vijay devarakonda

పోర్న్ సైట్స్‌లా పైరసీ సైట్స్‌ను కూడా బ్యాన్ చేయాలి

Updated By ManamFri, 11/16/2018 - 08:08

ప్రాణం పెట్టారు...
సినిమా పోస్టర్‌లో హీరో కనపడొచ్చు. అయితే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి మాత్రం ఎందరో సాంకేతిక నిపుణులు కష్టం దాగుంటుంది. మా సినిమా విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ బిజోయ్, కెవెురామెన్ సుజిత్ సారంగ్ తదితరులు సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టం బయటివాళ్లకు తెలియకపోవచ్చు. కానీ నాకు తెలుసు.అలాంటిది సిని మా ఫైరసీ అయినప్పుడు వాళ్ళు ఎంత పెయిన్ అను భవించారో అందరికీ తెలియాలి. అప్పుడే మా పెయిన్ ఆడియన్స్‌కి అర్ధమవుతుంది. అందుకే ఆడియో ఫంక్షన్ లో మా టెక్నీషియన్స్ గురించి అలా మాట్లాడాను. 

devarakonda

అలా జరగాలని లేదు
పైరసీ బారిన పడిన తర్వాత ‘గీత గోవిందం’ హిట్ అయ్యింది కదా.. అని ప్రతి సినిమాకి అలాగే జరగాలని లేదు. ఫైరసీ వల్ల మా సినిమాకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ? ఆడియన్స్ సినిమా చూడటానికి థియేటర్స్‌కి వస్తారా? లేదా? అనే టెన్షన్ ఎప్పుడూ ఉంటుంది. ‘పెళ్లి చూపులు’ సినిమా ఫైరసీ జరిగి ఉండి ఉంటే.. నాకు ఆ తరువాత సినిమాలు వచ్చి ఉండేవి కావు. నేను ఇంతదూరం వచ్చి ఉండేవాడ్ని కాదు. ఏమైనా ఫైరసీని బ్యాన్ చెయ్యాలి. పోర్న్ సైట్స్‌ను బ్యాన్ చేసినట్లుగానే ఫైరసీ సైట్స్‌ను కూడా బ్యాన్ చెయ్యాలి.

వాళ్లు ఎక్కడుంటారో తెలిస్తే కదా..
వాళ్లెవరో మనకు తెలిస్తే మనం వాళ్లపై యాక్షన్ తీసుకోవచ్చు. కానీ సినిమాలను పైరసీ చేసేవాళ్లు ఇక్కడే ఉండాలనేం లేదు. వాళ్లు విదేశాల్లో కూడా పైరసీ చేయవచ్చు.  
అసలు ఎవరు ఫైరసీ చేస్తున్నారో తెలిస్తే కదా.. వాళ్ళ మీద ఏదైనా యాక్షన్ తీసుకోవటానికి. చాలా ఫైరసీ సైట్స్ ఉన్నాయి. ఫస్ట్ వాట్ని బ్యాన్ చేసేయాలి. అప్పుడే ఫైరసీ పోతుంది.

వాటిని నమ్మను
సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను నేను నమ్మను. ఎవరైనా సినిమా బాగుందంటేనే  చూస్తారు. లేదంటే ఎవ్వరూ చూడరు. నేనూ అదే నమ్ముతాను. కానీ చాలామంది నాతో కూడా అంటుంటారు నీ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయని.. కానీ నేను వాటిని సీరియస్ గా తీసుకోను.

మనకు నవ్వు వస్తుంది..
‘టాక్సీవాలా’లో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. అలాగే హర్రర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. సినిమాలో క్యారెక్టర్స్ పడే ఇబ్బందులకు, చేసే పనులకు మనకు ఆటోమేటిక్‌గా నవ్వు వస్తుంది.

