Bus Accident

కువైట్‌లో ఘోరం, ఏడుగురు భారతీయులు దుర్మరణం

Updated By ManamMon, 04/02/2018 - 08:24

Kuwait కువైట్‌లో ఘోరం జరిగింది. ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భారతీయులు దుర్మరణం చెందారు. బుర్గాన్ చమురు క్షేత్రం సమీపంలో అల్-అర్టల్ రోడ్డుపై రెండు బస్సులు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు కువైట్ ఫైర్ సర్వీస్ డైరక్టరేట్(కేఎఫ్‌ఎస్‌డీ) తెలిపింది. ఈ ఘటనలో మొత్తం 15మంది మరణించారని అధికారులు తెలిపారు. అందులో ఐదుగురు ఈజిప్షియన్లు, ముగ్గురు పాకిస్థానీలు ఉన్నారని పేర్కొన్నారు. మరికొందరికీ గాయాలు అయినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులు దగ్గర్లోని ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.



ట్రావెల్ బస్సు బోల్తా.. వైజాగ్‌లో రోడ్డు ప్రమాదం

Updated By ManamWed, 02/21/2018 - 07:27

Busవిశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎన్ఏడీ జంక్షన్‌లో వెళ్తున్న ట్రావెల్ బస్సు రోడ్డు దాటుతున్న లారీని ఢీ కొట్టి, బోల్తా కొట్టింది. ఆ బస్సులో 50మంది ప్రయాణికులు ఉండగా.. వారందరికీ గాయాలయ్యాయి. వారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 



ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ బస్సు బోల్తా

Updated By ManamThu, 01/25/2018 - 09:24

Srs Travels కర్నూలు: జిల్లాలో ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. జిల్లాలోని వెల్దుర్తి మండలం అల్లుగుండు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వస్తున్న ఈ బస్సు మలుపు వద్ద వేగంగా వెళ్లడంతో ప్రమాదం సంభవించిందని తెలుస్తోంది. ఈ ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. అత్యవసర చికిత్స కోసం క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. 

స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ మద్యం సేవించి బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.



రాజస్థాన్ బస్సు ప్రమాదం: 32కు పెరిగిన మృతులు

Updated By ManamSat, 12/23/2017 - 13:22

bus accidentజైపూర్: రాజస్థాన్లోని సెవాయ్ మాదోపూర్‌లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 32కు చేరగా.. వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. మరోవైపు ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి కార్యాలయం స్పందించింది. ఈ సందర్భంగా మృతి చెందిన కుటుంబాలను సానూభూతిని ప్రకటించారు ప్రధాని నరేంద్రమోదీ.



నదిలో పడ్డ బస్సు.. 12మంది మృతి

Updated By ManamSat, 12/23/2017 - 09:36

Rajasthanజైపూర్: రాజస్థాన్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు దుబీలోని సవాయి మాదోపూర్ వంతెన వద్ద అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 12మంది అక్కడికక్కడే మరణించగా, 24మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు సహాయకచర్యలను చేపట్టారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.





Related News