ysrcp

జగన్‌కు మోహన్ బాబు పరామర్శ

Updated By ManamFri, 11/02/2018 - 16:48
Mohan babu meets Ys jagan mohan reddy

హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సినీ నటుడు మోహన్ బాబు పరామర్శించారు. మోహన్ బాబు...శుక్రవారం వైఎస్ జగన్ నివాసానికి వెళ్లారు. పరామర్శ అనంతరం ఆయన మాట్లాడుతూ...‘వైఎస్ జగన్ వందేళ్లు చల్లగా ఉంటారు. ఆయన ఆరోగ్యంగా బాగానే ఉంది. జగన్ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని’ అని తెలిపారు. అయితే ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు మోహన్ బాబు సమాధానం ఇస్తూ..  రాజకీయాల గురించి ఇది మాట్లాడే సమయం కాదన్నారు.నా కుమారుడికి వైసీపీతో సంబంధాలు లేవు

Updated By ManamFri, 11/02/2018 - 09:34

Parentsఅమరావతి: తమ కుమారుడికి వైస్సార్‌సీపీ పార్టీతో సంబంధాలు లేవని, తమకు కూడా ఆ పార్టీ నేతలతో పరిచయాలు లేవని శ్రీనివాసరావు తల్లిదండ్రులు సావిత్రమ్మ, తాతారావు స్పష్టం చేశారు. గురువారం వారిని విడివిడిగా, శ్రీనివాసరావుతో కలిపి విచారించిన సిట్ అధికారులు, పలు కోణాల్లో ప్రశ్నించారు. శ్రీనివాసరావు ఊరిలో సరిగా ఉండేవాడు కాదని అతడి తల్లిదండ్రులు తమ విచారణలో చెప్పినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి.

శ్రీనివాసరావు ఏ రాజకీయ పార్టీలో తిరిగేవాడు..? ఎలా ఉండేవాడు..? వంటి ప్రశ్నలను వారి చేత సిట్ అధికారులు సమాధానాలు తెలుసుకున్నారు. మమ్ముడివరంలోని ఠానేలంక నుంచి బుధవారం రాత్రి వారిని విశాఖకు తీసుకువచ్చిన అధికారులు గురువారం మొత్తం విచారించారు. కాగా శ్రీనివాసరావుకు విధించిన రిమాండ్ ఇవాళ్టితో ముగియనుంది. దీంతో శ్రీనివాసరావు కస్టడీని పొడిగించాలని కోర్టును సిట్ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.జగన్‌పై హత్యాయత్నం కేసు: మరో ఇద్దరు అరెస్ట్

Updated By ManamWed, 10/31/2018 - 09:00

YS Jaganఅమరావతి: ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో సిట్ విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలో కేసుకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఈ కేసులో సంబంధం ఉందన్న అనుమానంతో ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకొని విశాఖకు తరలించారు.

ఎయిర్‌పోర్టుకు సమీపంలో శ్రీనివాసరావు ఫ్లాట్‌లోని మరో గదిలో ఉన్న అమ్మాయిలు వీరేనా అన్న కోణాల్లో ఈ ఇద్దరినీ ప్రశ్నించనున్నారు. వీరిలో ఒకరు శ్రీనివాసరావు తన స్నేహితులకు పార్టీ ఇచ్చిన సమయంలో వచ్చిన యువతిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మధ్యప్రదేశ్‌లోని శ్రీనివాస్ స్నేహితుడిని కూడా విశాఖకు రప్పించి, ప్రశ్నిస్తున్నారు. కాగా మంగళవారం అస్వస్థతకు గురైన నిందితుడు శ్రీనివాస్ ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు అంటున్నారు.ప్రతిపక్ష నేతను వాడు వీడు అంటారా?

Updated By ManamTue, 10/30/2018 - 15:29
  • సీఎం స్థాయి వ్యక్తి వెకిలిగా మాట్లాడటం సరికాదు...

