medaram jathara

వైభవోపేతంగా మేడారం జాతర

Updated By ManamFri, 02/02/2018 - 11:16

Medaram Jatharaతెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి గాంచిన మేడారం మహాజాతర వైభవోపేతంగా సాగుతున్నాయి. జనజాతరలో మూడో రోజైన శుక్రవారం వనదేవతల దర్శనం కోసం వేల సంఖ్యలో కిలో మీటర్ల పొడవున భక్తులు బారులు తీరారు. బుధవారం సాయంత్రం సారలమ్మ గద్దెల మీదకు చేరుకోగా...గురువారం సమ్మక్క కూడా గద్దెల మీదకు చేరుకోవడంతో జాతరలో ప్రధాన ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. గద్దెల మీద నుంచి సమ్మక్క, సారక్క భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు.  మేడారం గద్దెలు జనసంద్రంగా మారాయి. గద్దెల వద్ద బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. శుక్రవారం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సీఎం కేసీఆర్ మేడారంలో వనదేవతలను దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రేపు(శనివారం) వన దేవతలు వన ప్రవేశం చేయనున్నారు. అమ్మవార్ల వనప్రవేశంతో మేడారం జాతర ముగియనుంది. మేడారం జాతర ఏర్పాట్లపై సమీక్ష

Updated By ManamSat, 12/23/2017 - 16:10

kadiyam srihariహైదరాబాద్: మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఎంపీలు వచ్చే నెల 2న కేంద్ర గిరిజన శాఖ మంత్రిని కలిసి మేడారంను జాతీయ పండుగగా గుర్తించాలని కోరతారని స్పష్టంచేశారు. శనివారం ఆయన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర నిర్వహణ ఏర్పాట్లపై మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, చందూలాల్, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జాతర నిర్వహణ, సౌకర్యాలు, భక్తులకు కల్పిస్తున్న వసతులు తదితర అంశాలపై చర్చ జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కడియం సూచించారు. ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో జాతరను పర్యవేక్షించాలని పేర్కొన్నారు. 


సమీక్షా సమావేశం అనంతరం కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ మేడారం జాతరను గతంలో కంటే ఘనంగా నిర్వహిస్తామన్నారు. జాతరకు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు కోటి మందికిపైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మేడారం జాతర నిర్వహణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.80 కోట్లు కేటాయించారన్నారు. జనవరి 15 నాటికి జాతర పనులన్నీ పూర్తిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. జాతర పనుల్ని వీలైనంత వరకు స్థానికులకే అప్పగించాలన్నారు. జనవరి 18న మేడారంలో మరోమారు సమీక్షా సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. 

medaram jatharaకాగా వచ్చే ఏడాది జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు మేడారం జాతర జరుగునుంది. 31 వ తేదీ తొలిరోజు సారలమ్మను మేడారం గద్దెల వద్దకు తీసుకు వస్తారు. ఫిబ్రవరి 1 న రెండో రోజు సమ్మక్క దేవతను చిలుకలగుట్ట నుంచి గ‌ద్దెలపైకి తీసుకువస్తారు. ఫిబ్రవరి 2న భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. ఫిబ్రవరి 3న వనదేవతలు తిరిగి వనప్రవేశం చేస్తారు.  

మేడారం జాత‌ర రూట్ మ్యాప్ యాప్ ఆవిష్క‌ర‌ణ‌

స‌మ్మ‌క్క‌-సారాల‌మ్మ  జాత‌ర‌కు వ‌చ్చే భ‌క్తుల‌కు కోసం  "మేడారం గైడ్" అనే యాప్ ను ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీహ‌రి, దేవ‌దాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆవిష్క‌రించారు. మేడారం జాత‌ర‌కు వ‌చ్చే భ‌క్తులకు రూట్ మ్యాప్ యాప్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు.

Related News