ipl

రాహుల్ బ్యాటింగ్‌కు ఫిదా

Updated By ManamWed, 05/09/2018 - 21:48

imageముంబై:  టీమిండియా యంగ్ బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ ఈ  ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రెచ్చిపోతున్నాడు. అద్భుత మైన ప్రదర్శనతో కింగ్స్ పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న రాహుల్‌పై ప్రశంసలు జల్లు కురుస్తోంది.  తాజాగా పాకిస్థాన్ యాం కర్ ఒకరు రాహుల్ బ్యాటింగ్‌కు ఫిదా అయ్యా రు.  రాజస్థాన్ రాయల్స్‌తో  జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రాహుల్ 54 బంతుల్లో 7 బౌండరీలు, 3 సిక్స్‌లు బాది  84 పరుగులు సాధించాడు. ఈ విజయంపై పాక్ యాంకర్ జైనబ్ అబ్బాస్ తన ట్వీటర్‌లో ఓ పోస్టు చేశారు. ‘కేఎల్ రాహుల్ టైమింగ్ అదిరింది. అత్యుత్తమ ప్రదర్శ నతో ఆకట్టు కుంటున్నాడు. అతని ఆట చూడటం గొప్పగా ఉంది’ అంటూ ఓ ట్వీట్ చేశారు. స్పోర్ట్స్ యాం కర్ అయిన జైనబ్‌కు పాక్ యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ ఐపీ ఎల్ సీజన్‌లో రాహుల్ వరుసగా అర్థ సెంచరీలతో రాణిస్తున్నాడు. 10 మ్యాచ్‌లలో 4 అర్థసెంచరీలతో 471 పరుగులు సాధించి టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇదే సీజన్‌లో 14 బంతుల్లో అర్థ సెంచరీ చేసి ఐపీఎల్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును తన పేరిట నిలుపు కున్నాడు. మంగళవారం రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నూ రాహుల్ (70 బంతుల్లో 95 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్స్‌ల)తో పోరాడాడు. సన్ రైజర్స్ రేస్

Updated By ManamWed, 05/09/2018 - 21:35

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018లో రేసుగుర్రంలా దూసుకుపోతోంది సన్ రైజర్స్. ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకున్న ఆరెంజ్‌ఆర్మీ లీగ్ రేస్‌లో గురువారం ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో పోటీకి రెడీ అయింది. ఇప్పటికే ప్లే ఆఫ్ బరి నుంచి దాదాపు తప్పుకున్న ఢిల్లీ జట్టు  సన్‌రైజర్స్‌తో జరిగే పోరులో అయినా గెలిచి  పరువు నిలుపుకోవాలనుకుంటోంది.

imageన్యూఢిల్లీ: ఐపీఎల్ నుంచి దాదాపుగా నిష్క్రమించిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు గెలుపు కోసం ఇంకా తహతహలాడుతోంది. ఐపీఎల్‌లో భాగంగా గురువారమిక్కడ జరగనున్న మ్యాచ్‌లో టేబుల్ టాపర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు తలపడనుంది. 10 మ్యాచ్‌లకు గాను మూడింటిలో గెలిచిన శ్రేయాస్ అయ్యర్ సేన కనీసం పరువు నిలబెట్టుకోవాలంటే సన్‌రైజర్స్‌తో తప్పక గెలవాల్సిన పరిస్థితి. అత్యుత్తమ జట్టుగా పేరు తెచ్చుకున్న జట్టుకు గౌతమ్ గంభీర్ కెప్టెన్‌గా రాజీనామా చేయడంతో అయ్యర్ పగ్గాలు చేపట్టాడు. అయితే కీలక సమయాల్లో చేసిన చిన్న చిన్న తప్పుల కారణంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ నెల 5వ తేదీన హైదరాబాద్‌లో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రతిభావంతులైన పృథ్వీ షా 65 పరుగులు చేయడంతో ఢిల్లీ 163 పరుగుల చాలెజింగ్ స్కోరును సాధించింది. అయితే చివరి రెండు ఓవర్లలో అనుభవజ్ఞులైన డాన్ క్రిస్టియన్, ట్రెంట్ బౌల్ట్ 28 పరుగులను పరిరక్షించలేకపోయారు. దీంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఓటమిపాలైంది.  అయితే బలమైన సన్‌రైజర్స్‌తో ముఖ్యంగా ఈ టోర్నీలోనే అత్యుత్తమ బౌలింగ్ యూనిట్ గల జట్టుతో మ్యాచ్‌లో ఆ తప్పులు పునరావృతం కాకూడదని అయ్యర్ భావిస్తున్నాడు.

