teja

స్పెషల్ సాంగ్‌లో ‘ఆర్‌ఎక్స్ 100’ భామ

Updated By ManamSun, 09/16/2018 - 15:31

Payal Rajput‘ఆర్ఎక్స్‌100’తో టాలీవుడ్‌లో క్రేజీ ఇమేజ్ సంపాదించుకున్న పాయల్ రాజ్‌పుత్‌కు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. అయితే సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ బ్యూటీ తాజాగా ఓ స్పెషల్ సాంగ్‌లో నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ తెరకెక్కిస్తున్న చిత్రంలో పాయల్ స్పెషల్ సాంగ్‌లో మెరవనున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, మన్నోరా చోప్రా హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే.నాలుగేళ్ల తరువాత టాలీవుడ్‌కు క్రేజీ విలన్

Updated By ManamMon, 09/10/2018 - 11:31

Sonu Soodఒకప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ విలన్‌గా పేరు తెచ్చుకున్న సోనూసూద్.. నాలుగేళ్ల తరువాత టాలీవుడ్‌లోకి రాబోతున్నాడు. ‘అరుంధతి’, ‘జులాయి’, ‘ఆగడు’, ‘సూపర్’, ‘అతడు’ వంటి చిత్రాల్లో నటించి అందరినీ మెప్పించిన సోనూసూద్.. ఈ మధ్య తమిళ్, హిందీ చిత్రాలలో బిజీగా ఉన్నాడు. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ తెరకెక్కిస్తున్న చిత్రం ద్వారా ఈ విలన్ మళ్లీ తెలుగులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో సోనూసూద్ రాజకీయ నాయకుడిగా కనపడనున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో బెల్లంకొండ సరసన కాజల్ నటిస్తుండగా.. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనున్న విషయం తెలిసిందే. కాగా 2014లో సోనూసూద్ తెలుగులో ఆగడులో సోనూసూద్ చివరిగా నటించాడు.(ఆ తరువాత 2016లో అభినేత్రితో వచ్చినప్పటికీ.. అది స్ట్రైట్ తెలుగు సినిమా కాదు.)నెగ‌టివ్ షేడ్‌లో కాజ‌ల్‌?

Updated By ManamTue, 07/10/2018 - 13:16

Kajal `ల‌క్ష్మీక‌ల్యాణం, నేనే రాజు నేనే మంత్రి` చిత్రాల త‌ర్వాత కాజ‌ల్ అగ‌ర్వాల్ తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌లో అనీల్ సుంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా న‌టిస్తున్నాడు. కాజ‌ల్ కోసం తేజ స‌రికొత్త పాత్ర‌ను డిజైన్ చేశాడ‌ట‌. నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో కాజ‌ల్ క‌న‌ప‌డుతుంద‌ట‌. ఈ చిత్రంలో సోనూసూద్ కూడా విల‌న్‌గా న‌టిస్తున్నాడు.  అలాగే బెల్లంకొండ శ్రీనివాస్‌, సోనూసూద్ అన్న‌ద‌మ్ములుగా క‌నిపిస్తార‌ట‌. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా స్టార్ట‌య్యింది. ఎన్టీఆర్ బ‌యోపిక్ య‌న్‌.టి.ఆర్‌.. వెంకీ చిత్రాల నుండి తేజ డ్రాప్ అయిన త‌ర్వాత చేస్తున్న చిత్ర‌మిది. 
 బెల్లంకొండ శ్రీను- కాజల్- తేజ చిత్రం ప్రారంభం

Updated By ManamMon, 07/09/2018 - 12:47
bellamkonda

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ తెరకెక్కించనున్న చిత్రం ప్రారంభమైంది. కాజల్ ఇందులో హీరోయిన్‌గా కనిపించనుంది. హైదరాబాద్‌లో ఈ మూవీ ప్రారంభ వేడుక జరగగా.. దర్శకులు వినాయక్, శ్రీవాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వినాయక్ క్లాప్ కొట్టగా, శ్రీవాస్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. తేజ మొదటి సీన్‌కు దర్శకత్వం వహించారు. ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుండగా.. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు.ఉదయ్ కిరణ్ బయోపిక్‌పై తేజ స్పందన

Updated By ManamFri, 05/18/2018 - 10:30

teja, uday సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ బాక్సాఫీస్ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరో ఉదయకిరణ్ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇక ఈ చిత్రానికి ఉదయ్‌ కిరణ్ సినిమాలకు పరిచయం చేసిన తేజ దర్శకత్వం వహించనున్నట్లు, అందుకోసం ‘కాబోయే అల్లుడు’ అనే టైటిల్‌ను కూడా అనుకుంటున్నట్లు గాసిప్‌లు వినిపించాయి. ఇవన్నీ తేజ వరకు వెళ్లడంతో వాటిపై తాజాగా స్పందించారు ఆయన.

