farmers

మహోన్నత లక్ష్యానికి తూట్లు..

Updated By ManamSat, 07/28/2018 - 01:18
 • రైతులందరినీ కలవని ఏఈఓలు..రైతు బంధు బీమా పట్ల నిర్లక్ష్యం..

 • పత్రాల కోసం రైతుల ఎదురుచూపులు.. వలసపోయిన వారి సంగతి అంతే..

 • ఇప్పటికే హెచ్చరించిన సీఎం కేసీఆర్

imageహైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా రైతు జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. మహోన్నత లక్ష్యంతో ప్రారంభించిన పథకం కాస్త.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీరుగారిపోతోంది. రైతు ఏ కారణంతో మరణించినా.. రూ.5లక్షల బీమా కల్పిస్తూ ప్రపంచంలోనే తొలిసారిగా సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రైతు బంధు పథకాన్ని విజయవంతం చేసిన మాదిరిగానే రైతు బంధు బీమాను విజయవంతం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు సీఎం పిలుపునిచ్చారు. ఆగస్టు ఒకటో తేదీ నాటికి బీమా సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. రైతు బంధు పథకం అమలు స్ఫూర్తితో రైతు బంధు బీమా అదే స్థాయిలో కొనసాగుతుందని రైతులందరూ ఆశించారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా సర్వే ప్రక్రియ నడుస్తోంది.

రాష్ట్రంలో రైతు బీమా సర్వే పరిస్థితి ఇదీ..
రాష్ట్రంలో 18 ఏండ్ల వయస్సు నుంచి 60 ఏండ్ల వయస్సు కలిగిన రైతులందరికీ రైతు బీమాను చేయించాలని సీఎం భావించారు. అందుకు తగిన విధంగా ఎల్‌ఐసీతో ఇప్పటికే ఒప్పందం కుదిరింది. రైతు బీమాలో చేరిన రైతు మరణిస్తే.. నామినీగా ఉన్న వారికి పది రోజుల్లో రూ.5లక్షలు అందనున్నాయి. ఆగస్టు 15 నుంచి పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. రైతు బంధు పథకం వివరాల  ప్రకారం రాష్ట్రంలో 57 లక్షల మంది రైతులు ఉన్నారు. ఈనెల 25 వరకు 38.05 లక్షల మంది రైతులను వ్యవసాయ విస్తరణ అధికారులు కలిశారు. అయితే వీరిలో దాదాపు 28 లక్షల మంది రైతులు రైతు జీవిత బీమాకు అర్హులుగా తేలగా, 9 లక్షల పైచిలుకు రైతులు వయస్సు కారణంగా అనర్హులయ్యారు. రైతు బీమా సర్వే పూర్తయ్యేసరికి 15 లక్షల మంది రైతులు అనర్హులుగా తేలే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నా రు.

ఇంటింటికీ వెళ్లని ఏఈఓలు
ఏఈఓలు రైతుల ఇంటింటికీ తిరిగి రైతు బంధు బీమా వివరా లను సేకరించాలని, బీమా ఆవశ్యకత వంటి వివరాలను రైతులకు వివరించాలని రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్‌నూ జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రైతులందరినీ వ్యవ సాయ అధికారులు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించాల్సి ఉంది. కానీ వ్యవసాయా ధికారులు ఎక్కడా రైతు ఇంటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్న దాఖాలాల్లేవు. చాలాచోట్ల గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్దో.. ప్రధాన కూడలిలోనో.. కూర్చోని.. అక్కడికి వచ్చిన రైతుల నుంచి వివరాలను సేకరిస్తున్నారు. అంతుకు ముందు రోజు రైతులందరూ నిర్ధేశిత ప్రాంతానికి రావాలని డప్పు చాటింపు వేయిస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనుల్లో రైతు కుటుంబాలన్నీ నిమగ్నమై ఉన్నాయి. దీంతో రైతులు రైతు బీమా కోసం పని మానుకుని ఏఈఓలు చెప్పిన ప్రదేశానికి వెళ్లడం లేదు. కొన్నిచోట్ల గ్రామాల్లోని యువకులకు బీమా పత్రాలను అప్పగించి.. రైతుల నుంచి వివరాలు తీసుకుని నింపాలని పురమా యిస్తున్నాయి. ఈ క్రమంలో రైతులకు రైతు జీవిత బీమా అనేది తెలియడం లేదు. దీంతో ఇటీవల సీఎం కేసీఆర్ సైతం సర్వే జరుగుతున్న తీరుపట్ల అధికారులపై మండిపడ్డారు. అయినా నేటికీ అధికారుల తీరులో మార్పు రావడం లేదు. ఇదిలావుంటే.. ఇతర ప్రాంతాలకు వలసెళ్లిన రైతులు, వేరే ప్రాంతాలకు వెళ్లిన రైతులకు రైతు బీమా గురించి సమాచారం ఇచ్చేవారు కరువయ్యారు. దీంతో వారు రైతు జీవిత బీమాకు దూరంగానే ఉన్నారు.