‘నిజం చెప్పాలంటే చాలా నిరాశ చెందాం. ఒకానొక దశలో మాదే పైచేయిగా ఉంది. క్యాచ్‌లు గెలిపిస్తాయి మ్యాచ్‌లు అన్నట్టుగా జరిగింది. మేము ఫీల్డింగ్ ప్రాక్టీస్ బాగా చేశాం. కానీ అధిక ఒత్తిడి ఉన్న సమయంలో క్యాచ్‌లు చేజార్చడం వంటి తప్పులు జరుగుతుంటాయి. చివరి వరకు పోరాడాం’ అని ఏడు వికెట్లతో ఓటమిపాలైన అనంతరం అయ్యర్ అన్నాడు. అయితే కెప్టెన్ అయ్యర్, షా ఇద్దరూ ఫామ్‌లో ఉండటం ఢిల్లీ జట్టుకు ఉత్సాహాన్నిచ్చే అంశం. బ్యాటింగ్ స్వర్గధామంగా ఫిరోజ్ షా కోట్ల మైదానానికి పేరుంది. చావో రేవోగా నిలిచిన ఈ మ్యాచ్‌లో ఫామ్‌లో ఉన్న ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ చెలరేగే అవకాశముంది. మరోవైపు అయ్యర్, షా కూడా ఉన్నతమైన ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మరి సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో షాతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించే మరో అవకాశం ఇస్తారా? లేక పక్కన కూర్చోబెట్టి మళ్లీ కొలిన్ మన్రోకు అవకాశమిస్తారా? చూడాలి. రికీ పాంటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఢిల్లీ జట్టు హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఒక స్పిన్నర్ అమిత్ మిశ్రాతో బరిలోకి దిగింది. పేసర్ల కంటే అతను ఎంతో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. దీంతో ఈసారి మిశ్రాతో పాటు మరో స్పిన్నర్‌తో బరిలోకి దిగే అవకాశముంది.

మరోవైపు సన్‌రైజర్స్ జట్టుకు అన్ని అంశాలు కలిసొస్తున్నాయి. తక్కువ అవకాశాలొచ్చి నప్పటికీ హాలెస్ వాటిని సద్వినియోగం చేసుకున్నాడు. దీంతో మరోసారి ఈ స్టార్ ప్లేయర్ శిఖర్ ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశ ముంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో 78, 45 స్కోర్లు చేసిన ధావన్ తర్వాత విఫలమవుతూ వచ్చాడు. సన్‌రైజర్స్ బౌలింగ్ యూనిట్ ప్రత్యర్తి బ్యాటింగ్ లైనప్ చీల్చి చెండాడేదిగా ఉంది. ప్రత్యర్థులు నిర్దేశించే ఎటువంటి భారీ స్కోరునైనా ఛేదిస్తుంది. ఈ సీజన్‌లో ఆ విషయం మరోసారి నిరూపితమైంది. కేన్ విలియమ్సన్  కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ జట్టును గెలుపు బాట నడిపిస్తున్నాడు. ‘మేము బాగా ఆడటంలో ఎటువంటి సీక్రెట్ లేదు. వివిధ రకాల పిచ్‌లను ఎదుర్కోవాలని అనుకుంటున్నాం. ఈ లీగ్‌లో ఇంక కొన్ని మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. ఇంకా అభివృద్ధి చెందాలని భావిస్తున్నాం’  అని ఢిల్లీతో మ్యాచ్‌లో గెలిచిన అనంతరం విలియమ్సన్ అన్నాడు.రాయుడు కంటే రహానే బెటర్  

