకెత్తడంతోనే విత్తనం కథ ముగిసిపోదు. విత్తనానికి అందమైన కొనసాగింపుగా పువ్వులు విచ్చుకుంటాయి. ప్రకృతికి రంగుల పాఠం నేర్పే గురువులుగా పువ్వులు మనుషులకు కూడా ఎన్నో పాఠాలు చెబుతాయి. ఇవాళ పూసి, రేపొద్దుటికల్లా వాడిపోయే పువ్వు మనిషి జీవితానుభవాన్ని ఒక్కరోజులో కాచివడబోస్తుంది. మనుషులుగా మనం కోల్పోయిన విలక్షణమైన, అందమైన మన అస్తిత్వం పువ్వుల్ని చూసినప్పుడు మనకు గుర్తుకు వస్తుంది. అవి మనలోని సానుకూల ప్రపంచాన్ని నిద్ర లేపుతాయి. పువ్వుల్ని అనుభూతించే కొద్దీ అవి మనలోని మనకి మరింత స్పష్టంగా బొమ్మకడతాయి. ప్రతి పువ్వుకీ తనదైన పరిమళం, రంగు ఉన్నట్టే జీవితంలోని ప్రతి మలుపుకీ తనదైన నిర్వచనం ఉంటుంది. సంతోషానికి పువ్వుల్నే బహూకరిస్తాం. విషాదానికీ పువ్వులతోనే వీడ్కోలు చెబుతాం. జీవితం పూలబాట కాకపోయినప్పటికీ మన బతుకుబాటలో పువ్వులు కాసిని నవ్వుల్ని, మరి కాసిని భావోద్వేగాల్ని వెంటబెట్టుకుని మనకు సదా తోడుగానే ఉంటున్నాయి. అందుకే ఇవాళ ‘మైత్రి’ పువ్వుల తాలూకు కొన్ని భిన్నమైన విశేషాల్ని మీముందుంచుతోంది.    - మీ మైత్రి

