bahubali 2

చైనాలో 'బాహుబ‌లి 2' క‌ష్టాలు

Updated By ManamWed, 05/09/2018 - 21:34

bahu'బాహుబ‌లి 2'.. తెలుగు సినిమా స్థాయిని పెంచిన విజువ‌ల్ వండ‌ర్‌. తెలుగునాటే కాదు.. జాతీయ స్థాయిలో దాదాపు అన్ని భాష‌ల్లోనూ డ‌బ్బింగ్ వెర్ష‌న్స్‌తో అదిరిపోయే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టుకుంది. ఓవ‌ర్సీస్‌లోనూ క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది. అలాంటి ఈ చిత్రం.. స‌రిగ్గా ఏడాది త‌రువాత చైనాలో మే 4న‌ రిలీజ్ అయ్యింది. తొలి రోజు.. భార‌తీయ చిత్రాల ప‌రంగా టాప్ 3 బెస్ట్ ఓపెనింగ్ మూవీగా నిలిచిన ఈ సినిమా.. రెండో రోజు కూడా మెప్పించిన‌ప్ప‌టికీ ఆ త‌రువాత మాత్రం ఆ దూకుడు కొన‌సాగించ‌లేక‌పోయింది. శుక్ర‌వారం $ 2.43 మిలియ‌న్లు రాబ‌ట్టిన ఈ మూవీ.. శ‌నివారం $ 2.94 మిలియ‌న్ల‌ను ఆర్జించింది. ఇక ఆదివారం $ 2.30 మిలియ‌న్ల‌ను, సోమ‌వారం $ 0.89 మిలియ‌న్ల‌ను, మంగ‌ళ‌వారం $ 0.82 మిలియ‌న్ల‌ను.. మొత్తంగా $ 9.38 మిలియ‌న్ల‌ను (రూ. 63.19 కోట్లు) ఆర్జించింది. మొత్తానికి 'బాహుబ‌లి2' చైనాలో వ‌సూళ్ళు రాబ‌ట్ట‌డానికి బాగానే క‌ష్టాలు ప‌డుతోంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి.



'బాహుబ‌లి 2'.. చైనాలో దూకుడు త‌గ్గిందా?

Updated By ManamSun, 05/06/2018 - 23:37

bahubali 2తెలుగు సినిమాని మ‌రో స్థాయికి తీసుకెళ్ళిన చిత్రం ‘బాహుబలి2: ది కంక్లూజ‌న్‌’. కేవ‌లం తెలుగునాటే కాకుండా.. అనువాద‌మైన అన్ని భాషల్లోనూ స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేసింది ఈ సినిమా. ప్ర‌భాస్ హీరోగా రాజ‌మౌళి రూపొందించిన ఈ సినిమా శుక్ర‌వారం చైనాలోనూ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. విడుదలైన తొలి రోజు వసూళ్ళ పరంగా టాప్ 3 ఇండియన్ ఫిలిమ్స్‌లో స్థానం ద‌క్కించుకుంది ఈ చిత్రం. కాగా.. తొలి వీకెండ్‌కిగానూ $7.8 మిలియ‌న్ డాల‌ర్లు (రూ.52 కోట్లు) క‌లెక్ట్ చేసింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. తొలి రోజు క‌లెక్ష‌న్ల ప‌రంగా భార‌తీయ సినిమాల ప‌రంగా 3వ స్థానంలో ఉన్న ఈ చిత్రం.. తొలి వీకెండ్ పూర్త‌య్యే సమ‌యానికి ఐదో స్థానానికి ప‌రిమిత‌మైంది. తొలి స్థానంలో 'సీక్రెట్ సూపర్ స్టార్'($29.2 మిలియన్లు) నిల‌వ‌గా.. రెండో స్థానంలో ‘హిందీ మీడియం’($21.25 మిలియన్లు - తొలి వీకెండ్ 5 రోజులు)నిలిచింది. మూడో స్థానంలో ‘దంగల్’ ($14.5 మిలియన్లు), నాలుగో స్థానంలో ‘బ‌జరంగి భాయిజాన్’ ($9.0 మిలియన్లు) నిలిచాయి. తొలి రోజు 'బాహుబ‌లి2' తరువాతి స్థానాల‌లో ఉన్న 'దంగ‌ల్‌', 'బ‌జ‌రంగి భాయిజాన్‌'.. తొలి వీకెండ్ పూర్త‌య్యేస‌రికి పై స్థానాల్లో ఉండ‌డం విశేషం. ఒక ర‌కంగా చూస్తే.. 'బాహుబ‌లి 2' దూకుడు చైనాలో అనుకున్నంత స్థాయిలో లేద‌నే అంటున్నారు ట్రేడ్ పండితులు.



