Ritika Singh

‘నీవెవ‌రో’ మూవీ రివ్యూ

Updated By ManamFri, 08/24/2018 - 14:32
Neevevaro

నిర్మాణ సంస్థ‌:  కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌, ఎంవీవీ సినిమా
న‌టీన‌టులు: ఆది పినిశెట్టి, తాప్సి, రితికా సింగ్, వెన్నెల‌కిషోర్‌, తుల‌సి, శివాజీరాజా, శ్రీకాంత్ అయ్య‌ర్‌, స‌త్య‌కృష్ణ‌న్‌, సప్త‌గిరి, ఆద‌ర్శ్, ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ త‌దిత‌రులు
సంగీతం: అచ్చు రాజామ‌ణి, ప్ర‌స‌న్
ర‌చ‌న‌, స‌మ‌ర్ప‌ణ‌:  కోన వెంక‌ట్‌
నిర్మాత‌:  ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌
ద‌ర్శ‌క‌త్వం:  హ‌రినాథ్‌
కెమెరా: సాయిశ్రీరామ్‌
క‌ళ‌: చిన్నా
కూర్పు: ప్ర‌దీప్ ఇ.రాఘ‌వ్‌
పోరాటాలు: వెంక‌ట్‌
విడుద‌ల తేదీ: 24.08.18

కొత్త క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుని, వాటి కోసం అహ‌ర్నిశ‌లూ క‌ష్ట‌ప‌డి మంచి ప్రాడెక్ట్ ని ప్రేక్ష‌కుల‌కు ఇవ్వాల‌న్న కాంక్ష మంచిదే. కేవ‌లం డ‌బ్బుల కోస‌మే సినిమాలు చేయ‌కుండా, ప్యాష‌న్‌తో సినిమాలు చేయ‌డ‌మూ మంచిదే. అలా మంచి పని చేస్తున్నారు ఆది పినిశెట్టి. ర‌విరాజా పినిశెట్టి కుమారుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట‌ర్ అయి పుష్క‌రం అవుతున్న సంద‌ర్భంగా మ‌ర‌లా హీరోగా ఆయ‌న న‌టించిన తెలుగు సినిమా `నీవెవ‌రో`. ఈ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ప్రేక్ష‌కుల‌ను ఎంత‌వ‌ర‌కు మెప్పించింది అనేది తెలుసుకోవాలంటే చ‌దివేయండి.

క‌థ‌:
అంద‌రిలాగే ఆరోగ్యంతో పుట్టిన కల్యాణ్ ( ఆది పినిశెట్టి) త‌న 15వ ఏట క‌ళ్లు పోగొట్టుకుంటాడు ఓ ప్ర‌మాదంలో. పోయింది క‌ళ్లే గానీ, సెల్ప్ కాన్ఫిడెన్స్ కాద‌న్న‌ది అత‌ని అభిప్రాయం. ఎవ‌రైనా అత‌ని ప‌ట్ల సానుభూతి చూపిస్తే అత‌నికి న‌చ్చ‌దు. అలాంటిది వెన్నెల (తాప్సీ) అత‌నికి అనుకోకుండా ద‌గ్గ‌ర‌వుతుంది. అను (రితికా) ద‌గ్గ‌ర‌వ్వ‌డానికి ప్ర‌య‌త్నించినా.. అందులోనూ ఏదో ఒక సానుభూతి అత‌నికి క‌నిపిస్తుంది. ఈ నేప‌థ్యంలో క‌ల్యాణ్ ప్ర‌మాదానికి గుర‌వుతాడు. అత‌నికి చూపు తిరిగి వ‌స్తుంది. వెన్నెల తండ్రి తిల‌క్ వ‌చ్చి క‌ల్యాణ్ క‌లుస్తాడు. ఓ సంద‌ర్భంలో తిల‌క్ ప్ర‌మాదానికి గుర‌వుతాడు. అత‌న్ని గుర్తుప‌ట్టిన క‌ల్యాణ్ అది హ‌త్య అని తెలుసుకుంటాడు. ఆ హ‌త్య తాలూకు కూపీ లాగుతుంటే అత‌నికి వెన్నెల నిజ స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డుతుంది. ఇంత‌కీ వెన్నెల ఎవ‌రు? క‌ల్యాణ్ తెలుసుకున్న కొత్త నిజం ఏంటి?  వెన్నెల మెడ‌లో మూడు ముళ్లు వేశాడా?   లేకుంటే అనును పెళ్లి చేసుకున్నాడా అనేది ఆస‌క్తిక‌రం. 

