sukumar

బుల్లితెరపైనా ‘రంగస్థలం’ రికార్డు

Updated By ManamThu, 10/25/2018 - 12:19

Rangasthalamమెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన చిత్రం ‘రంగస్థలం’. ఈ ఏడాది మార్చి చివర్లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించగా.. తాజాగా వెండితెరపైనా దూసుకుపోయింది. ఇటీవలే ‘రంగస్థలం’ మొదటి ప్రీమియర్ స్టార్ మాలో ప్రదర్శించబడగా.. 19.5టీఆర్పీ రేటింగ్‌ను సాధించింది. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు విడుదలైన సినిమాలలో మహానటి అత్యధిక టీఆర్పీని సాధించగా.. ఆ తరువాత రంగస్థలం నిలిచింది. దీంతో మెగాభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా రామ్ చరణ్, ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సమంత, అనసూయ తదితరులు కీలక పాత్రలలో నటించగా.. కేరళలో ఈ చిత్రాన్ని వచ్చే నెలలో విడుదల చేయనున్నారు.మహేశ్- సుక్కు మూవీపై ఆసక్తికర వార్త

Updated By ManamWed, 10/17/2018 - 15:54

Mahesh Babu, Sukumarప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ చిత్రంలో నటిస్తున్న మహేశ్ బాబు, ఆ తరువాత సుకుమార్ డైరక్షన్‌లో మరో చిత్రంలో నటించనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి స్ర్రిప్ట్ తయారుచేసే పనిలో సుకుమార్ ఉండగా.. ఈ మూవీ కథా నేపథ్యం గురించిన ఓ వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. 

అదేంటంటే పిరియాడిక్ కథా నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో జరిగే కథగా ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. రామ్ చరణ్‌తో ‘రంగస్థలం’ అనే పీరియాడిక్ డ్రామాను తెరకెక్కించిన సుకుమార్, ఆ చిత్రంతో పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు అదే ఊపుతోనే మహేశ్ కోసం కూడా ఓ పిరియాడిక్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.‘‘రంగమ్మా.. మంగమ్మా’’.. మరో రికార్డమ్మా

Updated By ManamMon, 09/17/2018 - 09:29

Rangamma Mangammaరామ్ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ‘రంగస్థలం’ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలోని ప్రతి విభాగం అందరినీ ఆకట్టుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఈ చిత్రంతో మరోసారి తన మ్యూజిక్ సత్తాను చాటాడు రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్. మొత్తం ఆరు పాటలు ఉండగా.. ప్రతి పాట అందరినీ మెప్పించేలా కంపోజ్ చేశాడు. కాగా ఈ చిత్రంలోని రంగమ్మా మంగమ్మా వీడియో పాట  ఇప్పుడు అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

ఈ ఏడాది ఏప్రిల్ 28న విడుదలైన ఈ పాట తాజాగా 100మిలియన్ వ్యూస్‌ను దాటేసింది. దీంతో 100మిలియన్లు సాధించిన రెండో తెలుగు పాటగా రంగమ్మా.. మంగమ్మా నిలిచింది. దేవీ శ్రీ మ్యూజిక్, మానసి వాయిస్‌కు తోడు సమంతల ఎక్స్‌ప్రెషన్స్ ఈ పాట ఇంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకునేలా చేసింది. కాగా బాహుబలిలోని సాహోరో బాహుబలి పాట తెలుగులో మొదటి 100మిలియన్ల వ్యూస్‌ను సాధించి, రికార్డు సృష్టించింది.బిత్తిరి సత్తి హీరోగా ‘తుపాకి రాముడు’

Updated By ManamSat, 09/15/2018 - 18:56
Bithiri Sathi

ప్రముఖ పాపులర్ యాంకర్, నటుడు బిత్తిరిసత్తి కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘తుపాకి రాముడు’. ‘బతుకమ్మ’ ఫేమ్, సీనియర్ దర్శకులు టి. ప్రభాకర్ దర్శకత్వంలో రసమయి ఫిల్మ్స్ పతాకంపై రసమయి బాలకిషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తి చేసుకుని, శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర మోషన్ పోస్టర్‌, ఫస్ట్ లుక్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. ‘‘బిత్తిరిసత్తిగా అందరికీ పరిచయమైన సత్తి.. ‘తుపాకి రాముడు’ చిత్రంలో మరో కోణంలో కనిపిస్తున్నారు. ఈ సినిమా సత్తికి మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే దర్శకుడు ప్రభాకర్‌గారు నాకు పరిచయమైన తొలి దర్శకుడు. సీనియర్ దర్శకుడైన ప్రభాకర్‌గారు ఈ చిత్రాన్ని ఎంతో వినోదాత్మకంగా తెరకెక్కించి ఉంటారని ఆశిస్తున్నాను. ఈ చిత్రం అందరికీ మంచి పేరు, సక్సెస్‌ని ఇవ్వాలని కోరుకుంటున్నాను..’’ అన్నారు.

