ipl

విదేశాలకు ఐపీఎల్?

Updated By ManamWed, 09/12/2018 - 00:36
  • వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలే కారణం

iplన్యూఢిల్లీ: వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల తేదీలను భారత ఎన్నికల కమిషన్ ఎప్పుడు ప్రకటిస్తుందా అని రాజకీయ పార్టీలే కాదు బీసీసీఐ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఆ ఎన్నికల షెడ్యూల్‌ను బట్టి మరోసారి ఐపీఎల్-12ను విదేశాలకు తరలించాలని బోర్డు భావిస్తోంది. గతంలో అంటే 2009లో సౌతాఫ్రికాకు, 2014లో యూఏఈకి ఇదే ఎన్నికల కారణంగా ఐపీఎల్‌ను తరలించారు. 2019 ఐపీఎల్‌కు బీసీసీఐ ఇప్పటి నుంచే సిద్ధపడుతోంది. కమిటీ ఆఫ్ అడ్మనిస్ట్రేటర్స్ (సీఓఏ), సీఈఓ రాహుల్ జొహ్రి నేతృత్వంలోని బీసీసీఐ మేనేజ్‌మెంట్, ఐపీఎల్ సీఓఓ హేమంగ్ అమిన్ ఇప్పటికే ఎ, బి, సి ప్లాన్స్ సిద్ధం చేశారు. ఓ ఆంగ్ల వెబ్‌సైట్ కథనం ప్రకారం పూర్తి టోర్నీని తరలించాల్సి వస్తే సౌతాఫ్రికాకు తొలి ప్రాధాన్యత ఇచ్చే అవకాశముంది. ఒకవేళ పాక్షకంగా అంటే టోర్నీలోని కొంత భాగం మాత్రమే మార్చాల్సి వస్తే యూఏఈ తెరపైకి రానుంది. ఇంగ్లాండ్ కూడా ఈ టోర్నీ నిర్వహణ బరిలో ఉంది. కానీ అది అధిక ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ఇంగ్లాండ్ అనేది చివరి ఆప్షన్. యూఏఈలో భారతీయులు ఎక్కువ సంఖ్యలో ఉండటం.. ఖర్చు పరంగా కూడా అనుకూలమైన దేశం కావడంతో ఎమిరేట్స్ వైపై బీసీసీఐ, సీఓఏ, ఐపీఎల్ గవర్నింగ్ బాడీ మొగ్గు చూపే అవకాశముంది. అయితే మౌలిక వసతుల రూపకల్పన విషయంలో ఐపీఎల్‌కు యూఓఏ చాలా చిన్నది. ఎందుకంటే ఈ దేశంలో మూడే మూడు పెద్ద మైదానాలు (దుబాయ్, షార్జా, అబుధాబీ) ఉన్నాయి. దీంతో ఐపీఎల్‌లోని కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే యూఏఈ ఆతిథ్యం ఇవ్వగలదు. అంతేకాని 60 మ్యాచ్‌లు, ఎనిమిది జట్ల ఈ లీగ్‌కు ఆతిథ్యం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో మొత్తం టోర్నీని తరలించాల్సి వస్తే సౌతాఫ్రికాకు తొలి ప్రాధా న్యత ఇవ్వనున్నారు. ఇదిలా వుండగా.. టోర్నీ నిర్వహణ బాధ్యతలు తమకే ఇవ్వాలని మూడు దేశాల (సౌతాఫ్రికా, ఎమిరేట్స్, ఇంగ్లాండ్) బోర్డులు వివర ణలు, ఆప్షన్స్ ఇచ్చాయి. ఐపీఎల్ 12వ సీజన్ మార్చిలోనే..!

Updated By ManamFri, 06/01/2018 - 22:52

iplముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్ 2018) సీజన్-11 ఇప్పుడుప్పుడే ముగిసి కొన్ని రోజులు కూడా కాలేదు. అప్పుడే వచ్చే ఏడాది సీజన్ ఐపీఎల్ గురించి చర్చలు మొదలయ్యాయి. ఈసారి ఐపీఎల్-12వ సీజన్ ముందుగానే జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అభిమానులు ఎంతగానో ఎదురుచూసే వరల్డ్ కప్ కూడా 2019లోనే జరగనుంది. వచ్చే ఏడాది వరల్డ్ కప్‌తో పాటు.. సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మార్చిలోనే ఐపీఎల్‌ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుంది. ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ కప్ వచ్చే సంవత్సరం మే 30 నుంచి ప్రారంభమవుతుంది. భారత ప్లేయర్స్ నిబంధనల ప్రకారం ఒక టోర్నీ అయిపోయిన తర్వాత మరో టోర్నీలో మ్యాచ్ ఆడటానికి కనీసం 15 రోజుల విరామం ఉండాలి. దీనిలో భాగంగానే ఐపీఎల్-12వ సీజన్ త్వరగానే నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇంగ్లండ్‌లోని వేల్స్ వేదికగా 2019 మే 30 నుంచి జూలై 14 వరకు వరల్డ్ కప్ జరగనుంది. అయితే ప్రతి సంవత్సరం ఐపీఎల్ ఏప్రిల్ మొదటి లేదా రెండో వారంలో ప్రారంభమై మే నెల చివరి వారంలో ముగుస్తుంది. కానీ, ఈసారి మాత్రం ఐపీఎల్ మే మూడో వారంలోనే ముగించాలి. అలా అయితేనే ఇండియన్ ప్లేయర్స్‌కు వరల్డ్ కప్‌లో ఆడేందుకు 15 రోజుల గ్యాప్ లభిస్తుంది. ఈ విధంగా చూస్తే 2019లో మార్చి 29న  ఐపీఎల్ -12వ సీజన్ ప్రారంభమతుందని సమాచారం. అంతేకాక ఐపీఎల్-12ను విదేశాల్లో నిర్వహించే అవకాశం ఉందన్నారు. ఎలక్షన్స్ సమయంలో మ్యాచ్‌లు నిర్వహిస్తే భద్రత కష్టమవుతుంది. గతంలో కూడా 2009లో ఎన్నికల సమయంలో ఐపీఎల్‌ను దక్షిణాఫ్రికాలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఐపీఎల్-11వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ కైవసం చేసుకుంది.ఎలిమినేటర్ ఎవరో...

