Tamil Nadu

తమిళనాడులో 9చోట్ల ఈడీ దాడులు

Updated By ManamSat, 09/08/2018 - 19:21
  • రూ.90 కోట్ల వరకు ఎస్బీఐకి ఎగనామం పెట్టిన సంస్థ 

  • మనీలాండరింగ్ కేసు నమోదు.. ఈడీ దర్యాప్తు

ED Raids, 9 Places, Tamil Nadu, Bank Fraud Caseచెన్నై: తమిళనాడులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం ఏకకాలంలో దాడులు నిర్వహించింది. రూ.90 కోట్ల బ్యాంకు రుణం ఎగవేత కేసులో తొమ్మిది ప్రాంతాల్లో మెరుపు దాడులు చేసినట్టు ఈడీ అధికారులు పేర్కొన్నారు. మనీలాండరింగ్ కేసుతో ఇన్సుమథి రిఫైనరీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ (ఐఆర్‌పీఎల్) కంపెనీకి సంబంధం ఉందనే ఆరోపణల నేపథ్యంలో విర్దూనగర్, మధురై, కోయింబత్తుర్‌ ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్టు ఈడీ పేర్కొంది. పీఎమ్ఎల్ఎ కింద క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. ఇన్సుమథి రిఫైనరీస్ అనే కంపెనీని ఆర్ షణ్భాగన్, సహా పలువురు నిర్వహిస్తుండగా, షణ్మాగన్ నివాసం, సంబంధిత సంస్థలపై ఈడీ తనిఖీలు నిర్వహించింది. ఐఆర్‌పీఎల్ కంపెనీ చెన్నైలోని ఎస్బీఐ ఓవర్సీస్ బ్రాంచ్ నుంచి లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ), క్యాష్ క్రెడిట్ ఫెసిలిటీస్ (సీసీపీ) సదుపాయం ద్వారా రుణాలను పొందినట్టు ఈడీ విచారణలో పేర్కొంది. 

రూ.87.36 కోట్ల విలువైన నకిలీ పత్రాలు, సంస్థల పేరుతో ఎస్బీఐ నుంచి మొత్తం 46 వరకు ఎల్‌ఓసీలతో బ్యాంకు నుంచి రుణాన్ని తీసుకున్నట్టు ఈడీ గుర్తించింది. అయితే కంపెనీల్లో చూపించిన సొమ్మును వెంటనే సదరు కంపెనీ మేనేజ్‌మెంట్ వ్యాపార లావాదేవీలకు మళ్లించి ఖాతాలను ఖాళీ చేసి సుమారు రూ.90 కోట్లకు ఎస్బీఐకి ఎగనామం పెట్టేసారు. దాంతో ఎస్బీఐ చీటింగ్ కేసు పెట్టడంతో సీబీఐ షణ్భాగన్, సహా సంబంధిత వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన ఈడీ సదరు సంస్థపై పీఎంఎల్ఏ కేసు నమోదు చేసింది. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

Updated By ManamSat, 09/01/2018 - 09:07
Tamilnadu bus accident:eight killed

చెన్నై : తమిళనాడులోని సేలం సమీపంలోని మామందూరు వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు  ఢీకొన్న దుర్ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందగా, మరో 30మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి .. సేలం నుంచి ధర్మపురికి ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు ..... బెంగళూరు నుంచి సేలం వెళుతున్న బస్సును ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కికక్కడే మరణించగా, మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. కాగా క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. మృతుల్లో నలుగురు కేరళ, ముగ్గురు కర్ణాటక, ఒకరు తమిళనాడుకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. కాగా మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మరోవైపు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.వారసుడొచ్చాడు :  స్టాలిన్‌కు పార్టీ పగ్గం