Updated By ManamWed, 05/09/2018 - 21:35
  • సెలెక్టర్ల నిర్ణయంపై గంగూలీ ఆశ్చర్యం 

imageముంబై : ఐర్లండ్, ఇంగ్లండ్‌లతో జరిగే వన్డే, టి20లకు సీనియర్ ప్లేయర్ అజింక్యా రహానేను తప్పించటంపై మాజీ కెప్టెన్ గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్, ఐర్లాండ్‌లతో సిరీస్‌లకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న ఏకైక టెస్టుకు సారథ్యం వహించనున్న రహానేను అనూహ్యంగా వన్డే, టీ20 మ్యాచ్‌ల నుంచి తప్పించారు. ఇంగ్లండ్‌తో వన్డేలకు శ్రేయస్ అయ్యర్, సిద్ధార్థ్ కౌల్, అంబటి రాయుడులకు పిలుపు రాగా రహానే లాంటి ఆటగాడిని పక్కన పెట్టటం  సరికాదని  గంగూలీ అన్నాడు.  ‘నాకు అవకాశం ఇస్తే, రాయుడు కంటే ముందుగా కచ్చితంగా రహానేను తీసుకుంటాను. ఇంగ్లండ్ లాంటి దేశాల్లో ఆడిన అనుభవం రహానే సొంతం. ఇంగ్లండ్‌లో రహానేకు మంచి రికార్డ్ ఉంది. రహానేను తప్పించడం కఠిన నిర్ణయమని’ అభిప్రాయపడ్డాడు.  దక్షిణాఫ్రి కాతో సిరీస్‌లో పెద్దగా రాణించకపోయినా... అంతకు ముందు సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో వరుసగా నాలుగు అర్ధ సెంచరీలు చేసిన రహానేకు చోటు దక్కకపోవడం సెలక్షన్ కమిటీ తీసుకున్న తప్పుడు నిర్ణయంగా గంగూలీ పేర్కొన్నాడు. మరోవైపు ఇదే ఇంగ్లండ్ సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ ఎంపికను గంగూలీ సమర్థించాడు.  ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ సారథ్యం వహిస్తున్న రహానె ఈ సీజన్‌లో నామమాత్రంగా రాణిస్తున్నాడు. ఇక అంతర్జాతీయ వన్డేల్లోనూ 90 మ్యాచ్‌లాడిన రహానే 35సగటుతో 2962 పరుగులు చేశాడు.ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్

Updated By ManamWed, 05/09/2018 - 21:35
  • గంట ముందే ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లు  

imageముంబై:  ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్... ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజస్ ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌ల  వేళల్లో మార్పులు చేస్తున్నట్లు పాలక మండలి ప్రకటించింది.  ప్రస్తుతం లీగ్ దశలో మ్యాచులు మే 20వ తేదీతో పూర్తవుతాయి. అనంతరం మే 22న వాంఖడే స్టేడియం వేదికగా తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత జరిగే ఎలిమినేటర్, రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లు కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతాయి. అయితే అభిమానుల సౌకర్యం దృష్ట్యా ఈ మ్యాచ్‌లను రాత్రి ఎనిమిది గంటలకు బదులుగా ఏడు గంటలకే ప్రారంభించాలని పాలక మండలి తీర్మానించింది. ‘ ఐపీఎల్ మ్యాచ్‌లను అభిమానులు గ్రౌండ్‌లో కానీ టెలివిజన్‌లో విపరీతంగా చూస్తారు. కాబట్టి ఫ్యాన్స్ ఇష్టాన్ని మనసులో పెట్టుకొని, ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లను కాస్త త్వరగా ప్రారంభించాలని నిర్ణయించాం.  ఈ మ్యాచ్‌లు రాత్రి ఎనిమిది గంటలకు బదులుగా ఏడు గంటలకే ప్రారంభమవుతాయి’ అని  ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా పేర్కొన్నారు. ‘మ్యాచ్‌ని గ్రౌండ్‌లో లేదా టెలివిజన్‌లో చూసి తిరిగి ఉదయం ఎవరి పనులకు వాళ్లు వెళ్లడం కష్టమవుతుంది. మ్యాచ్ చూసే వాళ్లలో విద్యార్థులు, ఉద్యోగులే ఎక్కువగా ఉంటారు. అందుకే మ్యాచ్‌ని కాస్త ముందుగా ప్రారంభిస్తే వాళ్లకి ఎంతో ఉపయోగపడుతుంది’ అని పేర్కొన్నారు. దీంతో ఈ నిర్ణయంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తు న్నారు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైన ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడు తుంది అని అంటున్నారు.పుంజుకుంటున్న ‘ముంబై’