Updated By ManamTue, 05/22/2018 - 21:55
  • నేడు ఐపీఎల్‌లో రాజస్థాన్, కోల్‌కతా మధ్య చివరిపోరు

imageకోల్‌కతా: ఐపీఎల్-11లో లీగ్ దశ ముగిసింది. ఒక ఉత్కంఠ పోరుకు తెరలేచింది. బుధవారం జరగనున్న కీలకమైన ఎలిమినేటర్ పోరులో మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్), రెండుసార్లు విజేత, ఈ మ్యాచ్‌లో హాట్ ఫేవరెట్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లోని లీగ్ దశ మ్యాచ్‌ల్లో ఇంటా, బయటా ఆర్‌ఆర్‌ను కేకేఆర్ చిత్తు చేసింది. గత నెలలో జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్లతో ఆర్‌ఆర్‌ను కోల్‌కతా చిత్తు చేయగా.. వారం క్రితం ఈడెన్ గార్డెన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్లతో గెలిచి ప్లే ఆఫ్‌కు చేరుకుంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన కేకేఆర్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇలా నాలుగో స్థానంలో నిలవడం ఇది ఆరోసారి. ఈ సీజన్‌లోనే అత్యధిక స్కోరు నమోదు చేసిన కేకేఆర్ జట్టు గత మ్యాచ్‌లో టేబుల్ టాపర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ సేన చాలా తెలివిగా ప్రవర్తించింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో హోం అడ్వాంటేజ్ తీసుకున్న ఏకైక జట్టు కేకేఆర్. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు రెండో క్వాలిఫయర్ ఆడుతుంది. ఓడిన జట్టు ఇంటి ముఖం పడుతుంది. మరోవైపు ఆరంభ ఐపీఎల్ విజేత రాజస్థాన్ జట్టు స్టార్ ప్లేయర్స్‌తో ప్లే ఆఫ్‌కు చేరుకుంది. కానీ ప్లే ఆఫ్‌లో జోస్ బట్లర్, బెన్ స్టోక్స్ వంటి స్టార్ ఆటగాళ్లు లేకపోవడంతో ఇప్పడు అదృష్టంపైనే ఎక్కువగా ఆధారపడింది. రాజస్థాన్ జట్టు ఎన్నో ఒడుదు డుకులు ఎదుర్కొని ప్లే ఆఫ్‌కు చేరుకుంది. అయితే ఈ నెల 19న జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. కానీ అది ఎంత మాత్రమూ సరిపోలేదు. ప్లే ఆఫ్‌కు చేరాలంటే మరో రెండు మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి వచ్చింది. వారి ప్రార్థనలు ఫలించి మిగతా మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్లు ఓటమిపాలై ఇంటి ముఖం పట్టాయి. దీంతో నాటకీయంగా ఆర్‌ఆర్ జట్టు ప్లే ఆఫ్‌కు చేరుకుంది. దాదాపు క్వార్టర్ ఫైనల్‌తో సమానమైన ఎలిమినేటర్‌లో తప్పిదాలకు అవకాశం లేదు. దీంతో అజింక్య రహానే సేన ప్రస్తుతం తమకున్న వనరులపైనే ఆధారపడాల్సి వచ్చింది. ఆర్‌ఆర్ ముందున్న మొదటి సవాల్ ఏదనగా.. సునీల్ నరైన్, పియుష్ చావ్లా, కుల్‌దీప్ యాదవ్ వంటి అత్యుత్తమ స్పిన్నర్లను ఎదుర్కోవడం. లీగ్ దశ మ్యాచ్‌లన్నింటీలో పేలవ ఆటను కొనసాగించిన కెప్టెన్ రహానే (324 పరుగులు) ఈ మ్యాచ్‌లోనైనా కీలకపాత్ర పోషించాలి. పరుగుల స్వర్గ ధామంగా, రెండో బ్యాటింగ్ చేసే జట్టుకు సహకరించే ఈ పిచ్‌పై సంజు శాంసన్, ఫామ్‌లో ఉన్న ఓపెనర్ రాహుల్ త్రిపాఠీలతో కలిసి రహానే కూడా సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు.రైజర్స్ v/s రైడర్స్

