viral video

సిగరెట్‌తో రాకెట్ లాంచింగ్.. వైరల్ వీడియో!

Updated By ManamThu, 08/30/2018 - 16:05

viral video, man lights rockets, cigarette, NASA, SpaceX, Netizens jokesరాకెట్ లాంచింగ్ చేయాలంటే ఎంతో ఖర్చు, శ్రమతో కూడిన పని. కానీ, ఈ స్పేస్‌మెన్ మాత్రం.. సింపుల్‌గా సిగరెట్‌తో రాకెట్‌ను అవలీలగా ఎగురవేస్తున్నాడు. ఒక్కదాని తరువాత మరొకటి నింగిలోకి భలే వదులుతున్నాడు చూడండి. నడిరోడ్డుపై నిలబడి చేతిలో టపాసు రాకెట్లను పట్టకొని.. స్టైల్‌గా సిగరెట్‌ కాలుస్తూ సరికొత్తగా నింగిలోకి లాంచ్ చేస్తున్నాడు. ఇతగాడు ఎవరో తెలియదు గానీ, నింగిలోకి రాకెట్లు వదులుతుంటే అటుగా వెళ్లే వాహనదారులంతా నోరెళ్లబెట్టి చూస్తున్నారు.

టపాసు రాకెట్లను నింగిలోకి వదులుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా నాసాకు కొత్త భారతీయ శాస్త్రవేత్త, స్పేస్ఎక్స్ దొరికాడు అంటూ ట్యాగ్‌లు తగిలించి సరదాగా కామెంట్లు చేస్తున్నారు. రాకెట్ లాంచింగ్ స్కిల్స్ అంటే ఇతగాడివేనంటూ జోకులు పేలుస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియో..పుతిన్‌తో షేక్‌హ్యాండ్..ఫస్ట్ లేడీ ఎక్స్‌ప్రెషన్స్

Updated By ManamThu, 07/19/2018 - 16:36
  • మెలానియా ముఖంలో విచిత్రమైన భయాందోళనలు..

Melania trump

అమెరికా, రష్యాల మధ్య సత్సంబంధాల ఏర్పాటు లక్ష్యంగా ఇరుదేశాల అధ్యక్షులు భేటీ అయ్యారు. ఫిన్‌లాండ్‌లో జరిగిన ఈ సమావేశంపై ప్రపంచ వ్యాప్తంగా ఉత్సుకత నెలకొంది. ఈ భేటీలో వారి మధ్య ఏయే అంశాలు చర్చకొస్తాయని వివిధ దేశాలు ఆసక్తిగా చూస్తుండగా.. అంతకంటే ఆసక్తికరమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది.

అసలు విషయం వదిలేసి కొసరుపై పడ్డట్లు.. సోషల్ మీడియాలో ఇప్పుడంతా దీనిపైనే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏంజరిగిందని అనుకుంటున్నారా.. ఈ భేటీకి అమెరికా అధ్యక్షుడు సతీసమేతంగా వచ్చేశారు. ఫిన్‌లాండ్‌లోని హెల్సింకిలో షెడ్యూల్ ప్రకారం పుతిన్‌ను కలుసుకున్నారు. మర్యాదపూర్వకంగా ఇద్దరూ కరచాలనం చేసుకున్నారు. అక్కడి వరకూ అంతా బాగానే జరిగింది. ఆ తర్వాత పుతిన్‌ను పలకరించిన మెలానియా.. ఆయనతో కరచాలనం చేయడం, ఆ తర్వాత చోటుచేసుకున్న సంఘటనలు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి.

పుతిన్‌తో కరచాలనం సందర్భంగా మెలానియా ముఖంలో విచిత్రమైన హావభావాలు వ్యక్తమయ్యాయని నెటిజన్లు చెబుతున్నారు. మెలానియా చాలా భయపడుతున్నట్లు అనిపించిందని కొందరు అంటే.. మరికొందరేమో ఎందుకొచ్చిన మీటింగ్ అన్నట్లు విసుక్కుంటుండి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో అసలు ఉద్దేశం.. అదేనండి ట్రంప్, పుతిన్‌ల భేటీ, దాని వెనకున్న ఆశయంపై జరగాల్సిన చర్చ కాస్త తప్పుదోవ పట్టింది.

మీడియాలోనూ ఇదే విషయానికి ప్రాధాన్యం కల్పించడం గమనార్హం. మెలానియా ముఖంలో ఫీలింగ్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. పుతిన్‌తో కరచాలనం సందర్భంగా అమెరికా ఫస్ట్‌లేడీ మెలానియా ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది.వీడియో: సల్మాన్ కోసం.. అన్నం, స్కూల్ మానేసిన చిన్నారి..

