vaikunta ekadasi

భక్తజనసంద్రమైన తిరుమల

Updated By ManamFri, 12/29/2017 - 20:45
Tirumala

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల భక్తజన సంద్రమైంది. గతంలో ఏ వైకుంఠ ఏకాదశికి లేనంతగా భక్తుల తాకిడి నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లన్నీ నిండిపోయి బయట ఐదు కిలోమీటర్ల పైబడి మూడు వరసల కూలైన్లలో భక్తులు బారులుతీరారు. స్వామివారి దర్శనానికి 25 గంటల సమయం పడుతోంది. మరో రెండు రోజులపాటు తిరుమలలో దాదాపు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముంది. తిరుమల కొండపై ఎటుచూసినా భక్తులే కనిపిస్తున్నారు.  

Tirumala

కాగా స్వామివారి స్వర్ణరథోత్సవంలో భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.  స్వర్ణ రథంపై స్వామివారు తిరువీధుల్లో విహరిస్తుండగా...తిరుమల గిరులు గోవిందనామస్మరణలతో మార్మోగిపోయాయి. 

tirumala

 



సింహాద్రి అప్పన్న ఉత్తరద్వార దర్శనం

Updated By ManamFri, 12/29/2017 - 17:18

simhadri appannaతెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వైష్ణవ ఆలయాల్లో భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తరద్వార దర్శనం కోసం భక్తులు బారులుతీరారు.  సింహాద్రిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అప్పన్న ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. వైకుంఠవాసుడిగా శేషతల్పంపై శ్రీ వరాహలక్ష్మీ నృశింహస్వామి దర్శనమిచ్చారు. 





Related News