Updated By ManamSat, 05/05/2018 - 23:29
  • నేడు కోల్‌కతాతో ఐపీఎల్ మ్యాచ్   

imageముంబై: గతంలో మాదిరిగా ఈసారి ఐపీఎల్‌లోనూ ముంబై ఇండియన్స్ జట్టు టైటిల్‌ను నిలబెట్టుకునే దిశగా పయనిస్తోంది. కింగ్స్ లెవెన్ జట్టుపై గెలిచి ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న ముంబై జట్టు ఆదివారమిక్కడ జరగనున్న మ్యాచ్‌లో బలమైన కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడనుంది. గత కొన్ని వారాలుగా మ్యాచ్‌లు గెలుస్తున్నప్పటికీ ముంబై జట్టు ప్లే ఆఫ్ ఆశలు ఆశనిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. క్రునాల్ పాండ్య, రోహిత్ శర్మ 21 బంతుల్లో చేసిన 56 పరుగుల భాగస్వామ్యం ఇండోర్ స్టేడియంలో చరిత్ర సృష్టించింది. కానీ హోం గ్రౌండ్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌లకు గాను ముంబై జట్టు ఒక్క మ్యాచ్‌లో గెలిచింది. మరోవైపు కోల్‌కతా జట్టు స్టోరీ మరో విధంగా ఉంది. కెప్టెన్ దినేష్ కార్తీక్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌పై 6 వికెట్లతో గెలిచిన కోల్‌కతా జట్టుకు ఇది వరసగా మూడో గెలుపు. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలవడం కోల్‌కతా జట్టు సభ్యులకు ఎనలేని బలాన్ని ఇచ్చింది. కోల్‌కతా పేసర్లు టామ్ కుర్రన్, వెటరన్ మిచెల్ జాన్సన్, యువకుడు శివమ్ మవి ఇప్పటికైనా సత్తా చాటాలి. ముంబైకి అగ్నీ పరిక్ష

Updated By ManamThu, 05/03/2018 - 22:05
  • నేడు కింగ్స్ లెవన్ పంజాబ్‌తో కీలక పోరు

mumbaiఇందోర్: ఐపీఎల్ సీజన్-11 కీలక దశలో చేరుకుంది. దాదాపు సగం మ్యాచులు ఐపోవస్తున్నాయి. కానీ, డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మాత్రం తన పేలవమైన ఆటతో అభిమానులతో పాటూ, ఫ్రాంచైజీను కూడా నిరాశపరుస్తోంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా మూడు సార్లు టైటిళ్లు గెలుచుకున్న ముంబై ఇండియన్స్ ఈ సారి చెత్త ఆటతో అందరిని నిరుత్సహపరుస్తోంది. ఇప్పటి వరకు 8 మ్యాచులు ఆడిన ముంబై ఇండియన్స్ 2 మ్యాచుల్లోనే విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివర్లో నిలిచింది. మరోవైపు కింగ్స్ లెవన్ పంజాబ్ ఏడు మ్యాచుల్లో 5 విజయాలతో మూడో స్థానంలో కొనసాగుతుంది. ప్లే ఆఫ్‌లో నిలువాలంటే ముంబై ఇండియున్స్‌కు ఈ మ్యాచ్లో తప్పని సరిగా గెలవాల్సిందే. లేదంటే టోర్నీ నుంచి అవుటైపోతుంది. దీంతో ఈ మ్యాచ్ ముంబై ఇండియున్స్‌కు అగ్ని పరిక్షగా మారింది. ప్రపంచ టాప్ క్లాస్ ఆటగాళ్లున్న ముంబై ఇండియన్స్ తన స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతుంది. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ సారి పెలవ ఆటతో వరుసగా ఫ్లాప్ అవుతున్నాడు. అతను ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాల్లో ఇప్పటివరకు కూడా సరిగ్గా నిర్ధరించకోలేక పోతున్నాడు. ప్రతి సారి వేరే వేరే స్థానల్లో బ్యాటింగ్‌కూ రావడంతోనే సరిగ్గా బ్యాటింగ్ చేయులేక పోతున్నాడని విశ్లేషకులు చెపుతున్నారు. రోహిత్ శర్మ 8 మ్యాచుల్లో 196 పరుగులు మాత్రమే చేశాడు. ప్రస్తుతం ముంబై ఇండియున్స్‌కు ఓపెనర్ల వైఫల్యం కూడా పెద్ద సమస్యగా మారింది. ఈ సీజన్‌లో ముంబై ఓపెనర్లు తొలి వికెట్‌కు చేసిన పరుగులు (7, 11, 102, 0, 1, 12, 69, 5) ఓపెనర్లు గొప్ప ఆరంభానిస్తేనే ఏ జట్టైన భారీ స్కోరు చేయగలుగుతుంది. ఈ ఓపెనర్ స్థానంలో రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తే బాగుంటుదని అందరు భావిస్తున్నారు. అతని అనుభవంతో బ్యాటింగ్‌లో భారీ పరుగులు చేయడంలో ఉపయోగపడుతుంది. ఓపెనర్ సూర్య కుమార్ (283) పరుగులతో పరవలేదనిపిస్తున్నాడు. నిలకడగా రాణిస్తున్నాడు. మరో ఓపెనర్ ఎవిన్ లెవిస్ మాత్రం విఫలమవుతున్నాడు. ఇతను ఆడిన ఏడు మ్యాచుల్లో 194 పరుగులు చేశాడు. ఆల్ రౌండర్లు కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యాలు కూడా నిరశపరుస్తున్నారు. ఒకటిరెండు మ్యాచుల్లో తప్ప మిగితా మ్యాచుల్లో ఘోరంగా విఫలమయ్యారు. ఇది కూడా ముంబై ఇండియన్స్‌కు కలవరపెడుతున్న విషయమే. ఇక బౌలింగ్‌లో యువ సంచలనం మయాంక్ మార్ఖండే (11 వికెట్లు) ఒక్కడే పర్వాలేదనిపిస్తున్నాడు. ఇతర బౌలర్లు ముస్తాఫీజుర్, మాక్‌లెంగన్ నిరశ పరుస్తున్నారు. సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వికెట్లు తీయలేక పోతున్న పొదుపుగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి బ్యాట్స్‌వెున్స్‌ను కట్టిడి చేస్తున్నాడు. 


