srinivas goud

గెలుపే లక్ష్యంగా పని చేస్తాం

Updated By ManamWed, 09/12/2018 - 01:23
  • మహబూబ్ నగర్  టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే వీ. శ్రీనివాస్ గౌడ్  

imageహైదరాబాద్:  ముందస్తు ఎన్నికల వేళా అధికార టీఆర్‌ఎస్ పార్టీలోకి జోరుగా వలసల భాట పట్టారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే వీ. శ్రీనివాస్ గౌడ్ ఆద్వర్యంలో మంత్రి కేటీఆర్, సమక్షంలో మంగళవారం సుమారు 200 మంది టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మెట్టు కాడి శ్రీనివాస్ ముదిరాజ్ సుమారు 200 నేతలు మందితో కలిసి హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ముదిరాజ్ సంఘం నేత, తెలంగాణ రాష్ట్ర బిసి మహాసభ అధ్యక్షులు, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర సమన్వయ కర్త ఉపాధ్యక్షుడు మెట్టు కాడి శ్రీనివాస్ గులాభి తీర్ధం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ బిసి మహాసభ జిల్లా అధ్యక్షులు ఎం. ఆనందలింగం, విరశైవ సమాజం జిల్లా కార్యదర్శి సిద్ది రామప్ప, జిల్లా బిసి మహాసభ ప్రధాన కార్యదర్శి మెట్టుకాడి శ్యామ్ సుందర్ ముదిరాజ్, జిల్లా ముదిరాజ్ మహాసభ నాగర్ కర్నూల్ అధ్యక్షులు నిరంజన్, జిల్లా ముదిరాజ్ అధ్యక్షుడు వేణుగోపాల్‌లతో పాటు పలువురు నేతలు టీఆర్‌ఎస్ చేరారు. ఇక ఇదే విషయంపై మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ...ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ చేస్తున్న చేస్తున్న అభివృద్దికి కర్శితులై టీఆర్‌ఎస్ పార్టీలో చెరుతున్నట్లు వారు తెలిపారు. ఇక ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపే లక్ష్యంగా తామంతా పనిచెస్తామన్నారు.పాలు, నీళ్లు బంజేస్తం

Updated By ManamTue, 07/24/2018 - 02:28
  • మా సమస్యలు పరిష్కరించాలి

  • ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, లారీ యజమానుల సంఘం నాయకులు.. 

  • రేపు పెట్రోల్ ట్యాంకర్ల ‘మద్దతు’ సమ్మె

imageహైదరాబాద్: నాలుగు రోజుల నుంచి లారీ యజమానులు సమ్మె చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, లారీ యజమానుల సంఘం నాయకులు అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సోమవారం సచివాల యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి లారీ యజమానుల సమస్యలను వివరించి, పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా 85 లక్షల లారీ నడుస్తున్నా యని, అందులో 2 లక్షల లారీ తెలంగాణలోనే నడుస్తున్నాయని తెలి పారు. తెలంగాణలో లారీలపై ఆధారపడి దాదాపు 10 లక్షల కుటుం బాలు జీవిస్తున్నాయని, వారి సమస్యలపై కేంద్రం స్పందించకుండా వారిని నిర్లక్ష్యం చేస్తున్నాయని మండిపడ్డారు. నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న వారిని పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రం ఎన్నో పరిశ్రమలకు ఇన్సెంటివ్స్ ఇస్తోందని, కానీ లారీల వ్యవస్థను కూడా ఒక పరిశ్రమగా భావించి ఇన్సెంటీవ్స్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నిత్యావసర సరుకుల సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టనట్టు ఉందన్నారు. లారీల సమ్మెకు మద్దతుగా పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ యజమానుల సంఘం మంగళ వారం సమ్మె చేయడానికి ముందుకు వచ్చినట్టు తెలిపారు. ఒక సారి పర్మిషన్ తీసుకుని మిగిలిన రాష్ట్రాలన్నింటి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అనుమతిస్తున్నారు, కానీ తెలంగాణ వాహనాలను అనుమతించపోవడం దారుణమన్నారు. సమస్య లు పరిష్కరించకుండా పోరాటం చేసే వారిపై కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలను డిమాండ్‌చేశారు. ఇన్యూరెన్స్ చార్జ్‌లు అధికంగా పెంచారని, వెంటనే తగ్గించాలన్నారు. డీజిల్‌పై జీఎస్టీ తీసుకురావాలన్నారు. టోల్ చార్జి కూడా తగ్గించాలన్నారు. ఈ డిమాండ్లన్నీ నెరవేర్చకపోతే నిత్యావసర సరుకులతోపాటు పాలు, నీళ్ల ట్యాంకర్లను కూడా బంద్ చేస్తమని హెచ్చరించారు. ఈ సమావేశంలో లారీ యజమానుల సంఘం నాయకులు రాజశేఖర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. బీసీలకు మరచిపోలేని రోజులివి

