smartphone

వదలకపోతే వేళ్లు ఒంగిపోతయ్

Updated By ManamWed, 10/24/2018 - 02:18

smartబీజింగ్: ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకూ స్మార్ట్‌ఫోన్ లేకుండా నేటి యువతకు ఒక్క క్షణం గడవదు. మొబైల్‌ను అతిగా వినియోగించడం వల్ల అనేక అనర్ధాలు జరుగుతాయని, ఆరోగ్యానికి హానికరం అని ఎన్ని హెచ్చరికలు చేసినా మానడం లేదు. కొంతమంది మాత్రం నిరంతరం సెల్‌ఫోన్‌లో మునిగిపోయి బయటి ప్రపంచాన్ని మర్చిపోతున్నారు. ఈ కారణంగా పలు ప్రమాదాలు కొనితెచ్చుకుంటూనే ఉన్నారు. కొన్ని సార్లు అవి ప్రాణాల మీదకు కూడా వస్తున్నాయి. దీనికి నిదర్శనంగా గతంలో జరిగిన ఎన్నో విభిన్న ఘటనలకు తోడు ఇటీవల మరో విస్మయకర విషయమొకటి బయటపడింది. చైనాకు చెందిన ఓ యువతి అదే పనిగా స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించడం వల్ల తన చేతి వేళ్ల కదలికను కోల్పోయింది. ఫోన్‌ను ఏ విధంగా అయితే పట్టుకొని ఉందో.. అదే రీతిలో ఆమె వేళ్లు బిగుసుకుపోయాయి. వైద్యుల చికిత్స అనంతరం ఎట్టకేలకు ఆమె చేతి వేళ్లు మళ్లీ మామూలు స్థితికి వచ్చాయి.  చెనాకు చెందిన షాంఘైలిస్ట్ కథనం ప్రకారం.. హునాన్ ప్రావిన్సుకు చెందిన ఓ యువతి స్మార్ట్‌ఫోన్‌కు బానిస. ఈమెకు ఈ ఫోను పిచ్చి ఎంతగా ఉందంటే తన ఉద్యోగానికి వారం రోజులు సెలవు పెట్టి మరీ సమయాన్నంతా ఫోన్ వినియోగిస్తూనే ఉంది. కేవలం నిద్రపోయే సమయంలో మాత్రమే దానిని వదిలిపెట్టేది. ఇలాగే రోజూ చేయడంతో చేతులు నొప్పి పెట్టి.. చివరికి ఆమె వేళ్లు వంగిపోయి బిగుసుకుపోయాయి. స్మార్ట్‌ఫోన్ ను ఏ విధంగా పట్టుకుని ఉందో అదే పొజిషన్లో ఆమె వేళ్లు కూడా ఉండిపోయాయి. తిరిగి మామూలు స్థితికి రాలేకపోయాయి. దీంతో ఆమె వైద్యులను సంప్రదించింది. అదృష్టవశాత్తూ ఆమె వేళ్లను వైద్యులు తిరిగి మామూలు స్థితికి తీసుకురాగలిగారు. కానీ ఆమె స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలని సూచించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇటువంటి సంఘటనలతోనైనా యువత కన్నుతెరుస్తుందో లేదో వేచి చూడవలసిందే.స్మార్ట్ ఫోన్ ధరలో స్మార్ట్ టీవీ