Updated By ManamFri, 08/31/2018 - 00:48

imageతమిళనాడు రాజకీయాల్లో అర్ధ శతాబ్దంగా కీలకపాత్ర పోషిస్తున్న ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన స్టాలిన్ తన అన్న ఎంకె అళగిరి నుంచి పెద్ద ఎత్తున సవాళ్లు ఎదుర్కొన బోతున్నారు. ఇప్పటివరకూ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వ్యవ హరించిన స్టాలిన్ ఆగస్టు 7న డిఎంకె అధినేత ఎం.కరుణానిధి మర ణించడంతో కొత్త అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. అయితే కరుణానిధి బతికి ఉన్న కాలంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకుగాను 2014లో డిఎంకె నుంచి బహిష్కృతులైన ఎంకె అళగిరి పార్టీలోకి తనను తీసు కోవాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 5న మౌన ప్రదర్శన చేపట్ట నున్నారు. అయితే పార్టీలోకి తనను తీసుకున్నట్లైతే తాను స్టాలిన్ నాయకత్వాన్ని ఆమోదిస్తానని అళగిరి సంచలన ప్రకటన చేశారు.  

చెన్నైలో జరిగిన డిఎంకె పార్టీ సాధారణ కౌన్సిల్ సమావేశంలో పార్టీ అధ్యక్ష పదవికి 65 మంది జిల్లా కార్యదర్శులు ప్రతిపాదించగా స్టాలిన్ నామి నేషన్ వేసి గెలవడం పార్టీపై ఆయనకున్న పట్టును మరోసారి నిరూపిం చింది. దాంతో గోడ మీద పిల్లి వాటంలా అళగిరిని సమర్థిస్తున్న కొంత మంది మధ్యస్థాయి నాయకులు ప్రస్తుతం స్టాలిన్ కోసం క్యూగట్టారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ పరాజయాల పాలైతేనే తప్ప, పార్టీలో ఆయ నకు మద్దతు లభించే అవకాశమే లేదు. వాస్తవంలో కరుణానిధి బతికు న్నప్పుడు అళగిరి చాలా అతిగా ప్రవర్తించి, తండ్రి దృష్టిలో అసమ ర్థుడిగా మిగిలాడు. అదే సమయంలో స్టాలిన్ సంయమనంతో వేచి చూసే వైఖరి చేపట్టి, పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండటం, కరుణానిధి మాటను అతిక్రమించకపోవడంతో, నేడు పార్టీ పగ్గాలు చేపట్డడంలో కృతకృత్యులయ్యాడు. అళగిరి అహేతుక దూకుడుపై స్టాలిన్ ఓపికతో కూడిన నేర్పు విజయం సాధించింది. 

తమిళనాట రాజకీయాలను శాసిస్తున్న పెద్ద నాయకులు జయలలిత, కరుణానిధి ఇద్దరూ మరణించడంతో ఆ రాష్ట్ర రాజకీయాలను భర్తీ చేసేం దుకు భిన్న శక్తులు, వ్యక్తుల ప్రయత్నాలు సాగుతున్నాయి. అన్నాడీఎంకె నాయకులకు బలమైన పునాది లేకపోయినా కేంద్రంలోని బీజేపీ అండ దండలతో ప్రభుత్వంలో కొనసాగుతోందనేది బహిరంగ రహస్యం. పళని స్వామి, పన్నీరు సెల్వం వర్గాలను ఎంతకాలం బీజేపీ కలిపి ఉంచ గలదో లేక ఉంచుతుందో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఊహించడం కష్టం. శశికళ ప్రతినిధి దినకరన్ బలంగా లేకపోవడం ఒక ప్రతికూల అంశం. ప్రధాన రాజకీయ పక్షమైన అన్నా డిఎంకె ముక్కలు చెక్కలై బలమైన నాయకత్వ కేంద్రాన్ని కోల్పోయిన సందర్భంలో ఆ అవకాశాన్ని బీజేపీకి అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ అగ్రనాయకులు తీవ్రం గా ప్రయత్నాలు చేస్తున్నారు. దేశ విభజన తాలూకు విషాద చారిత్రక సందర్భం ఉత్తరాదిపై అధిక ప్రభావం వేయడంతో విభజన, విద్వేష రాజకీయాలను నడపడం అక్కడి బీజేపీకి సులువయింది. అదే దక్షి ణాదిలో కమ్యూనిస్టు ఉద్యమాలు, హేతువాద, బ్రాహ్మణిస్టు, హిందీ వ్యతిరేక ద్రవిడ ఉద్యమాలు నడవడం వల్ల బీజేపీ మత రాజకీయ విన్యాసాలు సాగడం కష్టం. అయినప్పటికీ కర్ణాటక అనుభవంతో తమిళ నాడు రాజకీయాల్లో అన్నా డిఎంకెకు ప్రత్యామ్నాయంగా డిఎంకెతో తల పడాలన్న బీజేపీ కలలు సాకారం కావడం అసాధ్యమని నిపుణుల అభి ప్రాయం.

