jio

జియో, వాట్సప్ దేశ పర్యటన

Updated By ManamSun, 10/07/2018 - 22:06

WhatsApp-and-Jioహైదరాబాద్: మార్కెట్‌లోకి ప్రవే శిస్తూనే జియో చేసిన సందడి అంతా ఇంతా కాదు. తర్వాత జియో నుంచి వచ్చిన ఫీచర్ ఫోన్ మంచి విజయాన్ని సాధించింది. ఇటీవల మరి న్ని అప్‌డేట్స్‌తో వాట్సప్‌తో వినియోగించేందు కు వీలుగా జియో ఫోన్ 2ను మార్కెట్లో ప్రవేశ పెట్టింది. అయితే జియో ఫోన్2లో వాట్సా ప్ ఎలా వాడాలనే సందేహాలను తీర్చడాని కి జి యో సంస్థ వాట్సప్‌తో కలిసి దేశం మొత్తం పర్యటించనున్నట్లు ప్రకటించాయి. హైదరాబాద్, చెన్నై, భోపాల్, పట్నా, కోల్‌కతా, జైపూర్, అహ్మదాబాద్, పుణె, డెహ్రాడూన్, జమ్ము నగరాల్లో జియో, వాట్రాప్ ప్రచార వాహనం పర్యటించనుం ది. ఈ నెల తొమ్మిదో తేదిన ప్రారంభం కానున్న ఈ పర్యటనలొ సంప్రదాయ పద్దతిలో నాటకాల రూపంలో ప్రాంతాల వారిగా వాట్సప్‌ను ఎలా వాడాలి అనె విషయాన్ని ప్రజలకు తెలపనున్నట్లు జియో అధికారి ఒకరు తెలిపారు. వీటితో పాటు వీడియో రూపంలో కూడా జియో ఫోన్‌లో వాట్సప్ వాడకం పట్ల అవగాహన కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఫోర్బ్స్ జాబితాలో ముకేశ్

Updated By ManamThu, 10/04/2018 - 22:13
  • అంబానీదే మొదటి స్థానం జూసంపన్నుల జాబితాలో 2వ స్థానంలో అజీమ్ ప్రేమ్‌జీ 