  • చంద్రబాబు, టీడీపీ నేతలపై వైఎస్సార్య సీపీ మండిపాటు

Malladi vishnu-vellampalli srinivas

విజయవాడ : ప్రతిపక్షనేతపై దాడి జరిగితే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి వెకిలిగా మాట్లాడటం సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు. పార్టీ సీనియర్ నేత మల్లాది విష్ణు మంగళవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘ జగన్‌పై దాడి జరిగిన రోజు రాష్ట్రంలోనే ఓ చీకటి రోజు. ఈ దాడి చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యంగా పరిగణించకుండా చంద్రబాబు వెకిలిగా మాట్లాడారు. మీ హయాంలో కాదా మాధవరెడ్డి, వంగవీటి రంగా, పింగళి దశరథరామ్ హత్యలు జరిగింది. మల్లెల బాబ్జీ హత్య కూడా అప్పుడే జరిగింది. 

జగన్‌పై హత్యాయత్నం జరిగితే మీరు సంఘటన జరిగిన తీరుపై మాట్లాడిన తీరు... ప్రవర్తించిన తీరు చూస్తే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి పదవిలో ఉండే అర్హత లేదనిపిస్తోంది. టీడీపీ నేతలు భౌ భౌ అని ఎందుకు అరుస్తున్నారో అర్థం కావడం లేదు. గంటలోనే నిందితుడు పెట్టాడంటూ సంక్రాంతి పోస్టర్‌ను తయారు చేసి మీడియాకు ఇచ్చారంటూ ప్రజలకు అంత అర్థం అవుతోంది. మీరు హడావుడిగా ఢిల్లీ వెళ్లి ఎందుకు ప్రెస్‌మీట్ పెట్టారో చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి. మాకు అన్నింటిపై నమ్మకం ఉంది. కానీ చంద్రబాబు, టీడీపీ, డీజీపీపై నమ్మకం లేదు. మీరు సంఘటనను తప్పుదోవ పట్టించి, ఎన్ని కుటిల యత్నాలు చేశారో ప్రజలకు అర్థం అయ్యాయి. 

నటుడు శివాజీ చెప్పిన గరుడ పురాణంపై చర్యలు తీసుకోకుండా జాప్యం ఏంటి. ప్రజల అభిమానాలను అత్యధికంగా చూరగొన్న నేత వైఎస్ జగన్ అని మీడియా సంస్థలు చెప్పడాన్ని చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. ప్రతిపక్ష నేతను వాడు వీడు అని మాట్లాడటమేనా 40 ఏళ్ల అనుభవం. మీ ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాయి. మా బిడ్డకు ఇలా జరిగిందే అని బాధపడ్డ ప్రజలకు, రాజకీయ పార్టీలకు ధన్యవాధాలు చెప్పుకుంటున్నాం. ఇదే సమయంలో టీడీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడటానికి సిద్ధంగా ఉన్నారు’ అని అన్నారు.

జగన్‌కు అండగా ఐదుకోట్లమంది
వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అయిదు కోట్లమంది తెలుగు ప్రజలు అండగా నిలబడ్డందుకు వైఎస్సార్ సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ...‘విశాఖ విమానాశ్రయం నుంచి జగన్ విమానంలో వెళ్లి డైరెక్ట్‌గా హైదరాబాద్ ఆస్పత్రికి వెళితే... ఆయన ఇంటికి వెళ్లారని చంద్రబాబు ...ముఖ్యమంత్రి స్థాయిలో నవ్వుతూ వెకిలిగా మాట్లాడారు. చిన్నకత్తే కదా అదేమవుతుంది అని కొంతమంది. ఎంపీ కేశినేని నాని కైమా కైమా చేస్తాం అని, సోదిరెడ్డిగారు భారీస్థాయిలో చేస్తాం అని అంటారు. మీ వ్యాఖ్యలను ప్రజలు చూస్తున్నారు అనే విషయం గుర్తుంచుకోండి’ అని హెచ్చరించారు.ఆ ఉద్దేశం కేంద్రానికి లేదు: జీవీఎల్

Updated By ManamMon, 10/29/2018 - 14:07

Central govt, President rule, GVL, GVL Narasimha Rao, AP CM, Chandrababu Naidu, TDP, YSRCP, Ys Jagan mohan Reddyఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన పెట్టే ఉద్దేశం కేంద్రానికి లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అబద్దాలు చెప్పే ప్రయత్నం చేశారని ఆయన విమర్శించారు. సోమవారం జీవీఎల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టే ఉద్దేశం కేంద్రానికి లేదన్నారు. ఎలాగో ఆరు నెలల్లో ప్రజలే టీడీపీని ఇంటికి పంపుతారని ఎద్దేవా చేశారు.

కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని వైసీపీ కోరుతుంటే టీడీపీ మాత్రం వద్దనడం దారుణమన్నారు. తన వద్ద అన్ని వివరాలు ఉన్నాయని చంద్రబాబు అంటున్నారని, ఇన్వెస్టిగేషన్ వివరాలు సీఎం వద్ద ఉండటమేంటి? అని ఆయన ప్రశ్నించారు. జగన్‌పై దాడి ఆయన్ను చంపాడానికే అని పోలీసులు రిపోర్ట్‌లో రాశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జగన్‌పై దాడి వల్ల ఎవరికి లాభం అనేది విచారణ జరపాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. జగన్‌పై దాడి: విశాఖ పోలీసులు రిపోర్టు

Updated By ManamSun, 10/28/2018 - 11:25

Jagan Mohan Reddyఅమరావతి: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై విశాఖ పోలీసులు రిపోర్టు తయారు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాసరావును  కాసేపట్లో  తమ ఆధీనంలోకి తీసుకోనున్న విశాఖ పోలీసులు దాడి ఎలా జరిగిందో రిపోర్టు తయారు చేసి, వారి అనుమానాలను అందులో పొందపరిచారు. 

అందులో మధ్యాహ్నం 12.30గంటలకు జగన్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోగా.. 8నిమిషాల పాటు ఆయన అక్కడే ఉన్నారని పోలీసులు రిపోర్టులో పొందపరిచారు. ఇక ఆ సమయంలోనే శ్రీనివాసరావు, జగన్‌పై దాడి చేశాడని పేర్కొన్నారు. జగన్‌కు 3 నుంచి 5 ఇంచుల గాయమైందని రిపోర్టులో ప్రస్తావించారు. రిపోర్టులో రమాదేవి అనే పేరును కూడా ప్రస్తావించిన పోలీసులు, ఆమె ఎవరన్న దానిపై ఆరా తీయనున్నారు. శ్రీనివాసరావు తలకు బలమైన గాయమైందని, శ్రీనివాసరావు పది పేజీల లేఖపై కూడా విశాఖ పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. శ్రీనివాసరావుతో పాటు రేవతిపతి, విజయలక్ష్మి అనే వ్యక్తులు కూడా ఈ కేసులో కీలకంగా మారనున్నారు.జగన్‌పై దాడి: ఢిల్లీకి వైసీపీ నేతలు

Updated By ManamSun, 10/28/2018 - 10:49

YSRCPహైదరాబాద్: వైసీపీ నేతలు ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. మూడు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేయనున్న వైసీపీ నేతలు ఇవాళ హోంమంత్రి రాజ్‌నాథ్‌ను కలవనున్నారు. ఈ సందర్భంగా ఏపీలో శాంతిభద్రతలు లేవని వారు హోంమంత్రికి ఫిర్యాదు చేయనున్నారు. అలాగే జగన్‌పై దాడి కేసును థర్డ్ పార్టీతో విచారణ చేయించాలని విఙ్ఞప్తి చేయనున్నారు. ఇక సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనున్నారు. వైసీపీ బృందంలో సీనియర్ నాయకులు, మాజీ ఎంపీలు ఉన్నారు. మరోవైపు జగన్‌పై దాడి కేసులో సిట్ అధికారులు విచారణను వేగవంతం చేసిన విషయం తెలిసిందే.జగన్‌పై జరిగింది హత్యాయత్నమే

Updated By ManamSat, 10/27/2018 - 20:04

 

  • వైఎస్సార్ సీపీ నేత గుడివాడ అమర్ ఆరోపణ

  • ప్రజలను తికమక పెట్టేందుకే బాబు డ్రామాలు..

gudivada amarnath

విశాఖ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై హత్యాయత్నమే జరిగిందని ఆ పార్టీ అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ఆయన శనివారం విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ....‘మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నానికి కర్త, కర్మ, క్రియ అంతా ముఖ్యమంత్రే. పోలీస్ అధికారులు, టీడీపీ నాయకులు కలిసి జగన్‌పై హత్యాయత్నం చేసినట్లు దాడి జరిగినతీరు చూస్తుంటే అర్థమవుతుంది. ఎయిర్ పోర్ట్‌లోని ఫ్యూజన్ ఫుడ్స్ ప్రస్తుత యజమాని హర్షవర్ధన్ ప్రసాద్ అభ్యంతరం చెప్పడంతో బయట నుంచి జగన్‌కి కావలసినవి తీసుకు రావడం కుదరలేదు. 