Updated By ManamSat, 04/07/2018 - 12:01

Viral video, Salman Khan, little fan, weeps bitterly, conviction in blackbuck poaching case ముంబై: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చిన్న పిల్లలూ సల్మాన్‌‌ను పిచ్చిగా అభిమానించే వారిలో ముందుంటారు. అలాంటిది తన అభిమాన హీరో సల్మాన్‌కు జైలు శిక్ష పడిందన్న వార్త తెలియగానే ముద్దులొలికే ఓ చిన్నారికి ఒక్కసారిగా పట్టరాని దు:ఖం వచ్చేసింది. ‘సల్మాన్ జైలు నుంచి తిరిగి వస్తేనే అన్నం తింటా.. స్కూల్‌కి వెళ్తా’ అంటూ మారం చేస్తోంది ఆ చిన్నారి. 1998లో నమోదైన కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్‌ ఖాన్‌‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ న్యాయస్థానం గురువారం సంచలన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. చిన్నారి మాత్రమే కాదు ఆయన్ను అభిమానించే ప్రతిఒక్కరూ ఆ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.

సోషల్ మీడియాలో నెటిజన్లు, సినీ ప్రముఖులు సైతం సల్మాన్‌కు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. సల్మాన్ కోసం ఏడుస్తున్న ఓ చిన్నారికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్‌లో ట్రేడింగ్ అవుతోంది. ఆ వీడియోలో.. ముద్దుగా కనిపిస్తున్న చిన్నారి.. సల్మాన్ తిరిగి వచ్చే వరకూ తాను అన్నం తిననని మొండికేసింది. అంతేకాదు స్కూల్‌కు కూడా వెళ్లనని బోరున విలపించింది. సల్మాన్ త్వరలోనే విడుదల చేస్తారులే.. అని పాప తల్లి బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ చిన్నారి ఊరుకోలేదు. ఇదే ఆ వీడియో..  క్రికెట్ ఆడిన కరుణానిధి (వీడియో)

Updated By ManamThu, 03/01/2018 - 13:53

 kalaignar Karunanithi plays cricketచెన్నై: గత కొద్దిరోజులుగా డీఎంకే అధినేత కరుణానిధి అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆయన అనారోగ్యం నుంచి కుదుటపడుతున్నారు. ఇంట్లోనే కుర్చీకే పరిమితమైన ఆయన అక్కడ్నుంచే పార్టీ వ్యవహారాలన్నీ చూస్తూ.. అధికారపార్టీని ఎలా ఎదుర్కొనాలని కుమారుడు స్టాలిన్‌‌కు సూచనలిస్తున్నారు. అయితే తాజాగా ఆయన క్రికెట్ ఆడుతున్నట్లు ఉన్న ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కరుణానిధి క్రికెట్ ఆడటమేంటని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు వింటున్నది నిజమే.. ఇదిగో ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది.

ఆయన క్రికెట్ ఆడింది గ్రౌండ్‌లో కాదు... తన ఇంట్లోనే వీల్ చైర్‌లో కూర్చొనే క్రికెట్ ఆడారు. అలాగే కూర్చొనే తన ముని మనవడితో క్రికెట్ ఆడేశారు. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది. కరుణానిధి కుర్చీలోనే ఉండి బౌలింగ్ చేయగా... ముని మనవడు బ్యాటింగ్ చేశాడు. పక్కనే ఇద్దరు మహిళలు బాల్ అందించారు. ఈ సీన్‌ను ఇంట్లో వాళ్లే తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే కొన్ని వందలాదిమంది చూశారు.

కరుణానిధి ఆరోగ్యంపై వదంతులు వస్తుండటంతో ఈ వీడియోతో ఆయన ఆరోగ్యంగానే ఉన్నారనే క్లారిటీ కూడా వచ్చింది. అంతేకాదు వీడియోలో కూడా ఆయన చాలా ఉత్సాహం కనిపించారు. డీఎంకే కార్యకర్తలు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. మరోవైపు తమ అధినేత ఆరోగ్యంగా, ఉత్సాహంగానే ఉన్నాడని డీఎంకే నేతలు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.యాచకుడి పాట (వైరల్ వీడియో)

Updated By ManamWed, 01/03/2018 - 21:46

తనకు ఒక్క రూపాయి భిక్షమేయాలని అర్ధిస్తూ ఓ యాచకుడు పాడిన పాట ఇప్పుుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేదాంత ధోరణిలో పాటపాడిన యాచకుడు...తెలంగాణ సర్కార్ చెబుతున్న అభివృద్ధి వట్టిదేనని తేల్చేశాడు. వైసీపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులకు పాటలోని భావం నచ్చకున్నా...యాచకుడి పాటకు మాత్రం ఫిదా కాకుండా ఉండలేరు. మీరే ఒకసారి వినండి. 

Related News