airport

ఎయిర్‌పోర్ట్‌లో ఆ చోట ప్రాణాంతక వైరస్.. 

Updated By ManamThu, 09/06/2018 - 15:34

airport, security tray, germs, public toiletsనాటింగ్‌హామ్: విమాన ప్రయాణికులరా జర జాగ్రత్త. విమానాశ్రయంలో ఒక చోటు అత్యంత ప్రమాదకరమట. రోత పుట్టించేలా ఉండే ఆ చోటుకు ఎంత దూరంగా ఉంటే అంతమంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రమాదకరమైన సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా అత్యంత వేగంగా వ్యాప్తిచెందుతాయట. అదే ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ చెకింగ్ పాయింట్. ప్రయాణికులు వెంట తీసుకెళ్లే లగేజీ భద్రపరిచే ట్రేల ద్వారా వ్యాప్తి చెందే వైరస్ అతి ప్రమాదకరమని పరిశోధనలో తేలింది. ఈ వైరస్.. పబ్లిక్ టాయిలెట్లలో ఉండే వైరస్ కంటే అత్యంత ప్రమాదకరమని గుర్తించినట్టు నాటింగ్‌హామ్, ఫిన్‌లాండ్ నేషనల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, వెల్‌ఫేర్ యూనివర్శిటీ పరిశోధకులు వెల్లడించారు. ఇలాంటి ట్రేల ద్వారా డజన్ల కొద్ది సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా సోకి ప్రాణాంతకమైన అంటువ్యాధులు ప్రబలుతాయని పేర్కొన్నారు. సాధారణ జలుబు, న్యుమోనియా, పిత్తాశయం, అంటువ్యాధులు, సార్స్, మెదడు దెబ్బతినడం వంటి వ్యాధులు ప్రబలుతాయని తెలిపారు. 2016లో శీతాకాలం సీజన్‌లో ఫిన్‌లాండ్‌లోని హెల్సింకీ-వాంటా ఎయిర్‌పోర్ట్‌లో పలుచోట్ల పరిశోధక బృందం పరీక్షలు జరిపింది. 

ప్లాస్టిక్ ట్రేల ద్వారా వ్యాప్తి..
ఈ పరీక్షల్లో ఎయిర్‌పోర్ట్‌లోని ప్రయాణికుల లగేజీ భద్రపరిచే ట్రేల వద్ద 10 శాతం మేర వైరస్ ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. ప్రధానంగా ఎక్స్‌రే చెక్ పాయింట్ వద్ద ప్రయాణికులు క్యూ కట్టిన సమయంలో ప్లాస్టిక్ ట్రేల ద్వారా ఈ వైరస్ ను వ్యాప్తి చేసే బ్యాక్టిరీయా ఉందని గుర్తించినట్టు చెప్పారు. ఈ పరిశోధనకు సంబంధించి జనరల్ బీఎంసీ ఇన్ఫిక్షన్స్ డిసిజేస్‌లో ప్రచురించారు. ప్లాస్టిక్ ట్రేలపై ఉండే బ్యాక్టీరియా కారణంగా సాధారణ జలుబుతో మొదలై శ్వాసకోస వ్యాధులు వస్తాయని పరిశోధకులు తెలిపారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇలాంటి వైరస్.. పబ్లిక్ టాయిలెట్ల వంటి బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడా కూడా గుర్తించలేదని పేర్కొన్నారు.
airport, security tray, germs, public toiletsఈ వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే ముందు జాగ్రత్త చర్యగా ప్రతిఒక్కరూ తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, జలుబు చేసిన సమయంలో హ్యాండ్ కర్చిఫ్, టిస్యూలను వాడాల్సి ఉంటుంది. ప్రత్యేకించి ఎయిర్‌పోర్ట్ వంటి బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఇలాంటి చర్యల ద్వారా వైరస్ సోకకుండా జాగ్రత్త పడొచ్చు. ఇలాంటి సులభమైన జాగ్రత్తలను తీసుకోవడం వల్ల వైరస్‌ బారినపడకుండా జాగ్రత్తపడవచ్చనని యూనివర్శిటీ ప్రొఫెసర్ జొనథాన్ వాన్ తెలిపారు.గాల్లో తిరిగే ట్యాక్సీలొచ్చాయ్!