Updated By ManamFri, 10/05/2018 - 22:09

inmageహైదరాబాద్: గుజరాత్ కేంద్రంగా పని చేస్తున్న ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ ‘హోమ్ ఇండియా’ సంస్థ స్మార్ట్ టీవీలను హైదరాబాద్‌లో శుక్రవారం ఆవిష్కరించింది. గుజరాత్‌లో టీవీలను ఆవిష్కరించిన మూడున్నర నెలల్లోనే 20,000 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. మొదటి సారిగా కంపెనీ ఉత్పత్తులను దక్షిణాదిన అదీ హైదరాబాద్ నుంచి  మార్కెట్‌లోకి ప్రవేశ పెడుతున్నట్లు కంపెనీ డైరెక్టర్ అహ్మద్ జియా చెప్పారు. మొదట ఈ టీవీలను  పట్టణాల్లో ఉన్న మల్టీ బ్రాండ్ అవుట్‌లెట్‌ల ద్వారా వ్రియాలు సాగిస్తామని ఆయన చెప్పారు. వీటితో పాటు మరిన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ప్రవేశ పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్‌లో వాషింగ్ మెషీన్లను, వచ్చే ఏడాది మార్చినాటికి రిఫ్రిజిరేటర్లను ఇక్కడి మార్కెట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటి వరకు వీటి తయారీకి రాజ్‌కోట్, నోయిడాలోని సదుపాయాలను వినియోగించుకుంటున్నట్లు హోమ్ గ్రూపు మార్కెటింగ్, సేల్స్ మేనేజింగ్ డైరెక్టర్ రోహిల్ పుజారా తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 20 కోట్ల నుంచి రూ. 25 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో తయారీ కేంద్రాన్ని నెలకొల్పనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నోయిడాలో ఉన్న సదుపాయం ద్వారా 20 వేలకు పైగా యూనిట్లను తయారు చేస్తున్నామని హైదరాబాద్‌లో నెలకొల్పబోయే సదుపాయం సామర్థ్యాలను అప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు.

\ప్రస్తుతం కంపెనీ ఆదాయం ఏడాదికి రూ. 25,000 కోట్లుగా ఉందని తెలిపారు. దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్న ప్యానెళ్ళను హోమ్ స్మార్ట్ టీవీల తయారీలో వినియోగించుకుంటున్నట్లు చెప్పారు.   కంపెనీ ప్రోడక్ట్ హెడ్ జేమ్స్ స్టీఫెన్  హోమ్ స్మార్ట్ టీవీ ప్రత్యేకతల గురించి వివరిస్తూ ఇవి ఇతర స్మార్ట్ టీవీల మాదిరి కాదన్నారు. వీటిలో పొందు పర్చిన రెండు యూఎస్‌బీ పోర్ట్‌లు ఫైల్ ట్రాన్స్‌ఫర్‌కు ఉపయోగడతాయని చెప్పారు. ఎల్‌ఈడీ టీవీ (32 రెండు అంగుళాలది)  రూ. 10,990 కి, స్మార్ట్ టీవీని రూ. 13,490కి అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. కంపెనీ 40, 48, 49, 55 అంగుళాల శ్రేణిలో స్మార్ట్, అల్ట్రా స్మార్ట్ టీవీల ధరలను రూ. 17, 990 నుంచి రూ. 34,990 మధ్య నిర్ణయించింది. స్మార్ట్ 4కే, 64 అంగుళాల టీవీ ధర  రూ. 64,990గా కంపెనీ పేర్కొంది.  ఇక ఇంటర్నెట్‌ను పెద్ద స్క్రీన్‌పై ఆస్వాదించాలనుకునే వారికి హోమ్ టీవి కచ్చితంగా నచ్చుతుందని స్టీఫేన్ అన్నారు. నాణ్యమైన పిక్చర్, సౌండ్ సిస్టమ్ ఇందులో ప్రధాన ఆకర్షణగా ఆయన పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వీవో, లావా మొబైల్ కంపెనీలకు బ్రాండ్ పంపిణీదారుగా ఉన్నా రమేశ్ బాబు హోమ్ స్మార్ట్ టీవీ రాష్ట్ర భాగస్వామిగా వ్యవహరించనున్నట్లు కంపెనీ పేర్కొంది. స్మార్ట్ ఫోన్‌ల కంటే చౌకగా హోమ్ స్మార్ట్ టీవీలు లభించడం నిజంగా గొప్ప విషయమని రమేశ్ బాబు ఆన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో ప్రధాన మొబైల్ దుకాణాల్లో ఈ నెల 10 నుంచి హోమ్ స్మార్ట్ టీవీలు విక్రయానికి అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. నూతన ఫీచర్లతో కామన్ మొబైల్స్