వాళ్ల గొప్పతనం..
నేను పొగడ్తలను వీలైనంతగా మరచిపోవడానికి ప్రయత్నిస్తాను. బన్నీ ఆన్న, చిరంజీవి సర్ నా గురించి మాట్లాడటం అది వాళ్ళ గొప్పతనం. అంతటి స్టార్స్ నా గురించి అలా మాట్లాడటం నేను ఇప్పటికి నమ్మలేకపోతున్నాను .నాకు ఏభై సంవత్సరాలు వచ్చాక నా గురించి వాళ్ళు మాట్లాడినవి పెట్టుకొని గ్లాస్ లో మందు పోసుకొని తాగుతూ.. ఎంజాయ్ చేస్తాను కానీ.. ఇప్పుడు కాదు.
 
పెద్ద డైరెక్టర్‌తో.. 
పెద్ద డైరెక్టర్, చిన్న డైరెక్టర్ అని ఇప్పటి వరకు ఆలోచించలేదు. మంచి కథ అనిపిస్తే సినిమాలు చేస్తూ వచ్చాను. అయితే వచ్చే ఏడాది మాత్రం ఖచ్చితం గా ఓ పెద్ద డైరెక్టర్ తో సిని మా చేస్తున్నాను. ఆయన ఎవరో ఇప్పుడు చెప్పలేను గాని, ఆయన సినిమా లకి మాత్రం నేను పెద్ద అభిమానిని. అలాంటిది ఆయనే నాతో ఓ సినిమా చేస్తావా? అని నన్ను అడగటం నేను ఎప్పటికీ మర్చిపోలేను. హండ్రెడ్ పర్సంట్ ఆ పెద్ద డైరెక్టర్‌తో సినిమా ఉంటుంది.

తదుపరి చిత్రాలు..
ప్రస్తుతం ‘డియర్ కామ్రే డ్’ జరుగుతుంది. ఈ మంత్ ఎండింగ్ మళ్లీ షూట్‌కి వెళ్లనున్నాము. ఆల్ మోస్ట్ థర్టీ పర్సెంట్ సినిమా అయిపోయిం ది. అది నెక్స్ట్ ఇయర్ మిడిల్ లో రిలీజ్ అవుతుంది.బన్నీ టీ షర్ట్ కాస్ట్ అంతనా..!

Updated By ManamTue, 11/13/2018 - 12:25
Allu Arjun

సినిమాల్లోనే కాకుండా బయట కూడా స్టైలిష్‌గా కనిపిస్తూ స్టైలిష్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్. ప్రతి సినిమాకు లుక్ పరంగానే కాకుండా కాస్ట్యూమ్ పరంగా ఈ హీరో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. కాగా ఇటీవల విజయ్ దేవరకొండ టాక్సీవాలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బన్నీ వేసుకొచ్చిన టీ షర్ట్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఆ ఫంక్షన్‌లో బన్నీ టీ షర్ట్‌ చూసిన కొంతమంది యువత దాని ఖరీదు తెలుసుకోవడానికి ఆసక్తిని చూపారు. ఈ క్రమంలో ఆ టీ షర్ట్ విలువ 65వేలకు పైగా ఉండటం వారిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ షర్ట్‌ను, దాని ధరతో కూడిన ట్యాగ్‌ను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. విజయ్... తనని తాను చెక్కుకున్న శిల్పం

