kcr

బలహీన వర్గాల బలమైన గొంతుక కేసీఆర్

Updated By ManamSat, 11/17/2018 - 00:02
 • మల్లయ్య యాదవ్‌కు మహాకూటమితో అన్యాయం జరిగింది

 • సీఎం సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన గడ్డం అరవింద్ రెడ్డి

 • తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో బోల్లం మల్లయ్య యాదవ్

kcrహైదరాబాద్: టీఆర్‌ఎస్‌లోకి చేరికలు  పెరుగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందర్ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు.  శుక్రవారం ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఆయన గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు. అదే విధంగా మంత్రి కేటీఆర్ సమక్షంలో మల్లయ్య యాదవ్ చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల బలమైన గొంతుక కేసీఆరేనని పేర్కొన్నారు. మల్లయ్య యాదవ్‌కు మహాకూటమితో అన్యాయం జరిగిందని అన్నారు. ప్రతి రోజూ తెలంగాణ భవన్‌లో ప్రతి రోజూ వేలాది మందితో చేరికలు జరుగుతుంటే.. గాంధీ భవన్ గేట్లకు తాళాలు వేస్తున్నరన్నారు. ఇక, గాంధీ భవన్ దగ్గర బౌన్సర్లే... ఉత్తమ్ ఇంటి వద్ద బౌన్సర్లేనంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ స్వయంగా పంపిన కాంగ్రెస్ నేతే తమ దగ్గర మూడు కోట్లు డిమాండ్ చేసారని ముప్పయి ఏళ్ళు కాంగ్రెస్ లో పనిచేసిన బడుగువర్గాల నేతలు ఆరోపించారు.ఇక, ఒక్కో సీటును మూడు కోట్లకు టికెట్ అమ్ముకుంటున్న వారు పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్ముకోరా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు కూడా తెలంగాణ అమ్ముకోరని గ్యారంటీ ఉందా అని కాంగ్రెస్ నేతలను నిలదీశారు. వారి టికెట్లు ఢిల్లీ, అమరావతిలో ఖరారయ్యాయి. కాంగ్రెస్‌లో 40 మంది సీఎం అభ్యర్థులున్నారు. నెలన్నరకొకరు చొప్పున 60 నెలలు 40 మంది సీఎంలు అవుతారన్నారు. సీల్డు కవర్ సీఎం కావాలా...సింహం లాంటి కేసీఆర్ కావాలా అని నిలదీశారు. 67 ఏళ్ళ కాంగ్రెస్, టిడిపి పాలనను పోల్చుకోవాలన్నారు. నాలుగేళ్ల కేసీఆర్ పాలన పోల్చుకొని ఓటెయ్యాలని కోరారు. ఎలాగైనా కోదాడలో గులాబీ జెండా ఎగరాలన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురు అభ్యర్థులు ఒకే వేదిక మీదున్నారన్నారు. అందరూ కలిసికట్టుగా కోదాడ టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని ఆయన ఆభ్యర్ధులని పార్టీ శ్రేణులను కోరారు.టీడీపీకి 3 పదవులు.. నాకు మంత్రి పదవి!

Updated By ManamFri, 11/16/2018 - 20:29
 • టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి వ్యాఖ్య

TDP, 3 posts, minister post, Revuri prakash reddy, TRS, TDP ticket, Chandrababu naidu, KCR, Telangana assembly electionsవరంగల్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధిస్తే టీడీపీకి 3 మంత్రి పదవులు దక్కనున్నాయనీ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి చెప్పారు. అలా జరిగితే తాను మంత్రి కావడం తథ్యమని ఆయన అన్నారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ గోబెల్స్‌ ప్రచారం చేస్తోందని విమర్శించారు. నాలుగేళ్లు అధికారంలో ఉండి టీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధి ఏ పాటిదో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