Updated By ManamSun, 07/08/2018 - 23:20
  • కేసీఆర్ అభినవ జ్యోతిరావు ఫూలే

  • మరో ఇరవై ఏళ్లు కేసీఆరే సీఎం.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్

imageహైదరాబాద్: రాష్ట్రంలో బీసీలు ఎన్నటికీ మరచిపోలేని రోజులు నడుస్తున్నాయని, కేసీఆర్ అభినవ జ్యోతిరావు ఫూలే అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో బీసీ విద్యార్థుల కోసం 19 గురుకులాలు ఉండేవని, టీఆర్‌ఎస్ సర్కార్ వచ్చాక 119 గురుకులాలను ఇచ్చిందని అన్నారు. ఆదివారం టీఆర్‌ఎస్‌ఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. బ్యాంకుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఉచితంగా ఆర్థిక సహకారం అందిస్తోందని ఆయన చెప్పారు. కళ్యాణ లక్ష్మి పథకంతో అనేకమంది అప్పుల్లేకుండా ఆడపిల్లలకు పెండ్లి చేయగలుగుతున్నారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రతిపక్షాలకు నోట్లు ఓట్లు తప్ప వేరే ద్యాసలేదన్నారు. తమ సర్కార్‌లో బలహీన వర్గాలను బలపర్చే ప్రయత్నం చేస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. కాంగ్రెస్ బలహీనవర్గాలను మరింత బలహీనపరుస్తోందన్నారు. కాంగ్రెస్‌లో ఒక్క బీసీ ఎమ్మెల్యే లేడని, అయినా సిగ్గు లేకుండా వాళ్లు మాట్లాడుతున్నారని అన్నారు. బీసీల అభివృద్ధిని చూసి ఆ పార్టీ నేతలు ఓర్వలేక పోతున్నారని ఆయన మండిపడ్డారు.'కులవృత్తులను నాశనం చేసిందే కాంగ్రెస్'

Updated By ManamMon, 01/15/2018 - 15:57

Srinivas goud, Congress party leaders, Caste occupationsహైదరాబాద్‌: కులవృత్తులను నాశనం చేసిందే కాంగ్రెస్‌ పార్టీ అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్‌ అన్నారు. బీసీలపై కపట ప్రేమను ఒలకబోయడం కాంగ్రెస్‌కు పరిపాటిగా మారిందని విమర్శించారు. బీసీల్లో ప్రత్యేకించి గౌడ కులస్థులపై కాంగ్రెస్ పార్టీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. గౌడ కులస్థులపై ప్రేమ నటిస్తున్న కాంగ్రెస్ అధికారంలో ఉండగా హైదరాబాద్‌లో కల్లు దుకాణాలపై నిషేదం విధించిందని దుయ్యబట్టారు.

కుల వృత్తులను నిషేధించే ప్రయత్నం జరిగినప్పుడు కాంగ్రెస్‌ నేతలు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. ఈత, తాటి చెట్లకు సంబంధించిన హైబ్రీడ్‌ విత్తనాలను టీఆర్ఎస్ ప్రభుత్వం పంపిణీ చేస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం బీసీల మొత్తానికి కేటాయించిన బడ్జెట్.. తెలంగాణ చేనేత వర్గాలకు కేటాయించిన బడ్జెట్‌ కంటే తక్కువేనని అన్నారు. బీసీ కులాలకు తీరని అన్యాయం: శ్రీనివాస్ గౌడ్

Updated By ManamSun, 01/14/2018 - 22:22

srinivas goudహైదరాబాద్ సిటీ, జనవరి 14(మనం న్యూస్): వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నిల్లో గ్రామ సర్పంచ్‌లను వార్డు మెంబర్ల ద్వారా పరోక్ష పద్ధతి ద్వారా ఎన్నుకోవాలనే రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులను బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా వ్యతిరికిస్తుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం ఆయన పంచాయతీ ఎన్నికల తీరుపై  ఒక ప్రకటన విడుదల చేశారు. పంచాయుతీరాజ్ చట్టాన్ని సవరించి పరోక్ష పద్ధతిని తీసుకువస్తే బీసీలకు రాజకీయంగా తీరని అన్యాయం జరుగుతుందని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 8,684 గ్రామ పంచాయుతీలు ఉంటే బీసీలకు జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు 50 శాతం లేకపోవడంతో అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. బీసీలకు ప్రస్తుతం 34 శాతం రిజర్వేషన్లు అవులు అవుతున్నందున వార్డుమెంబర్ల ద్వారా సర్పంచ్‌ను ఎన్నుకోవాలనే నిబంధనతో జనరల్ స్థానాలు కలిగిన సుమారు 3,500 గ్రామాలను రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అగ్రకుల ధనవంతులు డబ్బున్న కులాలవారే వార్డుమెంబర్లతో క్యాంపు రాజకీయాలు చేసి కైవసం చేసుకుంటారని  శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉండే నిజైమెన నిజాయుతీగల నాయుకులు, సంఘసేవకులు సర్పంచ్ అయ్యే అవకాశం కోల్పోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానంతో పెట్టుబడిదారులే గ్రామాలను ఏలుతారని ఆయన వ్యాఖ్యానించారు. వ్యాపారం కోణంలోనే గ్రామాల్లో పాలన సాగుతోందని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అవెురికా తదితర దేశాల్లో దేశాధ్యక్షులను సైతం ప్రజలు నేరుగా ఎన్నుకుంటుంటే మన దేశంలో మాత్రం పరోక్ష పద్ధతి అంటే దొడ్డిదారిన అధికారం చెలాయించడమే అవుతుందని జాజుల అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి వర్గ ఉపసంఘం సిపార్సులను పరిగణలోకి తీసుకోవద్దని శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. బంగారు తెలంగాణలో మళ్లీ బాంచెన్ దొర తెలంగాణ వస్తుందని దీనిని అందుకే వ్యతిరేకిస్తున్నామని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. 

Related News