ప్ల‌స్ పాయింట్స్
- న‌టీన‌టుల న‌ట‌న‌
- సంగీతం
- కెమెరా
- ఆర్ట్

మైన‌స్ పాయింట్లు
- క‌థ‌, క‌థ‌నం
- నెమ్మ‌దిగా సాగిన స్క్రీన్‌ప్లే
- సాగ‌దీత స‌న్నివేశాలు

Neevevaro

స‌మీక్ష‌
రీమేక్‌లు అన్నీ పండ‌వు. అన్నీ మెప్పించ‌వు. కానీ కొన్ని మాత్రం బావుంటాయి. అలా బావుంటుంద‌నుకుని కోన వెంక‌ట్ తెర‌కెక్కించిన సినిమా `నీవెవ‌రో`. త‌మిళంలో స‌క్సెస్ అయిన `అదే క‌న్‌గ‌ళ్‌` చిత్రానికి రీమేక్ ఇది. తెలుగు ఆడియ‌న్స్ టేస్ట్ కు త‌గ్గ‌ట్టు కొన్ని మార్పులు చేశారు. ఆది పినిశెట్టి చూపు లేకుండా, చూపు క‌లిగిన కుర్రాడిగా బాగా న‌టించాడు. తాప్సీ స‌హజంగా న‌టించింది. త‌న పాత్ర ప‌రిధిలో రితిక‌, స‌త్య కృష్ణ‌, తుల‌సి, శ్రీకాంత్ అయ్యంగార్‌, శివాజీరాజా, వెన్నెల కిశోర్‌, స‌ప్త‌గిరి.. అంద‌రూ మెప్పించారు. చాన్నాళ్ల త‌ర్వాత స‌ప్త‌గిరికి మంచి పాత్ర ప‌డ్డ‌ట్ట‌నిపించింది. న‌టీన‌టుల ప‌రంగా సినిమా ప‌క్కాగా బావుంది. కాక‌పోతే స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే విష‌యంలోనే ఇంకాస్త జాగ్ర‌త్త తీసుకోవాల్సింది. అన‌వ‌స‌ర‌మైన స‌న్నివేశాలు చాలా ఉన్న‌ట్ట‌నిపించాయి. ఎడిట‌ర్ కొన్ని వేల గంట‌లు రూమ్‌లో కూర్చుని సినిమాను ఈ షేప్‌కు తెచ్చార‌ని అంతా తెగ‌పొగిడారు. మ‌రికొన్ని గంట‌లు ఎడిటింగ్ మీద దృష్టి పెట్టి ఉంటే బావుండేది. ఆర్ట్, కాస్ట్యూమ్స్, కెమెరా వ‌ర్క్ బావుంది. ద‌ర్శ‌కుడు మాత్ర‌మే కాస్త అటూ, ఇటూ త‌డ‌బ‌డ్డ‌ట్టు అనిపిస్తుంది. రీరికార్డింగ్ అక్క‌డ‌క్క‌డా అస‌లు అత‌క‌లేదు. ఎమోష‌న్స్ కొన్ని చోట్ల స‌రిగా పండ‌లేదు. అక్క‌డ‌క్క‌డా లాజిక్ కూడా మిస్ అయిన‌ట్టు అనిపించింది. మ‌ల్టీప్లెక్స్ ఆడియ‌న్స్ కి మాత్రం క‌నెక్ట్ అయ్యే సినిమా.
రేటింగ్: 2/5
బాట‌మ్ లైన్‌:  న‌త్త న‌డ‌క‌న‌.. `నీవెవ‌రో`.‘నీవెవరో’కు సెన్సార్ పూర్తి

Updated By ManamTue, 08/21/2018 - 15:19

Neevevaroఆది హీరోగా హరినాథ్ తెరకెక్కించిన చిత్రం ‘నీవెవరో’. ఆగష్టు 24న ప్రేక్ష్కుల ముందుకు రానున్న ఈ చిత్రానికి తాజాగా సెన్సార్ పూర్తైంది. చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్‌లు లేకుండా యు/ఎ సర్టిఫికేట్‌ను ఇచ్చారు. దీంతో ప్రమోషన్లలో మరింత వేగాన్ని పెంచింది చిత్ర యూనిట్. కాగా ఈ చిత్రంలో ఆది అంధుడి పాత్రలో నటిస్తుండగా.. ఆయన సరసన తాప్సీ, రితికా సింగ్ నటించారు. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రవీణ్ శ్యామ్ సంగీతం అందించాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.‘నీవెవరో’కు విడుదల తేది ఖరారు

Updated By ManamWed, 08/01/2018 - 13:23

Neevevaroఆది పినిశెట్టి హీరోగా హరినాథ్ తెరకెక్కించిన చిత్రం ‘నీవెవరో’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి విడుదల తేదీని ఖరారు చేశారు. ఆగష్టు 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్, ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.