చైనాలో.. 'బాహుబ‌లి2' రెండు రోజుల క‌లెక్ష‌న్స్‌

Updated By ManamSat, 05/05/2018 - 22:33

bahubali2తెలుగు సినిమాని మ‌రో స్థాయికి తీసుకెళ్ళిన చిత్రం ‘బాహుబలి2: ది కంక్లూజ‌న్‌’. కేవ‌లం తెలుగునాటే కాకుండా.. అనువాద‌మైన అన్ని భాషల్లోనూ స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేసింది ఈ సినిమా. ప్ర‌భాస్ హీరోగా రాజ‌మౌళి రూపొందించిన ఈ సినిమా శుక్ర‌వారం చైనాలోనూ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. విడుదలైన తొలి రోజే వసూళ్ళ పరంగా టాప్ 5 ఇండియన్ ఫిలిమ్స్‌లో స్థానం ద‌క్కించుకుంది. మొద‌టి రోజు $2.85 మిలియన్లు క‌లెక్ట్ చేసిన ఈ సినిమా.. రెండు రోజుల‌కిగానూ $5.54 మిలియ‌న్లు (రూ.37 కోట్లు) క‌లెక్ట్ చేసింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తానికి.. మ‌న‌ 'బాహుబలి' చైనాలోనూ త‌న స‌త్తా చాటుతున్నాడ‌న్న‌మాట‌.



చైనాలో ‘బాహుబలి2’ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌

Updated By ManamFri, 05/04/2018 - 22:31

bahubali 2యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘బాహుబలి2: ది కంక్లూజ‌న్‌’. ‘బాహుబలి: ది బిగినింగ్‌’(2015)కి కొనసాగింపుగా ఈ సినిమా రూపొందింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 28, 2017న విడుదలై.. తెలుగు సినీ చరిత్రలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అంతేగాక‌, తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచం నలువైపులా వ్యాపింప చేసింది. ఇదిలా ఉంటే.. ఈ రోజు (శుక్ర‌వారం) చైనాలో విడుదలైన ఈ చిత్రం.. అక్కడ బాక్సాఫీస్ దగ్గర కూడా తనకు ఎదురులేదని నిరూపిస్తోంది. విడుదలైన తొలి రోజే వసూళ్ళ పరంగా టాప్ 5 ఇండియన్ ఫిలిమ్స్‌లో స్థానం ద‌క్కించుకుంది. తొలి స్థానంలో 'సీక్రెట్ సూపర్ స్టార్'($6.74మిలియన్) నిల‌వ‌గా.. రెండో స్థానంలో ‘హిందీ మీడియం’($3.39మిలియన్), మూడో స్థానంలో ‘బాహుబలి2’($2.85మిలియన్) నిలిచాయి. త‌రువాతి స్థానాల‌లో  ‘దంగల్’ ($2.49మిలియన్), ‘భజరంగి భాయిజాన్’ ($2.20మిలియన్) నిలిచాయి. టాప్ 5 ఇండియన్ ఫిలిమ్స్‌లో నాలుగు హిందీ చిత్రాల మ‌ధ్య‌.. కలెక్షన్‌ల పరంగా మూడో స్థానంలో నిలిచిన ఏకైక తొలి తెలుగు చిత్రం ‘బాహుబలి2: ది కంక్లూజ‌న్‌’ కావ‌డం విశేషం.



