facebook

జుకర్‌బర్గ్‌కు పదవీ గండం..!

Updated By ManamThu, 10/18/2018 - 11:02

Mark Zuckerbergఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌ పదవికి గండం వచ్చి పడింది. ఆ సోషల్ మీడియా దిగ్గజ చైర్మన్‌గా మార్క్ జుకర్‌బర్గ్‌ను తొలగించాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఫేస్‌బుక్ ఇంక్‌లో మెజారిటీ షేర్లు ఉన్న నాలుగు దిగ్గజ పబ్లిక్ ఫండ్స్ జుకర్‌బర్గ్‌ను చైర్మన్‌గా తొలగించాలనే ప్రతిపాదనను బుధవారం తెలిపాయి. కంపెనీలో అతిపెద్ద అసెట్ మేనేజర్లు కూడా ఈ ప్రతిపానకే ఓకే చేస్తారని వారు అభిప్రాయపడుతున్నారు.

అయితే 2017లో కూడా ఈ ప్రతిపాదన తెరమీదికి రాగా.. తాజాగా తీసుకొచ్చిన ప్రతిపాదన కీలకమైనదని రోడ్ ఐలండ్ స్టేట్ ట్రెజర్స్ వెల్లడించింది. డేటా హ్యాక్, కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాండల్ వంటి సమస్యల నుంచి ఫేస్‌బుక్‌ను బయటికి తీసుకురావడానికి ఇదే మార్గమని పేర్కొంది. అయితే ఈ విషయంపై స్పందించడానికి ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి నిరాకరించారు.రాజాసింగ్ ఫేస్‌బుక్ హ్యాక్, ఫిర్యాదు

Updated By ManamMon, 10/08/2018 - 13:30
BJP MLA Raja singh, facebook

హైదరాబాద్ : గోషామహల్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఫేస్‌బుక్ హ్యాక్ అయింది. దీంతో ఆయన సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా తన ఫేస్‌బుక్ ఖాతా నుంచి సుమారు 5,00,000 ఫేస్ బుక్ ఖాతాదారులకు అసభ్యకరమైన సందేశాలు వెళ్లినట్లు ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఫేస్‌బుక్‌కు హ్యాకర్ల దెబ్బ

Updated By ManamSun, 09/30/2018 - 04:20
 • వారి వ్యక్తిగత సమాచారం తస్కరణ?

 • భారత్‌లోని ఖాతాదారులైనా ప్రభావం

 • ‘వ్యూ యాజ్’ ఫీచర్‌తో సమాచార సేకరణ

 • ఖాతాదారుడి ప్రొఫైల్ చూసే అవకాశం

 • ఖాతానే హ్యాకర్ల చేతుల్లోకి తీసుకునే ప్రమాదం

 • స్వయంగా వెల్లడించిన సీఈవో జుకర్‌బర్గ్

facebookవాషింగ్టన్: సామాజిక మాధ్యమాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఫేస్‌బుక్ సంస్థ పిడుగులాంటి వార్త వెల్లడించింది.  భద్రతా లోపం వల్ల సుమారు 5 కోట్ల మంది యూజర్ల ఖాతాలు హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందని ఫేస్‌బుక్ చెప్పింది. ఫేస్‌బుక్‌లోని ఒక ఫీచర్‌లో ఉన్న ఈ సాంకేతిక లోపంతో హ్యాకర్లు యూజర్ అకౌంట్లను హ్యాక్ చేయవచ్చని కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది. ఈ ఫీచర్‌ను ‘వ్యూ యాజ్’ అంటారు. దీని ద్వారా మిగతా వారికి తన ప్రొఫైల్ ఎలా కనిపిస్తుందో యూజర్ చూడగలడు. ఈ భద్రతా ఉల్లంఘనను సరిదిద్దేందుకే అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్ వెల్లడించారు. ఈ హ్యాకర్ల ప్రభావం భారత్‌లోని అత్యధిక ఫేస్‌బుక్ ఖాతాదారులపైనా ఉండనుందని చెప్పారు. సమాచార తస్కరణ చేయకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు ప్రారంభించామన్నారు. అయితే ఈ హ్యాకింగ్‌కు ఎవరు పాల్పడ్డారో, ఏ దేశం నుంచి చేశారో ఇంకా తెలియలేదని వాషింగ్టన్‌లో మీడియాతో ఆయ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌కు 2 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారని, భారత్‌లో 2.7 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారని చెప్పారు. వీరిలో అత్యధిక ఖాతాదారులపై హ్యాకర్ల ప్రభావం ఉండనుందని తెలిపారు. ‘‘దాదాపు 5 కోట్ల మంది యూజర్ల ఖాతాలు హ్యాకింగ్‌కు గురయినట్లుగా మా ఇంజనీర్ల బృందం గుర్తించిందన్నారు. ‘‘మేం ఇప్పుడే మా పరిశీలన ప్రారంభించాం. అకౌంట్లు దుర్వినియోగం చేశారా? సమాచారం దొంగిలించారా? అనేది ఇంకా తెలుసుకోవాలి. ఈ సైబర్ దాడి వెనక ఎవరున్నారో? అది ఎక్కడి నుంచి జరిగింది అనేది ఇంకా తెలియలేదు’’ అని ఆయన చెప్పారు.

