boy

బుడ్డోడి తిక్క కుదిరింది.. నవ్వు ఆపుకోలేరంతే..!

Updated By ManamMon, 09/10/2018 - 16:41

Boy, Doll pistol, not stoped crying, Shane Warn post, Video Viral చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు చేసే పనులు ఎంతో ముద్దుగా ఉంటాయి. కొన్నిసార్లు వారి అల్లరి చేష్టలను చూస్తే కోపం వచ్చినా వారి అమాయకత్వాన్ని చూస్తే నవ్వకుండా ఉండలేరు. ఇదిగో ఈ బుడ్డోడిని చూడండి.. ఏం చేస్తున్నాడో.. తుపాకీని తిరిగేసి ఎలా కాల్చుకుంటున్నాడో.. ఒరేయ్.. బుడ్డోడా? సెంటర్‌లో గన్ గురిపెట్టావ్.. బుడ్డి పగులుద్దిరా అని చెప్పినా వింటేనా.. చూడండి ఏమైందో.. అమ్మ.. బాబోయ్.. నొప్పి.. అంటూ ఎగిరి గంతేశాడు.. నొప్పి తట్టుకోలేక బుడ్డోడు బాధపడుతుంటే.. పొట్టచెక్కలయ్యేలా నవ్వడం చూసేవారి వంతైంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను మాజీ క్రికెటర్ షేన్ వార్న్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. బుడ్డోడి వీడియోను చూసి గత 24 గంటలుగా నవ్వు ఆపులేక ఆనంద బాష్పాలు కార్చినట్టు ట్వీట్ వేదికగా పంచుకున్నాడు. ఈ వీడియోను చూస్తే మీరు కూడా నవ్వు ఆపుకోలేరంతే... చూసి హాయిగా నవ్వుకోండి.. ఉస్మానియాలో హృదయ విదారక ఘటన

Updated By ManamTue, 02/13/2018 - 13:26

boyహైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో హృద‌య విదారక సంఘ‌ట‌న ఒక‌టి చోటు చేసుకుంది. తల్లి గుండెపోటుతో విగతజీవిగా మారగా ఐదేళ్ల బాలుడి పరిస్థితి దయనీయంగా మారింది. సమీనా సుల్తానాను మూడేళ్ల క్రితమే కట్టుకున్న భర్త వదిలి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కూలీనాలీ చేస్తూ తన కుమారుడిని పెంచి పోషిస్తోంది సుల్తానా. గత కొంతకాలంగా హృద్రోగ సమస్యతో ఆమె బాధపడుతోంది. ఫిబ్రవరి 11న‌ రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో సుల్తానా...ఉస్మానియాలోని ఎమ‌ర్జెన్సీ వార్డులో చేర్చారు. ఆమెతో పాటే ఆమె అయిదేళ్ల కుమారుడు కూడా ఆస్పత్రిలోనే ఉన్నాడు. రక్తపోటు, పల్స్‌ బాగా పడిపోవడంతో ఆమె కన్ను మూసింది. తన తల్లి ఇక లేదన్న విషయం తెలియని ఆ పసివాడు ఆకలితో అలమటిస్తూ త‌ల్లి మృతదేహం పక్కనే చాలా సేపు పడుకున్నాడు. 

హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్ వాలంటీర్లు, వైద్య సిబ్బంది ఆ బాబును తల్లి మృతదేహం పక్క నుంచి తీసి... వేరే గదిలో పడుకోబెట్టారు. మృతురాలి గురించి ఎలాంటి సమాచారమూ తెలియ రాలేదు. దీంతో డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించగా..  ఆమె వేలి ముద్ర సాయంతో ఆధార్‌కార్డు వివరాల మేరకు జహీరాబాద్‌లోని బంధువులకు ఆమె స‌మాచారం అందించారు. ఆమె బంధువులు సోమవారం ఆసుపత్రి దగ్గరకు చేరుకోగా.. పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. చేతిలో రాళ్లతో పిల్లాడు.. వీడియో వైరల్