Updated By ManamTue, 11/13/2018 - 04:23

image‘‘ఎవరో మనకు తెలియని చిన్న చిన్న వాళ్లని కూడా గౌరవిస్తుంటాం. అలాగే సినిమా వాళ్లని కూడా గౌరవించండి. బయట నుండి చూసేవాళ్లకు సినిమా అంటే ఎంటర్‌టైన్‌మెంట్.. పేపర్‌లో నాలుగో పేజీలో వార్త కావచ్చు. కానీ మాకు సినిమానే జీవితం’’ అని అన్నారు అల్లు అర్జున్. ఈయన ముఖ్య అతిథిగా ‘టాక్సీవాలా’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్రానికి రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడు. జి.ఎ 2 పిక్చర్స్, యు.వి.క్రియేషన్స్ బ్యానర్స్‌పై ఎస్.కె.ఎన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘‘అన్ని సినిమా ఇండస్ట్రీల కంటే మన తెలుగులోనే అమ్మాయిలను ఎక్కువగా గౌరవిస్తారు. కాబట్టి ధైర్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలి. నిర్మాత ఎస్.కె.ఎన్ జర్నలిస్ట్‌గా, పి.ఆర్.ఒ, కో ప్రొడ్యూసర్‌గా ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా ఎదిగారు. తనని చూసి చాలా చాలా గర్వపడుతుంటాను. విజయ్ గురించి చెప్పాలంటే తనలో ఒరిజినాలిటీ నచ్చుతుంది. కాంటెంపరరీ హీరోలందరం ఓ రొట్టలో ఇరుక్కున్నాం. కానీ విజయ్ రొట్టలో ఇరుక్కోకుండా వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాడు. మేమంతా గోల్డెన్ ప్లేట్‌తో ఇండస్ట్రీలోకి వచ్చాల ఓ రాఘ వేంద్రరావుగారు, అశ్వనీదత్‌గారు మమ్మల్ని లాంచ్ చేశారు. అయితే విజయ్ సెల్ఫ్ మేడ్ పర్సన్. తనని తాను చెక్కుకున్న శిల్పం. చాలా మంచి పెర్ఫామర్. తను ఎదిగిన క్రమంలో ఇప్పుడు నెగిటివ్ ఫోర్సెస్ కూడా అడ్డుపడే అవకాశాలున్నాయి. వాటిని దాటుకుని విజయ్ సక్సెస్ సాధిస్తాడనే నమ్మకం ఉంది. తన సక్సెస్‌ను ఎంజాయ్ చేసేవాళ్లలో నేనూ ఒకడిని. సినిమా అంటే ఎంతో మంది కష్టం దాగుంది. దాన్ని పైరసీలో సినిమా చూసి ఎంకరేజ్ చేయవద్దు. దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్, మ్యూజిక్ డైరెక్టర్ బిజోయ్, కెమెరామెన్ సుజిత్ సారంగ్ సహా ఎంటైర్ యూనిట్‌కు అభినంద నలు’’ అన్నారు.
 

imageఅల్లు అరవింద్ మాట్లాడుతూ ‘‘కెరీర్ ప్రారంభం నుండి విజయ్ వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ వస్తున్నారు. మా బ్యానర్‌లో ఎన్నో సూపర్‌డూపర్ హిట్  చిత్రాలు వచ్చినా తొలిసారి వందకోట్ల రూపాయలను తీసుకొచ్చిన సినిమా గీత గోవిందం. హీరో విజయ్, డైరెక్టర్ రాహుల్‌కి ఈ సినిమా పరంగా అభినందనలు’’ అన్నారు.

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘‘బన్ని అన్నలా ఈ జన్మలో నేను డాన్స్ చేయలేను. మా కష్టంపై ‘పెళ్ళిచూపులు’, ‘అర్జున్ రెడ్డి’లాంటి సినిమాలు చేస్తే ‘గీత గోవిందం’, ఇప్పుడు ‘టాక్సీవాలా’ చిత్రాలతో గీతా ఆర్ట్స్, యు.వి.క్రియేషన్స్ దారి చూపించారు. నేను కూడా అలాగే నాతో పాటు కొంతమందిని ముందుకు తీసుకెళతాను. సినిమా ఎంటర్‌టైన్‌మెంటే అయినా దాని వెనుక చాలా మంది కష్టం, జీవితాలుంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకోండి. సినిమా థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి పైరసీ చేసిన వాళ్లు సిగ్గుపడేలా చేయండి’’ అన్నారు.