Updated By ManamWed, 09/26/2018 - 22:29

Tecnoహైదరాబాద్: రాబోయే దసరా పండగ సీజన్‌కు మొబైల్ వినియోగదారుల్లో కొత్త ఉత్సాహన్ని నింపిందేకు ట్రాన్సిషస్ ఇండియా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అయిన టెక్నో సంస్థ నూతన ఫీచర్లతో తయారైన కామన్ 2+ (రూ. 8999).  కామన్ ఐ2, (రూ. 10499,) కామన్ 2ఎక్స్ ( రూ. 12499) మొబైల్‌లను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. కామన్ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు కొత్తగా 6.2 అంగుళాల స్క్రీన్, 19.9 సూపర్ ఫుల్ వ్యూ నాచ్ డిస్‌ప్లేతో తయారైంది.  వీటితో పాటు ఈ కామన్ మొబైల్స్‌లో డ్యూయల్ రియర్ కెమెరా, 3750 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం, డ్యూయల్ సిమ్, డ్యూయల్ ఓల్ట్‌లతో శక్తిమంతంగా తయారు చేశారు. నూతనంగా ఈ మొబైల్స్ కోనుగోలు చేసే వినియోగదారులు 50 జీబీ, జియో 4 జీబీ డేటా, రూ. 2250లను ప్రయోజనంగా పొందుతారు. ఈ ఏడాది జనవరిలో ప్రవేశపెట్టిన ఈ కామన్ ఫోర్ట్ ఫోలియో మొబైల్స్ విశేష ప్రజాదరణ పొందాయి. ఈ సందర్భంగా ట్రాన్సిషన్ ఇండియా సీయమ్‌వో గౌరవ్ టికూ మాట్లాడుతూ ‘‘ ఏ విధమైనా కాంతిలోనైనా చక్కటి పిక్చర్స్‌ను, సెల్ఫీల అనుభూతిని వినియోగదారులకు అందించడం మా ప్రధాన లక్ష్యం’’ అని అన్నారు. అంతేకాకుండా మొబైల్ కోనుగోలు చేసిన తర్వాత సంవత్సరంలోపు ఒకసారి టైమ్ స్క్రీన్ మార్పిడి, 100 రోజుల ఉచిత రిప్లేస్‌మెంట్‌లను అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న 950+ సర్వీస్ సెంటర్ల ద్వారా అత్యుత్తమ సేవలను అందించేందుకు సంస్థ కట్టుబడి ఉందని నిర్వహకులు తెలిపారు.షావోమిలో మూడు కొత్త ఫోన్లు

Updated By ManamWed, 09/05/2018 - 22:03

Murali Krishnanహైదరాబాద్: బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ల తయారీ దిగ్గజం షావోమి బుధవారం మూడు కొత్త ఫోన్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. అది  రెడ్‌మి 6ఏ, రెడ్‌మి 6, రెడ్‌మి6 ప్రోలను కంపెనీ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మురళీకృష్ణన్  హైదరాబాద్‌లో బుధవారం ఆవిష్కరించారు.  ఇంతకు ముందు విడుదల చేసిన ఫోన్‌ల కంటే మెరుగైన ఫీచర్‌లతో ఎంఐ 6 సిరీస్‌ను తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కొత్త సీరిస్‌లన్నింటిలోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫేస్ అన్‌లాక్, రెండు సిమ్‌కార్డు స్లాట్‌లకు వీవోఎల్‌టీఈ సపోర్ట్ ఉండనుంది. వీటితోపాటు మెమొరీ కార్డును పెట్టుకునే సదుపాయం, వెనుకవైపు, ముందు వైపు కెమేరాల్లో  ఏఐ పోర్ట్‌రైట్ మోడ్, ఆటో ఫేస్ బ్యూటి, పూర్తి హెచ్‌డీ డిస్‌ప్లేలను  పొందుపరిచినట్లు ఆయన తెలిపారు. రెడ్‌మి 5ఏ ప్రపంచంలోనే అధిక అమ్మకాలను సాధించిన ఫోన్‌గా నిలిచిందని ఆయన తెలిపారు. ఇంతకు ముందు సిరీస్‌ల లాగే రెడ్‌మి 6 సిరీస్‌ను కూడా ఆదరిస్తారని భావిస్తున్నట్లు ఆయన బుధవారం నాడిక్కడ ఒక కార్యక్రమంలో చెప్పారు. రెడ్‌మి6ఏ (2జీబీ ర్యామ్, 16 జీబీ రోమ్ ధర రూ. 5,999), 2జీబీ ర్యామ్, 32 జీబీ రోమ్ మోడల్ (రూ. 6,999) లభించనున్నాయి. రెడ్‌మి6 ఫోన్ (3జీబీ ర్యామ్ 32 జీబీ రోమ్  రూ. 7,999), (3జీబీ ర్యామ్ 64 జీబీ రోమ్ వేరియంట్  రూ. 9,499) లకు లభించనున్నాయి. రెడ్‌మి6ప్రో 3జీబీ ర్యామ్, 32 జీబీ రోమ్ మోడల్ ధర రూ. 10,999గా, 4జీబీ ర్యామ్, 64 జీబీ రోమ్ వేరియంట్ ధర రూ. 12,999గా ఉండనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ కొత్త సీరిస్ ఫోన్‌లన్నీ మేడ్ ఇన్ ఇండియా కావడం విశేషం.‘నోకియా 6.1 ప్లస్’ వచ్చేసిందోచ్..!