కొంపముంచుతున్న పుట్టిన తేదీ..
వయస్సు కారణంగా బీమాకు అనర్హులైన రైతులకు అసలు తమకు బీమా ఎందుకు అందడం లేదో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. దీనికితోడు ఆధార్‌కార్డు నమోదు సమయంలో సరైన పుట్టినరోజు తెలియక ఇవ్వలేదు. ఆ సమయంలో నమోదు చేసుకున్న సిబ్బంది తమకు ఇష్టం వచ్చిన, గతంలో రేషన్ కార్డు, ఓటరు కార్డులో ఉన్న నామమాత్రపు పుట్టినతేదీనే నమోదు చేశారు. దీంతో చాలామంది రైతులు నిర్ణీత వయస్సు ఉన్నప్పటికీ.. కేవలం ఆధార్‌కార్డులో వయస్సు తప్పుగా పడడంతో రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న రైతు జీవిత బీమాకు అనర్హులుగా మారారు.
 

image

 బిగ్‌బాస్ షోపై మాజీ జేడీ మళ్లీ కామెంట్స్..

Updated By ManamSun, 07/22/2018 - 17:09

CBI Ex JD Lakshmi Narayana Again COMMENTS on Bigg Boss 2 Show

హైదరాబాద్: తెలుగు బుల్లితెర‌పై అతిపెద్ద రియాలిటీ షోగా ప్రారంభ‌మై ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది ‘బిగ్‌బాస్’ 2. అయితే ఈ షో అంతే రీతిలో విమర్శలు కూడా వినవస్తున్నాయి. షోలో పెద్దగా పసలేదని కొందరు అంటుంటే.. ఇంకొందరమో షోలోని పార్టిసిపేట్స్‌పై ఇంకొందరు.. మరికొందరేమో వ్యాఖ్యాత నాని గురించి ఇలా పలు రకాలుగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికి ఓ సారి ఈ షోపై షాకింగ్ కామెంట్స్ చేసిన మాజీ జేడీ లక్ష్మీ నారాయణ తాజాగా మరోసారి కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు.

తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు రోజులుగా పర్యటిస్తున్న ఆయన ఈ షో గురించి మాట్లాడుతూ..‘బిగ్ బాస్’ షోను స్టార్స్‌తో కాకుండా రైతులతో నిర్వహించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా ఈయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఈయన ఎప్పుడు చూసినా ఈ షో మీద పడుతున్నాడెందుకు..? అని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొంపదీసి ఇతనికేమైనా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ కావాలా ఏంటి..? అని ఇంకొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

ప్రజా సమస్యలపై మాట్లాడిన ఆయన.. "సామాజిక వర్గం కన్నా, సమాజమే ముఖ్యమని, ప్రజాస్వామ్యం వైపు పూర్తిగా ప్రజలు తమ ఆలోచనలు మళ్లించాలి. రాజకీయ వ్యవస్థలో మంచి మార్పు తీసుకురావాలి. జిల్లాలోని సమస్యలను తెలుసుకుని త్వరలోనే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తాను. ఈ సమస్యలపై మాట్లాడటానికి ఇప్పటికే అపాయింట్ మెంట్ కావాలని అడిగాను. సీఎంతో అపాయింట్ మెంట్ తేదీ ఫిక్స్ కాగానే నేను గుర్తించిన సమస్యలను నిశితంగా వివరిస్తాను. తూర్పుగోదావరి జిల్లా రైతులు, మత్స్యకారుల సమస్యలు, చేనేత కార్మికుల సమస్యలను గుర్తించాను. ఈ సమస్యలపై త్వరలో ఓ నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రికి, సంబంధిత అధికారులకు అందజేస్తాను" అని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అయితే సీఎం దృష్టికి ఈయన తీసుకెళ్లిన సమస్యలు ఎంత వరకు పరిష్కారమవుతాయో వేచి చూడాల్సిందే మరి.అవసరానికి మించి భూసేకరణ: పవన్‌

Updated By ManamSun, 07/22/2018 - 13:38
pawan
 • రైతుల్ని ఏడిపించినవారు నాశనం అవుతారు..

 • ప్రభుత్వాలు భూదాహం తగ్గించుకోవాలి

అమరావతి : చంద్రబాబు నాయుడు సర్కార్‌పై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మరోసారి విరుచుకుపడ్డారు. రాజధాని నిర్మాణం పేరుతో అవసరానికి మించి భూసేకరణ జరుగుతుందని ఆరోపించారు. పవన్‌ ఆదివారం ఉండవల్లిలో రైతులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ...‘భూసేకరణ చేస్తారని ఎన్నికలకు ముందు తెలిస్తే నేనే వేరేలా ఉండేవాడ్ని. అభివృద్ధికి వ్యతిరేకం అని తెలిస్తే టీడీపీకి మద్దతు ఇచ్చేవాడిని కాదు. భూసేకరణ చేస్తే ఎదురు తిరగండి. 