imageభూమ్మీద అత్యంత సున్నితమైంది పువ్వు. తాకితే కందిపోతుంది, పొద్దు వాలితే వాడిపోతుంది. అయితే భూమ్మీద అంతకన్నా సున్నితమైంది మరొకటి ఉంది. అదే గాజు. పగిలితే అతకదు. ఈ రెండింటిలోనూ ఇమిడిన ఒకే ధర్మం సున్నితత్వం. గాజుతో పువ్వుల్ని, ఆకుల్ని, రెమ్మల్ని, కొమ్మల్ని ఒకానొక అధివాస్తవిక చిత్రణలో సజీవం చేసిన ఘనత అమెరికన్ శిల్పి డేల్ చిహులీదే! గాజుతో ఎన్నెన్నో శిల్పాల్ని, ప్రతిమల్ని తయారు చేయడం మనకు తెలుసు. గాజు కళాఖండాలకు రూపమివ్వడం అంత సులభమైన విషయమేమీ కాదు. గాజుశిల్పాల చరిత్రలోనే ఒకానొక వైవిధ్యభరిత శైలికి తెరతీశారు చిహులీ. ‘బ్లోన్ గ్లాస్’ శైలిలో చిహులీ గాజు కళాఖండాల్ని రూపొందిస్తారు. ఒకానొక లోహపు గొట్టంలో మానవ శ్వాస గాజుగోళంగా రూపొందే అద్భుత శైలి అది. ఈ గాజుగోళం లేదా గాజు ముద్ద కేవలం ఇసుకతో తయారైందంటే నమ్మశక్యం కాదుimage. ఇసుకను ద్రవరూపంలోకి మార్చి, కాల్చడం ద్వారా చిహులీ అత్యంత సుందరమైన శిల్పాకృతుల్ని తయారు చేస్తారు. తన శిల్పాలకు చిహులీ ప్రకృతి నుంచి ప్రేరణను పొందుతారు. అందుకే ఆయన గాజుతో ఉద్యానవనాల్ని అవలీలగా సృష్టించి ప్రపంచాన్ని అబ్బుర పరిచారు. తన చిన్ననాటి నుంచి చిహులీకి గాజు అంటే ప్రాణం. అరవై ఒక్కేళ్ళ క్రితం తimageన ఇంట్లో స్టెయిన్డ్ గ్లాస్‌ని ఒక గొట్టంతో ఊదడం ద్వారా గాజు బుడగల్ని సృష్టించాడట ఆయన. అప్పటి నుంచి గాజుతో ఆయన రకరకాల ప్రయోగాలు చేశారు. గాజును ఒక ప్రత్యేక గొట్టం ద్వారా ఊదడం వల్ల చిత్రవిచిత్రమైన కళాఖండాల్ని సృష్టించవచ్చునని ఆయన కనిపెట్టారు. అంతవరకు గాజుతో కళాఖండాలు తయారు చేసే సంప్రదాయిక శైలి నుంచి చిహులీ మరింత విభిన్నమైన, తనదైన శైలిని సృష్టించుకున్నారు. చిహులీ వాషింగ్టన్‌లోని టకొమాలో జన్మించారు. ఎన్నెన్నో కష్టనష్టాలకు ఓర్చి తనకు ఇష్టమైన గాజుతో పనిచేయడమే జీవితలక్ష్యంగా మలచుకున్నారు. ఒకసారి 1976లో జరిగిన కారు ప్రమాదంలో ఆయన తన కంటిని పోగొట్టుకుimageన్నారు. కారు అద్దం పగిలి కంటిలో గుచ్చుకుంది. మరోసారి జరిగిన ప్రమాదంలో ఆయన భుజానికి పెద్ద గాయమైంది. దాంతో గాజు శిల్పాలు తయారు చేసేందుకు ఉపయోగించే పైప్‌ను పట్టుకోవడం అసాధ్యమైంది. అయినప్పటికీ చిహులీ వెనుకంజ వేయలేదు. చిహులీ కేవలం గాజుశిల్పి మాత్రమే కాదు. ఆయన చార్‌కోల్, యాక్రిలిక్, గ్రాఫైట్ వంటి పలు మాధ్యమాలతో పని చేయగలరు. జీవితం విసిరిన ప్రతిసవాలుకు చిహులీ గట్టి జవాబే ఇచ్చారు. లాస్ వెగాస్‌లోని బెల్లగియో హోటల్‌లో రెండువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండువేల గాజు శకలాలతో ఆయన సృష్టించిన అతిభారీ కళాఖండమే చిహులీ దీక్షకు నిదర్శనం. ప్రకృతిలో మనకు కనిపించే అనేకా వృక్షాలు, మొక్కలతో పాటు పలురకాల పుష్పాలకు కూడా ఆయన గాజుతో ప్రతిసృష్టి చేశారు. ఈయన కళాఖండాల్ని ప్రపంచవ్యాప్తంగా 200 మ్యూజియంలలో భద్రపరిచారు. సీటెల్ సెంటర్‌లో 2012 నుంచి ‘చిహులీ గార్డెన్ అండ్ గ్లాస్’ పేరిట ఆయన సృష్టించిన గాజు ఉద్యానవనం దీర్ఘకాలం ప్రదర్శితమైంది. పలు రకాల వృక్షాకృతులతో ఆయన సృష్టించిన కళాఖండాలు ప్రపంచవ్యాప్తంగా కళాభిమానుల ప్రశంసల్ని చూరగొన్నాయి.    -కల్కి
 
