Sensational Comments

ఉత్తమ్, జానాకు డిపాజిట్లు రాకుండా చేస్తా!

Updated By ManamMon, 07/16/2018 - 22:10

MiryalaGuda MLA Nallamothu Bhaskar Rao Sensational Comments On Congress Leaders Uttam and Janareddy

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి ఇటీవల నల్గొండ జిల్లా పర్యటనలో మంత్రి జగదీశ్ రెడ్డి, టీఆర్ఎస్ సర్కార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు టీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీని వీడి కారెక్కిన మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు స్పందించారు. "వచ్చేఎన్నికల్లో జగదీష్ రెడ్డి యాభై వేల మెజార్టీతో గెలుస్తారు. ఒక వేళ ఆయన గెలవకపోతే నల్గొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేస్తాము. కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డిలను ఓడించే బాధ్యతను పార్టీ నాకు అప్పగిస్తే వారికి డిపాజిట్ రాకుండా చేస్తాను. ఇచ్చిన మాట నెరవేర్చుకోకపోతే మెడలో చెప్పుల దండ వేసుకుని తిరుగుతాను" భాస్కర్ రావు సవాల్ విసిరారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి భాస్కర్ రావు ఒక్క మాట కూడా మాట్లాడకుండానే తన ప్రసంగాన్ని ముగించడం గమనార్హం.

చెప్పులు మెడలో వేసుకుని తిరుగుతా..!
"
రాజకీయాల్లో ఉండేందుకు ఏమైనా ఫీట్ల లెక్కుందా? ఈ మాటలు జ్ఞానం ఉన్న మనుషులు మాట్లాడేవేనా? జగదీష్ రెడ్డి గారికి డిపాజిట్ కూడా రాదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు! చాలెంజ్ చేసి చెబుతున్నా.. 50 వేల మెజార్టీ కన్నా తక్కువొస్తే నల్గొండ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరం రాజీనామాలు చేస్తాం. నల్గొండ పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్ గెలుస్తుందా? జానా, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను మేము ఓడించకపోతే చెప్పులు మెడలో వేసుకుని బజారులో తిరుగుతాను" అని ఎమ్మెల్యే అన్నారు.

కాగా.. ఈ మధ్య టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్లు, మాటల యుద్ధం జరుగుతోంది. అయితే తాజాగా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోని ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేయడంతో నేతలు ముక్కున వేలేసుకున్నారట. అంతేకాదు వామ్మో ఈయన మాములు స్పీడుగా లేడు కదా..? అంటూ టీఆర్ఎస్ నేతలు సైతం గుసగుసలాడుకుంటున్నారట.24 గంటల్లో వైఎస్ జగన్ నిరూపించాలి.. లేకుంటే..

Updated By ManamSun, 07/15/2018 - 17:19

TDP MP Murali mohan reacts on Ys jagan Sensational Comments

రాజమండ్రి: వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తలపెట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. పాదయాత్రలో భాగంగా ఆయన మాట్లాడిన ప్రతీ బహిరంగ సభలోనూ లోకల్‌గా ఉండే టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీలపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. మరోవైపు టీడీపీ సర్కార్‌పై ఒంటికాలిపై లేస్తూ దుమ్మెత్తిపోసిన సందర్భాలు కోకొల్లలు.

అయితే ఫస్ట్ టైం జగన్.. తనపై చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ మురళీమోహన్ రియాక్ట్ అయ్యారు. వైఎస్ జగన్ తనపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని.. ఆయన తీరు మార్చుకోకపోతే పరువు నష్టం దావా వేస్తానని చెప్పుకొచ్చారు. అసలు ఇసుక దందాలకు తనకు సంబంధేంటి..? అని ఈ సందర్భంగా సూటి ప్రశ్న సంధించారు. సంపాదన కోసం రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. అలీఫ్ సంస్థతో మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ఈ సందర్భంగా ఆయన తేల్చిచెప్పారు. తాను తప్పుచేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.

 సంపాదన కోసం.. రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇసుక దందాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, దొంగబుద్ధులు తమకు లేవన్నారు. రాజమండ్రిలో తాను కట్టుకున్న ఇంటికి ఇసుకను మార్కెట్ రేట్ ప్రకారమే కొనుగోలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్‌కు తనపై ఆరోపణలు చేసే అర్హత లేదని అన్నారు. అలిఫ్ సంస్థకు భూ కేటాయింపు వ్యవహారంలో తన కుటుంబసభ్యులకు ఎటువంటి సంబంధం లేదని, ఆ సంస్థకు ప్రభుత్వం భూమి కేటాయిస్తే తమపై ఆరోపణలు చేయడం తగదని అని ఆయన చెప్పుకొచ్చారు.