Updated By ManamSat, 05/19/2018 - 00:47
  • కోల్‌కతాకు చావో  నేడు హైదరాబాద్‌తో ఐపీఎల్ మ్యాచ్

  • ఐపీఎల్ సీజన్-11 చివరి దశకు చేరుకుంది. కానీ, ఇంకా ప్లే ఆఫ్‌పై స్పష్టత రాలేదు.. తొలి రెండు స్థానాలను సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకోగా.. మిగిలిన రెండు స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ స్థానాల కోసం ఐదు జట్లు పోటీ పడుతున్నాయి. అందులో కోల్‌కతా నైట్‌రైడర్స్ కూడా ఒకటి. అందుకే ఈ మ్యాచ్ నైట్‌రైడర్స్‌కు చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్‌కు చేరుకుంటుంది. ఒకవేళ ఓడిపోతే మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అందుకే ఈ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ తప్పనిసరిగా గెలవాలని పట్టుదలతో ఉంటే..వురోవైపు వరుసగా రెండు ఓటములను చవిచూసిన సన్  రైజర్స్ ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలిచి టాప్ ప్లేస్‌తో ముగించాలనే పట్టుదలతో ఉంది

Riders v/s ridersహైదరాబాద్: వరుస పరాజయాలపాలైనప్పటికీ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఇక ఏమాత్రం తప్పులు చేయడానికి వీల్లేదు. ఐపీఎల్‌లో భాగంగా శనివారం జరగనున్న మ్యాచ్‌లో బలమైనా, టేబుల్ టాపర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కేకేఆర్ తలపడనుంది. 13 మ్యాచ్‌ల్లో 9 విజయాలు సాధించి 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో 14 పరుగులతో ఓటమిపాలైంది. అయినప్పటికీ ఆతిథ్య జట్టు గత మ్యాచ్‌ల్లో సాధించిన విజయాలతో స్ఫూర్తి పొందవచ్చు. రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన కేకేఆర్ 13 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు సాధించి 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. తొలి రెండు స్థానాల్లో ఉన్న హైదరాబాద్, చెన్నై జట్లకు దగ్గరైన కేకేఆర్ శనివారం మ్యాచ్‌లో గెలుపు కోసం సర్వశక్తులొడ్డి పోరాడనుంది. మొన్నటి వరకు బలమైన బౌలింగ్ అటాక్ కలిగిన జట్టుగా పేరొందిన హైదరాబాద్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన కనబరిచింది. అయితే కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌లో ఆ తప్పులను సరిచేసుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌కు హైదరాబాద్ జట్టులో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. బెంగళూరుతో మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకుని ఐపీఎల్‌లోనే చరిత్ర సృష్టించిన పేసర్ బాసిల్ థంపిపై వేటు పడే అవకాశముంది. పూర్తి బౌలింగ్ కోటా నాలుగు ఓవర్లలో అతను 70 పరుగులిచ్చాడు. దీంతో ఇంతకుముందు ఇషాంత్ శర్మ నెలకొల్పిన రికార్డును థంపి బద్దలు కొట్టాడు. థంపీ బౌలింగ్‌ను ఏబీ డివిలియర్స్, మొయిన్ అలీ చితకబాదారు. అయినప్పటికీ సన్‌రైజర్స్ అద్భుతమైన బ్యాటింగ్‌తో హైదరాబాద్ జట్టు గెలుపుకు దగ్గరగా వచ్చింది. ఈ సీజన్‌లో 600 పరుగులు పూర్తి చేసిన సన్‌రైజర్స్  కెప్టెన్ కేన్ విలియమ్సన్ ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. మరోసారి తన ప్రతాపాన్ని చూపేందుకు సిద్ధమయ్యాడు. బెంగళూరుతో మ్యాచ్‌లో విలియమ్సన్ 42 బంతుల్లో 81 పరుగులు చేశాడు. ఈ ఐపీఎల్‌లో అతను అర్ధ సెంచరీకిపైగా పరుగులు చేయడం ఇది ఎనిమిదోసారి.  మరోవైపు బెంగళూరు బౌలర్లపై వీరవిహారం చేసి అర్ధ సెంచరీ చేసిన మనీష్ పాండే అదే జోరును కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు. గత మ్యాచ్‌లో ఆడలేకపోయిన ప్రధాన బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఈ మ్యాచ్‌కు బరిలోకి దిగనున్నాడు. రషీద్ ఖాన్, సిద్ధార్థ్ కౌల్, షకీబ్ అల్ హసన్ అతనికి అండగా నిలవనున్నారు. కేకేఆర్ జట్టులో అత్యున్నత విశ్వాసంతో ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే కుల్‌దీప్ యాదవ్. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కుల్‌దీప్ నాలుగు వికెట్లు తీసి జట్టుకు సునాయస విజయాన్ని అందించాడు.

