editorial

బ్రెగ్జిట్ భూతం

Updated By ManamSat, 11/17/2018 - 00:15

brexitబ్రిటన్‌ను బ్రెగ్జిట్ భూతం వెంటాడుతోంది. బ్రిటన్ ప్రధాని థెరెసా మే తన సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుండడంతో రాజకీయ సంక్షో భం తలెత్తింది. బ్రెగ్జిట్‌పై మే ప్రణాళికను వ్యతిరేకిస్తూ కీలకమైన బ్రెగ్జిట్ మంత్రి డొమినిక్ రాబ్ సహా మరో ఇద్దరు కేబినెట్ మంత్రులు రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో చర్చలు జరుపుతున్న ప్రధాన అనుసంధానకర్త బ్రెగ్జిట్ మంత్రి డొమినిక్ రాబ్ ఆకస్మిక రాజీనామాతో థెరిసా ప్రణాళికకే కాదు, ఆమె నాయకత్వానికి కూడా పెద్ద సవా ల్ ఎదురైంది. బ్రెగ్జిట్ ముసాయిదా ప్రణాళికపై బుధవారం బ్రిటిష్ మంత్రివర్గ సమావేశంలో తీవ్ర తర్జనభర్జనల అనంతరం అతికష్టం మీద ఆమోదం లభిం చింది. ఆ తర్వాత  పార్లమెంట్‌లో ఈ ముసాయిదాను చర్చకు పెట్టడానికి ముందే బ్రెగ్జిట్ మంత్రి రాబ్ రాజీనామా, తదనంతరం మరో మంత్రి ఈస్తర్ మెక్‌వే సహా మరికొందరు జూనియర్ మంత్రులు సహా ఏడుగురు మంత్రులు రాజీనామా చేయడంతో థెరిసా ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. మరోవైపు కన్సర్వేటివ్ పార్టీ 1922 కమిటీకి 48 లేఖలు అందినట్లయితే తన నాయకత్వంపై అవిశ్వాసం తీర్మానాన్ని ఆమె ఎదుర్కొనవలసి వస్తుంది. దానికి తోడు టోరీలు మరోసారి బ్రెగ్జిట్ రెఫరెండమ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. లేబర్ పార్టీ ముందస్తు సార్వత్రిక ఎన్నికల కోసం అర్రులు చాస్తోం ది. ఈ నేపథ్యంలో బ్రిటన్ రాజకీయాల్లో అనిశ్చితి చోటు చేసుకుంది. 

యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో భాగస్వామ్యం బ్రిటన్ నుంచి వైదొలగడాన్ని ‘బ్రెగ్జిట్’ అని పిలుస్తారు. అందుకోసం 2016 జూన్ 23న బ్రిటన్ లో ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) నిర్వహిస్తే అందులో 71.8 శాతం (3 కోట్ల మంది) ప్రజలు పాల్గొన్నారు. వారిలో 51.9 శాతం బ్రెగ్జిట్‌కు అనుకూలం గాను, 48.1 శాతం మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. వాణిజ్య, రాజకీయ సహకారం కోసం 28 దేశాల భాగస్వామ్యంతో ఏర్పడిన ఈయూలో ఉన్న కార ణంగా తాము వెనకబడిపోతున్నట్లు బ్రిటన్ భావిస్తోంది. ముఖ్యంగా 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభంలో తీవ్ర ఆర్థిక మాంద్యంలోకి బ్రిటన్ కూరుకుపోయిన నాటి నుంచి ఈయూ నుంచి విడిపోవాలనే భావన బ్రిటన్ కులీన వర్గంలో ప్రబ లంగా నాటుకుంది. ఈయూ సభ్యత్వ రుసుం కింద ఏటా వందల కోట్ల రూపా యలు చెల్లించవలసి రావడం భారం కావడం మూలాన ఆర్థిక పొదుపు చర్యలు చేపట్టడంతో దేశంలోని సంక్షేమ పథకాలు మూలన పడిపోయాయని పాలకులు తమ వైఫల్యాలను కప్పిపెట్టుకునేందుకు ప్రచారం చేశారు. దాంతో రెఫరెండం ద్వారా బ్రెగ్జిట్‌కు ప్రజామోదం లభించింది. దాన్ని అమలు చేసే కర్తవ్యాన్ని భుజానికెత్తుకున్న మే ప్రభుత్వం ఏర్పడింది. 2019 మార్చి 29 శుక్రవారం రాత్రి 11 గంటలకు ఈయూ నుంచి అధికారికంగా విడిపోవడానికి బ్రిటన్ కట్టుబడి ఉంది. ఈయూ సభ్య దేశాల మధ్య 43 ఏళ్ళ ఒప్పందాలు, వేలాది అంశాలపై జరిగిన ఒడంబడికల నుంచి బ్రిటన్ వైదొలగడం అంత సులువు కాదు. బ్రెగ్జిట్ అనంతరం వ్యాపార లావాదేవీలకు సంబంధించిన అంశమే ప్రస్తుతం అత్యంత క్లిష్టంగా మారింది. బ్రెగ్జిట్ అనంతర పరిణామా లకు సంబంధించిన ఒప్పం దాన్ని థెరిసా మే ప్రభుత్వంతో పాటు ఈయూలోని 27 దేశాలు ఆమోదించాల్సి ఉంటుంది. వీటిలో కొన్ని దేశాలు స్వతంత్రంగా తమ దేశాల్లోనూ రెఫరెండంలు నిర్వహించాలని యోచిస్తుండడంతో బ్రెగ్జిట్ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. గతంలో డెన్మార్క్ కౌంటీ గ్రీన్‌లాండ్ కూడా ఇలాంటి రెఫరెండం నిర్వ హించి, ఈయూ నుంచి వైదొలిగినప్పటికీ ఇతర దేశాలతో చేసుకున్న ఒప్పం దాల కారణంగా అదే స్థితిలో కొనసాగుతున్నది.

బ్రెగ్జిట్ ఒక ఘోరమైన విషవలయం. ఈయూ నిర్ణయాలను ఆమోదిస్తేనే బ్రెగ్జిట్ అమలులోకి వస్తుంది. అదీకాక సభ్యునిగా కొనసాగకపోయినా ఈయూ బడ్జెట్ కోసం బ్రిటన్ నిధులను తప్పక సమకూర్చవలసిన పరిస్థితి కొనసాగు తుంది. ఈయూ కూటమిలో గానీ, విడిగా గానీ తాను ఎలాంటి అంతర్జాతీయ ఒప్పందాలు చేసుకోలేని అసందిగ్ద పరిస్థితిలోకి  బ్రిటన్ కూరుకుపోతుంది. ఈ ఫ్రోజెన్ బ్రెగ్జిట్ (గడ్డకట్టిన బ్రెగ్జిట్) 2020 డిసెంబర్ దాకా కొనసాగుతుంది. అందుకు బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవలసి వస్తుంది. అందుకు బ్రిటన్ అంగీకరించకపోతే ఫ్రోజెన్ బ్రెగ్జిట్ గడువు మరికొన్ని దశాబ్దాల కాలం కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోకుండా బ్రెగ్జిట్ ప్రక్రియ ముగిసినట్లయితే ఈయూ దేశాలకు బ్రిటన్ ఒక కస్టమ్స్ యూని యన్‌గా మారిపోతుంది. యూకేలోని నార్త్రన్ ఐలాండ్ ఈయూకు సన్నిహితంగా ఉండడం కూడా సమస్యలకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో బ్రెగ్జిట్ ప్రక్రియ బ్రిటన్‌కు దుఃఖదాయినిగా మారబోతుంది. బ్రిటన్ రాజకీయ నాయకులు ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచే ఆర్థిక సంస్కర ణలు, పాలనపై దృష్టి, ఆర్థిక మాంద్యం నుంచి బయటపడే మార్గాలను అన్వే షించకుండా ఉద్వేగాలు రెచ్చగొడుతూ, బ్రెగ్జిట్ వంటి ప్రమాదకర ఆటలు కట్టిపెట్టాలి. తమ రాజకీయ నాయకుల క్షుద్ర రాజకీయ ఎత్తుగడలకు అడ్డుకట్ట వేసే ప్రజాస్వామిక వివేకాన్ని బ్రిటన్ ప్రజలు ప్రదర్శించగలరని ఆశిద్దాం. మరో ముందడుగు

Updated By ManamFri, 11/16/2018 - 07:05

ప్రజా వ్యతిరేక విధానాలతోనే వివేచనా పరులుగా విభేదమంతా, ఎవరు ఎన్నేళ్ళు పీఠాలు ఏలుకుంటారో ఏలుకోనీ... అమరుల ఆకాంక్షలు ఆవిరైనప్పుడల్లా అక్షరాలు అలజడికి లోనవుతాయి. అన్నీ చూస్తూ... అంటీ ముట్టనట్లు ఉండడానికి ఆత్మగౌరవం లేనివి కావు అక్షరాలు. వీరుల రక్తాన్ని అద్దుకొని రగరగ మెరిసిన అక్షరాలు. ఉద్యమ స్వరాలకు ఊపిరైదద్ద రిల్లజేసిన అక్షరాలు. సమాజాన్ని జాగృత పరిచేందుకు శిరమెత్తుకొని నిలుస్తున్న అక్షరాలు ప్రశ్నల కొడవళ్లై మొలకెత్తక మానవు. మెరుగైన సమాజం కోసం తెర వేతన కలాలను నిరంతరం కాపుగా ఉంచుతుంది. తన దారిని మరింత విస్తరించుకుంటూ ఏడవ రాష్ట్ర మహాసభలతో మేధావులను ఏకం చేసేందుకు మరో ముందడుగు వేస్తుంది తెరవే !

editorialసాహిత్యం అంతిమ ప్రయోజనం సామాజిక మార్పే. సామాజిక చలనాన్ని, మార్పులను, పరిణామాన్ని సాహిత్యం ప్రతిఫలిస్తుంది. కాలానుగుణంగా సంభ వించే గతిశీలక మార్పులను అందిపుచ్చుకొని సృజన కారులు సాహిత్యాన్ని సృష్టిస్తారు. అయితే ఈ మార్పులు ఒక్కో కాలానికి, సమాజానికి ప్రత్యేకమైనవిగా ఉంటాయి. తెలంగాణ సమాజం వరకు వస్తే, భూస్వామ్య అణచివేత, వెట్టి విముక్తి కోసం నిజాము నెదిరించి సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ... తెలంగాణ తరతరాల వెనుకబాటుకు సమసమాజ స్థాపనే పరిష్కారంగా సాగిన విప్లవోద్యమం... తెలంగాణ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో కొనసాగిన వివక్షకు తక్షణ విముక్తిగా వెల్లువెత్తిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల ఫలితంగా వచ్చిన పరిణామాత్మక మార్పులు, గుణాత్మక మార్పులుగా స్థిరపడుతూ తెలంగాణ సాహిత్యం వెల్లువెత్తి బలమైన సాంస్కృతిక భూమికను ఏర్పరచుకున్నది. తెలంగాణ పట్ల కొనసాగిన తీవ్రమైన వివక్ష, నీళ్ళు, నిధులు, ఉద్యోగాల దోపిడి, తత్ఫలితంగా రైతుల ఆత్మహత్యలు, గల్ఫ్, ముంబాయి వలసలు, మితిమీరిన రాజ్యహింస, భాషా - సాహిత్య మూలా ల విధ్వంసం... వీటన్నింటి కారణంగా తెలంగాణ తీవ్ర సంక్షభంలోకి నెట్టివేయబడింది. వీటికి గల కార్య కారక సంబంధాలను విశ్లేషించుకొనే లోతైన చూపు, సరైన దృక్పథం సృజనకారులకు లేకుంటే, ఈ సామా జిక చలనాలను సాహిత్యంలో ప్రతిఫలింపజేసే అవ కాశం లేదు. ఈ చూపును, దృక్పథాన్ని ఇక్కడి సాహి త్యకారులకు అందించింది తెలంగాణ రచయితల వేదిక. సమాజ గతిశీలతకు అనుగుణంగా, సాహిత్య మూ మార్పులను సంతరించుకుంటుంది. భావవాద నిష్ప్రయోజకత్వాన్ని నిరసిస్తూ అరసం.. దిగంబర కవిత్వ ధిక్కారానికి రాజకీయ విశ్వాసాలను జోడిస్తూ, వర్గ దృక్పథంతో విరసం ఏర్పడితే.... అస్తిత్వవాద స్పృహతో తక్షణ విముక్తిని ఆకాంక్షిస్తూ తెరవే ఏర్పడింది.

తెలంగాణ భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృ తుల పరిరక్షణే ధ్యేయంగా తెరవే 2001లో ఒక చారి త్రక సందర్భంలో పురుడు పోసుకున్నది. ప్రత్యేక తె లంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తి తన కర్తవ్యంగా భావించి కలం వీరుల్ని తయారుచేసింది. 1969 ఉద్య మం విఫలం కావడానికి ప్రధాన కారణం ఉద్యమాన్ని కడదాకా కొనసాగించే ఆచరణాత్మక భావజాల నిర్మా ణాన్ని రూపొందించుకోకపోవడం వల్లనే. మలిదశ ఉ ద్యమంలో ఈ పనిని తెరవే ప్రభావవంతంగా చేసిం ది. సోయి పత్రిక ద్వారా... వందలాది సభలు, పుస ్తకాల ద్వారా తెలంగాణ భాషపై జరిగిన దాడిని తిప్పి కొట్టి అది ఎంతటి జీవద్భాషో నిరూపించగలిగింది. ఆరు రాష్ట్ర మహాసభలు, రెండు అఖిల భారత తెరవే సభలు, అనేక జిల్లా సభల ద్వారా తెలంగాణ మేధో సమాజాన్నంతా ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి తె లంగాణకు జరిగిన ద్రోహంలో వలస పాలకుల, మన పాలకుల పాత్రను ఎండగడుతూ, ముల్కి రూల్స్ నుంచి మొదలుకొని కడదాకా సాగిన సీమాంధ్రుల కుట్రలను విప్పి చెప్పడం ద్వారా విద్యార్థులు, ఉద్యో గులు, విద్యావంతులతో పాటు నిరక్షరాస్యులు సైతం ఉద్యమంలో భగభగమండే అగ్గిరవ్వలై కదిలారు. రాజకీయ నాయకుల వ్యూహ-ప్రతివ్యూహాల ద్రోహ చర్యలతో ఉద్యమం ఆటుపోట్లకు గురైనా, ఉద్యమ ఆకాంక్షను చివరికంటా నిలిపేందుకు కవులు, కళా కారులను కార్యక్షేత్రంలో నడిపించింది. బమ్మెర, పాలకుర్తి గ్రామాల మట్టిని తెచ్చి హైదరాబాద్‌లో జరిగే సభల్లో చల్లడం ఒక ఉద్విగ్న సన్ని వేశం. పాల్కురికి సోమన్నే ఆదికవిగా ఆత్మవిశ్వాసంతో చాటిచెప్పి, పోతన్నను ఒంటిమిట్టకు తరలించుకు పోయే కుట్రల్ని భగ్నం చేయడం చారిత్రక విజయం. ఉద్యమ సమయంలో సాగరహారం, మిలియన్ మా ర్చ్, సకల జనుల సమ్మెలో కలాల కవాతు చేయించిం ది. సాహిత్య యుద్ధభేరిని మోగించి, ఉద్యమాకాంక్షను తెలియజేసింది. ప్రకటించిన తెలంగాణ తిరిగి వెనకకు మళ్ళినపుడు, ఉద్యమాల ఉధృతి ద్వారానే తెలంగాణ సాధ్యమని ఒకవైపు, ఎన్నికల లాబీయింగే మార్గమని మరోవైపు అనే సందిగ్ధ స్థితి నెలకొన్నపుడు ‘ఇపుడేం చేద్దాం’ అని 12 గంటల కవి సమ్మేళనాన్ని నిర్వహించి 500 మంది కవులచే కవితాగానం చేయించడం సాహి త్య చరిత్రలో ఒక సంచలనం.

