nani

ఆ ‘దేవదాస్’ పుట్టిననాడే ఈ ‘దేవదాస్’ ఆడియో వేడుక

Updated By ManamTue, 09/18/2018 - 13:09

Devadasనాగార్జున, నాని హీరోలుగా యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన చిత్రం ‘దేవదాస్’. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రంలో అకాంక్ష సింగ్, రష్మిక మందన్న హీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్ర ఆడియో వేడుకకు ముహూర్తం ఖరారు అయ్యింది. మహానటుడు ఏఎన్నార్ జయంతి సందర్భంగా ఈ నెల 20న ఈ చిత్ర ఆడియో వేడుకను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే పోస్టర్లు, టీజర్, పాటలతో ఆకట్టుకున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో మంచి అంచనాలే ఉన్నాయి.

 చాలా రోజుల తరువాత నా పక్కన అందమైన అమ్మాయి: నాగ్

Updated By ManamTue, 09/18/2018 - 00:03

Akankshaనాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన చిత్రం దేవదాస్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో నాగార్జున సరసన ‘మళ్లీ రావా’ ఫేమ్ ఆకాంక్ష సింగ్, నాని సరసన రష్మికా నటించగా.. తాజాగా ఆకాంక్ష ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో జాహ్నవీ అనే పాత్రలో ఆకాంక్ష నటిస్తుండగా.. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న నాగార్జున.. ‘‘చాలా రోజుల తరువాత నా పక్కన ఒక అందమైన అమ్మాయి’’ అంటూ కామెంట్ పెట్టారు. ఇక వీరిద్దరికి సంబంధించిన ఓ పాటను సోమవారం సాయంత్రం విడుదల చేయనున్నారు. కాగా వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించిన విషయం తెలిసిందే.
 

image

 ఫస్ట్‌ టైం మిమ్మల్ని మెట్రోలో చూసినప్పుడే..

Updated By ManamMon, 09/17/2018 - 13:27

Rashmika Mandannaనాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన మల్టీస్టారర్ చిత్రం ‘దేవదాస్’. ఇందులో నాని సరసన రష్మిక మందన్న నటిస్తుండగా.. తాజాగా ఆమెకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పూజా అనే పాత్రలో రష్మిక కనిపిస్తుండగా ఆమె లుక్‌ను షేర్ చేసిన నాని.. ‘‘ఫస్ట్ టైం మిమ్మల్ని మెట్రోలో చూసినప్పుడే.. లోపల ఏదో రింగ్ అయ్యింది పూజా గారు.. మళ్లీ ఎప్పుడు’’ అంటూ కామెంట్ పెట్టాడు. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. 

 కన్ఫర్మ్ చేసిన అనిరుధ్

Updated By ManamThu, 09/06/2018 - 09:48

Nani, Anirudhప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునతో కలిసి ‘దేవదాసు’ చిత్రంలో నటిస్తున్న నాని.. ఆ తరువాత ‘మళ్లీ రావా’ ఫేమ్ గౌతమ్ తన్నూరి దర్శకత్వంలో ‘జెర్సీ’లో నటించనున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. ఈ చిత్రానికి తమిళ స్టార్ మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ సంగీతం అందించనున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. తాజాగా ఈ విషయాన్ని అనిరుధ్ కన్ఫర్మ్ చేశాడు.

ఇండస్ట్రీకి నాని వచ్చి పది సంవత్సరాలు పూర్తికాగా ఈ విషయాన్ని తెలిపిన అనిరుథ్.. నాని జెర్సీ చిత్రానికి సంగీతం అందిస్తున్నట్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా నాని, అనిరుధ్‌కు వెల్‌కమ్ అంటూ చెప్పాడు. కాగా ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయంలో నటిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 శైలజ రెడ్డి అల్లుడు కోసం వస్తున్న దేవదాసులు 

Updated By ManamWed, 09/05/2018 - 13:21

nag naniనాగచైతన్య హీరోగా, రమ్యకృష్ణ కీలకపాత్రలో రూపొందిన చిత్రం 'శైలజా రెడ్డి అల్లుడు'. ఈ చిత్రానికి మారుతీ దర్శకత్వం వహించారు. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ 9వ తేదీన జరగనుంది.

ఇక ఈ వేడుకకు దేవదేసు సినిమాలో నటిస్తున్న నాగార్జున, నాని అతిధులుగా హాజరు కానున్నారు. చైతూ కోసం నాగార్జున వస్తుండగా.. మారుతి కోసం నాని రానున్నట్లు తెలుస్తోంది. కాగా మారుతీ గతంలో నానికి ‘భలే భలే మగాడివోయ్' చిత్రంతో మంచి హిట్‌ను అందించిన విషయం తెలిసిందే. అందుకోసమే నాని కూడా వస్తున్నట్లు తెలుస్తోంది.నాని స్థానంలో...

