kcr

కేసీఆర్ వైఖరితో కూటమిలో టెన్షన్

Updated By ManamSat, 11/10/2018 - 05:51
  • 11న ఆభ్యర్థులతో టీఆర్‌ఎస్ అధినేత భేటీ 

  • బీ ఫారాలు అందచేసేందుకు రంగం సిద్ధం

  • గజ్వేల్ కార్యకర్తలు, స్థానిక నేతలతో చర్యలు

kcrహైదరాబాద్: టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడును పెంచారు. ప్రచారం మొదలు.. ప్రత్యర్థు లను ఢీకొనే వ్యూహాల వరకు అంతు చిక్కని ఆలోచనలతో దూసుకుపోతున్నారు. కేసీఆర్ వ్యూహాలతో మహాకూటమి నేతల్లో టెన్షన్ చోటు చేసుకుంది. కేసీఆర్‌ను ఢీ కొట్టేందుకు ఎం చేయాలనే కూటమి నేతల్లో చర్చ ప్రారంభమైంది. వారిలో గుబులు మొదలైంది. దీంతో క్షణ క్షణం తెలంగాణ రాజకీయాలు అత్యంత రక్తి కట్టించే తార స్థాయికి చేరాయి. ఒకరిపై ఒకరు తమకు తాముగా అన్నీ చేసామని భావిస్త్తున్న సమయంలో అధికార పార్టీదే పైచేయిగా అనిపిస్తోంది. ఎవరూ ఊహించని విధంగా కేసీఆర్ ఈ నెల 11న పార్టీ ఆభ్యర్థులతో భేటి అవుతున్నారు. అదే రోజు బీ ఫారాలు అందచేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇదిలా ఉంటే, కూటమి నేతలు ఇంకా పొత్తుల చర్చల్లో కోట్టు మిట్టాడుతునే ఉన్నారు. ఇప్పటికే అధికార పార్టీ అన్ని నియోజక వర్గాల్లో రెండు విడుతలుగా ప్రచారం పూర్తి చేసింది. దీంతో అధికార పార్టీలో జోష్ కనిపిస్తోంది.

11 న గజ్వేల్ కార్యకర్తలతో భేటి
 మరోవైపు గత కోద్ది రోజులుగా రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదుపేసిన గజ్వేల్ రాజకీయాలు తార స్థాయికి చేరాయి. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ గజ్వేల్‌లోని నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలు, స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చించేందుకు వారిని స్వయంగా ఆహ్వానించారు. ఈనెల 11న కేసీఆర్ గజ్వేల్ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఎర్రవెల్లి వ్యవ సాయ క్షేత్రంలో మధ్యాహ్నం 12 నుండి మూడు గంటల వరకు జరిగే ఈ సమా వేశంలో గజ్వేల్ నియోజక వర్గానికి చెందిన 15వేల మంది కార్యకర్త లతో ముఖ్యమంత్రి మాట్లాడతారు. ఈ నాలుగున్నరేళ్లలో టీఆర్‌ఎస్ సర్కార్ చేసిన అభివృద్ధితో పాటు, నిరుెపేద, మధ్య తరగతి వర్గాల ప్రజలనుద్దేశించి చేసిన పలు సంక్షేమ పథకాలను వారికి వివ రించనున్నారు. గత ఎన్నికల మేనిఫెస్టో, ఇచ్చిన హమీలకన్న కొత్తగా తెచ్చిన పథకాలు, వాటి ద్వారా ప్రజలకు జరిగిన లబ్ధిని వివరిస్తారు. టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి ఎందుకు రావాలో గజ్వేల్ వాసులకు నివేదించను న్నారు. మళ్లీ తాము అధికారంలోకి వస్తే ఎమేం పనులు చేస్తారో కేసీఆర్ చెప్ప నున్నారు. గత ఆరవై ఎళ్లు ఉమ్మడి పాలన లో జరిగిన దోపిడిలు, కుట్రలు, ఆన్యా యాలను వివరిస్తారు. మహకూటమికి ఓటే య్యద్దని, తెలంగాణను ఆగం చేసేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్రలను వారికి ఆర్థమయ్యేలా, కళ్లకు కట్టినట్లు వివరించను న్నట్లు తెలుస్తోంది. ఇక్కడ నుంచి తన గెలుపు బాధ్యత వారిదేనని గులాబీ బాస్ వారికి వివరిస్తారు. మీరు ఈ ముప్పయి రోజులు మా కొరకు కష్టపడండి, తాము ఈ రాష్టానికి ఈ ఐదేళ్లు మెరుగైన పాలనలో రాష్టాభివృద్ధికి బాటలు వేస్తామని దిశానిర్ధేశం చేయనున్నారు. ఈ భేటీ తర్వాత ప్రతిపక్షాలకు ఏమాత్రం డిపాజిట్ దక్క కుండా చేసే ఆలోచనతో గులాబి బాస్ కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగానే, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎంపీ కవితకు కీలక బాధ్యతలు అప్పగించారు. కూటమి జాబితా ప్రకటించాక టీఆర్‌ఎస్ మిగిలిన అ పన్నెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం.'ఎవరూ సీఎం అయినా అభ్యంతరం లేదు'