సుమ‘భారం
పువ్వు సౌందర్యానికి, సౌరభానికి నెలవు. మానసికోద్వేగాల్ని వ్యక్తం చేయడానికి మనం చాలా సందర్భాల్లో పువ్వుల మీదే ఆధార పడతాం. అయితే ఇక్కడ మనం చూస్తున్న పువ్వులు రూపంలో ను, సౌరభంలోను పూర్తిగా భిన్నమైనవి. అందమైన పువ్వు కోసం కొమ్మ దగ్గరికెళితే రెమ్మరెమ్మకూ పుర్రెలు వేలాడడాన్ని చూస్తే ఏమై పోతాం? అలాంటి విచిత్రమైన పువ్వుల గురించి తెలుసుకుందాం. 

snap dragonస్నాప్ డ్రాగన్
సాధారణంగా ఈ పూలను డ్రాగన్ ఫ్లవర్స్ అంటారు. ఈ మొక్క డ్రాగన్ ఆకారంలో ఉండ డమే దీనికి ఆ పేరు రావడానికి కారణం. కాగా ఈ మొక్క చనిపోయే టపుడు విత్త నాల్ని కాయల్లో వదిలి వెళుతుంది. ఈ కాయ లు చూడ్డానికి మనిషి పుర్రెల్ని పోలి ఉంటాయి.

 

 

 

 

 

హూకర్స్ లిప్ hookers lip
చూడ్డానికి అచ్చంగా దొండపండులాంటి పెదాలతో కనిపించే ఈ పువ్వు సైకోట్రియా ఎలాటా అనే వృక్ష జాతికి చెందింది. ఇది దక్షిణ, మధ్య అమెరికాల్లో పెరుగుతుంది. అయితే ఈ అధరాల ఆకృతి పువ్వు వికసించే ముందు కాసేపు మాత్రమే ఉంటుంది. హమ్మింగ్ బర్డ్స్, సీతాకోకచిలుకల వంటి వాటిని ఆకర్షించడానికే ఈ పుష్పం కాసేపు అధర సుధల్ని ఒలికిస్తూ నాటకాలాడుతుంది.

titusటైటన్ ఆరమ్
దీన్ని పువ్వులన్నిం టికీ మాతృరూపంగా భావిస్తారు. అయితే ఇది చూడడానికి లావణ్యంగా ఉండదు. మూడుమీటర్ల ఎత్తు పెరిగి, పరమ దుర్గంధాన్ని వెదజల్లుతుంది ఈ పుష్పం.

 

 

 

 

సుగంధాల క్లిక్కు
మనదేశంలో పువ్వులు లేకుండా రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. రోజూ పక్కింటి గోడ మీద నుంచి మన వాటాలోకి తొంగి చూసేimage మందారం కొమ్మని కాస్త వంచి, ఒక్క పువ్వునైనా కోసి, దేవుడి ముందు పెట్టేసి, చేతులు జోడిస్తాం. పండగ, పబ్బం అంటూ వచ్చిందా ఇక పువ్వులమ్మే పిల్ల కోసం మన కళ్ళు బజారంతా గాలించేస్తాయి. అయితే రంగుల రంగవల్లిలాంటి పూలబజారు అందుబాటులో ఉంటే ఇక మనకు పట్టపగ్గాలే ఉండవు. సత్కారాలకైనా, సత్కార్యాలకైనా పూలదండలు కొనుక్కెళ్ళి, మెడలో వేసి మన గౌరవాన్ని చాటుకుంటాం. ఇవాళైతే బారు జడలు కనుమరుగు కావడంతో సరి పోయింది కానీ, ఓ ఇరవై ఏళ్ళ క్రితమైతే ఎండాకాలం వచ్చిందంటే చాలు మల్లెపూలతో, మొగలి పూలతో అమ్మాయికి జడనల్లే హడావిడీనే వేరు!