వ్యూ యాజ్ అంటే..
ఫేస్‌బుక్ ‘వ్యూ యాజ్’ అనేది ఒక ప్రైవసీ ఫీచర్. దీని ద్వారా యూజర్ మిగతా వారికి తన ప్రొఫైల్ ఎలా కనిపిస్తుందో, తన ఫేస్‌బుక్ ఫ్రెండ్స్, వారి స్నేహితులకు బయట ఏయే వివరాలు కనిపిస్తున్నాయో చెక్ చేసుకోవచ్చు. దాడిచేసిన వారికి ఈ ఫీచర్‌లో చాలా లోపాలు దొరికినట్లుగా భావిస్తున్నారు. వాటి ద్వారా వాళ్లు ఫేస్‌బుక్ యాక్సెస్ టోకెన్ దొంగిలించవచ్చు. దానితో వాళ్లు ఇతరుల అకౌంట్‌ను తమ చేతుల్లోకి తీసుకోవచ్చు. యూజర్ల డేటాను రక్షించగలమని అమెరికా, ఇతర దేశాలను ఫేస్‌బుక్ ఒప్పిస్తున్న సమయంలో ఈ భద్రతా లోపం బయటపడటం గమనార్హం.ఎంపీ కాళ్లు కడిగి, ఆ నీళ్లు తాగాడు...

Updated By ManamMon, 09/17/2018 - 12:36
BJP worker washes party MP Godda Nishikant Dubey feet in Jharkhand

గొడ్డా:  భారతీయ జనతా పార్టీ ఎంపీపై ఆయన అనుచరుడి అభిమానం హద్దులు దాటింది. దాంతో ఆ పార్టీ కార్యకర్త తన స్వామిభక్తిని చాటుకునేందుకు సదరు ఎంపీగారి కాళ్లు కడగటమే కాకుండా, ఆ నీళ్లను పవిత్ర గంగాజలంగా సేవించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వీడియోను ఎంపీ తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడం పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీసింది. అయితే ఎంపీగారు మాత్రం తన కాళ్లు కడగడాన్ని సమర్థించుకోవడం విశేషం.

వివరాల్లోకి వెళితే..జార్ఖండ్‌కు చెందిన గొడ్డా బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే ఆదివారం పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా  పవన్‌ సింగ్‌ అనే కార్యకర్త వేలాదిమంది సాక్షిగా...ఎంపీ కాళ్లు కడిగి, అనంతరం ఆ నీళ్లను తాగేశాడు. ఈ తతంగాన్ని అంతా ఓ కార్యకర్త వీడియో తీయడం, దాన్ని ఎంపీ తన వ్యక్తిగత ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడం జరిగింది. 

అయితే ఆ పాదపూజపై పలువురు సమర్థించినా, పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఈ చర్యను ఎందుకు రాజకీయ రంగు పులుముతారంటూ, అతిథుల కాళ్లు కడగటం మన సంప్రదాయమని, పురాణాల్లో కూడా ఉందంటూ ఎంపీ నిషికాంత్ దూబే చెప్పుకొచ్చారు. చవకబారు ఆలోచనలు చేయడం సరికాదని, ​కాళ్లు కడిగిన నీటిని తాగడంలోనూ ఏమాత్రం తప్పులేదని ఎంపీ వ్యాఖ్యానించారు. పార్టీ టికెట్ కావాలా  బాబూ...?