మురళీ మోహన్ కోడలు రూప మాట్లాడుతూ.. " ఏపీ తెలంగాణలో నాకు ప్రభుత్వ భూమి ఉన్నట్లు నిరూపిస్తే ఏ కేసులకైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఆధారాలుంటేనే ఇతరులపై ఆరోపణలు చేయాలి. నాపై చేసిన ఆరోపణలు 24 గంటల్లో నిరూపించాలి. రాజమండ్రి బలభద్రపురంలో స్థలం ఇస్తామన్నా నేను వద్దన్నాను" అని ఆమె స్పష్టం చేశారు.

అయితే.. ఈ వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజమండ్రిలో పర్యటిస్తున్నప్పుడు లోకల్‌గా ఉన్న నేతలిచ్చిన స్క్రిప్ట్‌నే జగన్ చదివేశారా..? లేదా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకున్నారా..? అసలు ఈ ఆరోపణల్లో నిజమెంతో తెలియాలంటే ఒకటి... జగన్ మాట్లాడిన విధంగానే ఆధారాలూ చూపిస్తే సరే లేకుంటే అనవసరం ఆయన టీడీపీకి బుక్కయినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి చూస్తే ఈ వ్యవహారంపై స్పష్టత రావాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే మరి.పవన్‌కు పది ఓట్లు కూడా పడవు..!!

Updated By ManamFri, 07/13/2018 - 19:37

JC Pawan Reddy Sensational Comments On Janasena Chief Pawan Kalyan

అనంతపురం: ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై టీడీపీ ఎంసీ జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన జేసీ పవన్.. " పవన్ కల్యాణ్ పది ఓట్లు కూడా పడే పరిస్థితికూడా లేదు. టీడీపీ, వైసీపీలో టికెట్లు రావనుకుంటున్నారో వాళ్లు మాత్రమే వెళ్లి జనసేన టికెట్లు తీసుకుంటారే తప్ప.. మిగిలిన వారెవ్వరూ ఆ పార్టీలోకి వెళ్లరు. కనీసం పార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేరు. పవన్ కల్యాణ్ చుట్టూ ఉండే వారంతా మన అనంతపురం వాసులే. సలహాదారులు మొదలుకుని ఆయన పనిచేసే వాళ్లంతా మన జిల్లా వాసులే. పవన్ కల్యాణ్ తో నాకు కొంచెం పరిచయం ఉంది. గుంటూరులో బహిరంగసభ సందర్భంగా పవన్ కల్యాణ్ ఏం మాట్లాడారో అందరికీ తెలుసు. అయితే ఆ తర్వాత ఏమైందో గానీ లూజ్ కనెక్షన్ ఏర్పడిందో ఏమో కానీ... సడన్‌గా యూటర్న్ తీసుకుని టీడీపీ గురించి ఇష్టమొచ్చి మాట్లాడారు. అసలు మంత్రి లోకేష్ బాబుగురించి ఆయన ఎందుకు మాట్లాడారో ఇప్పటికీ తెలియట్లేదు.

సరిగ్గా ఆ టైంలో.. నేను టీవీ దగ్గరే కూర్చోని చూస్తున్నాను.. ఒక్క మాటైనా వైసీపీ గురించి మాట్లాడతాడేమోనని టీవీ మార్చకుండానే చూస్తున్నా. అక్రమాలకు పాల్పడిన జగన్ గురించి ప్రజలకు చెబుతాడో అనుకున్నా.. ఒక్క మాట కూడా పవన్ మాట్లాడలేదు. ఉలుకుపలకు లేకుండానే పవన్ ప్రసంగాన్ని ముగించేశారు. అంతకు ముందు రోజు వరకు టీడీపీతో సఖ్యతగా ఉన్న పవన్.. రాత్రికి రాత్రే పవన్ మారిపోయారు. నాకు తెలిసిన సమాచారం మేరకు ఢిల్లీ నుంచి ఫోన్ రావడంతో ఇలా మారిపోయారు. పవన్ కల్యాణ్.. నువ్ టీడీపీతో పోకూడదు.. నీకు ఎంత కావాలో చెప్పు.. అంతా ముట్టజెబుతాం అన్నదే ఆ ఫోన్ కాల్ సారాంశం" అని ఆయన చెప్పుకొచ్చారు.