  • 3వ స్థానానికి ఎగబాకిన లక్ష్మీ మిత్తల్ 

Mukesh-Amabniన్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ 47.3 బిలియన్ అమెరికన్ డాలర్ల నికర విలువతో వరుసగా 11వ ఏడాది అత్యంత సంపన్న భారతీయునిగా నిలిచారని ఫోర్బ్స్ మ్యాగజైన్ పేర్కొంది. రిలయన్స్ జియో బ్రాడ్‌బ్యాండ్ టెల్కో సర్వీస్ సాధిస్తూ వస్తున్న విజయాలతో ఆయన సంపద 9.3 బిలియన్  డాలర్లు పెరిగిందని, ఈ ఏడాది ఇలా అత్యధికంగా సంపదను పెంచుకున్న వ్యక్తి కూడా ముకేశేనని ఆ పత్రిక వెల్లడించింది. ‘ఫోర్బ్స్ ఇండియా సంపన్నుల 2018 సంవత్సరపు జాబితా’లో విప్రో చైర్మన్ అజిమ్ ప్రేమ్‌జీ రెండవ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆయన ఇప్పటికే ఉన్న 21 బిలియన్ డాలర్ల సంపదకు మరో 2 బిలియన్ డాలర్లను జోడించుకున్నారు. ఆర్సిలార్‌మిత్తల్ చైర్మన్, సి.ఇ.ఓ లక్ష్మీ మిత్తల్ 18.3 బిలియన్ డాలర్ల నికర విలువతో నాల్గవ స్థానం నుంచి మూడవ స్థానానికి ఎగబాకారు. ఆయన సంపద 1.8 బిలియన్ డాలర్లు పెరిగింది. మిత్తల్ తర్వాత, 18 బిలియన్ డాలర్ల నికర విలువతో హిందూజా సోదరులు నాల్గవ స్థానంలో నిలిచారు. పల్లోంజీ మిస్త్రీ 15.7 బిలియన్ డాలర్లతో ఆ తర్వాత స్థానాన్ని ఆక్రమించారు. టాప్ 10 జాబితాలో ఇతర వ్యాపార ప్రముఖులలో శివ్ నాడార్ (14.6 బిలియన్ డాలర్లు), గోద్రెజ్ కుటుంబం (14 బిలియన్ డాలర్లు), దిలీప్ షాంఘ్వీ (12.6 బిలియన్ డాలర్లు), కుమార్ బిర్లా (12.5 బిలియన్ డాలర్లు), గౌతమ్ అదానీ (11.9 బిలియన్ డాలర్లు)లు ఉన్నారు. ‘‘సవాళ్ళతో గడుస్తున్న ఏడాదిలో, రూపాయి చతికిలపడింది. దేశంలోని 100 మంది సంపన్నులు సమష్టిగా వారి సంపదను నిలబెట్టుకోగలిగారు. పైగా, కొత్త కుబేరులు పుట్టుకురావడం కొనసాగుతోంది. భారతదేశపు వ్యవస్థాపక సామర్థ్య శక్తి ఎప్పటిలానే ఆశాభావంతో ఉందని ఇది సూచిస్తోంది’’ అని ఫోర్బ్స్ ఏషియా ఇండియా ఎడిటర్ నాజ్‌నీన్ కర్మాలీ అన్నారు. ఈ ఏడాది శాతం వారీగా చూస్తే అతి పెద్ద లబ్ధిదారుగా బయోటెక్నాలజీ పితామహురాలు కిరణ్ మజుందార్-షా నిలిచారు. జాబితాలో చోటు సంపాదించుకున్న నలుగురు మహిళల్లో ఆమె ఒకరు. కుటుంబాలు, వ్యక్తులు, స్టాక్ ఎక్చ్సేంజీలు, ఎనలిస్టులు, భారతదేశపు రెగ్యులేటరీ ఏజన్సీల నుంచి సేకరించిన సమాచారాన్ని ఆధారం చేసుకుని ఈ జాబితా రూపొందించారు. సెప్టెంబర్ 21నాటి షేర్ల ధరలు, మారకం విలువలను లెక్కలోకి తీసుకున్నారు.జియో యూజర్లకు శుభవార్త!

Updated By ManamWed, 08/15/2018 - 15:54
  • జియో ‘గిగాఫైబర్’ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

  • నేటి నుంచే ప్రీ-బుకింగ్స్ ఆరంభించిన జియో రిలయన్స్

Jio GigaFiber registrations, register online, Jio broadbandముంబై: రిలయన్స్ జియో యూజర్లకు శుభవార్త. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న జియో గిగాఫైబర్‌ బ్రాండ్‌బ్యాండ్ ఆన్‌లైన్ ప్రీ-బుకింగ్స్‌ ప్రారంభయ్యాయి. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రిలయన్స్‌ జియో బుధవారం (ఆగస్టు 15) నుంచి ఆప్టికల్‌ ఫైబర్‌ బ్రాండ్‌బ్యాండ్‌ సేవలకు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. 4జీ సేవలతో వినియోగదారులను ఆకట్టుకున్న రిలయన్స్ సంస్థ జియో నెట్‌వర్క్‌తో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించనుంది. అత్యంత వేగంగా పనిచేసే ఈ గిగాఫైబర్ బ్రాండ్‌ బ్యాండ్ సేవలను ఆఫీసుల్లోనూ లేదా ఇంట్లోనూ కనెక్ట్ చేసుకోవచ్చు.
Jio GigaFiber registrations, register online, Jio broadbandఆసక్తి ఉన్నవారంతా జియో గిగాఫైబర్ కనెక్షన్ కోసం.. గిగాఫైబర్.జియో.కామ్ (gigafiber.jio.com)లో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. గిగో ఫైబర్ కనెక్షన్లను దాదాపు 1,100 నగరాల్లో విస్తరింపజేయనున్నట్టు రిల్ సంస్థ చైర్మన్ ముఖేశ్ అంబానీ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గిగోఫైబర్ కనెక్షన్లకు సంబంధించి ఏ ప్రాంతం నుంచి దరఖాస్తులు ఎక్కువగా వస్తాయో అక్కడే మొదటగా సర్వీసును ప్రారంభిస్తామని జయో సంస్థ వెల్లడించింది. కాగా, ప్రస్తుతానికి జియో గిగాఫైబర్‌ను ఇళ్లలో ఉపయోగించే‌ వినియోగదారులకు నెలకు రూ.1000 ప్లాన్‌తో సెకనుకు వంద మెగాబైట్స్ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ అందించనుంది. గృహ వినియోగదారులకు పది రెట్ల వేగంతో ఇంటర్నెట్‌ అందించనుండగా, గిగాఫైబర్‌ ధరను ఇంకా వెల్లడించాల్సి ఉంది. 