జీవన విధ్వంసానికి కారకాలైన మూలాలను అవగాహన చేసుకోకుండా, ఏ సృజనకారుడైనా జీవి తాన్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మార్పు చేయగల ఉత్తమ సాహిత్యాన్ని సృష్టించలేడు. అందుకే తెరవే కవులు, రచయితలను జనంతో మమేకం చే యించింది. సాహిత్యానికి ముడిసరుకు జీవితమే. పోలవరం ముంపు బాధితులను, ఆత్మహత్యలతో అ ల్లాడిపోతున్న సిరిసిల్ల నేతన్నలను, గడప గడపకో కన్నీటి గాథను దాచుకున్న రుద్రంగి గల్ఫ్ బాధితు లను, ఓపెన్ కాస్ట్ బాధిత గ్రామం ఎర్రగుంటపల్లి, ముంపు గ్రామం మల్లన్న సాగర్‌ను, అమరుల త్యాగాలను స్మరించుకొనేందుకు ఆంక్షల కంచెలను దాటుకెళుతున్న ఇంద్రవెల్లి ఆదివాసీలను కలిసి, వారికి అక్షరాలు బాసటగా నిలుస్తాయని బాసచేసింది.

వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసు కుంటుంటే, బాధిత కుటుంబాలను ఒకచోట చేర్చి ‘రైతు భరోసా గీతం’ పేరుతో సభ నిర్వహించి వారి లో ఆత్మస్థైర్యాన్ని నింపి ఆర్థిక చేయూత నిచ్చింది. తొలి కంద పద్యానికి వేదికైన బొమ్మలమ్మగుట్టను, 1300 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాచీన దేవాలయ మున్న కోట్లనర్సింలపల్లి దేవునిగుట్టను గ్రానైట్ మాఫి యా కోరలకు చిక్కకుండా కవులు రచయితల ఉద్య మంతో కాపాడుకుంది. చెంచుల వారసత్వ వాయిద్య మైన కిన్నెర అంతరించి పోను సందర్భంలో వారికి దానిని బహుకరించింది. సమస్త తెలంగాణ జానపద కళారూపాలను ఒకేవేదిక మీదికి చేర్చి, అద్భుత ప్రద ర్శన చేపట్టింది. రామప్ప దేవాలయం శిథిలావస్థకు చేరుకున్నా పట్టించుకోని ప్రభుత్వాల తీరును నిరసిస్తూ, స్థానికులను సమీకరించి ఉద్యమించిన ఫలి తంగా కోర్టుల చొరవతో రక్షణ చర్యలకు బీజం పడింది. ఈ క్షేత్ర పర్యటనల అధ్యయనంతో ‘వన రుల విధ్వంసం, మా ఊరి పెద్దర్వాజ, భూమి దుః ఖం, శబ్దలయలు, కన్నీటి సాగరాలొద్దురా మల్లన్నా’ మొదలగు పుస్తకాలను వెలువరించింది. భాష, సాహిత్యం, కళలు ప్రజలు సృష్టించు కున్నవి. అవి విధ్వంసానికి గురవుతున్న ప్రతి మూల మలుపులో తెరవే వాటి పరిరక్షణ కోసం నిలబడింది.. నిలబడుతుంది. తెలంగాణ ఉద్యమ లక్ష్యం భౌగోళిక హద్దులు గీసుకొని భౌతికంగా వేరుపడాలన్నది కాదు. ఛిద్రమైన జీవితాలు చిగురించాలని, భంగపడిన భా ష బడి పుస్తకాలలో వెలగాలనీ, మసకబారిన మానవ హక్కులు మరల వికసించాలనీ, మన సాహిత్యం, కళ లు మకుటాయమానమై విరాజిల్లాలని, యువకులు, విద్యార్థులకు ఉద్యోగాల భరోసా దొరకాలని ఆఖరి యుద్ధాన్ని చేశాము. ఆశలన్ని నెరవేరుతాయా అన్నది ప్రస్తుతం మనముందున్న ప్రశ్న. ప్రత్యామ్నాయ రాజకీయాల చర్చ కాకపోయినా, ప్రజాస్వామిక విశ్వా సాల పరిధిలోనైనా మెరుగైన మానవ జీవనానికి తెలంగాణ వేదిక కావాలి. సకల జనులు భాగస్వాము లై సాధించిన తెలంగాణలో వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలి. ఎందుకంటే అవి ఉద్యమ లక్ష్యాలుగా నెత్తి కెత్తుకొని ఊరేగినవాళ్ళం. మనం!

ఈ ప్రభుత్వాల అభివృద్ధి నినాదం ఏమిటి? గు ణాత్మకమైన మార్పుకు సూచీ ఏది? సంక్షేమ పథకాల పెంపే దానికి సమాధానం కాగలదా? ధర్నా చౌక్‌ను ఎత్తివేయడం, ఏ భావ స్వేచ్ఛగా భావించవచ్చు? కొండలను పిండి చేయడం, ఓపెన్ కాస్ట్‌లతో భూమిని పుండుగా మార్చడం వనరుల విధ్వంస కొనసాగింపు కాదా? అధికారమే లేక అలంకార ప్రాయమైన అధి కార భాషా సంఘం, అందరిదీ కాక కొందరి బంధువుగా మారిన సాహిత్య అకాడమీ, కోట్లాది రూపా యలతో జాతరగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో భాషా - సాహిత్యాభివృద్ధి కోసం తీసు కొనే చర్యలు తీర్మానాలుగా వెలువడక గాలిలోనే వేలాడుతున్న తీరు, తెలంగాణ భాష - సాహిత్యాభి వృద్ధికి పైపై తొడుగులే కానీ, నిర్మాణాత్మక చర్యలు కావు అని నిరూపించడం లేదా ? వందలాది మంది కళాకారులకు, లక్షలాది రూపాయల జీతాలు చెల్లిస్తు న్నా... రైతు ఆత్మహత్యలు, పరువు హత్యలు నిర సిస్తూ వారికి భరోసానిచ్చే ఒక్కటంటే ఒక్కటైనా పుట్టని పాట... పథకాలను ప్రచారం చేస్తూ పడుచుల పెదాలపై లిప్‌స్టికెకై మెరుస్తుండడం ఒక విషాదం. లక్షలాది మంది విద్యార్థులు గర్వంగా పాడుకుంటున్న జయ జయహే గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటిం చక పోవడం చూస్తే, తెలంగాణ ఉద్యమ శ్వాసగా నిలిచిన పాట ఊపిరి తీసినట్లుగా కనిపించడం లేదా? ఇవన్నీ కవులు, రచయితలు, బుద్ధిజీవులను కలవర పరిచే విషయాలే. రాజాశ్రయాన్ని కాంక్షించే కలాలకు ఇవి పట్టని విషయాలే కానీ.. ప్రజల పక్షాన నిలిచే అక్షరాలకు ఇవన్నీ తక్షణ స్పందనలే !
తెరవే ఏ రాజకీయ పార్టీ జేబు సంస్థ కాదు. ప్రభుత్వాలు ఏవైనా వాటితో ఏలాంటి పేచీ లేదు. ప్రజా వ్యతిరేక విధానాలతోనే వివేచనా పరులుగా విభేదమంతా, ఎవరు ఎన్నేళ్ళు పీఠాలు ఏలుకుంటా రో ఏలుకోనీ... అమరుల ఆకాంక్షలు ఆవిరైనప్పుడల్లా అక్షరాలు అలజడికి లోనవుతాయి. అన్నీ చూస్తూ... అంటీ ముట్టనట్లు ఉండడానికి ఆత్మగౌరవం లేనివి కావు అక్షరాలు. వీరుల రక్తాన్ని అద్దుకొని రగరగ మెరిసిన అక్షరాలు. ఉద్యమ స్వరాలకు ఊపిరైదద్ద రిల్లజేసిన అక్షరాలు. సమాజాన్ని జాగృత పరిచేందుకు శిరమెత్తుకొని నిలుస్తున్న అక్షరాలు ప్రశ్నల కొడవళ్లై మొలకెత్తక మానవు. మెరుగైన సమాజం కోసం తెర వే తన కలాలను నిరంతరం కాపుగా ఉంచుతుంది. తన దారిని మరింత విస్తరించుకుంటూ ఏడవ రాష్ట్ర మహాసభలతో మేధావులను ఏకం చేసేందుకు మరో ముందడుగు వేస్తుంది తెరవే!
గాజోజు నాగభూషణం
9885762052‘సర్కార్’తో సర్కార్

Updated By ManamTue, 11/13/2018 - 01:11

imageఅస్తిత్వవాదులు (మత, జాతి, కుల, ప్రాంత, జెండర్ తదతర) తమ ఉనికి కోసం పలు సినిమాలపై దాడులకు తెగబడటం, వాటిని నిషేధించాలని కోరడం, అభ్యంతరకర/ సామాజిక సమూహాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నా యనే నెపంతో కొన్ని సినిమా ప్రాజెక్టులు మూలపడటం, కీలక అంశాలపై సర్కార్ సెన్సార్ కోతలు ఇండియాలో కొత్తకావు. అయితే వివాదాస్పద చారి త్రక సన్నివేశాలు, భావనలను కావాలని వక్రీకరించి లేదా అతిశయోక్తులుగా చిత్రీకరించడం ద్వారా సమాజంలోని కొన్ని సమూహాల మనోభావాలను రెచ్చ గొట్టడం ద్వారా బాక్సాఫీస్ హిట్‌లను సాధించాలని సినిమా పరిశ్రమ సరికొత్త వివాదాలను సృష్టించడం ఒక ఎత్తుగడగా చేపట్టిందనడంలోనూ తప్పు లేదు. రచనలు మొదలు చిత్రకళ, ఛాయాచిత్రకళా రంగాల వంటి సృజనాత్మక రంగా ల్లోకి మితవాద భావజాలం, రాజ్య వ్యవస్థలు, సంస్థలు, మూకస్వామ్య శక్తులు, మోరల్ పోలీసింగ్ చేయడమే కాక, మైనారిటీ మత వ్యతిరేక, దళిత, బహుజన వ్యతిరేక విద్వేషకాండను, గో సంరక్షణ తదితర చట్టాల్ని బలవంతంగా అమ లు చేసే రాజ్యేతర ప్రైవేట్ శక్తులు, సంస్థలు, మూకలు బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి నాటి నుంచి  సమాజంలో వ్యవస్థీకృతమవడం ప్రజ లు, ప్రజాస్వామికవాదులకు ఆందోళన కలిగిస్తోంది.

ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం పదే పదే చెప్పిన హితవచనాలను, ఆదేశాలను సైతం ఖాతరు చేయని ఒక ఉద్వేగభరిత భావజాల మూకస్వామ్యం మోదీ ప్రభుత్వ అండ దండలతో దేశవ్యాప్తంగా ఆవరిస్తోంది. తాజాగా వివిధ భాషల్లో విడుదలైన తమిళ చిత్రం ‘సర్కార్’ చుట్టూ అలాంటి వివాదమే కమ్ముకుంది. సర్కార్‌లోని కొన్ని సన్నివేశాలు తమ పార్టీ అధినేత జయలలితను, ఆమె తీసుకొచ్చిన జన సంక్షేమ పథకాలను అవమాన పరిచేలా ఉన్నాయని ఆరోపిస్తూ పాలక అన్నా డిఎంకె కార్యకర్తలు తమిళనాడు థియేటర్లపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఆ చిత్ర కథానాయకుడు విజయ్, దర్శకుడు మురుగదాస్‌లకు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు తెలియజేయడమే కాక, సాక్షాత్తు ఒక మంత్రి వారిపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేయడం విడ్డూరం. ఇప్పటికే బీ జేపీ మరబొమ్మలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్నాడిఎంకెలోని ఒ. పన్నీ ర్ సెల్వం (ఓపీఎస్-పురుచ్చితలైవి-అమ్మ), ఎడప్పాడి కె. పళనిస్వామి (ఈపీ ఎస్-ఏఐఏడిఎంకె-అమ్మ) ముఠాలు, ప్రజల దృష్టిని పక్కదారి పట్టించి, ఆ మరకను వదిలించుకునేందుకు ‘సర్కార్’ చిత్రంపై దాడులకు కార్యకర్తలను పురమాయించాయి. అయితే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ దాడుల వెనుక బీజేపీ దక్షిణాది వ్యూహం కూడా ఉందన్న ఆరోపణలనూ కాదనలేము.

రాజకీయ కారణాలతో జరుగుతున్న ఈ దాడులు ‘సర్కార్’ సినిమా గణం (నిర్మాత, దర్శకుడు, హీరో, పంపిణీదారులు వగైరా..) ఊహించినదీ, కోరు కున్నదీను. సంచలనాలను రగిలించి, ఆ ఉద్వేగాల, ఉద్రిక్త వివాదాల నడుమ తమ చిత్రాలను మొదటి వారం కలెక్షన్లతోనే నిర్మాణ వ్యయాన్ని రాబట్టడమే కాక, భారీ లాభాల పంటను పండించుకునేందుకు ఆయా సినిమా గణాలు ఒక మార్కెటింగ్ ఎత్తుగడగా అమలు చేస్తుండడం ఇండియా సినిమా రంగానికి ఒక దుర్మార్గపు ఆనవాయితీగా మారింది. సినిమా భారీ కలెక్షన్లతో ప్రదర్శనలు జరిగి కోట్లాది రూపాయల లాభాలను పిండుకునేందుకు ఎంతటి భావజాల కాలుష్యాన్నైనా, విద్వేష విషాన్నైనా, అశ్లీల పరిమళాలనైనా, అలవోకగా, బాధ్య తారహితంగా వెదజల్లేందుకు సినిమా గణం వెనకాడటం లేదు. అదే సమ యంలో మతవాద, కులవాద (ఏ కులమూ మినహాయింపు లేదు) వివిధ అస్తిత్వ సమూహాల నాయకులు డబ్బు, అధికారం, స్వజన ఐక్యత కోసం ఈ మధ్య కాలంలో ఒక ధోరణిలా వస్తున్న బయోపిక్ సినిమాల్లోని సన్నివేశాలను సాకుగా చూపి విద్వేషకాండలను సృష్టిస్తుండడం కద్దు. విజయ్ హీరోగా నటిం చిన అంతకుముందటి సినిమా ‘మెర్సల్’పై కూడా జీఎస్‌టీపై తప్పుడు విమ ర్శలు చేశారన్న ఆరోపణలపై బీజేపీ శ్రేణులు దాడులు చేసిన ఉదంతం నేప థ్యంలో ప్రస్తుతం ‘సర్కార్’ చిత్రంపై ప్రభుత్వం, అధికార పార్టీ శ్రేణులు జమి లిగా చేస్తున్న దాడుల ఆంతర్యమేమిటో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కా దు. గతంలో ‘పద్మావత్’ చిత్రంపైనా, ఆర్నెళ్ల క్రితం ప్రముఖ నటుడు రజనీ కాంత్ చిత్రం ‘కాలా’పైనా ఇలాంటి వివాదమే తలెత్తడం చూస్తుంటే  ఈ ధోరణి ప్రమాదకరంగా మారి, సామాజిక వైపరీత్యాలకు దారితీసే అవకాశమూ లేకపోలేదు.