నిర్మాత ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ ‘‘నేను నిర్మాతగా మారడానికి కారణమైన వ్యక్తి నా గాడ్‌ఫాదర్ అల్లు అరవింద్‌గారు. సాధారణంగా ఏ ప్రొడ్యూసర్ అయినా తన కొడుకునో, మనవడినో నిర్మాతను చేస్తారు. కానీ ఏలూరు మెగాభిమానిగా బ్యానర్‌లు కట్టుకునే నన్ను అరవింద్‌గారు నిర్మాతను చేశారు. సాధారణంగా అందరి జీవితం ఎ అనే అక్షరంతో ప్రారంభమైతే నా జీవితం మాత్రం ఎఎ అనే రెండు అక్షరాలతో ప్రారంభమైంది. బన్నిగారు తనతో పాటు నేనూ ఎదగాలని కోరుకున్నారు’’ అన్నారు.

చిత్ర దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ మాట్లాడు తూ ‘‘సినిమా ఫస్టాఫ్‌ను మూడు గంటల్లో రాసేశాం.. సెకండాఫ్‌ను పూర్తి చేయడానికి ఆరు నెలలు పట్టింది. నిర్మాత ఎస్.కె.ఎన్‌గారితో పాటు బన్నీవాస్ కూడా మమ్మల్ని ముందుండి నడిపించారు’’ అన్నారు.  ఈ కార్యక్రమంలో హీరోయిన్ ప్రియాంక జవాల్కర్, సంగీత దర్శకుడు జె.కె.బిజోయ్, ఛాయాగ్రహకుడు సుజిత్ సారంగ్ సహా ఇతర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.దేవరకొండ కోసం మరోసారి బన్నీ

Updated By ManamFri, 11/09/2018 - 12:37
Taxiwaala

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘టాక్సీవాలా’. గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా.. రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 11న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రానున్నాడు. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటనను ఇచ్చింది. 

అయితే విజయ్ దేవరకొండ కోసం అల్లు అర్జున్ అతిథిగా రావడం ఇది రెండోసారి. అంతకుముందు విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా బన్నీ వచ్చాడు. గీత గోవిందం, టాక్సీవాలా రెండు చిత్రాలు గీతా ఆర్ట్స్‌ 2లోనే తెరకెక్కిన విషయం తెలిసిందే. ఎన్నికలకు అంబాసిడర్లు

Updated By ManamWed, 11/07/2018 - 03:48
  • ఓటుపై అవగాహన కల్పించనున్న స్పోర్ట్స్ స్టార్లు, సినీ యాక్టర్లు, ప్రజా గాయకులు

  • మహబూబ్ నగర్ జిల్లాకు విజయ్‌దేవరకొండ

  • పోలింగ్  కేంద్రాల్లో దివ్యాంగ ఓటర్లకు వీల్ చైర్లు: రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్‌కుమార్

Rajatkumarహైదరాబాద్: తెలంగాణ ఎన్నికలు సమీపి స్తున్న వేళ ఎన్నికల సంఘం ఏర్పాట్లును వేగవంతం చేస్తోంది.  దివ్యాంగ ఓటర్ల కోసం చేసిన ఏర్పాట్లపై బేగంపేట హరిత ప్లాజాల్లో మంగళవారం ఎన్నికల సంఘం సదస్సు నిర్వహింది. జిల్లా ఎన్నికల అధికారుల సూచన మేరకు 10 నుంచి 15 వేల వీల్ చైర్లు అందు బాటులో పెడుతామని రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్‌కుమార్ తెలిపారు. ఒక పోలింగ్ కేంద్రానికి 8 వీల్ ఛైర్లవరకు అందుబాటులో  ఉంచుతామన్నారు. దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉచిత రవాణా ఏర్పాట్లు చేస్తామని, వారికోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ప్రవేశపెడతామన్నారు. వాదా యాప్ సేవల్ని వినియోగించుకుంటామని చెప్పారు. బధిరులకు ప్రత్యేక కరపత్రాలు ముద్రిస్తామని ఎన్నికల అధికారులందరికీ ప్రాథమిక సైన్ లాంగ్వేజ్‌పై అవగాహన కల్పించామని వెల్లడించారు. రెండురోజుల్లో దివ్యాంగుల సహాయార్థం సీఈఓ తెలంగాణ వెబ్‌సైట్ అందుబాటులో రానుంద న్నారు. మహిళా ఓటర్ల కోసం ఏర్పాటు చేసే పింక్ పోలింగ్ కేంద్రాల్లో పింక్ కలర్‌ను వాడబోమని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో మహిళల కోసం ఒక పింక్ స్టేషన్ ఉంటుందని వివరించారు. సీవిజిల్ ద్వారా ఇప్పటివరకు 1457 ఫిర్యాదులు వచ్చినట్లు, వికారాబాద్‌లో జరిగిన రాజకీయ హత్యపై తనకు సమాచారం లేదన్నారు.