Updated By ManamMon, 09/03/2018 - 14:46
 • పార్టీ టికెట్ కావాలంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాల్సిందే..

 • ఫేస్‌బుక్‌లో 15,000 లైకులు, ట్విట్టర్‌లో 5000 మంది ఫాలోవర్లు తప్పనిసరి

 • తాజా నిబంధనతో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ టికెట్ ఆశావాహులకు షాక్..

 • ‘సైబర్ వారియర్స్’ వర్సెస్ ‘రాజీవ్ కే సిపాయి’

Congress Tickets to go to Leaders Most Active on Social Media in madhya pradesh assembly ticket

భోపాల్ : ప్రస్తుత కాలంలో బిజినెస్‌లోనే కాదూ... పొలిటిక్స్‌లోనూ సోషల్ మీడియా పాత్ర కీలకంగా మారింది. తమ ప్రొడక్ట్‌ను సోషల్ మీడియాలో ఎలా మార్కెటింగ్ చేసుకుంటున్నారో... గత కొంతకాలంగా... రాజకీయ పార్టీలు కూడా తమకు అందుబాటులో ఉన్నంతవరకూ టెక్నాలజీని వాడుకుంటున్నాయి.

దీంతో ఉద్యోగం పొందేందుకు అర్హత ఎలా ఉండాలో రాబోయే ఎన్నికల్లో  పార్టీ టికెట్ ఆశించవారికి తప్పనిసరిగా సోషల్ మీడియాలో కొన్ని  అర్హతలు ఉండాల్సిందేనట... అది కూడా ఫేస్‌బుక్‌లో లైక్స్, ట్విట్టర్‌లో ఫాలోవర్స్, వాట్సాప్‌లో పెద్ద ఎత్తున గ్రూప్స్ ఉంటేనే సుమా.... పార్టీ టికెట్ కన్‌ఫర్మ్ అయ్యేంది. ఈ మేరకు ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ  (ఎంపీసీసీ) పెట్టిన కొత్త రూల్... ఆశావాహులకు ఊహించని ఝలక్‌గా చెప్పుకోవచ్చు.

అంతేకాదు...సోషల్‌ మీడియాలో భారీగా ఫాలోవర్లు ఉన్నవారికే టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం... పార్టీ నేతలకు స్పష్టం చేసింది. ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అభ్యర్థులకు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో తప్పనిసరిగా అకౌంట్స్ ఉండాల్సిందేనని పేర్కొంది. అలా అని సోషల్ మీడియాలో అకౌంట్ ఉంటే సరిపోదూ... అందుకు తగ్గట్టుగా లైక్స్, ఫాలోవర్స్‌ కూడా ఉండి తీరాల్సిందేనని రూల్స్ పెట్టింది. దీంతో  అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్న ఆశావాహులకు తాజా కండిషన్‌ ఊహించని షాక్ అనే చెప్పవచ్చు. 

ఫేస్‌బుక్‌లో కనీసం 15,000 లైకులు, ట్విట్టర్‌లో 5000 మంది ఫాలోవర్లు, పెద్ద సంఖ్యలో వాట్సాప్‌ గ్రూపుల్లో ఉండాలని నిబంధనలు విధించింది.  అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారంతా ఈనెల 15లోగా వారి సోషల్‌ మీడియా ఖాతాల వివరాలను పార్టీకి సమర్పించాలని సూచించింది. పనిలో పనిగా మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ పోస్టులను రీట్వీట్‌ చేయాలని, లైక్‌ కొట్టాలని, పార్టీ అధికారిక పేజీల్లో పోస్టులను తమ పేజీల్లో షేర్‌ చేయాలని పేర్కొంది.

‘సైబర్ వారియర్స్’ వర్సెస్ ‘రాజీవ్ కే సిపాయి’
మరోవైపు రానున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నెటిజన్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్‌, బీజేపీ శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు అధికార బీజేపీ, ప్రతిపక్షం కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని ఇప్పటి నుంచే హోరెత్తిస్తున్నాయి.