Updated By ManamFri, 11/09/2018 - 18:37

Janareddy, Congress, Telangana state, KCR, Chandrababu naiduహైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమ పార్టీ నుంచి ఎవరూ సీఎం అయినా తనకు అభ్యంతరం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి స్పష్టం చేశారు. మహాకూటమిలో పొత్తులపై పూర్తి స్పష్టత రాలేదన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జానా మాట్లాడుతూ.. బీసీలకు గతంలో ఇచ్చినట్టే సీట్లు కేటాయిస్తామని చెప్పారు. పొత్తుల్లో పరస్పర సహకారం అవసరమన్నారు. ఆయా పార్టీలకు కావాల్సిన సీట్లు వాళ్లు అడిగారని, కానీ మాకు కూడా ముఖ్యమైనవి ఉంటాయని జానా చెప్పారు.

మిగిలిన పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. రేపు (శనివారం) సాయంత్రానికి పూర్తి క్లారిటీ వస్తుందన్నారు. కేసీఆర్‌తో తమకు పోలిక లేదని జానా చెప్పారు. దేశం కోసం చంద్రబాబు కాంగ్రస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసారని ఈ సందర్భంగా జానా చెప్పుకొచ్చారు. గతంలోనూ ఆయన అవసరం కోసం కేసీఆర్‌తో చంద్రబాబు కలిసారని జానా గుర్తు చేశారు. కుటుంబంలో ఒకే సీటు ఇవ్వాలనే నిబంధన ఉందని, సందర్భాన్ని బట్టి మారుతుందని జానా చెప్పారు. కేసీఆర్‌ను ఓడించి ప్రజలే రికార్డు బ్రేక్‌ చేస్తారన్నారు. ఎన్టీఆర్‌ కంటే కేసీఆర్‌ గొప్పేమీకాదని తెలిపారు. కేసీఆర్‌ అప్పులు చేసి అభివృద్ధి అంటున్నారని మండిపడ్డారు. నిర్ణయాలు ఆలస్యమైనా గెలుపు మాత్రం తమదేనని జానారెడ్డి ధీమా వ్యక్తంచేశారు. గవర్నర్‌తో సీఎం భేటీ

Updated By ManamTue, 11/06/2018 - 06:39
  • దేశ,రాష్ట్ర తాజా రాజకీయాలపై చర్చ

  •  కూటమి యత్నాలపైనా సంభాషణ

  • 2 గంటలకు పైగా కొనసాగిన మీటింగు  నేడు టీఆర్‌ఎస్ మేనిఫెస్టో

  • 12 మంది జాబితా విడుదల!

