NOTA

ముగిసిన పోల్: నోటాకు డేట్ ఫిక్స్

Updated By ManamSat, 09/22/2018 - 12:28
NOTA

విజయ్ దేవరకొండ హీరోగా ఆనంద్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘నోటా’. తెలుగు, తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మొదట అక్టోబర్ 4న విడుదల తేదిని ఫిక్స్ చేశారు. అయితే కొన్ని పరిస్థితుల వలన విడుదల వాయిదా పడొచ్చనే వార్తలు వినిపించాయి. ఇలాంటి సమయంలో నటుడు విజయ్ దేవరకొండ ‘నోటా’కు మీరే రిలీజ్ డేట్ చెప్పాలంటూ సోషల్ మీడియాలో ఓ పోల్ నిర్వహించాడు. అందులో అక్టోబర్ 5, 10, 18 తేదీలతో పాటు నోటా అంటూ ఆప్షన్స్ ఇచ్చాడు. 

ఈ పోల్ ఈ రోజు ముగియడంతో ఎట్టకేలకు డేట్‌ను చెప్పేశాడు విజయ్. ‘‘మీరు నోటాకు ఓటు వేశారు, అక్టోబర్ 5కు ఓటేశారు. చెప్పడానికి ఏమీ లేదు అక్టోబర్ 5న రానున్న నోటా’’ అంటూ కామెంట్ పెట్టాడు ఈ సెన్సేషనల్ హీరో. ఇక పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సరసన మెహ్రీన్ నటించగా.. నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఙ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.బెల్జియం యువతితో విజయ్ లవ్ నిజమేనా..?

Updated By ManamThu, 09/20/2018 - 15:05

Vijay Devarakonda వరుస విజయాలతో సన్సేషనల్ హీరోగా వెలుతుగున్న విజయ్ దేవరకొండ టాలీవుడ్‌లో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటితో పాటు అటు కోలీవుడ్‌లో నోటా అనే చిత్రంతో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతుండగా.. మరోవైపు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా పక్కనపెడితే బెల్జియంకు సంబంధించిన ఓ యువతితో విజయ్ దేవరకొండ క్లోజ్‌గా ఉన్న ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి.

అయితే అవన్నీ ఫొటో మార్ఫింగ్ చేసిన ఫొటోలు అంటూ ఆ తరువాత కొంత మంది కొట్టివేశారు. కాగా.. తాజాగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో ఆ యువతి కుటుంబం ఉన్న ఫొటో ఒకటి ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. దీనిపై అభిమానులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. విజయ్ ఫ్యామిలీతో కూడా ఆ యువతి క్లోజ్‌గా ఉండటంతో ఆమె ఫ్యామిలీ ఫ్రెండ్ అని కొందరు, పెళ్లిచూపులు చిత్రం నుంచే వీరిద్దరికి పరిచయం ఉందని మరికొందరు మాట్లాడుకుంటున్నారు. మరి దీనిపై విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Vijay Devarakonda

 విజయ్ మూవీలో గెస్ట్ రోల్‌లో టాప్ డైరెక్టర్

Updated By ManamWed, 09/12/2018 - 13:30

NOTA 1విజయ్ హీరోగా ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘నోటా’. తెలుగు, తమిళ్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర షూటింగ్ క్లైమాక్స్‌కు వచ్చేసింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ అందరినీ ఆకట్టుకోగా.. తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్‌తో చిత్రంపై మరింత అంచనాలను పెంచేశాడు దర్శకుడు. అదేంటంటే ఇందులో టాప్ డైరక్టర్ మురగదాస్ అతిథిపాత్రలో కనిపించనున్నాడు. ఒక కీలక పాత్రలో ఆయన నటించనున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు కన్ఫర్మ్ చేశాడు.

‘‘నా గురువును ఈ రోజు నేను డైరెక్ట్ చేస్తున్నా. ఎంత అద్భుతమైన క్షణం’’ అంటూ కామెంట్ పెట్టాడు. కాగా మురగదాస్ దగ్గర ఆనంద్ శంకర్ అసిస్టెంట్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఇక పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన మెహ్రీన్ నటిస్తుండగా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 ‘నోటా’కు రిలీజ్ డేట్ ఫిక్స్..?

Updated By ManamFri, 09/07/2018 - 12:26

NOTAసెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘నోటా’. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర టీజర్ గురువారం విడుదలైంది. ఈ టీజర్ అందరినీ ఆకట్టుకోగా.. తాజాగా ఈ మూవీ విడుదలకు డేట్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అక్టోబర్ 4వ తేదిన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శక నిర్మాతలు అనుకుంటున్నారట. దసరా రోజుల్లో అటు తెలుగు, ఇటు తమిళ్‌లో గట్టి పోటీగా ఉండటం వలన ఈ సినిమాను ముందుగానే విడుదల చేయడం మంచిదనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సాధారణ యువకుడిగా, ముఖ్యమంత్రిగా కనిపించనున్న విషయం తెలిసిందే.పోలింగ్‌ అప్పుడే! 

