allu arjun

బన్నీ టీ షర్ట్ కాస్ట్ అంతనా..!

Updated By ManamTue, 11/13/2018 - 12:25
Allu Arjun

సినిమాల్లోనే కాకుండా బయట కూడా స్టైలిష్‌గా కనిపిస్తూ స్టైలిష్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్. ప్రతి సినిమాకు లుక్ పరంగానే కాకుండా కాస్ట్యూమ్ పరంగా ఈ హీరో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. కాగా ఇటీవల విజయ్ దేవరకొండ టాక్సీవాలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బన్నీ వేసుకొచ్చిన టీ షర్ట్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఆ ఫంక్షన్‌లో బన్నీ టీ షర్ట్‌ చూసిన కొంతమంది యువత దాని ఖరీదు తెలుసుకోవడానికి ఆసక్తిని చూపారు. ఈ క్రమంలో ఆ టీ షర్ట్ విలువ 65వేలకు పైగా ఉండటం వారిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ షర్ట్‌ను, దాని ధరతో కూడిన ట్యాగ్‌ను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. విజయ్... తనని తాను చెక్కుకున్న శిల్పం

Updated By ManamTue, 11/13/2018 - 04:23

image‘‘ఎవరో మనకు తెలియని చిన్న చిన్న వాళ్లని కూడా గౌరవిస్తుంటాం. అలాగే సినిమా వాళ్లని కూడా గౌరవించండి. బయట నుండి చూసేవాళ్లకు సినిమా అంటే ఎంటర్‌టైన్‌మెంట్.. పేపర్‌లో నాలుగో పేజీలో వార్త కావచ్చు. కానీ మాకు సినిమానే జీవితం’’ అని అన్నారు అల్లు అర్జున్. ఈయన ముఖ్య అతిథిగా ‘టాక్సీవాలా’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్రానికి రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడు. జి.ఎ 2 పిక్చర్స్, యు.వి.క్రియేషన్స్ బ్యానర్స్‌పై ఎస్.కె.ఎన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘‘అన్ని సినిమా ఇండస్ట్రీల కంటే మన తెలుగులోనే అమ్మాయిలను ఎక్కువగా గౌరవిస్తారు. కాబట్టి ధైర్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలి. నిర్మాత ఎస్.కె.ఎన్ జర్నలిస్ట్‌గా, పి.ఆర్.ఒ, కో ప్రొడ్యూసర్‌గా ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా ఎదిగారు. తనని చూసి చాలా చాలా గర్వపడుతుంటాను. విజయ్ గురించి చెప్పాలంటే తనలో ఒరిజినాలిటీ నచ్చుతుంది. కాంటెంపరరీ హీరోలందరం ఓ రొట్టలో ఇరుక్కున్నాం. కానీ విజయ్ రొట్టలో ఇరుక్కోకుండా వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాడు. మేమంతా గోల్డెన్ ప్లేట్‌తో ఇండస్ట్రీలోకి వచ్చాల ఓ రాఘ వేంద్రరావుగారు, అశ్వనీదత్‌గారు మమ్మల్ని లాంచ్ చేశారు. అయితే విజయ్ సెల్ఫ్ మేడ్ పర్సన్. తనని తాను చెక్కుకున్న శిల్పం. చాలా మంచి పెర్ఫామర్. తను ఎదిగిన క్రమంలో ఇప్పుడు నెగిటివ్ ఫోర్సెస్ కూడా అడ్డుపడే అవకాశాలున్నాయి. వాటిని దాటుకుని విజయ్ సక్సెస్ సాధిస్తాడనే నమ్మకం ఉంది. తన సక్సెస్‌ను ఎంజాయ్ చేసేవాళ్లలో నేనూ ఒకడిని. సినిమా అంటే ఎంతో మంది కష్టం దాగుంది. దాన్ని పైరసీలో సినిమా చూసి ఎంకరేజ్ చేయవద్దు. దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్, మ్యూజిక్ డైరెక్టర్ బిజోయ్, కెమెరామెన్ సుజిత్ సారంగ్ సహా ఎంటైర్ యూనిట్‌కు అభినంద నలు’’ అన్నారు.
 

imageఅల్లు అరవింద్ మాట్లాడుతూ ‘‘కెరీర్ ప్రారంభం నుండి విజయ్ వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ వస్తున్నారు. మా బ్యానర్‌లో ఎన్నో సూపర్‌డూపర్ హిట్  చిత్రాలు వచ్చినా తొలిసారి వందకోట్ల రూపాయలను తీసుకొచ్చిన సినిమా గీత గోవిందం. హీరో విజయ్, డైరెక్టర్ రాహుల్‌కి ఈ సినిమా పరంగా అభినందనలు’’ అన్నారు.