‘గిగోఫైబర్’ కనెక్షన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ..
1. జియో బ్రాండ్ బ్యాండ్‌ కంపెనీ వెబ్‌సైట్‌ jio.com లోకి వెళ్లి gigafiber ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అక్కడి నుంచి gigafiber.jio.com వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అవుతుంది. 
2. గిగాఫైబర్ వెబ్ పేజీలో మీ వ్యక్తిగత వివరాలు (ఇంటి చిరునామా, ఆఫీసు చిరునామా)ను నింపాల్సి ఉంటుంది. 
3. ఆ తరువాత మరో పేజీలో మీ వ్యక్తిగత వివరాలు (పూర్తి పేరు, మొబైల్ నెంబర్)ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాంతో రిజిస్ట్రర్డ్ ఫోన్ నెంబరుకు ఓటీపీ (వన్‌టైమ్ పాస్‌వర్డ్) వస్తుంది.
4. నమోదు ప్రక్రియలో భాగంగా మీకో సంక్షిప్త సమాధానం వస్తుంది.. ‘‘జియో గిగోఫైబర్ మీ ప్రాంతంలో సర్వీసు అందించేందుకు మీకో ఆహ్వానం మాత్రమే. మీ వ్యక్తిగత వివరాలన్నీ jio.com వెబ్‌సైట్‌లో అత్యంత గోప్యంగా ఉంచడం జరుగుతుంది’’ అని స్పష్టంగా ఉంటుంది. 
5. మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీ నెంబరును రిజిస్ట్రేషన్ సమయంలో నమోదు చేయాల్సి ఉంటుంది. దాంతో మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. గిగాఫైబర్‌కు సంబంధించిన రిలయన్స్ జియో యాడ్స్ నమోదు చేసుకున్న వినియోగదారులకు ఎస్ఎంఎస్ ద్వారా అందుతాయి.  జియో టారిఫ్ వార్