kcrహైదరాబాద్: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమ వారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈ ఎస్ ఎల్ నరసింహన్‌తో భేటీ ఆయ్యారు. వివిధఅంశాలపైన దాదాపు రెండు గంటలకు పైగా చర్చించారు. నరసింహన్‌కు జన్మదిన,  దీపావళి శుభాకాంక్షలు తెలియచేశారు. హైకోర్టు విభజనపై సుప్రీంకోర్డు జారీ చేసిన తాజా ఉత్తర్వులపై చర్చ జరిగినట్లు తెలిసింది. టీఆర్‌ఎస్ మేనిఫెస్టో     కూడా చర్చకు వచ్చిందంటున్నారు. షబ్బీర్ అలీ, రేవంత్‌రెడ్డి వ్యవహరం  చర్చకు వచ్చనట్లు తెలిసింది. సీఎం కేసీఆర్ గవర్నర్‌ను కలవడంలో ప్రత్యేకత అంటూ ఏమీ లేదని, పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేయడానికి మాత్రమే మర్యాదపూర్వకంగా కలుసుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. గవర్నర్‌తో కేసీఆర్ భేటీ సందర్భంగా తెలంగాణలో ఎన్నికల సందడి, దేశ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకుం టున్న రాజకీయ నిర్ణయాలు చర్చకు వచ్చనట్లు తెలిసింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి దారి తీసిన పరిస్దితులు, ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడి సీట్ల కోసం పాటుపడుతున్న తీరు, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అభ్యర్దుల ప్రచారం గురించి కూడా సీఎం కేసీఆర్ ప్రస్ధావించినట్లు తెలిసింది. ఎన్నికల గడువు సమీపిస్తుండడంతో రాష్ట్రంలో రాజకీయ వేడి క్రమంగా పెరుగుతోన్న నేపథ్యంలో గవర్నర్‌తో ముఖ్యమంత్రి భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. గత కొంత కాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. అభ్యర్దులను ఎన్నికల బరిలోకి దింపడంతో పాటు వారి ప్రచార సరళిని నిశితంగా పరిశీలిస్తున్నారు. హైకోర్డు విభజన అంశంపై సుప్రీంకోర్డు తీసుకున్న నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇదే అంశంపై గవర్నర్‌తో చర్చించడంతో పాటు ఆయన చేసిన కృషికి ధన్యవాదాలు తెలియచేసినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా టీఆర్‌ఎస్ అధినేత, ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం పార్టీ పూర్తి స్దాయి మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉంది. మిగిలిపోయిన 12 నియోజకవర్గాల అభ్యర్ధుల పేర్లు కూడా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. శనివారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో సీఎం సమావేశం ఉంటుందనే సమాచారంతో తెలంగాణ భవన్ వర్గాలు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మేనిఫెస్టో కమిటీ సమావేశంతో పాటుగా దీపావళి పర్వదినం పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు మేనిఫెస్టో పేరుతో తీపి కబురు అందించబోతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రజాకర్షక పథకాల ఆవిష్కరణ గొప్పగా ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ వ్యూహం గురించి కూడా గవర్నర్‌తో చర్చించినట్లు తెలిసింది. టీఆర్‌ఎస్ 105 మంది అభ్యర్ధులను ప్రకటించిన నాటి పరిస్ధితులు ఇప్పుడు లేవని, గ్రాఫ్ పడిపోతుందని, సిట్టింగ్‌లపై సర్వత్రా నిరసనలు వ్యక్తం కావడంతోపాటు ప్రతిపక్షాలన్ని కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగుతున్నందున ప్రజాకర్షక హామీలు అనివార్యం అని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గత వారం పది రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక విధాలుగా ప్రజాభిప్రాయం సేకరించడంతోపాటు ప్రజలు ఏమి ఆశిసు ్తన్నారనే కోణంలో అన్వేషణ జరిపించారని కూడా తెలియ చేశారు. ప్రజల నాడిని పసిగట్టడంలో దిట్టగా పేరొందిన కేసీఆర్ మేనిఫెస్టో తయారీలో కూడా తనదైన ముద్రపడే విధంగా చర్యలు తీసుకున్నారని తెలిసింది.గవర్నర్‌తో కేసీఆర్ సమావేశం

Updated By ManamMon, 11/05/2018 - 16:13
kcr meets governor at raj bhavan

హైదరాబాద్ : తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో ఈ సమావేశం జరిగింది. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఢిల్లీ వెళ్లివచ్చిన విషయం తెలిసిందే. ఆ పర్యటన అనంతరం గవర్నర్‌తో సీఎం భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.'కరెంట్ చార్జీలు తగ్గిస్తాం.. మెగా డీఎస్సీ'

Updated By ManamSat, 11/03/2018 - 18:21

Power, power project, Uttam Kumar Reddy, KCR, TRS, TPCC chiefనల్గొండ: కేసీఆర్ పాలనలో విద్యాసంస్థలకు ఎన్నో అవమానాలు జరిగాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తనిఖీల పేరుతో విద్యాసంస్థలపై దాడులు చేశారని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే విద్యాసంస్థలకు కరెంట్ చార్జీలు తగ్గిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని తెలిపారు. మెగా డీఎస్సీ ద్వారా 20వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. మళ్లీ కేసీఆర్ సీఎం కావాలి: పోసాని

Updated By ManamSat, 11/03/2018 - 16:57

KCR, telangana CM, Posani Krishnamurali, TRS leader Maganti Gopinath, Election campaignహైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర కలలు సాకారం కావాలంటే మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావాలని ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి ఆకాంక్షించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ జూబ్లిహిల్స్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ శనివారం ఎల్లారెడ్డి గూడలోని పోసాని నివాసానికి వెళ్లారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని పోసానిని మాగంటి అభ్యర్థించారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ.. అనతి కాలంలోనే రాష్ర్టాన్ని ప్రగతి పథంలోకి నడిపించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

