ramya krishna

ఆ క్యారెక్టర్సే నన్ను నటిగా నిలబెట్టాయి

Updated By ManamFri, 09/14/2018 - 22:57

imageహీరోయిన్‌గా ఎన్నో సూపర్‌హిట్ సినిమాల్లో నటించిన రమ్యకృష్ణ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మరిన్ని విజయాలు సొంతం చేసుకుంటున్నారు. ఆమధ్య ‘బాహుబలి’ చిత్రంలో శివగామిగా అందర్నీ ఆకట్టుకున్న రమ్యకృష్ణ తాజాగా ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రంలో చేసిన అత్త పాత్రతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. సెప్టెంబర్ 15 రమ్యకృష్ణ బర్త్‌డే.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘ఈ పుట్టినరోజుకి ఒక మంచి చిత్రం సూపర్‌హిట్ అవ్వటం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా విజయంలో ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. వారందరికీ నా కృతజ్ఞతలు. ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే ఏంతవరకైనా పోరాడే ధీరత్వం, తల్లిగా కూతురు మీద ప్రేమ.. ఈ రెండు వేరియేషన్స్ ఉన్న నా పాత్రను మారుతిగారు మలిచిన విధానం చాలా బాగుంది. ఈ చిత్రంలో తల్లికి, కూతురికీ ఇద్దరికీ ఇగో సమస్య ఉంటుంది. మరో పక్క అల్లుడుకి కూడా ఇగో ఉంటుంది. మా ముగ్గురి మధ్యలో నరేష్‌గారు, పృథ్విగారు, వెన్నెల కిషోర్‌గారు కేరక్టర్స్ కామెడీగా ఉంటాయి. షూటింగ్ చేస్తున్నపుడే మేం విపరీతంగా ఎంజాయ్ చేశాం. నాగచైతన్య గురించి చెప్పాలంటే అతను చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. సినిమాలోని చాలా సీన్స్‌లో ఎంతో ఈజ్‌తో నటించారు.

ఇప్పటివరకు నేను చేసిన వెరైటీ క్యారెక్టర్సే నన్ను నటిగా నిలబెట్టాయి. అలాంట క్యారెక్టర్స్ వస్తే తప్పకుండా చేస్తాను. ఈ పండగకు రిలీజ్ అయిన ‘శైలజారెడ్డి అల్లుడు’ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. రిలీజ్ అయిన ప్రతిచోటా మంచి టాక్‌తో రన్ అవుతోంది. ఈ చిత్రాన్ని మరింత ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు.
 మరోసారి శివగామిగా..

Updated By ManamMon, 08/06/2018 - 23:54

imageబాహుబలి, బాహుబలి 2 చిత్రాల్లో రాజమాత శివగామిగా నటించి అందర్నీ అలరించిన రమ్యకృష్ణ మరోసారి శివగామిగా కనిపించనుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపుదిద్దుకుంటోన్న ‘రాణి శివగామి’ చిత్రంలో రమ్యకృష్ణ టైటిల్ పాత్రను పోషిస్తోంది. శ్రీవెంకటేశ పిక్చర్స్ పతాకంపై మురళీకృష్ణ దబ్బుగుడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మధు మిణకన్ గుర్కి దర్శకుడు.

ప్రస్తుతం నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం విశేషాలను నిర్మాత తెలియజేస్తూ ‘‘రమ్యకృష్ణ నటిస్తున్న మరో పవర్‌ఫుల్ చిత్రమిది. ఆమెను కొత్తకోణంలో ఆవిష్కరించే ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. పీరియాడిక్ డ్రామా విత్ సోషియో ఫాంటసీగా రూపొందుతున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్‌కి అధిక ప్రాధాన్యం ఉంటుంది.  ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో ఏకకాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ ‘‘తొమ్మిదవ శతాబ్దంలో ప్రారంభమయ్యే ఈ కథ 21వ శతాబ్దం వరకు కొనసాగుతుంది. ఈ కాలక్రమంలో జరిగే ఘటనలు ఎంతో ఆసక్తికరంగా వుంటాయి. తొమ్మిదవ శతాబ్దానికి, 21వ శతాబ్దానికి వున్న సంబంధం ఏమిటనేది ఈ చిత్రకథ. రమ్యకృష్ణ నటన చిత్రానికి ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది’’ అన్నారు. న‌య‌న‌తార కాదు.. ర‌మ్య‌కృష్ణ‌?