పెళ్ళిళ్ళకీ, బారసాలలకీ, గృహప్రవేశాలకీ... అబ్బో, ఒకటేమిటి... వేడుక అంటూ ఒకటి మొదలవ్వాలే కానీ, పూల సంబరానికి కొదవేమీ ఉండదు. పూజ అంటే దేవుడి కన్నా మనకు ముందు గుర్తుకొచ్చేవి పూలే! మరి ఇన్ని అవసరాల్ని తీర్చేదీ పూలమ్మే వాళ్ళేగా! ఆసియాలోనే అతిపెద్ద పూలబజారు ఒకటి మనదేశంలో ఉంది. హుగ్లీ నదీతీరాన ఉన్న ఈ పూలబజారులో ప్రతి రోజూ రెండువేల మంది పూలమ్మే వాళ్ళు వ్యాపారం చేస్తుంటారు.

imageఅదే కోల్‌కతాలోని ‘మాలిక్ ఘాట్  ఫ్లవర్ మార్కెట్’. ఏదో పని మీద మన దేశానికి వచ్చిన డానిష్ ఫోటోగ్రాఫర్ కెన్ హెర్మన్ మాలిక్ ఘాట్ ఫ్లవర్ మార్కెట్‌కు వెళ్ళారు. అక్కడ పూలమ్మే వాళ్ళు కెన్ హెర్మన్ కెమెరాను ఆకర్షించారు. ఈయన తీసిన ఈ ఫోటోలు కేవలం వ్యక్తుల్నే కాదు, వారి జీవన శైలిని, సంస్కృతిని కూడా ఏకమొత్తంగా ప్రతిబింబించాయి. రోజూ మనకు కనిపించే పూలమ్మే వాళ్ళని యధాతథంగా చూపెడుతూనే, పూలకీ, మనుషులకీ మధ్య ఉన్న అనుబంధాన్ని కెన్‌హెర్మన్ కవితాత్మకంగా తన కెమెరాలో బంధించిన వైనం విమర్శకుల మన్ననల్ని పొందింది. ఆయన తొలుత పూలమ్మే ఆడవాళ్ళను కూడా ఫోటోలు తీయాలని ప్రయత్నిస్తే, వాళ్ళు భృకుటి ముడివేయడంతో ఆ ప్రయత్నాన్ని మానుకున్నాడు. కఠినమైన పనులు అవలీలగా చేయగలిగే పురుషుimageలు పువ్వులతో ఎంత సున్నితంగా వ్యవహరించగలరో వీళ్ళని చూశాకే తెలిసిందంటారు కెన్ హెర్మన్.

బంతిపువ్వు లమ్మే కుల్విందర్ తన పని మానుకుని, ఎర్రటి ఎండలో తన ఫోటోలకు ఓపిగ్గా పోజులిచ్చిన వైనాన్ని అభిమానంగా గుర్తు చేసుకుంటారు ఈ ఫోటోగ్రాఫర్. తాను తీసిన ప్రతి ఫోటోకి ఆయన వీళ్ళకి ప్రతిఫలాన్ని కూడా ముట్టజెప్పా రట. రోజుకు 55 మంది పూలమ్మేవాళ్ళని ఆయన ఫోటోలు తీసే వారట. పూలమ్మే వాళ్ళు బెంగాలీ మాత్రమే మాట్లాడేవారు. దాంతో కెన్‌హెర్మన్ ఒక బెంగాలీని సహాయకునిగా నియమించుకుని, ఈ ఫోటోగ్రాఫుల్ని తీశారట. కొన్ని దేశాల్లో భారతదేశమంటే పేదరికం తాండవిస్తుంటుందన్న భావన ఉందని, కానీ తాను తీసిన ఈ ఫోటోల్ని చూసిన తరువాత ఆ అభిప్రాయం మారిపోతుందని ఆయన అంటున్నారు.శ్రీదేవికి ఫోన్ చేసిన ఆ వ్యక్తి ఎవరు?

