PETA

ఇంకా జంతువులపై ప్రయోగాలా!

Updated By ManamFri, 08/31/2018 - 23:01
  • వెంటనే వాటిని రద్దు చేయండి.. పీజీ వైద్యవిద్యలో ప్రయోగాలొద్దు

  • కంప్యూటర్ సిమ్యులేషన్ మేలు.. ఎంసీఐని కోరిన పెటా  

imageన్యూఢిల్లీ: జంతువుల ప్రాణాలకు ముప్పు తెచ్చే ప్రయోగాలు చేయడంపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిషేధం విధించినా, ఇప్పటికీ ఆ తరహా పరీక్షలు, ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా వైద్యవిద్యకు సంబంధించిన పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌లోని మెడికల్ ఫార్మకాలజీ, ఫిజియాలజీ సబ్జెక్టులలో కుక్కలు, కుందేళ్లు, ఎలుకలు, గినియా పందుల మీద ప్రయోగాలు చేస్తుంటారు. వాటికి బదులు కంప్యూటర్ సిమ్యులేషన్ పరికరాలను వాడాలని ఎంసీఐ ఎప్పుడో చెప్పింది. కానీ, ఇటీవల పోస్ట్‌గ్రాడ్యుయేట్ కరిక్యులంను సవరించిన తర్వాత  మొత్తం పీజీ సిలబస్ నుంచి జంతువుల ఉపయోగాన్ని పూర్తిగా పరిహరించాలని పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) కోరింది. కేంద్ర పర్యావరణ, అటవీ చట్టాల ప్రకారం జంతువులను ఇలాంటి పరీక్షలు, ప్రయోగాలకు ఉపయోగించకూడదని తెలిపింది. 

జంతువులతో కాకుండా.. కంప్యూటర్ ఆధారిత సిమ్యులేషన్ ద్వారా చదువుకున్న విద్యార్థులు మరింత సులభంగా వాటి శరీర నిర్మాణాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారని, వారికి పరీక్షలలో కూడా మంచి ఫలితాలు వస్తున్నాయని పెటా ఇండియా సైన్స్ పాలసీ సలహాదారు డాక్టర్ దీప్తి కపూర్ తెలిపారు. ఈ మేరకు ఆరోగ్య శాఖ మాజీ మంత్రి, ఎంపీ శ తృఘ్న సిన్హా కూడా ఎంసీఐ అధ్యక్షురాలు డాక్టర్ జయశ్రీ మెహతాకు ఒక లేఖ రాశారు. పీజీ వైద్యవిద్యకు సంబంధించిన అన్ని కోర్సులలో జంతువుల డిసెక్షన్, ప్రయోగాల బోధనను రద్దుచేయాలని అందులో కోరారు.'జల్లికట్టు'పై కొనసాగుతున్న టెన్షన్

Updated By ManamFri, 12/15/2017 - 09:28

Jallikattuచెన్నై: తమిళనాడు ప్రజలు సంప్రదాయ క్రీడగా భావించే జల్లికట్టును ఆడుకోవచ్చంటూ కేంద్రం  నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి 1960 యానిమల్స్ యాక్ట్‌లో కూడా కేంద్రం కొన్ని సవరణలు చేసింది. దీంతో సంతోషం వ్యక్తం చేసిన తమిళులు ఇప్పటినుండే జల్లికట్టు ఏర్పాట్లను చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే కేంద్ర నిర్ణయంతో అసంతృప్తిలో ఉన్న పెటా, దీనిని నిషేధించాలంటూ మరోమారు సుప్రీంను ఆశ్రయించింది. దీంతో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది.

అయితే జల్లికట్టుతో మూగజీవాలను హింసిస్తున్నారంటూ పెటా వేసిన పిటిషన్‌తో మార్చి 7, 2014న ఈ ఆటపై సుప్రీం నిషేధం విధించింది. దీంతో రాజకీయ, సినీ ప్రముఖులు సహా తమిళనాడు ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తమ సంప్రదాయ క్రీడను అడ్డుకోవడం ఏంటంటూ వారు కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ ఆందోళనతో దిగివచ్చిన కేంద్రం చట్టంలో సవరణను చేసి జల్లికట్టుకు అనుమతి ఇచ్చింది. కానీ దీనిపై ఎప్పటినుండో వ్యతిరేకతను చూపిస్తున్న పెటా మరోమారు సుప్రీంను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం జల్లికట్టుపై మళ్లీ టెన్షన్ మొదలైంది.
 

Related News