Updated By ManamFri, 04/20/2018 - 23:59

ramyaస‌మైక్యాంధ్ర‌ప్ర‌దేశ్‌ మాజీ ముఖ్య‌మంత్రి, దివంగ‌త నేత వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న చిత్రం 'యాత్ర‌'. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ సినిమా.. అతి త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నుంది. ఇదిలా ఉంటే.. వై.ఎస్‌.ఆర్ పాత్ర‌లో మాలీవుడ్ మెగాస్టార్ మ‌మ్ముట్టి న‌టించ‌నున్న‌ ఈ చిత్రానికి మ‌హి వి.రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న సంగ‌తి తెలిసిందే. కాగా.. వై.ఎస్‌.ఆర్ స‌తీమ‌ణి విజ‌య‌మ్మ పాత్ర‌లో న‌య‌న‌తార న‌టించ‌నుంద‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. అయితే.. తాజా స‌మాచారం ప్ర‌కారం ఇప్పుడా పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌టించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ర‌మ్య ఎంట్రీపై క్లారిటీ రానుంది.'గ్యాంగ్' రివ్యూ

Updated By ManamFri, 01/12/2018 - 17:59

gangచిత్రం: గ్యాంగ్
తారాగణం: సూర్య, కీర్తి సురేష్, రమ్యకృష్ణ, కార్తిక్, సెంథిల్, తంబి రామయ్య, ఆనంద్ రాజ్, బ్రహ్మానందం, సురేష్ మీనన్, నందా, ఆర్‌.జె.బాలాజీ, నిరోషా తదితరులు
ఛాయాగ్రహణం: దినేష్ కృష్ణన్
కూర్పు: ఎ.శ్రీకర్ ప్రసాద్
మాటలు: శ‌శాంక్ వెన్నెల కంటి
సంగీతం: అనిరుధ్‌ రవిచందర్
నిర్మాతలు: ప్రమోద్, వంశీ
బ్యానర్: యువి క్రియేషన్స్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విఘ్నేష్‌ శివన్
విడుదల తేది: జనవరి 12, 2018

మంచి వాళ్లు చెడ్డ‌వాళ్లుగా మారితేనే.. చెడ్డ‌వాళ్లు మంచి వాళ్లుగా మారుతారు.. అని భావించే 1987 కాలం నాటి ఓ యువ‌కుడి ఆలోచ‌న‌కు రూప‌మే 'గ్యాంగ్' చిత్రం. సూర్య‌, కీర్తి సురేష్, ర‌మ్య‌కృష్ణ‌, కార్తీక్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా.. హిందీ చిత్రం ‘స్పెషల్ ఛ‌బ్బీస్‌’ రీమేక్‌గా తెర‌కెక్కింది. శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ సినిమాపై మనం అందిస్తున్న‌ సమీక్ష మీ కోసం:

కథ: 
gangతిలక్ (సూర్య) చిన్నప్పటినుంచి సి.బి.ఐ ఆఫీసర్ అవ్వాలని కల‌లు కంటూ ఉంటాడు. తిల‌క్  తండ్రి (తంబి రామ‌య్య‌) మాత్రం ఓ సి.బి.ఐ ఆఫీస్‌లో గుమాస్తాగా పనిచేస్తూ ఉంటాడు. అయితే తండ్రి ప‌నిచేసే ఆఫీస్‌కే ఇంట‌ర్వ్యూకి వెళ్ళిన తిల‌క్‌ని.. ఇంట‌ర్వ్యూ చేసిన అధికారి అవ‌మానిస్తాడు. ''క్లర్క్‌గా ప‌నిచేసే నీ తండ్రి ఆఫీస్‌కే నువ్వు అధికారిగా రావాల‌నుకుంటున్నావా? ఆయ‌న స‌ర్వీస్‌లో పోతే అదే ఉద్యోగం నీకు వ‌స్తుంది? అది చేయ్‌'' అంటూ వ్యంగ్యంగా మాట్లాడ‌తాడు. దీనికి తోడు పోలీస్ కావాల‌నుకున్న తిల‌క్‌ స్నేహితుడు.. అర్హ‌త ఉన్నా నిరుద్యోగం కార‌ణంగా అత‌ని క‌ళ్ళ ముందే ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడు. దీంతో.. ల‌క్ష‌లు పోసి ప‌నిచేసే ఉద్యోగం కంటే.. ల‌క్ష్యం కోసం ప‌నిచేసే ఉద్యోగం ఉత్త‌మం అనుకుంటూ.. త‌ను ఓ ఫేక్ సి.బి.ఐ.అధికారిగా మారి.. త‌నలాగే నిరుద్యోగంతో బాధ‌ప‌డుతున్న మ‌రో ముగ్గురు (ర‌మ్య‌కృష్ణ‌, సెంథిల్‌,) స‌హ‌కారంతో సి.బి.ఐ బృందం అంటూ.. అవినీతితో సంపాదించిన వారి ఇళ్ళ‌ల్లో డూప్లికేట్ రెయిడ్ చేసి డ‌బ్బు, న‌గ‌లు సొంతం చేసుకుంటారు. ఈ సోదాల తర్వాత తెలుస్తుంది.. తిల‌క్ టీమ్‌ అసలు సిబిఐ టీమ్‌ కాదు అని. దీంతో అసలు సి.బి.ఐ టీమ్‌ అప్రమత్తమ‌వుతుంది. తిల‌క్ గ్యాంగ్‌ని పట్టుకోవడానికి రంగంలోకి దిగుతుంది.  దీంతో.. తిల‌క్‌ గ్యాంగ్ మరో డూప్లికేట్ రెయిడ్‌ చేయడం కోసం హైదరాబాద్ వెళుతుంది. మ‌రోవైపు ఈ గ్యాంగ్‌ని పట్టుకోవడానికి సి.బి.ఐ స్పెషల్ ఆఫీసర్‌గా శివ‌శంక‌ర్ (కార్తీక్‌) వస్తాడు. మ‌రి.. శివ‌శంక‌ర్ ఈ బృందాన్ని ప‌ట్టుకుంటాడా?  లేదా?  తిల‌క్ ల‌క్ష్యం ఎంత‌వ‌ర‌కు నెర‌వేరింది? అనేది మిగిలిన క‌థ‌.