కింగ్స్ ఎలవన్ పంజాబ్ నిలకడగా రాణిస్తు మూడో స్థానంలో ఉంది. పంజాబ్ 7 మ్యాచుల్లో 5 విజయాలు సాధించి ప్లే ఆఫ్‌కు చెరువైంది. క్రిస్ గేల్ విధ్వంసకరమైన బ్యాటింగ్‌తో ఆకట్టు కొంటున్నాడు. ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో బీకర ఫామ్‌లో ఉన్నాడు. మరోవైపు కేఎల్ రాహుల్ (268) పరుగులు కూడా దూకుడుగా ఆడుతున్నాడు. ఈ సీజన్లో ఐపీఎల్ ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు. బౌలర్లు కూడా నిలకడగా రాణిస్త్తూ టీమ్ విజయాల్లో తమ వంతు ప్రోత్సహం అందిస్తున్నారు. 

ఐపీఎల్‌లో నేడు 
ముంబై ఇండియన్స్  X  కింగ్స్ లెవన్ పంజాబ్ 
హోల్కర్ స్టేడియం, ఇండోర్, రాత్రి 8 గంటల నుంచి...   స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం...
 

 ముంబై ఇండియన్స్ ఆటగాళ్లకు ఫన్నీ పనిష్మెంట్

Updated By ManamThu, 05/03/2018 - 14:28

mumbai indians ట్రైనింగ్‌కు లేటుగా వెళ్లినందుకు, జిమ్‌కు సరిగా వెళ్లనందుకు, జీన్స్ వేసుకున్నందుకు ముగ్గురు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లకు యాజమాన్యం ఫన్నీ పనిష్మెంట్ ఇచ్చింది. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లందరి ఎమోజీలతో కూడిన ఓ షూట్‌ను వాళ్లు ధరించేలా చేసింది. యువ ఆటగాళ్లు ఇషాన్ కిశన్, అనుకుల్ రాయ్, రాహుల్ చాహర్ ఈ శిక్షను అనుభవించారు.

కాగా జిమ్‌కు సరిగా రానందుకు ఇషాన్‌కు, ఫిజియో దగ్గర ఒక సెషన్‌ను నిషేధించినందుకు అంకుల్‌కు, జీన్స్ వేసుకొచ్చినందుకు చాహర్‌కు ఈ పనిష్మెంట్ పడింది. అంతేకాదు ఈ ఎమోజీ షూట్‌లను వేసుకొని వారు ముంబై నుంచి బెంగళూరుకు ప్రయాణించారు. ఆ సమయంలో ఎయిర్‌పోర్టులో ఈ ముగ్గురు సిగ్గుపడుతూ.. ఇకపై ఎప్పుడూ తప్పు చేయమని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

 
Emoji Kit is back!

