ysrcp

వైసీపీలో చేరిన రామచంద్రయ్య

Updated By ManamTue, 11/13/2018 - 12:52
Ramachandraiah

విజయనగరం: బద్ధశత్రువైన టీడీపీతో జతకట్టినందుకు అలకబూనిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సి. రామచంద్రయ్య ఆ పార్టీని వీడిన వీడి, వైఎస్సార్‌సీపీ పార్టీలో చేరారు. విజయనగరం జిల్లాలో ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన రామచంద్రయ్య, ఆ పార్టీ తీర్థం తీసుకున్నారు. ఈ సందర్భంగా రామచంద్రయ్యను ఆలింగనం చేసుకొని, కండువాను కప్పి సాధరంగా తన పార్టీలోకి ఆహ్వానించారు జగన్ మోహన్ రెడ్డి. రామచంద్రయ్య రాకతో వైఎస్సార్ జిల్లాలో పార్టీ మరింత బలపడుతుందని వైఎస్సార్‌సీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.వైఎస్సార్ సీపీలోకి కొండా సిద్ధార్థ

Updated By ManamMon, 11/12/2018 - 14:39
  • చంద్రబాబు సొంతజిల్లాలో టీడీపీకి షాక్

konda siddhartha joins ysr congress party

విజయనగరం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీలో కీలక నేతలు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. సుమారు 40 ఏళ్లుగా టీడీపీలోఉన్న కొండా కుటుంబం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది.   మాజీ ఎంపీ మిథున్ రెడ్డి, తంబాలపల్లి సమన్వయ కర్త ద్వారాకనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పీటీఎం మండలం (పెద్దతిప్ప సముద్రం) ఎంపీపీ కొండా గీతమ్మ, కొండా సిద్ధార్థ అనుచరులు పార్టీలో చేరారు.

చిత్తూరు జిల్లా ప్రజలే కాదు...
ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ..‘చంద్రబాబు పాలనను చిత్తూరు జిల్లా ప్రజలే కాదు... విలువలున్న టీడీపీ కుటుంబాలు నమ్మడం లేదు. కొండా కుటుంబం టీడీపీ ని వీడిందంటే..చంద్రబాబు ఎంత ఘోరంగా వ్యవహరిస్తున్నారా అర్థమవుతుంది. జగన్‌పై హత్యాయత్నం జరిగినా చాలా హుందాగా వ్యవహరించారు. చంద్రబాబులా పబ్లిసిటీ కోసం పాకులాడకుండా.... ప్రజలు సంయమనం పాటించేలా ప్రవర్తించారు. పాదయాత్రలో టీడీపీ మోసాలు ప్రజలకు తెలిసి వస్తున్నాయి. అందుకే వైఎస్సార్ సీపీలో కీలక నేతలు అంతా చేరుతున్నారు.’ అని అన్నారు.

అందుకే రాజీనామా చేశాం..
కొండా సిద్ధార్థ మాట్లాడుతూ... టీడీపీలో ఎన్టీఆర్ స్థాపించిన విలువలేవి లేవు. 40 ఏళ్లుగా టీడీపీలో ఉన్న మేము అందుకే రాజీనామా చేసాం. జగన్ పోరాటం, పాదయాత్రను చూసి అండగా నిలవాలని నిర్ణయించాం. టీడీపీలో నిజమయిన నాయకులకు, కార్యకర్తలకు విలువలేదు అని వ్యాఖ్యానించారు. ద్వారకనాథరెడ్డి నాయకత్వాన్ని తామంతా బలపరచి, వైఎస్‌ జగన్‌‌ని ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా కృషి చేస్తామని తెలిపారు.

konda siddhartha joins ysr congress party

బీసీ నేతలు చేరిక..
మరోవైపు పాప‌య్య‌వ‌ల‌స వ‌ద్ద వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో  మార్గాని నాగేశ్వ‌ర‌రావు, మార్గాని భ‌ర‌త్‌.  రాజ‌మండ్రికి చెందిన బీసీ సంఘం నేతలు, జేఏసీ నేత‌లు, శెట్టిబ‌లిజ‌, గౌడ‌, ఈడిగ నేత‌లు పార్టీలో చేరారు.విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జగన్

Updated By ManamSun, 11/11/2018 - 19:34

Ys Jagan mohan reddy, Vizag airport, YSRCP, Jagan Padayatraవిశాఖ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం సాయంత్రం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు వద్ద జగన్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జగన్ విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి ప్రజాసంకల్పయాత్రను పునఃప్రారంభించనున్నారు.

