celebrations

అంబరాన్ని అంటిన ఎల్జీబీటీల సంబరాలు

Updated By ManamThu, 09/06/2018 - 13:40
Love, Equally: Supreme Court Ends Section 377

న్యూఢిల్లీ : స్వలింగ సంప్కరం నేరం కాదంటూసుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుతో ఎల్జీబీటీల ఆనందం అంబరాన్ని అంటాయి. సెక్షన్ 377పై...ఇతరుల హక్కులను తగ్గించడం సామాజిక నైతికత కాదని, స్వలింగ సంపర్కాన్ని నేరంగా భావించడం అహేతుకం ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడిన విషయం తెలిసిందే. తాజా తీర్పుతో దేశవ్యాప్తంగా ఎల్జీబీటీలు సంతోషంతో స్వీట్లు పంచుకున్నారు. మరికొందరు డాన్సులు చేయగా,  బెలూన్స్ ఎగురవేసి ఆనందం వ్యక్తం చేసుకున్నారు. 

Love, Equally: Supreme Court Ends Section 377

మరోవైపు సుప్రీం తీర్పుకు మద్దతుగా పలువురు ప్రముఖులు ట్వీట్ చేశారు. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ కరణ్ జోహార్... ‘ ఇది చరిత్రాత్మకమైన తీర్పు.. చాలా గర్వంగా ఉంది. దేశానికి మళ్లీ ఆక్సిజన్ అందడం ప్రారంభమైంది’ అని ట్విట్ చేశారు. అలాగే ప్రముఖ రచయిత చేతన్ భగత్, కేంద్ర మాజీమంత్రి శశిధరూర్‌, నటుడు ఆయుష్మాన్ ఖురానా తదితరులు సుప్రీం తీర్పున స్వాగతించారు.



ఏపీలో ఘనంగా గణతంత్ర వేడుకలు

Updated By ManamFri, 01/26/2018 - 12:49

AP 67th Republic Day 2018 Celebrations In Vijayawadaవిజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు జరిగాయి. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఈ గణతంత్ర వేడుకల్లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా గవర్నర్ తెలుగు ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. చివరగా ఏపీ పథకాలను తెలియజేస్తూ ఏర్పాటుచేసిన శకటాలు స్టేడియంలో దర్శనమిచ్చాయి. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరుకాలేకపోయిన విషయం తెలిసిందే. ఈ వేడుకలకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి లోకేశ్ కుమారుడు దేవాన్ష్ పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. 

డీజీపీ కార్యాలయంలో..
అమరావతిలోని డీజీపీ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు జరిగాయి. డీజీపీ మాల కొండయ్య జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  అభివృద్ధితో పాటు సైబర్ నేరాలు పెరుగుతున్నాయన్నారు. సాంకేతికత సాయంతో సైబర్ నేరాలు అధిగమిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో ఉన్న దాదాపు 2వేల మంది పోలీసు సిబ్బంది జూన్ తర్వాత సొంత రాష్ట్రానికి వచ్చే అవకాశముందని మాలకొండయ్య చెప్పారు.



గణతంత్ర వేడుకలకు చంద్రబాబు గైర్హాజరు

Updated By ManamFri, 01/26/2018 - 11:34

Ap Cmఅమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. గురువారం సాయంత్రంతో బాబు పర్యటన ముగిసింది. అయితే శుక్రవారం ఉదయం దావోస్ నుంచి తిరుగు పయనమై ఏపీలో జరుతున్న రిపబ్లిక్ వేడుకల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్యకారణాల వల్ల అమరావతికి రాలేకపోయారు. చంద్రబాబు ఇండియాకు రావాల్సిన విమానం పొగమంచు కారణంగా ఆలస్యమవ్వడంతో ఆయన రాలేకపోయారు. దీంతో చంద్రబాబు అధికారిక నివాసంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి జాతీయ జెండాను ఆవిష్కరించారు. 

ఇదిలా ఉంటే శుక్రవారం 12గంటల లోపు గవర్నర్ విజయవాడకు చేరుకుని జాతీయ జెండా ఆవిష్కరించి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ఆయన ప్రసంగించనున్నారు. కాగా చంద్రబాబు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. నాలుగు రోజుల దావోస్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు బృందం పలు కీలక సంస్థల ప్రతినిధులతో సమావేశమై, కీలక ఒప్పందాలపై సంతకాలు చేసింది.



పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు

Updated By ManamFri, 01/26/2018 - 09:27

Telangana CM KCR at Republic day celebrationsహైదరాబాద్: నగరంలోని పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ ప్రభుత్వం గణంత్ర వేడుకలను ఘనంగా జరుపుతోంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ హాజరయ్యారు. శుక్రవారం 9గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకున్న సీఎం మొదట అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్ఛంతో నివాళులర్పించారు. గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

మరికాసేపట్లో పరేడ్‌ గ్రౌండ్స్‌లో గవర్నర్ చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు పార్టీ నేతలు, ప్రముఖులు హాజరయ్యారు. మరికాసేపట్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం సీఎం, గవర్నర్ ప్రసంగిస్తారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.



2018కి వెల్‌కమ్ పలికిన తొలి దేశం ఇదే!

Updated By ManamSun, 12/31/2017 - 17:15

kirimatiకిరిబాటి: 2017 సంవత్సరానికి ఘనమైన వీడ్కోలు తెలిపి.. 2018కి సాదర స్వాగతం పలికేందుకు ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. భారత్‌లో కొత్త సంవత్సర వేడుకలకు మరికొద్ది గంటలు మాత్రమే సమయముంది. అయితే పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబాటి ద్వీపాన్ని కొత్త సంవత్సరం పలుకరించింది. భారతకాలమానం ప్రకారం డిసెంబర్ 31వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు కిరిబాటి ద్వీపం 2018లోకి అడుగుపెట్టింది. ఈ ఐలాండ్‌లో న్యూ ఇయర్ వేడుకలు మిన్నంటాయి. బాణాసంచా వెలుగుల్లో ద్వీపంలోని పలు నగరాలు వెలిగిపోయాయి. ప్రపంచంలో మొట్టమొదటిగా న్యూ ఇయర్ వేడుకలు కిరిబాటిలోనే జరగడం విశేషం. 

కిరిబాటి తర్వాత చాతమ్ ఐలాండ్ ప్రజలు 2018కి ఘన స్వాగతం పలకనున్నారు. చిట్టచివరిగా బెకర్ ఐలాండ్, హౌలాండ్ ఐలాండ్‌లో నూతన సంవత్సర సంబరాలను జరుపుకోనున్నారు. అయితే ఇక్కడ విశేషమేంటంటే.. ప్రపంచంలో మొట్టమొదటిసారి న్యూ ఇయర్‌కు వెల్‌కమ్ చెప్పింది పసిఫిక్ పరిధిలోని కిరిబాటి ద్వీపమే.. చిట్టచివరిగా జరుపుకోబోయే కూడా పసిఫిక్ మహా సముద్రం పరిధిలోని బెకర్ ఐలాండ్, హౌలాండ్ ఐలాండ్ ద్వీపాలే. కిరిబాటి ద్వీపం 33 చిన్నచిన్న ద్వీపాల సముదాయం. వీటిని గిల్ బర్బ్స్ ఐలాండ్స్ అని పిలుస్తుంటారు. ‘కిరిబాటి’లో న్యూ ఇయర్ ప్రవేశించిన 26 గంటల తర్వాత బెకర్ ఐలాండ్, హౌలాండ్ ఐలాండ్ లలో కొత్త సంవత్సరం ప్రవేశిస్తుంది.





Related News