Bus Accident

అదుపు తప్పిన బస్సు.. ఒకరి మృతి

Updated By ManamWed, 09/19/2018 - 09:23

Bus Accidentసూర్యాపేట్: హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు మునగాల వద్ద అదుపు తప్పి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా.. మరో 30మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందరూ ఘాడ నిద్రలో ఉండగా.. ఒక్కసారిగా బస్సు బోల్తా కొట్టడంతో ప్రయాణికులంతా ఉలిక్కిపడ్డారు. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.అదుపుతప్పిన బస్సు.. 20మందికి గాయాలు

Updated By ManamSun, 09/16/2018 - 12:23
  • ప్రాణాపాయం తప్పిందంతే!.. అదే నిర్లక్ష ్యం.. అంతే ఘోరం..

  • 50 సీట్ల బస్సులో 107 మంది ప్రయాణం

  • ప్రయాణికుల భారానికి విరిగిన ఇరుసు.. ఊడిన టైర్లు..

  • అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు

  • 12 మందికి తీవ్ర గాయాలు.. నాగర్‌కర్నూల్ జిల్లా వట్టెం వద్ద ఘటన

imageనాగర్‌కర్నూల్: డొక్కు బస్సులో వంద మందిని ఎక్కించి 60 మందిని పొట్టనపెట్టుకున్నా ఆర్టీసీ తీరుమారలేదు. కొండగట్టు ఘాట్ రోడ్డు ఘటన మరువక ముందే అచ్చు అలాంటిదే ఆదివారం మరో ప్రమాదం చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో డ్రైవర్ అప్రమత్తతో పెను ముప్పు తప్పింది. యాదగిరి గుట్ట ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు (ఎపి24జడ్0037) హైదరాబాద్  నుంచి వనపర్తి వెళ్తోంది. బిజినపల్లి మండలం వట్టెం గ్రామ సమీపంలోకి రాగానే స్టీరింగ్ గుండి ఊడిపోయింది(స్టీరింగుకు టైర్లకు సంబంధం తెగిపోయింది). వెంటనే డ్రైవర్ అప్రమత్తమై బ్రేకు వేసి బస్సును ఆపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బస్సు ఇరుసు విరిగి, ముందరి టైర్లు ఊడిపోయి పక్కన పొలాల్లోకి దూసుకెళ్లింది.

వీఆర్వో అభ్యర్థులతో కిక్కిరిసిన బస్సు
యాభై సీట్ల బస్సులో వంద మందిని ఎక్కించడంతో, ఒకరిపై ఒకరు పడి ఊపిరాడకే ఘాట్ రోడ్డు ఘటనలో ఎక్కువimage మంది మరణించారు. అయినప్పటికీ ఆర్టీసీ అధికారుల తీరు మారలేదు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించొద్దని కండక్లర్లు, డ్రైవర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయలేదు. ఆక్యుపెన్సీ ఒత్తిడి ఉండడంతో 50 సీట్ల బస్సులో కండక్టర్లు 100 మందిని ఎక్కిస్తున్నారు. తాజాగా ప్రమాదానికి గురైన బస్సులోని ప్రయాణికుల సంఖ్య ఇదే స్పష్టంజేస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 107 మంది ఉన్నారు. వీఆర్వో పరీక్షకు వెళ్తున్న అభ్యర్థులతో కిక్కిరిసిపోయింది. బస్సు టాప్‌పైన 20 మందిని కూర్చోబెట్టారు. బస్సు ఒక్కసారిగా కుదుపులకు గురవడంతో వీరిలో సగానికిపైగా కిందపడిపోయారు. 12 మంది తీవ్రగాయాలపాలయ్యారు. పరిస్థితి విషమంగా ఉన్న ఆరుగురిని హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో బస్సులో కిక్కిరిసిన ప్రయాణికులు ఒకరిపైఒకరు పడి ఊపిరాడక ఉక్కిరి బిక్కిరయ్యారు. బస్సు పల్టీలు కొట్టకుండా నిలిచి ఉండడంతో వారంతా నిమిషాల వ్యవధిలో తేరుకుని స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను  నాగర్‌కర్నూల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బస్సు పల్టీలు కొట్టుంటే మరో కొండగట్టు ప్రమాదమయ్యేదని స్థానికులు ఆందోళన వ్యక్తంచేశారు. ప్రమాద కారణంగా కొంతమంది వీఆర్వో అభ్యర్థులు పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోవడం గమనార్హం.