ఈ సందర్భంగా రోడ్డుమార్గంలో విజయనగరం జిల్లా మక్కువకు జగన్ బయల్దేరారు. గత నెల 25న వైఎస్‌ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకోవడంతో పాదయాత్రకు విరామం ప్రకటించారు. వైఎస్ జగన్‌ వెంట వైఎస్సార్‌ సీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మిథున్‌ రెడ్డి తదితరులు ఉన్నారు. జగన్‌ను ప్రజలే కాపాడుకుంటున్నారు: వైఎస్ విజయమ్మ

Updated By ManamSun, 11/11/2018 - 10:47

YS Vijayammaహైదరాబాద్: రాష్ట్ర ప్రజల్ని వైఎస్ తన కుటుంబ సభ్యుల్లా చూశారని, కత్తి దాడి నుంచి జగన్ కోలుకోవడం ఆయనకు పునర్జన్మ అని వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. రాష్ట్ర సమస్యలపై జగన్ రాజీలేని పోరాటం చేస్తున్నారని, జగన్‌ను ప్రజలే కాపాడుకుంటున్నారని తెలిపారు. తమపై నిరాధార ఆరోపణలను మౌనంగా భరిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. కేసులు, విచారణల పేరుతో జగన్‌ను చాలా ఇబ్బంది పెట్టారని.. ఎన్ని సమస్యలున్నా, కష్టాలున్నా తన కుమారుడు చలించలేదని విజయమ్మ వెల్లడించారు. జైల్లో ఉన్న 16 నెలలు తప్ప మిగిలిన అన్ని రోజులు జగన్, జనం మధ్యనే ఉన్నారని ఆమె అన్నారు.

ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ లేకపోతే ఇంకెక్కడ భద్రత ఉంటుందని, జగన్‌పై దాడి కేసులో తూతూ మంత్రంగా విచారణ జరుగుతోందని విమర్శించారు. చిన్న గాయం, విచారణ అక్కర్లేదని ఎలా చెబుతున్నారని ఆమె ప్రశ్నించారు. పరిటాల హత్య జరిగినప్పుడు వైఎస్ సీబీఐ విచారణకు ఆదేశించారని విజయమ్మ గుర్తు చేశారు. ప్రతిపక్షనేతకే భద్రత కల్పించలేని ప్రభుత్వం ఎందుకని, జనం లేని చోట జగన్‌పై దాడి చేయాలని భావిస్తున్నారని ఆమె విమర్శించారు. తమ కుటుంబసభ్యుల్లో మహిళలను కూడా తిడుతున్నారని ఆమె అన్నారు. దాడి చేసింది అభిమానే అయినా.. విచారణ జరిపించాల్సిన బాధ్యత లేదా అంటూ ఆమె మండిపడ్డారు. జగన్‌పై దాడి కేసులో నిస్పక్షపాతంగా విచారణ జరగాలని ఆమె అన్నారు.రేపు మీడియా ముందుకు వైఎస్ విజయమ్మ

Updated By ManamSat, 11/10/2018 - 15:31
YS vijayamma Press Meet tomorrow

హైదరాబాద్ : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన కత్తి దాడి ఘటనపై ఆయన కుటుంబసభ్యులు తొలిసారి మీడియా ముందుకు రానున్నారు. విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్‌పై శ్రీనివాస్ అనే యువకుడు కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో జగన్ భుజానికి గాయం అవ్వగా, తొమ్మిది కుట్లు పడ్డాయి. వైద్యుల సూచన మేరకు అప్పటి నుంచి  ప్రజా సంకల్ప యాత్రకు కూడా విరామం ఇచ్చి ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు.  