వరంగల్‌ పశ్చిమ నుంచి పోటీ చేసేందుకు రేవూరికి టీడీపీ టికెట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో చేసిన పనులను చెప్పుకునే దమ్ములేక చంద్రబాబును టార్గెట్‌ చేస్తున్నారని ఆయన నిప్పులు చెరిగారు. చంద్రబాబును విమర్శించకుండా టీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గాల వారిగా కూటమి తరపున సమన్వయ కమిటీలు పనిచేస్తాయని రేవూరి తెలిపారు. 'ఇక ఆ పార్టీకి మిగిలింది బౌన్సర్లే'

Updated By ManamFri, 11/16/2018 - 18:09

TRS leaders, Danam Nagender, Mahamud ali, KCR, Congress, Telangana assembly electionsహైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీని, అధినేత కేసీఆర్‌పై ఆ పార్టీ నేతలు ఖైరతాబాద్ అభ్యర్థి దానం నాగేందర్, డిప్యూటీ సీఎం మెహమూద్ అలీ ప్రశంసలతో ముంచెత్తారు. శుక్రవారం నేతలిద్దరూ మీడియాతో మాట్లాడారు. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ వందకు పైగా సీట్లు గెలుస్తుందని దానం ధీమా వ్యక్తం చేయగా, టీఆర్ఎస్ అంతటి మంచి పార్టీ దేశంలో ఏదీ లేదని మెహమూద్ అలీ కొనియాడారు. టీఆర్ఎస్ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతుందని డిప్యూటీ సీఎం జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌లో ఎవరికి న్యాయం జరగలేదని, గాంధీ భవన్ నుంచి కార్యకర్తలను బయటకు పంపారని, ఇక కాంగ్రెస్‌కు మిగిలేది బౌన్సర్లేనని దానం ధ్వజమెత్తారు. ముస్లింలను కంటికి రెప్పలా కాపాడేది కేసీఆర్‌నే అని అలీ పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందాయని దానం నాగేందర్ గుర్తు చేశారు. ముస్లింలకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్‌ అని అలీ ప్రశంసల జల్లు కురిపించారు.

బీజేపీతో కలిసే ప్రసక్తే లేదు..
బీజేపీతో టీఆర్ఎస్ కలుస్తుందని కాంగ్రెస్ పుకార్లు సృష్టిస్తోందని ఆయన మండిపడ్డారు. బీజేపీతో టీఆర్ఎస్ కలిసే ప్రసక్తే లేదని అలీ స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధించారని, ఆమరణ దీక్షను ఆపాలని తాము కేసీఆర్‌ను కోరినా ఆయన పట్టుదలతో దీక్ష కొనసాగించారని అలీ చెప్పారు. కేసీఆర్ దీక్ష ఫలితమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. కేసీఆర్ పోరాటాలతోనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని తెలిపారు. తామే తెలంగాణ తెచ్చామన్నా.. కాంగ్రెస్‌ను గత ఎన్నికల్లో ప్రజలు నమ్మలేదని అలీ దుయ్యబట్టారు. ఇపుడు కూడా నమ్మరని, కేసీఆర్‌ను మించిన నాయకుడు తెలంగాణలో లేడని కొనియాడారు. ముస్లింలకు ఇన్ని సంక్షేమ పథకాలు దేశంలో అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అభినందించారు.‘ఆ సీటు’ కేసీఆర్‌కు గిఫ్ట్‌గా ఇస్తాం: కవిత

Updated By ManamFri, 11/16/2018 - 13:14
we will give jagtial gift to kcr, say MP kavitha

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 100కి పైగా సీట్లు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని ఆ పార్టీ ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఆమె శుక్రవారమిక్కడ మీడియాతో చిట్ చాట్ చేశారు. ‘టీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని ఉత్తమ్ అన్నారు. మరి...ఆయన తన భార్య పద్మావతికి టికెట్ ఎలా తీసుకుంటారు?. ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్య పద్మావతి నామినేషన్ ఉపసంహరించుకుంటే గౌరవంగా ఉంటుంది. కోదాడలో టీఆర్ఎస్ గెలుస్తుంది. 