సారూప్య భావజాలంతో రాజకీయ ఆరంగేట్రం చేసిన రజనీ కాంత్‌ను ముందు పెట్టుకొని రాజకీయం నడపొచ్చని బీజేపీ భావిస్తోంది. ఇకపోతే ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ సారథ్యంలోని ‘మక్కల్ నీధి మైయం’ పార్టీ భావజాలపరంగా బీజేపీతో విభేధిస్తోంది. అయితే సంప్రదాయ ద్రవిడ పార్టీల ధోరణిలో బ్రాహ్మణ వ్యతిరేక భావజాలాన్ని ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న కమల్ హాసన్ రాజకీయ పార్టీకి  స్థానిక ఆధిపత్య వర్గాల, ముఠాల మద్దతు ఇప్పటికీ నిర్ణయం కాకపోవడంతో ఎన్నికల్లో ఎలా రాణించగలరో సందేహమే! దక్షిణాది లోకి ‘ఏకీకృత హిందూ అస్తిత్వం’ అనే నినాదంతో దూసుకురావలని భావిస్తున్న బీజేపీని ద్రవిడ రాజకీయ నాయకులు హిందీ-ఉత్తరాది వ్యతి రేక భావజాలాన్ని ముందుకు తీసుకొస్తాయి. స్టాలిన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

జాతీయవాద, ప్రాంతీయవాద శక్తులు తమిళనాడులో తీవ్ర ఘర్షణ పడుతున్న సందర్భం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అప్పుడప్పుడూ దక్షిణాది ప్రత్యేక దేశంగా ఏర్పడాలన్న డిమాండ్‌ను కూడా రాజకీయ వాదులు ముందుకుతెస్తున్నారు. బీజేపీ పాలనలో లౌకిక సూత్రాలు దెబ్బ తింటున్నాయని, విద్య, కళలు, సాహిత్యం తదితర అంశాలపై కాషాయ శక్తులు దాడి చేస్తున్నాయనీ, రాజకీయ పరిస్థితి ప్రమాదకరంగా మారిందని కేంద్రంపై స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం తన విధానాలు మార్చుకోకపోతే 1965 నాటి హిందీ వ్యతిరేక ఉద్యమం పున రావృతమవుతుందని గంభీరంగా ప్రకటించాడు. ప్రధాన ప్రత్యర్థి అన్నా డిఎంకె ముక్కలు చెక్కలైనప్పటికీ, బీజేపీ నుంచి ప్రమాదం పొంచి వున్నట్లు డిఎంకె భావిస్తోంది. దాంతో పార్టీ అంతర్గతంగా అళగిరి కిరికిరి కంటే బయట నుంచి తన రాజకీయ ప్రత్యర్థుల నుంచి ప్రమాదం ఎదురవుతుందని ఆందోళన చెందుతున్నారు.

