ranveer singh

సింధీ సంప్రదాయంలో...

Updated By ManamSat, 09/08/2018 - 02:35

బాలీవుడ్ జంట రణవీర్ సింగ్, దీపికా పదుకొన్ ఈ సంవత్సరం నవంబర్‌లో వివాహ బంధంతో ఒక్కటి కానున్న విషయం తెలిసిందే. వీరి వివాహం ఏ పద్ధతిలో జరగనుందనే విషయం చర్చనీయాంశంగా మారింది. అయితే సింధీ సంప్రదాయ పద్ధతిలోనే ఈ వివాహం జరిపించడానికి రణవీర్ సింగ్ కుటుంబ సభ్యులు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. వారి సంప్రదాయ దుస్తులు, వంటకాలు, వివాహ పద్ధతి ప్రకారం ఉండాలని భావిస్తున్నారు.

image


స్నేహితులు, బంధువులు పెళ్లి కుమారుడి వస్త్రాలను చంపే సంప్రదాయమైన సాంత్ కార్యక్రమం కూడా పెళ్ళిలో ఉండాలని చెబుతున్నారు. దీపికా, రణ్‌వీర్‌ల వివాహం ఇటలీలోని ఓ సుందర సరస్సు సమీపాన అత్యంత వేడుకగా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడలేదు. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది. బాలీవుడ్ బయోపిక్‌లో అల్లు అర్జున్..?

Updated By ManamFri, 09/07/2018 - 11:25

Allu Arjunటాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్ లో ఆరంగేట్రం చేయబోతున్నాడా..? బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ బయోగ్రఫీలో బన్నీ కనిపించనున్నాడా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి. 1983లో టీమిండియా ప్రపంచ కప్‌ను సాధించగా.. దాని ఆధారంగా బాలీవుడ్‌లో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 83 అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

ఇక ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రలో కనిపిస్తుండగా.. కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రకు అల్లు అర్జున్ కోసం సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. 1983లో భారత్ వరల్డ్ కప్‌ సాధనలో శ్రీకాంత్ పాత్ర కూడా కీలకం. అందుకే ఈ పాత్రను ఒక స్టార్ హీరోతో చేయించాలని చిత్ర యూనిట్ అనుకుందట. బన్నీ చిత్రాలు హిందీలో డబ్ అయ్యి యూట్యూబ్‌లో సంచలనం సృష్టించాయి. అందునా అక్కడ ఈ హీరోకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఇందులో బన్నీ ఉంటే బావుంటుందని భావించిన టీం, శ్రీకాంత్ పాత్రకు ఎంచుకున్నట్లు సమాచారం. ఇక ఇందులో నటించేందుకు బన్నీ కూడా ఆసక్తిని చూపుతున్నట్లు టాక్. ఒకవేళ ఇదే నిజమైతే మెగా అభిమానులకు పండగే.ఇద్దరిలో ఎవరు కత్తి      

Updated By ManamFri, 08/24/2018 - 22:45

imageతమిళంలో విడుదలై ఘన విజయం సాధించిన ‘కత్తి’ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. చిరంజీవి ఎంట్రీ మూవీగా ‘ఖైదీ నంబర్ 150’ పేరుతో సినిమా విడుదైలెంది. తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించింది. రైతు సమస్యలపై తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్ దర్శక నిర్మాత సంజయ్ లీలా బన్సాలి సినిమా రీమేక్ హక్కులను దక్కించుకున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి. హీరోగా ఎవరు నటిస్తారనే దానిపై పలు వార్తలు వినవస్తున్నాయి. ఇప్పటికే మురగదాస్ చిత్రాలు తుపాకీ, ఠాగూర్ హిందీ రీవేుక్స్‌లో అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. కాబట్టి కత్తి రీవేుక్‌లో అక్షయ్‌ కుమార్ నటించే అవకాశాలున్నాయంటున్నారు. అలాగే రణవీర్ సింగ్ కూడా ఇందులో హీరోగా నటించే అవకాశాలున్నాయని వార్తలు వినపడుతున్నాయి.భారీ తారాగణంతో కరణ్ ‘తక్త్’.. నటీనటులు వీరే

Updated By ManamThu, 08/09/2018 - 13:53

takhtబాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ తన దర్శకత్వంలో తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. ‘తక్త్’ అనే పేరుతో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో భారీ తారాగణం నటించనుంది. అందులో రణ్‌వీర్ సింగ్, కరీనా కపూర్, అనిల్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్, భూమి పడ్నేకర్, జాన్వీ కపూర్‌లు నటించనున్నారు. దీనికి సంబంధించిన ఆయన అధికారిక ప్రకటనను ఇచ్చారు. ఈ చిత్రం ప్రేమ, యుద్ధానికి సంబంధించినది అని కరణ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరపుకుంటున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుండగా.. 2020లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కరణ్ స్వీయ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. కాగా కరణ్ జోహార్ దర్శకత్వంలో చివరగా ‘యే దిల్ హై ముష్కిల్’ తెరకెక్కిన విషయం తెలిసిందే.ఇటలీలో పెళ్లి.. ముంబైలో రిసెప్షన్