‘సర్కార్’ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా హిం సను ప్రేరేపించేవిగా ఉన్నాయన్న ఫిర్యాదుపై మురుగదాస్ ఇంటిపై పోలీసులు దాడి చేయడమేకాక అన్నాడిఎంకె కార్యకర్తల నిరసన ప్రదర్శనలకు లొంగి వారికి అభ్యంతరకరమని అనిపించిన సన్నివేశాలు, పదాల తొలగింపునకు చిత్ర నిర్మాతలు రాజీపడ్డారు. చట్టాలను, రాజ్యాంగ నియమాలను రాజ్యాం గేతర వ్యవస్థలు, సంస్థలు, శక్తులు అమలు చేసేందుకు (విజిలాంటిజం) ప్రయ త్నించడం అప్రజాస్వామికం. ఆ ధోరణి సమాజంలో ప్రజావ్యతిరేక దక్షిణపక్ష భావజాలం వ్యవస్థీకృతమయ్యేందుకు, ఫాసిస్టు పాలనకు రాజ్యాంగ ఆమోదం, ప్రజామోదం లభించేందుకు మార్గం సులువు చేస్తుంది. క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితి, అందుకు అనువైన సమాచారం, వాటి అంతస్సారంగా ఉండే విరుద్ధ అంశాల మధ్య సంబంధాలు, వైరుధ్యాలు, అంతచ్ఛేదనలు, పరస్పరాధారిత.  సారూప్యతల చారిత్రక పరిణామాలుగా ఉన్న సత్యం ఆధారంగా ఏర్పడకుండా, కేవలం వ్యక్తిగత విశ్వాసాలు, ఉద్వేగాలు, ఆధిపత్య వర్గాల పట్ల వివిధ అస్తిత్వ రూపాల్లో కొనసాగుతున్న భావజాల దాస్యం పునాదిగా ప్రజాభిప్రాయం రూ పొందుతున్న కాలమిది. ఈ ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే, ఆ సామాజిక పరిస్థితికి ప్రతిఫలనంగానే ఫాసిస్టు, అర్థఫాసిస్టు, దక్షిణపక్ష, మత మితవాద రాజకీయపక్షాలు అధికారంలోకి వస్తున్న పోస్ట్ ట్రూత్ (సత్యానంతర) యుగ మిది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రభుత్వాలు, పాలకులు స్థానిక రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్య పరుస్తూ, ప్రజాస్వామ్యం, పర్యావరణ పరిరక్షణ తదితర ప్రక్రియలకు గండికొడుతున్నారు. ఆ క్రమంలో చట్టాన్ని తమ చేతు ల్లోకి తీసుకునే శక్తులు సృష్టిస్తున్న మూకస్వామ్య చిత్రవధలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుండడం చారిత్రక అపరాధమవుతుంది. ప్రజాస్వామికవాదులు, పర్యావరణవాదులు ఈ మూకస్వామ్య దాడుల్లో రాలిపోతుండడం విదితమే. రాజ్యాంగంపై, చట్టాలపై ఒకవైపు విశ్వాసముందని చెబుతూనే దొడ్డిదారిన ఇండియా బహుళత్వ సంప్రదాయాలకు గండికొడుతూ, సామాజిక విభజన రాజకీయాలను ఎన్నికల తంత్రంగా ప్రధాన జాతీయ, ప్రాంత, కుల, మత, జాతి తదితర అస్తిత్వవాద రాజకీయ పక్షాలు వినియోగిస్తుండడం సరికాదు. నేడు ప్రజల ప్రాథమిక హక్కులకు, ప్రజాస్వామ్యానికి విఘాతంగా రాజ్యాధికారం మారడం దురదృష్టకరం. 
 ఆర్బీఐపై పెత్తనం? 

Updated By ManamFri, 11/09/2018 - 03:00

imageగత దశాబ్దకాలంగా కేంద్రీయ బ్యాంక్ (రిజర్వ్ బ్యాంక్) ఆగంతుక నిధి తరిగిపోతోంది. అయినప్పటికీ ఈ అంశంపై ఎలాంటి పారదర్శకతకు చోటు కల్పించే అవకాశం ఇవ్వకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు ఆర్బీఐపై ఒత్తిడి తీసుకొస్తున్నారన్నది ఇప్పుడు తలెత్తే ప్రధాన ప్రశ్న. ఆర్బీ కాంటింజెన్సీ ఫండ్ విధానాన్ని క్రమాంకనం చేయాలని గానీ, మార్చాలనిగానీ ఎవరూ కోరుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రానికి, ఆర్బీఐకి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం రెండిటి మధ్య దూరాన్ని పెంచేలా ఉండడం ఆందోళన కలిగించే అంశం. అన్ని అసాధారణ అంశాలను ఈ నెల 19న జరిగే బ్యాంకు బోర్డు సమావేశంలో చర్చిస్తామని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ప్రకటించారు. ఈ ప్రకటన చూసిన తరువాత సమస్యపై దొడ్డిదారి చర్చలకు అవకాశం ఉంటుందని ఎవైరెనా ఊహిస్తారు. 

అయితే, పరిస్థితులు చూస్తుంటే క్షీణించే విధంగానే కనిపిస్తున్నాయి. 19న జరిగే బోర్డు సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తనకు అనుకూల మైన నిర్ణయాలు, తీర్మానాలు చేయించేలా ఆర్బీఐ గవర్నర్‌పై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ వివాదం మరింత ముదిరేలా పరిస్థితులు మరింత కఠినంగా మారే సూచనలుండడం దురదృష్టకరం. ఈ సమావేశంలో పరస్పర సంతృప్తికరైమెన పరిష్కారం లభించకపోతే దేశంలో ఆర్థికపరంగాను, మార్కెట్లలోను గడ్డుపరిస్థితులు ఎదురు కాగలవు. ఒకవేళ గవర్నర్‌పై బోర్డు ఒత్తిడి తెచ్చి తనకనుకూలైమెన తీర్మానాన్ని ముందుకు తీసుకువస్తే కొద్ది దశాబ్దాలుగా లేని చెడు సంప్రదాయానికి దారితీస్తుంది. పాలనపరైమెన అంశా ల్లో బోర్డు ఇంతవరకు ఈ విధంగా చురుైకెన పాత్ర పోషించిన దాఖలాలు లేవు. ఇదే విషయంలో ఆర్బీఐ పూర్వపు గవర్నర్ రఘురామ్ రాజన్ తీవ్రంగా హెచ్చరించారు. ఒకవేళ గవర్నర్‌పై పాలనాపరైమెన నిర్ణయాలు తీసుకురావడం తగదని ఆయన సూచించారు. ఆర్బీఐ ఏ విధంగా కాంటింజెన్సీ నిధి విధానైంపె వ్యవహరించాలో మాత్రం బోర్డు పరిశీలించవచ్చునని ఆయన చెప్పారు. ప్రస్తు త వాదోపవాదాలను పక్కనబెడితే, రిజర్వ్ బ్యాంక్ కంటింజెన్సీ ఫండ్‌పై దశాబ్దం పాటు అధ్యయనం జరిగిందని పలువురు గుర్తుచేస్తున్నారు. 

పరస్పర అనుగుణైవెున స్ఫూర్తితో ఈ ఫండ్ విషయంలో మార్పులు చేసే ప్రయత్నాలు ఎందుకు జరగలేదో ఎవరికీ అర్ధం కాని అంశం. కానీ, ఈ అంశం లో బ్యాంకులకు తిరిగిపెట్టుబడి పెట్టేందుకు 3.5 లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖకు బదలాయించవలసిందిగా గవర్నర్‌ను ఆదేశిస్తూ బోర్డు నిర్ణయం తీసుకోవడం సరికాదని పలువురు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. రిజర్వ్‌బ్యాంక్ కంటింజెన్సీ ఫండ్ కింద వాస్తవంగా 2.5 లక్షల కోట్ల రూపాయలు మాత్రవేు నిల్వ ఉండడం ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆస్తుల్లో సుమారుగా 6.5 శాతంగా ఉన్నది. మరి కేంద్ర ఆర్థిక శాఖ ఏవిధంగా 3.5 లక్షల కోట్ల రూపాయల కంటింజెన్సీ ఫండ్‌ను ఎలా కోరుతోందో అర్ధంకాని విషయం. ఇవన్నీ పట్టించుకోకుండా గతంలో ఎన్నడూ లేనివిధంగా రిజర్వ్‌బ్యాంక్‌ను తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడం ద్వారా దాని స్వయంప్రతిపత్తిని హరించే యత్నాలకు నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రయత్నించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధవేునని చెప్పక తప్పదు. స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలపై పెరుగుతున్న ప్రభుత్వ పెత్తనం వల్ల ఆర్థికరంగంపై తీవ్ర ప్రభా వం చూపుతుంది. కేంద్రం ఈ విధంగా ఒక్కొక్క సంస్థను తమ ఆధీనంలోకి తెచ్చుకుని కబళించే యత్నాలను గట్టిగా ఆయా సంస్థలకు చెందిన ఉన్నతాధికారులు, ప్రజాస్వామ్యప్రియులు ఎదిరించాల్సిన అవసరమైంతెనా ఉన్నది. 

ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయం పన్ను విభాగం, ఎన్నికల సంఘం, చివరకు న్యాయవ్యవస్థపై కూడా ఆర్‌ఎస్‌ఎస్, సంఘపరివార్ కూట మి నేతృత్వంలోని ప్రభుత్వ జోక్యం పెరిగి తమ భావజాలాన్ని జొప్పించే య త్నాలకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఏ ప్రభుత్వ రంగ సంస్థలోైనెనా విధాన పర నిర్ణయాల్లో తమ భావజాలానికి పెద్దపీట వేయాలన్నదే సంఘపరివార్ కుటిలయత్నం. విద్యావ్యవస్థలో కూడా ఆర్‌ఎస్‌ఎస్ పెత్తనం కొనసాగుతోందని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మారిన సిలబస్ రుజువుచేస్తోంది. బ్యాంకులు దివాలా స్థితిలోకి రావడానికి తమ మద్దతున్న కార్పొరేట్ వాణిజ్యవేత్తలే కారణమని సంఘ్‌పరివార్‌కు బాగా తెలుసు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించేందుకు, తమను మించిన దేశభక్తులు లేరనే భావన కలిగించేందుకు సర్దార్ పటేల్ విగ్రహ స్థాపన వంటి కార్యక్రమాలతో తిమ్మిని బ మ్మిని చేస్తున్నారు. ఇలాంటి ముసుగులో దేశంలోని అన్ని రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యంచేస్తూ వాటిలో కూడా తమ ముద్ర వేసేందుకు వెనుకాడని సంఘపరివార్ కార్యకలాపాలను అడ్డుకోకపోతే రాజ్యాంగ కర్తల స్ఫూర్తి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలకు తిలోదకాలిచ్చినట్టే కాగలదు. అందువల్ల ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్న ప్రభుత్వ విధానాలపై ప్రజాస్వామ్య ప్రియులు, మేధావులు కలిసికట్టుగా ఎదిరించి పోరాడకపోతే మళ్లీ దేశం అనాగరిక మనుస్వామ్యంలోకి జారిపోయే ప్రమాదం ఉన్నది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ సంస్థలపై దండెత్తేలా తమకు అనుకూలంగా వ్యవహరించేలా మార్చుకుంటూ పోతుంటే ప్రజాశ్రేయస్సు కాకుండా ప్రభుత్వాల, పార్టీల శ్రేయస్సుకే ఉపయోగపడుతుంది. అందువల్లనే ప్రభుత్వాలు తీసుకునే దుర్మార్గ చ ట్టాలు, దుర్వినియోగ విధానాలను ఎండగట్టవలసిన అవసరం ఉన్నది. ఆర్బీ ఐ వంటి ప్రభుత్వ సంస్థల స్వయం ప్రతిపత్తిని కాపడడం ప్రతి ఒక్కరి విధిగా భావించాలి. చీకటి వెలుగుల రంగేళి!

Updated By ManamWed, 11/07/2018 - 07:29

హరిత దీపావళితో పర్యావరణాన్ని, 
ప్రజారోగ్యాన్ని పరిరక్షించుకుందాం!

దీపావళి అంటేనే ‘దీపాల శ్రేణి’ సంబురం. దీప జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిద ర్శనంగా భావిస్తారు. దీపాలను సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీక లుగా భావిస్తారు. మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలం శరధ్రు తువులో దీపావళి అరుదెంచడం విశేషం. ప్రాణశక్తికి ప్రతీక దీపం.. ఆనందానికి మరో రూపం. చీకటిని పారదోలి వెలుగునిచ్చే సాధనం. అసత్యంపై సత్యం సా ధించే విజయానికి ప్రతీక దీపం. అజ్ఞానం నుంచి జ్ఞానానికి, దుఃఖం నుంచి ఆనందానికి, నిరాశలోంచి ఆశాభావంలోకి చేరాలన్న మనిషి నిరంతర తపనకు దీపం సంకేతం. ఆనందోత్సాహాలతో జాతి, కుల, మత వర్గ భేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే దీపావళి పండుగ భారతీయ బాహుళత్వ సంస్కృతికి ప్రతి బింబం. నరకాసురవధ, రావణుడిపై రాముని విజయం వంటి పురాణ గాథల మాట ఎలా వున్నా చీకటిని, కష్టాలను పారదోలుతూ వెలుగు, సుఖాలు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి నిలుస్తుంది. పంచభూతాలలో ప్రధాన మైనది అగ్ని. ఈ అగ్ని ప్రాణికోటి మనుగడకు ఉపకరించే తేజస్సును, ఆహారాన్ని ఐహికంగాను, విజ్ఞాన ధర్మగరిమను ఆధ్యాత్మికంగాను ప్రసాదిస్తుంది. అంతేగాక మానవులకు విజ్ఞానం, వివేకం, వినయాలకు దీప ప్రజ్వలన సంకేతమని భారతీయుల నమ్మకం. 
 

image

కృష్ణదేవరాయల కాలంలో దీపావళిని లక్ష్మీ ఉత్సవంగా జరుపుకునేవారు. నిజానికి ఈ దీపావళి పండుగ అన్ని దేశాల్లోనూ వివిధ రూపాల్లో ఉంది. అగ్నిపై మానవుని విజయానికి, ఆ ప్రకృతి శక్తిని మానవీకరించడానికి సంకేతమే ఈ దీపా వళి పండగని ప్రపంచంలో వివిధ జాతుల ప్రజలు దీపాల పండుగను జరుపు కుంటారని చరిత్రకారులు చెబుతున్నారు. దీపావళి సరదా పండుగే అయినా అందులో గొప్ప దార్శనికత ఉంది. కొందరు ఈ పండుగను అనవసరంగా డబ్బు లు తగలేసే పండుగని, పర్యావరణ విధ్వంసక సంబురమని విమర్శించడంలో వాస్తవం ఎంత ఉన్నప్పటికీ ఇంటిల్లిపాదికి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని చేకూర్చే పండుగ ఇది. దేశవ్యాప్తంగా ఒక్క దీపావళి పండుగ రోజు కాల్చే టపాకాయల విలువ వందల కోట్లు చేస్తుంది. తమిళనాడులోని శివకాశిలో ఉన్న 8 వేలకు పైగా ఉన్న బాణసంచా పరిశ్రమలు భారత దేశంలోని 90 శాతం టపాసులను ఉత్పత్తి చేసి, వెయ్యి కోట్లకు పైగా టపాసుల వ్యాపారం జరుగుతుంది. అయితే దేశ రాజధాని ఢిల్లీ సహా దేశవ్యాప్త నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో దీపావళి రోజున జరిగే సంబురాల్లో తగలేసే టపాకాయలు నుంచి విడుదలవబోతున్న కాలుష్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. బాణసంచాతో మిరుమిట్లు గొలిపే దీపావళి పండుగకు ముందుగానే దేశ రాజధానిలో వాయు కాలుష్య ప్రమాదపు ఘంటి కలు మోగిస్తున్నాయి. ఆదివారం నాటికి తగ్గిన తీవ్రత దీపావళికి ముందు సోమ వారం నాడు సురక్షిత పరిమితి కంటే 20 రెట్లు ప్రమాదకర స్థాయికి పెరిగింది.