Updated By ManamSat, 05/12/2018 - 23:21

jioన్యూఢిల్లీ: జియో పోస్ట్ పెయిడ్ విభాగంలోకి ప్రవేశించడం టెలికాం రంగంలో ప్రత్యర్ధుల మధ్య టారిఫ్ యుద్ధానికి తెరలేపనుంది. దీంతో ప్రస్తుతం ఈ విభాగంలో అగ్ర స్థానంలో ఉన్న భారతీ ఎయిర్‌టెల్, ఐడియా వంటి సంస్థలు వాటి ప్లాన్‌లలో కూడా స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆ సంస్థలు పోస్ట్ పెయిడ్  విభాగం నుంచే 20 శాతం రాబడి సాధిస్తున్నాయి. జియో ప్రవేశం వీటిపై ప్రభావం చూపనుంది. జియో రెండు రోజుల క్రితం రూ. 199 కే పోస్ట్ పెయిడ్ ప్లాన్ ను ప్రకటించింది. ఇందులో 25 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్‌ఎమ్‌ఎస్‌లను అందివ్వనుంది. ఇవే కాకుండా, అంతర్జాతీయ రోమింగ్‌లో కేవలం వాయిస్, డేటా (1ఎంబీ), ఎస్‌ఎమ్‌ఎస్ లకు రూ. 2 చొప్పున నిర్ణయించింది. కాగా రోజుకు రూ. 500లతో అంతర్జాతీయ రోమింగ్ ఆఫర్‌లను కూడా జియో ప్రకటించింది. ఈ ఆఫర్లు మే 15 నుంచి అన్ని సర్కిళ్ళలో అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న అన్ని ఆఫర్ల కంటే దాదాపు 50 శాతం తక్కువ ధరకే ఈ టారీఫ్‌లు ఉండటం విశేషం. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థల్లో పని చేసే 40 శాతం ఉద్యోగులు పోస్ట్ పెయిడ్ వినియోగదారులే.  వారిని అకర్షించేందుకే  జియో వివిధ ఆఫర్లతో పోస్ట్ పెయిడ్ విభాగంలోకి ప్రవేవిస్తున్నట్లు టెలికాం మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.రిలయన్స్ జియోకి జపాన్ రుణం

Updated By ManamMon, 04/16/2018 - 22:03

jioన్యూఢిల్లీ: జపాన్ బ్యాంకుల నుంచి సమురై టెరమ్ రుణంగా సుమారు రూ. 3,250 కోట్లు సమీకరించేందుకు ఒక ఒప్పందంపై టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో సంతకాలు చేసింది. ‘‘రిలయన్స్ జియో ఇన్ఫోకాం లిమిటెడ్ 7 ఏళ్ళ కాల అవధితో సుమారుగా 53.5 బిలియన్ జపనీస్  యెన్‌ల సమురై రుణాన్ని తీసుకునే ఒప్పందంపై సంతకాలు చేసింది. ఈ రుణానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గ్యారంటీ ఇచ్చింది. ప్రస్తుతం సాగుతున్న రిలయన్స్ జియో మూలధన వ్యయానికి ఈ నిధులు వినియోగిస్తారు’’ అని రిలయన్స్ జియో ఒక ప్రకటనలో తెలిపింది. భారతీయ రూపాయల్లో ఇది దాదాపు రూ. 3,248 కోట్లుగా తేలుతుంది. జపాన్ ఇన్వెస్టర్లు తక్కువ వడ్డీపై ఇచ్చే రుణాలను సమురై రుణం అంటారు.  రూ. 20,000 కోట్ల రుణాన్ని సేకరించేందుకు రిలయన్స్ జియో బోర్డు గత నెలలో ఆమోదం తెలిపింది. కంపెనీ మొబైల్ వ్యాపారంలో రూ. 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. సంస్థ 168 మిలియన్ల కస్టమర్లను సంపాదించుకుంది. జియో రాకతో భారీగా ఆదా!