Updated By ManamTue, 08/21/2018 - 20:57

Nokia 6.1 Plus, Nokia 6.1 Plus specifications, Corning Gorilla Glass 3, smartphoneస్మార్ట్ ఫోన్ యూజర్లకు శుభవార్త. నోకియా బ్రాండ్‌పై మరో స్మార్ట్‌ఫోన్‌ భారత్ మార్కెట్లలోకి వచ్చేసింది. నోకియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్‌ భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ‘నోకియా 6.1 ప్లస్‌’ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇటీవల హాంకాంగ్‌లో నోకియా గ్లోబల్‌ వెర్షన్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే నోకియా విడుదల చేసిన ఫోన్ మోడల్స్ కాకుండా 6.1 ప్లస్‌ డిజైన్‌‌తో సరికొత్తగా రూపొందించింది.

యాపిల్‌ ఐఫోన్ ఎక్స్ లా టాప్‌లో నాచ్‌, ఫుల్‌ డిస్‌ప్లేతో స్మార్ట్ ఫోన్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్‌ తయారుచేసింది. ఇంతకీ నోకియా 6.1 ప్లస్‌ ధర ఎంతో తెలుసా? రూ. 15,999. ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్‌, నోకియా ఆన్‌లైన్ స్టోర్లలో ఈ నెల 30 నుంచి నోకియా 6.1 ప్లస్ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. మంగళవారం ఈ ఫోన్లకు కొనుగొలు చేసేందుకు ప్రీఆర్డర్లు ప్రారంభమయ్యాయి.

నోకియా 6.1 ప్లస్‌ ఫీచర్లు.. ఇవే..

- 64 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ కార్డు
- మెమొరీ కార్డుతో 400 జీబీ వరకు స్టోరేజ్‌ 
- స్నాప్‌డ్రాగన్‌ 636 ప్రాసెసర్‌
- 4 జీబీ ర్యామ్‌
- 5.8 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
- 3060 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం
- టైప్‌ సిపోర్ట్‌
- 16 మెగాపిక్సెల్‌ ఫ్రెంట్ కెమెరా
- 16 మెగాపిక్సెల్‌, 5 మెగాపిక్సెల్‌తో బ్యాక్ రెండు కెమెరాలు
- ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌రోజులో 150సార్లు స్మార్ట్‌ఫోన్ వంకే!

Updated By ManamSun, 05/20/2018 - 23:15
  • సమాచారం మిస్సవుతామని భయం.. కేంద్రీయ వర్సిటీల విద్యార్థుల చదువు

  • ఆరోగ్యంపైనా తీవ్రమైన ప్రభావం.. 63% విద్యార్థులు ఏడు గంటలు అంకితం

  • కంప్యూటర్ బదులు వాడేస్తున్నవారు 80%.. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ సర్వే వెల్లడి