రాష్ట్ర ఎన్నికలకు ఐకాన్లు 
ఓటింగ్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పలు రంగాలకు చెందిన ప్రముఖల్ని అంబాసిడర్లుగా నియమించారు. రాష్ట్ర ఎన్నికల ఐకాన్‌గా సానియా మీర్జా, పుల్లెల గోపీచంద్, వీవీఎస్ లక్ష్మణ్, గోరేటి వెంకన్న, సినీనటి అభినయ శ్రీ, అంజనేయులు, క్రికెటర్ మహేంద్ర, గాయకురాలు శ్రావ్య, టీవీ యాంకర్ సుజాత, శాస్త్రవేత్త బాబునాయక్ ఉన్నారు. జిల్లా స్థాయిలో కూడా ఎన్నికల ఐకాన్లు ఉంటారని చెప్పారు. విజయ్‌దేవరకొండ మహచిరు తరువాత దేవరకొండతో..?

Updated By ManamTue, 10/30/2018 - 12:59

Koratala Siva, Vijay Devarakondaవరుసగా నాలుగు విజయాలతో టాలీవుడ్ టాప్ దర్శకులలో ఒకడిగా పేరు లిఖించుకున్న కొరటాల శివ, తదుపరి ప్రాజెక్ట్‌ను మెగాస్టార్ చిరంజీవితో చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతుండగా.. జనవరి నుంచి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా తాజా సమచారం ప్రకారం ఈ చిత్రం తరువాత కొరటాల, విజయ్ దేవరకొండతో ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన కొరటాల.. పెళ్లిచూపులు తరువాత విజయ్‌తో ఓ సినిమా చేయాలనుకున్నానని.. అయితే అతడికి సెట్ అయ్యే కథను రాసి ఆ తరువాత విజయ్‌ను కలవాలనుకున్నానని తెలిపారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉండగా.. కొరటాల, చిరంజీవి చిత్రం రావడానికి కూడా మరో ఏడాదిన్నర సమయం పట్టేలా ఉంది. ఈ తరువాత ఈ ఇద్దరి కాంబోలో ఓ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.నవంబర్ 16న ‘టాక్సీవాలా’

Updated By ManamSun, 10/21/2018 - 09:59

imageవిజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సీవాలా’. జి.ఎ2 పిక్చర్స్, యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎస్.కె.ఎన్ నిర్మా త.  ఈ చిత్రంతో నిర్మాతగా.... రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడు. ఈ చిత్రం లోని గ్రాఫిక్స్‌కి సంబంధించిన పనుల కారణంగా నే విడుదల విషయంలో కాస్త ఆలస్యమైం ది. సస్పెన్స్, సైంటిఫిక్ థ్రిల్లర్ కథాంశాన్ని హిలేరియస్ కామెడీతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నవంబర్ 16న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.ముహూర్తం కుదిరింది...

