shahid kapoor

హిందీ ‘అర్జున్ రెడ్డి’ ఫస్ట్‌లుక్

Updated By ManamFri, 10/26/2018 - 11:20

Kabir Singhటాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డినే హిందీ వెర్షన్‌కు డైరక్ట్ చేస్తున్నాడు. అక్కడ కబీర్ సింగ్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. తాజాగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఇక ఈ చిత్రంలో షాహిద్ కపూర్ సరసన కియారా నటిస్తుండగా.. వచ్చే ఏడాది జూన్ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా హిందీ అర్జున్ రెడ్డిలో పలు మార్పులు ఉంటాయని ఇదివరకే దర్శకుడు ప్రకటించిన విషయం తెలిసిందే.‘అర్జున్‌రెడ్డి’కి పిల్ల ఖరారు

Updated By ManamTue, 09/25/2018 - 13:16

Shahid Kapoor, Kiara Advaniటాలీవుడ్ సెన్సేషనల్ చిత్రం ‘అర్జున్ రెడ్డి’ని హిందీలో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డినే హిందీలో కూడా తెరకెక్కిస్తున్నారు. ఇందులో షాహిద్ కపూర్ అర్జున్ రెడ్డిగా కనిపిస్తుండగా.. ఆయన సరసన ప్రీతి పాత్రలో మొదట ప్రముఖ మోడల్ తారా సుటారియాను ఎంచుకున్నారు. అయితే కారణాలు తెలీదు కానీ సినిమా ప్రారంభం అవ్వకముందే ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుంటున్నానని చెప్పి ఆమె షాక్ ఇచ్చింది.

దీంతో ఆ పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీని తాజాగా ఎంపిక చేసుకున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరి ప్రీతిగా కియారా ఎంతమందిని ఆకట్టుకుంటుందో చూడాలి. కాగా ‘ఫగ్లీ’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కియారా.. ఆ తరువాత ‘ఎమ్‌ఎస్‌ ధోని’తో మంచి పేరును సంపాదించుకుంది. ఇక ఈ ఏడాది తెలుగులో ‘భరత్ అనే నేను’తో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చిన కియారా.. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే.షాహిద్ కపూర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్..

Updated By ManamThu, 09/06/2018 - 18:01
  • ‘పద్మావత్’ చిత్రంపై అసభ్యకర సందేశాన్ని జతచేసి పోస్టింగ్ 

  • షాహిద్ కపూర్ ట్విట్టర్‌లో టర్కీష్ భాషలో రీట్వీట్స్.. 

Shahid Kapoor, Twitter account hack, hate message, Padmaavatముంబై: బాలీవుడ్ నటుడు షాహిద్ కపూ‌ర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌కు గురైంది. షాహిద్ భార్య మీరా రాజ్‌పూట్ గత రాత్రి రెండోబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా షాహిద్ ఇంట్లో వేడుకుల్లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో షాహిద్ తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌‌కు గురైనట్టు గుర్తించారు. ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేసిన హ్యాకర్.. ప్రత్యేకించి టర్కీష్ భాషలో వివాదాస్పద చిత్రం ‘పద్మావత్’ చిత్రంపై అసభ్యకరమైన సందేశాన్ని పోస్టు చేశాడు. ఈ ఏడాదిలో బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మించిన పద్మావత్ చిత్రం ఎన్నో వివాదాలను దాటుకొని విజయవంతంగా విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో షాహిద్.. చిత్తూర్ మహార్వాల్ రతన్ సింగ్‌ పాత్రను పోషించగా.. రన్‌వీర్ సింగ్ అల్లా ఉద్దీన్ ఖిల్జీ పాత్రలో.. దీపకా పదుకొనె పద్మావతిగా నటించారు. ఈ చిత్రానికి ఎన్నో అవంతరాలు చుట్టుముట్టిన సంగతి విదితమే. ఈ వివాదాస్ప చిత్రంపై టర్కీష్ భాషలో హ్యాకర్ షాహిద్ ట్విట్టర్ అకౌంట్‌లో అసభ్యకర సందేశాన్ని పోస్టు చేసి.. ఆ పోస్టును ఇతర విదేశీ అకౌంట్లకు పలుసార్లు రీట్వీట్ చేశాడు. ‘ఐ లవ్ కత్రినా’ అనే క్యాప్షన్‌తో ‘ఎక్తా థా టైగర్’ చిత్రం నుంచి ‘మషాల్హ్’ అనే పాటను కూడా షేర్ చేశాడు. కాగా, షాహిద్ కపూర్ నటించిన కొత్త చిత్రం ‘భట్టి గుల్ మీటర్ ఛాలు’ ఈ నెల 21న విడుదల కానుంది. Shahid Kapoor, Twitter account hack, hate message, Padmaavatషాహిద్‌ ఇంట వారసుడు