తెలంగాణ కాంగ్రెస్‌కు సడన్‌గా సెటిలర్లపై ప్రేమ పుట్టుకు వచ్చింది. కమ్మ సామాజికవర్గానికి అన్యాయం జరిగిందని ఆ పార్టీ ఎంపీ రేణుకా చౌదరి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. కొత్తగా కుసుమకుమార్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. తెలంగాణలో టీడీపీ అభ్యర్థిని కాదు... ఆ పార్టీని తిరస్కరిస్తారు. నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ సీట్లు గెలుస్తాం. ఇక జగిత్యాల సీటు గెలిచి కేసీఆర్‌కు బహుమతిగా ఇస్తాం.  రూరల్, అర్బన్ అనే తేడాలేదు... అందరూ టీఆర్ఎస్ వైపే’ అని కవిత ధీమా వ్యక్తం చేశారు.19 నుంచి కేసీఆర్ ప్రచారం

Updated By ManamFri, 11/16/2018 - 06:07
 • కాంగ్రెస్ సీనియర్ల నియోజక వర్గాలపై ప్రత్యేక దృష్టి

 • పార్టీ ముఖ్యులతో కేసీఆర్ సమాలోచనలు

 • పరిస్థితులను బట్టి పద్ధతి మార్చాలని సూచన

 • త్వరలోనే టీఆర్‌ఎస్ మేనిఫెస్టో విడుదల

kcrహైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ల నియోజక వర్గాలపైన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. దాదాపు 23 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుందనే సమాచారంతో పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడూ పరిస్ధితులను బేరీజు వేసుకుంటూ ప్రచారం చేయాలని సూచిస్తున్నారు. గురువారం పార్టీ ముఖ్యులతో కేసీఆర్ చర్చలు జరిపారు. తాను ఈ నెల 19 నుంచి ప్రచారం ప్రారంభిస్తానని చెప్పినట్లు సమాచారం. ప్రతి గుంటకు సాగునీరు, ప్రతి ఇంటికి మంచినీరు, నిరుద్యోగ భృతి హామీలతో ప్రజలకు ముందుకు వెళుతున్న టీఆర్‌ఎస్ ఇప్పటికే అమలు జరిపిన పథకాలతో ప్రయోజనం పొందిన లబ్దిదారులు  టీఆర్‌ఎస్‌ను మరో సారి ఆశీర్వదించడానికి సిద్దపడ్డారని కేసీఆర్ అన్నట్లు తెలిసింది. కూటమిలోని పరిణామాలను విశ్లేషిస్తున్నారు. ప్రజా కూటమి తమకు పోటీ కానే కాదనే ధైర్యం నూరి పోస్తున్నారు. తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లగలిగితే విజయాన్ని ఏ శక్తి ఆపలేదని అన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సిట్టింగ్‌లకు తిరిగి టికెట్ ఇవ్వడంపై వస్తున్న విమర్శలపై కూడా చర్చ జరిగిందంటున్నారు. ప్రజా ప్రతినిధిగా సిట్టింగ్‌లకు ఉన్న ప్రజాదరణను దృష్టిలో పెట్టుకొని టికెట్లను ఇవ్వడం జరిగిందని, ఈ నిర్ణయంతో రాజకీయ నష్టం కొంత జరిగినప్పటికీ ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం పెరిగిందని కేసీఆర్ అన్నట్లు తెలిసింది. టీఆర్‌ఎస్ రాజకీయ నిర్ణయంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలకు బహిరంగ సభల్లోనే స్పందిస్తానని కేసీఆర్ అన్నట్లు తెలిసింది. కొంతమంది సీనియర్లు పార్టీని వీడుతున్నారనే సమాచారంపై కూడా చర్చ జరిగిందంటున్నారు. వెళ్లాలనే ఆలోచనలో ఉన్న వారిని నిలువరించవలసిన అవసరం టీఆర్‌ఎస్‌కు లేదని, ఇతర పార్టీల సీనియర్లు అనేకులు త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్దమయ్యారని కేసీఆర్ అన్నట్లు తెలిసింది. తాను ఈ నెల 21 తర్వాత జిల్లాల పర్యటనల్లో భాగంగా కాంగ్రెస్ ప్రముఖులు పోటీ చేస్తున్న నియోజక వర్గాలతో పాటుగా బలహీనంగా ఉన్న అభ్యర్దుల నియోజక వర్గాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం జరుగుతుందని హామీ ఇచ్చారని అంటున్నారు.  కాంగ్రెస్ మైండ్ గేమ్ వ్యవహరాలపై అప్రమత్తంగా ఉండాలని పలువురు సీనియర్లకు సూచించారు. కూటమిలో కూర్పు పట్ల కేసీఆర్ తనదైన శైలిలో వ్యాఖ్యనించారని, ఉద్యమకారులం అని చెప్పుకునే వారు కూడా కాంగ్రెస్ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్న తీరును ప్రజలు గమనిస్తునే ఉన్నారని కేసీఆర్ అన్నట్లు పార్టీ సీనియర్లు తెలిపారు. పార్టీ మేనిఫెస్టో సిద్దమైందని, త్వరలోనే విడుదల చేయడంతో పాటుగా కేసీఆర్ ఎన్నికల పర్యటన వివరాలను కూడా వెల్లడించడం జరుగుతుందని పేర్కొన్నారు.'కాంగ్రెస్‌లో కోవర్టులున్నారు'