Updated By ManamSun, 04/08/2018 - 22:42
  • వినియోగదారులకు రూ.64 వేల కోట్ల లాభం

  • భారతీయులకు పెరిగిన తలసరి జీడీపీ

  • హార్వర్డ్ అనుబంధ సంస్థ నివేదికలో వెల్లడి

jioన్యూఢిల్లీ: 2016 సెప్టెంబర్ నెలలో రిలయన్స్ జియో మార్కెట్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇది వినియోగదారులకు 10 బిలియన్ల డాలర్లను సేవ్ చేసింది. ఈ మేరకు హార్వార్డ్ బిజినెస్ స్కూల్ అనుబంధ ఐఎఫ్‌సీ (ఇనిస్టిట్యూట్ ఫర్ కాంపిటెటివ్‌నెస్) నివేదిక దీనిని వెల్లడించింది. అంతేకాదు, దీంతో పాటు తలసరి జీడీపీ కూడా పెరిగిందని పేర్కొంది. జియో మార్కెట్లోకి వచ్చిన తొలి నాళ్లలో ఉచిత డేటా అందించింది. ఆ తర్వాత తక్కువ టారిఫ్‌లతో అనేక డేటా ఆఫర్లను తీసుకొచ్చింది. జియోకు ముందు 1జీబీ డేటాకు సగటున రూ. 152 ఉండగా, ఆ తర్వాత అది రూ.10కి పడిపోయింది. దీని వల్ల కోట్లాది మంది భారతీయులకు ఇంటర్నెట్ సదుపాయం చేరింది. తద్వారా వినియోగదారుల డేటా ఖర్చులు కూడా బాగా తగ్గాయి. జియో రాక తర్వాత వినియోగదారులకు ఏటా 10 బిలియన్ డాలర్లు ఆదా అవుతున్నాయి. మన కరెన్సీలో ఇది రూ.64వేల కోట్లు. దీని వల్ల జీడీపీ 5.65% పెరిగిందట. జియో తర్వాత భార త టెలికం మార్కెట్లో అనేక మార్పు లు వచ్చాయని, జీవితకాలం పాటు ఉచి త వాయిస్ కాలింగ్ సదుపాయం కల్పించి జియో ఇతర టెలికాం సంస్థలకు పోటీగా నిలిచిం దని ఆ నివేదిక వెల్లడించింది. జి యో ప్రారంభ మైన ఆరు నెలల్లోనే భారత్ ప్రపంచంలోనే అత్యధిక మొబైల్ డేటా యూజర్లు గల దేశంగా ఎదిగింది. జియోకు పోటీగా ఇప్పటికే అనేక టెలికం సంస్థలు తమ టారిఫ్‌లు తగ్గిస్తున్న విషయం తెలి సిందే. దీంతో వినియోగదారులకు డేటా ఖర్చుల నుంచి ఊరట కలిగింది.జియో ఫోన్ కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్

Updated By ManamSun, 02/11/2018 - 18:12

jioన్యూఢిల్లీ: టెలికాం మార్కెట్లో పెను మార్పులకు కారణమైన రిలయన్స్ జియో, ఫీచర్ ఫోన్లను కూడా అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్లకు సంబంధించి జియో యాజమాన్యం ఓ కొత్త విషయాన్ని వెల్లడించింది. రిలయన్స్ జియో ఫోన్లను ఇన్నాళ్లూ జియో.కామ్‌లోనే అందుబాటులో ఉంచిన ఆ కంపెనీ ఇక నుంచి మొబైల్ వ్యాలెట్ మొబిక్విక్‌ ద్వారా కూడా వినియోగదారులకు అందించనుంది. ఈ మేరకు జియో, మొబిక్విక్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా మొబిక్విక్ బిజినెస్ హెడ్ మాట్లాడుతూ.. జియో ఫోన్లను విక్రయించబోతున్న మొట్టమొదటి మొబైల్ వ్యాలెట్ తమదే కావడం సంతోషంగా ఉందన్నారు. యూజర్లు మొబిక్విక్‌లో ఫోన్‌ను కొనడం ఎంతో సులభమని ఆయన చెప్పారు. యూజర్లు ఫోన్‌ను బుక్ చేసుకోగానే దగ్గరలోని జియో స్టోర్‌కు సంబంధించిన వివరాలు ఎస్‌ఎంఎస్ రూపంలో వస్తాయని.. అక్కడికి వెళ్లి ఫోన్‌ను పొందొచ్చని తెలిపారు. ఇదిలా ఉంటే, జియో ఫోన్ యూజర్లకు రిపబ్లిక్ డే సందర్భంగా ఇటీవలే జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. జియో ఫోన్ యూజర్లు 49రూపాయల ప్యాక్‌తో రీచార్జ్ చేయిస్తే.. 1జీబీ డేటాతో పాటు ఫ్రీ వాయిస్ కాల్స్‌ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించింది. రోజుకు 50 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు కూడా పంపుకోవచ్చు. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 28 రోజులు. ఇంత తక్కువ ధరకే నెలంతా మాట్లాడుకునే సదుపాయాన్ని కల్పించడంపై యూజర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఎయిర్‌‌టెల్ 93 ఆఫర్‌పై ఓ లుక్కేయండి!