Look who travelled in Emoji kits this time around? It's Ishan Kishan, Rahul Chahar and Anukul Roy ? The #MIEmojis are available on ? http://bit.ly/EmojisWeb or the MI App ? http://bit.ly/MIAPPAndroid & http://bit.ly/MIAPPiOS #CricketMeriJaan #MumbaiIndians

Posted by Mumbai Indians on Monday, April 30, 2018

 సన్‌రైజర్స్ టాప్ గేర్

Updated By ManamMon, 04/30/2018 - 00:13
  • ఆరెంజ్ ఆర్మీని గెలిపించిన బౌలర్లు

  • రాజస్థాన్ రాయల్స్‌పై ఘన విజయం

sunrisers batsman
ఈ ఏడాది ఐపీఎల్‌లో బౌలర్లనే నమ్ముకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో చిరస్మరణీయ విజయం దక్కింది. సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్‌ను 11 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ చిత్తు చేసి హ్యాట్రిక్ విక్టరీ సాధించింది. ఇప్పటి వరకూ 8 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్కు ఇది ఆరో విజయం. సీజన్ ఆరంభంలో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి హ్యాట్రిక్  విజయాలు సాధించిన సన్‌రైజర్స్ ఆ తర్వాత రెండు మ్యాచ్‌లు ఓడిపోయింది. ఆ తర్వాత మళ్లీ వరుసగా మూడు విజయాలతో డబుల్ హ్యాట్రిక్ సాధించింది. ఈ గెలుపుతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో హైదరాబాద్ టాప్ ప్లేస్‌లో నిలిచింది.

జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ దూకుడు కొనసాగుతోంది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌ను సొంతగడ్డపై 11 పరుగుల తేడాతో ఓడించి వరుసగా మూడో విజయాన్ని సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 151 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 140 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో హైదరాబాద్‌పై రాజస్థాన్ రాయల్స్‌కు ఇది రెండో ఓటమి.

హైదరాబాద్ జట్టు నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ గెలుపు కోసం చివరి వరకూ పోరాడినా ఫలితం దక్కలేదు. రాజస్థాన్ ఆటగాళ్లలో కెప్టెన్ అజింక్యా రహనే (65: 53 బంతుల్లో 5 గీ4, 1గీ6) సంజు శాంసన్ (40: 30 బంతుల్లో 1గీ4, 1గీ6) రాణించారు. రహానే చివరి వరకూ పోరాడినా మిగతా ఆటగాళ్ల సహకారం లేక పోవటంతో రాజస్థాన్ చేతులారా ఓటమి పాలైంది.  ఈసీజన్‌లో అంతగా ఆకట్టుకోలేకపోతున్న బెన్‌స్టోక్స్ డకౌట్ అవగా, బట్లర్ (10), మహిపాల్ 11, గౌతమ్ (8) పరుగులు తీయటానికి ఇబ్బందులు పడ్డారు.  హైదరాబాద్ బౌలర్లలో  కౌల్ 2, సందీప్ శర్మ, బాసిల్ థంపి , రషీద్‌ఖాన్, యూసుఫ్ పఠాన్‌లు ఒక్కో వికెట్ పడగొట్టారు.

విలియమ్సన్ కెప్టెన్ ఇన్నింగ్స్
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ రాజస్థాన్ రాయల్స్‌కు 152 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కేన్ విలియమ్సన్ (63: 43 బంతుల్లో 7గీ4, 2గీ6), ఓపెనర్ అలెక్స్ హేల్స్ (45: 39 బంతుల్లో 4గీ4) మాత్రమే రాణించారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్ శిఖర్ ధావన్ (6: 4 బంతుల్లో 1గీ4) జట్టు స్కోరు 17 వద్ద కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన సారథి కేన్ విలియమ్సన్ (63) ఆచితూచి ఆడి అర్ధశతకం సాధించాడు. ఓపెనర్ హేల్స్  విలియమ్సన్‌కు  సహకారం అందిచాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అర్ధశతకం తర్వాత విలియమ్సన్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో 10 ఓవర్లకు సన్‌రైజర్స్ వికెట్ నష్టపోయి 70 పరుగులు చేసింది. ఉనద్కట్ వేసిన 12 ఓవర్‌లో విలియమ్సన్ మూడు ఫోర్లు, 1 సిక్స్‌తో ఏకంగా 21 పరుగులు చేసి చెలరేగిపోయాడు.   హేల్స్ సైతం వేగం పెంచాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని జట్టు స్కోరు 109 వద్ద గౌతమ్ విడదీశాడు. హేల్స్ (45) అవుటయ్యాక ఆ తర్వాత కొద్ది సేపటికే ఇష్ సోధి బౌలింగ్‌లో విలియమ్సన్ పెవిలియన్‌కు చేరడంతో స్కోరు వేగం తగ్గింది. చివర్లో రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో మనీశ్ పాండే (16), షకిబ్ (6), యూసఫ్ పఠాన్ (2), రషీద్ (1) వెంటవెంటనే ఔటయ్యారు. దీంతో సన్‌రైజర్స్ 151 పరుగులకు పరిమితమైంది. రాజస్థాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీశాడు.