మూడేళ్ళ దాకా తమిళ నాడు అసెంబ్లీ ఎన్నికలు లేకపోయినప్పటికీ, ఏడాదిలో జరుగబోతున్న సార్వత్రిక ఎన్నికలను స్టాలిన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనున్నారు. ఎందు కంటే అధికారంలో ఉన్న అన్నా డిఎంకె ముఠాలను బీజేపీ ఎంతోకాలం భరించదనీ, గడువు పూర్తయ్యేలోపే మద్దతు ఉపసంహరించి ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. తమిళ నాడు రాజకీయ యవనికలో కొత్త తరహా రాజకీయ ముఖాలు రాబోయే ఎన్నికల్లో అధికారం కోసం తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో తను, తన పార్టీ స్థానాన్ని పుననిర్వచించుకోవలసిన అవసరం ఉంది. హేతు వాదాన్ని పునర్జీవనంతో డిఎంకె భావజాలాన్ని పునర్నిర్వచించుకొని తమిళనాడు రాష్ట్ర దీర్ఘకాలిక సమగ్ర అభివృద్ధి దృక్పథంతో స్వల్పకాలిక ఎన్నికల ప్రయోజనాలను సమన్వయించుకోవలసిన తరుణమిది. కరుణానిధి వలె కొద్దిమంది అంతరంగిక ముఠా మద్దతు, సలహా సంప్ర దింపులపైగాక, విశాల ప్రజారాశులను ప్రభావితం చేసే రాజకీయ కార్యా చరణపై స్టాలిన్ ఆధారపడితేనే డిఎంకె తమిళనాట ప్రధాన రాజకీయ శక్తిగా నిలదొక్కుకోగలడు. శోకసంద్రంలో తమిళనాడు.. హై అలర్ట్

Updated By ManamTue, 08/07/2018 - 19:16

high alert in tamilnadu over karuna death

చెన్నై: డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తుదిశ్వాస విడిచారు. ఆయన మంగళవారం సాయంత్రం 6:10 గంటలకు కన్నుమూసినట్లు కావేరి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. అంతక ముందు కొన్ని గంటలుగా ఆయన అవయవాలు చికిత్సకు సహకరించడం లేదని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. విషయం తెలుసుకున్న అభిమానులు, కార్యకర్తలు, నేతలు అప్పటికే పెద్ద ఎత్తున కావేరి ఆస్పత్రికి తరలివచ్చారు. కరుణ.. కరుణ.. అంటూ నినాదాలు చేస్తున్నారు.

తమ అభిమాన నేత లేడన్న వార్తను తెలుసుకున్న అభిమానులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. కార్యకర్తలు తరలిరావడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆస్పత్రికి నాలుగు కిలోమీటర్ల మేర ఎక్కడి బండ్లు అక్కడే నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆస్పత్రి వద్ద ఉద్విగ్న, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తలైవార్ తలైవా అంటూ తమిళనాడు మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.

బుధవారం ఉదయం ఏడు గంటలకు రాజాజీ హాల్లో అంతిమ దర్శనం ఉంటుందని తెలుస్తోంది. మెరీనా బీచ్‌లో ఉన్న అన్నా సమాధి పక్కనే కరుణ అంత్యక్రియలు జరిపే అవకాశముందని తెలుస్తోంది. మరికొద్దిసేపట్లో కావేరి ఆస్పత్రి నుంచి గోపాలపురంలోని కరుణ నివాసానికి పార్థీవదేహం తరలించనున్నారు. ఇదిలా ఉంటే.. తమిళనాడులో ఇవాళ, రేపు సినిమా షోలు బంద్ కానున్నాయి. కర్నాటక నుంచి తమిళనాడు వెళ్లే కేఎస్ఆర్టీసీ బస్సుల్ని కూడా ప్రభుత్వం రద్దు చేయడమైంది. కర్నాటక, తమిళనాడు సరిహద్దుల్లో హైఅలర్ట్ ప్రకటించడం జరిగింది. కాగా జూన్ 26న కరుణానిధిని ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు.చెన్నైలో గాడిద.. కుక్క పెళ్లి

Updated By ManamThu, 02/15/2018 - 08:02

ChennaiTamil NaduValentine's Day 2018

  • వాలెంటైన్స్ డేకు బీహెచ్‌ఎఫ్ నిరసన

  • ప్రేమికులను పరుగుపెట్టించిన బజ్‌రంగ్ దళ్

చెన్నై/లఖ్‌నవ్: ప్రేమికుల దినోత్సవ వేడుకలను పలు హిందూ సంప్రదాయవాద సంస్థలు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో బజ్‌రంగ్ దళ్, భారత్ హిందూ ఫ్రంట్ (బీహెచ్‌ఎఫ్) వంటి సంస్థలు పలు రకాలుగా నిరసనలు తెలిపాయి. చెన్నైలో బీహెచ్‌ఎఫ్ గాడిద.. కుక్కల పెళ్లి చేసి వినూత్నంగా నిరసన వ్యక్తం చేసింది. ఇక్కడి చోళై ప్రాంతంలో సంస్థకు చెందిన మహిళా కార్యకర్తలు ముందుండి ఈ తంతు జరిపారు.  పెళ్లికి అవసరమైన వస్తువులను తెచ్చి వాటి ముందుంచారు. అనంతరం వాటికి పూల మాలలు వేసి.. పసుపు, కుంకుమలతో అలంకరించారు. 