Updated By ManamFri, 08/31/2018 - 00:12

imageకొత్త కాన్సెప్టులతో విజయాలను అందుకున్న తెలుగు సినిమాలను ఇతర భాషలకు చెందిన నిర్మాతలు తెరకెక్కించడానికి ఆసక్తి చూపుతున్నారు. ‘అత్తారింటికి దారేది, టెంపర్, నాన్నకు ప్రేమతో’ వంటి చిత్రాలను తమిళంలో రీమేక్ చేయబోతున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో ‘నిన్నుకోరి’ సినిమా కూడా చేరింది. వివరాల్లోకెళ్తే.. నాని, ఆదిపినిశెట్టి, నివేదా థామస్ ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం ‘నిన్నుకోరి’.

కోనవెంకట్, డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించగా శివ నిర్వాణ సినిమాను డైరెక్ట్ చేశారు. మినిమం బడ్జెట్‌తో.. పెళ్లి తర్వాత ప్రేమ అనే అంశంతో రూపొందిన ఈ చిత్రం పెద్ద విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తమిళంలో ఈ సినిమాను రీమేక్ చేయబోతున్నారు. తమిళ రీమేక్‌లో నాని స్థానంలో వైభవ్ నటించనున్నారు. ప్రముఖ దర్శకుడు ఎ.కోదండ రామిరెడ్డి తనయుడైన వైభవ్ తమిళ సినిమాల్లో ఎక్కువగా నటిస్తున్న సంగతి తెలిసిందే.తమ్ముడు చూడాలనుందన్నారు.. ఇంతలోనే వదిలి వెళ్లారు

Updated By ManamWed, 08/29/2018 - 10:14

Harikrishnaసినీ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆయనతో తమ అనుబంధాన్ని చెప్పుకుంటూ పలువురు సినీ ప్రముఖులు హరికృష్ణకు తమ సంతాపాన్ని ప్రకటించారు. 

‘‘ ‘చాలా రోజులు అయ్యింది తమ్ముడు నిన్ను చూసి, కలవాలి తమ్ముడు’ కొన్ని రోజుల క్రితం నాతో ఈ మాటలు మాట్లాడిన ఆయన ఇప్పుడు దూరంగా వెళ్లిపోయారు. చాలా బాధగా ఉంది. నిన్ను మిస్ అవుతున్నా అన్నయ్య‘‘ అంటూ అక్కినేని నాగార్జున ట్వీట్ చేశారు. హరికృష్ణ హఠాన్మరణం చాలా బాధించిందని, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కుటుంబానికి తమ సంతాపం అంటూ పలువురు ప్రముఖులు తెలిపారు. వారిలో మోహన్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేశ్ బాబు, మంచు మనోజ్, నాని, కాజల్ అగర్వాల్, రామ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, సాయి బెల్లంకొండ, జెనీలియా, రకుల్ ప్రీత్ సింగ్, లక్ష్మీ మంచు,  దేవీ శ్రీ ప్రసాద్, శ్రీనువైట్ల, పూజా హెగ్డే, గౌతమి, శరత్ కుమార్, దర్శకుడు మారుతి, అనసూయ, గోపిచంద్ మలినేని తదితరులు ఉన్నారు.

 క్రేజీ కాంబో మరోసారి..?

Updated By ManamTue, 08/21/2018 - 12:34

Naniకోలీవుడ్ స్టార్ డైరక్టర్ గౌతమ్ మీనన్‌కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆయన తెరకెక్కించిన అనేక చిత్రాలు ఇక్కడ కూడా విడుదలై మంచి విజయాన్ని సాధించాయి. అంతేకాదు వెంకటేశ్, నాగచైతన్య, నాని వంటి తెలుగు హీరోలతోనూ ఆయన సినిమాలను తెరకెక్కించారు. ఇక ప్రస్తుతం విక్రమ్ హీరోగా ధృవ నచ్చిత్రమ్‌ను తెరకెక్కిస్తున్న మీనన్.. త్వరలో నానితో సినిమా చేయబోతున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఒక ప్రేమకథను తయారుచేసుకున్న గౌతమ్ మీనన్.. దానిని నానితో తీయాలని అనుకుంటున్నాడట. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇంతకుముందుచ్చిన ఎటో వెళ్లిపోయింది మనసు పెద్దగా ఆడకపోయినప్పటికీ.. యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. అదే నమ్మకంతోనే ఇప్పుడు ఈ కథను నాని ఓకే చెబుతాడని గౌతమ్ మీనన్ భావిస్తున్నట్లు సమాచారం.గన్‌తో నాగ్.. స్టెతస్కోప్‌తో నాని