Updated By ManamThu, 09/06/2018 - 11:40

Shahid Kapoorబాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ ఇంట మరో వ్యక్తి చేరాడు. షాహిద్ భార్య మీరా రాజ్‌పుత్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బుధవారం సాయంత్రం ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో షాహిద్ భార్య జన్మనిచ్చింది. కాగా 2016లో షాహిద్, మీరా దంపతులకు మిషా అనే పాప పుట్టినవిషయం తెలిసిందే. ఇక ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు షాహిద్, మీరా దంపతులకు శుభాకాంక్షలను చెబుతున్నారు.ప్ర‌భుదేవా అంటే ఇష్ట‌మ‌న్న న‌టి

Updated By ManamWed, 08/08/2018 - 15:12

Kiara Advani, Prabhudeva`నాకు ప్ర‌భుదేవా అంటే చాలా ఇష్టం. నేను ఆయ‌న‌కు వీరాభిమానిని` అని కైరా అద్వానీ అన్నారు. ఉన్న‌ట్టుండి ఈ భామ ప్ర‌భుదేవాను ఎందుకు పొగ‌డాల్సి వ‌చ్చింద‌ని ఆరా తీస్తే ఆస‌క్తిక‌ర‌మైన అంశాలే వెలుగుచూశాయి. ఆయ‌న న‌టించిన `ఊర్వ‌శీ ఊర్వ‌శీ` పాట‌కు ఇప్పుడు కైరా స్టెప్పులు వేయ‌నుంది. అవునా... ఇంత‌కీ ఏ భాష‌లో అంటే హిందీలో.

ప్ర‌భుదేవా, న‌గ్మా జంట‌గా న‌టించిన `ప్రేమికుడు` సినిమాలోని ఊర్వ‌శి పాట ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే. అందులోని ఊర్వ‌శి పాట అయితే మ‌రీనూ. ఇప్పుడు ఆ పాట‌ను షాహిద్ క‌పూర్ హిందీ `అర్జున్ రెడ్డి`లో పెట్ట‌నున్నారు. ఇందులో ఆ పాట‌లో కైరా స్టెప్పులు వేయ‌నుంది. ఊర్వ‌శీ ఊర్వ‌శీ అనే ప‌దాల‌ను మాత్రం అలాగే ఉంచి, మిగిలిన సాహిత్యాన్ని మారుస్తార‌ట‌. యోయో హ‌నీ సింగ్ పాట‌ను కంపోజ్ చేసే ప‌నుల్లో ఉన్నారు. ఫిల్మ్ సిటీలో క్ల‌బ్ సెట్‌లో తెర‌కెక్కిస్తోన్న ఈ పాట గురించి కైరా మాట్లాడుతూ ``షాహిద్ డ్యాన్సులు ఇర‌గ‌దీస్తాడు. అత‌నితో స‌మానంగా స్టెప్పులు వేయ‌డం చాలా క‌ష్టం`` అని అన్నారు. జాన్వీ ‘అర్జున్ రెడ్డి’ని వద్దనడానికి కారణం..