బీజేపీ ‘సైబర్ వారియర్స్’ అంటూ దూసుకువెళుతుంటే... అందుకు దీటుగా ‘రాజీవ్ కే సిపాయి’ అంటూ కాంగ్రెస్ పోటీ పడుతోంది. డిజిటల్‌ ప్రచారం కోసం  రెండు పార్టీలు ...ప్రత్యేకంగా ఇందుకోసం పెద్ద ఎత్తున సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నాయి. ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ యువ ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నాయి.ఫేస్‌బుక్ నుంచి ఆ యాప్ ఔట్

Updated By ManamThu, 08/23/2018 - 13:09

Facebookలీకుల ఆరోపణలు వచ్చినప్పటి నుంచి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ తాజాగా తమ ఫ్లాట్‌ఫాం నుంచి మరో థర్డ్ పార్టీ యాప్‌ను నిషేధించింది. మై పర్సనాలిటీ పేరుతో ఉన్న ఈ యాప్‌ వలన దాదాపు 40లక్షల మంది యూజర్ల పర్సనల్ డేటా తప్పుదారి పట్టే ప్రమాదం ఉందని తెలిపిన ఫేస్‌బుక్, దానిని తొలగిస్తున్నట్లు గురువారం వెల్లడించింది. 2012 నుంచి ఈ యాప్ ఫేస్‌బుక్‌లో ఉన్నట్లు ఆ సంస్థలోని ఓ అధికారి తెలిపారు.

మై పర్సనాలిటీ యాప్ వలన యూజర్ల సమాచారాన్ని ఇతర కంపెనీలతో పంచుకున్నట్లు విచారణలో తేలింది. దీనికి సంబంధించిన ఆయా యూజర్లకు సమాచారాన్ని తెలియజేశాం. ఈ యూజర్ల ఫ్రెండ్స్ సమాచారాన్ని కూడా దుర్వినియోగం చేశారా లేదా అన్న విషయంపై ఇంకా తెలియరాలేదు. వారిది కూడా దుర్వినియోగం అయిందని తెలిస్తే వెంటనే సమాచారం ఇస్తాం అంటూ ఫేస్‌బుక్‌ వెల్లడించింది. అయితే కేంబ్రిడ్జ్ అనలిటికా స్కా తరువాత అనుమానాస్పదంగా ఉన్న సుమారు 400 యాప్స్‌ను ఫేస్‌బుక్ తొలగించిన విషయం తెలిసిందే.ఫేస్‌బుక్ పోస్ట్ గొడ‌వ‌.. కాల్పులు

Updated By ManamSat, 08/11/2018 - 15:08
Facebook Comment Fight Ends With Florida Man

వాషింగ్టన్ : ఫేస్‌బుక్‌లోని పోస్ట్ చేసిన ప‌ర‌స్ప‌ర విరుద్ధ‌మైన అభిప్రాయాలు ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌కు.. ఆపై కాల్పుల‌కు దారి తీసింది. అమెరికాలోని టాంపాలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. బ్రియాన్ సెబ్రింగ్ అనే వ్య‌క్తి అధికారి డెమోక్ర‌టిక్ పార్టీ కార్య‌క‌ర్త‌. స్థానిక ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన ఓ చ‌ట్టానికి సంబంధించి కొన్ని పోస్టుల‌ను ఫేస్‌బుక్‌లో పెట్టాడు. వాటిపై అలెక్స్ స్టీఫెన్సు అనే వ్య‌క్తి స్పందించాడు. ఇద్ద‌రూ ఒక‌రిపై ఒక‌రు కామెంట్లు చేసుకున్నారు. వివాదం ముదిరింది.

చివ‌రికి స్టీఫెన్సు చేత‌నైతే త‌న‌తో పోట్లాడాలంటూ స‌వాల్ విసిరి, త‌న అడ్ర‌స్ ఇచ్చాడు. దీంతో బ్రియాన్ త‌న వాహ‌నంలో అత‌డికి ఇంటికి వెళ్లి, గ‌ట్టిగా హార‌న్ మోగించాడు. క‌త్తి చేత‌బ‌ట్టుకుని బ‌య‌ట‌కు వ‌చ్చిన స్టీఫెన్సుపై కాళ్ల‌పై త‌న తుపాకీతో కాల్చి, వెంట‌నే అక్క‌డి నుంచి వెనుదిరిగాడు.