అధిక బరువే కారణం!
సరైన సమయంలో బ్రేక్‌లు వే యడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు పేర్కొన్నారు. బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు  ఉండడంతో ఇరుసుపై భారం ఎక్కువై అది ప్రమాదానికి దారి తీసి ఉండవచ్చునని భావిస్తున్నారు. క్షణాల వ్యవధిలోనే బస్సు రోడ్డు దిగి పొలాల్లోకి దూసుకెళ్లి ఆగిపోయింది. ఆ సయమంలో బస్సు వేగం తక్కువగానే (గంటకు 30-40 కిలోమీటర్లు) ఉన్నదని స్థానికులు తెలిపారు. ప్రమాద సమాచారం తెలియగానే వట్టెం గ్రామ ప్రజలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నాగర్‌కర్నూలు నుంచి పది నిమిషాల్లో అంబులెన్స్ చేరుకుంది.

ఘటనపై మంత్రి ఆరా
బస్సు ప్రమాద ఘటనపై ఆపద్ధర్మ మంత్రి మహేందర్‌రెడ్డి ఆరాతీశారు. ఆర్టీసీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుకుల మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.  ప్రభుత్వాస్పత్రిలో క్షతగాత్రులను జిల్లా కలెక్టర్  శ్రీధర్, ఎస్పీ సాయిశేఖర్, మాజీ ఎమ్మేల్యే మర్రి జనార్థన్‌రెడ్డి, టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జక్కా రఘునందన్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగం జనార్థన్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి గాయపడిన వారిని పరామర్శించారు.  

ప్రమాదంలో గాయపడినవారు
కటకల కృష్ణ  (ఎల్జాల)
నల్లారి మధు (ఆమన్‌గల్)
జక్కా నాగమల్లయ్య(ఆలేరు)
భూపాల్ (షాబాద్)
జరుపుల రాంచందర్ (బాల్‌నగర్)
యం.ప్రబాకరాచారి (కొల్లూరు)
కోట్ల రాజశేఖర్ (నల్ల చెరువు)
శివకుమార్ (ఆలేరు)
పల్లె నర్సింహులు(పెద్ద నర్వల్)
రాజు (బాల్‌నగర్)
అనిల్ (కొడంగల్)జమ్ము కశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. 11మంది మృతి

Updated By ManamFri, 09/14/2018 - 11:55

Road Accidentశ్రీనగర్/జమ్ము: జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కిష్టవర్ జిల్లాలోని థాక్రియా దగ్గర ప్రయాణికులతో వెళుతున్న బస్సు జారి లోయలోకి పడటంతో పదకొండు మంది అక్కడికక్కడే మరణించారు. మరో పదిహేను మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సామర్థ్యానికి మించి బస్సులో ప్రయాణికులు ఉండటం వలనే ఈ ప్రమాదం జరిగినట్లు ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ చెప్పారు. కేసును నమోదు చేసుకున్నామని, దర్యాప్తును చేపట్టామని అన్నారు. కాగా ఇటీవల తెలంగాణలో ఇదే తరహాలో జరిగిన కొండగట్టు రోడ్డు ప్రమాదంలో 60మంది మృతి చెందగా.. పలువురు గాయాలపాలైన విషయం తెలిసిందే.ఇది మాటలకందని ప్రమాదం..

Updated By ManamTue, 09/11/2018 - 18:32

PM Narendra modi, Kondagattu, Bus accident, shocking beyond words న్యూఢిల్లీ: తెలంగాణలో జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద మంగళవారం జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఇంత భారీ సంఖ్యలో ప్రజలు చనిపోవడం తననెంతో బాధ కలిగిస్తోందని అన్నారు. ఇది మాటలకందని ప్రమాదమని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. ఆర్టీసీ చరిత్రలోనే పెద్దప్రమాదమైన ఈ ఘటనపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాల్సిందిగా డిమాండ్ చేశారు. 

ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ రవాణా శాఖ మంత్రి, టీఎస్ఆర్టీసీ అధికారులను వెంటనే తొలగించాల్సిందిగా డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఆర్టీసీ తరపున 3 లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించినట్టు మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల బస్సు డిపో హనుమంతురావును సస్పెండ్ వేటు పడింది. కాగా, కొండగట్టు ఘాట్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు బోల్తాపడిన ఘటనలో 50మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

Updated By ManamSat, 09/01/2018 - 09:07
Tamilnadu bus accident:eight killed

చెన్నై : తమిళనాడులోని సేలం సమీపంలోని మామందూరు వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు  ఢీకొన్న దుర్ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందగా, మరో 30మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి .. సేలం నుంచి ధర్మపురికి ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు ..... బెంగళూరు నుంచి సేలం వెళుతున్న బస్సును ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కికక్కడే మరణించగా, మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. కాగా క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. మృతుల్లో నలుగురు కేరళ, ముగ్గురు కర్ణాటక, ఒకరు తమిళనాడుకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. కాగా మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మరోవైపు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.డివైడర్‌ను ఢీకొట్టిన బస్సు.. 25మందికి గాయాలు