చాలెంజర్స్‌తో రాయల్స్ పోరు
జోస్ బట్లర్, బెన్ స్టోక్స్ వంటి స్టార్ ప్లేయర్స్ లేకపోవడంతో బలహీనపడ్డ రాజస్థాన్ రాయల్స్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో తలపడేందుకు సిద్ధమైంది. శనివారం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఐదారు స్థానాల్లో ఉన్న ఈ రెండు జట్లకూ ఈ మ్యాచ్ కీలకమైంది. ప్లే ఆఫ్ అవకాశాలు వేడెక్కుతున్న సమయంలో నాలుగైదు స్థానాల కోసం ఐదు జట్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఇప్పటికే తొలి రెండు స్థానాలను ఖాయం చేసుకున్నాయి. కాగా రాజస్థాన్ రాయల్స్, ఆర్‌సీబీ, పంజాబ్, ముంబై ఇండియన్స్, కేకేఆర్ జట్లు మిగిలిన రెండు స్థానాల కోసం పోటీ పడుతున్నాయి. 

ఐపీఎల్‌లో నేడు
రాజస్థాన్ రాయల్స్ X రాయల్ చాలెంజర్స్  సవాయి మాన్‌సింగ్ స్టేడియం-జైపూర్  సా 4 గంటలకు..
సన్‌రైజర్స్ హైదరాబాద్ X కోల్‌కతా నైట్‌రైడర్స్ ఉప్పల్ స్టేడియం హైదరాబాద్  రా 8 గంటలకు...కోహ్లీ గ్రేట్ రికార్డు

Updated By ManamWed, 05/16/2018 - 02:39

ముంబై: బెంగళూరు కెప్టెన్  కోహ్లీ  ఐపీఎల్‌లో ఎవరికీ సాధ్యంkohli కానీ రికార్డును సాధించాడు.   ఐపీ ఎల్‌లో ఐదు సీజన్లలో 500కు పైగా పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ రికార్డుల్లోకెక్కాడు.  టోర్నీలో భాగంగా సోమవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఈ సీజన్‌లో అతడి పరుగుల సంఖ్య 514కి చేరింది. 2011 సీజన్‌లో కోహ్లీ మొదటిసారి 557 (16 మ్యాచ్‌లు) పరుగులు సాధించాడు. ఆ తర్వాత 2013లో 634 (16 మ్యాచ్‌లు), 2015లో 505 (16 మ్యాచ్‌లు), 2016లో 973 (16 మ్యాచ్‌లు) పరుగులు చేశాడు. ఈ సీజన్‌కు ముందు కోహ్లీతో పాటు డేవిడ్ వార్నర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) నాలుగుసార్లు 500కు పైగా పరుగులు సాధించాడు. చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా ప్రతి సీజన్లోనూ 300కు పైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడికి నిలిచాడు. రైనా 2010, 2013, 2014లో 500 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. ఈ సీజన్లో లీగ్ దశలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండింట్లో గెలిస్తేనే ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది.ప్లే ఆఫ్ రేస్

Updated By ManamWed, 05/16/2018 - 02:20
  • రెండు బెర్తులు.. ఐదు జట్లు   ప్రతీ మ్యాచ్ అగ్ని పరీక్షే!

ఐపీఎల్‌లో ప్లే ఆఫ్ కంటే ముందు... అసలు సిసలు మజా మొదలైంది. నాలుగు ప్లే ఆఫ్ బెర్తుల్లో ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు దాదాపు తమ స్థానాలను ఖాయం చేసుకోగా... మిగతా రెండు స్థానాల కోసం ఐదు జట్లు పోటీలో ఉన్నాయి. దీంతో ఈ ఐపీఎల్‌లో మిగతా లీగ్ మ్యాచ్‌లు  మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. ఈ వేసవి చివర్లో ప్రేక్షకులకు మరింత వినోదాన్నందించబోతున్నాయి. ఇప్పటి వరకూ ఉన్న పాయింట్ల పట్టికను పరిశీలిస్తే  2018 ఐపీఎల్‌లో ఢిల్లీ కథ ముగిసింది. ఈ మూడు జట్లు ...కింగ్స్ లెవెన్ పంజాబ్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్  12 పాయింట్లతో సమ ఉజ్జీలుగా నిలిచాయి. మాజీ చాంపియన్లు ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజ్స్ బెంగళూరు 10 పాయింట్లతో ఉన్నాయి. టోర్నమెంట్ ఆరంభంలో చెత్తగా ఆడిన ముంబై, రాజస్థాన్, బెంగళూరు పాయింట్ల పట్టికలో చివరి స్థానం కోసం పోటీపడుతూ వచ్చినా ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. దీంతో  ప్లే ఆఫ్ రేసు మరింత రసవత్తరంగా మారింది. ఈ కారణంగా లీగ్ మ్యాచ్‌ల చివరి వరకూ ప్లేఆఫ్  బెర్తులపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలు కనిపించటం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో (కోల్‌కతా నైట్ రైడర్స్- రాజస్థాన్ రాయల్స్, మంగళవారం నాటి మ్యాచ్‌కు ముందు) ఏ జట్టు ప్లే ఆఫ్  చేరే అవకాశముంది.. ప్లే ఆఫ్ చేరాలంటే ఏ జట్టు ఏం చేయాలి..?