smartphone-addictionన్యూఢిల్లీ: కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చదువున్న విద్యార్థులు రోజులో సగటున 150 సార్లు తమ స్మార్ట్‌ఫోన్ వంక చూడకుండా ఉండలేకపోతున్నారట! ఫోన్ ముట్టుకోకపోతే ఎక్కడ సమాచారం మిస్సవుతామోనన్న భయం, ఉద్వేగం, గాబరా వారిలో పెరిగిపోతోందట! ఇది వారి చదువుతో పాటు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ (ఐసీఎస్‌ఎస్‌ఆర్) కలిసి సంయుక్తంగా దేశ వ్యాప్తంగా ఉన్న 20 కేంద్రీయ వర్సిటీల్లో అధ్యయనం చేశాయి. స్మార్ట్‌ఫోన్ డిపెండెన్సీపై చేసిన ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ప్రతి వర్సిటీలో 200 మంది విద్యార్థులను ప్రశ్నించి వారి నుంచి పరిశోధకులు వివరాలను సేకరించారు. విద్యార్థులు సగటున 150 సార్లు తమ ఫోన్ చూస్తున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. అయితే కేవలం 26 శాతం విద్యార్థులు మాత్రమే తమ ఫోన్‌ను కాల్స్ కోసం వినియోగిస్తున్నారు. మిగిలిన వారంతా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు, గూగుల్ సెర్చ్, సినిమాలు చూడడం వంటి వినోదాలు, సమాచార సేకరణ కోసం స్మార్ట్ ఫోన్‌ను వాడుతున్నారని సర్వే ప్రాజెక్టు డైరెక్టర్ మహ్మద్ నవీద్ ఖాన్ వెల్లడించారు. కనీసం 14 శాతం మంది రోజులో కనీసం మూడు గంటలు, అంతకన్నా తక్కువ సమయం ఫోన్‌కు అతుక్కుని పోతున్నారు. ఇక 63 శాతం విద్యార్థులు కనీసం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు స్మార్ట్ ఫోన్‌కు అంకితమవుతున్నారు. ఇక 23 శాతం విద్యార్థులు రోజూ తమ సమయంలో 8 గంటలు వృథా చేసుకుంటున్నారని పరిశోధకులు వెల్లడించారు. ఇదిలా ఉండగా కంప్యూటర్‌కు బదులుగా స్మార్ట్‌ఫోన్ యాప్స్‌తో నడిపించేస్తున్నవారు 80 శాతం వరకు ఉన్నారని సర్వేలో తేలింది.సేవలన్నీ అరచేతిలోనే 

Updated By ManamMon, 02/19/2018 - 01:47
  • మొబైల్ యాప్స్ ద్వారా ప్రభుత్వ సేవలు.. ప్రతి పనికి ఓ యాప్

  • కాలుకదపకుండా పనులు పూర్తి

  • సమాచారం మొదలు.. దరఖాస్తు దాకా

  • పథకాల నుంచి ఉద్యోగ ఖాళీల వరకు

  • అన్ని వివరాలు చెప్పే ‘యాప్’లు

smartphoneహైదరాబాద్: ప్రభుత్వ సేవలు పొందాలంటే పనులన్నీ మానుకొని కార్యాలయాలకు పదేపదే తిరగాల్సి రావడం ఏదో ఒక సందర్భంలో ప్రతీ వారికీ అనుభవమే! దీనికి కారణాల మాటెలా ఉన్నా.. సాంకేతికత దీనికి పరిష్కారం చూపిస్తోంది. బిల్లులు కట్టాలన్నా.. సమాచారం తెలుసుకోవాలన్నా.. ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలన్నా ఇంట్లోంచి కాలు బయటపెట్టకుండానే పూర్తిచేసే సౌలభ్యం కలిగిస్తోంది. కూర్చున్న చోటి నుంచి లేవాల్సిన అవసరమే లేకుండా ఎంచక్కా పనులన్నీ చక్కబెట్టుకునే అవకాశం తీసుకొచ్చింది. అరచేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్‌లో ఒక యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే బాధను తప్పిస్తోంది. ప్రజా సేవకోసం టెక్నాలజీ వాడకంలో తెలంగాణ కూడా పరుగులు పెడుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని ముఖ్యమైన యాప్‌ల వివరాలు మనం పాఠకుల కోసం..

టీ శాట్:
ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వీడియోలు, ఉద్యోగాల ప్రకటనలు, భర్తీలు, ఖాళీల వివరాలు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రభుత్వ కార్యక్రమాలు, నిరుద్యోగులకు అంశాల వారీగా యాప్‌లో తరగతులు కూడా చూడొచ్చు. వివిధ ఉద్యోగ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఉపయోకరమైన సమాచారాన్ని అంశాల వారీగా యాప్‌లో అందుబాటులో ఉంటుంది.