Updated By ManamThu, 08/30/2018 - 20:12
vijay devarakonda Movie nota Coming Out October 4

విజయ్‌ దేవరకొండ తెలుగు, తమిళంలో నటిస్తున్న చిత్రం 'నోట'. ఇటీవల విడుదలైన గీత గోవిందం తర్వాత విజయ్‌ దేవరకొండ నటిస్తున్న చిత్రమిదే. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. కె.ఇ.జ్ఞానవేల్‌రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని నిర్మాతలు అక్టోబర్‌ 4న విడుదల చేయాలనుకుంటున్నారట. మెహరీన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.

ఈ సినిమా కోసం విజయ్‌ తమిళ్‌ కూడా నేర్చుకుంటున్నారు. తమిళంలోనే డబ్బింగ్‌ చెప్పనున్నారు. ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నారు. మరి ఇప్పటికే తెలుగులో స్టార్‌ హీరో ఇమేజ్‌ను సంపాదించుకున్న ఈ యువ కథానాయకుడికీ తమిళ ప్రేక్షకులు ఎలాంటి ఆదరణ చూపుతారో తెలియాలంటే అక్టోబర్‌4న జరగబోయే పోలింగ్‌ వరకు వెయిట్‌ చేయాల్సిందే.. పోలింగ్‌ అంటే రిలీజ్‌ డేట్‌ !. త‌మిళ తంబీల‌కు ద‌గ్గ‌ర కావ‌డానికి... 

Updated By ManamWed, 08/22/2018 - 16:35

vijayపెళ్ళిచూపులు,అర్జున్ రెడ్డి,గీత గోవిందం ఇలా వ‌రుస సినిమాలతో స్టార్ హీరో క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.ఇప్పుడు వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న విజ‌య్‌.తెలుగు,త‌మిళ భాష‌ల్లో న‌టిస్తున్న చిత్రం `నోటా`. జ్ఞాన‌వేల్ రాజా నిర్మాత‌గా ఆనంద్ శంక‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. తెలుగుతో పాటు త‌మిళ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర కావ‌డానికి విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా త‌మిళం నేర్చుకుంటున్నాడ‌ట విజ‌య్. త‌మిళంలోనే డ‌బ్బింగ్ చెబుతున్నాడ‌ట‌. మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ను సెప్టెంబ‌ర్‌కంతా పూర్తి చేసి సినిమాను క్రిస్మస్ కు విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ట‌. రాజ్యసభ ఎన్నికల్లో ‘నోటా’కు నో

Updated By ManamTue, 08/21/2018 - 14:55
  • పరోక్ష ఎన్నికలలో వద్దన్న సుప్రీంకోర్టు.. 2014లో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్

  • అది అవినీతికి తావిస్తుందన్న కాంగ్రెస్.. నోటాను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు

  • కాంగ్రెస్ వాదనకు ఎన్డీయే మద్దతు.. నోటిఫికేషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

NOTA, Rajya Sabha Elections, Supreme Court, NDA, Congress Party, Non of the Aboveన్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల్లో నోటా (నన్ ఆఫ్ ద ఎబోవ్) ఆప్షన్‌ను అనుమతించేది లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఎన్నికల కమిషన్ జారీచేసిన నోటిఫికేషన్‌ను ఓవర్ రూల్ చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం.. ఈసీ నోటిఫికేషన్‌ను రద్దుచేసింది. రాజ్యసభ ఎన్నికల బ్యాలట్ పేపర్లలో నోటా కూడా అనుమతిస్తూ ఈసీ ఇంతకుముందు ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే, రాజ్యసభ ఎన్నికలు వివిధ రాష్ట్రాలకు నైష్పత్తిక ప్రాతినిధ్యం కల్పించడానికి పరోక్షంగా నిర్వహించే ఎన్నికలని, వాటిలో నోటాను పెట్టడం ఏమాత్రం తగదని సుప్రీం వ్యాఖ్యానించింది. బ్యాలట్ పేపర్లలో నోటా పెట్టడాన్ని సవాలు చేస్తూ గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెస్ చీఫ్‌విప్ శైలేష్ మనుభాయ్ గత నెలలో దాఖలుచేసిన కేసులో తీర్పు వెలువరిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. నోటాను అనుమతిస్తే రాజ్యసభ ఎన్నికల్లో సభ్యుల కొనుగోలు, అవినీతి పెరుగుతాయని ఆయన వాదించారు. 