కోల్‌కతా నైట్‌రైడర్స్ (12 పాయింట్లు)dinesh
ఒకప్పటి చాంపియన్ నైట్ రైడర్స్ ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. ముంబై చేతిలో  దెబ్బమీద దెబ్బ తిన్నాక పంజాబ్‌పై భారీ స్కోరు (245/6) చేసి గెలుపొంది మళ్లీ పుంజుకుంది. రాజస్థాన్‌పై గెలిస్తే.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువవుతుంది. ఓడినా చివరి మ్యాచ్‌ల్లో తప్పని సరిగా గెలిస్తే  ప్లే ఆఫ్‌కు  చేరే అవకాశాలున్నాయి. అయితే మిగతా జట్ల గెలుపోటములూ ఈ జట్టును ప్లే ఆఫ్‌కు చేర్చే అంశంపై ప్రభావం చూపుతాయి.

రాజస్థాన్ రాయల్స్ (12 పాయింట్లు)
rahaneటోర్నీ ఆరంభంలో చెత్తగా ఆడిన రాజస్థాన్ రాయల్స్ ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ప్లే ఆఫ్ రేసులోకి  దూసుకొచ్చింది. కోల్‌కతాతో జరిగే  కీలక మ్యాచ్‌తో రాజస్థాన్ జట్టు  అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగే చివరి మ్యాచ్ వరకూ రాజస్థాన్‌కు ప్లే  ఆఫ్ పోరాటం తప్పదు.

కింగ్స్ లెవెన్ పంజాబ్ (12 పాయింట్లు)
బెంగళూరుతో  సోమవారం జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడి  పంజాబ్ జట్టు డేంజర్‌లో పడింది. వరుస ఓటములతో ప్లే ఆఫ్ అవకాశాన్ని మరింత క్లిష్టం చేసుకున్న పంజాబ్ మూడో స్థానం నుంచి ఐదో స్థానానికు పడిపోయింది. ఇంకో రెండు మ్యాచ్‌లాడాల్సి ఉన్నందున ఈ జట్టుకు ప్రతి మ్యాచ్ కీలకమే. బుధవారం ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌తో పాటు  చివరి మ్యాచ్‌ను  చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడాల్సి ఉంది.

ముంబై ఇండియన్స్ (10 పాయింట్లు)
ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై చిత్తుగా ఓడిపోయిన ముంబైకి ఇక ప్రతి మ్యాచ్ కీలకమే.. బుధవారం  పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో ఓడితే ఇక టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే.. పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌తో పాటు ఆ తర్వాత ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగే మ్యాచ్‌లోనూ ముంబై గెలిస్తే  ముంబై ముందుకెళుతుంది.  

rcbరాయల్ చాలెంజర్స్ బెంగళూరు (10 పాయింట్లు)
ఐపీఎల్‌లో ఆడుతున్న ఎనిమిది జట్లలో ప్రస్తుతం ఏడో స్థానంలో  ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండు విజయాలు సాధించి ప్లే ఆఫ్ రేస్‌లో  తామూ ఉన్నామని నిరూపించింది. ఆ కలను నెరవేర్చుకోవాలంటే మిగతా రెండు మ్యాచ్‌ల్లో బెంగళూరు తప్పక గెలవాల్సి ఉంది. పంజాబ్‌ను పది వికెట్ల తేడాతో ఓడించి మెరుగైన రన్‌రేట్‌ను సంపాదించిన బెంగళూరు మిగతా మ్యాచ్‌ల్లోనూ అదే ఆటను ప్రదర్శిస్తే ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకునే అవకాశం  ఉంది.నువ్వా..నేనా

Updated By ManamTue, 05/15/2018 - 01:06
  • ఐపీఎల్‌లో నేడు కోల్‌కతా, రాజస్థాన్‌లకు చావోరేవో  

ఐపీఎల్‌లో ప్లే ఆఫ్  రేస్ మజా కొనసాగుతోంది.  ఇప్పటికే సkolkattaన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు  ప్లే ఆఫ్ బెర్త్‌లు ఖాయం చేసుకోగా, మరో రెండు స్థానాల కోసం పంజాబ్, నైట్ రైడర్స్, రాజస్థాన్, ముంబై జట్లు పోటీపడుతున్నాయి.  ఈ నాలుగు జట్లలో ప్లే ఆఫ్‌కు చేరేవి రెండు జట్లే.. దీంతో ఐపీఎల్‌లో చివరి లీగ్ మ్యాచ్‌లు మరింత ఆసక్తికరంగా మారాయి.