కన్నడ చిత్రం ‘కంగల్‌’ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆది అంధుడి పాత్రలో కనిపించనుండగా.. ఆయన సరసన తాప్సీ, రితికా సింగ్ నటించారు. కోనవెంకట్, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రసేన్ సంగీతం అందిస్తున్నాడు. వారి బాట‌లోనే రితికా సింగ్‌

Updated By ManamTue, 07/10/2018 - 13:22

ritika ఇప్పుడు తెలుగులో న‌టిస్తున్న హీరోయిన్స్ అంద‌రూ తెలుగు నేర్చుకుంటున్నారు. అంతే కాకుండా తెలుగులో డ‌బ్బింగ్ కూడా చెప్పుకుంటున్నారు.  కీర్తిసురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌, అదితిరావు హైద‌రి అంద‌రూ డ‌బ్బింగ్ చెప్పుకున్న‌వారే. ఇప్పుడు వీరి బాట‌లో రితికా సింగ్ అడుగుపెట్టింది. వివ‌రాల్లోకెళ్తే.. ఆదిపినిశెట్టి, తాప్సీ, రితికాసింగ్ క‌లిసి న‌టిస్తున్న థ్రిల్ల‌ర్ `నీవెవ‌రో`. ఈ చిత్రంలో రితికా సింగ్ త‌న పాత్ర‌కు త‌నే డ‌బ్బింగ్ చెప్పుకుంటోంద‌ట‌. ద‌ర్శ‌కుడు హ‌రికృష్ణ రితికా స్వంతంగా డ‌బ్బింగ్ చెప్పుకుంటే బావుంటుంద‌ని భావించ‌డంతో త‌ను కూడా ఒప్పుకుంద‌ట‌. కోన వెంక‌ట్‌, ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఆది మూవీ టైటిల్‌ చెప్పేసిన నాని

Updated By ManamThu, 05/24/2018 - 12:50

neevevaro ‘లవర్స్’ ఫేం హరి నాథ్ దర్శకత్వంలో ఆది పినిశెట్టి ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర టైటిల్‌ను తాజాగా నాచురల్ స్టార్ నాని విడుదల చేశాడు. ‘నీవెవరో’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆది సరసన తాప్సీ, రితికా కనిపించనున్నారు. కాగా పోస్టర్‌లో హీరో మధ్యలో ఉండగా.. అటు, ఇటు హీరోయిన్లు ఉన్నట్లు చేసిన డిజైన్ ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రాన్ని ఎమ్‌వీవీ సత్యనారాయణ, కోనా వెంకట్ సంయుక్తంగా నిర్మిస్తుండగా ఫ్రసన్ సంగీతాన్ని అందించనున్నాడు. 
 

                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                   ఆదితో బాక్సింగ్ బ్యూటీ

Updated By ManamThu, 12/21/2017 - 09:15

Aadhi'గురు' సినిమాతో తెలుగు వారికి పరిచయమైన బాక్సింగ్ బ్యూటీ రితికా సింగ్‌ తన నటనతో ఇక్కడ కూడా అభిమానులను సంపాదించుకుంది. అయితే ఆ మూవీ తరువాత టాలీవుడ్‌లో ఆమెకు పెద్దగా ఆఫర్లేవీ రాలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం రితికాకు తెలుగులో మంచి ఆఫర్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఆది పినిశెట్టి హీరోగా హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో తాప్సీ మెయిన్‌ హీరోయిన్‌గా కనిపించనుండగా.. మరో కీలక పాత్రలో రితికా కనిపించనుందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 27నుండి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీని కోనా ఫిల్మ్ కార్పోరేషన్, ఎమ్‌వీవీ సినిమాస్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. తెలుగులో పాటు హిందీలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు సమాచారం.

Related News