కత్తి దాడి జరిగిన తర్వాత వైఎస్ జగన్ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతేకాకుండా ఆయన కూడా మీడియా ముందుకు రాలేదు. అయితే కత్తి దాడి ఘటన అనంతరం తొలిసారి వైఎస్ జగన్ తల్లి విజయమ్మ మీడియా ముందుకు రానున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఆమె మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో విజయమ్మ ఏం మాట్లాడతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా తే జగన్ ఆరోగ్యం కుదుటపడిన నేపథ్యంలో ఈ నెల 13 నుంచి తిరిగి పాదయాత్రను ప్రారంభించనున్నారు. రేపు సాయంత్రం ఆయన విజయనగరం వెళతారు. సోమవారం ఉదయం నుంచి పాదయాత్రలో పాల్గొంటారు. 
 వైఎస్సార్ సీపీలోకి మాజీమంత్రి సీఆర్!

Updated By ManamSat, 11/10/2018 - 11:55
  • 13న బొబ్బిలిలో జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలోకి సి.రామచంద్రయ్య

C.Ramachandraiah to join YSR congress party

హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీమంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈనెల 13వ తేదీన ఆయన వైఎస్సార్ సీపీ కండువా కప్పుకోనున్నారు. ఎల్లుండి నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పున: ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా బొబ్బిలిలో వైఎస్ జగన్ సమక్షంలో సి.రామచంద్రయ్య వైఎస్సార్ సీపీలో చేరనున్నారు.

కడప జిల్లాలో జరిగిన ఓ వేడుకకు హాజరైన సీఆర్ ... తన మనసులోని మాటను సన్నిహితుల వద్ద వెల్లడించినట్లు సమాచారం. అయితే రామచంద్రయ్య చేరికపై ఆయన కానీ, వైఎస్సార్ సీపీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ-కాంగ్రెస్ పొత్తు కారణంగానే తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు సి.రామచంద్రయ్య పేర్కొన్న విషయం విదితమే.పెడన వైసీపీలో వర్గపోరు.. తీవ్ర ఉద్రిక్తత

Updated By ManamFri, 11/09/2018 - 20:06
  • జోగిరమేశ్ కారు అద్దాలు ధ్వంసం

  • ఉప్పాల రాంప్రసాద్, జోగి రమేశ్ వర్గీయుల మధ్య ఘర్షణ

  • తోపులాట.. ఉప్పాల వర్గ కార్యకర్తలకు గాయాలు 

Ysrcp, Uppala ramprasad, Jogi ramesh, two division workers, fight themselves, Pedanaకృష్ణా: కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో వైసీపీలో వర్గపోరు రచ్చకెక్కింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే జోగి రమేశ్, ఉప్పాల రాంప్రసాద్ వర్గాల మధ్య ఘర్షణకు దిగాయి. పెడన బస్టాండ్ వద్ద బాలసౌరీ ర్యాలీలో ఇరువర్గాలు బాహాబాహికి దిగడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పెడన బస్టాండ్‌ సమీపంలో ఇరువర్గాల ర్యాలీలు ఎదురవడంతో రెండు వర్గాల కార్యకర్తల మధ్య మాటామాటా పెరిగి తోపులాట చోటుచేసుకుంది.

