ram gopal varma

వర్మ బయోపిక్ తీయనున్న సెన్సేషనల్ డైరక్టర్

Updated By ManamFri, 08/03/2018 - 09:57

Ajay Bhupathi సంచలన కథాంశాలపై బయోపిక్‌లు తీసే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జీవిత చరిత్రపై త్వరలో బయోపిక్ రానుంది. ఈ చిత్రానికి ఇటీవల సెన్సేషనల్ హిట్‌ను సొంతం చేసుకున్న ఆర్‌ఎక్స్ 100 చిత్ర దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహించనున్నాడు. గతంలో రామ్ గోపాల్ వర్మ దగ్గర కొన్ని చిత్రాలకు అసిస్టెంట్‌గా పనిచేసిన అజయ్ భూపతి.. ఇప్పుడు అతడి జీవిత చరిత్రను తెరకెక్కించనున్నాడు. ఈ విషయాన్ని ఆయనే తెలిపాడు.

భారతదేశంలోని గొప్ప టెక్నీషియన్‌లలో రామ్ గోపాల్ వర్మ ఒకరని తెలిపిన అజయ్ భూపతి, అతడి జీవిత చరిత్ర ఆధారంగా చిత్రాన్ని తీయాలనుందని తన కోరికను భయటపెట్టాడు. మరి ఈ ప్రాజెక్ట్‌ను అతడు ఎప్పుడు సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడో చూడాలి. కాగా అజయ్ భూపతి ప్రస్తుతం ఆర్ఎక్స్ 100 హిందీ రీమేక్ సన్నాహాల్లో ఉన్నాడు.దావూద్‌పై వర్మ వెబ్ సిరీస్

Updated By ManamThu, 07/26/2018 - 12:54

Varma‘ఆఫీసర్’ తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్న రామ్ గోపాల్ వర్మ మళ్లీ బిజీ అవ్వనున్నాడు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై ఓ వెబ్ సిరీస్‌‌ను రూపొందించనున్నాడు. అందులో దావూద్ 1980లలో సృష్టించిన అల్లర్లు, అతడు స్థాపించిన డి-కంపెనీ గురించి చూపించనున్నారు. ఈ విషయాన్ని వర్మ సోషల్ మీడియాలో తెలిపారు.

ఐదు సీజన్లో పది ఎపిపోడ్‌లుగా ఈ వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మధు మంతెనతో కలిసి ఈ వెబ్ సిరీస్‌ను వర్మ నిర్మించనున్నారు. కాగా వైరస్ అనే మరో చిత్రాన్ని కూడా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.రూట్ మార్చిన వర్మ.. స్టోరీని కూడా చెప్పేశాడు

Updated By ManamMon, 06/11/2018 - 08:54

varma ‘ఆఫీసర్‌’తో మరో పరాజయాన్ని మూటగట్టుకున్న వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తదుపరి చిత్ర విశేషాలను చెప్పేశాడు. ఈ సారి యాక్షన్‌ను వీడిన వర్మ వైరస్‌పై కన్నేశాడు. ఎబోలాను పోలిన ఓ వైరస్‌పై వర్మ నెక్ట్స్ మూవీని తెరకెక్కించనున్నాడు. ఈ విషయంపై అధికారిక ప్రకటనను ఇచ్చేసిన వర్మ, సినిమా లైన్‌ను కూడా చెప్పేశాడు.

దక్షిణాఫ్రికాను సందర్శించేందుకు వెళ్లిన ఓ విద్యార్థి అక్కడి నుంచి ఓ వైరస్‌ను వెంటపెట్టుకొని ముంబైకి వస్తాడు. ఆ తరువాత ఆ వైరస్ పలువురికి సోకగా, అప్పటికే ముందస్తు జాగ్రత్తలు తీసుకోని ప్రభుత్వం ఒక మనిషి, మరో మనిషికి 20 అడుగుల దూరంగా ఉండాలని సూచిస్తోంది. అయినా అక్కడ మరణాలు రోజు రోజుకు పెరుగుతుండటంతో ముంబైని దేశం నుంచి దూరంగా పెడుతోంది భారత ప్రభుత్వం. అంతేకాదు ముంబైని దాటి రావాలని ప్రయత్నించే వారిని చంపేయాలని ఆర్డర్ కూడా వేస్తోంది. ఈ క్రమంలో అక్కడ ఉన్న ప్రజల కష్టాలు, భయాలు గురించి ఈ చిత్రం ఉండబోతుందని వర్మ తెలిపాడు. ఇక ఈ చిత్రాన్ని సర్కార్, ద అటాక్స్ ఆఫ్ 26/11 చిత్రాల నిర్మాత పరాగ్ సంఘవి నిర్మించనున్నాడు.ఆత్మహత్యే నాకు శరణ్యం: ఆఫీసర్ డిస్ట్రిబ్యూటర్