Updated By ManamThu, 11/15/2018 - 15:31

Congress Party, Kyama Mallesh, TRS, Congress, DCC president, Dasoju Sravan, KCRహైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అధికార పార్టీ టీఆర్ఎస్‌ను గద్దె దించేందుకు ప్రజాకూటమి తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో కూటమిలో సీట్ల సర్దుబాటు కారణంగా పార్టీ టికెట్ దక్కని ఆశావహులంతా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తాము పోటీ చేయాలనుకున్న స్థానాల్లో మరో పార్టీ నేతలకు సీట్లను కేటాయించడంతో సొంత పార్టీలోని టికెట్ దక్కని నేతలంతా గుర్రుగా ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ నేత, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌లో కోవర్టులున్నారని ఆయన విమర్శించారు. సీట్ల కేటాయింపుల్లో యాదవులు, కుర్మలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. 

రూ. 10 కోట్లు తీసుకొని దానం నాగేందర్‌పై బలహీన అభ్యర్థి దాసోజు శ్రవణ్‌కు టికెట్ ఇచ్చారని మల్లేశ్ విమర్శించారు. భక్త చరణ్‌దాస్ ఒక నియోజకవర్గానికి రూ.3 కోట్లు అడిగినట్టు చెబుతున్న ఓ ఆడియో టేప్‌ను మల్లేశ్ విడుదల చేశారు. స్ర్కీనింగ్ కమిటీ వ్యవహారం కంచే చేనుమేసినట్లుందని దుయ్యబట్టారు. కేసీఆర్‌ను విమర్శించే కాంగ్రెస్ నేతలకు సిగ్గుండాలన్నారు. ఇబ్రహీంపట్నం సీటు కోసం భక్తచరణ్ దాస్ కొడుకు సాగర్ రూ.3 కోట్లు అడిగారని మల్లేశ్ ఆరోపించారు. 16 రంగాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రగామి..

Updated By ManamThu, 11/15/2018 - 12:30
KTR Meet the Press from Press club in somajiguda

హైదరాబాద్ : 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునేవారు కూడా టీఆర్ఎస్ పాలన చూసి అవాక్కయ్యారని కేటీఆర్ అన్నారు. ఆయన గురవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘మీట్ ది ప్రెస్’లో మాట్లాడుతూ...‘నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో నెలకొన్న అనుమానాలు అన్నింటినీ నివృత్తి అయ్యాయి. కేసీఆర్ మంచి ఆందోళనకారుడే కాదు... మంచి పాలన దక్షుడు కూడా. మా పాలన చూసి ప్రతిపక్షమే అవాక్కు అయింది. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని కేంద్రమే చెబుతోంది. అంతేకాకుండా రాష్ట్ర ఆదాయాన్ని రెట్టింపు చేశాం. రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. పేదరికం లేని నవ తెలంగాణ నిర్మాణం కోసం ముందుకు వెళ్లాం.