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘‘బన్ని అన్నలా ఈ జన్మలో నేను డాన్స్ చేయలేను. మా కష్టంపై ‘పెళ్ళిచూపులు’, ‘అర్జున్ రెడ్డి’లాంటి సినిమాలు చేస్తే ‘గీత గోవిందం’, ఇప్పుడు ‘టాక్సీవాలా’ చిత్రాలతో గీతా ఆర్ట్స్, యు.వి.క్రియేషన్స్ దారి చూపించారు. నేను కూడా అలాగే నాతో పాటు కొంతమందిని ముందుకు తీసుకెళతాను. సినిమా ఎంటర్‌టైన్‌మెంటే అయినా దాని వెనుక చాలా మంది కష్టం, జీవితాలుంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకోండి. సినిమా థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి పైరసీ చేసిన వాళ్లు సిగ్గుపడేలా చేయండి’’ అన్నారు.

నిర్మాత ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ ‘‘నేను నిర్మాతగా మారడానికి కారణమైన వ్యక్తి నా గాడ్‌ఫాదర్ అల్లు అరవింద్‌గారు. సాధారణంగా ఏ ప్రొడ్యూసర్ అయినా తన కొడుకునో, మనవడినో నిర్మాతను చేస్తారు. కానీ ఏలూరు మెగాభిమానిగా బ్యానర్‌లు కట్టుకునే నన్ను అరవింద్‌గారు నిర్మాతను చేశారు. సాధారణంగా అందరి జీవితం ఎ అనే అక్షరంతో ప్రారంభమైతే నా జీవితం మాత్రం ఎఎ అనే రెండు అక్షరాలతో ప్రారంభమైంది. బన్నిగారు తనతో పాటు నేనూ ఎదగాలని కోరుకున్నారు’’ అన్నారు.

చిత్ర దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ మాట్లాడు తూ ‘‘సినిమా ఫస్టాఫ్‌ను మూడు గంటల్లో రాసేశాం.. సెకండాఫ్‌ను పూర్తి చేయడానికి ఆరు నెలలు పట్టింది. నిర్మాత ఎస్.కె.ఎన్‌గారితో పాటు బన్నీవాస్ కూడా మమ్మల్ని ముందుండి నడిపించారు’’ అన్నారు.  ఈ కార్యక్రమంలో హీరోయిన్ ప్రియాంక జవాల్కర్, సంగీత దర్శకుడు జె.కె.బిజోయ్, ఛాయాగ్రహకుడు సుజిత్ సారంగ్ సహా ఇతర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.అల్లు అర్జున్‌కి ఘన స్వాగతం

Updated By ManamSun, 11/11/2018 - 01:50

imageఅల్లు అర్జున్‌కు కేరళ అభిమానులు ఘనస్వాగతం పలికారు. శనివారం కేరళలోని అలప్పుఝా వద్ద ఉన్న పున్నామ్ద సరస్సులో జరిగిన ప్రతిష్టాత్మక 66వ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ ప్రారంభోత్సవానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా.. ఆయన సతీమని అల్లు స్నేహారెడ్డితో కలిసి హాజర య్యారు. కేరళ ప్రజలు తమ అభిమాను హీరోకు కొచ్చి ఎయిర్ పోర్ట్ నుంచే గ్రాండ్ వెల్ కమ్ చెప్పా రు. మల్లూవుడ్‌లో అల్లు అర్జున్‌కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లే దు. తన అభిమానులకు ఎంతో ఇష్టమైన నలుపు రంగు డ్రెస్‌లో పలకరించడంతో అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. బోట్ రేస్ కార్యక్రమానికి తెల్లటి దుస్తుల్లో... అచ్చమైన కేరళవాసిగా దర్శనమిచ్చి అభిమానం చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి కేరళ గవర్నర్ పళనిసామి సదాశివం హాజరయ్యారు. ఆయనతో కలిసి అల్లు అర్జున్ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇటీవల కేరళలో సంభవించిన వరదలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆ నష్టాన్ని పూడ్చేందుకు విరాళాల సేకరణ కోసం ఈ ఈవెంట్‌ను కేరళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.
 దేవరకొండ కోసం మరోసారి బన్నీ

Updated By ManamFri, 11/09/2018 - 12:37
Taxiwaala

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘టాక్సీవాలా’. గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా.. రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 11న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రానున్నాడు. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటనను ఇచ్చింది. 