భూసేకరణ జరిగితే చెప్పండి. మీతో కలిసి ఆందోళన చేస్తా. బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే ప్రాణాలు ఇవ్వడానికి ముందుంటా. అవసరానికి మించి భూములు తీసుకుంటే జనసేన ముందుండి పోరాటం చేస్తుంది. పంట భూముల్ని బీడు భూములుగా చూపడం సరికాదు. పోలీసులు, అధికారులను నెగిటివ్‌గా చూడొద్దు.  వాళ్లు ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేసేవారు మాత్రమే.

 కొందరు చావులు, ఏడుపులతో రాజధాని వద్దు. రైతులు అభివృద్ధికి ఆటంకం కావద్దు, రైతుల్ని ఏడిపిస్తే నాశనం అవుతారు. ప్రభుత్వాలు భూదాహాన్ని తగ్గించుకోవాలి. సంపద కొద్దిమంది చేతుల్లోకి వెళ్లడాన్ని జనసేన సహించదు. రాజ్యాంగం అందరికి సమానం. ఎవరు ఎవరికీ బానిసలు కాదు’ అని అన్నారు.విపక్షాలు కలయికతో చిత్తడే..

Updated By ManamSat, 07/21/2018 - 17:19
 • బురదలో నుంచే కమల వికాసం

 • రైతులపై కాంగ్రెస్ మొసలి కన్నీరు

 • షహజాన్‌పూర్‌లో ప్రధాని మోదీ

Narendra modi

న్యూఢిల్లీ: రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని, అవిశ్వాస తీర్మానానికి ఆమోదం పలికేందుకు మిగతా పార్టీలనూ అదే దొంగ ఏడ్పులతో నమ్మించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. వాస్తవానికి తీర్మానం అంత సులభంగా రాలేదని ఆయన అన్నారు. గతంలో తాము చేసిన తప్పులు బయటపడతాయనే ఆందోళనతో సతమతమవుతున్న వారికి ప్రభుత్వంపై సహజంగానే విశ్వాసం ఉండదంటూ పరోక్షంగా కాంగ్రెస్‌పై చురకలు వేశారు. 

ఉత్తరప్రదేశ్‌లోని షహజన్‌పూర్‌లో  జరిగిన రైతు ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని శనివారం రైతులను ఉద్దేశించి మాట్లాడారు. అవిశ్వాస తీర్మానాన్ని భారీ మెజారిటీతో నెగ్గిన 24 గంటల తర్వాత మోదీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. రైతు ర్యాలీలో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోవడానికి కారణమేంటని వారిని(కాంగ్రెస్ సహా విపక్షాలను) పదే పదే అడిగాను.. అయితే కారణమంటూ ఉంటే చెప్పొచ్చు. కానీ వారి దగ్గర అసలు జవాబే లేనప్పుడు కౌగిలించుకోవడం తప్ప ఏం చేయలేరని’మోదీ తెలిపారు. 

ప్రభుత్వంపై వారికి విశ్వాసం లేకపోవచ్చు కానీ భారతీయ జనతా పార్టీకి ప్రజల మద్దతు ఉందని తనకు అమిత విశ్వాసం ఉందని మోదీ పేర్కొన్నారు. ప్రజలకు తమపై ఉన్న భరోసా విపక్షాల అహంకారాన్నీ దనుమాడిస్తుందని తెలిపారు. ‘మీరు(ప్రజలు) మాపై ఉంచిన నమ్మకాన్ని విపక్షాలు తట్టుకోలేక పోతున్నాయి. మీ తీర్పుపై, మీ నమ్మకంపై వారికి ఎలాంటి గౌరవం లేదు’ అంటూ ఆరోపించారు. 

కాగా, ఈరోజు తమ ప్రభుత్వాన్ని పదేపదే నిలదీస్తున్న పార్టీలు దేశంలోని నాలుగు కోట్ల మంది ప్రజలను చీకటిలోనే ఉంచేశారని మోదీ మండిపడ్డారు. వారికి విద్యుత్ సౌకర్యం కల్పించకుండా అంధకారంలో నెట్టేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి డ్బ్బై ఏళ్లు గడిచినా ఇప్పటికీ విద్యుత్ సౌకర్యానికి నోచుకోకపోవడానికి కారణమెవరని మోదీ ప్రశ్నించారు. దేశం మొత్తం 2018లో జీవిస్తుంటే.. వీరిని మాత్రం ఇప్పటికీ 18వ శతాబ్దంలోనే బతికేలా చేసిందెవరని నిలదీశారు. 

దేశంతో పాటు ప్రజల పరిస్థితులను మెరుగు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటే వారు(విపక్షాలు) మాత్రం పార్లమెంట్‌లో మాపై అవిశ్వాస తీర్మానం పెట్టే పనిలో బిజీగా ఉన్నారని మోదీ ఎద్దేవా చేశారు. ఓవైపు ప్రజా సంక్షేమం కోసం బీజేపీ సర్కారు చేపడుతున్న పథకాలను వివరిస్తూనే.. ప్రతిపక్షాలపై ఆరోపణలు గుప్పించారు.

