oscar awards

ఆ కేటగిరిని వాయిదా వేసిన ఆస్కార్

Updated By ManamFri, 09/07/2018 - 14:43

Oscar అంతర్జాతీయ అకాడమీ అవార్డ్స్‌ ఆస్కార్‌లో ఇటీవల చేర్చిన ఔట్‌స్టాండింగ్ ఎచీవ్‌మెంట్ ఇన్ పాపులర్ ఫిలిం కేటగిరిని వాయిదా వేశారు. ఎలాంటి విమర్శలు లేకుండా బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన చిత్రానికి గానూ ఈ అవార్డును ఇవ్వాలని అనుకున్నారు. రానున్న ఆస్కార్ అవార్డ్స్ కార్యక్రమంలో ఈ కేటగిరీని పెట్టాలనుకున్నారు. అయితే దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. దీంతో ఈ కేటగిరిని వాయిదా వేస్తున్నట్లు ఆస్కార్ ఫిలిం అకాడమీ అధ్యక్షుడు జాన్ బైలీ వెల్లడించారు.

ఈ మధ్య కాలంలో మంచి కాన్సెప్ట్‌లతో వస్తున్న సినిమాలకు గుర్తింపు ఇవ్వడానికే ఈ కేటగిరీని పెట్టామని, చాలామందికి ఆ కేటగిరీకి ఉన్న విలువ అర్థం చేసుకోలేకపోయారని జాన్ ఈ సందర్భంగా తెలిపారు.హ్యాపీ బ‌ర్త్‌డే టు డ‌బుల్ ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్‌

Updated By ManamSat, 01/06/2018 - 14:20

ar“పనిలో విజయాన్ని కాదు శ్రేష్టతని వెతుకు, విజయం తనంతట తానే నీకు దాసోహం అవుతుంది”. ఈ మాట నూటికి నూరుపాళ్ళు డబుల్ ఆస్కార్ అవార్డ్ గ్రహీత రెహ‌మాన్‌ జీవితానికి అన్వయించవచ్చు. తన టాలెంట్‌తో అహర్నిశలు శ్రమిస్తూ విజయాన్ని కాకుండా.. తన పనిని ఎంతో నిబద్ధతతో శ్రేష్టత కోసం శ్రమిస్తున్న నిరంతర శ్రామికుడు. కన్నవారికి, పుట్టిన దేశానికి వన్నె తెస్తున్న సంగీతసామ్రాట్. భారతదేశ కీర్తిని, తన ప్రతిభని ప్రపంచానికి చాటిచెప్పిన స్వరమాంత్రికుడు. మొదటి చిత్రంతోనే ఫిలిం ఫేర్‌ని  సొంతం చేసుకున్న స్వరధుని, సంగీతఝరి “ఎ.ఆర్.రెహ‌మాన్‌ ”. ఈ రోజు (శ‌నివారం) ఈ పద్మభూషణుడి పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా.. తను స్వరపరచిన ‘రోజా’ సినిమాలో “చిన్ని చిన్ని ఆశ” పాటలో ప్రతీ పదం, వాక్యం తన కెరీర్‌కి సరిగ్గా అన్వయించుకున్న రెహ‌మాన్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ, కొన్ని మధుర జ్ఞాపకాలలోకి వెళితే..

a.r.rehamanపుట్టడం దిలీప్ శేఖర్‌గా పుట్టి.. ప్రపంచాన్ని తన సంగీతంతో ఓలలాడిస్తున్న డబుల్ ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎ.ఆర్.రెహ‌మాన్‌ . జనవరి 6, 1967న‌ ఆర్.కె.శేఖర్, కస్తూరి (తర్వాత కరీమా బేగంగా పేరు మార్చుకున్నారు) దంపతులకు మద్రాసు నగరంలో జన్మించారు. తండ్రి ఆర్.కె.శేఖర్ ఫిలిం-స్కోర్ కంపోజర్ అవడంతో సంగీతంపై ఆసక్తితో.. తండ్రితో బాటు తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించారు రెహ‌మాన్‌. తొమ్మిది సంవత్సరాల వయసులో తండ్రిని కోల్పోయిన తర్వాత.. తల్లి నీడలో కీబోర్డు ప్లేయర్‌గా ఎదిగి...తన చిన్ననాటి స్నేహితులు ప్రముఖ పెర్క్యూసన్ వాద్యకారుడు శివమణి, జాన్ ఆంటోనీ, సురేష్ పీటర్స్, జోజో, రాజాలతో కలిసి “నెమెసిస్ అవెన్యూ’ అనే రాక్ గ్రూప్‌ని కూడా ఏర్పాటు చేశారు. ధనరాజ్ మాస్టర్ దగ్గర సంగీతంలో శిక్షణ తీసుకున్న రెహ‌మాన్‌ ..తన తండ్రి స్నేహితుడు, మలయాళంలో మ్యూజిక్ కంపోజర్ అయిన ఎం.కె.అర్జునన్ వద్ద ఆర్కెస్ట్రా గ్రూప్లో చేరారు. ఆ తర్వాత ఎం.ఎస్.విశ్వనాథన్, ఇళయరాజా, రమేష్ నాయుడు, రాజ్-కోటి వంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పనిచేసారు.

