guntur

మళ్లీ తడబడిన బికామ్‌లో ఫిజిక్స్ ఎమ్మెల్యే..!

Updated By ManamFri, 08/31/2018 - 15:00
  • జగన్‌ను విమర్శించబోయి తప్పులో కాలేసిన జలీల్ ఖాన్..

  • నారా హమారా.. టీడీపీ హమారా కార్యక్రమంలో వ్యాఖ్యలు..

TDP MLA, Jaleel Khan, tongue slip, Nara Hamara TDP hamara, Gunturవిజయవాడ: బికామ్‌లో ఫిజిక్స్ చదివిన ఎమ్మెల్యే అనగానే టక్కున గుర్తుచ్చే పేరు జలీల్ ఖాన్. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేగా ప్రస్తుతం వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా ఆయన మాట్లాడే విధానంతో అందరిని కడుపుబ్బా నవ్విస్తారు. జలీల్ ఖాన్ ఎప్పుడు మీటింగ్‌ల్లో పాల్గొన్న ఆయన మాటల్లో తడబాటుతో తప్పులో కాలేసి చిక్కుల్లో పడుతుంటారు. తాజాగా గుంటూరులో ఏర్పాటు చేసిన ‘టీడీపీ హమారా.. నారా హమారా..’ కార్యక్రమంలో మైనార్టీల సమస్యలపై జలీల్ ఖాన్ మాట్లాడుతూ మరోసారి తప్పులో కాలేశారు. టీడీపీ చేపట్టిన కార్యక్రమాలను ప్రస్తావిస్తూ ప్రసంగం మొదలు పెట్టిన జలీల్ ఖాన్.. కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌సీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. గతంలో 125 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ ముస్లింలకు చేసింది ఏమి లేదని విమర్శించిన ఆయన.. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించబోయి తడబడ్డారు. ‘రాయలసీమలో ముస్లింలను ఎదగకుండా చూసిన చరిత్ర రాజశేఖర్ రెడ్డి వాళ్ల నాన్న.. జగన్ మోహన్ రెడ్డిది..’ అనడంతో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. బికామ్‌లో ఫిజిక్స్ ఉన్నట్టుగానే.. వైఎస్సార్‌కు జగన్ మోహన్ రెడ్డి నాన్న అంటూ మరోసారి హ్యాస్యాన్ని పండించారు.

తుని తరహాలో గొడవకు వైసీపీ పథకం..
అదేవిధంగా శనివారం అమరావతిలో జరిగిన నారా హమారా.. టీడీపీ హమారా కార్యక్రమంలో మాట్లాడుతూ.. తుని ఘటన తరహాలో గొడవ చేసేందుకు వైసీపీ పథకం రచిస్తోందని జలీల్ ఖాన్ మండిపడ్డారు. ప్రత్యర్థి పార్టీల్లో అల్లర్లు చేయడం జగన్‌కే కాదు.. ఆయన తాత, తండ్రీకి అలవాటేనని విమర్శించారు. జగన్ అధికారంలోకి వస్తే ఫ్యాక్షనిజం పెరుగుతుందని జలీల్ ఖాన్ విరుచకపడ్డారు. కాగా, 2004లో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ జెండాపై గెలిచిన జలీల్ ఖాన్.. చంద్రబాబు ఆకర్ష్ మంత్రంతో రాత్రికి రాత్రే టీడీపీ తీర్థం పుచ్చేసుకున్నారు. చంద్రబాబు కేబినెట్‌‌లో మైనార్టీ శాఖ ఖాళీగా ఉండటంపై కన్నేసిన జలీల్ ఖాన్.. రాజీనామా చేయకుండా టీడీపీలోకి జంప్ చేసి ఫిరాయింపు ఎమ్మెల్యేగా పార్టీలో కొనసాగుతున్నారు. ఘోరం.. జాబ్ ఇప్పిస్తానని చెప్పి గ్యాంగ్ రేప్

Updated By ManamThu, 08/09/2018 - 15:03

4 Men Gang Rape on lady In Guntur Over Job Issue

హైదరాబాద్: భాగ్యనగరంలో మరో సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్వెయంగా వెలుగు చూసింది. ఉద్యోగం పేరుతో యువతిపై నలుగురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనను మొత్తం సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసిన దుండగులు విషయం బయట ఎవరికైనా చెప్పినా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన వీడియోలు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తామని బెదిరించారు.

దీంతో తీవ్ర భయాందోళనకు గురైన యువతి కుటుంబీకులకు, తోటి స్నేహితులకు సైతం చెప్పలేదు. మార్చిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే విషయం నలుగురికీ తెలిస్తే పరువు పోతుందని యువతి మిన్నకుండిపోయింది.