Updated By ManamTue, 06/05/2018 - 11:07

officerనాగార్జున, వర్మ కాంబినేషన్లో వచ్చిన ‘ఆఫీసర్’ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆత్మహత్యే తనకు శరణ్యమని ఆ మూవీ ఏపీ రైట్స్‌ను కొనుగోలు చేసిన సుబ్రమణ్యం అనే డిస్ట్రిబ్యూటర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫీసర్ షూటింగ్ సమయంలో వర్మ తన వద్ద నుంచి రూ. 1.30 కోట్ల ఫైనాన్స్ తీసుకున్నాడని, సినిమా పూర్తి అయినా ఆ డబ్బు తిరిగి ఇవ్వలేదని, తాను అడిగితే, కోర్టుకు వెళ్లాలని వర్మ బెదిరించారని ఆయన ఆరోపించారు. 

అయితే కోర్టుకు వెళితే సమస్య తేలేందుకు సమయం పడుతుందన్న ఉద్దేశంతో సినిమా గోదావరి రైట్స్ ఇవ్వాలని అడిగానని, కేవలం గోదావరి రైట్స్ మాత్రమే విడిగా ఇచ్చే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేసిన వర్మ, ఏపీ రైట్స్ మొత్తం తీసుకోవాలని చెప్పాడని అన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో తాను మరో రూ. 3.50 కోట్లు చెల్లించి ఏపీలో సినిమాను విడుదల చేశానని కాని తొలి షో నుంచే మినిమమ్ కలెక్షన్లు కూడా రాలేదని విలపించాడు. ఇప్పుడు తనకు ఆత్మహత్యే శరణ్యమని చెప్పారు. మరి ఈ వివాదంపై నాగార్జున, వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి.పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో వర్మ ఫిర్యాదు

Updated By ManamTue, 05/22/2018 - 12:25

varma అసభ్యకరమైన ఫొటోకు తన ఫొటోతో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.  అయితే చిక్కడపల్లికి చెందిన పి. జయ కుమార్ అనే వ్యక్తి ఈ నెల 18న ఓ మహిళ అసభ్యకరమైన బంగిమలో ఉన్న ఫొటోకు రాంగోపాల్ వర్మ ముఖాన్ని తగిలించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీన్ని గమనించిన వర్మ.. తనను అవమానించాడంటూ, తన పరువు తీశాడంటూ ఆ వ్యక్తిపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కోర్టు అనుమతితో కేసు నమోదు చేస్తామని వర్మకు తెలిపారు.నేను కూడా ప్రేమిస్తాను: వర్మ

Updated By ManamSat, 05/19/2018 - 15:14

varma వివాదాస్పద వ్యాఖ్యల్లో ఎప్పుడూ వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ప్రముఖులపై ఆయన ఎప్పుడూ విమర్శలు చేస్తూనే ఉంటారు. అందుకు వారి అభిమానుల నుంచి ప్రతివిమర్శలు ఎదుర్కొంటారు. అయితే తాజాగా తనలో కూడా ప్రేమ ఉందని తెలిపాడు వర్మ. ఒక కుక్క పిల్లతో ఫొటోను తీసుకున్న రామ్ గోపాల్ వర్మ, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ‘‘నేను కూడా ప్రేమిస్తాను’’ అంటూ కామెంట్ పెట్టాడు. కాగా నాగార్జున హీరోగా వర్మ తెరకెక్కించిన ‘ఆఫీసర్’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

 ‘ఆఫీసర్’ విడుదల వాయిదా

Updated By ManamWed, 05/16/2018 - 09:29

officer నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘ఆఫీసర్’. ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇదివరకే ప్రకటించారు. అయితే తాజాగా ఈ చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. జూన్ 1న ఆఫీసర్ విడుదల కానుందని వర్మ సోషల్ మీడియాలో తెలిపారు. 

సాంకేతికంగా ఆఫీసర్ చిత్రానికి మరిన్ని మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉందని అందుకే ఈ చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు వర్మ ప్రకటించారు. కాగా 25 సంవత్సరాల తరువాత వర్మ, నాగార్జున కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్న విషయం తెలిసిందే.