Updated By ManamSat, 10/13/2018 - 01:34

యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ కొత్త చిత్రానికి ముహూర్తం కుదిరింది. దసరా సందర్భంగా అక్టోబర్ 18న సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ చిత్రంలో విజయ్‌ుదేవరకొండతో సరసన రాశీఖన్నా, ఐశ్వర్య రాజేశ్, బెల్జియం మోడల్ ఇసాబెల్లెడి నటిస్తున్నారు. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కబోయే ఈ చిత్రాకి క్రాంతి మాధవ్ దర్శకుడు. కె.ఎస్.రామారావు చిత్ర సమర్పకులు. క్రియేుటివ్  కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ సుందరం సంగీతం అందిస్తుండగా.. జె.కె. సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. త్వరలోనే చిత్రంలో నటించబోయే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. 
 

image

 విజయ్, క్రాంతి మాధవ్ చిత్రానికి ముహూర్తం ఫిక్స్

Updated By ManamFri, 10/12/2018 - 14:26
Vijay Deavarakonda, Kranthi Madhav

‘ఓనమాలు’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన క్రాంతి మాధవ్, టాలీవుడ్ సెన్సేషనల్ విజయ్ దేవరకొండతో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్ర ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. దసరా సందర్భంగా అక్టోబర్ 18న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జరగున్నాయి.

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన ముగ్గురు భామలు రొమాన్స్ చేయనున్నారు. వారిలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, ఇజాబెల్లె లైతే ఉన్నారు. కాగా కోలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా రాణిస్తున్న ఐశ్వర్యా రాజేశ్‌, మోడల్‌ ఇజాబెల్లె లైతేలకు ఇదే తొలి తెలుగు చిత్రం కావడం విశేషం. ఇక ఈ చిత్రాన్ని కేఎస్ రామారావు సమర్పణలో కేఏ వల్లభ నిర్మిస్తుండగా.. గోపి సుందర్ సంగీతం అందించనున్నాడు.త‌రుణ్ భాస్క‌ర్ సినిమా బ్యాక్‌డ్రాప్ ఏంటంటే

Updated By ManamTue, 10/09/2018 - 10:57

Tharun Bhascker`ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం` చిత్రంలో కీల‌క‌పాత్ర‌లో న‌టించిన విజ‌య్‌దేవ‌ర‌కొండ‌ను `పెళ్ళిచూపులు` చిత్రంతో హిట్ హీరోగా చేశాడు ద‌ర్శ‌కుడు త‌రుణ్‌భాస్క‌ర్‌. పెళ్ళిచూపులు చిత్రంతో స‌క్సెస్‌ఫుల్ ద‌ర్శ‌కుడిగా పేరుసంపాదించుకున్న త‌రుణ్‌.. బెస్ట్ రైట‌ర్‌గా ఏకంగా నేష‌న‌ల్ అవార్డుని కైవ‌సం చేసుకున్నాడు. త‌దుప‌రిగా `ఈన‌గ‌రానికి ఏమైంది` సినిమా చేశాడు త‌రుణ్‌భాస్క‌ర్‌. `పెళ్ళిచూపులు` అంత గొప్ప‌గా కాక‌పోయినా.. నిర్మాత‌కు లాభాల‌ను తెచ్చిపెట్టిన చిత్రంగా నిలిచింది `ఈ న‌గ‌రానికి ఏమైంది`. కాగా తదుప‌రి త‌రుణ్ భాస్క‌ర్ హీరోగా న‌టించ‌బోతున్నాడు. త‌న‌కు హీరోగా బ్రేక్ ఇచ్చిన త‌రుణ్ భాస్క‌ర్‌ను హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ యువ క‌థానాయ‌కుడు కింగ్ ఆఫ్ హిల్ పేరుతో ఓ నిర్మాణ సంస్థ‌ను స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ బ్యాన‌ర్‌పై ఓ త‌మిళ ద‌ర్శ‌కుడితో ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇందులో త‌రుణ్ భాస్క‌ర్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు. టెర్ర‌రిస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో హైద‌రాబాద్ పాత‌బ‌స్తీకి చెందిన యువ‌కుడిగా త‌రుణ్ భాస్క‌ర్ క‌నిపిస్తార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

Related News