Updated By ManamMon, 07/02/2018 - 15:00

Jhanvi Kapoor అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ‘ధడక్’ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమవుతుంది. అయితే ఈ మూవీ రిలీజ్ అవ్వకముందే ఈమెకు ఆఫర్లు వరుస కడుతున్నాయి. వాటిలో ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ కూడా ఒకటి. తెలుగులో అర్జున్ రెడ్డిని తెరకెక్కించిన సందీప్ రెడ్డి ఇప్పుడు బాలీవుడ్‌లో షాహిద్ కపూర్‌తో ఈ మూవీని రీమేక్ చేస్తున్నారు. ఇందులో భాగంగా హీరోయిన్‌గా మొదట జాన్వీని సంప్రదించారట.

అయితే అందుకు ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ వద్దని చెప్పాడట. శ్రీదేవి మరణం తరువాత జాన్వీకి మెంటర్‌గా వ్యవహరిస్తున్న కరణ్ జోహార్.. కెరీర్ ప్రారంభంలోనే బోల్డ్ సినిమాలు చేయడం మంచిది కాదని ఆమెకు సూచించాడట. దీంతో ఈ ప్రాజెక్ట్‌కు ఆమె నో చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇక ఈ రీమేక్‌కు హీరోయిన్‌గా తార పేరును సూచించింది కూడా కరణ్ కావడం విశేషం. కాగా ధడక్ ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీపై చాలా అంచనాలే పెట్టుకుంది కరణ్ జోహార్.స్టార్ జంట పడకగది ముచ్చట్లు!

Updated By ManamWed, 03/21/2018 - 17:59

shahidబాలీవుడ్ స్టార్ హీరోల్లో షాహిద్ కపూర్ ఒకరు. ఆయన తన వ్యక్తిగత జీవితం గురించి అన్ని విషయాలు బహిరంగంగా మాట్లాడతాడని బాలీవుడ్‌లో ఓ ప్రచారం ఉంది. కొన్ని సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ విషయాన్ని రుజువు చేశాయి. అయితే ఆయన భార్య మాత్రం అంతకు మించి ఓపెన్‌గా మాట్లాడగలదని ఈ మధ్యే తెలిసింది. ఎంత ఓపెన్ అంటే పడక గది విషయాలను కూడా ఏ మాత్రం బెరుకు లేకుండా పంచుకునేంత. ఇంతకీ అసలు విషయమేంటంటే.. హీరోయిన్ నేహాదూపియా వ్యాఖ్యాతగా బాలీవుడ్‌లో ఓ షో చేస్తోంది. ఆ షోకు అతిథులుగా షాహిద్‌కపూర్, ఆయన భార్య మీరా వచ్చారు. అయితే ఈ ఇంటర్వ్యూలో భాగంగా నేహా వీళ్లిద్దరినీ కాస్త ఇబ్బందిపెట్టే ప్రశ్న అడిగింది. మీకు ఇష్టమైన శృంగార భంగిమ ఏదని షాహిద్‌ను అడిగింది. ఆ ప్రశ్నకు షాకయిన షాహిద్ నోరెళ్లపెట్టాడు. అయితే షాహిద్ భార్య మీరా మాత్రం ఏ మాత్రం తడుముకోకుండా ఆయనకు అన్ని యాంగిల్స్ ఇష్టమేనని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షాహిద్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తన భార్య ముద్దులు బాగా ఇస్తుందని మాత్రమే చెప్పాడు. మీరా మాత్రం ఏకంగా శృంగార భంగిమల గురించి కూడా ఓపెన్‌గా చెప్పేసరికి అందరూ అవాక్కయ్యారు. పెళ్లి విషయం ఫస్ట్ నాకే చెప్పాడు