Updated By ManamTue, 02/27/2018 - 10:24

    Sridevi death: Cops question Boney Kapoor, hotel staff, family; check call logsఅతిలోకసుందరి, లెజండరీ నటి శ్రీదేవి హఠాన్మరణంతో యావత్ సినీ ప్రపంచం మూగబోయింది. ఆమెను కడసారి చూసేందుకు నటీనటులు.. కనీసం టీవీల్లోనైనా చూద్దామని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఆమె మరణంపై నిమిషానికో సంచలన నిజం బయటపడుతోంది. ఇప్పటికే శ్రీదేవి భర్త బోనీకపూర్ మూడున్నర గంటలపాటు సుధీర్ఘంగా పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌‌లో పడి ఆమె మరణించిందని ఫోరెన్సిక్ రిపోర్టులో అధికారులు తేల్చేయడంతో పెను అనుమానాలకు తావిస్తోంది. దీంతో రంగంలోకి దిగిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంత తేలికగా మీరు రిపోర్టు ఎలా ఇచ్చేస్తారంటూ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. దీంతో పబ్లిక్ ప్రాసిక్యూషన్‌‌కు పోలీసులు కేసు అప్పగించారు. ప్రాసిక్యూటర్ సుమారు గంటన్నరపాటు విచారించారు. ఈ విచారణలో పలు ప్రశ్నలకు బోనీ పొంతనలేని సమాధానాలు చెప్పినట్లుగా సమాచారం. దీంతో అసలేం జరిగింది. ఆమెది హత్యా? లేదా ఆత్మహత్యా అని తేల్చేందుకు మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. అంతేకాదు ఆయన దుబాయ్ నుంచి పారిపోకుండా ఉండటానికి పాస్‌పోర్టు సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు..?
ఇవన్నీ ఒక ఎత్తయితే అసలు ఆమె ముంబై శ్రీదేవి కుటుంబం దుబాయ్ వచ్చిన తర్వాత ఎక్కడికెళ్లారు? ఎవరెవరితో మాట్లాడారు? అంతేకాకుండా బోనీ, శ్రీదేవి ఫోన్‌‌లో ఎవరితో మాట్లాడారు? ఏమేం మాట్లాడుకున్నారు అని కాల్ డేటాను సేకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గత రెండురోజులుగా బోనీకపూర్, శ్రీదేవి ఎవరెవరితో మాట్లాడుతూ వచ్చారు? అసలు నిజాలు నిగ్గుతేల్చేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిద్ధమయ్యారు. మరి విచారణలో ఎలాంటి నిజాలు తేలుతాయో వేచి చూడాల్సిందే మరి.

ఎక్స్‌క్లూజివ్ సమాచారం మేరకు..
ఒక వ్యక్తి నుంచి శ్రీదేవికి పదేపదే కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆమె మరణానికి రెండు రోజుల ముందునుంచి ఈ కాల్స్ వచ్చాయని సమాచారం. అసలు ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు ఫోన్ చేశారు?. శ్రీదేవి దుబాయ్‌కు వెళ్లే ముందు నుంచి రెండు రోజుల పాటు ఆమెకు పదేపదే ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చింది? ఫోన్‌లో ఏం మాట్లాడుకున్నారు? ఫోన్‌‌లో ఏమైనా గొడవ జరిగిందా? అందుకే తీవ్ర మనస్తాపంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నారా?. అంతమైన బలమైన కారణాలు లేకపోతే కాల్ డేటా పరిశీలించాల్సిన అవసరమేంటి?  ఎందుకిలా జరిగింది? ఇదంతా కుట్రలో భాగమేనా? అనే కోణంలో పోలీసులు మళ్లీ విచారించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

మొత్తానికి ఈ ఎపిసోడ్‌‌కు అంతటికీ బోనీకపూర్ కీలకంగా మారారు. మోహిత్ మార్వా (బోనీ కపూర్ మేనల్లుడు) కుటుంబాన్ని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే బోనీకపూర్‌ను రషీద్‌కు ఆస్పత్రికి చెందిన ఇద్దరు డాక్టర్లను, ఐదుగురు హోటల్ సిబ్బందిని పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే.

Related News