తాను ఎలాంటి బయోపిక్‌లు తెరకెక్కించడం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి వదంతులను ఎవరు సృష్టిస్తున్నారో తెలీదని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా బాలకృష్ణ ప్రధానపాత్రలో ఎన్టీఆర్ బయోపిక్‌కు మొదట తేజ దర్శకుడిగా పనిచేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్‌ నుంచి ఆయన తప్పుకున్నారు. దీంతో ఆ బయోపిక్ వాయిదా పడ్డ విషయం తెలిసిందే.


 ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ రానుందా?

Updated By ManamWed, 05/16/2018 - 20:43

udayతెలుగునాట బ‌యోపిక్‌ల ట్రెండ్‌కు శ్రీ‌కారం చుట్టిన చిత్రం ‘మహానటి’. ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో..  అదే బాట‌లో మ‌రిన్ని బ‌యోపిక్ చిత్రాలు తెర‌పైకి రావ‌డానికి ముస్తాబవుతున్నాయి. వాటిలో.. ఒక‌ప్పటి యువ సంచలనం ఉదయ్ కిరణ్ బయోపిక్ కూడా ఉంద‌ని తెలుస్తోంది. కాస్త‌ వివరాల్లోకి వెళితే..  ‘చిత్రం’, నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’.. ఇలా కెరీర్ ఆరంభంలోనే హ్యాట్రిక్ విజయాలను చవి చూసి.. తెలుగు సినీ పరిశ్రమలో క‌థానాయ‌కుడిగా సంచలనాన్ని సృష్టించారు యంగ్ హీరో ఉదయ్ కిరణ్. అంతేగాకుండా..  ఫిల్మ్‌ఫేర్‌ను (‘నువ్వు నేను’ చిత్రానికి గాను) అందుకున్న అతి పిన్న వయస్కుడిగా (21 సంవత్సరాలు) కమల్ హాసన్ తర్వాత ఆ జాబితాలో చేరారు ఉదయ్ కిరణ్.  అలా వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న ఈ హీరో కెరీర్, లైఫ్‌..  ఒక్కసారిగా ఒడిదుడుకులకు లోనయింది. అవి ఎంతవరకు తీసుకుని వెళ్ళాయంటే.. ఆఖరికి ఈ యువ కథానాయకుడు బతుకు భారం మోయలేక తనువు చాలించే స్థాయికి దిగజార్చేసాయి.

మహానటి సావిత్రి జీవితానికి కాస్త అటు ఇటుగా ఉదయ్ కిరణ్ జీవితం కూడా ఉండడంతో.. ఇప్పుడు ఈ యంగ్ హీరో జీవితాన్ని కూడా బయోపిక్‌గా తీయడానికి దర్శకుడు తేజ ప్లాన్ చేస్తున్నారు. ఉదయ్ కిరణ్‌తో మంచి అనుబంధం ఉండడం.. అంతేగాక వీరిద్దరి కెరీర్ కూడా ‘చిత్రం’ సినిమాతోనే ప్రారంభం కావడంతో.. ఉదయ్ కిరణ్ బయోపిక్‌ను తేజ తెరకెక్కించడానికి నిశ్చయించుకున్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమాని తేజ ఎప్పుడు సెట్స్ పైకి తీసుకుని వెళ్తారో చూడాలి. అన్న‌ట్టు.. ఇటీవ‌లే 'య‌న్‌.టి.ఆర్‌' బ‌యోపిక్ నుంచి తేజ బ‌య‌ట‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.రానా, తేజ కాంబోలో మ‌రో చిత్రం?