మందిర్ మార్గ్, జవహర్ నెహ్రూ స్టేడియం, మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడి యం ప్రాంతాలలో గాలిలో నలుసులు తీవ్రస్థాయిలో ఉన్నట్లు రికార్డు అయింది. గత ఏడాది దీపావళి సమయంలో ఢిల్లీలో కాల్చిన బాణసంచా వల్ల పి.ఎమ్. 2.5 (నలుసు పదార్థ కాలుష్యం 2.5) కాలుష్యం సురక్షిత పరిమితి కంటే 6.6 రెట్లు పెరిగిందని సీఎస్‌ఈ అధ్యయనం వెల్లడించింది. అయితే దీపావళికి ముందే 20 రెట్లు ప్రమాదకర స్థాయికి చేరుకున్న రాజధానిలో కాలుష్యం వల్ల ఎలాంటి విపత్తు ముంచుకొస్తుందో? సుప్రీంకోర్టు దీపావళి రోజు రాత్రి రెండు గంటలు మాత్రమే బాణసంచా కాల్చాలని స్పష్టమైన ఆదేశాలిచ్చినా, ఆ తీర్పును దేశ వ్యాప్తంగా అమలు జరిపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి కనీస మాత్రం ప్రయత్నం కూడా చేయలేదని పర్యావరణ వేత్తలు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు చెందిన అంశాలపై (శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల ఆడవాళ్ళ ప్రవేశం వగైరా) సుప్రీంకోర్టు ఆదేశాల అమలు తరచూ వివాదాస్పదంగా మారాయి. అదేతీరులో దీపావళి సంబురాల్లో బాణసంచా వినియోగంపై హరిత టపాసులే వినియోగించాలని, రెండుగంటలే టపాసుల సంబురాలు జరుపుకోవాలని సుప్రీం కోర్టు ఆంక్షలు విధించినా అమలు చేసే యంత్రాంగం లేక పోవడం, సామాజిక మాధ్యమాల్లోనూ, కొన్ని హిందుత్వ సమూహాలు ఆ ఆంక్షల్ని ధిక్కరించడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈసారి కూడా దీపావళి సృష్టించే వాయు కాలుష్యం భారతీయులకు ఒక సవాలుగా మారనుంది. 
 

image

దీపావళి పేరుతో వివిధ కార్పొరేట్ కంపెనీలు ఆఫర్లు, అక్షయ తృతీయ పేరుతో నగల వ్యాపారం, బట్టల వ్యాపారం ఒక్కటేమిటి వివిధ రకాల చిన్న పెద్ద వ్యాపారాలు జోరందుకుంటాయి. దాంతో సమాజమంతా కళకళలాడుతూ అంద ర్ని సంతోషపెట్టే దీపావళి అంటే చిన్న పెద్దలందరికీ ఎంతో సంతోషం, సరదా. అయితే మాల్స్ వచ్చిన దగ్గర నుంచి వీధి చివరి దుకాణాదారులు, రోడ్ల వెంబడి చిల్లర వ్యాపారస్తులకు తీవ్ర నష్టం వాటిల్లింది. విదేశీ సంస్కృతి మీద మోజుతో స్వదేశీయలకు తీవ్రనష్టం కలిగిస్తూ చైనా టపాసులు వంటి అనేక సరకులను మాల్స్‌లో వేలకు వేలు ఖర్చుచేస్తూ, చిరు వ్యాపారస్తుల దగ్గర కొనేటప్పుడు మాత్రం గీసిగీసి బేరమాడుతుంటారు.

ప్రముఖ, కంప్యూటర్లు, ప్రింటర్ల మేకింగ్ కంపెనీ హెచ్‌పీ ఇండియా ‘వీధి వ్యాపారస్తులకు మద్దతు తెలపండి.. మన ఇళ్ళలోని దీపాలు వారి ఇళ్ళలో కూడా కాంతులు నింపుతాయి’ అని చిరు వ్యాపారులకు సాయం చేసినప్పుడే, వారి బతుకులు కళకళలాడినప్పుడే నిజమైన దీపావళి అనే ఉద్దేశంతో చేసిన ‘ఉమ్మీద్ కా దియా’ అనే యాడ్ ఇప్పుడు నెటి జన్లను తెగ ఆకట్టుకుంటోంది. ప్రమిదల్లో తైలాన్ని నింపి దీపాలు వెలిగించి, బాణ సంచా ఆర్భాటంగా కాల్చినంత మాత్రాన దీపావళి రాదు. ప్రజలందరిలో సుఖ సంతోషాలను, ఆకలి కేకలు వేసే చిన్నారుల కళ్లల్లో వెలుగులు నింపినపుడు,  పర్యావరణ విధ్వంసక, భూతాపాన్ని పెంచి మానవ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చే, విషకాలుష్యాలను వెదజల్లే బాణసంచాను కాల్చకుండా నిగ్రహంగా వ్యవ హరించినపుడు నిజమైన దీపావళి వచ్చినట్లవుతుంది. ఓ చిరుదివ్వెను వెలిగిం చినా అది చీకటిని పారదోలి వెలుగు పువ్వులు నింపుతుంది. పర్యావరణ విధ్వం సాన్ని చొరవతో నిరోధించి, సామాన్యులకు జీవనోపాధిని కల్పించి వారి జీవన ప్రమాణాలు పెంచే విధానాలను ప్రభుత్వాలు చేపడితే దేశంలో నిజమైన దీపావళి వెల్లివిరుస్తుంది.

భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకొని ఉదాసీనమైన, చీకట్లు అలుముకుంటున్న స్థితి నుంచి ఉత్సాహభరితమైన, వెలుగులు విరజిమ్మే ఆశలు, ఆకాంక్షలతో దృఢ సంకల్పాన్ని ప్రోదిచేసుకునేందుకు ఈ సందర్భంగా వ్యక్తులు, వ్యవస్థలు పునఃసంకల్పించాలి. ప్రజల జీవితాల్లో పండుగ వాతావరణం తీసుకు రావటం కోసం ప్రభుత్వాలు ప్రజల కొనుగోలు శక్తిని పెంచే విధానాల రూప కల్పనకు శ్రీకారం చుట్టడం ద్వారా దీపావళి ముఖ్య ఉద్దేశాన్ని, స్ఫూర్తిని సాకారం చేసి వారి బతుకుల్లో వెలుగులు తీసుకురావాలి. స్త్రీ-పురుష ‘సమానత్వం’ కోసం, అత్యున్నత న్యాయస్థానం చూపిన దారి!

Updated By ManamSun, 11/04/2018 - 05:12

 వివాహేతర సంబంధం ‘నేరం’ కాదు; కానీ, విడాకులకు అది ఒక కారణం! ఇది ఎలా సాధ్యం? ‘బిడ్డల’ మాట లేకుండానే భార్యభర్తల సమానత్వం! ‘నేరం’ మాట లేకుండానే విడాకులు పొందే హక్కు! విడాకుల కోసం, ఏం కారణం చూపిస్తారు? కారణం లేని కార్యం! ఈ రకంగా, పాత చట్టంలో నిన్న కొత్త సవరణ జరిగిపోయింది! ఇక, అందరికీ తిరుగుళ్ళ స్వేచ్ఛలు దొరికాయి! బాగుంది కదా ఈ బూర్జువా సవరణ? 

image‘భూమి’ అనేది, ‘బంతి’ అంత గుండ్రంగా, సముద్రాల్నీ, కొండల్నీ, లోయల్నీ, అడవుల్నీ, మహావృక్షాల్నీ, జంతువుల్నీ, మనుషుల్నీ - వంటి ఎన్నిటినో వేసుకుని సూర్యుడి చుట్టూ తిరుగుతోందని, అంతంత పెద్దపెద్ద శాస్త్ర విషయాలు కనిపెట్టేశారు మనుషులు! కానీ, ఆ మనుషులు, ఒకళ్ళ తో ఒకళ్ళు ఎటువంటి సంబంధాలతో వుంటే సుఖంగా  బతకగలరో మాత్రం గ్రహించుకోలేకపోతున్నారు! మనకు ఇప్పుడు కావలిసింది, మనుషుల్లో వున్న ‘ఆడా -మగా’ తేడాల విషయమే. ఈ తేడాలైతే, ప్రకృతి సహజ మైనవే. ఈ తేడాలు, మనుషులు ఏర్పర్చుకున్నవికావు. చెట్లూ-పిట్టలూ వంటి ఏ జీవజాతుల్లో అయినా, ఒక తరం, వృద్ధాప్యంతో నశించి పోయే నాటికి, కొత్తతరం పుట్టి పెరు గుతూ వుండడానికే, ఆ జాతిలో ఆడా-మగా తేడాలు అవ సరం! మానవుల్లో అయినా, స్త్రీ-పురుష భేదాలకు అర్ధం ఇదే. అయితే, మానవుల్లో తప్ప ఇతర జీవుల్లో లేని ‘వివాహ వ్యవస్థ’ గురించే ఇప్పుడు చర్చ! ‘మానవ సమాజం’లో, రాజ్యాంగ యంత్రమూ, దానికి వేరువేరు చట్టాలూ అన్నీ ఉంటున్నాయి. ఈ ప్రభుత్వాలూ, చట్టాలూ, ఇతర ఏ జీవ జాతులకూ లేని లక్షణాలు! దీనికి కారణం, ఇతర జీవుల మధ్య లేని ‘శ్రమ సంబంధా’లనేవి, మానవ జాతికి మాత్రమే ఉండడం! మానవ జాతిలో వున్న శ్రమ సంబంధాలు ‘ఆహారం కోసం’ అయితే; ఇక స్త్రీ-పురుషుల శారీరక సంబంధాలు, కొత్త తరాల సంతానాల కోసం అవసరం అయ్యే సంబం ధాలే. వాటి కోసమే స్త్రీ-పురుష శరీర నిర్మాణాలూ, వాటి అనుభూతులూనూ! మానవ జాతి, అనేక ప్రకృతి శాస్త్రాల్ని గ్రహించ గలిగింది గానీ; తమ శారీరక సంబంధాల గురించీ, తమ ‘అనురాగాల’ గురించీ, తమ ‘సంతానాల’ గురించీ మా త్రం, అత్యల్పంగా అయినా గ్రహించలేక పోయింది. ఇలా అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. భారత శిక్షాస్మృతి (ఇండియన్ పీనల్ కోడ్) చూపించే చట్టాల్లోనే ఈ ఉదా హరణలు చూడగలం. ఈ దేశాన్ని బ్రిటీషు వాళ్ళు పాలించిన వెనకటి కాలంలో, ఏర్పడిన 497 చట్టాన్ని, ఈ నాటి భారత అత్యున్నత న్యాయస్థానం, నిన్నటి రోజు చేసిన ‘సవరణ’ గురించే ఈ చర్చ! ఆ 497 చట్టం, నిన్నటి వరకూ ఎటువంటి నిబంధనలతో వుంది? ఆ చట్టంలో, స్త్రీ పురుషుల సంబంధాల మధ్య ‘సమానత్వం’ లేదనీ; ఆ సమానత్వాన్ని నేడు తాము ఏర్ప ర్చగలమనీ, సుప్రీం కోర్టు జడ్జీలు 5 గురు, ఏకాభిప్రాయంతో ఆ సవరణ చేశారు. ఆ సవరణతోనే పాత 497 చట్టం మారి పోయింది! ఇక, కొత్త సవరణే అమలులోకి వచ్చిన కొత్త నిబంధన! అయితే, పాత 497 చట్టం నిన్నటి వరకూ స్త్రీ పురుషుల గురించి ఎటువంటి నిబంధనలతో వుండేది? అందులో వున్న ‘అసమానత్వం’ ఏమిటి? ఆ అసమానత్వాన్ని నేడు సమానత్వంగా మార్చిన సవరణ ఏమిటి? భారత అత్యున్నత న్యాయమూర్తులు ఎలా ఆలోచించారో చెప్పుకునేదే  ఈ ప్రయత్నం. ఈ విషయాలన్నీ పత్రికల్లో అనేక మంది, చదివినవే. అందరూ ఆలోచిస్తున్నవే. పాత 497 చట్టంలో చేసిన సవ రణ, స్త్రీ పురుష సంబంధాల్లో సమానత్వాన్ని ఇస్తుందని కొం దరూ; ఆ సమానత్వం, స్త్రీ పురుష సంబంధాల్ని ఏమీ మార్చలేక పోయిందని మరి కొందరూ; ఎవరి వాదనలు వారు చేస్తూనే వున్నారు.

నా మట్టుకు నాకు ఈ చట్టాల్లో సవరణల మీద చర్చిం చాలని మొదటినించీ లేదు. దాని వేపు నేను చూడలేదు. కానీ, పాఠకుల్లో కొందరు, వారందరూ పత్రికలు చదివే వారే, ప్రతీదాన్నీ చర్చించ గల వారే, అయినా నేనేదో రాస్తా నని ఊహించారు. రాయలేదేమని నన్ను ప్రశ్నించారు. నా జ వాబు నేను చెప్పాను. ‘‘బూర్జువా చట్టాల మీద ఎంత రాస్తే మాత్రం ఏం ప్రయోజనం? ఆ సవరణని మీరు అర్ధం చేసు కుంటూనే వున్నారు. అంతకన్నా నేను రాసేదేముం టుంది?’’ అంటూనే చెప్పాను. ‘‘అలా కాదు; మా అభిప్రాయం మాది. మీ అభిప్రాయం మీరు చెప్పండి!’’ అనే మాట ఆ పాఠకులు మానలేదు. బూర్జువా చట్టాల్లో, ప్రతీ చట్టంలోనూ ఒక దానితో ఒకటి సరిపడని వైరుధ్యాలు ఉంటాయి. వాటిని, ఆ శాసన కర్తలు, తమ ప్రయోజనాల కోసం, కావాలనే అలా ఏర్పర్చుకుంటారు. పాత 497 చట్టంలో స్త్రీ పురుష సంబంధాల్లో సమా నత్వం లేదనీ, ఇప్పుడు తాము సమానత్వాన్ని ఇస్తున్నా మనీ, నిన్న చేసిన న్యాయమూర్తుల సవరణ కూడా అర్ధం లేని సమానత్వమే అనవలిసి వస్తుంది. నిన్నటి దాకా సాగిన 497వ సెక్షను, స్త్రీ-పురుష సంబం దాల గురించి చెప్పింది ఏమిటి? (దీన్ని నా మాటల్లో నేను క్లుప్తంగా చెపుతాను. జడ్జీల వాదన పత్రికల్లో ఎలాగా వుంది.) వివాహం చేసుకున్న భార్యా భర్తలు ఉంటారు కదా? వారిలో, ఆ భర్త, పర స్త్రీలతో తిరుగుతూ వుంటే, ఆ భర్తని నేరస్తుడిగా నిందించే హక్కు భార్యకి ఉండదు. భర్తని, ఇంట్లో సాధించే హక్కు భార్యకి ఉండవచ్చు గానీ, చట్టప రంగా భర్త మీద కోర్టులో కేసు పెట్టే హక్కు మాత్రం భార్యకి ఉండదు. దీని అర్ధం ఏమిటంటే: పురుషుడు అనే వాడు, ఎప్పుడు ఎలాగైనా ప్రవర్తించవచ్చుననీ, అతని హక్కుని భార్య అంగీకరించి తీరాలనీ, ఆ చట్టమూ చెబుతోంది; సమాజమూ చెబుతోంది. అయితే, ఆ తిరుగుబోతు భర్త మీద కేసు పెట్టే హక్కు ఎవరికి ఉంటుంది? ఆ పురుషుడితో తిరిగే పరాయి స్త్రీకా? అదెలా సాధ్యం? ఆమెకి కాదు. ఆమె, తన ఇష్టంతోనే, ఆ పరాయి పురుషుడితో రహస్యంగా తిరుగుతోంది కదా? కాబట్టి, ఆమెకి కాదు!