Updated By ManamSat, 07/28/2018 - 11:52

ranveer, deepika బాలీవుడ్ ప్రేమపక్షులు రణ్‌వీర్, దీపికలు త్వరలో పెళ్లిచేసుకోనున్నారా..? అంటే అవునంటున్నారు వారి సన్నిహితులు. ఈ నవంబర్‌ 10న ఈ ఇద్దరి వివాహానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఉత్తర ఇటలీలోని లంబార్టీ అనే ప్రదేశంలో ప్రకృతి అందాల మధ్య ఈ ఇద్దరి వివాహం జరగనుందని సన్నిహితవర్గాలు తెలిపాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో ఈ ఇద్దరు వివాహం చేసుకోనున్నారట. దీనికి సంబంధించి అక్కడికి వెళ్లనున్న అతిథులందరి కోసం లాడ్జిలు, విల్లాలు ఇప్పటికే బుక్ చేశారని అంటున్నారు. ఇక ఆ తరువాత ముంబైలో అందరి కోసం రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

కాగా పద్మావతి తరువాత ఏ చిత్రాన్ని ఒప్పుకోని దీపికా.. ప్రస్తుతం పెళ్లి పనులు చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు గల్లీబాయ్‌తో పాటు టెంపర్ రీమేక్‌లో నటిస్తున్న రణ్‌వీర్ ఈ రెండు చిత్రాలను నవంబర్‌లోగా పూర్తి చేయాలని భావిస్తున్నాడట. మరి ఈ వార్తలపై రణ్‌వీర్, దీపికా జంట ఎలా స్పందిస్తుందో చూడాలి.రణ్‌బీర్‌ నాకు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికాడు

Updated By ManamWed, 07/25/2018 - 14:42

Ranbir, deepikaరణ్‌వీర్ సింగ్‌తో ప్రేమాయణం కొనసాగించక మునుపు దీపికా పదుకొనే, రణ్‌బీర్ కపూర్‌లు కొన్ని సంవత్సరాలు డేటింగ్ చేసి, మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఆ తరువాత ఒకరి గురించి మరొకరు మాట్లాడేందుకు కూడా వీరు ఇష్టపడలేదు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దీపికా పదుకునే రణ్‌బీర్ పేరు చెప్పకుండా.. తన పాత రిలేషన్‌ ఎందుకు చెడిందో చెప్పింది. ఈ నేపథ్యంలో రణ్‌బీర్‌పై ఘాటు కామెంట్లు చేసింది దీపికా.

‘‘రిలేషన్‌లో ఉన్నప్పుడు నేను ఎవరినీ మోసం చేయలేదు. కానీ అతడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడి నా నమ్మకాన్ని వమ్ముచేశాడు. ఆ సమయంలో రెండో చాన్స్ ఇవ్వాలంటూ చాలా ప్రాధేయపడ్డాడు. కానీ మరోసారి ఫూల్ అవ్వకూడదనే ఉద్దేశంతోనే అతడికి దూరమయ్యాను. అతడి నుంచి విడిపోయిన తరువాత చాలా కుమిలిపోయా. ఆ తరువాత ఆ విషాదం నుంచి నెమ్మదిగా బయటపడ్డా’’ అంటూ రణ్‌బీర్ గురించి చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. అయితే దీపికాతో బ్రేకప్ తరువాత రణ్‌బీర్, కత్రినాను ప్రేమించాడు. వీరి రిలేషన్ కూడా మూడు రోజుల ముచ్చటగానే నిలిచింది. విడిపోయిన సమయంలో కత్రినా కూడా రణ్‌బీర్‌పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం అలియాతో రణ్‌బీర్ ప్రేమలో ఉన్నాడు.రణ్‌వీర్ ఫొటోకు షాక్ తిన్న దీపికా

Updated By ManamSun, 06/24/2018 - 13:48
ranveer

గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న బాలీవుడ్ సెలబ్రిటీలు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకునేలు ఈ ఏడాది పెళ్లి పీటలెక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయని, ఈ నేపథ్యంలో ఇద్దరు షాపింగ్ కూడా చేస్తున్నారని బాలీవుడ్‌లో గుసగసలు వినిపించాయి. అయితే వీటిని ఈ జోడి ఖండించకపోవడంతో అవి నిజమని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో రణ్ వీర్ సింగ్ పెట్టిన ఓ ఫొటోకు దీపికా షాక్ తింది. అంతేకాదు ‘నో’ అంటూ కామెంట్ పెట్టేసింది. మరి దీపికా అంతలా షాక్ తిన్న ఫొటో ఏంటంటే రణ్‌వీర్‌ చిన్నప్పటి ఫొటో. ఓ ఢిపరెంట్ హెయిల్‌స్టైల్‌లో ఉన్న రణ్‌వీర్‌ ఈ ఫొటోను 1985లో తీసుకోగా.. దాన్ని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాన్ని చూసిన ఆయుష్మాన్ ఖురానా, గుల్షన్ గ్రోవర్, అర్జున్ కపూర్, అదితీ రావు హైదారీ ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తుండగా.. దీపికా ‘నో’ అంటూ కామెంట్ పెట్టింది. 
 