ఈ క్రమంలో జోగి రమేశ్‌కు చెందిన కారు అద్దం ధ్వంసమయ్యాయి. ఉప్పాల వర్గానికి చెందిన ఇద్దరు కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసుల జోక్యంతో ఇరువర్గాల మధ్య వివాదం సద్దుమణిగింది. మచిలీపట్నంలో పార్లమెంటరీ నియోజకవర్గ వైసీపీ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా పెడనలో జోగి రమేశ్‌, ఉప్పాల రాంప్రసాద్‌ వర్గాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు వేర్వేరుగా ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. జగన్ కోలుకోవాలని.,

Updated By ManamWed, 11/07/2018 - 10:13

Balarajuఅమరావతి: ఇటీవల విశాఖపట్నం విమానాశ్రయం శ్రీనివాసరావు అనే వ్యక్తి చేతిలో దాడికి గురైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోలుకోవాలని కోరుతూ ఓ మాజీ ఎమ్మెల్యే మోకాళ్లపై గుడి మెట్లు ఎక్కారు.  పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ రాష్ట్ర ఎస్టీ విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గుబ్బల మంగమ్మతల్లి ఆలయానికి వెళ్లి జగన్ కోలుకోవాలని మొక్కుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా జగన్‌కు ఏమీ కాదని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, కోట్లాది తెలుగు ప్రజలు జగన్‌కు తోడుగా ఉన్నారని తెలిపారు.జగన్‌తో కూడా బాబు చేతులు కలుపుతారు

Updated By ManamSat, 11/03/2018 - 10:29

Pawan Kalyanఅమరావతి: కాంగ్రెస్-టీడీపీ పొత్తు కేవలం ట్రైలర్ మాత్రమేనని.. ఆ సినిమా ఆడే అవకాశం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. చంద్రబాబు రాజకీయ ప్రయాణం ఎక్కడ మొదలైందో, చివరకు అక్కడకే చేరుకుందని పవన్ చెప్పారు. 2014లో కూడా చంద్రబాబును పూర్తిగా నమ్మలేదని.. కానీ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయనకు మద్దతు ఇచ్చానని పవన్ అన్నారు.

తాను అడ్డంకిగా అనిపిస్తే.. జగన్‌తో కూడా చేతులు కలపడానికి చంద్రబాబు సిద్ధపడతారని పవన్ ఎద్దేవా చేశారు. జనసేన ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని, ప్రజలతోనే పొత్తు పెట్టుకుంటుందని ఈ సందర్భంగా పవన్ తెలిపారు. జగన్‌లా లక్షల కోట్లు తన వద్ద లేవని, అలాగే చంద్రబాబులా హెరిటేజ్ ఫ్యాక్టరీలు లేవని పవన్ అన్నారు.'తల్లి, చెల్లి దాడి చేయించారనడం తప్పు'

Updated By ManamFri, 11/02/2018 - 20:33

Pawan Kalyan, Vizag airport, YSRCP, Ys Jagan mohan Reddy, Ys Vijayamma, Sharmila విజయవాడ: విశాఖ విమానాశ్రయంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరోసారి స్పందించారు. జగన్‌పై దాడి జరగడం చాలా దురదృష్టకరమన్నారు. శుక్రవారం జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రైలులో ‘సేనానితో రైలు ప్రయాణం’లో భాగంగా విజయవాడ నుంచి తునికి వెళ్తున్న సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడారు. జగన్‌పై దాడి ఘటనపై టీడీపీ నేతలు వెకిలిగా మాట్లాడటం సరికాదన్నారు. జగన్‌పై దాడి ఘటనను లోతుగా విశ్లేషించాలని కోరారు. తల్లి, చెల్లి దాడి చేయించారని కొందరు నేతలు వ్యాఖ్యానించడం తప్పు అన్నారు.

ఎక్కడైనా తల్లే కొడుకుపై దాడి చేయిస్తుందా? అని పవన్ ప్రశ్నించారు. విజయమ్మ, షర్మిల తనను దూషించినా.. తాను ఏమీ అనలేదని ఈ సందర్భంగా పవన్ గుర్తుచేశారు. దాడి కావాలని చేశాడా? ఎవరైనా చేయించారా?.. కుట్రా అనేది విచారణలో పోలీసులు తేల్చాలన్నారు. రాజకీయ జోక్యం లేకుండా విచారణ జరిపి దాడి ఘటనలో వాస్తవాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఉందని, తన పర్యటనలో కూడా పోలీసులు రక్షణ కల్పించకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డానన్నారు. 

Related News