ఆ తిరుగుబోతు పురుషుడి మీద కేసు పెట్టే హక్కు ఎవరిదంటే, ఆ పురుషుడు, ఏ పరాయి స్త్రీతో తిరుగుతున్నా డో, ఆ స్త్రీ తాలూకు భర్తకే ఆ హక్కు! ఆ పురుషుడు, తన తిరుగుబోతు భార్య మీద అయితే కేసు పెట్టలేడు. తన పెళ్ళాన్ని ఇంట్లోనే తిట్టడమూ, తన్నడమూ, చెయ్యగలడు గానీ, ‘నా భార్య చూడండీ, ఎలా తిరుగుతోందో!’ అని ఆమె మీద కోర్టులో మాత్రం కేసు పెట్టలేడు. దానికి కోర్టు ఒప్పుకోదు. అయితే, అతడేం చెయ్యాలి? - తన భార్యతో ఎవడైతే రహస్యంగా తిరుగుతున్నాడో, వాడి మీదే కేసు పెట్టుకోవాలి. అలా పెట్టే హక్కుని ఇస్తుంది చట్టం! అతడు ఆ కేసు పె ట్టాలంటే, అతడు, తన బాధని కోర్టుకి ఇలా రాస్తాడు: ‘‘కోర్టు వారూ! చూడండీ! నా భార్య, నా ఆస్తి కదా? నా హక్కు కదా? ఆమెని వాడుకోవలిసింది నేనే కదా? పరాయి వాడు కూడా నా భార్యని వాడితే, వాడు, నా ఆస్తిని దొంగి లించినట్టే కదా? అతడు నేరస్తుడవుతాడా, అవడా? అతన్ని శిక్షించరా కోర్టు వారూ?’’ అని తన కేసు పెట్టగలడు. అదం తా కోర్టు భాషలో రాయడానికి లాయరు ఉంటాడనుకోండీ! లాయరుకి ఫీజు తప్పదు మరి! తన భార్యని వేరే వాడు వాడుకుంటున్నాడంటూ ఒక బాధితుడు, ఆ వేరే పురుషుడి మీద కేసు పెడితే, అప్పుడు కోర్టు ఏం చేస్తుంది? ఏం చెపుతుంది?  కోర్టు ఏం చేస్తుం దేమిటి? ఆ బాధితుడు విన్నవించేదాన్ని ‘నేరం’గానే కోర్టు తేల్చేస్తుంది. అలా తేల్చేసి, కొన్ని సంవత్సరాల జైలు గానీ, లేదా కొంత డబ్బు జరిమానా గానీ; లేదా, ఆ రెంటినీ కూడా గానీ, శిక్షగా ఆ తిరుగుబోతు పురుషుడికి విధిస్తుంది. అయితే, ఒక వింత ఏమిటంటే, బాధిత పురుషుడు, తన భార్యని, తన ఇష్టంతోనే, ఎవడు అడిగితే, వాడి దగ్గిరికి పంపితే, అప్పుడు ఎవడి మీదా కేసు ఉండదు! లాయరు ఖర్చూ ఉండదు. ఒక భర్త, తన భార్యని, ఇంకో మగవాడి దగ్గిరికి, తన ఇష్టంతోనే పంపడం జరుగుతుందా అసలు? ఇది, భూస్వా మ్య కాలం అయితే, సంసారాల్లో ఆడ వాళ్ళకి పాతివ్రత్యమే కాబట్టి, వారిని భర్తలే పరాయి పురుషుల దగ్గిరికి పంపడా లూ అవీ జరగవు. ఆ భార్య, రహస్యంగానే ఆ దారి తొక్కితే, ఆ భార్యని భర్త, నరికి వెయ్యడమే చేస్తాడు. ఇలాంటి హత్యల్ని బోలెడు మత కథల్లో చూశాం. కానీ, 497 చట్టం వచ్చిన కాలం బూర్జువా కాలమే కదా? పైగా అది బ్రిటీషు వాడి పాలన కదా? కాబట్టి, ఏ భర్త అయినా, తన భార్యని ఎక్కడికైనా పంపగలడు. అలా పంపడం ఎందుకంటే, ఎదటి వాడి నించీ కొంత డబ్బుని ఆశించి కావచ్చు. లేదా, తన పదవిలో కొంత ఎదుగుదల (ప్రమోషన్) కావాలంటే, ఆ ఎక్కువ పదవిని ఇచ్చే స్థితి అవతలి వాడి చేతుల్లో వుంటే, ఆ ఎదుగుదల కోసం అయినా, తన ఆస్తి అయిన భార్యని బైటి వాడికి పంప వచ్చు. అది కూడా కాకపోతే, వీడికి మాత్రం ఇంకోడి పెళ్ళం మీద ఆశ ఉండదా? ఆ ఆశతో, ‘నా పెళ్ళాన్ని నీకు పంపిస్తా గానీ, రేపు నీ పెళ్ళాన్ని నాకు పంపిస్తావా?’ అనే రకం బేరం అయినా సాగవచ్చు. ఇదీ కాకపోతే, ఇక్కడ మనం ఊహించ లేని, ఇంకేదో వింత ఉండవచ్చు. ఈ రకంగా, భర్త అనే వాడు, తన పెళ్ళాన్ని తన ఇష్టంతోనే బైటికి పంపితే, ఇక కేసూ - కోర్టూ ఏం అవసరం? లాయర్లూ, వాళ్ళకి ఫీజులూ, అవన్నీ ఎందుకు? ఆ దండగలు ఉండవు. అయితే, అసలు ప్రశ్న, భర్త గారు, తన భార్యని, ‘ఫలానా వాడి దగ్గిరికి వెళ్ళిరా!’ అంటే, ఆ భార్యా రత్నం కిక్కురు మనకుండా బైల్దేరుతుందా? అలాంటి సంబంధాలు ఉంటాయనీ; భర్తే భార్యని తన ఇష్టంతో పంపితే నేరం అవదని చట్టమే చెబుతోంది గదా? బూర్జువా సంస్కృతిలో పుట్టి పెరిగే స్త్రీకి, ఎక్కడి కంటే అక్కడికి పోయి రావడం, పెద్ద ఇబ్బంది అయి వుండకపోవచ్చు! ‘‘అలా వెళ్ళను’’ అని వ్యతిరేకించే భార్యలు కూడా ఉంటారో, ఉండరో, ఆ 497 చట్టంలో, ఆ వివరాలేవీ లేవు.

ఒక భార్య, తన భర్తకి తెలియకుండా, రహస్య మార్గంలో బైటి తిరుగుళ్ళు తిరుగుతోంటే, ఆ రహస్యం బైట పడినా, ఆమె మీద కేసు పెట్టే హక్కు భర్తకి ఉండదు. కేసు పెట్టవలి సింది, భార్య మీద కాదు. ఆమె తిరిగే పర పురుషుల మీద అయితేనే. నేరం అంతా పర పురుషుడిదే, తన భార్యది కాదు! ఆమెది అమాయకత్వం! ఇంకో సంగతి! ఇంకా పెళ్ళి కాని యువతి ఉందనుకుందాం. భార్య వున్న ఒక మగవాడు, ఆ పెళ్ళి కాని పిల్లతో తిరుగుతాడనుకుందాం. ఆ పురుషుడి మీద కేసు పెట్టగలిగేది ఎవరు? అతని భార్యకి అయితే, ఆ హక్కు వుండదు. ఆ అవివాహిత యువతికి భర్తే లేడు కాబట్టి, లేని వాడు చేసేదేమీ వుండదు కదా? ఇంత వరకూ చూసిన దాన్ని బట్టి, స్త్రీ పురుషుల మధ్య 497 చట్టంలో వున్న ‘అసమానత్వం’ ఏమిటి? మగవాడి విషయం అయితే, అతను పరాయి స్త్రీలతో తిరుగుతోన్నా, దాన్ని నేరంగా భావించే హక్కు, అతని భార్యకి ఉండదు కదా? అంతే కాదు, ఆ భర్త, ఏ పరాయి స్త్రీతో తిరుగుతు న్నాడో, ఆ పరాయి స్త్రీ మీద కేసు పెట్టే హక్కు కూడా ఈ భార్యకి ఉండదు. అంటే, భర్త వ్యభిచారం చేస్తూ వుంటే, దాన్ని నేరంగా భావించే, కేసు పెట్టే ఏ హక్కూ భార్యకి ఉండదు. 

ఇప్పుడు భార్య రహస్యంగా తిరుగుతూ వుంటే, ఆమె ఏ మొగవాళ్ళతో తిరుగుతోందో ఆ మొగవాళ్ళ మీద కేసులు పెట్టే హక్కు భర్తకైతే వుంటుంది! అంటే, తన భార్య మీద కేసు పెట్టలేకపోయినా, ఆమె తిరిగే వాడి మీద పెట్టడం అంటే, తన భార్య తిరుగుడికి స్వేచ్ఛ లేకుండా చెయ్యడమే కదా అది? కాబట్టి, ‘స్త్రీ-పురుష సమానత్వం’ కావాలంటే, ఏం మార్పు జరగాలని, సుప్రీం కోర్టులో 5 గురు జడ్జీలు భావిం చారు? భర్త తిరుగుళ్ళని నేరంగా చూసే హక్కు భార్యకి లేదు కాబట్టి; అలాగే, భార్య తిరుగుళ్ళని అడ్డుకునే విధంగా, ఆమె తిరిగే వాడి మీద కేసు పెట్టే హక్కు, ఆమె భర్తకి కూడా ఉండ కూడదు. అలాగైతే, భర్తకి వున్న తిరుగుడు స్వేచ్ఛ, భార్యకి కూడా ఉంటుంది! భార్యా భర్త లిద్దరికీ శృంగారాల తిరు గుడు స్వేచ్ఛలు ఉండాలంటే, ఎవరు ఎవరి మీదా కేసులు పెట్టకూడదు. అలాగైతేనే అది, ‘స్త్రీ-పురుషుల సమానత్వం’ అవుతుంది. - ఇదీ, సుప్రీం న్యాయమూర్తులు 497 చట్టంలో చేసిన సవరణ! 497 చట్టంలో వున్న దాన్ని, అంటే ఒక పురుషుడు, తన భార్య తిరిగే పురుషుడి మీద కేసు పెట్టడం - అనే దాన్ని, ‘అసమానత్వం’గానూ, ‘సమానత్వాన్ని’ చెప్పే రాజ్యాంగా నికి విరుద్ధంగానూ వున్న విషయంగా తేల్చారు. ఇదీ, ‘స్త్రీ పురుష సమానత్వం’ కోసం చేసిన సవరణ! అయితే, ఈ సవరణ తప్పనీ, పాత చట్టంలో వున్నట్టు, పురుషుల మీద కేసులు అలాగే జరగాలనీ, మనం అనాలా? - అలా కాదు. ‘చెడ్డ విషయంలో సమానత్వం ఏమిటి?’ అనేది మన ప్రశ్న. మొగాళ్ళు సిగరెట్లు కాల్చితే, ఆడవాళ్ళూ కాల్చాలి. మొగ వాళ్ళు తాగితే ఆడవాళ్ళూ తాగాలి. మొగవాళ్ళు తిరిగితే, ఆడవాళ్ళూ తిరగాలి! ఇదా, సమానత్వాన్ని తెచ్చే మార్గం? ‘తప్పు’ అనే దాన్ని మొగవాళ్ళూ చెయ్యకూడదు, ఆడ వాళ్ళూ చెయ్యకూడదు - అని చెప్పలేరా? ‘ఎవ్వరూ చెయ్య కూడదు’ అంటామా; ఆడవాళ్ళు, మొగవాళ్ళ లాగే నడవాలి - అంటామా? అసలు, ‘స్త్రీ పురుష సమానత్వం’ గురించి మాట్లాడే వాళ్ళకి, స్త్రీ-పురుషులకు సంబంధించిన ‘బిడ్డల’ సంగతి బొత్తిగా గుర్తు రాలేదేం? ఒకవేళ, ఇలా చెపుతారనుకుందాం. పెళ్ళిళ్ళూ వొద్దు,  పెటాకులూ వొద్దు! కుటుంబాలూ వొద్దు, సంసారాలూ వొద్దు! ఆదిమ కాలంలో మనుషులు ఒంటి మీద బట్టలు లేకుండా బతికేవారే, అలా బతికేద్దాం! ఏ సంబంధాలూ లేకుండా ఎవరి స్వేచ్ఛ వారిదిగా బతికేద్దాం! - అని, ఇలా చెప్తే, ఏ నిబంధనలూ వుండవు. అది వేరు!

జడ్జీలు అలా చెప్పలేదు. ఎవరి తిరుగుళ్ళు వాళ్ళు తిరగొచ్చు. వివాహాలు వుంటూనే వివాహేతర సంబంధాలు ఉండొచ్చు! అది నేరం కాదు - అని చెప్పారు. న్యాయమూ ర్తుల దృష్టిలో కూడా వివాహాలు ఉండవలిసిందే! కుటుం బాలు ఉండవలిసిందే! చదువులూ, సంధ్యలూ ఉండవలి సిందే. కానీ, ఎవరి వివాహేతర సంబంధాలు వారివిగా ఉండాలి, అంతే! అదీ స్వేచ్ఛకి అర్ధం! అయితే, పిల్లలకు ‘తల్లిదండ్రుల’ సంబంధాలు ఎలా ఏర్పడాలి? ‘తల్లి’ అయితే తెలుస్తూ ఉంటుంది, సరే! తండ్రి ఎవరు? తల్లికే తిరుగుడు వుంటే, ఆ తల్లి, తను  వివాహం చేసుకున్న వాడి సంబంధంతో గర్భవతి అయిందో; లేక, పరాయి వాళ్ళలో ఎవడి వల్ల అలా అయిందో; తెలుసు కోలేదు! ఇక దానికి సైన్సు పరీక్షల దాకా పోవాలంటారు. అదంతా సవ్యంగా జరిగితేనే! డాక్టర్లు, లంచాలు తినకుండా నిజాలు చెప్తే! అసలు, డాక్టర్లకి అదంతా తెలిసి వుంటే! ఆ డాక్టరు, తన భార్య మీద కూడా పరీక్షలు చేస్తాడా? వివాహం వున్నా, వివాహేతర స్వేచ్ఛ కావాలంటే, ‘వివా హం’ ఎందుకు? ‘కుటుంబం’ ఎందుకు? వాటిని కూడా వొద్దని చెప్పాలి కదా? స్త్రీ-పురుషుల సంబంధాల విషయంలో ‘బిడ్డల’ మాట ఎత్తక పోవడం ఏమిటి? ఏ తల్లికి అయినా, తన బిడ్డలంద రికీ, తల్లిని ‘నేనే’ అని స్పష్టంగానే తెలుస్తుంది. కానీ, ఏ బి డ్డకి తండ్రి ఎవరో, ఆ తల్లికి అయినా తెలుస్తుందా?- తెలీ దు. ఇక, తండ్రి సంగతి చూస్తే, ఆ పురుషుడికి వివాహేతర స్వేచ్ఛే కావాలంటే, అతని పిల్లలు అనేక ఊళ్ళల్లో ఉంటారు. అనేకమంది స్త్రీల ద్వారా, ఉంటారు. ఏ తిరుగుబోతు పురు షుడూ, తన బిడ్డల్లో, ఒక్క బిడ్డని కూడా తనబిడ్డగా గ్రహిం చలేడు! ఈ చీదర అంతా ఎందుకు తయారవుతుంది? వివాహే తర స్వేచ్ఛలు కోరుకుంటే! ‘సమానత్వం’ అంటే, ‘వివాహే తర సమానత్వం’ కాదు. జడ్జీలు, తాము పరిశీలించే కొన్ని కేసుల్లో, ‘‘ఈ కేసుని నేను నమ్మడంలేదు’’ అంటారు. ఒక్కోసారి, ‘‘దీన్ని నేను న మ్ముతున్నాను’’ అంటారు. అటువంటి స్థాయిల్లో వున్న మానవులు, వివాహేతర స్వేచ్ఛతో, సమానత్వాన్ని సమానం చెయ్యడమా? వాళ్ళు ఏం చెప్పాలంటే, ‘‘అసలు, వివాహ మూ, కుటుంబమూ అనేవి వుండాలంటే, వివాహేతర స్వేచ్ఛ అనేది శుద్ధ తప్పు’’ అని చెప్పాలి. బుర్ర వున్న ఏ మానవుడైనా, ఒక విషయం ఆలోచించ గలడు. ‘‘మనం, ఆదిమకాలం వాళ్ళం కాదు. మనల్ని మ నం నాగరీకులుగా భావిస్తున్నాం. స్త్రీ-పురుషులు కలిసి జీవించడానికి, వారి అనురాగమే, వారి స్వంత నిర్ణయాలే వారికి మార్గదర్శకాలుగా ఉండాలి. అనురాగంతో జీవించడ మే ఒక కుటుంబం. ఆ ఇద్దరే వారి బిడ్డలకు తల్లిదండ్రులు. స్త్రీ పురుష సంబంధం అంటే, ‘శ్రమ సంబంధాల’ మాట కాదు. ఇక్కడ, అనురాగ సంబంధాలకు ఫలితాలే బిడ్డలు. ఒక్కోసారి బిడ్డలు కలగవచ్చు; కలగక పోవచ్చు. బిడ్డలు కలగకపోయినా అనురాగ సంబంధం నశించదు. 