Updated By ManamThu, 12/28/2017 - 18:03

airtelటెలికాం రంగంలో జియో పోటీని తట్టుకోవడానికి ఇతర కంపెనీలు ఇప్పటికీ పాట్లు పడుతూనే ఉన్నాయి. జియో ఇటీవల చార్జీలను కాస్త పెంచినా ఇతర కంపెనీలతో పోల్చుకుంటే తక్కువ ధరకు ఎక్కువ డేటాను, కాల్స్‌ను అందిస్తున్నట్లేనని చెప్పక తప్పదు. అయితే ఎయిర్‌టెల్ జియోకు కౌంటర్‌గా 93 రూపాయల ప్యాక్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాక్‌ను రీచార్జ్ చేయించుకుంటే 1జీబీ 3జీ/4జీ‌తో పాటు ఉచిత లోకల్, ఎస్టీడీ కాల్స్ మాట్లాడుకోవచ్చు. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు పంపుకోవచ్చు. అయితే ప్యాక్ కాలపరిమితి మాత్రం 10రోజులే కావడం గమనార్హం. ఈ ప్యాక్ రిలయన్స్ జియో 98 రూపాయల ప్యాక్‌కు కౌంటర్‌గా ఎయిర్‌టెల్ అందిస్తోంది. అయితే జియోతో పోల్చుకుంటే మాత్రం ఈ ప్యాక్ అంత ఆశాజనకంగా లేదని యూజర్లు పెదవి విరుస్తున్నారు. రిలయన్స్ జియో 98 రూపాయల ప్యాక్‌తో రీచార్జ్ చేసుకుంటే అపరిమిత వాయిస్ కాల్స్‌తో పాటు 2.1జీబీ డేటాను ఇస్తున్నట్లు చెబుతున్నారు. పైగా రోజుకు 140 ఎస్‌ఎంఎస్‌లు పంపుకునే సదుపాయం ఉందని, 14రోజుల వ్యాలిడిటీతో ఈ ప్యాక్ అందుబాటులో ఉందని తెలిసింది.మారనున్న రిలయన్స్ జియోఫోన్!

