legal notice

‘లాయర్ కోట్’ ఎంత పనిచేసింది?

Updated By ManamFri, 11/02/2018 - 11:40
  • అమితాబ్‌కు లీగల్ నోటీసులు 

Amitabh Bachchan Served Legal Notice by Bar Council of Delhi

న్యూఢిల్లీ : సాధారణంగా వాణిజ్య ప్రకటనల్లో నటించేవారు  టీచర్, డాక్టర్, లాయర్...ఇలా వివిధ వృత్తుల్లో రాణిస్తున్నట్లు చూస్తూనే ఉంటాం. అయితే ఇక నుంచి యాడ్స్‌లో నటించేవాళ్లు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిందే. లేకుంటే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్‌లా నోటీసులు అందుకోవాల్సిందే. ఇంతకీ అసలు విషయం ఏంటంటే... అమితాబ్ నటించిన ‘ఎవరెస్ట్ మసాలా’ యాడ్‌పై ఢిల్లీ బార్ కౌన్సిల్ సీరియస్ అయింది. 

ఆ యాడ్‌లో ఆయన లాయర్ కోట్ ధరించడాన్ని బార్ కౌన్సిల్ తప్పుబట్టింది. అనుమతి లేకుండా లాయర్ కోట్ వినియోగించడాన్ని ఆక్షేపిస్తూ ...అమితాబ్‌కు లీగల్ నోటీసులు పంపింది. అంతేకాకుండా ఆ యాడ్‌ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేసింది. అలాగే అమితాబ్‌తో పాటు ఎవరెస్ట్‌ మసాలా, యూట్యూబ్‌, ఓ మీడియా సంస్థకు బార్ కౌన్సిల్ నోటీసులు పంపిస్తూ...పదిరోజుల్లోగా స్పందించాలని సూచించింది. అయితే ఈ నోటీసులుపై అమితాబ్ ఇంకా స్పందించలేదు.



రేవంత్‌కు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు

Updated By ManamWed, 09/12/2018 - 12:34
Jubilee Hills  Police serve notice to Revanth reddy

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అవకతవకల కేసులో  కాంగ్రెస్ సీనియర్ నేత రేవంత్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.  తప్పుడు పత్రాలతో ఇళ్ల స్థలాల కేటాయించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి 15 రోజుల్లోగా విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆ నోటీసులలో రేవంత్ రెడ్డికి సూచించారు. 41 సీఆర్పీసీ కింద రేవంత్ సహా 13మందికి నోటీసులు ఇచ్చారు. అయితే ఎన్నికల బిజీలో ఉన్నందున విచారణకు హాజరు కాలేనని ఆయన లేఖ రాశారు.



మిడిల్ ఫింగర్ ఎమోజీపై వాట్సాప్‌కు నోటీసులు

Updated By ManamTue, 12/26/2017 - 20:16

wtpన్యూఢిల్లీ: సోషల్ మీడియా, వాట్సాప్‌‌ వాడుతున్న వారికి ఎమోజీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక మనిషి  భావోద్వేగాలను వ్యక్తం చేసేందుకు ఈ ఎమోజీలను ఉపయోగిస్తుంటారు. కోపం, బాధ, నవ్వు ఇలా రకరకాల ఎమోజీలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాట్సాప్‌ ఈ మధ్య కాలంలో మిడిల్ ఫింగర్ ఎమోజీని తీసుకొచ్చింది. ఈ ఎమోజీ వివాదాస్పదంగా మారింది. భారతదేశంలో ఇలా ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తికి మధ్య‌వేలును చూపడమంటే బూతును తిట్టినట్టే. స్త్రీలకు అలా మధ్యవేలును చూపించడమంటే వారిని వేధింపులకు గురిచేసినట్టే అవుతుంది. ఈ ఎమోజీ ఈ మధ్య వాట్సాప్‌లో హల్‌చల్ చేస్తోంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యూఢిల్లీకి చెందిన న్యాయవాది గుర్మీత్ సింగ్ వాట్సాప్‌కు లీగల్ నోటీసులు జారీ చేశారు.

15రోజుల్లోగా ఆ ఎమోజీని తొలగించాలని ఆయన వాట్సాప్‌ను హెచ్చరించారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 354, 509 ప్రకారం ఆ ఎమోజీ మహిళలను కించపరిచే విధంగా ఉందని ఆయన నోటీసులో పేర్కొన్నారు. క్రిమినల్ జస్టిస్(పబ్లిక్ ఆర్డర్) చట్టం 1994, సెక్షన్ నంబర్ 6 ప్రకారం మిడిల్ ఫింగర్‌ను చూపడాన్ని ఐర్లాండ్‌లో నేరంగా పరిగణిస్తారని గుర్మీత్ వెల్లడించారు. 15రోజుల్లోపు మిడిల్ ఫింగర్‌కు సంబంధించిన ఎలాంటి చిహ్నాలు, ఎమోజీలు, ఫొటోలు వాట్సాప్‌లో ఉండకూడదని, కాదని ఉంచితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని న్యాయవాది హెచ్చరించారు. వాట్సాప్ ఈ నోటీసుపై ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.





Related News