ప్రధాని మోదీని పదవి నుంచి దింపేందుకు విపక్షాలు తమ సైద్ధాంతిక భేదాలనూ మరిచి ఏకమవుతున్నారని దనుమాడారు. అయితే, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని పార్టీలు ఏకమైనా చేయగలిగేదేంలేదని, ప్రజాభిమానం తమపైనే ఉందని ప్రధాని ఆత్మవిశ్వాసం కనబరిచారు. విపక్షాలు అన్నీ కలిస్తే చిత్తడి పెరుగుతుందని.. ఆ బురదలో నుంచే కమలం వికసిస్తుందని మోదీ చమత్కరించారు. పల్లేటూర్ 

Updated By ManamThu, 07/12/2018 - 01:23

villageటూరిజం డిపార్ట్‌మెంట్ మొదలుపెట్టిన రూరల్ టూరిజం కొత్త పుంతలు తొక్కుతోంది.  వెరైటీగా సాగే ప్రాజెక్టుగా ఈ టూర్‌ను రూపొందించడం హైలైట్. సంస్కృతి పేరుతో సాగుతున్న ఈ ప్రాజెక్టు పట్ల ఆకర్షితులైన బెల్జియం టూరిస్టులు మన పల్లె వాతావరణాన్ని ఆద్యంతం ఆస్వాదిస్తుండడం విశేషం.

 

బెల్జియం గెస్టులు
తిరుపతి సమీపంలోని మాధవమాల గ్రామంలో ప్రస్తుతం బెల్జియం నుంచి వచ్చిన ఇద్దరు పర్యాటకులు, లోలా స్నాకర్స్, అలెన్ వాటర్‌మెన్ మన తెలుగుదనాన్ని రుచి చూసి వావ్ అంటున్నారు. వీరితో పాటు హైదరాబాద్‌కు చెందిన మమతా మల్లిపూడి, విశాల్ ఫెర్నాండెజ్, బెంగళూరుకు చెందిన విజయ్ శర్మ మన ‘పల్లెవాసాన్ని’ భలేగా ఉందని ఎగిరి గంతేస్తున్నారు. స్వచ్ఛమైన గ్రామీణ వాతావరణంలో టెన్షన్ ఫ్రీగా, పల్లె ప్రజల ఆత్మీయత సరికొత్తగా ఉందని సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. కుటుంబ సభ్యుల్లా కోళ్లు, ఆవులు, గేదెలు, మేకలను భావిస్తూ వాటిని ప్రేమగా ఆదరిస్తూ..వాటితో ఆడి పాడుతూ, మరోవైపు పాలు పితుకుతూ, ఇంతలోనే వరినాట్లు వేసేందుకు.. వాన చినుకులను సైతం లెక్కచేయకుండా వరి మడిలో దిగడం.. ఇవన్నీ జీవితకాలపు మధుర స్మృతులుగా మిగిలిపోతాయని సంబరంగా ‘మనం’తో తమ అనుభూతులను దేశ విదేశీ టూరిస్టులు పంచుకున్నారు. బిజీ బిజీ నగర జీవితం నుంచి మంచి బ్రేక్ దొరికిందని..ఇదంత గమ్మతుగా ఉందని.. వీటన్నింటినీ వీడియోలు, ఫొటోల రూపంలో పదిలపరచుకునేందుకు కెమెరాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.  చక్కని ఈ టూర్‌పై బ్లాగ్‌ల్లో పుంఖాను పుంఖాలుగా రాసేస్తామంటున్న బెల్జియం టూరిస్టులు నెటిజెన్లను ఆలోచిం పచేస్తామంటున్నారు.  బొమ్మలు చెక్కడం, కలంకారీ అద్దకాల్లో మునిగిపోయిన పరదేశీయులు ఇవి సూపర్‌గా ఉన్నాయంటున్నారు.