కౌశల్ ఫంజియాప్:
యువతలో చదువుతో పాటు, నైపుణ్యం పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం దీన్‌దయాల్ ఉపాధ్యాయ కౌశల్ యోజన కింద ఈ యాప్‌ను రూపొందించింది. ఇందులో తమ పేర్లు, వివరాలు నమోదు చేసుకుని కాలానుగుణంగా మారుతూ యువత తమ నైపుణ్యాలను, భావవ్యక్తీకరణను పెంపొందించవచ్చు. పదో తరగతి నుంచి డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారికి వివిధ కోర్సులను అనుగుణంగా నెల నుంచి 3 నెలల పాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి వివిధ సంస్థల్లో ఉపాధి కల్పిస్తుంది.

టీ రేషన్:
టీ రేషన్ యాప్ ద్వారా మన రేషన్ కార్డుకు కేటాయించిన సరకులు, రేషన్ షాపునకు వచ్చిన సరకులు ప్రస్తుత నిల్వలు, కీ రిజిస్టర్ వివరాలు, జిల్లాల వారీగా రేషన్ కార్డుల వివరాలు, ఆధార్ కార్డుతో రేషన్‌కార్డు లింకు సంబంధిత వివరాలతో పాటు, రేషన్‌కార్డుల ద్వారా ప్రతి నెల జరిగిన లావాదేవీలు మొదలైన వివరాలు తెలుసుకోవచ్చు.

టీఎస్-ఎస్‌ఎస్‌ఏ యాప్:
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు పోషక విలువలు గల మధ్యాహ్న భోజనాన్ని అందిస్తూ విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీని కోసం నూతనంగా టీఎస్-ఎస్‌ఎస్‌ఏ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. పాఠశాలల పర్యవేక్షణ అధికారుల తనిఖీల సమాచారాన్ని ఈ యాప్ ద్వారా రాష్ట్ర స్థాయి అధికారులకు తెలుపవచ్చు. పాఠశాలల పరిశీలన నివేదికలను అందరూ చేసేందుకు వీలుగా యాప్‌లో అందుబాటులో ఉంటాయి.

జీఎస్‌టీ రేట్ ఫైండర్:
కేంద్రం తెచ్చిన వస్తు సేవల పన్ను విధానంలో వివిధ వస్తువులకు ప్రభుత్వం విధించే పన్నుల వివరాలు దీంతో తెలుసుకోవచ్చు. ఇందులో.. 0 నుంచి 28 వరకు గల వివిధ పన్ను శాతం, వస్తువు పన్నుల జాబితా ద్వారా ఏయే వస్తువుకు ఎంత శాతం పన్ను విధించారో తెలుసుకోవచ్చు.

టీ వాలెట్:
నగదు రహిత లావాదేవీల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన యాప్ టీ వాలెట్.. ఈ యాప్ ద్వారా ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు సంబంధించి బిల్లుల చెల్లింపులతో పాటు, నగదు బదిలీ ఇతర సేవలను వినియోగించుకోవచ్చు.
దివ్యాంగ సారధి:

దివ్యాంగులు తమ రవాణా, ఇతర సౌకర్యాలలో రాయితీ వివరాలు, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు జాతీయ ఉపకార వేతనాలు విద్యాభ్యాసంకోసం రుణాలు, ప్రభుత్వ పథకాలు, వివిధ ప్రభుత్వ సంస్థలు అవి కల్పించే సౌకర్యాలు తదితర వివరాలను ఈ యాప్‌తో తెలుసుకోవచ్చు.