చిత్ర దర్శకుడు టి. ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘‘యూనివర్శల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు పుష్కలంగా ఉంటాయి. బిత్తిరిసత్తిని ఈ చిత్రంలో వైవిధ్య కోణంలో చూపిస్తున్నాము. రసమయి బాలకిషన్‌గారు కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాకి సహకరించారు. పూర్తి వినోదాత్మకంగా ఉండబోతోన్న ఈ చిత్రం ప్రేక్షకులందరినీ తప్పకుండా ఎంటర్‌టైన్ చేస్తుంది..’’ అని అన్నారు.హీరోయిన్ అవ్వాలనుకుంటున్నారా..!

Updated By ManamWed, 09/05/2018 - 14:28

Casting Callమీరు తెలుగమ్మాయా..? హీరోయిన్ అవ్వాలనుకుంటున్నారా..? మీ వయసు 18-24మధ్య ఉందా..? అయితే ఈ అవకాశం మీ కోసమే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ హీరోయిన్ కోసం పిలుపునిచ్చింది. హీరోయిన్ అవ్వాలనుకుంటే మీ ఫొటో, డెమో రీల్స్, ఇంట్రో వీడియోలు [email protected]ి పంపండి. ఇక ఈ చిత్రానికి టాప్ దర్శకుడు సుకుమార్ కథను అందిస్తుండగా.. ఆయన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన బుచ్చిబాబు సన దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇంకెందుకు ఆలస్యం హీరోయిన్ కావాలనుకునే వారు తొందరగా ఈ అవకాశాన్ని ట్రై చేసుకోండి.‘బాహుబలి’ రచయితకు బంపర్ ఆఫర్

Updated By ManamThu, 07/26/2018 - 14:42

Vijayendra Prasad‘బాహుబలి’, ‘భజరంగీ భాయిజాన్’, ‘మెర్సల్’ వంటి హిట్ చిత్రాలకు కథను అందించిన రచయిత విజయేంద్రప్రసాద్ బంపర్‌ ఆఫర్ సొంతం చేసుకున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్‌తో ఆయన చేతులు కలిపారు. ఈరోస్‌తో కలిసి ఆయన తెలుగు, తమిళ్, హిందీలో పలు సినిమాలు, వెబ్ సిరీస్‌కు కథలను అందించడంతో పాటు సినిమాలను నిర్మించి, పంపిణీదారుగా కూడా పని చేయనున్నారు. కాగా ఇప్పటికే విజయేంద్రప్రసాద్ దగ్గర పది కథలు సిద్ధంగా ఉన్నాయి. అందులో ఒకటి సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ కాగా.. మరొకటి కంచు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ బైలింగ్వల్ చిత్రం. మొత్తానికి ‘జిగేలు రాణి’కి న్యాయం జరిగింది

Updated By ManamSat, 07/21/2018 - 12:02

jigelu Rani ఈ ఏడాది ఘన విజయం సాధించిన రంగస్థలంలోని ‘జిగేలు రాణి’ అనే పాటను పాడినందుకు గానూ తనకు ఒక్క రూపాయి కూడా ముట్టలేదని ఆ పాటను ఆలపించిన వెంకటలక్ష్మి ఇటీవల ఓ చానెల్‌తో తన గోడును చెప్పుకుంది. ఇది కాస్త వైరల్‌గా మారి దర్శకుడి వరకు వెళ్లడంతో.. ఈ వివాదంపై సుకుమార్ స్పందించారు. ఈ పాట  పాడినందుకు గానూ ఆమెకు లక్ష రూపాయల చెక్‌ను సుకుమార్ పంపించారు. రంగస్థలం 100 రోజుల వేడుకకు ఆమెను పిలిచేందుకు ప్రయత్నించామని, అయితే ఫోన్ నంబర్ అందుబాటులో లేకపోవడంతో కుదరలేదని ఈ సందర్భంగా సుకుమార్ అన్నారు.