స‌మాచారం అందుకున్న పోలీసులు బ్రియాన్‌ను అదుపులోకి తీసుకుని వివిధ సెక్ష‌న్ల కింద కేసులు పెట్టారు. దాదాపు 6,500 డాల‌ర్ల పూచీక‌త్తుతో అత‌డిని విడుద‌ల చేశారు. ఏదో తొంద‌ర‌పాటుతో అక్క‌డికి వెళ్లానే కానీ, అలెక్సును చంపాల‌ని మాత్రం కాద‌ని అత‌డు మొత్తుకుంటున్నాడు. ఇదంతా ఫేస్‌బుక్ వ‌ల్లే జ‌రిగింద‌ని అంటున్నాడు.ఫేస్‌బుక్‌కు రూ.9 ల‌క్ష‌ల కోట్ల న‌ష్టం

Updated By ManamThu, 07/26/2018 - 12:31
 • కేంబ్రిడ్జ్ అన‌లిటికా వివాదం త‌ర్వాత సీత క‌ష్టాలు

facebook

న్యూయార్క్‌: సోషల్ మీడియా రారాజు ఫేస్‌బుక్ ప‌త‌నం మొదలైందా? ఇటీవ‌ల బ‌య‌ట‌ప‌డిన డేటా దుర్వినియోగ‌మే ఎఫ్‌బీ కొంప‌ముంచ‌నుందా? బుధవారం ఫెస్‌బుక్ కంపెనీ షేర్ల‌లో 20 శాతం ప‌త‌న‌మే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. ఇటీవ‌ల కేంబ్రిడ్జ్ అన‌లిటికా సంస్థ.. ఫేస్‌బుక్ డేటాను దుర్వినియోగం చేయ‌డంతో అస‌లుస‌మ‌స్య మొద‌లైంది.  

ఇది నిజ‌మేనంటూ ఎఫ్‌బీ సీఈఓ మార్క్ జుక‌ర్ బ‌ర్గ్ ఒప్పుకోవ‌డం.. ఆ త‌ర్వాత కూడా కంపెనీ సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసుకున్న వ్య‌వ‌స్థ కూడా అంత స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయ‌క‌పోవ‌డం, విచార‌ణ సంస్థ‌ల ద‌ర్యాప్తు ప్ర‌భావంతోనే ఈ సంస్థ షేర్ల‌లో 20 శాతం ప‌త‌నం క‌నిపించింది. న‌ష్ట‌పోయిన షేర్ల విలువ 130 బిలియ‌న్ డాల‌ర్లు (దాదాపు రూ.8.9ల‌క్ష‌ల కోట్లు) ఆవిరైపోయింది.

ఇంత భారీగా ఎఫ్‌బీ షేర్లు పడిపోవడంతో జుకర్‌బర్గ్ వ్య‌క్తిగ‌తంగా 16.8బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.1.15ల‌క్ష‌ల కోట్లు)  న‌ష్ట‌పోయారు. గురువారం ట్రేడింగ్‌లో కూడా సంస్థ షేర్లు నష్టాలతో ముగిస్తే జుకర్‌బర్గ్‌ బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌లో మూడో స్థానం నుంచి ఆరో స్థానానికి పడిపోతారు. అయితే వినియోగ‌దారుల భ‌ద్ర‌త‌పై ప్ర‌త్యేకంగా దృష్టిపెట్టామ‌ని.. లాంగ్‌ర‌న్‌లో ఎలాంటి న‌ష్టం రాకుండా వ్యూహాలు అమ‌లుచేస్తున్నామ‌ని జుక‌ర్‌బ‌ర్గ్ ధీమా వ్య‌క్తం చేశారు. భ‌ద్ర‌త విష‌యంలో ఎలాంటి రాజీ ఉండ‌బోద‌న్నారు. ఈ న‌ష్టాలు తాత్కాలిక‌మేన‌న్నారు. అసత్య వార్తలపై సమరం

Updated By ManamMon, 07/23/2018 - 13:16

బ్రిటన్‌లో స్టార్టప్‌ను ఆరంభించిన ఎన్‌ఆర్‌ఐ జైన్

lyric jainలండన్: అసత్య.. నకిలీ వార్తలు! సామాజిక మాధ్యమాల్లో విర్రవీగుతున్న ఈ వార్తలు మన దేశంలో ఎంతటి బీభత్సాన్ని సృష్టిస్తున్నాయో తెలిసిందే. ఇలాంటి వార్తలకు చెక్ పెట్టేందుకు బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్త లిరిక్ జైన్ కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా ఓ స్టార్టప్ సంస్థను నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కర్ణాటకలోని మైసూరుకు చెందిన లిరిక్ జైన్.. కేంబ్రిడ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తిచేశారు.