మరికొన్ని యాప్‌లు 
వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సు వంటి వివరాలకు- ఆర్‌టీఏ ఎం వాలెట్
ధ్రువీకరణ పత్రాలు, ధ్రువపత్రాల నిక్షిప్తంకోసం ‘డిజిలాకర్’ యాప్ ఉపయోగపడుతుంది.
నగదు బదిలీకోసం ‘బీమ్’ యాప్
జాతీయ ఉపాధి హామీ పథకం వివరాలను తెలిపే -జనమన్‌రేగా!
ఇంటర్ విద్య వివరాల కోసం-డిస్క్‌యాప్ 
ఆధార్ కోసం- ఎమ్ ఆధార్ యాప్ 
1 నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలకోసం- టీఎస్ ఎస్‌సీఈఆర్‌టీ బుక్స్
రెవెన్యూ పహాణీకోసం- తెలంగాణ ల్యాండ్ రికార్డు ఇన్‌ఫో యాప్
అధ్వాన రహదారుల స్థితులపై ఫిర్యాదు చేయవడానికి- మేరిసడాక్ యాప్ 
పోస్టల్ చిరునామా, ప్రభుత్వ శాఖల చిరునామాకోసం- పోస్ట్ ఇన్‌ఫ్లో 
వీటితో పాటు చాలా బ్యాంకులు వారి ఖాతాదారుల సౌలభ్యం కోసం యాప్‌లు రూపొందించాయిచార్జింగ్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొట్టేదే లేదట!

Updated By ManamSun, 01/07/2018 - 19:25

bntస్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారు ముఖ్యంగా పరిగణనలోకి తీసుకునే అంశం బ్యాటరీ సామర్థ్యం. స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు బ్యాటరీ చార్జింగ్ ఉండటం లేదని తెగ బాధపడిపోతుంటారు. అయితే తమ స్మార్ట్‌ఫోన్ కొన్నవారికి ఆ తిప్పలు ఉండవంటోంది చైనా స్మార్ట్‌‌ఫోన్ సంస్థ. చైనా స్మార్ట్‌ఫోన్ సంస్థ డూగీ బీఎల్12000 మోడల్ పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను తయారుచేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ మోడల్‌ పేరులోనే దీని ప్రత్యేకత ఏంటో ఆ కంపెనీ చెప్పేసింది. 12,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్ రూపొందించినట్లు సంస్థ తెలిపింది. అంతేకాదు, ఆరు అంగుళాల స్ర్కీన్, 8జీబీ ర్యామ్‌తో ఈ ఫోన్ పనిచేస్తుందని పేర్కొంది. ఈ ఫోన్‌కు ఫ్రంట్, బ్యాక్ డ్యుయల్ కెమెరా ఉండటం విశేషం. 16 ఎంపీ బ్యాక్ కెమెరా, 13ఎంపీ అడిషనల్ కెమెరాతో పాటు 16ఎంపీ ఫ్రంట్ కెమెరా, 8ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా ఫీచర్ ఈ ఫోన్ మరో ప్రత్యేకత. వైడ్ యాంగిల్ కెమెరాతో గ్రూప్ సెల్ఫీలు తీసుకోవచ్చని సంస్థ తెలిపింది.ఫోన్‌ పక్కనుంటే మైండ్‌ పనిచేయదని తేల్చిన సర్వే

Updated By ManamFri, 09/22/2017 - 19:44

స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వచ్చి పాతికేళ్లు కూడా నిండి ఉండదు. కానీ వచ్చీరాగానే అవి మన జీవితాలని ఆక్రమించేసుకున్నాయి. దానికి తోడు ఇంటర్నెట్‌ కూడా చవకగా మారిపోవడంతో... చేతిలో ఓ స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు, ప్రపంచం మనల్ని వెలివేసినా పర్వాలేదు అనే ధైర్యం మనది. కానీ అదే స్మార్ట్‌ ఫోన్‌ కొంపలు ముంచుతోంది. స్మార్ట్‌ఫోన్‌ను అదే పనిగా వాడటం ద్వారా అనేక రకాల వాద్యులు, జబ్బులు సంభవించే అవకాశం ఉంది. దీనికి తోడు  స్మార్ట్‌ఫోన్‌ మనకు కంటిజబ్బులు, నిద్రలేమిలాంటి సమస్యలని తెచ్చిపెడుతోంది. అసలు స్మార్ట్‌ఫోన్‌ పక్కన ఉంటే మన మెదడు కూడా సరిగా పనిచేయదంటూ ఓ పరిశోధన వెలుగులోకి వచ్చింది. అదేమిటో మీరే చూడండి...