కోల్‌కతా: ఐపీఎల్‌లో మనుగడ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) జట్లు తలపడనున్నాయి. మంగళవారమిక్కడ జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లో బలంగా దూసుకొస్తున్న ఆర్‌ఆర్‌తో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న కేకేఆర్ తలపడనుంది. రౌండ్ రాబిన్ లీగ్ దశలో మరో మ్యాచ్ మాత్రమే మిగిలిన ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ ఇరు జట్ల భవిష్యత్తును నిర్ణయించనుంది. ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైన జట్టు ఇక నిష్క్రమించక తప్పదు. 12 పాయింట్లతో ఇరు జట్లూ నాలుగైదు స్థానాల్లో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకోగా ఓడిన జట్టు ఇంటి ముఖం పడుతుంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఇరు జట్లూ హోరా హోరీగా పోరాడనున్నాయి. లీగ్ దశ ముగుస్తున్న సమయంలో ఈ రెండు జట్లూ పుంజుకోవడంతో అర్హత పోటీ మరింత కఠినంగా మారింది. వరుస మ్యాచ్‌లతో వెనకబడిన కేకేఆర్ జట్టు గత మ్యాచ్‌లో ఐపీఎల్‌లోనే నాల్గవ అత్యధిక స్కోరు 245/6 నమోదు చేసింది. అంతేకాదు ఆ మ్యాచ్‌లో ప్రత్యర్థి కింగ్స్ లెవెన్ పంజాబ్‌ను 31 పరుగులతో చిత్తు చేసింది. ఎలిమినేషన్ అంచున నిలిచిన ఆర్‌ఆర్ జట్టు కూడా వరుసగా మూడు విజయాలతో పుంజుకుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో జోస్ బట్లర్ ఒంటరి పోరుతో జట్టును గెలిపించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ అజేయ 94 పరుగులు చేయడంతో ఆర్‌ఆర్ జట్టు 7 వికెట్లతో విజయం సాధించింది. ఇంగ్లండ్‌కు చెందిన ఈ వికెట్‌కీపర్/ బ్యాట్స్‌మన్‌కు ఇది వరుసగా ఐదో అర్ధ సెంచరీ. దీంతో ఐపీఎల్ రికార్డుల్లో  వీరేంద్ర సెహ్వాగ్ సరసన నిలిచాడు. బట్లర్ గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో చేసిన స్కోర్లు చూస్తే 67, 51, 82, 95 (నాటౌట్), 94 (నాటౌట్)గా ఉన్నాయి. బట్లర్‌తో పాటు బెన్ స్టోక్స్ కూడా కేకేఆర్‌కు ప్రమాదకరంగా మారనున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో స్టోక్స్ వివిధ స్థానాల్లో ఆడి మెప్పించాడు.

వీళ్లద్దరిని గనుక కట్టడి చేయగలిగితే దినేష్ కార్తీక్ నేతృత్వంలోని కేకేఆర్ సగం పోరు గెలిచినట్టే. ఆర్‌ఆర్ బలహీనతలను బాగా తెలుసుకున్న కార్తీక్ స్పిన్‌తో తమ ప్రత్యర్థిని దెబ్బతీయాలని భావిస్తున్నాడు. ఆర్‌ఆర్ కెప్టెన్ అజింక్య రహానే ఫామ్‌లో లేకపోవడం కేకేఆర్‌కు కలిసొచ్చే అంశం. రౌండ్ రాబిన్ లీగ్ దశలో ఈ మ్యాచ్ కోల్‌కతాకు చివరి హోం మ్యాచ్. దీంతో హోం గ్రౌండ్ మ్యాచ్‌లను గెలుపుతో ముగించాలని కేకేఆర్ పట్టుదలగా ఉంది. ఎలిమినేటర్, రెండో ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు ఈడెన్ గార్డెన్ ఆతిథ్యమివ్వనుంది. ఒకవేళ పాయింట్ల పట్టికలో మూడు లేదా నాలుగో స్థానంలో కేకేఆర్ నిలిస్తే మరోసారి హోం గ్రౌండ్‌లో ఆడే అవకాశం ఆ జట్టు కు లభిస్తుంది. రహానే 12 మ్యాచ్‌ల్లో 280 పరుగులు మాత్రమే చేశాడు. అయితే సత్తా చాటేందుకు, కెప్టెన్‌గా జట్టుకు అండగా నిలిచేందుకు రహానేకు ఇదే చివరి అవకాశం. మరోవైపు కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది.

సునీల్ నరైన్, దినేష్ కార్తీక్, యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఇండోర్‌లో భారీ స్కోరు సాధించిన మ్యాచ్‌లో సరైన్ 36 బంతుల్లో 75 పరుగులు, కార్తీక్ 23 బంతుల్లో 50 పరుగులు చేశారు. బ్యాట్‌తో, బంతితో రెచ్చిపోతున్న నరైన్ కేకేఆర్ జట్టుకు చాలా విలువైన ఆటగాడిగా మారాడు. ట్రినిడాడ్‌కు చెందిన ఈ ఆల్ రౌండర్ మరోసారి కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నాడు. నరైన్ బౌలింగ్‌కు, బట్లర్ బ్యాటింగ్‌కు మధ్య జరగనున్న పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కెప్టెన్ కార్తీక్ 46.37 సగటుతో మొత్తం 371 పరుగులు చేశాడు. కార్తీక్ కూడా ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ సత్తా చూపాలనుకుంటున్నాడు. ముఖా ముఖీ పోరులో ఈ రెండు జట్లూ 7-7తో సమంగా ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్ అభిమానులకు కన్నుల పండుగ కానుంది. పంజాబ్ చిత్తుచిత్తు