Updated By ManamWed, 01/03/2018 - 19:45

videoపుణె: భీమా కొరేగావ్ పోరాటానికి 200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం ముంబైలో నిర్వహించిన కార్యక్రమాల్లో హింస చెలరేగడంతో 28 ఏళ్ల వ్యక్తి చనిపోయాడు. దీంతో ముంబైతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వం ఆందోళనకారులను నిలువరించడంలో విఫలమైందని.. ఇందుకు నిరసనగా అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ బుధవారం బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పుణె నగరంలో కనిపించిన ఓ దృశ్యం అక్కడున్న ఉద్రిక్త పరిస్థితులకు, ప్రజల్లో నెలకొన్న విద్వేషానికి అద్దం పడుతోంది. ఓ పిల్లాడు చేతిలో రాళ్లు పట్టుకుని రోడ్డుపై వెళుతున్న దృశ్యాలవి. అక్కడేం జరుగుతుందో అర్థం చేసుకునేంత వయసు కూడా ఆ చిన్నారికి లేదు. కానీ అందరినీ చూసి అతనూ అదే బాటలో నడుస్తున్నాడు. ఈ ఘటనపై కొందరు మండిపడుతున్నారు. పిల్లల్లో కూడా ఈ స్థాయిలో విద్వేషాన్ని నింపడం సరికాదని చెబుతున్నారు. రోడ్డుపై వెళుతున్న ఆ చిన్నారిని.. వీడియో జర్నలిస్ట్ కొన్ని ప్రశ్నలడిగారు. ఆ సంభాషణ ఇదే.

వీడియోగ్రాఫర్: చేతిలో రాళ్లు పట్టుకున్నావు. ఎందుకు?
పిల్లాడు: దాడి చేయడానికి
వీడియోగ్రాఫర్: ఎందుకు దాడి చేయాలనుకుంటున్నావు?
పిల్లాడు: వాళ్లు మాపై దాడి చేశారు.
వీడియోగ్రాఫర్: ఎవరు దాడి చేశారు?
పిల్లాడు: వాళ్లే.
వీడియోగ్రాఫర్: అదే వాళ్లే ఎవరు?
పిల్లాడు: మరాఠా ప్రజలు(పక్కనున్న వాళ్లు పిల్లాడితో చెప్పించారు)
వీడియోగ్రాఫర్: ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు?
పిల్లాడు: వాళ్లను చంపాలనుకుంటున్నా.
వీడియోగ్రాఫర్: ఎక్కడికి వెళుతున్నావు?
పిల్లాడు: వాళ్లను చంపడానికి.
వీడియోగ్రాఫర్: పుణెకు ఎందుకొచ్చావు?
పిల్లాడు: నివాళి తెలపడానికి.
వీడియోగ్రాఫర్: ఎవరికి?
పిల్లాడు: బీఆర్ అంబేద్కర్‌కు
వీడియోగ్రాఫర్: అచ్చా.హృదయ విదారక ఘటన

Updated By ManamThu, 09/21/2017 - 18:19

గుంటూరు: గుంటూరు జిల్లా శివారు అడవి తక్కెళ్లపాడులో విషాద ఘటన జరిగింది. వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆ బాలుడు మృతి చెందాడు. ఈ దాడి ఘటన చూపరులను కలిచివేసింది. రాజీవ్ గృహకల్ప సముదాయంలో ఆడుకుంటున్న ఈ బాలుడిపై వీధికుక్కలు ఒక్కసారిగా గుంపుగా వచ్చి దాడి చేశాయి. ఒళ్లంతా గాయపరిచాయి. ఆ బాలుడిని కాపాడాల్సిన జనం వీడియోలు తీస్తూ కనిపించారు. వారి తీరుపై ఆ దృశ్యాలు చూసిన వారు తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక పక్క ప్రాణాపాయ స్థితిలో బాలుడు గిలగిలాకొట్టుకుంటే కాపాడాల్సింది పోయి సెల్ ఫోన్లో వీడియోలు తీస్తుండటం అమానుషమని వాపోతున్నారు. పైగా ఆ విజువల్స్‌లో బాలుడు కొన ఊపిరితో కొట్టుకుంటూ కాళ్లూచేతులూ కదిలించడం చూపరులను కంటతడి పెట్టించింది. అంత ప్రమాద పరిస్థితిలో ఉన్న బాలుడిని రక్షించాల్సింది పోయి వీడియోలు తీయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వారి తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు.

సకాలంలో ఆసుపత్రికి తరలించి ఉంటే బతికుండేవాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలా ఒక మనిషి కొన ఊపిరితో కొట్టుకుంటుంటే వీడియోలు తీస్తూ తమాషా చూడటం ఇవాళ కొత్తేమీ కాదు. పలు చోట్ల ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా మనుషుల ప్రవర్తనలో మార్పు రాకపోవడంపై మానవతావాదులు భగ్గుమంటున్నారు. సెల్ ఫోన్‌లో వీడియో తీసి, నెట్‌లో పెట్టి సంచలనం చెయ్యాలన్న తపనే తప్ప ప్రాణానికి విలువనివ్వడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివారు ప్రాంతం కావడంతో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని, గతంలో ఎన్ని సార్లు మున్సిపాలిటీ వారికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు. మున్సిపాలిటీ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

Related News