వివాహేతర తిరుగుళ్ళకు స్వేచ్ఛ యిస్తే, అది సమానత్వం అవదు. తల్లిదండ్రులే, బిడ్డల్ని పెంచుకోవాలి. పోషించుకోవాలి. తాము వృద్ధులైనప్పుడు, ఆ బిడ్డలే, ఆ తల్లిదండ్రుల్ని వృద్ధా ప్యంలో సేవలతో సాగనంపాలి. తర్వాత కాలంలో, ఆ బిడ్డల కి కూడా, అదే జరుగుతుంది. కానీ, వివాహేతర సంబంధాల వల్ల ఏర్పడే బిడ్డల ద్వారా నిజమైన తండ్రులూ దొరకరు; ఆ తండ్రులకు బిడ్డల సేవలూ దొరకవు. భార్యా భర్తల్లో ఎవ్వరికైనా, భార్యకైనా-భర్తకైనా, వివాహేతర సంబంధం నేరం కాదని చెప్పే సవరణలో మరొక వింత వుంది. ఆ సవరణ విడాకులకు కూడా అవ కాశం ఇస్తుంది. భార్యకి వుండే వివాహేతర సంబంధం ఇష్టం కాకపోతే, భర్త గానీ; లేదా భర్తకి వుండే వివాహేతర సంబం ధం ఇష్టం కాకపోతే భార్య గానీ, ఆ రెండో వ్యక్తితో విడా కులు పొందవచ్చునట! వివాహేతర సంబంధం ‘నేరం’ కాదు; కానీ, విడా కులకు అది ఒక కారణం! ఇది ఎలా సాధ్యం? ‘బిడ్డల’ మాట లేకుండానే భార్యభర్తల సమానత్వం! ‘నేరం’ మాట లేకుండానే విడాకులు పొందే హక్కు! విడాకుల కోసం, ఏం కారణం చూపిస్తారు? కారణం లేని కార్యం! ఈ రకంగా, పాత చట్టంలో నిన్న కొత్త సవరణ జరిగిపోయింది! ఇక, అందరికీ తిరుగుళ్ళ స్వేచ్ఛలు దొరికాయి! బాగుంది కదా ఈ బూర్జువా సవరణ?
రంగనాయకమ్మఅంబేడ్కర్ ఆశయం ఆచరణీయం

Updated By ManamSat, 11/03/2018 - 01:29

imageదేశానికి స్వాతంత్య్రం సము పార్జించిన నాటి నుంచి ప్రజాస్వామ్య పాలనలో ప్రజలు ఎన్నికల ద్వారా వారి ప్రజాప్రతినిధులను ఎన్ను కుని పాలనాపగ్గాలు కట్టబెడుతున్నారు. నాటి నుంచి నిన్నటి వరకు పరిపాలన చేసిన పార్టీ(నాయకు)లు దేశప్రజల అభివృద్ధికోసం స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక విధా నాల ద్వారా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ సంపద సృష్టిస్తున్నాం, ప్రజలకు పంచుతున్నాం ఇవే మాకు ముందు. మా విజన్(విదానా)లంటూ వివిధ రకాల పథకాలను ఏకరువుపెడుతున్నారు. మరీ ఎన్నికల వేళ గ ణాంకాలతో, పథకాలతో సాధారణ ఎన్నికలైనా, రాష్ట్రాల శాసనసభ ఎన్నికలైనా ఓట్లు దండుకోవడమే ధ్యేయంగా పథకాల, గణాంకాలతో అరచేతిలో స్వర్గాన్ని చూపుతున్నా రు. ప్రజల ఆలోచనలకు అందకుండా అతికీలకమైన కొన్ని అంశాలు... దేశంలో పెరిగిన సంపదను గద్దల లాగా తన్ను కుపోతున్నవారు కొందరైతే, రాచమార్గాన విదేశీ బ్యాంకుల్లో దేశాన్ని దోచేసి దాచుకుంటున్న కుబేరులు, ప్రపంచంలోనే ఆర్థికంగా బలపడి అగ్రభాగాన నిలుస్తున్నవారు కొందరు. మరికొందరు బ్యాంకుల్లో కోటాను కోట్లు ఋణాలు తీసు కొని వాటిని తిరిగి చెల్లించకుండా పాలకుల అండదండల తో పరాయి దేశాలకు వెళ్ళి విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారు. ఇంతేకాకుండా నేరచరిత కల్గినవారు పాల కులుగా అడ్డదారుల్లో ధనార్జన కోసం సులభమార్గంగా భావిస్తూ విచ్చలవిడిగా డబ్బు వెదజల్లి ఎన్నికల సంఘా లకు, ప్రజలకు చిక్కకుండా పాలకులుగా చలామణి అవుతున్నవారూ ఉన్నారు. 

ఇలా కార్పొరేటు శక్తులు, నల్లకబేరులు, నేరచరితులు, ప్రభుత్వ ఋణాలు చెల్లించకుండా విదేశాలకు పరారీ కావడంతో దేశ ఆర్థిక వ్యవస్థకు సవాల్‌గా మారిన వారి గురిం చి ఏ వేదికపైనా రాజకీయ నాయకులు ప్రస్తావించరు.  ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడిగే పార్టీ(నాయకు)లకు, ఈ నేరచరితులకు ప్రత్యక్షంగాకాని, పరోక్షంగాకాని సంబంధాలుండవు, ఉండనివ్వరు. ఎన్నికల్లో పాల్గొనే పార్టీ (నా యకు)లకు వెనక వెన్నుదన్నుగా ఉంటూ.. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల ప్రక్రియ పూర్తయి అధికారపక్షం, ప్రతి పక్షాలు తేలిపోతే వీరిదే పాలనాధికారం. రాజ్యాంగేతర శక్తుల చేతిలో రిమోటు చేరిపోతుంది. ఆ తర్వాత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోల్లోని అంశాలు ప్రజల ఆశలు, ఆశయాలు మంటకలిసి పోతున్నాయి. సామాన్యుల పొట్టకొట్టి వారి పొట్ట నింపుకుంటున్నారు. తరతరాలు తి న్నా తరగని సంపదను పోగుచేసుకుంటున్నారు. ఇది కాద నలేని నిజం. తరాలు మారినా, పార్టీలు మారినా ఇదే పున రావృతమౌతుందని ప్రజలు నిశ్చేష్టులుగా చూడవలసిందే  గాని, ఈ వ్యవస్థను కట్టడి చేయలేక పోతున్నది మాతరం నిజం. ఇలాంటి స్థితి నుంచి ప్రజలు చైతన్యవంతులై వీటి ని రూపుమాపే విధానాలు వచ్చేలా మరో ఉద్యమానికి పూనుకోవాలి. పై అంశాలను పూర్తిగా నిర్మూలిస్తామంటూ ముందుకు వచ్చే పాలకులను మాత్రమే ఎన్నుకోవాలి. చట్టాలను సవరించుకోని ఈ ఆధునిక దోపిడి విధానాలను అరికట్టే కఠిన చట్టాలు రావాలి. అవినీతి దోపిడి చేస్తే శిక్షలు పడేలా చేస్తే తప్ప దీనిని కట్టడి చేయలేము.

దేశ ప్రజలందరికీ అంటే సుమారు 135 కోట్ల భారతీయులకు పట్టెడు అన్నం పెట్టి కడుపు నింపుతున్న రైతులు మట్టిభూమినే నమ్ముకుని అతివృష్టి, అనావృష్టిలను తట్టు కొని పంటకోసం తెచ్చిన అప్పులు తీర్చలేక కాలయాపన జరిగితే వారి ఇంటిని, ఆస్తులను, పరువును వేలం వేస్తు న్న సంఘటనలను తట్టుకోలేక ఆత్మాభిమానంతో కుంగి పోతూ 1998-2018 మధ్య సుమారు 30,000 మంది రైతులు ఆత్మహత్యలకు పూనుకున్నట్లు తెలుస్తోంది. ఆ భూమి పుత్రులు బకాయిలు తీర్చలేక  తనువు చాలిస్తున్నారు. రుణమాఫీ పేర రైతులను బాగు చేస్తున్నట్లు చెప్పుకున్నా, మరణాలను ఆపలేకపోయారు. వడ్డీకి వడ్డీ పేరుకుపోయి మళ్లీ అసలు అప్పుగా కూర్చుంది.  కానీ పెద్ద, ధనిక, కార్పొరేటు పారిశ్రామికవేత్తలు బ్యాంకుల నుంచి రూ॥ 50కోట్లు అప్పుగా తీసుకుని ఎగవేసినా వారి పేర్లు బయటకు రావు. వీరికి అప్పటికే భారీమొత్తాలు ఎగ వేస్తున్న వారికి ఒకసారి పరిష్కారం పేర వడ్డీ మాఫీతో పాటు ఇంకా అనేక సదుపాయాలు, రాయితీలు, కల్పిస్తున్నారు. ఇంతచేసినా బకాయిలు చెల్లించకపోయినా వారిని  గౌరవిండం, చట్టప్రకారం చర్యలు తీసుకోవడంలో మీనవేుషాలులెక్కిండాన్ని ఏ విధంగా అర్ధం చేసుకోవాలి. రైతుకో న్యాయం, ఎగవేతదారులకో న్యాయమా! చట్టాలు కేవలం రైతులు,సాధారణ ప్రజలు చేసిన అప్పులవైపే చూస్తుంటాయని అర్థమవుతోంది. రైతులు భూమిని నమ్ముకుని, అప్పులు తీర్చలేక భూమిలోనే కలిసిపోతున్నారు. వీరు మా త్రం వేలకోట్ల రూపాయలు దేశ సంపదను, ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టి దేశాన్ని విడిచిపారిపోతున్నారు. అధికా రులకు, పాలకులకు తెలిసే జరుగుతున్న వాస్తవమిది. ఈ పార్టీ ఆ పార్టీ తేడాలేదు. అందరూ కూడబలుక్కొని రాజు సొమ్ము రాళ్లపాలు అన్న చందంలా వ్యవహరిస్తున్నారని భావించే స్థితికి ఆర్థికవ్యవస్థను తీసుకొచ్చారు. దేశ సంపద దేశ జనాభాలోని ఒక్క శాతం మంది అయిన ఉన్నతస్థాయి వర్గాల చేతు(ఖాతా)ల్లోకి వెళ్లిందని అనేక నివేదికలు కోడై కూస్తున్నాయి. ఇలా అప్రజాస్వామ్యంగా, అనైతికంగా అవి నీతి, దోపిడి కొనసాగడం వలన సామాజిక, ఆర్థిక అసమా నతలు పెరిగిపోయి ప్రజల్లో ఈర్ష్యాద్వేషాలకు దారి తీస్తా యి. స్వాతంత్య్రం తెచ్చుకుంది ఆ ఫలాలు దేశప్రజలందరికీ సమంగా పంచబడాలనే! 

2015-16 బహుముఖ పేదరికం(ఎమ్.పీ.ఐ) సూచీ ప్రకారం భారత్‌లో 36.4 కోట్ల పేదలున్నారు. వీరు కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా మరికొన్ని రాష్ట్రాల్లో చాలా తక్కువగా ఉన్నారు. ఇలా బిహార్ జనాభాలో (52 శాతం), ఝార్ఖండ్ (46), మధ్యప్రదేశ్ (41), ఉత్తరప్రదేశ్ (40), ఛత్తీస్‌గఢ్ (36) శాతంగా పేదలున్నారు. అలాగే అతి తక్కువ పేదలున్న 5 రాష్ట్రాలు కేరళ (1 శాతం), పంజాబ్ (6), తమిళనాడు (7), హిమాచల్ ప్రదేశ్ (8), హర్యాన (11)గా ఉన్నారు. కులాలవారీగా చూస్తే షెడ్యూల్డు కుల్లాల్లో (50శాతం), షెడ్యూల్డు తెగలల్లో (33), ఓబిసీల్లో (27) నిరుపేదలు న్నారు. మిగతా కులాల్లో నిరుపేదలు (15) మాత్రమే ఉన్నా రు. కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని కులాల్లో పేదరికం తిష్టవేసుక్కూ ర్చుంది. పాలకులు ఒకవైపు సామాజిక భద్రత కల్పిస్తూ, మరోవైపు ఉపాధి అవకాశాలు పెంచాలి. 70 ఏళ్ళ స్వతం త్ర దేశంలో రైతు ఆత్మహత్యలు, పేదరికం అర్థాకలి మరణాలు, విద్యార్థుల ఆత్మహత్యలు నిలవరించలేకపోవడం పాలకుల వైఫల్యంగానే భావించాలి.

