kalyan ram

కల్యాణ్‌రామ్ యాక్షన్

Updated By ManamMon, 09/24/2018 - 00:32

imageనందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం యాక్షన్ సీక్వెన్స్‌ల చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రంలో కల్యాణ్‌రామ్ సరసన నివేథా థామస్, షాలినీ పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్‌లను వైజాగ్‌లో చిత్రీకరిస్తున్నారు. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కల్యాణ్‌రామ్ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుందట. ఆ కొత్తదనం ఏమిటో తెలుసుకోవాలంటే కొంతకాలం ఆగాల్సిందే. నేడు హరికృష్ణ పెద్ద కర్మ.. పూర్తైన ఏర్పాట్లు

Updated By ManamSat, 09/08/2018 - 09:22

Harikrishnaగత నెల 29న నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సినీ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి హరికృష్ణ  పెద్ద కర్మ ఇవాళ జరగనుంది. నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ గ్రాండ్ లాన్స్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికి జలవిహార్‌లో ఏర్పాట్లు పూర్తి కాగా, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దీనికి హాజరయ్యే అవకాశం ఉంది.

అయితే నెల్లూరు జిల్లాలో ఓ వివాహ వేడుక కోసం గత నెల 29న హరికృష్ణ కారులో వెళుతుండగా.. నార్కట్‌పల్లి సమీపంలో ఆయన కారు డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన హరికృష్ణను కామినేని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.ఆ హిట్ చిత్రాన్ని రానా వదులుకున్నాడట

Updated By ManamWed, 09/05/2018 - 09:30

Rana Daggubatiకెరీర్ ప్రారంభం నుంచి విభిన్న పాత్రలు ఎంచుకుంటూ పలు భాషల్లో దూసుకుపోతున్న రానా ఓ హిట్ సినిమాను వదులుకున్నాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. ‘C/O కంచరపాలెం’ అనే చిత్రాన్ని రానా డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా.. ఈ మూవీ ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఓ ప్రమోషన్లో పాల్గొన్న రానా, తాను వదులుకున్న హిట్ చిత్రాన్ని తెలిపాడు.

ఇంతకు ఆ చిత్రం ఏంటని అనుకుంటున్నారా.. ‘పటాస్’. కల్యాణ్ రామ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన పటాస్ చిత్రం బాక్సాఫీస్ వద్ద పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. ఈ కథను ముందు అనిల్ రావిపూడి రానాకు వినిపించారట. అయితే అప్పుడు బాహుబలి కమిట్‌మెంట్స్ ఉండటం వలన ఈ చిత్రాన్ని చేయలేనని చెప్పాడట. ఆ తరువాత అనిల్, కల్యాణ్ రామ్‌ను కలవడం, ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం, విడుదలయ్యాక హిట్ అవ్వడం.. ఇలా అన్నీ జరిగిపోయాయి. కాగా ఈ చిత్రం తమిళ్‌లో ‘మొట్ట శివ కెట్ట శివ’, కన్నడలో ‘పటాకి’, బెంగాళిలో ‘ఏసీపీ రుద్ర: ఆన్ డ్యూటీ’ అనే పేర్లతో రీమేక్ అయిన విషయం తెలిసిందే.నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు పూర్తి

Updated By ManamThu, 08/30/2018 - 16:13
  • తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు

  • తండ్రి చితికి నిప్పంటించిన కుమారుడు కల్యాణ్ రామ్

  • అశ్రు నయనాలతో తుడి వీడ్కోలు...

Harikrishna funeral హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో గురువారం పూర్తయ్యాయి. కుటుంబసభ్యులు, అభిమానులు, సన్నిహితుల కన్నీటి వీడ్కోలు మధ్య  హైదరాబాద్ జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు ముగిశాయి. కుమారుడు కల్యాణ్ రామ్ తండ్రి చితికి నిప్పంటించారు.  అంతకు ముందు పోలీసులు గౌరవ సూచికంగా తుపాకీలతో మూడు రౌండ్లు గాలిలోకి పేల్చారు.

నందమూరి కుటుంబసభ్యులు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బాలకృష్ణ, లోకేష్,  టీడీపీ నేతలు, టాలీవుడ్ ప్రముఖులు, ఎన్టీఆర్ అభిమానులు హరికృష్ణకు కడసారి నివాళులు అర్పించి, తుది వీడ్కోలు పలికారు. మరోవైపు మోహదీపట్నం నుంచి జూబ్లీహిల్స్ వరకూ సాగిన అంతిమయాత్రలో హరికృష్ణ అమర్ రహే నినాదాలతో మార్మోగింది.హరికృష్ణ తనయులకు చంద్రబాబు పరామర్శ

Updated By ManamWed, 08/29/2018 - 14:58

Chandrababuహైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మరణించిన సినీ, రాజకీయ నాయకుడు హరికృష్ణ కుమారులు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. నల్గొండ జిల్లా నర్కాట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు నాయుడు అక్కడున్న ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లను కలిసి పరామర్శించారు. పోస్ట్‌మార్టం అనంతరం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ హరికృష్ణకు నివాళులు అర్పించారు.మధ్యాహ్నం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు సీతయ్య భౌతిక కాయం

Updated By ManamWed, 08/29/2018 - 11:14

Harikrishnaహైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రముఖ సినీ, రాజకీయ నాయకుడు మృతదేహాన్ని మధ్యాహ్నం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు తరలించనున్నారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయానికి పోస్ట్‌మార్టం పూర్తవ్వగా.. కాసేపట్లో కుటుంబసభ్యులకు హరికృష్ణ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు తరలించనున్నారు. కాగా ప్రస్తుతం నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రి వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, చంద్రబాబు నాయుడు, పురందేశ్వరి, బాలకృష్ణ, జగపతిబాబు తదితరులు ఉన్నారు. కాగా మొయినాబాద్‌లో ఉన్న ఫామ్‌హౌస్‌లో హరికృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.హరికృష్ణ మృతికి కారణాలు ఇవేనా..?