Ranveer singh

 రణ్‌వీర్, దీపికా వివాహ తేది ఖరారు!

Updated By ManamThu, 06/21/2018 - 14:34

Ranveer, Nani గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న రణ్‌వీర్, దీపికా పదుకునేలు తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి వివాహానికి ఇరు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో త్వరలో పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. దీంతో ఎప్పటి నుంచో ప్లాన్‌ను వేసుకున్న ఈ జంట తాజాగా పెళ్లికి ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో నవంబర్ 10న వీరి వివాహానికి ఇరు వర్గాలు ఓకే చెప్పినట్లు వారి సన్నిహితులు ద్వారా తెలిసింది.

అంతేకాదు విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ లాగా మీడియాకు దూరంగా ఫారిన్‌లో పెళ్లి చేసుకొని, ఇండియాలో రిసెప్షన్‌ పెట్టుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పెళ్లి కోసం ఇటలీని వారి ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమయ్యాడట. మరి దీనిపై ఈ జోడి ఎలా స్పందిస్తుందో చూడాలి.రణ్‌వీర్‌, అనుష్కలకు ఫాల్కే అవార్డు

Updated By ManamWed, 04/11/2018 - 11:57

Khilji తన ఎనర్జిటిక్ నటనతో దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ మరో అరుదైన అవార్డును అందుకోనున్నారు. 2018 సంవత్సరం దాదా సాహెబ్ ఫాల్కే ఎక్స్‌లెన్స్ అవార్డు గానూ రణ్‌వీర్‌ను ఎంపిక చేశారు నిర్వాహకులు. ఈ విషయాన్ని వారు అధికారికంగా ప్రకటించారు.

‘పద్మావత్‌’లో రణ్‌వీర్ పోషించిన మహమ్మద్ ఖిల్జీ పాత్రకు గానూ ఈ అవార్డును ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా ‘పద్మావత్‌’లో మహమ్మద్ ఖిల్జీ పాత్రలో రణ్‌వీర్ ఎంతగా ఒదిగిపోయారో అందరికీ తెలిసిందే. ఆ పాత్రలో అతడిని తప్ప మరెవ్వరినీ ఊహించుకోని విధంగా నటించారు. అందుకు గానూ ఇప్పటికే రెండు అవార్డులను కూడా అందుకున్నారు రణ్‌వీర్. ఇక హీరోయిన్లలో ఈ అవార్డును అనుష్క శర్మ అందుకోనున్నారు. నిర్మాతగా డిఫరెంట్ కంటెంట్ ఉన్న చిత్రాలను నిర్మిస్తున్నందుకు గానూ ఈ అవార్డుకు ఆమెను ఎంపిక చేశారు.

Anushka Sharma

 చెర్రీ యాక్టింగ్ ఇష్టమన్న బాలీవుడ్ హీరో

Updated By ManamSat, 04/07/2018 - 11:43

Ram Charan, Ranveer Singh మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లో కూడా మంచి క్రేజ్ ఉంది. కెరీర్ కొత్తలోనే ‘జంజీర్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు చెర్రీ. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. అక్కడ మాత్రం చాలా మంది అభిమానులనే సంపాదించుకున్నాడు ఈ మెగా హీరో. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ బాలీవుడ్ హీరో రామ్ చరణ్‌ నటన అంటే తనకు ఎంతో ఇష్టమని అతడి అత్త శోభన కామినేనికి చెప్పాడు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించింది. ఇంతకు ఆ హీరో ఎవరనుకుంటున్నారా.. మరెవరో కాదండి రణ్‌వీర్ సింగ్.

ఇటీవల జరిగిన ఇండియా బిజినెస్ లీడర్ అవార్డుల్లో ‘ఎంటర్‌టైన్ లీడర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును రణ్‌వీర్ సింగ్ సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డును శోభన కామినేని చేతుల మీదుగా తీసుకున్నాడు రణ్‌వీర్. ఆ తరువాత ఈ ఇద్దరు ముచ్చడించుకోగా.. తనకు రామ్ చరణ్ యాక్టింగ్‌ అంటే ఇష్టమని రణ్‌వీర్ తెలిపాడని ఆమె సోషల్ మీడియాలో తెలిపింది. దీన్ని చెర్రీ భార్య ఉపాసన కూడా తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

 

Related News