Updated By ManamTue, 05/15/2018 - 00:52
  • 10 వికెట్ల తేడాతో బెంగళూరు విజయం

ఇండోర్ : ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో కింగ్స్ లెవెన్ పంజాబ్‌కు ఘోరపరాభవం ఎదురైంది. రాయల్స్ umeshచాలెంజర్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడింది. ఈ విజయంతో రాయల్ చాలెంజర్స్ ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 15.1 ఓవర్లలో 88 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ స్వల్ప లక్ష్యాన్ని రాయల్ చాలెంజర్స్ జట్టు 8.1 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (48: 28 బంతుల్లో ఆరు ఫోర్లు, 2 సిక్స్‌లు) పార్థివ్ పటేల్ (40:22 బంతుల్లో 7 ఫోర్లు) వికెట్ నష్టపోకుండా ఆడి జట్టుకు ఘన విజయం అందించారు.

88కే ఆలౌట్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ పంజాబ్ ఆరంభంలో ఫర్వాలేదనిపించింది. రాహుల్ మూడు సిక్సర్లు, గేల్ నాలుగు ఫోర్లతో దూకుడుగా కనిపించారు. అయితే ఈ ఇద్దరినీ ఉమేశ్ యాదవ్ బోల్తా కొట్టించాడు. ఒకే ఓవర్‌లో రాహుల్ (21), క్రిస్ గేల్ (18)లు నిష్క్రమించడంతో ఇక కింగ్స్ పంజాబ్ ఇన్నింగ్స్ పేకవేుడలా కూలిపోయింది. అయితే అరోన్ ఫించ్ (26) ఔటైన తర్వాత కింగ్స్ స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోయింది.ఆపై సిరాజ్ బౌలింగ్‌లో కరుణ్ నాయర్ (2) ఔట్ కాగా, అటు తర్వాత చాహల్ బౌలింగ్‌లో స్టోయినిస్ (2) నాల్గో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో కింగ్స్ 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే మరో 38 పరుగులు మాత్రమే చేసిన కింగ్స్ పంజాబ్ మిగతా ఆరు వికెట్లను కోల్పోయింది. 8 మంది ఆటగాళ్లు రెండకెల స్కోరు కూడా చేయలేకపోవడంతో 88 పరుగులకే పంజాబ్ ఆలౌట్ అయింది. బెంగళూరు బౌలర్ ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టి పంజాబ్‌ను దెబ్బ తీశాడు. సిరాజ్, మొయిన్ అలి, చాహల్, గ్రాండ్‌హోమ్ తలో వికెట్ తీశారు.

సంక్షిప్త స్కోర్లు
కింగ్స్ లెవెన్ పంజాబ్ : 15.1 ఓవర్లలో 88 ఆలౌట్ (పింఛ్ 26, కె.ఎల్.రాహుల్ 21, ఉమేశ్ యాదవ్ 3/23).
రాయల్‌ చాలెంజర్స్ బెంగళూరు: 8.1 ఓవర్లలో 92/0 (కోహ్లీ 48 నాటౌట్, పార్థివ్ పటేల 40 నాటౌట్)రహానేకు షాక్

Updated By ManamTue, 05/15/2018 - 00:27

రూ.12 లక్షల ఫైన్
ముంబై: రాజస్థాన్ రాయల్స్ సారథి అజింక్య రహానేపై ఐపీrahaneఎల్ నిర్వాహకులు రూ.12లక్షల జరిమానా విధించారు. ఐపీఎల్ 11వ సీజన్‌లో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా ముంబైలో ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ జట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు నెమ్మదిగా ఓవర్లు వేశారు. అనుకున్న సమయంలో వారు తమ ఇన్నింగ్స్‌ను పూర్తి చేయలేకపోయారు. దీంతో టోర్నీ నిర్వాహకులు ఆ జట్టు సారథి రహానెకు రూ.12 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు. ఐపీఎల్‌లో స్లో ఓవర్ రేట్ నిబంధనను అతిక్రమించడం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఇదే తొలిసారి. అందుకే ఆ జట్టు సారథి రహానెకు జరిమానా విధిస్తున్నాం’ అని  ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ ఏడాది ఐపీఎల్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధించడం ఇది రెండోసారి. చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీకి రూ.12 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ టోర్నీలో భాగంగా మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పోటీపడుతుంది.సూపర్ కింగ్స్ సమరోత్సాహం..

