Anand Shankar

‘నోటా’ తమిళ సెన్సార్ పూర్తి

Updated By ManamSat, 09/29/2018 - 09:29

NOTAవిజయ్ దేవరకొండ హీరోగా ఆనంద్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘నోటా’. తెలుగు, తమిళ్‌లో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా తమిళంలో సెన్సార్‌ను పూర్తి చేసుకుంది. చిత్రాన్ని చూసిన అక్కడి సెన్సార్ సభ్యులు యు సర్టిఫికేట్‌ను ఇచ్చారు. ఇక తెలుగు సెన్సార్ కూడా త్వరలోనే పూర్తి అవ్వనుంది. కాగా ఇప్పటికే తమిళ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ పూర్తి కాగా.. తెలుగులో సెప్టెంబర్ 30న విజయవాడ, అక్టోబర్ 1న హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సీఎం పాత్రలో కనిపించనుండగా.. ఆయన సరసన మెహ్రీన్ నటించింది. సత్యరాజ్, నాజర్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై ఙ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రానికి శ్యామ్ సంగీతం అందించాడు. ఇప్పటికే ట్రైలర్, టీజర్లతో ఆకట్టుకున్న ఈ చిత్రంపై ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.



ముగిసిన పోల్: నోటాకు డేట్ ఫిక్స్

Updated By ManamSat, 09/22/2018 - 12:28
NOTA

విజయ్ దేవరకొండ హీరోగా ఆనంద్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘నోటా’. తెలుగు, తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మొదట అక్టోబర్ 4న విడుదల తేదిని ఫిక్స్ చేశారు. అయితే కొన్ని పరిస్థితుల వలన విడుదల వాయిదా పడొచ్చనే వార్తలు వినిపించాయి. ఇలాంటి సమయంలో నటుడు విజయ్ దేవరకొండ ‘నోటా’కు మీరే రిలీజ్ డేట్ చెప్పాలంటూ సోషల్ మీడియాలో ఓ పోల్ నిర్వహించాడు. అందులో అక్టోబర్ 5, 10, 18 తేదీలతో పాటు నోటా అంటూ ఆప్షన్స్ ఇచ్చాడు. 

ఈ పోల్ ఈ రోజు ముగియడంతో ఎట్టకేలకు డేట్‌ను చెప్పేశాడు విజయ్. ‘‘మీరు నోటాకు ఓటు వేశారు, అక్టోబర్ 5కు ఓటేశారు. చెప్పడానికి ఏమీ లేదు అక్టోబర్ 5న రానున్న నోటా’’ అంటూ కామెంట్ పెట్టాడు ఈ సెన్సేషనల్ హీరో. ఇక పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సరసన మెహ్రీన్ నటించగా.. నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఙ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.



విజయ్ మూవీలో గెస్ట్ రోల్‌లో టాప్ డైరెక్టర్

Updated By ManamWed, 09/12/2018 - 13:30

NOTA 1విజయ్ హీరోగా ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘నోటా’. తెలుగు, తమిళ్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర షూటింగ్ క్లైమాక్స్‌కు వచ్చేసింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ అందరినీ ఆకట్టుకోగా.. తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్‌తో చిత్రంపై మరింత అంచనాలను పెంచేశాడు దర్శకుడు. అదేంటంటే ఇందులో టాప్ డైరక్టర్ మురగదాస్ అతిథిపాత్రలో కనిపించనున్నాడు. ఒక కీలక పాత్రలో ఆయన నటించనున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు కన్ఫర్మ్ చేశాడు.

‘‘నా గురువును ఈ రోజు నేను డైరెక్ట్ చేస్తున్నా. ఎంత అద్భుతమైన క్షణం’’ అంటూ కామెంట్ పెట్టాడు. కాగా మురగదాస్ దగ్గర ఆనంద్ శంకర్ అసిస్టెంట్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఇక పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన మెహ్రీన్ నటిస్తుండగా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 



‘నోటా’కు రిలీజ్ డేట్ ఫిక్స్..?

Updated By ManamFri, 09/07/2018 - 12:26

NOTAసెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘నోటా’. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర టీజర్ గురువారం విడుదలైంది. ఈ టీజర్ అందరినీ ఆకట్టుకోగా.. తాజాగా ఈ మూవీ విడుదలకు డేట్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అక్టోబర్ 4వ తేదిన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శక నిర్మాతలు అనుకుంటున్నారట. దసరా రోజుల్లో అటు తెలుగు, ఇటు తమిళ్‌లో గట్టి పోటీగా ఉండటం వలన ఈ సినిమాను ముందుగానే విడుదల చేయడం మంచిదనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సాధారణ యువకుడిగా, ముఖ్యమంత్రిగా కనిపించనున్న విషయం తెలిసిందే.



పోలింగ్‌ అప్పుడే! 

Updated By ManamThu, 08/30/2018 - 20:12
vijay devarakonda Movie nota Coming Out October 4

విజయ్‌ దేవరకొండ తెలుగు, తమిళంలో నటిస్తున్న చిత్రం 'నోట'. ఇటీవల విడుదలైన గీత గోవిందం తర్వాత విజయ్‌ దేవరకొండ నటిస్తున్న చిత్రమిదే. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. కె.ఇ.జ్ఞానవేల్‌రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని నిర్మాతలు అక్టోబర్‌ 4న విడుదల చేయాలనుకుంటున్నారట. మెహరీన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.

ఈ సినిమా కోసం విజయ్‌ తమిళ్‌ కూడా నేర్చుకుంటున్నారు. తమిళంలోనే డబ్బింగ్‌ చెప్పనున్నారు. ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నారు. మరి ఇప్పటికే తెలుగులో స్టార్‌ హీరో ఇమేజ్‌ను సంపాదించుకున్న ఈ యువ కథానాయకుడికీ తమిళ ప్రేక్షకులు ఎలాంటి ఆదరణ చూపుతారో తెలియాలంటే అక్టోబర్‌4న జరగబోయే పోలింగ్‌ వరకు వెయిట్‌ చేయాల్సిందే.. పోలింగ్‌ అంటే రిలీజ్‌ డేట్‌ !. 



కోలీవుడ్ దర్శకుడికి విజయ్ గ్రీన్ సిగ్నల్.?

Updated By ManamSun, 12/17/2017 - 13:21

Vijay Devarakonda'పెళ్లిచూపులు', 'అర్జున్ రెడ్డి'లతో టాలీవుడ్‌లో మోస్ట్ వాటెండ్ హీరోగా మారిన విజయ్ దేవరకొండకు.. ఆ చిత్రాల డబ్బింగ్‌లతో పక్క రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో విజయ్‌కు ఓ కోలీవుడ్ దర్శకుడు కథను వినిపించినట్లు తెలుస్తోంది.

విక్రమ్ హీరోగా 'ఇరుముగన్‌'(తెలుగులో ఇంకొక్కడు)ను తెరకెక్కించిన దర్శకుడు ఆనంద్ శంకర్, ఇటీవల విజయ్‌కు ఓ కథను చెప్పారట. కథ నచ్చడంతో ఇందులో నటించేందుకు విజయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు టాక్. ఒకవేళ ఇదే నిజమైతే విజయ్ కోలీవుడ్‌లోనూ దూసుకుపోవడం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి.





Related News