మీరూ పల్లెబాట పట్టండి ..
imageతిరుపతి సమూహంలో శ్రీకాళహస్తి, మాధవమాల, వెంకటగిరి గ్రామాలు, అనంతపురంలో లేపాక్షి, నిమ్మలకుంట, వీరాపురం గ్రామాలు, రాజమండ్రి క్లస్టర్‌లో దిండి, నర్సాపూర్, ఉప్పాడ గ్రామాలు ప్రస్తుతం ‘సాంస్కృతిక ప్రాజెక్టు’ కింద ఎంపిక కాగా చిత్తూరు జిల్లాలోనే మరో క్లస్టర్‌ను ఏర్పాటు కానుంది.  గ్రామీణ పర్యాటకాన్ని అంతర్జాతీయ పర్యాటకులకు పరిచయం చేసే క్రమంలో అడుగడుగునా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేందుకు స్వయంగా సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, పర్యాటక అధారిటీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి హిమాన్హు శుక్లా రంగంలోకి దిగారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా వీరు రూపొందించిన పల్లెబాట ప్రాజెక్ట్ విజయవంతంగా సాగుతోంది. అందుకే రొటీన్ లైఫ్‌తో విసిగిన మీరూ పల్లెబాట పట్టి చూడండి.  స్వహస్తాలతో కుండలు చేయడం, వస్త్రాలు నేయడం, పార-పలుగు చేతపట్టి వ్యవసాయ పనులు చేయడం, వాహనాల రద్దీ రొదకు దూరంగా ఎక్కడికి వెళ్లినా ఎడ్లబండి, ట్రాక్టరు, సైకిల్ వంటి గ్రామాల్లో అందుబాటులో ఉన్న వాహనాల్లోనే ప్రయాణిస్తూ సాగడం, మినరల్ వాటర్ బాటిల్ కాకుండా స్థానికంగా లభించే నీరు తాగుతూ చేసే ఈ ‘రెట్రో లైఫ్ టూర్’లో ఎంత సింప్లిసిటీ ఉందో మీరు స్వయంగా తెలుసుకుంటే పల్లె జీవితం హాయిగా ఉందనడం ఖాయం.  ఆర్గానిక్ తిళ్లు తింటూ, గో బ్యాక్ టు నేచర్ అంటూ ప్రకృతి షరతులకు లోబడి నడిచే జీవితపు మాధుర్యాన్ని ఒక్కరోజైనా గడపి చూడండి.. మన మూలాలు ఎంత గొప్పవో, ఎంత అందమైనవో తెలుసుకునే ఛాన్స్ దొరుకుతుంది.  మహారాష్ట్ర, రాజస్ధాన్, గుజరాత్, ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికే రూరల్ టూరిజం లేదా విలేజ్ టూరిజం చాలా పాప్యులర్ కాగా పెద్ద ఎత్తున టూరిస్టులు ఇక్కడికొచ్చి గ్రామీణుల్లో మమేకమవుతున్నారు.  

రెట్రో లైఫ్ 
imageపబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్‌తో సాగుతున్న ‘పల్లెటూర్’ ప్యాకేజ్‌లో ఎన్నో గ్రామీణ అందాలు, రుచులు దాగున్నాయి.  వీటిని ఎంజాయ్ చేసేందుకు ఫారిన్ టూరిస్టులే కాదు మనవారు కూడా హుషారుగా ఇక్కడికి తరలివస్తున్నారు.  మన మూలాలను స్వహస్తాలతో తాకి, మానసికంగా స్పృశించాలని ఉత్సాహపడుతున్న నేటి తరానికి ఇదో అరుదైన అవకాశం ఇస్తోంది.  ‘‘బీ ఎ రోమన్ వెన్ యూ ఆర్ ఇన్ రోమ్’’ అన్నట్టు వీరంతా కూడా అచ్చం గ్రామీణుల్లానే ప్రవర్తిస్తూ, వారి దినచర్యనే ఫాలో అయ్యేలా ప్యాకేజీ ఉంటుంది.  మన పూర్వికులు తినే తిండి, చేసిన పనులు చేస్తూ.. వారి టైం టేబుల్‌నే అనుసరించడమే ఇందులో ఉన్న స్పెషాలిటీ. అంటే నో నైట్ షిఫ్ట్.. తెలవారకముందే నిద్ర లేచి, మూగజీవాల బాగోగులు చూసుకుంటూ.. పాడి పంటలతో ఊపిరి సలపలేనంత బిజీ షెడ్యూల్ గడపడం, పొద్దుగూకగానే ఇంత ముద్ద తిని పడకేయడం.. ఇలా సాగే యాత్రలో గ్రామీణుల చేతివృత్తులు, సంప్రదాయ కళలకు కూడా చోటు కల్పించేలా టూర్ డిజైన్ చేశారు.రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త

Updated By ManamWed, 07/04/2018 - 14:54

Farmersన్యూఢిల్లీ: రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వరి సహా ఖరీఫ్ పంటల కనీస మద్దతుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో క్వింటాల్ వరిపై మద్దతు ధర రూ.200వరకు పెరగనుంది.