ఓవైపు సంక్షేమ పథకాలు... మరోవైపు పాలనా సంస్కరణలు తీసుకొన్ని అధికారాన్ని వికేంద్రీకరించాం. కులవృత్తులకు ఊతం ఇచ్చాం. ఇంటింటికి మంచినీరు అందించేలా మిషన్ భగీరధ చేపట్టాం. 10 జిల్లాలను 31 జిల్లాలుగా విభజించాం. తండాలు, గూడాలను గ్రామ పంచాయతీలు చేశాం. 16 రంగాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రగామిలో ఉంది. చేనేత కార్మికులను అదుకునేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టాం. అలాగే  విద్యుత్ కోతలు లేకుండా వెలుగులు నింపాం.  భవిష్యత్ తరాల కోసం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ చేపట్టతాం. మొత్తం ఆస్తుల విలువ 22.60కోట్లు

Updated By ManamThu, 11/15/2018 - 10:41
KCR

హైదరాబాద్: శాసనసభ ఎన్నికలకు గానూ టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలతో కూడిన ప్రమాణ పత్రాన్ని ఆయన సమర్పించారు. అందులో కేసీఆర్ ఆస్తుల విలువ రూ.22.60కోట్లుగా పేర్కొన్నారు.

అందులో తన భార్య శోభ పేరిట రూ.93వేల నగదు, 2.2కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. అలాగే ఈ నాలుగేళ్లలో దాదాపు 17ఎకరాల వ్యవసాయ భూమిని ఆయన కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. తనపై మొత్తం 64కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, రెండు కేసుల్లో సమన్లు అంది విచారణలో ఉన్నాయని వివరించారు. ఇక గతంతో పోలీస్తే ఇప్పుడు కేసీఆర్‌కు అప్పులు మరో కోటి పెరిగి.. రూ.8.88కోట్లకు చేరాయి. వాటిలో కుమారుడు కేటీఆర్‌కు రూ.82లక్షలు, కోడలు శైలిమకు రూ.24.65లక్షల అప్పు చెల్లించాల్సి ఉందని వివరించారు. ఇక బంజారాహిల్స్, తీగలగుట్టపల్లిలో తనకు రెండు నివాసాలు ఉన్నాయని, సొంత కారు లేదని వివరించారు. కాగా 2014 ఎన్నికల సమయంలో కేసీఆర్ ఆస్తుల విలువను రూ.15.15కోట్లుగా చూపిన విషయం తెలిసిందే.

అఫిడవిట్‌లో కేసీఆర్ సమర్పించిన వివరాలు
నగదు:రూ.2,40,000
బ్యాంకు డిపాజిట్లు: రూ.4,25, 61, 452
కుటుంబ డిపాజిట్లు: రూ.1,38,12,494
కేసీఆర్ బంగారం: 7.5 తులాలు
శోభ(కేసీఆర్ భార్య) బంగారం: 2.2 కిలోలు, విలువైన వజ్రాలు
వ్యవసాయ భూమి: దాదపు 54.21 ఎకరాలు(విలువ: రూ.6.50కోట్లు)
వ్యవసాయేతర భూమి: 2.04 ఎకరాలు(విలువ: రూ.60లక్షలు)
పెట్టుబడులు:
తెలంగాణ బ్రాడ్‌కాస్టింగ్: రూ.55లక్షలు
తెలంగాణ పబ్లికేషన్స్: రూ.4,16,25,000
నివాస భవనాలు:
బంజారాహిల్స్ నందినగర్, తీగలగుట్టపల్లి(కరీంనగర్)
అప్పులు: రూ.8,8847,570 కోట్లు
కేసులు: 64, విచారణలో ఉన్నవి: 2.కేసీఆర్.. చేతనైతే ఎంపీలను ఆపుకో..!