తెలంగాణలోని ఆంధ్రులంతా టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని కోరారు. తెలంగాణ వాసులను మళ్లీ మోసం చేసేందుకే చంద్రబాబు వస్తున్నారని విమర్శించారు. వ్యవస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. టీజేఎస్ అధినేత కోదండరాం అంటే తనకు ఎంతో గౌరవమని పోసాని చెప్పారు. ఆధారాలతో కోదండారం విమర్శలు చేస్తే బాగుంటుందని పోసాని అభిప్రాయపడ్డారు. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Updated By ManamFri, 11/02/2018 - 20:23

Komati Reddy Venkata Reddy, TRS, KCR, Congress partyహైదరాబాద్: టీఆర్ఎస్ తనను చంపాలని ప్రయత్నిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అనుచరులను హతమార్చి, తరువాత తనను చంపేందుకు కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. గడపగడపకు ప్రచార కార్యక్రమంలో భాగంగా నల్గొండలోని 13వ వార్డులో శుక్రవారం ఆయన ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కేసీఆర్ చెప్పిన బంగారు తెలంగాణ వారి కుటుంబానికే పరిమితమైందని విమర్శించారు. ఎవరి బతుకులను వారే మార్చుకోవాలని ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఓడించాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. 'టీఆర్ఎస్ సంక్షేమం.. మహాకూటమి సంక్షోభం'

Updated By ManamThu, 11/01/2018 - 18:40

Harish Rao, Congress, TDP, Gajwel meeting, KCRసిద్దిపేట: గజ్వేల్‌లో సభ ద్వారా కురుమల సత్తా ఏందో రాష్ట్రం మొత్తానికి తెలియజేశారని మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం గజ్వేల్‌లో కుర్మల ఆత్మీయ ఆశీర్వాద సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ పార్టీ అంటే సంక్షేమం.. మహాకూటమి అంటే సంక్షోభమన్నారు. సంక్షేమం కావాలా.. సంక్షోభం కావాలా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మొట్ట మొదటి మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్పనగేష్ కురుమగా హరీశ్ కొనియాడారు. ఈరోజు అభివృద్ధికి అవకాశ వాదానికి మధ్య పోరాటం జరుగుతుందన్నారు. కల్యాణ లక్ష్మీ దెబ్బకు కురుమలు 18 సంవత్సరాల వయస్సు పిల్లలకు పెళ్లిళ్లు జరుగుతున్నాయని చెప్పారు. సంక్షేమ రాజ్యాన్ని కేసీఆర్ అందించుండని, అభివృద్ధి కావాలా సంక్షోభం కావాలా మీరే ఆలోచించండని హితవు పలికారు. 

ఈ తెలంగాణ మీద కేసీఆర్‌కి ప్రేమ ఉంటాదా చంద్రబాబు నాయుడు‌కి ప్రేమ ఉంటదో ఆలోచించండని అన్నారు. కర్ణాటక కాంగ్రెస్ మంత్రి రేవన్నాకు మా అభివృద్ధి కనిపిస్తుంది కానీ  మా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కళ్ళు కనిపించడం లేదని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో కురుమలకు 5 ఎకరాల భూమిని 5 కోట్ల రూపాయలు కేసీఆర్ ఇచ్చిండని గుర్తు చేశారు. ఇంత మంది సభకు తరలి వచ్చి కేసీఆర్‌ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా సంతోషమన్నారు. ఈడ ఇద్దరు తోడు దొంగలు మోపాయ్యాయని ఎద్దేవా చేశారు. రాత్రి రాత్రి వచ్చి డోర్లు కొడుతున్నారని విమర్శించారు. పొద్దున పూట వచ్చి తిరిగే మొఖం లేక తోడు దొంగళ్ల రాత్రి పూట ప్రచారం తిరుగుతూన్నారని మండిపడ్డారు. ఈరోజు మన ప్రాంతంలో కడుతున్న రిజర్వాయరికి మలన్న సాగర్ అని పేరు పెట్టుకున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు పార్టీ కట్టుబడి ఉంది...

Updated By ManamWed, 10/31/2018 - 16:48
TRS Leader Kishan Rao Fires on mahakutami Leaders

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ ఆగ్రోస్ చైర్మన్ కిషన్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన బుధవారం తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ....‘కాంగ్రెస్, మాయ కూటమి నాయకులు కేసీఆర్, కేటీఆర్‌లను ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. హైదరాబాద్‌లో నివసిస్తున్న అందరికీ భద్రత, భవిష్యత్ ఇచ్చే నాయకత్వం మా కేసీఆర్ సొంతం. నిజాంపేటలో కేటీఆర్ మాట్లాడిన మాటలకు మా పార్టీ కట్టుబడి ఉంది. కేటీఆర్ వ్యాఖ్యలపై లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ స్పందించి, అభినందించారు. దాసోజు శ్రవణ్‌కు కేసీఆర్, కేటీఆర్‌ను విమర్శించే హక్కులేదు. 