కాగా.. పవన్ కల్యాణ్ అనంత జిల్లా గుంతకల్లు లేదా కదిరి నియోజకవర్గం నుంచి పోటీచేస్తారని గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు గుంతకల్లు నియోజకవర్గం నుంచి జేసీ పవన్ రెడ్డిని టీడీపీ తరఫున పోటీ చేయించాలని పార్టీ పెద్దలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి చూస్తే రానున్న ఎన్నికల్లో పవన్ వర్సెస్ పవన్ కానుందన్న మాట. అయితే ఇది ఎంత వరకు నిజమవుతుందో తెలియాలంటే మరికొద్దిరోజులు వేచి చూడాల్సిందే.ఆయనొస్తుంటే బాబుకు ముచ్చెమటలు పడుతున్నాయ్!

Updated By ManamWed, 07/11/2018 - 15:59

YCP MLA Roja Sensational Comments On AP CM Chandrababu Naidu

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన రోజా.. జమిలీ ఎన్నికలకు వైసీపీ మద్దతు ప్రకటిస్తే... బీజేపీతో కుమ్మక్కయిందంటూ విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికలు ఒకేసారి జరిపించాలని, అలాగయితే డబ్బు, సమయం వృథా కాదని 2017లో చంద్రబాబు అన్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వస్తున్నారని తెలియగానే ఏపీ సీఎం చంద్రబాబు వణికిపోయారన్నారు. అంతేకాదు బాబుకు ముచ్చెమటలు పడుతున్నాయని ఆమె పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే నిర్మించాల్సి ఉన్నా... టెండర్లను తనకు అప్పగిస్తే ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీలు అవసరం లేదంటూ రాష్ట్ర భవిష్యత్తును చంద్రబాబు తాకట్టు పెట్టారన్నారని విమర్శలు గుప్పించారు. 

ఇప్పటి వరకు ఏపీకి ఏ కేంద్ర మంత్రి వచ్చినా పెద్దగా పట్టించుకోని చంద్రబాబు... గడ్కరీ వస్తున్నారని తెలియగానే ఉన్న ఫలంగా కేబినెట్ మీటింగ్ పెట్టి హడావుడి చేస్తున్నారని రోజా తీవ్ర విమర్శలు గుప్పించారు. గడ్కరీతో పాటు పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లవద్దని పదేపదే సీఎం చంద్రబాబు చెప్పినప్పటికీ .. లేదు లేదు వెళ్లి తీరాల్సిందేనంటూ సీఎం నిర్ణయం తీసుకున్నారని ఆమె చెప్పారు. ఈ ఒక్క నిర్ణయంతోనే పోలవరం టెండర్లలో ఏ మేరకు అవకతవకలు జరిగాయనే విషయం స్పష్టంగా అర్థమవుతోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.వైసీపీ ఎన్ని డ్రామాలాడినా..!

Updated By ManamMon, 04/23/2018 - 19:16

AP Deputy CM KE KrishnaMurthy Sensational Comments On YSRCPకర్నూలు: ఏపీలో వైసీపీ ఎన్ని డ్రామాలాడినా.. ప్రజలు టీడీపీనే విశ్వసిస్తారని డిప్యూటీ సీఎం కేఈ క్రిష్ణమూర్తి చెప్పుకొచ్చారు. సోమవారం సాయంత్రం ఓ చానెల్‌‌తో మాట్లాడిన ఆయన.. ఏపీలో వైసీపీ, బీజేపీ గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. తిరుపతి బంద్‌లో మోటర్ బైక్ దగ్ధం కూడా వీరి కుట్రలో భాగమేనని కేఈ సంచలన ఆరోపణ చేశారు. కాంగ్రెస్‌ కంటే నమ్మించి మెసం చేసిన బీజేపీ పైనే ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారన్నారు. పవన్ గురించి టీడీపీ పెద్దగా పట్టించుకోవడం లేదన్నారాయన.

"ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. కేసుల మాఫీకోసం వైసీపీ అధినేత జగన్‌‌, ప్రధాని మోదీతో కుమ్మక్కయ్యారు. ఏపీకి మోదీ చాలా అన్యాయం చేశారు. అందుకే కర్ణాటకలో మోదీకి ఓటేయొద్దని పిలుపునిచ్చాను" అని కేఈ చెప్పుకొచ్చారు.మరో సంచలనానికి తెరలేపిన శ్రీరెడ్డి

Updated By ManamSun, 04/22/2018 - 16:27

sri reddy sensational comments on Actor Nagababu

టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘క్యాస్టింగ్ కౌచ్’ పేరుతో వెలుగులోకి వచ్చిన నటి శ్రీరెడ్డి గంట గంటకో సంచలన ఆరోపణ, లీక్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ హీరో పవర్ స్టార్, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేసి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా మరో మెగా ఫ్యామిలీ మెంబరైన నాగబాబుపై సంచలన ఆరోపణ చేయడం గమనార్హం. ఇటీవల జరిగిన పరిణామాలపై పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు శ్రీరెడ్డిని టార్గెట్‌గా చేసుకుని సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించడమే కాదు.. ఆమె ఫోన్ నంబర్స్ నెట్టింట్లో నానా హంగామా చేసిన సంగతి తెలిసిందే. అయితే.. నాగబాబు నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ట్విట్టర్ వేదికగా శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. 

శ్రీరెడ్డి ట్వీట్ ఇదీ..
"నాకు చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో నాగ బాబు దగ్గర నుండి.. నాకు ఏమైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత మెగా ఫ్యామిలీదే, ఇది స్వయంగా నా స్వహస్తాలతో రాస్తున్న నా వాంగ్మూలం"
అని శ్రీరెడ్డి పేర్కొంది. 

శ్రీరెడ్డి ట్వీట్‌కు పవన్ వీరాభిమానులు, నెటిజన్లు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా మెగాభిమానులు తమ ఆగ్రహాన్నంతటినీ కామెంట్స్ రూపంలో చూపిస్తున్నారు. కాగా ఆడ బిడ్డ కాబట్టి వదిలేస్తున్నాం లేకుంటే పరిస్థితి వేరేలా ఉండేదంటూ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. నటుడు నాగబాబు ఒకింత హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

 బీజేపీకి ఇంత ధైర్యం ఎక్కడిది..?: చంద్రబాబు

Updated By ManamSat, 04/21/2018 - 16:29

బీజేపీకి ఇంత ధైర్యం ఎక్కడిది..?: చంద్రబాబు

అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని సీఎం చంద్రబాబు మరోమారు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సాధికార మిత్రులతో ముఖాముఖిలో మాట్లాడిన ఆయన.. ఏపీలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవదని జోస్యం చెప్పారు. బీజేపీ ఇతర పార్టీలతో లాలూచీపడి రాష్ట్రానికి రాష్ట్రానికి ద్రోహం చేస్తోందన్నారు. టీడీపీ మెజార్టీ పార్టీలు మద్దతిచ్చాయన్న విషయాన్ని బాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అవిశ్వాసంపై కావాలనే కాలయాపన చేశారన్నారు. కేంద్రంపై పోరాటంలో ధర్మపోరాట దీక్ష మొదటి అడుగు పడిందని బాబు స్పష్టం చేశారు. ఈ నెల 30న తిరుపతి సభలో ప్రధాని మోదీని నిలదీస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత నుంచి హోదా ఉద్యమాన్ని తీవ్రం చేస్తామన్నారు. 

" టీడీపీ అవిశ్వాస తీర్మానం పెడితే.. అన్నాడీఎంకే ఎంపీలను అడ్డంపెట్టుకుని తప్పించుకున్నారు. ప్రతిపక్షాలకు ఏ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు. హోదా ఇస్తామని మోదీ తిరుపతి సభలో హామీ ఇచ్చారు. అదే తిరుపతిలో సభపెట్టి మోదీని మరోసారి ప్రశ్నిస్తాం. ఏపీకి బీజేపీ ఒక్క సీటైనా గెలవగలదా..?. ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీకి ఒక్కరైనా ఓటేస్తారా..?. బీజేపీకి ఇంత ధైర్యం ఎక్కడ్నుంచి వచ్చింది..?. నేను లేకపోయినా చిన్నచిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంటే వాళ్లు బీజేపీ చెప్పుచేతుల్లో ఉంటారని బీజేపీ భావిస్తోంది" అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.అంతా కాపీ పేస్ట్‌‌లే..!: ఎమ్మెల్యే విష్ణు

Updated By ManamSun, 04/15/2018 - 15:59

BJP MLA VS TDP

అమరావతి: ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను.. దీక్ష విషయంలో ప్రధాని మోదీని.. సీఎం చంద్రబాబు కాపీ కొట్టారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే బాబు చేసేది మొత్తం అంతా కాపీ ఫేస్ట్‌‌లే అన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. ఆదివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన.. కేవలం ఫొటో షూట్ కోసమే బాబు పార్లమెంట్ మెట్లకు మొక్కారని ఆరోపించారు.

