Rs.1 Crore

రూ.కోటి విలువైన రద్దైన నోట్లు సీజ్..

Updated By ManamMon, 09/03/2018 - 14:02
Police arrested four men with demonetised notes with the face value of Rs 1 crore

చెన్నై : పెద్ద నోట్లు రద్దు చేసి ఏడాదిన్నర పూర్తి కావస్తున్నా... ఇంకా ఆ నోట్లు పెద్ద ఎత్తున వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా తమిళనాడు మధురైలో రూ.కోటి విలువైన పెద్ద నోట్లను నిన్న పోలీసులు సీజ్ చేశారు. ఇందుకు సంబంధించిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఓ కారులో ఈ నగదును తరలిస్తుండగా... వాహనాల తనిఖీల్లో భాగంగా ఈ నోట్లు బయటపడ్డాయి. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.



కలకలం: భారీగా పాతనోట్లు ప్రత్యక్షం

Updated By ManamSun, 01/14/2018 - 12:56

Oor Pakkam | Old Currency Notes worth Rs.1 Crore seizedచెన్నై: పాత నోట్లు రద్దయ్యి సుమారు ఏడాదికి పైగా కావస్తున్న విషయం అందరికీ తెలిసిందే. నోట్లు మార్చుకోవడానికి డెడ్ లైన్ ఇచ్చారు.. అది అయిపోంది కూడా.! ఇప్పటికే పాతనోట్లను రీసైక్లింగ్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. అయితే రద్దయిన నాటి నుంచి ఇవాళ్టి వరకూ దేశంలో ఎక్కడో ఒకచోట పాతనోట్లు ప్రత్యక్షమవుతుండటం గమనార్హం.

తాజాగా.. తమిళనాడులో భారీగా పాతనోట్లు పట్టుబడ్డాయి. తురయేరు చెక్‌పోస్ట్ దగ్గర కోటి రూపాయల 1000, 500 నోట్లను పోలీసులు స్వాధనంగా చేసుకున్నారు. ఈ నోట్లను తరలిస్తున్న నలుగుర్ని అరెస్ట్ చేయడం జరిగింది. తిరుచ్చి నుంచి సేలంకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు మీడియాకు వివరించారు. ప్రస్తుతం నలుగుర్నీ ప్రత్యేకంగా పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు ఈ పాత నోట్లు ఎక్కడికి తరిస్తున్నారు? ఎందుకు తరలిస్తున్నారు? ఎక్కడ మార్చుకునేందుకు తరిస్తున్నారు? ఈ మార్పిడి వెనుక ఉన్న గ్యాంగ్ ఎవరు? నోట్లు ఎక్కడ మారుస్తారు? ప్రభుత్వ అధికారులే దగ్గరుండి ఈ పనిచేయిస్తున్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. త్వరలోనే నిజానిజాలు తేలుస్తామని పోలీసు ఉన్నతాధికారి మీడియాకు వివరించారు.





Related News