రోజురోజుకు బెదిరింపులు పెరగడంతో చేసేదేమీ లేక యువతి పోలీసులను ఆశ్రయించింది. జాబ్ ఇప్పిస్తామని చెప్పి ఓ ఇద్దరు మహిళలు తనను గుంటూరుకు తీసుకెళ్లారని అక్కడికెళ్లిన తర్వాత తనపై నలుగురు అఘాయిత్యానికి పాల్పడ్డారని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. యువతి ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులకోసం గాలిస్తున్నామని త్వరలోనే వారిని పట్టుకుని కఠిన శిక్ష విధిస్తామనిపోలీసులు చెబుతున్నారు.

ఈ ఘటనపై ఓ పోలీస్ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. "యువతి ఎస్‌ఆర్ నగర్‌లోని ఓ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటోంది. మరో మహిళతో పరిచయం ఏర్పడటంతో జాబ్ ఇప్పిస్తానని సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లింది. యూఎస్ నుంచి కొందరు వస్తున్నారని మాయమాటలు చెప్పి తీసుకెళ్లింది.. అయితే ఎంత సేపటికీ సికింద్రాబాద్‌కు వాళ్లు రాకపోవడంతో గుంటూరుకు తీసుకెళ్లింది.

మార్గమధ్యలోనే కూల్ డ్రింక్ మత్తుమందు కలిపి అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. మత్తు నుంచి కోలుకున్న తర్వాత తనను బెదిరించారని యువతి చెప్పింది. ఇంటర్ నెట్ లో ఆ యువతికి సంబంధించిన ఫొటోలు అప్‌లోడ్ ఇబ్బందిపెడుతుండటంతో ఇప్పుడు ఫిర్యాదు చేశానని బాధితురాలు మాకు చెప్పింది"అని  మీడియాకు వివరించారు.చిలకలూరిపేటలో అగ్నిప్రమాదం.. భారీ ఆస్తి నష్టం

Updated By ManamTue, 08/07/2018 - 09:00

Chilakaluripetగుంటూరు: జిల్లాలోని చిలకలూరిపేటలో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాత కలప దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఈ మంటలు పక్క షాపులకు కూడా వ్యాపించాయి. మంటలు వ్యాపించిన తొమ్మిది షాపుల్లోను భారీగా కలప నిల్వ ఉండటంతో అదంతా కాలిబూడిదైంది. మంటలకు తోడు గాలి కూడా తీవ్రంగా ఉండటంతో వాటిని అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బందికి చాలా కష్టమైంది. నాలుగు ఫైరింజన్లుతో పాటు స్థానికంగా ఉన్న వాటర్ ట్యాంకుతో మూడు గంటల పాటు కష్టపడి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదం లో దాదాపు కోటి వరకు ఆస్తినష్టం జరిగి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ప్రమాదానికి కారణం మాత్రం ఇంకా తెలియటం లేదు.లెక్కలు తేల్చేపనిలో మైనింగ్ శాఖ నిమగ్నం

Updated By ManamSun, 07/29/2018 - 21:19

Illegal mining in Guntur

గుంటూరు: ఇటీవల జిల్లాలో జరిగిన మైనింగ్ విషయంలో టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌కు హైకోర్టు నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. దీంతో మైనింగ్ శాఖలో కదలిక వచ్చింది. అక్రమ తవ్వకాలపై అధికారులు లెక్కలు తీసే పనిలో నిమగ్నమయ్యారు. కోనంకి, కేశానుపల్లి, సీతారామపురం సహా ఎనిమిది చోట్ల సర్వే చేసినట్లు తెలుస్తోంది. గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో అక్రమ మైనింగ్ జరిగిందని హైకోర్టు గుర్తించింది.రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Updated By ManamSun, 05/20/2018 - 16:54

 roadaccident, 3persons died, gunturగుంటూరు : అతివేగం ముగ్గురు వ్యక్తుల మరణానికి దారితీసిన సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం నులకపేట వద్ద చోటుచేసుకుంది. అతివేగంగా వెళ్తున్న ఇసుక లారీ బైక్‌ను ఢీకొనడంతో దంపతులతో సహా మూడేళ్ల చిన్నారి దుర్మరణం చెందారు. మ‌‌ృతులు తాడేపల్లికి చెందిన శ్రీకాంత్, సరిత, అక్షరగా గుర్తించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ కుటుంబంలో పెనువిషాధం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన తీరు, దంపతులతో పాటు మూడేళ్ల చిన్నారి మృతి చెందడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. వారి బంధువులను రైల్వేస్టేషన్‌లో దింపిరావడానకి వెళ్లి బైక్‌పై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలుపుతున్నారు. ఇసుక లారీల వేగంపై గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు స్పందించకపోవడంతో ఇటువంటి ప్రమాదాలకు కారణమవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలపై అధికారులు సమీక్షించిన తరచు ప్రమాదాలు చోటు చేసుకోవడం తప్ప పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కన్పించడం లేదు. ఈ ఘటనపై ఆగ్రహించిన మృతుల బంధువులు మంగళగిరి-విజయవాడ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.మైనర్‌పై అత్యాచారయత్నం.. గుంటూరులో ఉద్రిక్తత