విశ్లేషణ: 
హిందీలో విజ‌యం సాధించిన స్పెష‌ల్ 26కి రీమేక్‌గా ఈ చిత్రాన్ని రూపొందించినా.. చెప్పుకోద‌గిన మార్పుల‌తో ఈ సినిమాని తెర‌కెక్కించాడు విఘ్నేష్ శివ‌న్‌. అయితే.. ప్ర‌ధానంగా త‌మిళంలో తెర‌కెక్కిన ఈ సినిమాకి త‌మిళ వాస‌న‌లు ఎక్క‌వ‌గా ఉండ‌డంతో ఇక్క‌డివారిని ఆక‌ట్టుకోవ‌డంలో ఫెయిలయింద‌నే చెప్పాలి. ప్ర‌థ‌మార్థంలో మినిస్ట‌ర్ ఇంటిపై సోదా చేసే స‌న్నివేశం, ద్వితీయార్థంలో వ‌చ్చే ఇంట‌ర్వ్యూ సీన్ మాత్ర‌మే ఈ సినిమాలో క‌ట్టిప‌డేసే దృశ్యాలు. ఇక‌ మిగిలిన సినిమా.. అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. న‌టీన‌టుల విషయానికి వ‌స్తే.. త‌న ఆశ‌యం నెర‌వేర‌క‌పోయినా నిరాశ‌ప‌డ‌క‌.. మ‌రో మార్గంలో దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకునే యువ‌కుడిగా సూర్య న‌ట‌న మెప్పిస్తుంది. చేసే ప‌నితోనే మ‌న గుర్తింపు అంటూ చెప్పుకొచ్చే స‌న్నివేశంలో ఆయ‌న న‌ట‌న మెప్పిస్తుంది. ఆయ‌న సొంత డ‌బ్బింగ్ ఒక‌ట్రెండు చోట్ల ఇబ్బంది పెట్టినా.. త‌న‌ ప్ర‌య‌త్నాన్ని మెచ్చుకోక‌త‌ప్ప‌దు. ఎనిమిది మంది పిల్ల‌ల త‌ల్లి అయిన నిస్స‌హాయ‌క మ‌ధ్య‌త‌ర‌గ‌తి గృహిణి బుజ్జ‌మ్మ‌గానూ.. (ఫేక్‌) సి.బి.ఐ.ఝూన్సీరాణిగానూ.. ఇలా రెండు షేడ్స్ ఉన్న పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌ట‌న గుర్తుండిపోతుంది. కీర్తి సురేష్‌కి ఇందులో న‌టించ‌డానికి పెద్ద‌గా స్కోప్ లేదు. ఒక‌ట్రెండు స‌న్నివేశాల్లో మాత్ర‌మే కాస్త అందంగా క‌నిపించింది. మిగిలిన న‌టులు త‌మ పాత్ర‌ల ప‌రిధుల్లో ఓకే అనిపించుకున్నారు. 
సాంకేతికంగా తీసుకుంటే.. ఈ సినిమాకి దినేష్ అందించిన ఛాయాగ్ర‌హ‌ణం బాగా కుదిరింది. అనిరుధ్ పాట‌లు, నేప‌థ్య సంగీతం ఇంప్రెసివ్‌గా లేవు. శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్ ఎడిటింగ్ వ‌ర్క్ బాగుంది. శశాంక్ మాట‌ల్లో ''ఒక్కడు కోటీశ్వరుడు అవడానికి కోటి మంది చావాల్సి వస్తోంది. మొత్తం తవ్వి బయటికి తీస్తే మన దేశంలో ఉన్న చాలా ప్రాబ్ల‌మ్స్‌ని ఈకల్లా పీకి పారేయొచ్చు”, “గుండెల్లో ధైర్యం...చేతిలో ధర్మం ఉంటే మనం దేనికి భయపడక్కర్లేదు”వంటి డైలాగులు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్‌
సూర్య‌, ర‌మ్య‌కృష్ణ‌
ఛాయాగ్ర‌హ‌ణం
మాట‌లు
నిర్మాణ విలువలు
సినిమా నిడివి

మైన‌స్ పాయింట్స్‌
సంగీతం
ద‌ర్శ‌క‌త్వం
త‌మిళ వాస‌న‌లు ఎక్కువ‌గా ఉండ‌డం

చివ‌ర‌గా.. రీమేక్ వ‌ర్క‌వుట్ కాలేదు
రేటింగ్‌.. 2.5/5
 'గ్యాంగ్’లో రమ్య పాత్రే కీలకం