అయితే చిన్నప్పటి నుంచి బుర్రకథలు చెప్పుకునే వెంకటలక్ష్మికి ‘రంగస్థలం’లో పాడే అవకాశం వచ్చింది. నాగభూషణం అనే మధ్యవర్తి వలన చెన్నై వెళ్లిన ఆమె రెండు రోజులు అక్కడే ఉండి పాటను పాడి వచ్చింది. అప్పటి నుంచి ఇంతవరకు తనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఇటీవలే తన గోడును ఓ చానెల్‌కు చెప్పుకుంది వెంకటలక్ష్మి. దీనిపై చిత్ర యూనిట్‌ను స్పందించాలని చాలా సార్లు ప్రయత్నించినప్పటికీ మధ్యవర్తి తనకు మోసం చేశాడని వెంకటలక్ష్మి తెలిపిన విషయం తెలిసిందే.చెర్రీ.. నీ నుంచి దూరమవుతానని భయంగా ఉంది

Updated By ManamMon, 07/09/2018 - 09:02

Ram Charan, Sukumar‘‘చెర్రీ నీతో మరో చిత్రం తీయాలనుంది. లేకపోతే నీ నుంచి దూరం పెరుగుతుందని భయంగా ఉంది’’ అంటూ దర్శకుడు సుకుమార్, రామ్ చరణ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కురిపించి ఇటీవలే వంద రోజులను పూర్తి చేసుకోగా.. ఆదివారం జరిగిన శతదినోత్సవ వేడుకల్లో చిత్ర యూనిట్ పాల్గొంది.

ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.. ఈ చిత్రం ఇంత బాగా రావడానికి చెర్రీనే కారణమని, చెర్రీ ఒప్పుకోకపోతే ఈ సినిమా ఉండేదే కాదని అన్నారు. ఈ చిత్రం కోసం పనిచేసిన అందరికీ చాలా కృతఙ్ఞతలని తెలిపారు. అలాగే తన విజన్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, తన సోల్ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ అని.. వారిద్దరు లేకపోతే ఈ చిత్రం ఇంత బాగా వచ్చేది కాదని చెప్పారు. ఇక మూవీ తరువాత చెర్రీ నుంచి దూరం పెరుగుతుందని భయంగా ఉందని, అందుకే అతడితో మరో మూవీ తీయాలనుందని మనసులోని మాటను సుకుమార్ బయటపెట్టగా.. వెంటనే స్పందించిన రామ్ చరణ్.. ‘‘ఎప్పుడెప్పుడేంటి, తొందరగా చెప్పు’’ అంటూ ఉత్సాహాన్ని చూపారు. ఇక వీరి మాటలను విన్న అభిమానులందరూ సంతోషాన్ని వ్యక్తపరిచారు.‘రంగస్థలం’@100 రోజులు

Updated By ManamSat, 07/07/2018 - 12:05
rangasthalam

ఇప్పటికాలంలో ఏదైనా చిత్రం థియేటర్లలోకి వచ్చిందంటే రెండు, మూడు వారాలు.. ఒకవేళ అదిరిపోయే టాక్ వస్తే నెల అంతకుమించి ప్రదర్శించబడే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి సమయంలో రామ్ చరణ్ రంగస్థలం వంద రోజులను పూర్తి చేసుకుంది. ఒకటి, రెండు కాదు దాదాపు 16 థియేటర్లలో ఈ చిత్రం సెంచరీని పూర్తి చేసుకుంది. ఇక రంగస్థలం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.

రామ్ చరణ్, సమంత, ఆది, ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, అనసూయ ఇలా ప్రధాన పాత్రాధారులందరూ తమ పాత్రలలో ఒదిగిపోవడం, సుకుమార్ స్ర్కీన్ ప్లే , రత్నవేలు సినిమాటోగ్రఫీ, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, రామకృష్ణ- మౌనిక ఆర్ట్ వర్క్ ఇలా ప్రతి విభాగంలోనూ ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదలైన అన్ని చిత్రాల్లో పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది రంగస్థలం.చైనీస్‌లోకి ‘రంగస్థలం’..?

Updated By ManamTue, 06/12/2018 - 10:33

rangasthalam రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన రీవేంజ్ డ్రామా ‘రంగస్థలం’. విమర్శకులను సైతం మెప్పించిన ఈ చిత్రం కలెక్షన్లలో నాన్ బాహుబలి రికార్డును ఖాతాలో వేసుకొని సమ్మర్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రాన్ని చైనాలో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల చైనాలో భారతీయ సినిమాలకు డిమాండ్ పెరిగింది. బాలీవుడ్ చిత్రాలైన సుల్తాన్, దంగల్, సీక్రెట్ సూపర్‌స్టార్, తాజాగా టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్‌కథ చిత్రాలను చైనీయులు బాగా ఆదరించారు. దీంతో ‘రంగస్థలం’ను చైనాలో విడుదల చేయాలని వారు భావిస్తున్నట్లు సమాచారం. అయితే చైనాలో ఇప్పటికే బాహుబలి చిత్రం ప్రదర్శతం కాగా మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకుంది. మరి ఒకవేళ ‘రంగస్థలం’ అక్కడ విడుదలైతే ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి. కాగా ఈ చిత్రాన్ని తమిళ్, మలయాళ్, హిందీలో డబ్బింగ్ చేస్తామని రామ్ చరణ్ తెలిపిన విషయం తెలిసిందే.  

Related News