Updated By ManamWed, 05/16/2018 - 08:29

rape  గుంటూరు: గుంటూరులో మరో దారుణం జరిగింది. బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మంగళవారం రాత్రి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడిని తమకు అప్పగించాలంటూ బాలిక తల్లిదండ్రులు, బంధువులు అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.

కానీ ఎంతకు పోలీసులు స్పందించకపోవడంతో వారు పోలీస్ స్టేషన్‌పైకి రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పోలీస్‌స్టేషన్ అద్దాలు, పోలీస్ వాహనాలు ధ్వంసం కాగా.. 22మంది పోలీసులకు గాయాలు అయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్‌ను విధించారు. దాచేపల్లి బాధితురాలికి అండగా ఉంటాం: రోజా

Updated By ManamFri, 05/04/2018 - 10:27

Roja గుంటూరు: దాచేపల్లి బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన రోజా అనంతరం మాట్లాడుతూ.. నిందితుడికి అరెస్ట్ చేయలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమని అన్నారు. పేదల ప్రాణాలంటే ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందని పేర్కొన్నారు. ఈ ఘటనకు చంద్రబాబు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని రోజా డిమాండ్ చేశారు.

అయితే తొమ్మిదేళ్ల బాలికపై 50ఏళ్ల వ్యక్తి బుధవారం అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలం సృష్టించింది. ఈ కేసులో వీలైనంత త్వరగా నిందితులను అరెస్ట్ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

 ఏపీలో 4 రైల్వే స్టేషన్లకు అంతర్జాతీయ హోదా

Updated By ManamWed, 04/04/2018 - 13:01

International Status to railway stations, Andhra pradesh state, Central govt, Vijayawada, Guntur, Railway ministry న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 4 రైల్వేస్టేషన్లకు కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ హోదా కల్పించింది. ఏపీ రాజధాని ప్రాంతంలోని విజయవాడ, గుంటూరు, రాయలసీమలోని కర్నూలు, గుంతకల్లు స్టేషన్లకు అంతర్జాతీయ హోదాను కల్పించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే ఈ రైల్వే స్టేషన్ల ఆధునికీకరణకు రూ.25కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తూ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. కాగా, అంతర్జాతీయ హోదాకు సంబంధించి ఈ నెల 10లోగా ప్రతిపాదనలు పంపాలని అధికారులకు రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఈ రైల్వే స్టేషన్లు కొత్త రూపును సంతరించుకోనున్నాయి.జగన్.. దమ్ముంటే నాపై పోటీకి రా: టీడీపీ ఎమ్మెల్యే

Updated By ManamFri, 03/30/2018 - 16:54

TDP MLA Kommalapati Sridhar Open Challange To YSRCP Chief Jagan

అమరావతి: వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే శ్రీధర్ సవాల్ విసిరారు. జగన్‌కు దమ్ముంటే తన మీద పోటీచేసి గెలవాలని ఓపెన్ చాలెంజ్ విసిరారు. టీడీపీపై విషం చిమ్మటానికే జగన్ పాదయాత్ర చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. గుంటూరులో జగన్ చేపట్టిన ‘ప్రజా సంకల్ప పాదయాత్ర’లో భాగంగా జిల్లా నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే శ్రీధర్ స్పందిస్తూ.. జగన్‌కు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తూ రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఈ సందర్భంగా ఆయన తేల్చిచెప్పారు. కోట్లు కుమ్మరించినా పెదకూరపాడు ప్రజలు వైసీపీని నమ్మరని శ్రీధర్ చెప్పుకొచ్చారు. 