నోటా అనేది ప్రత్యక్ష ఎన్నికలలో వ్యక్తులు ఉపయోగించడానికి మాత్రమే ఉద్దేశించినదని కోర్టు తెలిపింది. ఈ ఎన్నికలలో ఎవరైనా ఓటు వేయకపోతే వాళ్లను ఆ పార్టీ బహిష్కరించే అవకాశం ఉందని, కానీ నోటాను ప్రవేశపెట్టడం ద్వారా ఓటు వేయకపోవడాన్ని చట్టబద్ధం చేస్తున్నారని అంటూ.. ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక చర్యలో కోర్టును ఎందుకు ఒక పార్టీగా చేస్తారని ప్రశ్నించింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో నోటా ఉండాలని 2013లో సుప్రీంకోర్టే సూచించింది. దాంతో 2014లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కూడా నోటాను ఈసీ ప్రవేశపెట్టింది. దాన్ని గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సవాలు  చేసింది.  కాగా, రాజ్యసభ ఎన్నికల్లో నోటా వద్దన్న వాదనకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా మద్దతు తెలపడం విశేషం.మెహ‌రీన్‌ని ఇబ్బంది పెట్టిన ప్ర‌యాణీకుడు

Updated By ManamSat, 06/30/2018 - 09:05

mehreen తెలుగు సినిమాల్లో బిజీగా ఉన్న మెహ‌రీన్ కౌర్‌.. నోటా చిత్రంతో త‌మిళంలో కూడా ఎంట్రీ ఇచ్చింది. విజ‌య్ దేవ‌ర కొండ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాకు ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌కుడు. జ్ఞాన‌వేల్ రాజా నిర్మాత‌. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ కోసం మెహ‌రీన్ చెన్నై వెళ్లాల్సి వ‌చ్చింది. కానీ ఫ్లైట్ టిక్కెట్ దొర‌క‌లేదు. నిర్మాత రైల్ టికెట్ అరెంజ్ చేశాడు. అయితే మెహ‌రీన్ బుక్ చేసుకున్న టికెట్‌లో ఓ ప్ర‌యాణీకుడు మందు కొట్టేసి ప‌డుకొనేశాడ‌ట‌. అత‌న్ని చూసిన మెహ‌రీన్ భ‌యంతో నిర్మాత‌కు ఫోన్ చేసి విష‌యాన్ని వివ‌రించింద‌ట‌. దాంతో నిర్మాత మెహ‌రీన్‌కి కారుని ఏర్పాటు చేసి చెన్నై వ‌చ్చే ఏర్పాటు చేశాడ‌ట‌. ఇలా ప్ర‌యాణీకులు తార‌ల‌ను ఇబ్బంది పెట్ట‌డం రైల్లోనే కాదు.. విమానాల్లో కూడా జ‌రుగుతుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. న‌యా లుక్ అదుర్స్‌

Updated By ManamTue, 03/13/2018 - 21:51

vijay devarakonda'అర్జున్ రెడ్డి'తో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయారు యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్నారు. తాజాగా 'నోటా' పేరుతో ఓ ద్విభాషా చిత్రాన్ని కూడా సెట్స్ పైకి తీసుకు వెళ్ళారు. ఇదిలా ఉంటే.. ఈ రోజు (మంగ‌ళ‌వారం) విజ‌య్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో 'డిజైర్డ్' అంటూ ఓ స్టిల్‌ను పోస్ట్ చేశారు. అందులో.. విజ‌య్ లుక్ చాలా స్టైలీష్‌గా ఉంది. మ‌రి ఈ లుక్ సినిమా కోస‌మా? లేకుంటే యాడ్ కోస‌మా అన్న‌ది తెలియ‌దు కానీ.. విజ‌య్ మాత్రం నెటిజ‌న్ల‌ను ఇట్టే ఆక‌ట్టుకుంటున్నారు.విజయ్ దేవరకొండ 'నోటా' ఫస్ట్‌లుక్

Updated By ManamFri, 03/09/2018 - 14:25

Notaవిజయ్ దేవరకొండ హీరోగా ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం 'నోటా'. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం రీసెంట్‌గా ప్రారంభం కాగా.. తాజాగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. అందులో మధ్య వేలికి ఇంక్‌తో దర్శనమిచ్చాడు విజయ్ దేవరకొండ. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన మెహ్రీన్ నటిస్తుండగా.. స్టూడియో గ్రీన్ పతాకం నిర్మిస్తుంది. ఎన్నికల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సి.ఎస్. శ్యాం సంగీతం అందిస్తున్నాడు.

Related News