స్కోరుబోర్డు 
సన్‌రైజర్స్: హేల్స్ (సి) శాంసన్ (బి) గౌతం 45, ధావన్ (బి) గౌతమ్ 6, విలియమ్సన్ (సి) బట్లర్ (బి) సోధి (63), పాండే (సి) రహానె (బి) ఉనద్కత్ 16, షకిబుల్ హసన్ (బి) అర్చర్ 6, యూసుఫ్ పఠాన్ (సి) కులకర్ణి (బి) ఆర్చర్ 2,  సాహా (నాటౌట్) 11, రషీద్ ఖాన్ (సి) స్టోక్స్ (బి) అర్చర్ 1, బసిల్ థంపి (నాటౌట్) 0,  ఎక్స్‌ట్రాలు: 1, మొత్తం: 20 ఓవర్లలో 151/7, వికెట్ల పతనం : 1-17, 2-109, 3-116, 4-113, 5-137,  6-143, 7-150. బౌలింగ్: గౌతమ్ 4-0-18-2, కులకర్ణి 2-0-20-0, ఆర్చర్ 4-0-26-3, ఉనద్కత్ 3-0-33-1, సోధి 3-0-25-1, స్టోక్స్ 3-0-20-0, లోమోరర్ 1-0-8-0.

రాజస్థాన్ రాయల్స్: 
రహానే (నాటౌట్) 65, త్రిపాఠి (బి) శర్మ 4, సంజు శాంసన్ (సి) హేల్స్ (బి) సిద్ధార్థ్‌కౌల్ 40, బెన్‌స్టోక్స్ (బి) యూసుఫ్ పఠాన్ 0, బట్లర్ (సి) ధవన్ (బి) రషీద్ ఖాన్ 10, లోవ్‌ురన్ (సి)సహా (బి) సిద్ధార్థ్ కౌల్ 11, గౌతమ్ (సి) ధావన్ (బి) థంపి 8, అర్చర్ (నాటౌట్)1, ఎక్స్‌ట్రాలు: 1, మొత్తం: 20 ఓవర్లలో 140/6, వికెట్ల పతనం : 1-13, 2-72, 3-73, 4-96, 5-128, 6-139. బౌలింగ్: సందీప్ శర్మ 4-0-15-1, షకిబుల్ హసన్ 4-0-30-0, థంపి 2-0-26-1, సిద్ధార్థ్ కౌల్ 4-0-23-2, రషీద్ ఖాన్ 4-0- 31-1, యూసుప్ పఠాన్ 2-0-14-1.‘సూపర్ కింగ్స్’తో ‘డెవిల్స్’ ఫైట్

Updated By ManamSun, 04/29/2018 - 23:46
  • నేడు చెన్నై, ఢిల్లీ మధ్య ఐపీఎల్ మ్యాచ్   