Updated By ManamWed, 11/14/2018 - 18:40
 • టీఆర్ఎస్ అధినేతకు రేవంత్ సవాల్ 

 • ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌పై నిప్పులు

 • కొడంగల్‌లో రేవంత్ అనే హైటెన్షన్ వైరు అడ్డంగా ఉంది

 • నువ్వే డైరెక్ట్‌గా రా.. కొడంగల్‌లో తేల్చుకుందాం..

 • 19న 50వేల మందితో నామినేషన్ వేస్తున్నా..

Kodangal, Revanth Reddy, KCR, TRS, Two MPsకొడంగల్: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల నామినేషన్ల పర్వం కూడా వేగంగా సాగుతోంది. అధికార టీఆర్ఎస్ ఒకవైపు జోరుగా ప్రచారంలో దూసుకెళ్తుంటే.. ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రజాకూటమిగా ఏర్పడిన అన్ని పార్టీలు ఏకమై కేసీఆర్‌ను గద్దె దించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో కొడంగల్ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం కొడంగల్ ప్రచారంలో పాల్గొన్న రేవంత్ టీఆర్ఎస్‌పై నిప్పులు చెరిగారు. తొందరలోనే టీఆర్ఎస్‌కు చెందిన ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ చేరుతున్నారంటూ బాంబు పేల్చారు. కొడంగల్ చుట్టుపక్కల ఉండే ఎంపీలు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని.. కేసీఆర్ నీకు చేతనైతే మీ ఎంపీలు ఆపుకో అని సవాల్ విసిరారు.

రేవంత్ అనే హైటెన్షన్ వైరు ఇక్కడ..
కొడంగల్ ప్రజలతో ఆడుకుందాం అనుకునే వాళ్లు ఎవరూ బతికి బట్టకట్టరని రేవంత్ హెచ్చరించారు. కొడంగల్‌కు రేవంత్ అనే హైటెన్షన్ వైరు అడ్డంగా ఉందన్నారు. హరీశ్ లాంటి గుంట నక్కలు వచ్చిన కొడంగల్‌ను ఏమి చేయలేరని ధ్వజమెత్తారు. కొడంగల్ మీదికి కేసీఆర్ తోడేళ్ల గుంపును పంపుతున్నారని రేవంత్ విమర్శించారు. కేసీఆర్ రెండు కళ్లు తెరవడానికే మధ్యాహ్నం అవుతుందని, ఇక మూడో కన్ను ఎప్పుడు తెరుస్తాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మూటలు.. ముఠాలు కాదు. నువ్వే డైరెక్టర్‌గా రా.. కొడంగల్‌లో తేల్చుకుందామని సవాల్ విసిరారు. తాను ఈ నెల 19న ఉదయం 10 గంటలకు 50వేల మందితో నామినేషన్ వేస్తున్నట్టు రేవంత్ స్పష్టం చేశారు. నామినేషన్ వేసిన కేసీఆర్

Updated By ManamWed, 11/14/2018 - 14:54

KCRగజ్వేల్: తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత నామినేషన్ వేశారు. మధ్యాహ్నం గజ్వేల్ ఆర్డీవో కార్యాలయానికి వెళ్లిన ఆయన తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ముహూర్తం ప్రకారం మ.2.34గంటలకు ఆయన నామినేషన్ వేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ మేనల్లుడు, మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు మరో ముగ్గురు ఆయన వెంట ఉన్నారు. కాగా హరీశ్ రావూ కూడా ఇవాళనే తన నామినేషన్‌ దాఖలు చేయనుండగా.. కేటీఆర్ ఈ నెల 19న నామినేషన్ వేయనున్నారు.

Related News