ఫ్యూజన్ ఫుడ్స్ ఓనర్ హర్షవర్ధన్ ప్రసాద్ తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు. మధ్యాహ్నం12.40 గంటలకు హత్యా ప్రయత్నం జరిగితే 2 గంటలకు డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి  హత్యాయత్నం చేసింది వైఎస్సార్ సీపీ అభిమాని అని ప్రకటన చేయడమేమిటి?. 12.40 జగన్ పై హత్యాయత్నం జరిగితే సాయంత్రం 4.30లకు విమానాశ్రయం మేనేజర్, సీఐఎస్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్‌డెంట్ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదంతా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ముఖ్యమంత్రి, డీజీపీ కలిసి పక్కా పథకం రచించారు’ అని ఆరోపించారు.వచ్చేనెల 2వరకూ జగన్ పాదయాత్రకు బ్రేక్

Updated By ManamSat, 10/27/2018 - 19:08
YS Jagan Padayatra Break Due To Health reasons

హైదరాబాద్ : వచ్చే నెల 2వ తేదీ వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు బ్రేక్ పడింది. నవంబర్ 3వ తేదీ నుంచి ఆయన తిరిగి ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించనున్నారు. కాగా విశాఖ విమానాశ్రయంలో శ్రీనివాస్ అనే వ్యక్తి వైఎస్ జగన్‌పై  కత్తితో దాడి చేసిన ఘటనలో గాయపడ్డ విషయం తెలిసిందే. భుజానికి తొమ్మిది కుట్లు పడటంతో వైద్యులు ఆయనను విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో పాదయాత్రకు విరామం ఇస్తున్నట్లు వైఎస్సార్ సీపీ శనివారం ఓ ప్రకటన చేసింది. అంతా ‘జగన్’ నాటకం: మంత్రి లోకేశ్

Updated By ManamSat, 10/27/2018 - 16:27

Nara Lokesh, Ys Jagan mohan Reddy, YSRCP, Jagannatakam అమరావతి‌: అడ్డంగా దొరికిపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత జగన్మోహన్ రెడ్డి తనదే పైచేయి అంటున్నారని ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. శనివారం ఆయన ట్విట్టర్ వేదికగా జగన్‌పై విమర్శలు గుప్పించారు. ‘అడ్డంగా దొరికిపోయిన తరువాత కూడా ఏ1 ముద్దాయి జగన్ మోదీ రెడ్డి దొంగ, దొంగ అని అరుస్తున్నారు. అవినీతి పునాదులపై వెలసిన దొంగ పేపర్, ఛానల్‌లో డబ్బా కొట్టుకున్నంత మాత్రాన కోడి కత్తి డ్రామా వెనుక ఉన్న నిజం మారదు’ అని దుయ్యబట్టారు. 

కుట్రలను బయట పెడితే మీ అంతు చూస్తా అని పోలీసులకు బెదిరింపులు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, రాష్ట్ర వ్యవస్థల పై నమ్మకం లేదు అంటూ రాష్ట్ర ప్రజలను కించపరిచే విధంగా ‘జగన్ మోదీ’ రెడ్డి మాట్లాడటం దారుణమన్నారు. చివరగా #Jagannatakam అనే హ్యాష్‌ట్యాగ్‌ను లోకేశ్‌ జత చేశారు. విశాఖ విమానాశ్రయంలో ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌పై ఓ యువకుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇదంతా జగన్‌ ఆడిన నాటకమని లోకేశ్‌ విమర్శించారు. మరోసారి ఓటమి తప్పదు అనే భయంతో కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు.

Related News