godhadevi

ఉరకలేస్త్తున్న గోదావరి

Updated By ManamWed, 08/22/2018 - 02:34
  • మూడో ప్రమాద హెచ్చరికకు చేరువలో.. అప్రమత్తమైన అధికార యంత్రాంగం

  • పునరావాస కేంద్రాలు ఏర్పాటు.. నీట మునిగిన మెట్లు 

godhavariభద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలంలో గోదావరి ఉరకలు వేస్తుంది. గత కొద్ది రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షా లకు తోడు గోదావరి ఎగువ ప్రాంతంలో సైతం వర్షాలు పడడంతో గోదావరికి ఉదృతంగా వరద నీరు చేరుతుంది. రెండు రోజులు క్రితం రెండవ ప్రమాద హెచ్చరిక స్ధాయికి చేరి గోదావరి తగ్గుముఖం పట్టింది. ఎగువున కురిసిన వర్షపు నీరు గోదావరికి చేరడంతో వరద ఉదృతి పెరుగుతుంది. ఒక్క రోజులోనే రెండవ ప్రమాద హెచ్చరిక స్ధాయిని దాటి మూడవ ప్రమాద హెచ్చరికకు చేరువలోకి వచ్చింది. దీనితో జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయింది. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్, ఐటిడిఎ పివో, భద్రాచలం సబ్ కలెక్టర్‌లు ఎప్పటికప్పుడు పరిస్ధితిని సమీక్షిస్తూ తమ సిబ్బందికి తగు సూచనలు ఇస్తున్నారు. పునరావాస కేంద్రాలలోకి వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా విద్యుత్ సౌకర్యంతో పాటు మంచినీరు, ఆహరం అందించే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నారు. రహదారుల పైకి వరద నీరు చేరే అవకాశం ఉండడంతో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.

జిల్లాలో గోదావరి వరద ఉదృతి చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడ్ మండలాల్లో వరద ప్రభావం అధికంగా ఉంది. భద్రాచలంలోని రామాలయం నది ఒడ్డున ఉన్న స్నానాల రేవు దగ్గర మెట్లు నీట మునిగాయి. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల వైపు వెళ్ళే రహదారిలో పలు చోట్ల రోడ్డు పైకి వరద నీరు చేరే అవకాశం ఉందని మండల తహశీల్దార్‌లు తెలిపారు. దుమ్ముగూడెం మండలంలోని సున్నంబట్టి,తూరుబాక, రేగుబల్లి, గంగోలు గ్రామాలు వరద ముంపునకు గురవుతాయని అన్నారు.  సున్నంబట్టి బాధితులకు బైరాగులపాడు ప్రాధమిక పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశామని దుమ్ముగూడెం తహీశీల్దార్ హరిచంద్ తెలిపారు.  చర్ల మండలంలో 53 అడుగులకు వరద నీరు చేరితే కుదునూరు వద్ద రవాణాకు ఆటకం కలుగుతుందని చర్ల తహసీల్దార్ కెవి శ్రీనివాసరావు తెలిపారు. వరద ముంపునకు గురయ్యే గ్రామాలను దగ్గరలోని పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. వరద ముంపుకు గురయ్యే ప్రదేశాలను పాల్వంచ డిఎస్పీ శ్రీనివాసులు, సిఐ రాఘవేంద్రరావు, బూర్గంపాడ్ ఎస్సై సంతోష్‌లు పరిశీలించారు. బూర్గంపాడ్ మండలంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని విద్యుత్ సౌకర్యంతో పాటుగా ఆహరం మంచినీటి వసతులు కల్పించామనిపునరావాస కేంద్రాలలో శానిటేషన్ ఇబ్బంది కలుగకుండా తగు ఏర్పాట్లు చేశామని బూర్గంపాడ్ తహశీల్దార్ స్వర్ణ అన్నారు. కాగా ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. వరద నీటితో వాగులు పొంగిపొర్లుతున్నాయి. పెన్ గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు మంచిర్యాలలో గోదావరి ప్రవాహం ఉధృతంగా ఉంది. కోటపల్లి మండలంలో పంటపొలాలు నీట మునిగాయి. ప్రాణహిత నది నిండుగా ప్రవహిస్తున్నది. దీంతో మహారాష్ట్ర వైపు నాటు పడవలపై రాకపోకలు నిలిపివేశారు. వరదలు తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు కుమ్రం భీం జిల్లాలో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాయువ్య ఒడిశా, పరిసర ప్రాంతాల్లో అల్ప పీడనం కొనసాగుతున్నది. మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమైంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది.గోదాదేవిపై వివాదాస్పద వ్యాఖ్యలు!

Updated By ManamWed, 01/10/2018 - 14:14

vairamuthuగోదాదేవిపై తమిళ రచయిత వైరముత్తు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.   గోదాదేవిపై వైరముత్తు ఓ పత్రికకు రాసిన వ్యాసం దుమారం రేపుతోంది. ఇది దేవతామూర్తిగా పూజలందుకుంటున్న గోదాదేవి ప్రతిష్టను దిగజార్చేలా ఉందని పలువురు మండిపడుతున్నారు. వైరముత్తు వ్యాఖ్యల పట్ల తమిళనాడు బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. 

దేవతామూర్తిగా, మహిమాన్విత మూర్తిగా తమిళుల చేత పూజలందుకుంటున్న గోదాదేవిని దేవదాసిగా వ్యాఖ్యానించడం సరికాదని తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ మండిపడ్డారు. తన వాఖ్యల పట్ల వైరముత్తు విచారం వ్యక్తంచేస్తే సరిపోదని...వెంటనే సదరు వ్యాస్యాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లిఖితపూర్వకంగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతో పాటు...ఇకపై ఇలాంటి వ్యాసాలతో హింధువుల మనోభావాలను గాయపర్చబోనని క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. 

Related News