Updated By ManamTue, 08/07/2018 - 10:32

accidentజగ్గయ్యపేట: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప‍్పిన ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ వెంటనే సదరు ట్రావెల్స్‌ బస్సును మరో రెండు బస్సులు వెనుకనుంచి ఢీకొట్టాయి. ఈ ఘటనలో డ్రైవర్‌ మృతి చెందగా, 25 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను విజయవాడ, జగ్గయ్యపేట ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

మరోవైపు ఘటనపై ఎంపీ కేశినేని నాని ఆరా తీశారు. క్షత గాత్రులకు వెంటనే మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను అదేశించారు. తీవ్ర గాయాలైన వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చికిత్స నిర్వహించాలని నందిగామ డీస్పీ, విజయవాడ, జగ్గయ్యపేట ఆసుపత్రుల సూపెరింటెండలను, అధికారులకు సూచించారు.లోయలో పడ్డ బస్సు, 10మంది మృతి

Updated By ManamThu, 07/19/2018 - 11:34

bus accident సిమ్లా: ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్- గంగోత్రి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది. సుమారు 250మీటర్ల లోతులో ఈ బస్సు పడ్డట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 10మంది మృతి చెందగా, తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 25మంది ఉన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని హాస్పిటల్‌కు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్లను రప్పించింది. మరణించివారి కుటుంబసభ్యులకు 2లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. గాయపడ్డ వారికి 50వేలు ఇవ్వనున్నారు. ఘటనా స్థలానికి చేసుకున్న పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.లోయలో పడ్డ బస్సు.. ఏడుగురి మృతి

Updated By ManamFri, 06/01/2018 - 11:24

Shimlaసిమ్లా: హిమాచల్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 33మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు చైలా వద్ద లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా, 26మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తును చేస్తున్నామని స్థానిక ఎస్పీ ఒమాపతి జమ్వాల్ వెల్లడించారు.

 బిహార్ బస్సు ప్రమాదంలో కొత్త ట్విస్ట్..!

Updated By ManamFri, 05/04/2018 - 15:56

death toll went, two dozens to zero, bus accident, non story of a busపట్నా: బిహార్‌ రోడ్డుప్రమాద ఘటనలో ఓ కొత్త ట్విస్ట్ బయటపడింది. మోతిహరి ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు ఏసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడి మంటలు వ్యాపించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 27 మంది ప్రయాణికులు మంటల్లో సజీవదహనమైయ్యారంటూ అధికారులు ప్రకటించారు. అయితే బస్సు ప్రమాదం జరిగిన మాట వాస్తవమే గానీ, ఘటనలో ఎవరూ చనిపోలేదట. బిహార్ మంత్రి దినేశ్ చంద్ర యాదవ్ శుక్రవారం బస్సు ప్రమాదంలో ఎవరూ చనిపోలేదని వెల్లడించారు. ఇదిలా ఉండగా, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో కేవలం 13 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు, ఒక కండక్టర్, క్లీనర్ మాత్రమే ఉన్నట్టు తోటి ప్రయాణికులు చెబుతున్నారు. మొత్తం 42 మంది ప్రయాణికులు టికెట్లు బుక్‌ చేసుకోన్నారని, వీరిలో 13 మంది మాత్రమే ముజఫర్‌పూర్‌లో ఎక్కగా, మరో 27 మంది ప్రయాణికులు గోపాల్ గంజ్‌లో ఎక్కాల్సి ఉందని తెలిపారు.

ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడగా, స్థానికుల సహాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గురువారం జరిగిన ప్రమాద ఘటనపై స్పందించిన బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌, ప్రధాని నరేంద్ర మోదీ కూడా మృతుల పట్ల సంతాపాన్ని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు. కానీ, ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ ఒక్క మృతదేహం కూడా లభ్యం కాలేదు. బస్సు ప్రమాద ఘటనపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ మృతుల కుటుంబీకులకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించడం గమనార్హం.
death toll went, two dozens to zero, bus accident, non story of a busఘోర బస్సు ప్రమాదం.. ఇద్దరు మృతి

Updated By ManamFri, 04/13/2018 - 16:02
  • మరో 34 మందికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

Bus accident, Two passangers, Bhavanpatnam ఒడిశా: ఒడిశాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కలహండి జిల్లా భవానీపట్నం వద్ద శుక్రవారం నది వంతెన పైనుంచి బస్సు అదుపు తప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో 34 మందికి గాయాలయ్యాయి. 55 మంది ప్రయాణికులతో భువనేశ్వర్ నుంచి భవానీపట్నం వెళ్తుండగా బస్సుకు ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని స్థానికుల సాయంతో ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Related News