Updated By ManamSun, 05/06/2018 - 16:31

rana'నేనే రాజు నేనే మంత్రి' చిత్రంతో మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చారు ద‌ర్శ‌కుడు తేజ‌. 'య‌న్‌.టి.ఆర్' బ‌యోపిక్‌, వెంక‌టేశ్‌తో ఓ సినిమా చేయాల్సి ఉన్నా.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ రెండు ప్రాజెక్టుల నుండి తేజ బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఈ నేప‌థ్యంలో.. తేజ త‌దుప‌రి చిత్రంపై ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. అదేమిటంటే.. త‌న గ‌త చిత్రంలో క‌థానాయ‌కుడిగా న‌టించిన రానాతోనే ఓ భారీ బ‌డ్జెట్ మూవీ చేసేందుకు తేజ ప్లాన్ చేసుకుంటున్నార‌ని తెలిసింది. 1971 ఇండో పాక్ వార్ నేప‌థ్యంలో సాగే ఈ సినిమా దాదాపు రూ.50 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కునుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నుంది. ఇంత‌కుముందు  రానా.. 1971 ఇండో పాక్ వార్ నేప‌థ్యంలో 'ఘాజీ' సినిమా చేసిన సంగ‌తి తెలిసిందే. జ‌లాంత‌ర్గామి యుద్ధం నేప‌థ్యంలో 'ఘాజీ' ఉంటే.. తేజ చేయ‌బోతున్న సినిమా మ‌రో కోణంలో సాగ‌నుంది. ‘యన్.టి.ఆర్’ చిత్రానికి దర్శకుడెవరు?

Updated By ManamSat, 04/28/2018 - 19:38

ntrనందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా ఆయన తనయుడు బాలకృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘యన్.టి.ఆర్’. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా నుంచి దర్శకుడు తేజ తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో.. ఈ సినిమాకి దర్శకుడు ఎవరన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.  కె.రాఘవేంద్రరావు, పూరి జగన్నాథ్, క్రిష్, కృష్ణవంశీ.. ఇలా కొంత‌మంది దర్శకుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకి దర్శకుడు ఖరారు కాలేదు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించి మరో వార్త ప్రచారంలో ఉంది. అదేమిటంటే.. ఈ చిత్రంలో నటిస్తూ నిర్మిస్తున్న నందమూరి బాలకృష్ణే దర్శకత్వ బాధ్యతలు కూడా చేపడతారని.. తన తండ్రి జీవిత కథను తానే రూపొందిస్తే బాగుంటుందన్నది ఆయ‌న‌ ఆలోచన అని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై క్లారిటీ వ‌స్తుంది.ప్రారంభమైన ఎన్టీఆర్ బయోపిక్

Updated By ManamThu, 03/29/2018 - 09:34

NTRమాజీ ముఖ్యమంత్రి, మహా నటుడు సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభమైంది. నాచారంలోని రామక‌ృష్ణ స్టూడియోలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరుకాగా.. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ కనిపిస్తుండగా.. ప్రారంభం సందర్భంగా అతడిపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. సాయి కొర్రపాటితో కలిసి బాలకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.'యన్.టి.ఆర్’.. ప్రారంభోత్స‌వానికి స‌ర్వం సిధ్ధం

Updated By ManamTue, 03/27/2018 - 15:54

ntrఎన్టీఆర్.. ఈ పేరే సంచలనం. సినీ పరిశ్రమైనా, రాజకీయరంగమైనా ఈ పేరు సృష్టించిన ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. మరి అటువంటి మహామనిషి జీవిత కథని వెండితెరపై ఆవిష్కరిస్తే.. అన్న ఆలోచనలోంచి పుట్టిందే ‘యన్.టి.ఆర్’ చిత్రం. ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ నటిస్తుండగా.. సంచలన దర్శకుడు తేజ దర్శకత్వం వహిస్తున్నారు. బాల‌కృష్ణ‌, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతసారథ్యం వహిస్తున్నారు. ఈ బ‌యోపిక్‌కు సంబంధించి ఎన్టీఆర్ వర్ధంతి రోజున‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఆపై నటీనటుల ఎంపిక ప్రక్రియ కొన‌సాగింది. త్వరలోనే దీనిపై అధికారికంగా ఓ ప్రకటనను కూడా విడుద‌ల చేయ‌నున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ నెల 29న హైదరాబాద్ – రామకృష్ణ స్టూడియోస్‌లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించనున్నారు. ఒక్క రోజు షెడ్యూల్ అనంతరం కొంత విరామం ఇచ్చి.. ఆగష్టు నుంచి నిరవధికంగా చిత్రీకరణను చేపట్టనున్నారు. ఎన్టీఆర్ సినీ పరిశ్రమలో నటుడిగా ప్రవేశించి.. అగ్రస్థానానికి చేరుకున్న వైనంతో పాటు.. రాజకీయరంగ ప్రవేశం మొదలుకొని.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినంతవరకు ఈ చిత్రంలో చూపించనున్నారు. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. కాగా, ఈ రోజు (మంగ‌ళ‌వారం) ఈ సినిమాకి సంబంధించిన ఓ పోస్ట‌ర్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది.

Related News