హిందూ సంప్రదాయ పద్ధతిలో వాటి పెళ్లి తంతు ముగించారు. అనంతరం వాలెంటైన్స్ డేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. దీంతో వారిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. ఇక లఖ్‌నవ్, అహ్మదాబాద్, హైదరాబాద్ సహా పలు నగరాల్లో బజ్‌రంగ్ దళ్ కార్యకర్తలు ప్రేమికులను పరుగులు పెట్టించారు. ఎక్కడ ప్రేమ జంటలు కనిపించినా తరిమికొట్టారు. అహ్మదాబాద్‌లోని శబర్మతి నదీ తీరంలో యువతపై దాడులకు దిగారు. కాగా, వాలెంటైన్ డే వేడుకలు జరుపుకోవద్దని హెచ్చరిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవ్ యూనివర్సిటీ బుధవారం సెలవు ప్రకటిం చింది. ఎవరూ క్యాంపస్‌లో జంటలుగా కనిపించొద్దని నోటీసు జారీ చేసింది. ఎవరు గిఫ్టులు ఇచ్చినా.. తీసుకున్నా కఠిన చర్యలు తప్పవని పేర్కొంది. అయితే దీన్ని విద్యార్థులు వ్యతిరేకించారు. గతంలో వాలెంటైన్స్ డే వేడుకలు జరిగాయని, ఇప్పుడు వర్సిటీని మార్చేయాలని వైస్ చాన్సెలర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.ఆర్కే నగర్‌లో భారీగా నగదు స్వాధీనం!

Updated By ManamSun, 12/17/2017 - 13:00
  • 12.6 లక్షల నగదును స్వాధీనం.. ఉప ఎన్నిక ప్రచారంలో మళ్లీ కలకలం.. 

  • ఓటర్లకు డబ్బులు పంపిణీ .. కొన్నిచోట్ల రూ. 20 లక్షల నగదు స్వాధీనం

RK Nagar By elections, J Jayalalithaa, Rs 12.6 lakh Chennai election, unaccounted money seized, Tamil Naduఆర్కే నగర్(తమిళనాడు): దివంగత జయలలిత (అమ్మ) సొంత నియోజకవర్గం ఆర్కే నగర్ ఉప ఎన్నిక ప్రచారంలో నగదు పంపిణీ మళ్లీ కలకలం రేపింది. ఆర్కే నియోజకవర్గంలోని ఓటర్లకు కొందరు డబ్బులు పంచుతూ పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి 12.6 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అందిన పక్కా సమాచారంతో పోలీసులు కొరుక్కుపేట్ లోని ఓ సైకోథెరపీ సెంటర్‌లో పోలీసులు దాడి చేసి భారీమొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. అదే నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో రూ. 20 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈసీ షెడ్యూల్ ప్రకారం.. ఆర్కే నగర్‌లో గత ఏప్రిల్ 12 ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. కానీ, ఓటుకు నోటు కుంభకోణంపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఎన్నికల సంఘం ఉప ఎన్నికను రద్దు చేసింది. మరోవైపు శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ వర్గం పనేనంటూ అధికార పార్టీనేతలు ఆరోపిస్తున్నారు. డిసెంబర్ 2016 లో దివంగత జయలలిత (అమ్మ) మరణంతో ఆమె సొంత నియోజకవర్గం ఆర్కేనగర్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. డిసెంబర్ 21న ఉప ఎన్నిక జరగనుంది. ఉప ఎన్నిక బరిలో మొత్తం 59 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.  

Related News