టెక్సాస్‌ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు, మన మెదడు మీద స్మార్ట్‌ఫోన్‌ పనితీరుని విశ్లేషించాలనుకున్నారు. స్మార్ట్‌ఫోన్‌ అదేపనిగా వాడటం ద్వారా వచ్చే మార్పుల గురించి తెలియజేయడానికి ఆయన ఓ పరిశోధన చేశారు. అందుకోసం వారు ఓ 800 మంది ఫోన్‌ వాడకందారులను పిలిపించారు. వీరిని ఓ కంప్యూటర్‌ ముందు కూర్చోబెట్టి కొన్ని చిన్న చిన్న సమస్యలకు జవాబులను అందించమని చెప్పారు. అప్పటికప్పుడు కాస్త మెదడుని పెడితే... ఎవౖరెనా సులువుగా జవాబు చెప్పగలిగే ప్రశ్నలే అవన్నీ! 

అభ్యర్థుల స్మార్ట్‌ఫోన్‌ పక్కగదిలో ఉండటమో, టేబుల్‌ మీదే ఉండటమో, జేబులోనే ఉండటమో బట్టి వారు జవాబులని ఇచ్చే సామర్థ్యంలో తేడా ఉందేమో గమనించారు. ఈ పరిశీలనలో ఖచ్చితౖమెన తేడాలు కనిపించాయి. పక్కగదిలో ఫోన్‌ పెట్టేసినవారు ఇతరులకంటే చక్కగా జవాబులు రాశారట. ఫోన్‌ అభ్యర్థికి ఎంత దగ్గరగా ఉంటే, సమస్య మీద అతని ఏకాగ్రత అంతగా బలహీనపడినట్లు గ్రహించారు. ఫోన్‌ సైలెంటులో ఉందా, తిరగేసి ఉందా లాంటి పరిస్థితులతో సంబంధం లేకుండా ఈ ఫలితాలు కనిపించాయి.

ఈ ప్రయోగానికి పొడిగింపుగా మరో సందర్భాన్ని సృష్టించారు పరిశోధకులు. ఈసారి అభ్యర్థులను- ఫోన్‌తో తమ అనుబంధం ఎలా ఉంటుంది? అని ప్రశ్నించారు. కొందరు అభ్యర్థులు అబ్బే మేము ఫోన్‌ లేకుండా నిమిషం కూడా బతకలేము అని చెప్పారు. మరికొందరు ఫోన్‌ కేవలం అవసరం కోసమే! అదే మా సర్వస్వం కాదు. దానికి పెద్దగా సమయాన్ని కేటాయించం అని తేల్చారు. వీళ్లందరి మీదా పైన పేర్కొన్న ప్రయోగాన్నే అమలుచేశారు. ఎవౖరెతే ఫోన్‌ లేకుండా గడపలేమని అన్నారో... వారు కంప్యూటర్‌లో కనిపించిన చిన్నపాటి సమస్యలకి కూడా జవాబుని అందించలేకపోయారట. దీని ద్వారా తెలిసింది ఏమిటంటే.. ఫోన్‌ వాడటం ద్వారా చిన్న చిన్న ప్రశ్నలకు కూడా ఫోన్‌ ఇంటర్నెట్‌‌పై ఆధారపడడంతో సమాధానాలు చేయలేకపోయారు. ఫోన్‌తో చాలా జాగ్రత్తలు వహించాలని తెలిపారు. 

ఏతావాతా తేలిందేమిటంటే, ఫోన్‌ దగ్గరలో ఉంటే చాలు- ఏదన్నా కాల్‌ వస్తుందేమో, వాట్సప్‌ మెసేజి వచ్చిందేమో, చార్జింగ్‌ ఉందో లేదో, భార్యకి కాల్‌ చేయాలి కదా, ఆన్‌లై‌న్‌లో డబ్బులు పంపించాలిగా లాంటి సవాలక్ష సందేశాలు మనసుని గిలిపెడుతూ ఉంటాయి. వాటిని పట్టిం చుకోకుండా పనిచేసు కోవాలి అని మనసుని బలవంతపెట్టిన కొద్దీ మన ఏకాగ్రత మరింతగా చెదిరిపోతుంది. ఫలితం! మన అవసరం కోసం కనిపెట్టిన స్మార్ట్‌ఫోన్‌ జీవితాలను కమ్ముకుని ఉంటోంది.

Related News