delhi daredevilsపుణె: కొత్త కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలో డిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు పుంజుకుంటోంది. అయితే ఐపీఎల్‌లో భాగంగా సోమవారం జరగనున్న మ్యాచ్‌లో టేబుల్ టాపర్ చెన్నై సూపర్ కింగ్స్‌తో (సీఎస్‌కే) ఢిల్లీ డేర్‌డెవిల్స్ (డీడీ) తలపడనుంది. ఢిల్లీ జట్టు పునరుజ్జీవం కోసం పోరాడనుండగా.. సీఎస్‌కే కూడా దాదాపు గెలుపు బాటను అందుకునేందుకు బరిలోకి దిగనుంది. ఎందుకంటే శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు ఎనిమిది వికెట్లతో ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. గౌతమ్ గంభీర్ నేతృత్వంలో ఇబ్బందులు పడ్డ ఢిల్లీ జట్టు గత మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. సొంత గడ్డపై కోల్‌కతా నైట్ రైడర్స్‌ను సునాయాసంగా ఓడించింది. రికీ పాంటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఢిల్లీ ఏడు మ్యాచ్‌లకు గాను రెండింటిలో గెలిచి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. ప్లే ఆఫ్‌కు చేరాలంటే వరుసగా విజయాలు సాధించాలి. మరోవైపు సీఎస్‌కే పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. కానీ శనివారం రాత్రి ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోవడంతో చెన్నై ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింది. అయితే సీఎస్‌కే తాత్కాలిక హోం గ్రౌండ్ మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ధోనీ సేనను ఓడించడం అంత సులువేమీ కాదు. అయినా ముంబై జట్టు ఓటమిని అంత సులువుగా అంగీకరించదు.

ఇతర విషయాలకొస్తే కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో కెప్టెన్ అయ్యర్ రెచ్చిపోయినట్టు ఈ మ్యాచ్‌లోనూ చెలరేగాలని ఢిల్లీ జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఆ మ్యాచ్‌లో అయ్యర్ 93 పరుగుల విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అయ్యర్ ఒక్కడే కాకుండా ఇతర బ్యాట్స్‌మెన్ ఓపెనర్ పృథ్వీ షా, రిషబ్ పంత్, ఆల్ రౌండర్లు గ్లెన్ మాక్స్‌వెల్, కొలిన్ మన్రో కూడా జట్టు విజయానికి తమ వంతు కృషి చేయాలి. ఆస్ట్రేలియాకు చెందిన మాక్స్‌వెల్ ఇన్నింగ్స్‌ను బాగానే ప్రారంభిస్తున్నాడు. కానీ దాన్ని భారీ స్కోరుగా మార్చలేకపోతున్నాడు. మరోవైపు ఫామ్‌లో లేని ఈ మ్యాచ్‌కు తుది జట్టులో ఆడిస్తుందా? లేక గత మ్యాచ్‌లో మాదిరిగా పక్కన కూర్చోపెడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. గత మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్లు బాగానే రాణించారు. కానీ స్టార్‌లతో కూడిన చెన్నై జట్టు ఓడించాలంటే మాత్రం ఢిల్లీ బౌలర్లు తమ శక్తికిమించి పోరాడాల్సి వుంటుంది. పంజాబ్‌పై సన్‌రైజర్స్ విజయం

Updated By ManamThu, 04/26/2018 - 23:51

imageహైదరాబాద్: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో పంజాబ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ అద్భుత విజయం సాధించింది. కష్ట సాధ్యం కాని లక్ష్యమే అయినా సన్‌రైజర్స్ బౌలర్లు సత్తా చాటడంతో పంజాబ్ 119 పరుగులకే ఆలైట్ అయింది. ఫలితంగా సన్‌రైజర్స్ 13 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
 
 మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. వీరి ఇన్నింగ్స్‌లో మనీష్ పాండే హాఫ్ సెంచరీ(54)తో మెరవగా, షకీబ్(28), యుసుఫ్(21) రాణించారు. పంజాబ్ బౌలర్లలో రాజ్‌పుత్ 14 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు సాధించి రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన రెండో భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. అతడికంటే ముందు ఇషాంత్ శర్మ 12 పరుగులకు ఐదు వికెట్లు తీశాడు.
 
అనంతరం కష్ట సాధ్యంకాని లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు రాహుల్, గేల్ శుభారంభం ఇచ్చారు. అయితే వీరిద్దరూ వేగంగా ఆడడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు. మొదట్లో ఆచితూచి ఆడినా క్రమంగా వేగాన్ని పెంచారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ పెవిలియన్‌కు చేరారు. 55 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయిన పంజాబ్.. 69 పరుగుల వ్యవధిలో మిగతా తొమ్మిది వికెట్లు కోల్పోయింది. పంజాబ్ బ్యాట్స్‌మన్లలో రాహుల్ 32, గేల్ 23 పరుగులతో రాణించగా మిగతా వారంతా విఫలమయ్యారు. సన్‌రైజర్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3, షకీబ్, థంపీ, సందీప్ శర్మ తలో రెండు వికెట్లు కోల్పోయారు.

Related News