Updated By ManamThu, 01/11/2018 - 19:42

ramya‘గ్యాంగ్’ సినిమాతో రేపు (శుక్ర‌వారం) తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు సూర్య. వినోదాత్మకంగా సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్‌ని విఘ్నేష్‌ శివన్ తెరకెక్కించారు. కీర్తి సురేష్ కథానాయికగా న‌టించిన ఈ సినిమా.. బాలీవుడ్ చిత్రం ‘స్పెషల్ 26’కి అధికారిక రీమేక్. సీనియర్ నటి రమ్యకృష్ణ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించారు. ‘గ్యాంగ్’ అనే దొంగల ముఠా జట్టులో ఒక సభ్యురాలైన రమ్యకృష్ణ పాత్ర చాలా ఆసక్తికరంగాను, అలాగే హాస్యాన్ని కూడా పండించే విధంగాను ఉంటుందని సమాచారం. ఈ మధ్య తనకు తగిన, ప్రాముఖ్యత ఉన్న పాత్రలనే పోషిస్తున్న రమ్య.. ఈ సినిమాలో తన వైవిధ్యమైన నటనతో మరోసారి ఆకట్టుకుంటారని చిత్ర బృందం చెప్పుకొస్తోంది. అలాగే రమ్యకృష్ణతో సూర్య మొదటిసారిగా నటించిన‌ ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ సంస్థ తెలుగు ప్రేక్ష‌కులకు అందిస్తోంది.మళ్లీ ‘శివగామి’గా రమ్యకృష్ణ

Updated By ManamWed, 11/15/2017 - 16:38
sivagami

‘బాహుబలి’ చిత్రంలోని శివగామి పాత్రను ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు. విలక్షణ నటి రమ్యకృష్ణ...శివగామి పాత్రలో అందరినీ మెప్పించారు. ‘బాహుబలి’ చిత్రానికి మరో సీక్వెల్ చేయకపోయినా...మరోసారి రష్యకృష్ణ శివగామిగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అవును మీరు వింటున్నది నిజమే. కన్నడలో ‘శివగామి’ అనే చిత్రంలో రమ్యకృష్ణ టైటిల్ పాత్రను పోషించనున్నారు. 9వ శతాబ్దానికి చెందిన రాణి శివగామి పాత్రలో రమ్యకృష్ణ కనిపిస్తారు.  బాహుబలి చిత్రంలోలానే నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఉండే రోల్‌‌ను రమ్యకృష్ణ పోషించనున్నారు. రమ్యకృష్ణ మరోసారి శివగామిగా ప్రేక్షకుల ముందుకు వస్తుండడం నిజంగానే ఆమె ఫ్యాన్స్‌కు ఎంతో సంతోషాన్నిచ్చే కథనమే.  తెలుగులో ప్రస్తుతం రమ్యకృష్ణ ‘బాలకృష్ణుడు’ చిత్రంలో నటిస్తోంది. నాగ‌చైత‌న్య‌తో అను ఇమ్మాన్యుయేల్‌?

Updated By ManamTue, 11/14/2017 - 12:38

maruthi, anu, chaituయువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం 'స‌వ్య‌సాచి' సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. కాగా, ఈ చిత్రం త‌రువాత మారుతి ద‌ర్శ‌క‌త్వంలో చైత‌న్య ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి 'శైల‌జా రెడ్డి అల్లుడు' అనే పేరు వినిపిస్తోంది. సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నారు. తాజాగా వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం ఈ సినిమాలో కేర‌ళ‌కుట్టి అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశ‌ముంద‌ని తెలిసింది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్ 25వ చిత్రంతో పాటు అల్లు అర్జున్ 'నా పేరు సూర్య‌'లోనూ అను హీరోయిన్‌గా న‌టిస్తోంది.'సోలో' బాట‌లో 'బాల‌కృష్ణుడు'