అత్యున్నత స్థానాల్లో ఉన్నవారు అవినీతి ప్రక్షాళన చేయవల్సిన వాళ్ళే అదేరొంపిలోకి కూరుకుపోతుంటే, జాతి భవిత సంగతేమిటి? ‘కనురెప్పలే కాటేస్తే’ కాచేవారెవరని జాతి అభధ్రతకు లోనవుతుంది. రాజ్యాంగబద్ధ వ్యవస్థల ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న తీరుచూస్తుంటే ప్రజా ప్రయోజనాలు ఎవరు కాపాడాలి? నేరచరిత్రగల ఎంపీలు మూడోవంతు ఉండి, వారు చట్టాలు చేస్తుంటే దేశసంపద దారి మళ్లక ఏం చేస్తుంది? సంపద కేంద్రీకృతమవ్వడం చూస్తుంటే కంచె చేనుమేస్తూ... ఉపాధి అవకాశాలు లేకపోవడం ధనిక పేదరికాల మధ్య అగాధం పెరిగిపోవ డానికి దారితీస్తుంది. ప్రజల్లో పాలకుల విధానాలపై క్రమే ణా విశ్వాసం సన్నగిల్లుతోంది. దేశంలోని 73 శాతం సంపద 1 శాతం మంది ధనవంతులు, కుబేరులు, కార్పొ రేట్ వ్యాపార, పారిశ్రామికవేత్తల, రాజకీయ నాయకుల వద్దనే కేంద్రీకృతమై ఉంది.  27 శాతం సంపద 99 శాతం మందికి పంపిణీ అవుతోంది. ప్రజాస్వామ్య పాలనలో ప్రజాప్రయోజ నాలకు రక్షణ కనిపించడం లేదు. దీనంతటికి పై 1 శాతం ధనిక వర్గాలే బాధ్యత వహించాలి. ఈ స్వార్థపూరిత ద్వంద్వ విధానాలు మారాలి. ‘అవినీతి వటవృక్షానికి తల్లివేరు రాజకీయ అవినీతి మాత్రమే’ నని గతంలో అనేకమంది రాజకీయ విశ్లేషకులు చెప్పి నారు. రాజకీయ అవినీతి వట వృక్షాన్ని కూకటివేళ్ళతో పెకిలించే కఠిన చట్టాలు, అమలు చేసే పాలకులు రావాలి. నేటి నవతరం, యువతరం ప్రజలు ఆ వైపుగా చైతన్య వంతులై ప్రజాప్రయోజనాలకు భంగం కలిగించని వారికి మాత్రమే పాలన అందించండి. 2014 నుంచి 2018 మధ్యకాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు తమకు వసూలు కావాల్సిన రూ॥ 3.16 లక్షల కోట్ల మొండిబాకీల మొత్తాన్ని రద్ధు చేశారు. ఇంత భారీస్థాయిలో ఉద్ధేశ్యపూర్వకంగా మొం డిబాకీలు  రద్దుచేయటం గత దశాబ్దకాలంలో ఎన్నడూ జరగలేదు. కార్పొరేట్ వ్యాపార దిగ్గజాలు ఉద్దేశ్యపూర్వకం గా ఎగ్గొడుతున్నవారే ఉన్నారు. ఎన్నికల వేళ రైతులకు దరిద్రరేఖకు దిగువనున్న వారికి కొన్ని ప్రజా ఆకర్షక పథ కాలు ఆశచూపి ఎన్నికల పబ్బం గడుపుకోవడం ఏడు దశాబ్దాలుగా పరిపాటిగా మారింది. ఈ తీరుమారి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి. ప్రజాజీవితాల్లో ఉండే నాయకుల్లో విలువలు అత్యున్నత నైతికత, నిబద్ధతకు కట్టు బడాలి. నూతన ఒరవడిలో పాలన సాగించి గతంలోని అనైతిక చర్యలకు అడ్డుకట్టవేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్న జపాన్, అతిచిన్న దేశమైన ఫిన్‌లాండ్  అభివృద్ధి నుంచి స్ఫూర్తిపొంది, రాబోయే పాలకులు పాలన సాగించాలి. అలాంటి వారికి ప్రజలు మద్దతు పలకాలి. జాతి సంపదను ఏనుగు మింగిన వెలగ పండు మేస్తూ, అప్పుల తిప్పలు, పన్నుల మోత ప్రజల నెత్తిన మోపడాన్ని చూస్తున్నాం. సంపద మీకు, అప్పుల ఆత్మహత్యలు మాకా... మేనిఫె స్టోలలో హామీలతో అరచేత స్వర్గం చూపడం మానండి... ఎన్నికల వేళ రాష్ట్రం, దేశం ఏదైనా ‘జాతి సంపద సమంగా పంచుతామనుకుంటే నే..’ ఓటు కోసం మా వద్దకు రండి. గతంలా కాకుండా మాట నిలుపు కోండంటూ ప్రజలు భావిస్తున్నారు. సాధారణ ఎన్నిక నాటికి ఇదే సింగిల్ జెండా..ఎజెండాగా మారేలా ప్రజలు స్ఫూర్తిని పొంది చైతన్యవంతులు కండి. ‘నా జాతి ప్రజలకు కత్తి చేతికివ్వ లేదు...ఓటు హక్కు ఆయుధంగా ఇచ్చా ను.. పోరాడి రాజులౌతారో...అమ్ము కొని, ఓడిపోయి బానిసలౌతారో... నిర్ణయం మీ చేతుల్లో ఉందంటూ బీఆర్ అంబేడ్కర్ మాటలు గుర్తుచేసుకోవలసిన తరుణమిది.
మేదాజీశిలాసదృశ ఐక్యత

Updated By ManamThu, 11/01/2018 - 02:12

స్వాతంత్య్రోద్యమ నేత సర్దార్ వల్లభాయి పటేల్‌కు చెందిన ప్రపంచంలోనే అతి ఎత్తయిన విగ్రహం ‘ఐక్యతా శిల్పాన్ని’ ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఆవిష్కరించారు. భారతీయ ఇంజనీరింగ్ ప్రతిభకు ఒక తార్కాణంగా అది నిలుస్తున్న మాట నిజమే. అయితే ప్రభుత్వం అశించిన స్థాయిలో ప్రజల నుంచి హర్షాతిశయాలు రాకపోగా పలు రైతు, ఆదివాసీ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. ప్రతిపక్షాలు ప్రభుత్వ చర్యను ఈసడించుకుం టున్నాయి. భారత దేశ ఉక్కుమనిషిగా ఖ్యాతిగాంచిన పటేల్ విగ్రహం (ఐక్యతా శిల్పం) వేలాది టన్నుల ఇత్తడి, ఇనుము, ఉక్కుతోపాటు లక్షా 80 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, సిమెంట్ వినియోగించి తయారుచేశారు. 182 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహ నిర్మాణ వ్యయం రూ. 2,989 కోట్లు! 180 కి.మీ. ప్రచండ వేగంతో వీచే గాలికైనా, రిక్టర్ స్కేల్‌పై 6.5 నమోదయ్యే భూకంపానికైనా తట్టు కునే శక్తితో ఆ విగ్రహాన్ని నర్మదా నదిలోని ఒక దీవిపై నిర్మించారు. అమెరికా లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, చైనా, జపాన్‌లోని విగ్రహాలే ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహాలుగా ఇప్పటి దాకా నిలిచాయి. అయితే కేవలం 33 నెలల్లోనే రికార్డు వేగంతో పూర్తిచేసిన ఈ పటేల్ ఐక్యతా శిల్పమే ఇప్పుడు అతి పెద్దది. ఈ విగ్రహ నిర్మాణం కోసం నిర్వాసితులైన వగాడియా గ్రామ ప్రజలకు మాత్రం పునరావాసం కల్పించకపోవడం దురదృష్టకరం. 
 

image

ఒకనది మధ్యలో ఇంత పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ముందు పర్యా వరణంపై ఆ విగ్రహం చూపే ప్రభావాన్ని, పర్యావరణ నిర్వహణా ప్రణాళిక, సంబంధిత ప్రజలతో చర్చలు, సంప్రదింపులు జరపడం వంటి ప్రాథమిక  అను మతులు తీసుకోనేలేదు. ఎందుకంటే ఐక్యతామూర్తి ప్రాజెక్టు కేవలం విగ్రహ నిర్మాణానికే పరిమితం కాదు. రోడ్లు, ఫైవ్‌స్టార్ హోటళ్లు, వివిధ రాష్ట్రాల అతిథి గృహాలు, టెంట్ సిటీ, రోప్ వే, పులులు, మొసళ్ళ సఫారీ మొదలైన వెన్నో ఈ ప్రాజెక్టులో భాగంగా ఉంటాయి. నర్మదా డ్యామ్‌కు దిగువున దక్షిణం వైపు ఐక్యతా ప్రతిమను నిర్మిస్తుంటే, ఉత్తరం వైపున వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం, రిజర్వ్ ఫారెస్టులున్నప్పటికీ కనీసం వన్యప్రాణుల సంరక్షణ విభాగపు అను మతులు కూడా తీసుకోకపోవడం విడ్డూరం. పర్యావరణంపై ప్రతికూల ప్రభా వం చూపే ఇలాంటి నిర్మాణాలపై సైతం పర్యావరణ అనుమతులు తీసుకోకుం డానే ఈ ప్రాజెక్టును పూర్తిచేయడం క్షమించరానిది. ఐక్యతా ప్రతిమ నిర్మాణం వల్ల జీవనోపాధి కోల్పోయిన ప్రజలు అల్లాడుతున్నారు. ఇప్పటికే దశాబ్దాలుగా నర్మదా ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న ఆదివాసీ నిర్వాసితుల సమస్యతో పాటు, నర్మదా ప్రాజెక్టు పూర్తయినా ఆ ప్రాంత ప్రజల తాగునీటి సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. దీంతో ఆ ప్రాంతానికి చెందిన 22 గ్రామాల సర్పంచులు మోదీ విగ్రహావిష్కరణను బహిష్కరించడమే కాక, 70 గ్రామాల ప్రజలు విగ్రహావిష్కరణ రోజున తమ ఇళ్ళపై నల్లజెండాలు ఎగురవేసి, ఇళ్ళలో వంటచేసుకోకుండా నిరసన తెలుపుతున్నారు. తాగునీరు, పాఠశాలలు, వైద్య శాలలు తదితర సదుపాయాలు కల్పించాలనీ, తమ సమస్యలు పరిష్కరించాలని ఆ ప్రాంత ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో తాము విక్రయించిన చెరకు పంటకు డబ్బులు (దాదాపు రూ.12కోట్లు) ఇవ్వకుండా మూతపడిన చక్కెర మిల్లు తాలూకు బకాయిల కోసం 11 ఏళ్ళుగా వివిధ రూపా ల్లో ఉద్యమించి, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం లభించని చోటా ఉదేపూర్, పంచ్‌మహల్స్, వదోదరా, నర్మద-నాలుగు జిల్లాలకు చెందిన 1500 మంది రైతులు విగ్రహ ప్రతిష్ఠ జరిగే సమయంలో నర్మదా నదిలో దూకి నిరసనలు తెలిపేందుకు సిద్ధమయ్యారు. 

నర్మదా ప్రాజెక్టుకు చెందిన 20వేల కిలోమీటర్ల కాలువల నిర్మాణం ఇప్పటికీ పూర్తిచేయకపోయినా వేలకోట్ల రూపాయలతో పటేల్ విగ్రహాన్ని నిర్మించడంలో పరమార్థమేమిటని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల విమర్శలను తోసిపుచ్చలేము. సంఘ పరివార్ శక్తులు ఒకవైపు దేశాన్ని ఏకఖండంగా నిలిపిన ఉక్కుమూర్తి ఐక్యతా ప్రతిమ నిర్మాణాన్ని సాగిస్తూ దేశంలో విద్వేషకాండను సృష్టించి భారతీయ బహుళత్వ సామాజిక సంస్కృతిని స్వార్థ రాజకీయాల కోసం విచ్ఛిన్నం చేస్తున్నా రని ప్రజాస్వామికవాదులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ఒకవైపు మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని హోరెత్తిస్తూ, మరొకవైపు పటేల్ విగ్రహ నిర్మాణంలో చైనా కార్మికులనే వినియోగించడం విడ్డూరం. ప్రజల సమస్యల పట్ల దృఢదీక్షతో పోరాడే స్వభావం గల పటేల్ విగ్రహ నిర్మాణంతో నిర్వాసిత ప్రజలకు ప్రభు త్వం సక్రమంగా న్యాయం చేయడం లేదు. ‘మనం పోరాడవలసివస్తే నిజాయి తీగా, ఎటువంటి ఆక్షేపణలు లేకుండా పోరాడాలి. అటువంటి పోరాటం సరైన సమయం, సరైన పరిస్థితుల కోసం వేచి చూడాలి. ఆ పోరాటానికి ఉద్యుక్తుల యినవారు అప్రమత్తంగా ఉండాలి. పోరాట భూమికను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. శరణార్థులకు వ్యతిరేకంగా పోరాడడం అసలు పోరాటమే కాదు. ఆశ్రయాన్ని, సంరక్షణను కోరుతున్న ప్రజల ప్రాణాలు తీయడాన్ని నాగరీక సమా జాల మానవతా నియమాలుగానీ, యుద్ధ నియమాలుగానీ అనుమతించవు.’ అనే సర్దార్ పటేల్ మాటలు ఇప్పటికీ ప్రాసంగితను కోల్పోలేదు. విభిన్న అస్తిత్వా ల ప్రజల మధ్య సంయమనం, ఐక్యతా సంస్కృతి పరిఢవిల్లేందుకు కృషి చే యాలి. వాస్తవంలో దేశీయ బహుళ సంస్కృతిని మెజారిటీ ఓటు బ్యాంకు కోసం, కుటిల రాజకీయాల కోసం విచ్ఛిన్నం చేస్తూ, ఐక్యతా శిల్పాలు ప్రతిష్ఠించడంతో కోల్పోతున్న ప్రజా విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం సాధ్యం కాదు.  కలం కట్టడాలపై ‘కులం’ పలకలు!

Updated By ManamTue, 10/30/2018 - 00:22

imageభారత రాజ్యాంగం ప్రకారం ఏ ప్రభుత్వం అయినా  అన్ని కులాల, మతాల, వర్గాల ప్రాంతాల ప్రజలను వి వక్ష లేకుండా సమన్యాయంతో ఏలుబడి చేయాలి. కానీ తూ.. తూ మంత్రం చేస్తూ పేదప్రజలను చైతన్య హీనులను చేస్తూ గద్దెలు ఎక్కి గదమాయిస్తున్నాయి. పేదపిల్లల పలక చదువుల నిలయాలైన ప్రభుత్వ బళ్లుకు సైతం అగ్రకుల ప్రభుత్వాల అంటరానితనపు ‘కుల వివక్ష మరకలు’ అంటడంతో పసిమొగ్గ హృద యాలు మెలితిరుగుతున్నాయి. ప్రజల సొమ్మును పన్ను ల రూపంలో రాబట్టుకుని పాలన సాగించే ప్రభుత్వాలు అందరి అభివృద్ధిని కాంక్షిస్తూ పాలనచేయాలి. కార్పొ రేటు ఇంగ్లీషు మీడియం కళాశాలలకు, కాన్వెంట్లకు వాళ్ళు ఆకర్షణీయమైన నామధేయాలతో, రంగురంగు లతో ఊరిస్తూ వలపన్నుతూ విద్యావ్యాపారం చేసు కుంటున్నారు. చదువులు ముసుగులో విద్యావ్యాపారం చేసు కొని కోట్లు గడించి ప్రభుత్వాలను సైతం నడిపే స్థాయికి చేరి శాసించేస్తున్నారు. పదవులు అలంకరిస్తూ వాళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నరు.