Updated By ManamMon, 12/18/2017 - 20:03

jio, new modelరిలయన్స్ జియోఫోన్...దేశీయ టెలికాం రంగంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ ఏడాది రిలీజ్ చేసిన చాలా హైప్ మొబైల్స్ ఫోన్లలో జియోఫోన్ ఒకటి. మొబైల్ ఇండ స్ట్రీలో అత్యధిక రెస్పాన్స్ పొందింది. ఈ స్మార్ట్ ఫీచర్ ఫోన్ కోసం కొనుగోలుదారులు ఏ స్థాయిలో పోటీ పడ్డారనేది ఈ ఫోన్‌కు ఉన్న డిమాండ్‌తో స్పష్టంగా కనిపించింది. ఈ మధ్యకాలంలో జియోఫోన్ సంచలనం క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. త్వరలోనే ఈ డివైస్ మేడ్ ఇన్ ఇండియాగా మారనుంది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ముకేష్ అంబానీ నేతృత్వం వహిస్తున్నారని రిపోర్ట్స్ వెల్ల డిస్తున్నాయి. చైనీస్ విక్రయదారుల సదుపాయంలో సర ఫరాకు సంబంధించిన సమస్యల కారణంగా ఈ నిర్ణ యం తీసుకోవడం జరిగింది. చైనా యూనిట్లో 6 మిలి యన్ యూనిట్లు కలిగిన మొదటి బ్యాచ్ జియో ఫోన్ ఒ క్కటే. రెండవ బ్యాచ్‌లో, 10మిలియన్ల యూనిట్లు రవా ణా చేయాలని సంస్థ హామీ ఇచ్చింది. డిమాండ్ ఎక్కు వగా ఉండటంతో..ఈ డివైస్ తయారీ చెన్నైతో కూడా ప్రారంభమయింది. డిసెంబర్ 2018 నాటికి జియో 200 మిలియన్ యూనిట్ల విక్రయాలను సాధించా లన్న లక్ష్యా న్ని చేరుకోవడం కష్టమని రిపోర్ట్ పేర్కొంది. జియో ఫోన్‌ను రిలీజ్ చేసిన సమయంలో ముఖేశ్ అంబానీ దేశంలో ప్రతివారంలో 5 మిలియ న్ల జియో ఫోన్లను విడుదల చేయాలన్న టార్గెట్ పెట్టుకున్నా రు. ఈ ఏడాది చివరి నాటికి భారత మార్కెట్లో ఫీచర్ ఫోన్ ప్రొడక్ట్ ప్రారంభం అవుతుందని తెలిపారు. ఇప్పుడే రి యాలిటీకి వచ్చినట్లు కనిపిస్తోంది. జూలైలో డివైస్ రిలీజ్ చేసినప్పటికీ అప్పటి నుంచి జియోఫోన్‌ను ట్రాన్స్ పోర్ట్ చేయడానికి వారు పెట్టుకు న్న టార్గెట్ చేరుకోవటానికి విఫలం అవుతూనే ఉంది. అయితే సంస్థ ఇప్పుడు తన ప్లానును మార్చాలని నిర్ణ యించుకుంది. తక్కువ ధరతో కూడిన ఆండ్రాయిడ్ స్మా ర్ట్ ఫోన్‌కు మార్చడానికి కంపెనీ జియోఫోన్ ప్రొడక్ట్ ఆప డానికి ప్లాన్ వేసింది. జియోఫోన్ ఈమధ్యే ఇంగ్లీష్, హిందీ రెండింటి సపోర్టుతో గూగుల్ అసిస్టెంట్‌ను ప్రారంభించింది.వొడాఫోన్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్

Updated By ManamThu, 12/14/2017 - 19:11

vodafoneజియో దెబ్బకు మిగిలిన అన్ని టెలికాం సంస్థలు పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్ ఛార్జీలను తగ్గిస్తున్నాయి. టెలికాం సంస్థల మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడడంతో ఆయా టెలికాం సంస్థలు భారీ ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. జియో, ఎయిర్‌టెల్, ఐడియా నుంచి తీవ్ర పోటీ ఉండడంతో తాజాగా వొడాఫోన్ కూడా తమ ప్రీపెయిడ్ వినియోగదారులకు కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. రూ.179ల ‘వొడాఫోన్ సూపర్ ప్లాన్’ ఆఫర్ ద్వారా ప్రీపెయిడ్ వినియోగదారులకు అపరిమిత 2జీ డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు లోకల్, ఎస్టీడీ ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. అలాగే రోమింగ్‌లో కూడా ఏ నెట్‌వర్క్‌కు అయినా ఉచిత కాల్స్ వెసులుబాటు ఉంటుంది.  28 రోజుల వ్యాలీడిటీ ఉంటుంది.  ప్రస్తుతం ఈ ఆఫర్ బీహర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మాత్రమే ఉంది. 

అసోం తదితర ఈశాన్య రాష్ట్రాలల్లో కూడా ఇదే తరహా ప్లాన్‌ను వొడాఫోన్ పరిచయం చేసింది. అక్కడ ప్రతి రోజూ 1 జీబీ 4జీ డేటాను ఉచితంగా పొందవచ్చు. ఎస్ఎంఎస్‌లకు 25 పైసలు ఉంటుంది. 

Related News