Updated By ManamThu, 11/02/2017 - 14:29

balakrishnuduవైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుంటున్న క‌థానాయ‌కుడు నారా రోహిత్‌. ఈ యువ క‌థానాయ‌కుడు న‌టించిన తాజా చిత్రం 'బాల‌కృష్ణుడు'. రెజీనా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ ఓ ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో సంద‌డి చేయ‌నుంది. ప‌వ‌న్ మ‌ల్లెల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీత‌మందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ 24న విడుద‌ల చేయ‌డానికి చిత్ర బృందం ప్లాన్ చేసింది. విశేష‌మేమిటంటే.. గ‌తంలో నారా రోహిత్‌, మ‌ణిశ‌ర్మ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన 'సోలో' చిత్రం కూడా ఇదే న‌వంబ‌ర్‌లో విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. న‌వంబ‌ర్ 25, 2011న 'సోలో' విడుద‌లైతే.. ఆ రోజుకి ఒక్క రోజు ముందుగా ఆరేళ్ల త‌రువాత 'బాల‌కృష్ణుడు' రాబోతున్నాడు. మ‌రి 'సోలో' మ్యాజిక్‌.. 'బాల‌కృష్ణుడు'కి కూడా రిపీట్ అవుతుందేమో చూడాలి.'శైల‌జ రెడ్డి అల్లుడు'గా నాగ‌చైత‌న్య

Updated By ManamFri, 10/27/2017 - 19:50

chaitanyaప్ర‌స్తుతం 'ప్రేమ‌మ్' ద‌ర్శ‌కుడు చందు మొండేటితో 'స‌వ్య‌సాచి' అనే చిత్రాన్ని చేస్తున్న యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని యూత్‌ఫుల్ డైరెక్ట‌ర్ మారుతితో చేయ‌నున్నాడు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మించే ఈ చిత్రానికి 'శైల‌జ రెడ్డి అల్లుడు' అనే పేరుని అనుకుంటున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందులో శైల‌జ రెడ్డి పాత్ర‌లో సీనియ‌ర్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ క‌నిపించ‌నున్న‌ట్లు తెలిసింది. ఈ టైటిల్‌కి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే వెలువ‌డనుంది. ఇందులో 'లై' ఫేమ్ మేఘా ఆకాష్ హీరోయిన్‌గా న‌టించ‌నుందని స‌మాచార‌మ్‌.'బాల‌కృష్ణుడు' బాగున్నాడు

Updated By ManamSat, 09/23/2017 - 16:23

ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుపోవ‌డంలో యువ క‌థానాయ‌కుడు నారా రోహిత్ శైలే వేరు. తొలి చిత్రం 'బాణం' నుంచి తాజాగా విడుద‌లైన 'క‌థ‌లో రాజ‌కుమారి' వ‌ర‌కు కొత్త‌ద‌నం ఉండే క‌థ‌ల‌కే ఓటేస్తూ వ‌స్తున్న రోహిత్‌.. ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల‌లో 'బాల‌కృష్ణుడు' ఒక‌టి. ప‌వ‌న్ మ‌ల్లెల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రోహిత్ స‌ర‌స‌న రెజీనా న‌టిస్తోంది. గ‌తంలో వీరి కాంబినేష‌న్ లో 'జో అచ్యుతానంద‌', 'శంక‌ర' చిత్రాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

'బాణం', 'సోలో' వంటి మ్యూజిక‌ల్ హిట్స్ ని నారా రోహిత్‌కి అందించిన మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి స్వ‌రాలు అందిస్తున్నాడు. అందాల న‌టి రాశి ఖ‌న్నా ఇందులో ఓ పాట పాడ‌డం విశేషం. అలాగే ప్ర‌ముఖ న‌టి ర‌మ్య‌కృష్ణ ఓ ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో క‌నిపించ‌నున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ని ఇవాళ విడుద‌ల చేశారు. దీంట్లో నారా రోహిత్ లుక్ బాగుంది. ఈ సినిమా కోసం ఆయ‌న సిక్స్‌ప్యాక్ చేశాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అక్టోబ‌ర్ నెలాఖ‌రులో ఈ సినిమా విడుద‌ల కానుంది. ద‌స‌రాకి టీజ‌ర్‌ని విడుద‌ల చేయ‌నున్నారు.

Related News