కానీ పేద, బడుగు బలహీన వర్గాల పిల్లలు చదు వుకునే ప్రభుత్వ పాఠశాలలు తెలుగు మీడియం చదు వులతో ఎదుగూబొదుగు లేక బిక్కుమంటూ వెనకబడి పోతున్న విషయం పాలకులకు తెలియదా? తెలిసేనా! తెలియనట్లు ఉంటున్నారని భావించకుండా ఉండలేం. అన్ని ప్రభుత్వ పాఠశాలలైనప్పుడు వాటికి వేరే పేర్లు ఎందుకు? ఉదాహరణకు ‘హరిజనవాడ‘ పాఠశాల. ఈ నామకరణం ఉద్దేశ్యం ఏమిటి? ఇలా కులం పేరుతో అంటరానితనం ఉందని గుర్తు చేయడమే. చట్టప్రకా రం ‘హరిజన‘ పదాన్ని నిషేధించేది వాళ్లే. ఆ పదం వాడితే శిక్షార్హం అనేది వాళ్లే. కానీ చాపకింద నీరులా వారు చేసేది చేస్తూనే ఉన్నారు. హరిజనవాడ బడా!! ఇంకే ముంది! ఇక ఆ బడికి మరేవర్గం వాళ్ళ పిల్లలు చదవరు. అలాగే బీసీ కాలనీ బడి, చాకలి బజారు బడి, మాలపల్లి బడి, వడ్డెర బజారు బడి, కోయగూ డెం బడి ఇలా చెప్పుకుంటూపోతే కులం పేరుతో నడిచే  ప్రభుత్వ పాఠశాలలు లెక్కకు మిక్కిలి. ఇక చెప్పేదే ముంది ఒక కులం పేరుతో ఉన్న బడికి మరో కులం వారు తమ పిల్లలను పంపడానికి ముందుకురారు.  ఎందుకనంటే  ఎనుకబడ్డ కులాలను శూద్రులుగా, అంటరాని వారుగా చిత్రించిన ‘మనుధర్మ శాస్త్ర‘ 4 వేల సంవత్సరాల పాలనా సంస్కృతికి చెందిన అలవాట్లు ఈ సమాజంలో ఇంకా వేళ్ళూనుకొనే ఉండడం ఇందు కు తార్కాణం. ఒకవేళ కచ్చితమైన అడ్రస్ కోసమే అలా పేర్లు పెట్టారనుకుంటే ప్రాథమిక పాఠశాల 1, 2, 3.. అని, అలాగే యూ.పీ.యస్ పాఠశాల, జిల్లా పరి షత్ పాఠశాల, ఉన్నత పాఠశాల 1,2,3,...లుగా పేర్లు పెట్టవచ్చు. లేదా గొప్ప శాస్త్రజ్ఞులు, కవులు, కళా కారులు, దేశభక్తులు, ఆయా ప్రాంత గొప్పవ్యక్తుల పే ర్లు పెట్టడం సముచితం కదా? కేవలం కులాల పేర్లు తో ప్రభుత్వ బళ్లు ఉండాలా? ఇదెక్కడి న్యాయం?

ఎస్సీ, బీసీ, యస్‌టీ మైనారిటీలకు వేరువేరుగా స్కూళ్ళు, కాలేజీలు, గురుకులలు ఏర్పాటు చేయడం కులవాదాన్ని ప్రభుత్వాలు పెంచి పోషిస్తున్నాయనటా నికి నిదర్శనం కాదా? ప్రస్తుతం గ్రామాల్లోకి సైతం కా ర్పొరేట్ వ్యాపార విద్యా వాహనాలు డొంక, డొంకకు, వీధివీధికి చక్కర్లు కొట్టి పిల్లలను పోగేసుకుని వ్యానుల్లో కుక్కుతున్న విషయం పాలకులకు పట్టదా? తల్లిదం డ్రుల బలహీనతపైనే వ్యాపారం చేస్తుండడం ఈ నేటి ప్రజాపాలకులకు తెలియని విషయమేమి కాదనేది అక్షరసత్యం. ఇకపోతే ‘ఆంగ్ల మాధ్యమం’ విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ పాఠశాలలన్నీ నిజంగా ఆంగ్లమాధ్యమంలోనే బోధన నిర్వహిస్తున్నాయా? అ క్కడ బోధించే (ప్రభుత్వ) నిరుద్యోగులకు అంత ప్రావీ ణ్యం ఉందా!? విద్యహక్కు చట్టంలోని అన్ని నిబంధ నలు ప్రవేటు బళ్ళల్లో అమలు చేయడం జరుగుతు న్నదా? ఇవన్నీ తల్లిదండ్రులకు, పాలకులకు పట్టని వి షయాలు. మా అబ్బాయి లేదా మా అమ్మాయి ప్రభు త్వ బళ్ళో కాకుండా ఏ ప్రైవేట్ బడిలోనైనా చదివితే అ దే పెద్ద ’పరువు’గా ఫీల్ అవుతున్న విషయం తెల్సిందే.

ప్రభుత్వ నియామకాలు లేక బండచాకిరీ చేస్తూ (నౌకరి) ప్రైవేటు బళ్లలో చాలీచాలని జీతాలతో, స్వేచ్ఛ లేని జైలు వాతావరణంలో చదువు నేర్పే ఉపాధ్యాయులు చాలామంది తెలుగు మాధ్యమంలో చదువు పూర్తి చేసుకున్న వారేకదా!? అయినా మాకు ఆ ఇంగ్లీషే కావాలని ప్రజలు ఎగబడుంటే కార్పొరేట్ వాళ్లు మా త్రం ఏం చేస్తారు. ఇదే అదునుగా ప్రభుత్వాలు కూడా ఉద్యోగ నోటిఫికేషన్ల జోలోకే పోవడం లేదు.

ప్రభుత్వ బళ్లలో కొన్ని సంవత్సరాలుగా ఆంగ్ల మధ్యమం చదువులు అక్కడక్కడ ప్రైమరీ, హై స్కూల్స్‌లో ప్రారంభించినప్పటికి సరైన మౌలిక వసతు లు లేక సాధించాల్సిన విద్యాప్రమాణాలను ఎంతో కొం త స్థాయిలో సాధించి నెట్టుకొస్తున్నాయి. అయినా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆ దేశంలో విద్యావిధానం బాగుంది, ఈ దేశంలో బాగుంది అని చెప్పి కొంత మంది బృందాలుగా ఏర్పడి ప్రభుత్వ ఖర్చుతో ఆయా దేశాలు  వెళ్లి అధ్యయనం చేసి నివేదికలు ఇస్తుంటారు. మన పత్రికల్లో టీవీల్లో తెలుసుకుంటున్నాం. మరి వా ళ్ళ నివేదికలు ఏమైపోతున్నాయి? అవన్నీ బుట్టదాఖలు అవుతున్నాయని చెప్పక తప్పదు.

ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఉండి ప్రస్తుతం ఉన్న పాఠశాలలన్నీటిని కావలసిన వసతులతో, సరిపడా ఉపాధ్యాయ నియమకాలతో బలోపేతం చేసే సత్తా పాలకులకు ఉన్నప్పటికీ , కొత్తకొత్త పేర్లతో పాఠశాలలు ప్రారంభించడం వెనుక పరమార్థం ఏమిటో? నేటి పాలకులు కులాల పేర్లతో పాఠశాలలు పెట్టి అది చేశాం, ఇది చేశాం అని చెప్పుకొని కాలం వెళ్ళ దీస్తుం డడం బాధాకరం. ప్రభుత్వ విద్య, ప్రైవేట్ కు దీటుగా ఉందని ఊకదంపుడు ప్రసంగాలు,ఉచిత ఛలోక్తులు మానుకొని చిత్తశుద్ధి కలిగి బడ్జెట్లో విద్యకు అధిక నిధులు కేటాయించి అకుంఠిత దీక్షతో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే పాలకులు రావాలని ఆశిద్దాం. 

- మేకల ధర్మారావు 
9848904761

 ప్రజాస్వామ్య ప్రహసనం

Updated By ManamTue, 10/30/2018 - 00:22

imageఆధునిక పార్లమెంటరీ ప్రజాస్వామ్య మేడిపండు కొలంబోలో మరోసారి బట్ట బయలైంది. ఎన్నికల ద్వారా ప్రజాధికారం భావన తార్కికంగా సంభవమే అయినప్పటికీ, మానవీయంగా అసంభవంగా మారే ‘అసంబద్ధత’గా చరిత్ర పొడవునా నిరూపితమైనా, దానికి ప్రత్యామ్నాయమైన సామాజిక ప్రక్రియ ఏదీ జనామోదం పొందలేదు. రణిల్ విక్రమ సింఘెను అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన పదవి నుంచి తొలగించి కొత్త ప్రధానిగా మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సేను గత శుక్రవారం నాడు నియమించడంతో శ్రీలంకలో ప్రజాస్వా మ్యం ఒక ప్రహసనంగా తయారైంది. కొలంబొలో గత రెండురోజులుగా కొన సాగుతున్న రాజకీయ సంక్షోభం ఆదివారం మరింత తీవ్రరూపం దాల్చింది. రణిల్ విక్రమ సింఘెకు విధేయుడైన పెట్రోలియం మంత్రి అర్జున రణతుం గను ఆయన కార్యాలయంలోకి వెళ్ళనీయకుండా అధ్యక్షుడు మైత్రిపాలసేన అ నుచరగణం అడ్డుకోవడంతో మంత్రి అంగరక్షకులు కాల్పులు జరపడం, సిం ఘెయే ప్రధాని అంటూ స్పీకర్ జయసూర్య ప్రకటించడం, విక్రమ సింఘె కూ డా పార్లమెంటులో బలనిరూపణ జరిగేంత వరకు తానే ప్రధానినని ప్రకటిం చడం వంటి వరుస సంఘటనలతో శ్రీలంక రాజ్యాంగ సంక్షోభంలో కూరుకు పోయింది. పదవీచ్యుతుడైన విక్రమ సింఘెను అధికార నివాసభవనాన్ని ఖాళీ చేయాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఆయన తిరస్కరించి, తన బలాన్ని నిరూపించుకునేందుకు వెంటనే పార్లమెంట్‌ను సమావేశపర్చాలని డిమాండ్ చేశారు. ఆయన నివాస భవనం ఎదుట దాదాపు వెయ్యి మంది కార్యకర్తలు, మద్దతుదారులు, అనుచరులు, గుమిగూడి పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. ఉరుములేని పిడుగులా ఊడిపడిన తాజా రాజ్యాంగ సంక్షో భానికి దేశాధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన దుందుడుకుతనమే కారణమని చెప్పక తప్పదు. 

సంకీర్ణ కూటమి భాగస్వాములుగా దేశ పాలనను నిర్వహిస్తున్న సిరిసేన, ప్రధాని విక్రమ్ సింఘేల నడుమ కొద్దిపాటి స్పర్థలు ఏడాదికాలంగా చినికిచినికి గాలివానగా మారింది. వాళ్ళిద్దరి మధ్య ఆర్థికవ్యవస్థ, భద్రత వంటి విధాన పరమైన అంశాలపై తలెత్తిన విభేదాలే ఈ సంక్షోభానికి దారితీసిందని పరిశీల కులు భావిస్తున్నారు. మైత్రిపాల సిరిసేన నాయకత్వంలోని యుైనె టెడ్ ఫ్రీడమ్ అలయెన్స్ (యూపీఏ), విక్రమ సింఘె నేతృత్వంలోని యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ) కలసి ఏర్పాటు చేసిన జాతీయ ఉమ్మడి ప్రభుత్వంలో యూఎన్ పీనే పెద్ద భాగస్వామి. 225 స్థానాలున్న శ్రీలంక పార్లమెంటులో యూఎన్‌పీకి 106 మంది సభ్యులుండగా, యూపీఏకు 95 మంది మాత్రమే ఉన్నారు. ప్రభు త్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 113కు ఏడు సీట్ల తేడాలో యూ ఎన్‌పీ ఉంది. అదే సమయంలో సిరిసేన నియమించిన కొత్త ప్రధాని మహేంద్ర రాజపక్సే పార్టీకి 18 సభ్యుల మద్దతు అవసరం. అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం నుంచి పార్లమెంటరీ తరహా వ్యవస్థకు మారుతూ రెండేళ్ళ క్రితం చట్టానికి తెచ్చిన సవరణల ప్రకారం పార్లమెంటు విశ్వాసాన్ని చూరగొనడంలో ప్రధాని విఫలమైతే తప్ప ఆయనను తొలగించే అధికారం అధ్యక్షునికి ఉండదు కాబట్టి సిరిసేన చర్య రాజ్యాంగ విరుద్ధమని విశ్లేషకుల అభిప్రాయం. మహింద రాజపక్సె హయాంలో ఎల్‌టీటీఐని అణచివేసే క్రమంలో యుద్ధనేరాలు, మైనారి టీల అణచివేత చర్యలకుగాను అంతర్జాతీయంగా ఆర్థిక ఆంక్షలు అమలవడం తో శ్రీలంక ఆర్థికపరిస్థితి బాగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే విషయమై సిరిసేనకు, విక్రమ సింఘెకు మధ్య విభేదాలు తలెత్తా యి. రక్షణశాఖ మాజీ కార్యదర్శిని, రాజపక్సె సోదరుణ్ణి హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందన్న విషయాన్ని  ప్రధాని సింఘెకు అధ్యక్షుడు సిరిసేన నేరు గా తెలియజేసినా పట్టించుకోకపోవడంపై ఇద్దరి మధ్య వివాదం పరాకాష్ఠకు చేరింది. 

దక్షిణాసియాలో ఆధిపత్యం కోసం సామ్రాజ్యవాద చైనాకు, అమెరికా దన్నుతో విస్తరణవాద చర్యలకు పాల్పడుతున్న ఇండియాకు మధ్య తీవ్రపోటీ నడుస్తోంది. రాజపక్సే హయాంలో ఎల్‌టీటీఈ నిర్మూలనా యుద్ధం సహా నౌకాశ్రయ నిర్మాణాల వంటి అనేక శ్రీలంక అభివృద్ధి ప్రాజెక్టులకు చైనా ఆర్థిక, సైనిక, దౌత్యపరమైన సహాయం పెద్ద ఎత్తున చేసింది. అయితే చైనా అండతో ఎల్‌టీటీ ఈ నిర్మూలనాయుద్ధంలో శ్రీలంక సైన్యం చేసిన యుద్ధ నేరాలు, మైనారిటీల అణచివేతకాండల కారణంగా అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యంలో శ్రీలంక రాజకీయ పక్షాలు భారత్‌వైపు మొగ్గాయి. అయితే అధ్యక్షుడు మైత్రీ పాల సిరిసేన ధోరణిలో కొంతకాలంగా భారత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొలంబో వెలుపల ఎల్‌ఎన్‌జీ టెర్మినల్, జాఫ్నాలో ట్రింకోమలీ చమురు నిల్వల కేంద్రాలు, పలావి విమానాశ్రయం, హంబన్ తోటలో మత్తల విమానాశ్రయ ప్రాజెక్టులతో పాటు ఈస్టర్న్ కంటౌనర్ టెర్మినల్ వంటి ఇండియాతో జరిగిన ఒప్పందాలు అమలుకు నోచుకోకుండా శ్రీలంక ప్రభుత్వమే కావాలని అడ్డుకుం టోంది. దీని వెనుక చైనా కుట్ర ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అదీకాక భారత విదేశీ నిఘా సంస్థ ‘రా’ తనను హత్య చేసేందుకు కుట్ర చేస్తోందన్న ఆ దేశ అధ్యక్షుడు చేసిన ప్రకటనను ఇరుదేశాల ప్రభుత్వాలు ఖండించాయి. సామ్రాజ్యవాది చైనా అనుకూల రాజపక్సే శ్రీలంక పార్లమెంటులో ఫిరాయింపు లను ప్రోత్సహించి ప్రధానిగా అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు ముమ్మ రంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. భౌగోళిక రాజకీయ సమీకరణాల నేపథ్యంలో జాతీయ రాజకీయ శక్తుల ఎత్తులు జిత్తుల కారణంగా శ్రీలంకలో ఏర్పడిన రాజ్యాంగ సంక్షోభ పరిష్కారానికి ఆ దేశ ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఏ మేరకు  చొరవ చేస్తారో వేచిచూడాలి! 

Related News