చైనాలో 7000 స్క్రీన్స్‌పై 'బాహుబలి 2'

Updated By ManamThu, 05/03/2018 - 15:20

bahubali2'బాహుబలి 2'.. స‌రిగ్గా ఏడాది క్రితం విడుద‌లై ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.1600 కోట్ల‌కి పైగా గ్రాస్ రాబ‌ట్టిన తెలుగు సినిమా పేరిది. ప్రేక్ష‌కుల రివార్డుల‌తో పాటు ప‌లు అవార్డుల‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా.. ఇటీవల జపాన్‌లో విడుదలై 100 రోజులను పూర్తి చేసుకుంది. అంతేగాకుండా.. రేపు (శుక్ర‌వారం) చైనాలో కూడా భారీ స్థాయిలో విడుద‌ల‌కు ముస్తాబ‌వుతోంది. చైనాలో ఐమాక్స్ ఫార్మేట్‌లో విడుదలవుతోన్న తొలి భార‌తీయ చిత్రంగా.. 7000కి పైగా స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్‌ కానుంది. విడుద‌లైన ప్ర‌తి చోట రికార్డు క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టిన 'బాహుబ‌లి 2' చైనాలో కూడా అదే జోరు కొన‌సాగిస్తుందేమో చూడాలి.



ఏప్రిల్ 28.. తెలుగు సినిమాకు ప్ర‌త్యేకం

Updated By ManamSat, 04/28/2018 - 16:22

apr 28తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఏప్రిల్ 28వ‌ తేదీకి ప్ర‌త్యేక స్థానముంది. ఎందుకంటే.. గ‌తంలో ఇదే తేదీన విడుద‌లైన కొన్ని సినిమాలు చ‌రిత్ర‌లో నిలిచిపోయే విజ‌యం సాధించాయి. అలాగే మ్యూజిక‌ల్‌గానూ మెప్పించాయి. ఆ చిత్రాల వైపు కాస్త దృష్టి పెడితే..

అనార్క‌లి (1955) 
అంజ‌లీ దేవి టైటిల్ రోల్‌లో న‌టించిన చారిత్రక చిత్రం 'అనార్క‌లి'. స‌లీమ్‌గా అక్కినేని నాగేశ్వ‌ర‌రావు , అక్బ‌ర్‌గా ఎస్వీ రంగారావు న‌టించిన ఈ క్లాసిక్ మూవీకి వేదాంతం రాఘ‌వ‌య్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పి.ఆదినారాయ‌ణ రావు సంగీతంలో పాట‌ల‌న్నీ ఆద‌ర‌ణ పొందాయి. ముఖ్యంగా ఘంట‌సాల, జిక్కి ఆల‌పించిన 'రాజ‌శేఖ‌రా' పాట అయితే అప్ప‌ట్లో ఓ సంచ‌ల‌నం. 28 ఏప్రిల్ 1955న విడుద‌లైన ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది.

అడ‌వి రాముడు (1977)
మ‌హాన‌టుడు నంద‌మూరి తారక రామారావు కెరీర్‌లో 'అడ‌వి రాముడు' చిత్రానికి ప్ర‌త్యేక స్థానం ఉంది. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. రామారావు, రాఘవేంద్ర‌రావు కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తొలి చిత్ర‌మిది. ఆ త‌రువాత వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో మ‌రో 11 సినిమాలు రాగా.. వాటిలో సింహ‌భాగం విజ‌యం సాధించాయి. కె.వి.మ‌హ‌దేవ‌న్ సంగీతంలో పాట‌ల‌న్నీ ఆద‌ర‌ణ పొందాయి. ముఖ్యంగా 'కృషి ఉంటే మ‌నుషులు రుషులౌతారు', 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను' పాట‌లు అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించాయి. జ‌య‌ప్ర‌ద క‌థానాయిక‌గా న‌టించిన ఈ సినిమాలో జ‌య‌సుధ ఓ కీల‌క పాత్ర పోషించారు. 28 ఏప్రిల్ 1977న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