 

 వర్మ కామెంట్.. శాస్త్రి కౌంటర్

Updated By ManamMon, 05/14/2018 - 11:02

varma, sastry వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ మళ్లీ ట్విట్టర్‌లో వివాదాలను ప్రారంభించాడు. గత కొన్ని రోజులుగా పవన్ కల్యాణ్‌పై, అతడి అభిమానులపై కామెంట్లు చేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా పవన్‌ తిరుమల పర్యటనకు సంబంధించిన ఓ ఫొటోను షేర్ చేసిన వర్మ.. పవర్ స్టార్‌ పవర్‌ఫుల్ ఎనర్జీకి ఒక ఉదాహరణ అంటూ కామెంట్ పెట్టాడు. దానికి ప్రముఖ సినీ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి కౌంటర్ ఇచ్చాడు. ‘‘కెలకమాకు సామీ.. కాస్త వాతావరణం మర్చిపోతే ఆపని అందరూ చేయగలరు... ఇది మీకు హుందా అయినది కాదు. తెలుగు ప్రజల సమయం అంత తేలికగా లేదు. ఏమన్నా ఉంటే పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడుకోండి’’ అంటూ కౌంటర్ ఇచ్చాడు.

 శ్రీదేవి బాహుబలి చేయకపోవడానికి కారణం అతనే

Updated By ManamSun, 04/29/2018 - 16:38

varma భారత సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన ‘బాహుబలి’లో శివగామి పాత్రకు ముందు అతిలోక సుందరి శ్రీదేవిని సంప్రదించినట్లు దర్శకుడు రాజమౌళి కూడా పలుసార్లు ప్రస్తావించిన విషయం తెలిసిందే. అయితే ఆ పాత్రను ఒప్పుకోవడం కోసం శ్రీదేవి భారీ రెమ్యునరేషన్ అడిగిందని పలు వార్తలు వినిపించాయి. దానిపై స్పందించిన శ్రీదేవి.. తాను కూడా ఓ నిర్మాత భార్యనేనని, ఎక్కువ రెమ్యునరేషన్ అడిగిన మాటల్లో నిజం లేదని స్పష్టం చేసింది. దీంతో ఈ వివాదం కాస్త ముగియగా.. తాజాగా ఆ విషయంపై మరోసారి స్పందించారు.

శ్రీదేవి బాహుబలి చేయకపోవటానికి కారణం బోని కపూరే అని వర్మ చెప్పారు. ఈ విషయంపై తాను అప్పట్లో శ్రీదేవితో మూడు, నాలుగుసార్లు చర్చించానని, శ్రీదేవి కూడా ఈ మూవీలో నటించేందుకు ఇంట్రస్ట్ చూపించారని, కానీ బోనినే ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసి ఆ చిత్రంలో నటించకుండా చేశారని పేర్కొన్నారు. బోని నిర్ణయాల కారణంగానే శ్రీదేవి కెరీర్ పరంగా ఎంతో నష్టపోయారని, పెళ్లి తరువాత ఆమె ఒక్క రోజు కూడా ఆనందంగా లేదంటూ తెలిపారు.


 పూరి వ్యాఖ్యలపై వర్మ రీట్వీట్..

Updated By ManamFri, 04/20/2018 - 15:40

Mega family, Ram gopal varma, Pawan Kalyan, Tollywood Casting couch హైదరాబాద్: టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్‌ వ్యవహారంపై పోరాటం చేస్తూ.. సినీనటుడు, జనసేన నేత పవన్‌ కల్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీనటి శ్రీరెడ్డి వివాదం మరో మలుపు తిరిగింది. సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ స్వయంగా తానే ఈ కామెంట్‌ చేయించానని చెప్పటంతో వివాదం మరింత ముదిరింది. పవన్ స్టార్ పవన్ కల్యాణ్ తన తల్లిని శ్రీరెడ్డి అసభ్యపదజాలంతో దూషించినందుకు ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీకి అభిమానులు, సినీప్రముఖుల నుంచి భారీ మద్దతు పెరుగుతోంది. తాజాగా ఈ వివాదంపై వర్మ శిష్యుడు, దర్శకుడు పూరి జగన్నాథ్‌ స్పందిస్తూ.. ‘నాకు జీవితాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బాధపడటం నాకు చాలా బాధ కలిగించింది . అతనిని ఎప్పుడూ ఇలా చూడలేదు . ఆర్‌జీవీ చేసిన పని నాకు నచ్చలేదు . ప్రాణం ఉన్నంత వరకూ ఐ సపోర్ట్‌ పవన్‌ కల్యాణ్’ అంటూ ట్వీట్‌ చేశారు.

పూరి ట్వీట్‌పై స్పందించిన రామ్‌ గోపాల్‌ వర్మ .. ‘మెగా ఫ్యామిలీకి, ముఖ్యంగా పవన్ కల్యాణ్ గారికి నమస్కారములతో.. భవదీయుడు రామ్ గోపాల్ వర్మ.. మీ బాధ నాకు అర్ధమైంది. నేను పొరపాటు చేశాను. ఇప్పటికే క్షమాపణ కూడా కోరాను సర్’ అంటూ ట్వీట్‌ చేశారు.

Related News