Updated By ManamTue, 08/07/2018 - 17:23

Nagarjuna, Nani ‘Devadas’ first look

అక్కినేని నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో వస్తున్న ‘దేవదాస్’. ఈ మూవీపై రోజురోజుకు అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ మల్టీస్టారర్ చిత్రంపై అంచనాలు సైతం పెరిగిపోతున్నాయి. కాగా ఇక్కటికే ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌తో ఉన్న చిన్నపాటి పోస్టర్‌ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ తాజాగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ స్టిల్‌ను చూసిన అక్కినేని, నాని అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇప్పుడీ పోస్టర్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఈ పోస్టర్‌లో నాగ్, నాని ఇద్దరూ ఒకే పడుకుని నిద్రిస్తున్నారు. నాగార్జున ఓ చేతిలో వైన్ బాటిల్‌.. మరో చేత్తో గన్ పట్టుకుని ఉన్నాడు. ఇక నాని విషయానికొస్తే సరికొత్త లుక్‌లో స్టెతస్కోపు‌, పుస్తకాలతో దర్శనమిచ్చాడు. కాగా నాగ్ డాన్‌గా.. నాని డాక్టర్‌గా ఈ చిత్రంలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ ఫస్ట్‌లుక్‌ను నాగ్, నాని తన ట్విట్టర్ ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్ టైన‌ర్‌లో నాగార్జున‌కు జోడీగా ఆకాంక్ష సింగ్.. నానికి జోడీగా ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివ‌రిద‌శ‌లో ఉంది. సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. వైజ‌యంతి మూవీస్ సంస్థ‌పై అశ్వినీదత్ నిర్మాత‌గా.. సిధ‌ర్మ‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో దేవ‌దాసు వ‌స్తుంది. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్‌ లోగోకు మంచి రెస్సాన్స్‌ వచ్చింది.

న‌టీన‌టులు
నాగార్జున‌, నాని, ర‌ష్మిక మంద‌న్న‌, ఆకాంక్ష సింగ్, న‌రేష్ వికే, బాహుబ‌లి ప్రభాక‌ర్, రావు ర‌మేష్, వెన్నెల కిషోర్, అవ‌స‌రాల శ్రీ‌నివాస్, స‌త్య‌
బ్యాన‌ర్: వైజ‌యంతి మూవీస్
నిర్మాత‌: అశ్వినీద‌త్
ద‌ర్శ‌కుడు: శ్రీ‌రామ్ ఆదిత్య‌
సినిమాటోగ్ర‌ఫ‌ర్: శ్యామ్ ద‌త్ సైనూదీన్
సంగీత ద‌ర్శ‌కుడు: మ‌ణిశ‌ర్మ‌జనసేన ‘రెడ్ రెవల్యూషన్’..

Updated By ManamMon, 08/06/2018 - 18:12

Janasena, Pawan Kalyan, Janasena Campaign, solve the village issue, red revolution, Kasthuri Sathya prasad, Naniనిడదవోలు (పశ్చిమగోదావరి): పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ వినూత్న ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రజాసమస్యలపై స్థానికంగా అధ్యయనం చేసి, ఆయా సమస్యల పరిష్కారంపై రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ‘రెడ్ రెవల్యూషన్’ (సమస్యల అవగాహన యాత్ర) అనే పేరుతో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో జనసేన స్థానిక నేతలు ప్రజా సమస్యల ప్రస్తావన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిడదవోలు నియోజకవర్గ కార్యకర్తలందరు ఆదివారం కోరుమామిడి,తాడిమళ్ల, కాటకొటేశ్వరం, ఉనకరమిల్లి గ్రామాల్లో తిరుగుతూ సమస్యల అవగాహన యాత్రలో భారీ ఎత్తున పాల్గొని జయప్రదం చేశారు. గ్రామాలలో ప్రధాన సమస్యలైన రోడ్లు, నీటిపారుదల, పారిశుధ్యం, వీది దీపాలు వాటిపై తీవ్రస్థాయిలో స్పందించారు. 

గ్రామాలన్నీ తిరుగుతూ వివిధ పార్టీల నాయకులు, ప్రజలతో చర్చించి, ప్రధాన సమస్యలను గుర్తించి, వాటిని గ్రామంలోని ఒక గోడపై రాస్తున్నారు, గోడకు ఎరుపు రంగు వేసి దానిపై తెలుపు రంగులో సమస్యలను రాస్తున్నారు. నిడదవోలు నియోజకవర్గంలో జనసేన నాయకుడు కస్తూరి సత్య ప్రసాద్ (నాని) ఈ రెడ్ రెవల్యూషన్‌కు నాయకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రెడ్ రెవల్యూషన్ టీం గుర్తించిన సమస్యలన్నింటినీ పార్టీలు తమ ఎన్నికల మానిఫెస్టోలో తప్పనిసరిగా చేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. సమస్యలకు పరిష్కారమయ్యే వరకు వార్షిక రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించే వరకు మా పోరాటం కొనసాగుతుంది’’ అని నాని స్పష్టం చేశారు. 

Related News