య‌మ‌లీల (1994)
హాస్య న‌టుడిగా రాణిస్తున్న అలీని క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ.. అప్ప‌ట్లో వ‌రుస విజ‌యాల‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్న‌ కుటుంబ‌క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించిన ఫాంట‌సీ మూవీ 'య‌మ‌లీల‌'. మ‌ద‌ర్ సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమాలో అలీ, మంజు భార్గ‌వి మ‌ధ్య సాగే స‌న్నివేశాలు హృద‌యాన్ని హ‌త్తుకునేలా ఉంటాయి. ఇందులో య‌ముడిగా స‌త్య‌నారాయ‌ణ‌, చిత్ర గుప్తుడిగా బ్ర‌హ్మానందం చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. ఈ సినిమా త‌రువాత‌ య‌ముడి పాత్ర‌లాగే ప్రేక్ష‌కులు కూడా ఐస్ క్రీమ్‌ల‌ను హిమ క్రీములుగా పిల‌వ‌డం ఆన‌వాయితీ అయిపోయింది. ఇక‌ మ్యూజిక‌ల్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాలో పాట‌ల‌న్నీ హిట్టే. ముఖ్యంగా 'సిరిలొలికించే చిన్ని న‌వ్వులే' పాట అయితే ఎవ‌ర్‌గ్రీన్‌. అలీకి జోడీగా ఇంద్ర‌జ న‌టించిన ఈ సినిమా 28 ఏప్రిల్ 1994న విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది.

పోకిరి (2006)
సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రం 'పోకిరి'. ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా.. అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. ప్రీ క్లైమాక్స్ వ‌ర‌కు హీరోను పోకిరిగా చూపించి.. చివ‌రి స‌న్నివేశాల్లో అత‌ను పోకిరి కాదు పోలీస్ అంటూ ఇచ్చిన ట్విస్ట్ ఆడియన్స్‌ను థ్రిల్ చేసింది. ఇలియానా అందాలు, మ‌ణిశ‌ర్మ సంగీతం ఈ సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. పాట‌ల్లో 'గ‌ల గ‌ల పారుతున్న గోదారిలా' గుర్తుండిపోయే మెలోడీ అయితే.. 'ఇప్ప‌టికింకా నా వ‌య‌సు నిండా ప‌ద‌హారే' అంటూ సాగే ప్ర‌త్యేక గీతం అయితే ఓ సెన్సేష‌న్‌. 28 ఏప్రిల్ 2006న విడుద‌లైన ఈ సినిమా మ‌హేష్ కెరీర్‌లో ఎప్ప‌టికీ ప్ర‌త్యేక‌మే.

బాహుబ‌లి 2 (2017)
తెలుగు సినిమాని మ‌రో స్థాయికి తీసుకెళ్ళిన 'బాహుబ‌లి' సిరీస్‌లో రెండో భాగంగా వ‌చ్చిన 'బాహుబ‌లి 2 - ది కంక్లూజ‌న్‌'.. జాతీయ స్థాయిలో రికార్డు వ‌సూళ్ళు ఆర్జించింది. అంతేగాకుండా.. తెలుగులో ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్ర‌భాస్ టైటిల్ రోల్‌లో సంద‌డి చేయ‌గా.. అనుష్క‌, ర‌మ్య‌కృష్ణ‌, త‌మ‌న్నా, రానా, నాజ‌ర్‌, స‌త్య‌రాజ్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. ఎం.ఎం.కీర‌వాణి సంగీతంలోని పాట‌ల‌న్నీ ఆద‌ర‌ణ పొందాయి. ముఖ్యంగా 'సాహోరే బాహుబ‌లి' పాట సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.  ప్ర‌భాస్‌, అనుష్కపై చిత్రీక‌రించిన 'ఓరోరి రాజా' విజువ‌ల్స్ ప‌రంగా మెప్పించింది. 28 ఏప్రిల్ 2017న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

మొత్త‌మ్మీద‌.. 'అడ‌విరాముడు', 'పోకిరి', 'బాహుబ‌లి 2' వంటి ఇండ‌స్ట్రీ హిట్ చిత్రాల‌న్నీ ఏప్రిల్ 28న రావ‌డం యాదృచ్ఛిక‌మైనా.. ఇలాంటి సెన్సేష‌న‌ల్ హిట్ చిత్రాలు రిలీజైన తేదీ కావ‌డంతో ఏప్రిల్ 28 తెలుగు సినిమాకు ప్ర‌త్యేకంగా నిలిచింది. మున్ముందు కూడా ఇదే తేదీన మ‌రిన్ని సంచ‌ల‌న చిత్రాలు విడుద‌ల‌వుతాయేమో చూడాలి.             