హైదరాబాద్ అన్ని కులాలు, మతాలకు నిలయం. శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలగలేదు. తెలంగాణ రాష్ట్ర దోపిడీకి పాల్పడిన ఆంధ్రా వలసవాదులపైనే మా కోపం. కుర్చీల కోసం కుస్తీ పట్టిన చరిత్ర కాంగ్రెస్‌ది. మత కల్లోలాలు సృష్టించి లబ్ధి పొందాలని చూసే పార్టీ కాంగ్రెస్. ఆ పార్టీ హయాంలో నాలాలు, చెరువులను ధ్వంసం చేశారు. తెలంగాణలో నివసించే అందరూ తెలంగాణ బిడ్డలే. చంద్రబాబు మరోసారి ఒక అక్రమ ప్రాజెక్టు నిర్మాణానికి తెర లేపారు. చంద్రబాబు తొత్తు రేవంత్ రెడ్డి. మహాకూటమితో జట్టు కట్టడానికి కాంగ్రెస్‌కు సిగ్గుండాలి.

దొంగల కూటమి, మాయా కూటమి మాటలు నమ్మొద్దని ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నా.  దాసోజు శ్రావణ్, విజయశాంతి తీరును ఖండిస్తున్నాం. కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నా. సిరిసిల్ల నేరెళ్ల బాధితులు కేటీఆర్ వెంటే ఉంటామని చెప్పారు. ప్రతిపక్ష నాయకులే తమను పక్కదారి పట్టించారని చెప్పారు. కాంగ్రెస్ ఇంతకాలం నేరెళ్లపై మాట్లాడింది దొంగమాటలే అని తేలిపోయింది’ అని అన్నారు.ఢిల్లీ పర్యటన ముగిసింది

Updated By ManamTue, 10/30/2018 - 06:46
  • నగరానికి చేరుకున్న కేసీఆర్

  • బీజేపీ పెద్దలతో హస్తినలో మంతనాలు?

  • విమానాశ్రయంలో అమిత్‌షాతో భేటీ!

KCRహైదరాబాద్: ఢిల్లీ పర్యటన ముగించు కొని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం రాత్రి నగ రానికి చేరుకున్నారు. ఆదివారం మధ్యా హ్నం ముఖ్యమంత్రి కంటి, పంటి పరీక్ష కోసం ఢిల్లీకి వెళ్లారు. సోమవారం ఉదయం ఢిల్లీ వైద్యులు పరీక్షలు నిర్వహించారు.  కేసీఆర్ నవంబర్ తొలి వారంలో రెండో విడత ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనబోతున్నారు. ఇప్ప టికే నల్లగొండ, నిజామాబాద్, వనపర్తి బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు. నవంబర్ తొలి వారంలో ఖమ్మం, వరంగల్, కరీంనగర్ ఎన్నికల బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొనవలసి ఉంది. ఈ మేరకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సభా ఏర్పాట్లు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటించవలసి ఉన్నందున వైద్యుల సలహా మేరకు కంటి, పంటి పరీక్షలు జరిపించుకోవడానికి ఢిల్లీ వెళ్లారని పార్టీ వర్గాలు తెలియచేశారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో బీజేపీ ప్రముఖులతో రహస్య మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది.  తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో  కొంత మంది పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవడానికి బీజేపీ నాయకత్వం కేసీఆర్ సహాయం కోరినట్లు, దానికి ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. బీజేపీ యువమోర్చాసభకు వచ్చిన అమిత్‌షాను ముఖ్యమంత్రి కేసీఆర్ బేగంపేట విమానాశ్రయంలో అత్యంత రహస్యంగా కలిశాడంటున్నారు. ఇద్దరూ వేర్వేరుగా ప్రత్యేక విమానాల్లో బయలుదేరడానికి బేగంపేట విమానాశ్రయానికి రావడంతో కలుసుకొనే అవకాశం ఏర్పడిందనే ప్రచారం జరుగుతుంది. మజ్లిస్ సీట్ల విషయంలో జోక్యం చేసుకోవడం లేదని పరోక్షంగా సంకేతాలు ఇచ్చిన కేసీఆర్ సహకారంతోనే కొన్ని స్దానాల్లో బీజేపీ అభ్యర్ధులను గెలిపించుకొనే విధంగా బీజేపీ పెద్దలు మంతనాలు జరిపినట్లు తెలిసింది.

Related News