"విదేశాలకు వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని నిందిచే సంస్కృతి ఎక్కడదీ?. ప్రధానిని విదేశాల్లో విమర్శిస్తే దేశంలో అందర్నీ అవమానించినట్టే. మీకేమైనా విదేశాలతో రహస్య ఒప్పందం ఉందా?. ఇదేనా మీ 40 ఏళ్ల రాజీకీయ అనుభవం?. 

మంత్రి గంటా గురించి..
ప్రస్తుతం ఏపీ కేబినెట్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు. రాజకీయ కుట్రలకు గంటా మేధావి" అని సీఎం, గంటాపై.. ఎమ్మెల్యే విష్ణు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.మోదీని ఢీకొట్టే మొనగాడు బాబే: వర్ల రామయ్య

Updated By ManamSat, 04/14/2018 - 18:50

TDP Sr Leader Varla Ramaiah Comments On Modi Amit Shah

అమరావతి: భారత ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన.. మోదీని ఢీకొట్టే మొనగాడు చంద్రబాబేనని దేశం భావిస్తోందని చెప్పుకొచ్చారు. దళితులపై మోదీ, అమిత్ షాలు దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేకహోదాతో పాటు దళితులపై దాడులను నిరసిస్తూ ఉద్యమించాలని వర్ల పిలుపునిచ్చారు. దళితులంతా సీఎం చంద్రబాబు వెనకే ఉంటారని వర్ల చెప్పారు. 

అయితే ప్రధానిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని ఏపీ బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా త్వరలోనే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తామని బీజేపీ నేతలు షెడ్యూల్‌ను కూడా సిద్ధం చేసుకున్నారు. అంతేకాదు ఏపీకి కేంద్రం ఏమిచ్చింది..? రాష్ట్రం ఎంత మేరకు అభివృద్ధి చేసింది? నిధుల లెక్కలు ఇలా అన్నీ చెప్పడానికి బీజేపీ నేతలు పక్కా ప్రణాళికలతోనే బీజేపీ నేతలు ఏపీ ప్రజల్లోకి వెళుతున్నారు.ఆ ఆస్తులపై జగన్ కన్నుపడింది: బుద్దా వెంకన్న

Updated By ManamSat, 04/14/2018 - 18:00

TDP MLC Buddha Venkanna Sensational Comments on YS Jagan .

అమరావతి: వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తలపెట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ కృష్ణా జిల్లా చేరుకుంది. శనివారం పాదయాత్రలో భాగంగా విజయవాడకు చెందిన టీడీపీ కీలక నేత యలమంచిలి రవి.. జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే ఇది చూసి ఓర్వలేని టీడీపీ నేతలు కొందరు జగన్ పాదయాత్రపై బురద జల్లుతున్నారని వైసీపీ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ..
కృష్ణా జిల్లాలో జగన్ పాదయాత్రకు ప్రజలు కరవయ్యారని చెప్పుకొచ్చారు. జనాలు కరువవ్వడంతో గుంటూరు జిల్లా నుంచి డబ్బులిచ్చి ప్రజలను తరలంచారని సంచలన ఆరోపణ చేశారు. శనివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన.. " రాజధానికి జగన్ అనుకూలమా.. వ్యతిరేకేమో చెప్పాలి. అగ్రిగోల్డ్ ఆస్తుల మీద జగన్ కన్ను పడింది. కొంతమంది రౌడీలతో ఎస్సెల్ గ్రూపు ప్రతినిధులను బెదింరించారు. వైఎస్ జగన్‌ను ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచే కాదు, దేశం నుంచి పారదోలాలి" అని బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే మీడియా ద్వారా వైఎస్ జగన్‌పై ఇష్టానుసారం ఆరోపణలు చేసేశారు కానీ ఆధారాలు మాత్రం ఆయన చూపకపోవడం గమనార్హం. కాగా బుద్దా వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

Related News