Updated By ManamWed, 02/28/2018 - 15:36

Shahid Kapoor, Kareena kapoorకరీనా కపూర్, షాహిద్ కపూర్‌లు దాదాపుగా మూడు సంవత్సరాలు ఒకరినొకరు ఘాడంగా ప్రేమించుకున్న విషయం విదితమే. అయితే కొన్ని కారణాల వలన ఈ జంట పెళ్లి పీటలెక్కకుండానే విడిపోయింది. ఆ తరువాత కరీనా కపూర్‌, సైఫ్ అలీ ఖాన్‌ను.. షాహిద్ కపూర్, మీరాను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు జోడీలు అటు తెరపైనా, ఇటు కుటుంబపరంగా సంతోష జీవితాన్ని గడుపుతున్నారు. అయితే బ్రేకప్ తరువాత ఈ ఇద్దరికి ఒకరంటే మరొకరికి పట్టనట్లుగా ఉన్నారనే వార్తలు అప్పుడప్పుడూ హల్‌చల్ చేశాయి. వాటికి తాజాగా సమాధానం ఇచ్చింది కరీనా.

విడిపోయినా, తాము ఇప్పటికీ మంచి స్నేహితులమని, చాలా విషయాలను ఇద్దరం షేర్ చేసుకుంటామని కరీనా చెప్పింది. ఇక షాహిద్ కపూర్ పెళ్లి వార్త కూడా తనకే ముందు చెప్పాడని తెలిపింది కరీనా. మీడియాకు, బాలీవుడ్‌ ప్రముఖులకు తెలియక ముందే తన పెళ్లి వార్త తనకు చెప్పాడని పేర్కొంది. అంతేకాదు తన మొదటి శుభలేఖను షాహిద్ స్వయంగా కరీనా కపూర్ ఇంటికి వెళ్లికి ఇవ్వడం విశేషం.'ప‌ద్మావ‌త్‌' తెలుగు వెర్ష‌న్‌ ట్రైలర్‌

Updated By ManamThu, 01/18/2018 - 20:09

padmavathదీపికా ప‌దుకునే, ర‌ణ్‌వీర్ సింగ్‌, షాహిద్ క‌పూర్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన హిందీ చిత్రం 'ప‌ద్మావ‌త్‌'. సంజ‌య్‌ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా.. తెలుగు, త‌మిళ భాష‌ల్లో అనువాద రూపంలో సంద‌డి చేయ‌నుంది. అనేక వివాదాల మ‌ధ్య జ‌న‌వ‌రి 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతున్న ఈ చారిత్రాత్మ‌క చిత్రం.. వెండితెర‌పై ఎలాంటి ప్ర‌భంజ‌నం సృష్టిస్తుందో చూడాలి మ‌రి. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తెలుగు వెర్ష‌న్‌ ట్రైలర్‌ని ఈ రోజు (గురువారం) విడుద‌ల చేశారు. దీనికి మంచి స్పంద‌న వ‌స్తోంది.నా కుమార్తె ఫొటోలు తీయకండి ప్లీజ్

Updated By ManamFri, 01/05/2018 - 11:20

Meeraతన కుమార్తె ఫొటోలు తీయకండి అంటూ ఫొటోగ్రాఫర్లకు అభ్యర్థన చేశారు బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ మీరా. ఇటీవల తన స్నేహితులతో కలిసి కుమార్తె మిషాను ప్లే గ్రౌండ్‌కు తీసికెళ్లింది మీరా. అక్కడ మిషా ఆడుకుంటుండగా.. దానికి సంబంధించిన ఫొటోలు కాసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ ఫొటోలపై మీరా స్పందించింది.

"దయచేసి కాస్త జాలి చూపండి. పిల్లలను వారి బాల్యాన్ని ఆనందంగా గడపనివ్వండి. వారి తల్లిదండ్రులకు ఫొటోలను తీయడాన్ని ఆపేయండి" అంటూ ఆమె అభ్యర్థించింది. అయితే మీరా ఒక్కటే కాదు ఐశ్వర్య, షారుక్ లాంటి తదితరులు సైతం తమ పిల్లలను ఫొటోలను తీయకండి అంటూ పలుసార్లు రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 

 

meera

 

Related News