అయితే విజయ్ దేవరకొండ కోసం అల్లు అర్జున్ అతిథిగా రావడం ఇది రెండోసారి. అంతకుముందు విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా బన్నీ వచ్చాడు. గీత గోవిందం, టాక్సీవాలా రెండు చిత్రాలు గీతా ఆర్ట్స్‌ 2లోనే తెరకెక్కిన విషయం తెలిసిందే. ‘మెగా’ దీపావళి

Updated By ManamThu, 11/08/2018 - 10:58
Mega Family

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ అన్యోన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ గురించి ఎవ్వరు ఏమనుకున్నా.. తామంతా ఒకే కుటుంబం అని వారు పలు సందర్భాలలో నిరూపిస్తూ వస్తున్నారు. కలిసి పండుగలు చేసుకోవడం, ఒకరి సినిమాలకు మరొకరు ప్రమోషన్లు చేయడం ఇలా ప్రతి విషయంలోనూ మెగా అనుబంధం బయటపడుతూనే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఈ కుటుంబం అంతా కలిసి దీపావళిని పండుగను జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఒక మెగా కుటుంబమే కాకుండా.. అల్లువారి కుటంబం కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ ఫొటోలను చూసిన మెగాభిమానులు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.

Mega FamilyMega Family

 త్వరలోనే చెబుతా: అల్లు అర్జున్

Updated By ManamThu, 11/08/2018 - 09:45

Allu arjunసినిమా కోసం ఎంతైనా కష్టపడే అల్లు అర్జున్‌కు సరిపోయే కథలు దొరకడం లేదు. ఓ వైపు తన తోటి హీరోలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు చేస్తుంటే.. బన్నీ మాత్రం ఆ రేస్‌లో కాస్త వెనుకబడ్డాడు. అందుకే నిదానమైనా ఫర్వాలేదు గానీ ఈసారి గట్టిగా ఓ పెద్ద హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ కథలను వింటూనే ఉన్నాడు. అయితే బన్నీ ఇంకా తదుపరి సినిమాను ప్రకటించకపోవడంపై ఆయన అభిమానులు మాత్రం నిరాశకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఉత్సాహపరిచేందుకు అల్లు అర్జున్ తాజాగా ఓ ట్వీట్ చేశాడు.

‘‘ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితంలో మంచి కాంతులు నింపాలని ఆశిస్తున్నా. నా తదుపరి చిత్రం కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు థ్యాంక్స్. త్వరలోనే నా చిత్రం గురించిన వివరాలు ప్రకటిస్తా. మీ ప్రేమ, అభిమానానికి థ్యాంక్యు’’ అంటూ బన్నీ ట్వీట్ చేశాడు. కాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే.

 బన్నీకి కేరళ సీఎం ఆహ్వానం

Updated By ManamTue, 11/06/2018 - 11:26

Allu Arjunస్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌కు అరుదైన ఆహ్వానం లభించింది. కేరళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నెహ్రూ ట్రోపీ బోట్ రేస్‌కు ముఖ్య అతిథిగా హాజరు అవ్వాల్సిందిగా బన్నీకి కేరళ ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఈ కార్యక్రమం ఈ నెల 10న అలప్పుల సమీపంలోని పున్నంద సరసులో జరగనుంది. ఇక కేరళ ప్రభుత్వ ఆహ్వానంపై సానుకూలంగా స్పందించిన బన్నీ.. ఆ కార్యక్రమానికి హాజరు అవుతానని మాటిచ్చినట్లు సమాచారం.

