rosaiah

జగన్‌కు రోశయ్య, చిరు పరామర్శ

Updated By ManamSat, 10/27/2018 - 16:34
Rosaiah, chiranjeevi phone call to YS jagan

హైదరాబాద్ : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, కేంద్ర మాజీమంత్రి చిరంజీవి, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తదితరులు ఫోన్‌లో పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

కాగా గురువారం విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్‌పై శ్రీనివాస్ అనే యువకుడు కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో జగన్ భుజానికి గాయం కాగా, తొమ్మిది కుట్లు పడ్డాయి. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వైఎస్ జగన్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో ఆయన ప్రజాసంకల్పయాత్రకు వారం పాటు విరామం ఇచ్చారు.
 కాంగ్రెస్‌కు పట్టం!

Updated By ManamMon, 09/10/2018 - 22:32
  • ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. పార్టీ శ్రేణులు కష్టపడాలి

  • కార్యకర్తలకు రోశయ్య పిలుపు.. ఆంధ్రరత్న భవన్‌లో సన్మానం

rosaiah

విజయవాడ: కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, దానిని సాధించుకోవటానికి పార్టీ శ్రేణులు కష్టపడాలని మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య పేర్కొన్నారు. సోమవారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన కొణిజేటి రోశయ్య.. కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు ఏపీసీసీ కార్యాలయాన్ని సందర్శించారు. ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, సీనియర్ నేతలు ఆయనను సాదరంగా ఆహ్వానించి, ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మీడియాతో రోశయ్య మాట్లాడారు. చాలా సార్లు విజయవాడ వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు రాలేదని, రఘువీరారెడ్డి కోరిక మేరకు ఆంధ్రరత్న భవన్‌కు వచ్చాన్నారు. ఎటు వెళ్లినా కాంగ్రెస్ పార్టీ జెండా కనబడితే ఉత్సాహం కలుగుతుందని అన్నారు. కాంగ్రెస్ జెండా ఎగరాలని కోరుకునే వారిలో తాను మొదట ఉంటానుని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, పార్టీ శ్రేణులు కష్టపడాలని సూచించారు. తాను విజయవాడ రావడం కూడా కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు. ఇప్పుడు పార్టీకి ఏమి చేయాలన్నా తనకు శక్తి సరిపోదని, ఉన్నవారు మాత్రం శక్తిని కూడగట్టుకొని పార్టీ కోసం పని చేయాలని కోరారు. విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని తాననుకోవటం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నానని రోశయ్య చెప్పారు. 

కాంగ్రెస్‌లోకి చేరికలు
తూర్పుగోదావరి జిల్లా ముమ్ముడివరానికి చెందిన గంగిశెట్టి గంగాధర్ అధ్వర్యంలో సుంకర పాలెం సర్పంచ్ శ్రీనివాస్ కిరణ్‌తో పా టు దాదాపు 50 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి రఘువీరారెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో బొంత శ్రీనివాస్, బొంత సత్యనారా యణ, వాసశెట్టి సత్యనారాయణ, కె.సత్యనారా యణ, వీరాబాబు, మగాపు గంగధర్, ఎడిద సూరిబాబు, గాడిబాబురావు ఉన్నారు. రోశయ్యకు జీవిత కాల పురస్కారం ప్రదానం

Updated By ManamSun, 02/11/2018 - 11:01

రోశయ్యకు జీవిత కాల పురస్కారం ప్రధానంహైదరాబాద్:  మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యకు జీవిత కాల పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదివారం ఉదయం రోశయ్యను సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రోశయ్య.. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంతో తన రాజకీయ జీవితం మొదలైందన్నారు. " నాకు అన్ని పదవులు యాదృచ్చికంగా వచ్చాయి. నేనెప్పుడూ పదవులను దుర్వినియోగం చేయలేదు" అని రోశయ్య స్పష్టం చేశారు.తెలంగాణ సర్కార్‌కు రోశయ్య సలహా

Updated By ManamThu, 01/11/2018 - 15:22

rosaiahహైదరాబాద్: చెన్నారెడ్డి శ‌త‌జ‌యంతి ఉత్సవాలను ఘ‌నంగా నిర్వహిస్తామ‌ని ఏపీ మాజీ సీఎం రోశ‌య్య అన్నారు. ఈ ఉత్సవాల‌కు మాజీ ప్రధాని మ‌న్మోహ‌న్ సింగ్‌తో పాటు దేశ న‌లుమూల‌ల నుంచి ప‌లువురు ప్రముఖులు హాజ‌రవుతార‌ని తెలిపారు. శనివారం నుంచి ఏడాది పొడుగునా జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. గొప్ప ప్రజా నాయకుడైన చెన్నారెడ్డి శ‌త‌జ‌యంతి ఉత్సవాల‌ను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు. చెన్నారెడ్డి నాయ‌క‌త్వ ప‌టిమ‌ను యావ‌త్ దేశం కొనియాడిందని గుర్తుచేశారు. చెన్నారెడ్డి ఒక ప్రాంతానికి ప‌రిమిత‌మైన నాయ‌కుడు కాదని రోశ‌య్య కొనియాడారు.

Related News