a.r.rehaman1992లో మణిరత్నం రూపొందించిన దృశ్యకావ్యం ‘రోజా’తో కోలీవుడ్‌లో అడుగుపెట్టారు రెహ‌మాన్‌. ఆ సినిమా జాతీయ స్థాయిలో పేరు తెచ్చిపెట్టింది. అంతేకాకుండా.. మొదటి సినిమాతోనే ఫిలింఫేర్‌ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘బొంబాయి’ సినిమాకుగాను స్వరపరచిన “కన్నానులే” పాట అప్పట్లో ప్రపంచంలోని వెయ్యి ఉత్త‌మ పాట‌ల‌లో ఒకటిగా నిలిచిందంటే.. ఈ స్వరజ్ఞాని స్థాయిని అర్ధం చేసుకోవచ్చు. అంతేగాక దక్షిణ భారత సినిమాలకు సంబంధించి 7.1 సౌండ్ సిస్టం టెక్నాలజీని పరిచయం చేసింది కూడా రెహ‌మాన్‌ కావడం విశేషం. అలాగే ఎన్నో అవార్డుల‌ను తన ఖాతాలో వేసుకున్న రెహ‌మాన్‌.. ప్రపంచవ్యాప్తంగా సినిమా వాళ్లు పొందాలనుకుని ఆరాటపడే ఆస్కార్‌ని సైతం తన సొంతం చేసుకున్నారు. 2009లో ‘స్ల‌మ్‌డాగ్‌ మిలీనియర్’కిగాను “ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు”తో పాటు “బెస్ట్ ఒరిజినల్ స్కోర్” రూపంలో రెండు ఆస్కార్లను కైవసం చేసుకున్నారు ఈ స్వరకర్త. 2010లో భారతదేశం “పద్మభూషణ్”తో ఈ స్వ‌ర‌జ్ఞానిని గౌరవించింది. తాజాగా ఇండో-బ్రిటిష్ చారిత్రాత్మక ఫిలిం ''వైస్రాయ్`స్ హౌస్''కు గాను  ప్రతిష్టాత్మకమైన “ది పబ్లిక్ ఛాయిస్ అవార్డు” కూడా ఈ సంగీత చక్రవర్తికి దాసోహం అయింది. 

arఇక శంకర్ సినిమాలకి ఆస్థాన సంగీత దర్శకుడిగా మారిన రెహ‌మాన్‌.. తాజాగా రజనీకాంత్, శంకర్ కలయికలో తెర‌కెక్కిన‌ ‘2.O’కి సంగీతం అందించారు. అలాగే రొమాంటిక్ మ్యూజికల్ ఫిలిం ‘99 సాంగ్స్’కి.. రాజీవ్ మీనన్ దర్శకత్వంలో మొదటిసారిగా బ్యాక్ గ్రౌండ్ స్కోరుని బట్టి తెరకెక్కిస్తున్న ‘సర్వం తాళమయం’ సినిమాకి.. 25 సంవత్సరాల తర్వాత చేస్తున్న మ‌ల‌యాళ చిత్రం ‘ఆడుజీవితం’(3డి సినిమా)కి.. మురుగదాస్, విజయ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న విజయ్ 62వ చిత్రానికి కూడా సంగీతాన్ని అందిస్తున్నారు రెహ‌మాన్‌. తన ప్రతిభతో దేశకీర్తిని మ‌రింత‌ ఇనుమడింపచేసి.. ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ రెహ‌మాన్‌కి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తోంది 'మ‌నం'. 

Related News