" నేను ఎమ్మెల్యేగా ఉన్న పెదకూరపాడు నియోజకవర్గంలో అవినీతి చేశానని జగన్‌ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకోవటానికి సిద్దంగా ఉన్నాను. అమరావతి అమరలింగేశ్వరస్వామి సన్నిధిలో అవినీతిపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నాను. జగన్‌ చూడటానికి చిన్న వ్యక్తిలా కనిపించినా.. నిలువెల్లా విషం పాకివుంది. అబద్దాన్ని పదే పదే నిజం చేసేలా వ్యవహరించటం జగన్‌కు అలవాటే. నేను ఇసుక రీచ్‌ల్లో అవినీతికి పాల్పడ్డానని జగన్‌ పాతయాత్రలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారు" అని శ్రీధర్ చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.టీడీపీకి షాక్.. వైసీపీలోకి కీలకనేత

Updated By ManamSun, 03/25/2018 - 11:59

TDP Leader joining into Ysrcp On 27th March | Guntur Politics

గుంటూరు: 2019 ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపాయి. పార్టీలో ఎవరు చేరినా కాదనకుండా ఇరు పార్టీలు నేతలు కండువాలు కప్పేసి స్వాగతం పలుకుతున్నారు. పార్టీలో వస్తున్న వ్యతిరేకతలను సైతం పక్కనపెట్టి అందరూ కలిసి పార్టీని బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు.. అధినేతలు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే ముఖ్యంగా ఎక్కడైతే తమ పార్టీ వీక్‌గా ఉందో అక్కడే పాగా వేయాలని చిన్న స్థాయి నేత నుంచి ఎంపీ, ఎమ్మెల్యే, మాజీల వరకు ఎవరు చేరినా సరే అధికార, ప్రతిపక్ష పార్టీల అధిపతులు ఆహ్వానించేస్తున్నారు.

తాజాగా.. టీడీపీకి చెందిన కీలక నేత నిమ్మకాయల రాజనారాయణ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌‌రెడ్డి తలపెట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ సాగుతోంది. ఈ పాదయాత్రలో భాగంగా అధికార పార్టీలో అసంతృప్తితో రగిలిపోతున్న వారిని వైసీపీలోకి రప్పించేందుకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలు రంగంలోకి దిగి జగన్ సమక్షంలో కండువా కప్పిస్తున్నారు. ఇదే క్రమంలో గుంటూరు జిల్లాలో టీడీపీ నుంచి వైసీపీలోకి చేరికలు జోరందుకున్నాయి.

రాజనారాయణ ప్రస్థానం ఇదీ..
సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి రాజనారాయణ 2009 ఎన్నికల్లో శాసన సభకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థి యర్రం వెంకటేశ్వర రెడ్డి ఘన విజయం సాధించారు. రాజనారాయణకు కేవలం 54,802 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. పీఆర్పీ తరఫున పోటీచేసిన అభ్యర్థికి 25,715 ఓట్లు పోలయ్యాయి. సత్తెనపల్లిలో అధికార పార్టీ తరఫున అన్ని కార్యక్రమాల్లో పాల్గొని నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. 2014 ఎన్నికల తర్వాత కూడా కీలకంగా ఉంటూ వచ్చారు. పార్టీలో ఏం జరిగిందో ఏమోగానీ గత కొద్దిరోజులుగా దూరంగా ఉంటూ వస్తున్నారని తెలిసింది. ఆయన అనుచరులు, పలువురు ముఖ్య కార్యకర్తల సూచన మేరకు వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమయ్యారు. ఈ నెల 27న సత్తెనపల్లిలో వైసీపీ అధినేత జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర భాగంగా వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. అనంతరం జగన్‌తో పాదయాత్రలో అడుగులేయనున్నారు.

అవును వైసీపీలోకి వెళ్తున్నా..!
పార్టీలో చేరిక విషయమై వైసీపీ రాజకీయ సలహా కమిటీ సభ్యుడు గుబ్బా చంద్రశేఖర్‌..  టీడీపీ నాయకులు నిమ్మకాయల రాజనారాయణ, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు ఆతుకూరి నాగేశ్వరరావుతో శనివారం సాయంత్రం చర్చించారు. సుధీర్ఘ చర్చల అనంతరం నియోజకవర్గంలోని ఈ ఇద్దరు నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకుంటామనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. కాగా ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు నారాయణను అడగ్గా అవును.. అని సమాధానమిచ్చి వెళ్లిపోయారాయన. సోమవారం వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించేశారు కూడా.

ఇదిలా ఉంటే జిల్లాకు చెందిన టీడీపీ కీలకనేతలు ఆయన్ను వైసీపీలోకి వెళ్లొద్దని మంతనాలు జరిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే పార్టీ పట్లు అసంతృప్తితో ఉన్న ‘నో’ అని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే అధికార పార్టీని కాదనుకుని వైసీపీ కండువా కప్పుకుంటున్న ఈయనకు జగన్ ఏం హామీ ఇస్తారో.. 2019లో ఎంత మేరకు న్యాయం చేస్తారో వేచి చూడాల్సిందే మరి.

tdp to ysrcp

Related News