కొత్తగా పెంచిన కనీస మద్దతు ధరల ప్రకారం.. క్వింటాల్ వరి(సాధారణ రకం) మద్దతు ధర రూ.1550 నుంచి రూ.1,750వరకు పెరిగింది. అలాగే గ్రేడ్ ఏ రకం వరి క్వింటాల్ ధర రూ.1,590 నుంచి రూ.1,750.. పత్తి ధర రూ.4,020 నుంచి రూ.5,150.. కందుల ధర రూ.5,450 నుంచి  రూ.5,675.. పెసర్ల ధర రూ.5,575 నుంచి రూ.6,975.. మినుములు రూ.5,400 నుంచి రూ.5,600లు పెరగనున్నాయి. అయితే పంటల సాగు వ్యయానికి కనీసం 1.5రెట్లు అధికంగా కనీస మద్దతు ధరను ఇస్తామని 2014 ఎన్నికల సందర్భంగా బీజేపీ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా ఈ హామీని నెరవేర్చారు.20 కోట్లకు టోకరా 

Updated By ManamTue, 07/03/2018 - 01:27
 • పత్తి కొని పైసలియ్యని దివ్యజ్యోతి యజమాని

 • ఎనుమాముల మార్కెట్‌లో బాధితుల ధర్నా.. మహిళా రైతు ఆత్మహత్యాయత్నం

 • వేయి మంది నుంచి పత్తి కొన్న వ్యాపారి.. మోసకారి శ్రీనివాసరావు అరెస్టు

imageవరంగల్: ఆసియాలోనే అతిపెద్ద గ్రీన్ మార్కెట్, ఉత్తర తెలంగాణకే తలమానికంగా నిలిచిన వరంగల్‌లోని ఎనుమాముల మార్కెట్‌లో రైతులను అడు గడుగునా మోసం చేస్తున్నారు. వరంగల్‌కు చెందిన దివ్యజ్యోతి ఎంటర్‌ప్రైజెస్ పాలకుర్తి నియోజక వర్గంలోని దాదాపు వేయి మంది రైతులకు మార్కెట్ ధర కన్నా 50 రూపాయలు ఎక్కువ ఇస్తామని ఆశ చూపి 15 నుంచి 20కోట్ల రూపాయల విలువైన పత్తిని కొన్నారు. డబ్బులు మాత్రం ఇప్పటికీ ఇవ్వకుండా రైతులను మోసం చేశారు. రైతులను మోసం చేసిన దివ్యజ్యోతి ఇంటర్‌ప్రైజెస్ యాజమా న్యాన్ని అరెస్టు.. చేసి రైతులకు చెల్లించాల్సిన కోట్లాది రూపాయలు ఇప్పించాలన్న డిమాండ్‌తో వరంగల్ డీసీసీబీ మాజీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి సోమవారం మార్కెట్ యార్డులో ధర్నా నిర్వహించారు. మోసానికి గురైన రైతులు దీనిలో పాల్గొన్నారు. ఆందోళనలో పాల్గొన్న ఒక మహిళారైతు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేసింది. అక్కడే ఉన్న రైతులు, ప్రజలు కిరోసిన్ బాటిల్‌ను గుంజుకుని రైతు ఆత్మహత్యా ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జంగా రాఘవరెడ్డి అధికారులు కల్పించుకుని వేయిమంది రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలనీ, మోసానికి పాల్పడ్డ దివ్యజ్యోతి ఎంటర్‌ప్రైజెస్ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం నోరుతెరిస్తే రైతు ప్రభుత్వం, రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెబుతూ పూట గడుపుతుందే తప్ప మార్కెట్‌లో జరుగుతున్న మోసాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని అన్నారు. ఒక పక్క రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందడం లేదని, పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని ఆత్మహత్యలు చేసుకుంటున్న తరుణంలో వేలాది మంది రైతులను నిండా ముంచడం ఆవేదన కలిగిస్తుంది, కానీ మోసకారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఉత్తర తెలంగాణ ప్రాంతానికే తలమానికంగా నిలిచిన ఎనుమాముల మార్కెట్‌లో అడుగడునా మోసం జరుగుతుందని, ప్రభుత్వం ఈ విషయాలను పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఎనుమాముల మార్కెట్ యార్డులో ప్రభుత్వ అధికారులు, కొనుగోలుదారుల మధ్య సమన్వయలోపంతో రైతులకు ఏం జరగడం లేదని, రోజుల తరబడి రైతులు మార్కెట్‌యార్డులో పడిగాపులు పడాల్సి వస్తోందని, గత ఏప్రిల్ నెలలో కురిసిన అకాలవర్షాలతో పంట నష్టపోయిన రైతులకు సరైన ధర చెల్లించలేదని, రైతుల వద్ద కొనుగోలు చేసిన అధికారులు రైతులకు సరైన సమయంలో డబ్బులు చెల్లించడం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి, పత్తి, మొక్కజొన్నకు వెంటనే చెక్కుల రూపంలో రైతులకు అందించాలని జంగా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. రెతులకు న్యాయం జరిగే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామన్నారు. 

మోసకారి శ్రీనివాసరావు అరెస్టు
ఈ వ్యవహారంపై మార్కెట్ సెక్రటరీ నిర్మల స్పందిస్తూ రైతుల వద్ద పత్తి కొనుగోలు చేసిన దివ్యజ్యోతి ఎంటర్‌ప్రైజెస్ సంస్థ యజమాని శ్రీనివాసరావు అనే వ్యక్తికి మార్కెట్ యార్డుతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఆయన ప్రైవేటు కొనుగోలుదారుడని, రైతుల వద్ద కొనుగోలు చేసేందుకు లైసెన్స్ కూడా లేదని చెప్పారు. ఆయన్ను అరెస్టు చేసి అడ్తి దుకాణాన్ని సీజ్ చేశారని తెలిపారు. మార్కెట్‌లో రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఖరీఫ్‌కు కదిలేదెట్లా..!