                                                                                             - మ‌ల్లిక్ పైడి



‘బాహుబలి2’ రికార్డును బ్రేక్ చేసిన ‘స్పైడర్’

Updated By ManamSat, 03/03/2018 - 21:55

spyderసూప‌ర్ స్టార్ మహేశ్‌ బాబు, క్రియేటివ్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగుదాస్ కాంబినేష‌న్‌లో రూపొందిన ద్విభాషా చిత్రం ‘స్పైడర్’. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడిన సంగ‌తి తెలిసిందే. తమిళ్ డైరెక్టర్ కావడంతో మహేశ్‌ను సరిగా ఉపయోగించుకోలేకపోయారని.. మహేశ్ మీద‌ కంటే ప్రతినాయకుడి పాత్ర పోషించిన ఎస్.జె.సూర్య మీదే ఎక్కువ ఫోకస్ పెట్టడం వలన సినిమా ఆశించిన మేర ఆకట్టుకోలేకపోయిందని కూడా విమర్శలు వినిపించాయి.

ఇదిలా వుంటే.. ఈ సినిమా ఒక విషయంలో ‘బాహుబలి 2’ ను అధిగమించింది. అదేమిటంటే.. గత ఆదివారం సన్ టీవీ ఛానల్‌లో ఈ మూవీ తమిళ వెర్షన్‌ను ప్రసారం చేశారు. దీన్ని డైరెక్ట్ చేసింది మురుగుదాస్ కావడంతో పాటు ఎస్.జె.సూర్య పాత్ర కూడా ఆకట్టుకోవడంతో 10.4 టీఆర్పీ రేటింగ్‌ని సాధించింది ఈ చిత్రం. ఇంతవరకు టెలివిజ‌న్ చరిత్రలో (తమిళంలోకి డ‌బ్బింగ్ అయిన తెలుగు సినిమాల విష‌యంలో) 10.33 టీఆర్పీ రేటింగ్‌తో.. ప్రథ‌మ స్థానంలో ఉన్న ‘బాహుబలి2’ను ‘స్పైడర్’ మూవీ అధిగమించి రికార్డు సృష్టించింది.



100 మిలియన్ల‌.. 'సాహోరే బాహుబ‌లి'

Updated By ManamFri, 03/02/2018 - 18:12

bahubali‘బాహుబలి2’ ప్రకంపనలు ప్రపంచంలో ఏదో ఒక మూల ఇంకా వినపడుతూనే ఉన్నాయి. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటి చాటి చెప్పిన చిత్రం ఇది. కథ, కథనం, గ్రాఫిక్స్‌తో పాటు రాజమౌళి దర్శకత్వ ప్రతిభ కూడా ఈ సినిమాకి అదనపు బలం. ఇక ఈ సినిమాలో వచ్చే మొదటి పాట “సాహోరే బాహుబలి”కైతే ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికులున్నారు. పాటలో బాహుబలి గొప్పతనంతో పాటు.. తల్లీ కొడుకుల అనుబంధాన్ని కూడా చాలా చక్కగా చెప్పారు గేయ రచయితలు డా.కె.రామకృష్ణ, కె.శివశక్తిదత్త. అందుకే 100 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకున్న తొలి దక్షిణ భారతీయ పాటగా ప్రేక్షకుల మన్ననలను పొందింది. ‘లహరి’ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ పాటను 100 మిలియన్ల మంది వీక్షించారు. కీరవాణి స్వరపరచిన ఈ పాటను ద‌లేర్ మెహెంది, కీరవాణి, మౌనిమ ఆలపించారు. మొత్తానికి మరో ఘనతను ‘బాహుబలి’ చిత్రం తన కీర్తి కిరీటంలో భ‌ద్ర‌ప‌ర‌చుకుంది. మ‌రోసారి.. ఆ పాట వైపు మీరూ ఓ లుక్కేయండి మ‌రి.



