vairamuthu

అమ్మవారిపై అతడు రాసింది తప్పు కాదు

Updated By ManamFri, 01/19/2018 - 13:27

Vairamuthuచెన్నై: తమిళుల దేవత అండాల్ అమ్మవారిపై ప్రముఖ కవి, రచయిత వైరముత్తు రాసిన మాటల్లో తప్పులేదని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. అండాల్ అమ్మవారిపై వైరముత్తు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన పిటిషన్‌ను ముంబై హైకోర్టు విచారించింది. ఈ నేపథ్యంలో వైరముత్తు అన్న మాటల్లో ఏ విధమైన తప్పు లేదని తెలిపింది.

అయితే ఒక పత్రికలో అండాల్ అమ్మవారి గురించి రాసిన వైరముత్తు.. ఆమెను 'దేవదాసి'తో పోల్చారు. దీంతో పలు హిందూ సంఘాలు ఆయనపై విమర్శలు కురిపించారు. అమ్మవారిని దేవదాసితో పోల్చడం ఏంటంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దానికి సమాధానమిచ్చిన వైరముత్తు తన దృష్టిలో దేవదాసి అంటే దేవుడి కోసం సేవ చేసేవాళ్లని చెప్పారు. తనకు అండాల్ అమ్మలాంటిదని, తాను ఎవరినీ కించపరిచేలా ఈ వ్యాఖ్యలు రాయలేదని, ఆ వ్యాఖ్యల వలన ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరారు. అయినా హిందూ సంఘాలు మాత్రం అతడి చంపేస్తామంటూ బెదిరించారు. ఇలాంటి సమయంలో తాజాగా హైకోర్టు తీర్పుతో వైరముత్తుకు కాస్త ఊరట లభించినట్లైంది.



గోదాదేవిపై వివాదాస్పద వ్యాఖ్యలు!

Updated By ManamWed, 01/10/2018 - 14:14

vairamuthuగోదాదేవిపై తమిళ రచయిత వైరముత్తు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.   గోదాదేవిపై వైరముత్తు ఓ పత్రికకు రాసిన వ్యాసం దుమారం రేపుతోంది. ఇది దేవతామూర్తిగా పూజలందుకుంటున్న గోదాదేవి ప్రతిష్టను దిగజార్చేలా ఉందని పలువురు మండిపడుతున్నారు. వైరముత్తు వ్యాఖ్యల పట్ల తమిళనాడు బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. 

దేవతామూర్తిగా, మహిమాన్విత మూర్తిగా తమిళుల చేత పూజలందుకుంటున్న గోదాదేవిని దేవదాసిగా వ్యాఖ్యానించడం సరికాదని తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ మండిపడ్డారు. తన వాఖ్యల పట్ల వైరముత్తు విచారం వ్యక్తంచేస్తే సరిపోదని...వెంటనే సదరు వ్యాస్యాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లిఖితపూర్వకంగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతో పాటు...ఇకపై ఇలాంటి వ్యాసాలతో హింధువుల మనోభావాలను గాయపర్చబోనని క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. 





Related News