Updated By ManamWed, 08/29/2018 - 08:52

Harikrishnaనటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మృతికి అతివేగమే కారణమా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి. ప్రమాద సమయంలో ఆయన గంటకు 160కిలోమీటర్ల వేగంతో స్వయంగా కారును నడిపినట్లు తెలుస్తోంది. ఇక ప్రమాదంలో కారు పల్టీలు కొట్టగా, హరికృష్ణ ఛాతీ స్టీరింగ్‌కు బలంగా తగిలిందని, ఆ తరువాత ఆయన కారులోంచి కిందపడగా, బలమైన గాయమై మెదడు చిట్లిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

ఆ తరువాత ఆసుపత్రికి తీసుకువచ్చేటప్పటికే ఆయన పరిస్థితి విషమించిందని, అత్యవసర వైద్య చికిత్సలు చేసినా హరికృష్ణ ప్రాణాలు నిలబడలేదని వైద్యులు తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో ఆయనతో పాటు మరో నలుగురు ఉండగా.. వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.‘జై లవ కుశ’కు అరుదైన గౌరవం

Updated By ManamSat, 07/21/2018 - 14:51

Jai Lava Kusa ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో బాబి తెరకెక్కించిన ‘జై లవ కుశ’ గతేడాది విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో జై పాత్రలో ఎన్టీఆర్ తన నట విశ్వరూపంతో విమర్శకులను మెప్పించాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రంకు తాజాగా అరుదైన గౌరవం లభించింది. నార్త్ కొరియాలో జరగబోయే బుచియాన్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్‌(BIFF)లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. అంతేకాదు ఈ గౌరవం లభించిన మొదటి సినిమా కూడా జై లవ కుశనే కావడం విశేషం. ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రాశిఖన్నా, నివేథా థామస్ నటించగా.. కల్యాణ్ రామ్ నిర్మించాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు కలెక్ట్ చేసిన రెండో చిత్రంగా నిలిచింది.నాగ్ ఒప్పుకొంటారా?

Updated By ManamMon, 06/25/2018 - 13:04

nag, kalyan ram క‌ల్యాణ్‌రామ్ న‌టించిగా విడుద‌లైన `నా నువ్వే` ఆయ‌న‌కు డిజాస్ట‌ర్‌గా నిలిచింది. అందుకే ఆయ‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఆచి తూచి అడుగులు వేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఆ క్ర‌మంలోనే ఆయ‌న ప‌వ‌న్ సాదినేని క‌థ‌ను ఓకే చేశారు. ఇందులో క‌ల్యాణ్‌రామ్‌తో పాటు మ‌రో స్టార్ హీరో కూడా ఉంటారు. ఆ పాత్ర కోసం నాగార్జున‌ను సంప్ర‌దిస్తున్నారు. అయితే నాగార్జున ఇంకా ఓకే చెప్పిందీ, లేనిదీ తెలియ‌లేదు. నాగార్జున‌ను ఒప్పించ‌డంలో ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు గుణ్ణం గంగ‌రాజు కూడా కీల‌క పాత్ర పోషిస్తున్నార‌ట‌. క‌ల్యాణ్ రామ్ త‌న సొంత బ్యాన‌ర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై తెర‌కెక్కించే ఈ సినిమాకు గుణ్ణం గంగ‌రాజు స్క్రీన్ ప్లే రైట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నాగార్జున అంగీక‌రిస్తే ఈ సినిమా షూటింగ్ సెప్టెంబ‌ర్ నుంచి మొద‌ల‌వుతుంద‌ని వినికిడి. నాగార్జున ప్ర‌స్తుతం నానితో ఓ మ‌ల్టీస్టార‌ర్‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. నందమూరి హీరోలకు బన్నీ థ్యాంక్స్

Updated By ManamWed, 06/06/2018 - 08:55

bunny, kalyan ram

టాలీవుడ్ హీరోల మధ్య సాన్నిహిత్యం పెరుగుతోంది. ఆ ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ అంటూ తేడా లేకుండా అన్ని ఫ్యామిలీల హీరోలు తమ మధ్య మంచి బంధాన్ని ఏర్పరచుకుంటూ అభిమానుల మధ్య అంతరాలను తొలగిస్తున్నారు. 

ఇదంతా పక్కనపెడితే తాజాగా హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్ అనే ఛాలెంజ్ దేశ వ్యాప్తంగా వైరల్‌గా మారగా దానిని టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఎన్టీఆర్‌ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన కల్యాణ్ రామ్ తన ఛాలెంజ్‌ను అల్లు అర్జున్, రామ్, సాయి ధరమ్ తేజ్‌లకు ఇచ్చాడు. దానికి స్పందించిన అల్లు అర్జున్ తనను నామినేట్ చేసినందుకు థ్యాంక్స్ అంటూ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లను ట్యాగ్ చేశాడు.

 

Related News