Updated By ManamSun, 07/01/2018 - 23:08
 • ‘పెట్టుబడి’ సొమ్ము ప్రాథమిక అవసరాలకే.. ఎప్పటిలాగే రైతుల చూపు ప్రైవేటు వైపు

 • పహాణీలు అందక అన్నదాతల పరేషాన్.. యాసంగిలో బ్యాంకులచ్చింది 65 శాతమే..

farmerహైదరాబాద్: ఓవైపు వర్షాకాలం మొదలైంది.. మరోవైపు రైతన్న సాగుకు సన్నద్ధమవుతుండు.. కానీ పెట్టుబడికి చేతినిండా పైసల్లేక అల్లాడాల్సిన పరిస్థితి నెలకొంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహోన్నత ఆశయంతో రైతులకు పంట పెట్టుబడి కోసం ఎకరాకు రూ.4వేలు అందించింది. పెట్టుబడి కింద ప్రభుత్వం నుంచి వచ్చిన సొమ్ముతో చదును చేయించి(ఇంతకుముందు వేసిన పంటల్ని తొలగించడం) దుక్కుల్ని సిద్ధం చేసి పెట్టుకున్నాడు. ఇంతవరకు బాగానే సాగింది. ఇగ ఇక్కడ్నుంచే ఖరీఫ్ సీజన్ ముందుకు సాగుతలేదు. చాలా తక్కువమంది పెట్టుబడి సొమ్ముతోనే అరకొరగా విత్తనాలు తెచ్చి పెట్టుకున్నరు. అధికశాతం మంది రైతులకు భూమిని చదును చేయించేందుకే ఆ సొమ్ము సరిపోయింది. దీంతో విత్తనాలు ఎట్లా పెట్టాలో.. ఎరువులు, పురుగుమందులు ఎట్లా కొనుగోలు చేయాలో తెలియక సతమతమవుతున్నడు. వాస్తవంగా ప్రతీ సంవత్సరం పరిస్థితి దాదాపు ఇలానే ఉండేది. దీంతో బ్యాంకులను పంట రుణం కోసం ఆశ్రయించేవారు. బ్యాంకు రుణం దొరకని రైతులు.. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పుజేసేవారు. కానీ తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు పంట పెట్టుబడి కింద ఎకరాకు రూ.4వేలు అందజేయడంతో బ్యాంకులు రైతులకు రుణాలిచ్చేందుకు విముఖత చూపుతున్నాయి. వానాకాలం మొదలైనా.. ఇంతవరకు ఏ ఒక్కరికీ బ్యాంకులు పూర్తిస్థాయిలో రుణాలిచ్చిన దాఖాలాల్లేవు. ఇగ తప్పనిపరిస్థితుల్లో ప్రతీ సంవత్సరం మాదిరిగానే ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి రైతులు అప్పుజేసి.. సాగు పనులు మొదలుబెడ్తున్నరు.

ఆలస్యంగా ఎస్‌ఎల్‌బీసీ సమావేశం..
రుణాలకు సంబంధించి ఏటా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జూన్‌కు ముందే జరగాల్సి ఉంటుంది. కానీ వివిధ కారణాల రీత్యా జూన్ 28న ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ పంట రుణాలతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు బ్యాంకులు అందజేసే రుణాల లక్ష్యాలను ప్రకటించారు. ఇదిలావుంటే.. మరో రెండు వారాల్లో పత్తి పంటలకు బీమా ప్రీమియం చెల్లింపు గడువు ముగియనుంది. అయితే పంట రుణాలు నత్తనడకన సాగుతుండడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఎందుకంటే.. కేవలం రెండు వారాల్లో 47 లక్షల మంది రైతులు రుణాలివ్వడం కష్టతరమే. బ్యాంకులు రుణాలు ఇచ్చే సమయంలోనే రైతుల నుంచి కొంత నగదును తీసుకుని పంటలకు బీమాను చెల్లిస్తాయి. ఈ క్రమంలో పంట రుణాలు ఇవ్వడం ఆలస్యమైతే.. పత్తి పంటకు బీమా ప్రీమియం గడువు తీరనుంది. ఫలితంగా రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది.