Updated By ManamThu, 05/10/2018 - 23:57
  • చావోరేవో తెల్చుకోనున్న రాజస్తాన్ రాయల్స్ 

iplఒకప్పటి ఐపీఎల్ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ బరిలో నిలవటం కోసం తంటాలు పడుతోంది.  టాప్‌గేర్‌లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌తో ఇవాళ చావో రేవో తేల్చుకోనుంది. రాయల్స్‌కు ఈ మ్యాచ్ గెలుపు తప్పనిసరికాగా.. ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖాయం చేసుకునేందుకు ఈ మ్యాచ్‌ను ఉపయోగించుకోవాలనుకుంటోంది చెన్నై...
జైపూర్: ఐపీఎల్ ఆరంభ టైటిల్‌ను గెలచుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు మళ్లీ ఇంత వరకు ఆలాంటి ప్రతిభ కనబరచలేదు. ఈసారి కూడా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శుక్రవారం పటిష్టవైున చెన్నై సూపర్ కింగ్స్‌తో రాజస్థాన్ అమీ తుమీ తేల్చుకోనుంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో రాయల్స్ ప్లే ఆఫ్ అవకాశాలు తగ్గిపోయాయి. ఇక్కడ చివరిసారి జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ లెవెన్ పంజాబ్‌పై రాజస్థాన్ 15 పరుగులతో గెలిచింది. అయితే ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆడాలి. అంతేకాదు మిగిలిన నాలుగు మ్యాచ్ ల్లోనే సత్తా చాటాలి. ఇంతకుముందు పుణెలో జరిగిన మ్యాచ్‌లో 64 పరుగులతో గెలిచిన చెన్నై జట్టుపై ప్రతీకారం తీర్చుకునేం దుకు కూడా శుక్రవారం రాజస్థాన్ జట్టు బరిలోకి దిగనుంది. ఈ సీజన్‌లో రాజస్థాన్ ఆడిన తీరు చెప్పుకోదగినంతగా లేదు.   10 మ్యాచ్‌లకుగాను ఎనిమిది పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్ అవకాశాలకు దగ్గరగా ఉన్న అజింక్య రహానే సేన ఈ మ్యాచ్‌ను తప్పక గెలవాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో ఓడిపోతే రాజస్థాన్ ప్లే ఆఫ్ ఆశలు గల్లంతయినట్టే. రాజస్థాన్ జట్టు ఇప్పుడు హోం గ్రౌండ్‌కు వచ్చేసింది.   జైపూర్‌లో నాలుగు మ్యాచ్‌లకు గాను మూడింటిలో రాజస్థాన్ గెలిచింది. దీంతో శుక్రవారంనాటి మ్యాచ్ కూడా రాజస్థాన్ జట్టుకు కీలకంగా మారింది. ఈ సీజన్‌లో రాజస్థాన్ బ్యాట్స్‌మెన్, బౌలర్లు పేలవ ప్రదర్శనను కనబరిచారు. కెప్టెన్ రహానే, సంజు శాంసన్ యావరేజ్ ప్రతిభ, ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్ప్, రాహుల్ త్రిపాఠి ఆశించిన మేరకు ఆడక పోవడంతో రాజస్థాన్ ఈ స్థితికి దిగజా రింది. అయితే బలమైన సీఎస్‌కేపై గెలవాలంటే బ్యాట్స్‌మెన్, బౌలర్లు అందరూ కలిసి కట్టుగా రాణించాలి. గత మ్యాచ్‌లో ఇంగ్లండ్ వికెట్‌కీపర్/బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ జట్టుకు అండగా నిలిచి 58 బంతుల్లో 82 పరుగులు చేయడంతో రాజస్థాన్ జట్టు 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు సాధించింది. అయితే ఈ స్కోరును బౌలర్లు సంరక్షించారు. కృష్ణప్ప గౌతమ్, కివీస్ స్పిన్నర్ ఇష్ సోధి, జోఫ్రా ఆర్చర్‌లు అద్భుత ప్రతిభ కనబరిచారు. మరోవైపు ఆడిన 10 మ్యాచ్‌లకు గాను 14 పాయింట్లతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రెండో స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖాయం చేసుకునేందుకు మిగిలిన నాలుగు మ్యాచ్‌లు చాలు. మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో ఆసాధారణ ఫామ్‌ను కనబరుస్తోంది. చెన్నై బ్యాట్స్‌మెన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. కానీ బెంగళూరుతో జరిగిన గత మ్యాచ్‌లో బౌలర్లు రాణించి నప్పటికీ బౌలింగ్ ఆ జట్టును కలవరపెడు తోంది. అయితే చహర్ గాయంపాలై ఈ మ్యాచ్‌కు దూరమైన నేప థ్యంలో పేస్ త్రయం లుంగి ఎంగిడి, డేవిడ్ విల్లే, శార్దూల్ మరింత బాధ్యతా యుతంగా బౌలింగ్ చేయాలి. చెన్నై బ్యాట్స్‌మెన్ అందరూ ఫామ్‌లో ఉన్నారు. జట్టుకు అవసరం ఉన్నపుడల్లా అంబటి రాయుడు, ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వాట్సన్, వెస్టిండీస్ డ్వైన్ బ్రావో, కెప్టెన్ ధోనీ, రైనా  తమ చేయూతను అందిస్తూనే ఉన్నారు.

ఐపీఎల్‌లో నేడు
రాజస్థాన్ రాయల్స్ X చెన్నై సూపర్ కింగ్స్ సవాయ్‌మాన్‌సింగ్ స్టేడియం-జైపూర్ రాత్రి 8 గంటలకు.. స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

Related News