ఫేస్‌బుక్, వాట్సప్ తదితర సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడిగా అసత్య వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. భారత్‌లో వీటి ప్రభావం మరీ దారుణంగా ఉంది. చిన్నపిల్లలను ఎత్తుకెళ్తున్నారనే వార్తలు ప్రచారం కావడంతో.. తమ ప్రాంతంలో ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే చాలు వారి వివరాలకు తెలుసుకోకుండా సామూహిక దాడులకు పాల్పడుతున్నారు. కొట్టి చంపేస్తున్నారు. 

ఇలాంటి ఘటనలు ప్రపంచవ్యాప్తంగా  అనేక దేశాల్లోనూ కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో ఓ సాంకేతిక పరిజ్ఞానాన్ని జైన్ రూపొందించారు. ప్రస్తుతం ఈ పరిజ్ఞానంపై పరీక్షలు జరుగుతున్నాయి. విజయ వంతమైతే బ్రిటన్, అమెరికాలో సెప్టెంబరు నుంచి ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. మన దేశంలో మాత్రం అక్టోబర్‌లో అందుబాటులోకి రావొచ్చు. ఎఫ్‌బీలో ఫేక్ న్యూస్‌కు ఫుల్‌స్టాప్..

Updated By ManamThu, 07/19/2018 - 19:49

Facebook will prioritize removing fake news that incites violence

 • రెచ్చగొట్టే వార్తలపై నిషేధం

 • 24 గంటల్లోనే మారిన నిర్ణయం

 • విమర్శలకు జడిసిన జుకెర్‌బర్గ్

న్యూయార్క్: ఫేస్‌బుక్‌లో అబద్ధపు వార్తలను, యూజర్లను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని తొలగించనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. సంస్థ ఫ్లాట్‌ఫాంపై వీటికి చోటులేకుండా చూస్తామని పేర్కొంది. తప్పుడు వార్తలు, వదంతుల ప్రచారంతో ప్రజలు భయాందోళనకు లోనై, మూకుమ్మడిగా దాడులకు పాల్పడుతున్న ఘటనల సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. దేశవ్యాప్తం గా పలుచోట్ల జరిగిన ఈ దాడులలో పలువురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సోషల్ మీడియానే కారణమని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఈ క్రమంలో ప్రముఖ సామాజిక మాధ్యమాలలో వదంతుల ప్రచారాన్ని కట్టడి చేయాలన్న డిమాండ్‌లు పెరిగాయి. భారత ప్రభుత్వం కూడా ఫేస్‌బుక్ గ్రూపునకు చెందిన వాట్సప్‌నకు గతంలోనే ఓ లేఖ రాసింది. 

అయితే.. సోషల్‌మీడియాలో పెట్టే పోస్టులు ఆయా వ్యక్తుల అభిప్రాయాలని.. దాడుల పేరుతో వాటిని తొలగించడం తీవ్రమైన చర్యే అవుతుందని ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఫేక్‌న్యూస్ అనే సందేహం వచ్చినపుడు సదరు వార్తల తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. అంతేకానీ మొత్తంగా పోస్ట్‌ను తొలగించడమంటే ఖాతాదారుల అభిప్రాయాలను అగౌరవ పరచడమేనని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

జుకర్‌బర్గ్ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే మొదలైన ట్రోలింగ్ తాజాగా మరో ప్రకటన విడుదల చేసే వరకూ ఆగలేదు. సర్వత్రా వెల్లివెత్తుతున్న విమర్శల నేపథ్యంలో ఫేస్‌బుక్ తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఎఫ్‌బీలో తప్పుడు, హింసను ప్రేరేపించే వార్తల ప్రచారంపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. కల్లోలాన్ని ప్రోత్సహించే వార్తలపై నిషేధంతో పాటు ఇంటర్నెట్‌లోని వివిధ ఫొటోలను మార్ప్ చేసి పోస్ట్ చేయడాన్నీ అడ్డుకోనున్నట్లు వివరించింది. మరోవైపు తన అనుబంధ సంస్థ వాట్సప్‌లో వదంతులు, పుకార్ల వ్యాప్తిని అడ్డుకోవడానికి మెరుగైన చర్యలు తీసుకుంటున్న విషయాన్నీ ఆయన గుర్తుచేశారు.

Related News