Updated By ManamTue, 03/06/2018 - 16:26

helitaxiబెంగళూరు: రోడ్డుపై తిరిగే ట్యాక్సీలను చూసే ఉంటారు. కానీ గాల్లో ఎగిరే ట్యాక్సీలను చూశారా. అవును. బెంగళూరులో గాల్లో తిరిగే హెలీ-ట్యాక్సీ అందుబాటులోకి వచ్చింది. బెంగళూరులో ఉండే రద్దీ ట్రాఫిక్ నుంచి తప్పించుకుని అతి తక్కువ సమయంలో గమ్యానికి చేర్చే ఉద్దేశంతో ఈ సరికొత్త హెలికాఫ్టర్ ట్యాక్సీలను అందుబాటులోకి తెచ్చారు. బెంగళూరు ఎయిర్‌పోర్ట్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ వరకూ ఈ సేవలు ప్రారంభమయ్యాయి. రోడ్డు మార్గాన వెళితే ఎయిర్‌పోర్ట్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీకి దాదాపు రెండు గంటలకు పైగా సమయం పడుతుంది. కానీ ఈ హెలీ-ట్యాక్సీలో వెళితే పదిహేను నిమిషాల్లోనే గమ్యానికి చేరవచ్చు. ప్రస్తుతం ఈ మార్గంలో మాత్రమే ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. స్పందన బాగుంటే మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని అధికారులు యోచిస్తున్నారు. ఉద్యోగుల సమయ వేళల ప్రకారం ఉదయం 6.30 నుంచి 9.30 మధ్య, సాయంత్రం 3.00 గంటల నుంచి సాయంత్రం 6.15 వరకూ ఈ హెలీ-ట్యాక్సీలు సేవలందిస్తాయి.వాటా పెంచుకుంటున్న  జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్

Updated By ManamSat, 02/03/2018 - 19:30

airportహైదరాబాద్: జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో మలేషియా ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ బెర్హార్డ్ (ఎం.ఏ.హెచ్.బి)కి ఉన్న 11 శాతం వాటా రూ. 484 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఆ సంస్థతో జీఎంఆర్ గ్రూప్‌నకు చెందిన అనుబంధ సంస్థ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. సంస్థ శుక్రవారంనాడు స్టాక్ ఎక్స్చేంజ్‌కి ఈ సంగతి తెలియజేసింది. రూ. 10 ముఖ విలువ కలిగిన 4.15 కోట్ల షేర్లను ఎం.ఏ.హెచ్.బి నుంచి కొనుగోలు చేస్తున్నట్లు జీఎంఆర్ తెలిపింది. అది విమానాశ్రయంలో 11 శాతం ఈక్విటీకి సమానమవుతుంది. దీనికి నియంత్రణా పరమైన అనుమతులు లభించవలసి ఉంది. జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ఒక స్పెషల్ పర్పస్ వెహికల్. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అదే అమలుజరిపి, నిర్వహిస్తోంది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్‌కి రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో ఇప్పటికే 63 శాతం ఈక్విటీ వాటా ఉంది. ఇప్పుడు ఎం.ఏ.హెచ్.బి నుంచి 11 శాతం వాటా కైవసం చేసుకుంటే, దాని మొత్తం వాటా 74 శాతానికి పెరుగుతుంది. మిగిలిన వాటాలో 13 శాతం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వద్ద, మరో 13 శాతం తెలంగాణ ప్రభుత్వం వద్ద ఉంది. లావాదేవీ 2018 డిసెంబర్ 1న లేదా అంతకుముందు పూర్తయిందని భావించి, ధరను ఆధారం చేసుకున్నట్లు  సంస్థ తెలిపింది. జీహెచ్‌ఏఐఎల్‌కు 2008 మార్చి నుంచి 60 ఏళ్ళ రాయితీ పీరియడ్ ఉంది. రూ. 2,500 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ విమానాశ్రయ విస్తరణ చేపట్టే ప్రక్రియలో జీఎంఆర్ ఉంది. విస్తరణకు,పాత అప్పును తిరిగి చెల్లించడానికి అది ఇటీవల నిధులు సేకరించింది.  నిజామాబాద్‌లో ఎయిర్‌పోర్టుకు ఎంపీ కవిత వినతి

Updated By ManamWed, 01/03/2018 - 14:52

kavithaకేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజును నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత బుధవారం కలిశారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి వద్ద ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని ఆమె మరోసారి కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర కమిటీని పంపాలని ఎంపీ కవిత కోరారు. ఎంపీ కవిత వినతిపై కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు సానుకూలంగా స్పందించారు.

Related News