కాగా తెలుగులో టాప్ హీరోగా దూసుకుపోతున్న బన్నీకి, మలయాళంలోనూ చాలామంది అభిమానులు ఉన్నారు. అంతేకాదు అతడి చిత్రాలన్నీ అక్కడ కూడా విడుదలై మంచి కలెక్షన్లను రాణిస్తుంటాయి. ఈ క్రమంలో మలయాళ స్టార్ హీరోలతో సమానంగా కేరళలో గౌరవాన్ని పొందుతున్నాడు బన్నీ. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌ను కేరళ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఇక ఈ గౌరవం పొందిన తొలి టాలీవుడ్ హీరో బన్నీనే కావడం విశేషం. కాగా ఈ ఏడాది ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’తో వచ్చిన బన్నీ.. తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.ఇది ‘మెగా’ హాలోవెన్ పార్టీ

Updated By ManamSat, 10/27/2018 - 08:54
Mega Family

హాలోవెన్ ఫెస్టివల్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. అక్టోబర్ చివర్లో వచ్చే ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఘనంగా జరుపుకుంటారు. దెయ్యాల్లాగా తమను అలంకరించుకొని ఈ పండుగను చేసుకుంటుంటారు. అయితే ఈ సంప్రదాయం ఇప్పుడు భారత్‌కు కూడా వచ్చేసింది. సినీ ఇండస్ట్రీలోని పలువురు ఈ ఫెస్టివల్‌ను జరుపుకుంటుంటారు. కాగా తాజాగా ఈ పండుగను జరుపుకుంది మెగా కుటుంబం.

మెగాస్టార్ చిరంజీవితో సహా రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, ఉపాసన, సుష్మిత, శ్రీజ, స్నేహ, నిహారిక మిగిలిన కుటుంబసభ్యులందరూ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అందులో దెయ్యాల గెటప్‌లతో మెగా కుటుంబం అదిరిపోయింది. కాగా రామ్ చరణ్ ఒక్కటే ఏ వేషం వేసుకోకుండా కేవలం నల్ల దుస్తులను మాత్రమే వేసుకున్నాడు. ఇక సాయి ధరమ్ తేజ్ ఫాదర్‌గా, సుష్మిత నన్‌గా ఉన్న మరో ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ప్రస్తుతం మెగా కుటంబంలోని అందరు హీరోలు సినిమాలతో బిజీగా ఉండగా.. అల్లు అర్జున్ ఇంకా ఏ సినిమాను ఒప్పుకోలేదు.

Mega FamilyMega FamilyMega Family

 తోచినంత సాయం చేయండి: అల్లు అర్జున్

Updated By ManamSat, 10/20/2018 - 13:36
  • తిత్తీ తుపాను బాధితులకు అల్లు అర్జున్ 25 లక్షల విరాళం

allu arjun donets Rs.25 lakhs to Titli Cyclone Victims

హైదరాబాద్ : తిత్తీ తుఫాను బాధితులకు హీరో అల్లు అర్జున్ రూ.25 లక్షల విరాళం ప్రకటించాడు. తిత్లీ తుపాను ఎందరి జీవితాల్లోనో విషాదం నింపిందని, వారి పరిస్థితి చూసి కలత చెందానని, అందుకే తనవంతుగా వారికి చేయూతనివ్వడం బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపాడు.

అంతేకాకుండా బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని, తోచినంత సాయం చేయాలని అల్లు అర్జున్ ట్వాట్టర్ వేదికగా పిలుపునిచ్చాడు. కాగా ఇప్పటికే తుపాను బాధితులకు పలువురు టాలీవుడ్ హీరోలు ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ కుటుంబసభ్యులతో కలిసి దసరా పండుగ సెలవులను ఎంజాయ్ చేస్తున్నాడు.నల్గొండలో బన్నీ దసరా వేడుకలు

Updated By ManamThu, 10/18/2018 - 15:27

Allu Arjun‘నా పేరు సూర్య’ తరువాత ఏ చిత్రాన్ని ఒప్పుకోని బన్నీ తన సమయాన్నంతా కుటుంబం కోసమే కేటాయిస్తున్నాడు. ఈ నేపథ్యంలో దసరా పండుగను స్పెషల్‌గా నల్గొండలో జరుపుకుంటున్నాడు బన్నీ. తన సతీమణి స్నేహారెడ్డి అమ్మమ్మ స్వగ్రామమైన నల్గొండ జిల్లా పెద్దపూర మండలం చింతపల్లి గ్రామానికి వెళ్లిన బన్నీ.. అక్కడ సంబరాలు చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా బన్నీని చూసేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి రాగా.. వారందరికీ పండుగ శుభాకాంక్షలను చెప్పారు. ఈ క్రమంలో బన్నీ అభిమానులను అదుపు చేయడానికి స్నేహారెడ్డి కుటుంబసభ్యులు కష్టపడాల్సి వచ్చింది.

Related News