'భాగ‌మ‌తి' త‌మిళ్ రైట్స్ ఎంతంటే..

Updated By ManamTue, 11/28/2017 - 17:56

anushka'బాహుబ‌లి 2'లో దేవ‌సేన‌గా అల‌రించిన అనుష్క‌.. అతి త్వ‌ర‌లో 'భాగ‌మ‌తి'గా సంద‌డి చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. హీరోయిన్ ఓరియెంటెడ్ స‌బ్జెక్ట్‌తో రూపొందిన ఈ సినిమాని వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 26న విడుద‌ల చేయ‌నున్న‌రు. తెలుగుతో పాటు త‌మిళ్‌, మ‌ల‌యాళంలోనూ ఈ సినిమా విడుద‌ల కానుంది. కాగా, ఈ సినిమా  త‌మిళ్ రైట్స్ భారీ రేటుకి ప‌లికాయ‌ని తెలిసింది. రూ.15 కోట్ల మొత్తంతో స్టూడియో గ్రీన్ ఈ చిత్రాన్ని కొనుగోలు చేసింద‌ట‌. 'పిల్ల జ‌మీందార్' ఫేమ్ అశోక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీత‌మందిస్తున్నాడు. 'అరుంధ‌తి' త‌ర్వాత ఆ స్థాయి హిట్‌ని అనుష్కకి అందించే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీగా భాగ‌మ‌తి నిలుస్తుంద‌ని చిత్ర బృందం పేర్కొంటోంది.



ప్ర‌భాస్ న‌ట‌న‌కి 15 ఏళ్లు

Updated By ManamSat, 11/11/2017 - 12:18

eeswar'బాహుబ‌లి', 'బాహుబ‌లి2'తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న క‌థానాయ‌కుడు ప్రభాస్‌. ఆ చిత్రాల్లో బాహుబ‌లి అంటే ఇలానే ఉంటాడేమో.. అనిపించే ప‌ర్స‌నాలిటీతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు ప్ర‌భాస్‌. అలాంటి ప్ర‌భాస్ న‌ట‌న‌కి శ్రీ‌కారం చుట్టిన సినిమా 'ఈశ్వ‌ర్‌'. తొలి చిత్రంలోనే న‌టుడిగా త‌న స‌త్తాని చాటే పాత్ర దొర‌క‌డం.. దాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌డంతో.. ప్ర‌భాస్‌లో మంచి మాస్ హీరో ఉన్నాడ‌న్న విష‌యం మొద‌టి సినిమాతోనే తెలుగు ప్రేక్ష‌కుల‌కు అర్థ‌మైంది. ఎదుటి వ్యక్తి ఎంత గొప్పవాడైనా.. తను అతనితో సరితూగగలనో లేదో అనేది కూడా లేకుండా, ఓటమిని అంగీకరించని గుణం.. ఎటువంటి పరిస్థితినైనా ఎదిరించగలననే గుండె ధైర్యంగల పాత్రతో ప్రభాస్ ని ఇంట్రడ్యూస్ చేసారు అప్ప‌టి టాప్ డైరెక్ట‌ర్ జ‌యంత్ సి.ప‌రాన్జీ.  ‘రుక్మిణి’లో బాల‌న‌టిగా అల‌రించిన‌ శ్రీదేవి.. ఈ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైంది. శివకృష్ణ, రేవతి, అశోక్ కుమార్ త‌దిత‌రులు కీలక పాత్రల్లో నటించారు. అప్ప‌టి టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఆర్.పి.పట్నాయక్ ఈ చిత్రానికి సంగీత‌మందించారు. నేటితో 'ఈశ్వ‌ర్' విడుద‌లై స‌రిగ్గా 15 ఏళ్లు. అంటే ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా కెరీర్‌ని ప్రారంభించి 15 ఏళ్లు అవుతుంద‌న్న‌మాట‌.   





Related News