గతేడాది పంట రుణాలు 65 శాతమే..
తెలంగాణ రాష్ట్రంలో గతేడాది (2017-18)కి సంబంధించి బ్యాంకులు కేవలం 65 శాతం రుణాలు మాత్రమే ఇచ్చాయి. గతేడాది ఖరీఫ్  పంట రుణాల లక్ష్యం రూ.23,851 కోట్లు కాగా బ్యాంకులు రూ.21,025(88.15 శాతం)కోట్లు మాత్రమే ఇచ్చాయి. యాసంగి సీజన్‌కొచ్చేసరికి పంట రుణాల లక్ష్యం రూ.15,901 కోట్లు కాగా, బ్యాంకులు కేవలం రూ.10,384(65 శాతం) కోట్లు మాత్రమే ఇచ్చాయి. ఇదిలావుంటే.. వీటిలో చాలావరకు బ్యాంకులు రైతులకు నేరుగా రుణాలను ఇవ్వలేదు. కేవలం ఖాతా బుక్కుల్లో అడ్జస్ట్‌మెంట్ మాత్రమే చేసినట్టు సమాచారం. 2018-19 సంవత్సరానికి సంబంధించి 47,65,683 మందికి రూ.42,494 కోట్లను పంట రుణాల కోసం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇప్పటికే ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి చాలామంది రైతులు బ్యాంకుల్లో రుణాలు దొరక్క.. ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. మరీ బ్యాంకులు ఏమేరకు రైతులకు రుణాలు అందిస్తాయనేది వేచిచూడాల్సిన అంశమే.

రైతులకు పహాణీ కష్టాలు..
రైతులు బ్యాంకుల్లో రుణాలు పొందాలంటే.. పహాణీలు తప్పనిసరి. కానీ ప్రస్తుతం పహాణీలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఆన్‌లైన్‌లో పహాణీల సమాచారం అందుబాటులో ఉండగా, ప్రస్తుతం భూరికార్డుల ప్రక్షాళన సందర్భంగా అధికార యంత్రాంగం దాన్ని నిలిపేసింది. వెబ్‌సైట్ ద్వారా ఇచ్చిన సమాచారంలో తప్పులు దొర్లడంతో వాటిని సరిదిద్దేందుకు చర్యలు చేపట్టారు. తహసీల్దార్ ధ్రువీకరించిన పహాణీని బ్యాంకులో సమర్పించాల్సి ఉంటుంది. కానీ సమాచార లోపంతో తహసీల్దార్లు కూడా పహాణీలను జారీ చేయడం లేదు. ఫలితంగా బ్యాంకులో రుణం కోసం రైతులు రోజుల తరబడి వ్యవసాయ పనులు మానుకుని.. అధికారుల చుట్టూ ప్రద క్షిణలు చేస్తున్నారు.

లోటులో ప్రస్తుత సీజన్ వ్యవసాయం..
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుత సమయానికి 36.24 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు కేవలం 24.62 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. అంటే 11.62 లక్షల ఎకరాల్లో పంట సాగు కాలేదన్నమాట. ఎనిమిది జిల్లాలో పదిశాతం పంటల సాగు నమోదు కాలేదు. ఇదిలావుంటే.. ఇప్పటివరకు సాగు చేసిన పంటల విస్తీర్ణంలో పత్తి పంట 14.30 లక్షల ఎకరాలు, 2.95లక్షల ఎకరాల్లో కందులు, 1.98 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 1.61 లక్షల ఎకరాల్లో సోయాబీన్, 1.29 లక్షల ఎకరాల్లో వరిపంట, 37 వేల ఎకరాల్లో జొన్న పంట సాగయ్యింది.పాలు, పండ్లు రోడ్లపై పడేసి.. దేశవ్యాప్తంగా రైతుల ఆందోళన

Updated By ManamFri, 06/01/2018 - 15:11

strike న్యూఢిల్లీ: రైతు రుణమాఫీ, స్వామి నాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్‌లలో రోడ్లపైకి వచ్చిన రైతులు తమ నిరసనను తెలుపుతున్నారు. ఈ సందర్భంగా రోడ్లపై కూరగాయలు, పండ్లు, పాలు పడబోసి తమ ఆందోళనను వ్యక్తపరుస్తున్నారు. పదిరోజులు ఇలాగే నిరసనలు వ్యక్తం చేస్తామని అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే తీవ్ర పర్యావసనాలు తప్పవని వారు హెచ్చరించారు.

 తడిసిన ధాన్యంపై రైతులకు మంత్రి భరోసా

Updated By ManamFri, 05/04/2018 - 12:56

harish rao సిద్ధిపేట: తడిసిన ధాన్యాన్ని కొంటామని రైతులతో మంత్రి హరీశ్ రావు భరోసా ఇచ్చారు. సిద్ధిపేట మార్కెట్‌యార్డులో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన హరీశ్ రావు అనంతరం మాట్లాడుతూ.. రైతుల నుంచి చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షానికి చాలా పంట నష్టం జరిగిందని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. 

ఇక మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు కొనేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చామని హరీశ్ రావు చెప్పారు. ధాన్యం కొనగానే వెంటనే తరలించాలని రవాణా అధికారులకు, కలెక్టర్లకు సూచించామని మంత్రి పేర్కొన్నారు. 

Related News