tollywood

వెంకీతో నాలుగోసారి...

Updated By ManamSun, 05/27/2018 - 22:13

imageవెంకటేశ్, నాగచైతన్య కాంబినేషన్‌లో మల్టీస్టారర్ రూపొందనుంది. బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కిం చనున్నారు. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో వెంకటేశ్ జోడిగా నయనతార నటిస్తుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో లక్ష్మీ, తులసి, బాబు బంగారం చిత్రాలు విడుదలయ్యాయి. అన్ని అనుకున్నట్లు కుదిరితే వీరి కాంబినేషన్‌లో నాలుగోసారి రిపీట్ అవుతుంది. నిజ జీవితంలోలాగానే వెంకీ, చైతు మామ, అల్లుడు పాత్రల్లో కనిపించబోతున్నారట.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.  జూన్‌లో ఈ సినిమా ప్రారంభం అవుతుంది.మాస్+క్లాస్= నేలటిక్కెట్టు

Updated By ManamThu, 05/24/2018 - 22:30

imageరవితేజ, మాళవికా శర్మ జంటగా నటించిన చిత్రం ‘నేల టిక్కెట్టు’. కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకుడు. రామ్ తాళ్లూరి నిర్మాత. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ ‘‘క్లాస్, మాస్ కాంబినేషన్‌లో రూపొందిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ ఇది. రవితేజగారు లేకుంటే సినిమా ఇంత ఫాస్ట్‌గా పూర్తయ్యేది కాదు. ఈ సినిమా సమయంలో ఆయనతో మంచి అనుబంధం ఏర్పడింది. ఈ ఏడాది సెప్టెంబర్ నుండి రవితేజగారితో మరో సినిమా చేయబోతున్నాను. డైరెక్టర్ కల్యాణ్ కృష్ణగారు ఈ సినిమా కోసం ఎంతో హార్డ్ వర్క్ చేశారు’’ అన్నారు. కల్యాణ్ కృష్ణ మాట్లాడుతూ ‘‘సినిమా అనే సౌండ్ అర్థమయ్యే ఏజ్ నుండి ముసలి వారి వరకు ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. సినిమాపై వందశాతం నమ్మకం ఉంది. సినిమాలో హండ్రెడ్ పర్సెంట్ ఎంటైర్‌టైన్ మెంట్ ఉంటుంది. దీంతో పాటు మనకు తెలిసిన విషయాలను.. మరచిపోయే విషయాలను గుర్తుకు తెచ్చే సినిమా ఇది’’ అన్నారు. హీరోయిన్ మాళవికా శర్మ మాట్లాడుతూ ‘‘ఇందులో మెడికల్ స్టూడెంట్ పాత్రలో కనపడతాను. టామ్‌బాయ్ లాంటి క్యారెక్టర్. రవితేజగారితో కంఫర్ట్‌గా నటించాను. ఆయన దగ్గర నుండి చాలా విషయాలను నేర్చుకున్నాను’’ అన్నారు. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’లో మ‌హాధ‌న్ న‌టించ‌డం లేదట‌

Updated By ManamTue, 05/22/2018 - 21:55

raviమాస్ మహారాజా రవితేజ, మాళవికా శర్మ జంటగా నటించిన చిత్రం ‘నేల టిక్కెట్టు’. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రవితేజ, ఇలియానా హీరో హీరోయిన్‌లుగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  ఈ సినిమాలో రవితేజ తనయుడు మహాధన్ కూడా నటిస్తున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే.. ఈ సినిమా షెడ్యూల్స్‌తో మహాధన్ స్కూల్ డిస్ట‌ర్బ్ అయ్యే అవ‌కాశం ఉండ‌డంతో..ఈ సినిమాలో మహాధన్ నటించడం లేదని రవితేజ స్పష్టం చేసారు. అలాగే.. మంచి కథ, మంచి పాత్ర వస్తే బయట సినిమాల్లో కూడా చేస్తాడని అంటూనే.. ప్రస్తుతం చదువుకునే వయసు కాబట్టి ఎక్కువ సినిమాలు చేయించే ఉద్దేశ్యం లేదని ఒక సగటు తండ్రిగా చెబుతున్నారు ర‌వితేజ‌. భవిష్యత్తులో మహాధన్ తనను దాటుకుని ముందుకు వెళితే.. అంతకన్నా ఏం కావాలి అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసారు.

కాగా.. చాలా కాలం తర్వాత రవితేజకు సక్సెస్‌ను అందించిన ‘రాజా ది గ్రేట్’ సినిమాతో మహాధన్ తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.నాగ్‌, నాని మ‌ల్టీస్టార‌ర్‌.. ఓ రీమేక్‌

Updated By ManamTue, 05/22/2018 - 20:30

nag2007లో శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన హిందీ చిత్రం ‘జానీ గద్దార్’. అప్పట్లో మంచి విజయం సాధించిన ఈ కామెడీ థ్రిల్లర్ ఫిల్మ్‌ను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. కాస్త‌ వివరాల్లోకి వెళితే.. నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని ‘జానీ గద్దార్’కు రీమేక్‌గా తెరకెక్కిస్తున్నట్టు స‌మాచారం. ‘దృశ్యం’ సినిమాలో ఎలాగైతే ఇత‌ర సినిమాలలోని సన్నివేశాలను చూసి అది తన జీవితంలోకి అన్వయించుకుని సమస్యల నుంచి ఒక కుటుంబం బయటపడుతుందో.. అలాగే ‘జానీ గద్దార్’లో కూడా ఒక ముఠాలోని సభ్యుడు పాత హిందీ సినిమాల్లోని సీన్స్‌ను తన తోటి వారిని మోసగించడానికి ఉపయోగిస్తూ ఉంటాడు. కామెడీగా సాగే ఈ స‌న్నివేశాలే ఈ సినిమాలో హైలైట్‌గా నిలిచాయి. ఇప్పుడు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య సినిమాలో ఈ త‌ర‌హాను పాత్రను నాని చేస్తున్నట్టు తెలుస్తోంది.

మరి ఇటువంటి జోనర్‌లో సినిమాలను చేయడంలో దిట్ట అయిన శ్రీరామ్.. ఈ సినిమాతో ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తారో చూడాలి. అన్నట్టు.. ‘జానీ గద్దార్’కి రీమేక్ చిత్రంగా 2013లోనే తెలుగులో ‘కమీనా’ చిత్రాన్ని రూపొందించడం గమనార్హం. మ‌రి ఈ కొత్త వెర్ష‌న్‌లో ఎన్ని మార్పులు ఉంటాయో చూడాలి.‘అమ్మమ్మ గారిల్లు’.. సెన్సార్ పూర్తి

Updated By ManamTue, 05/22/2018 - 17:21

ammaనాగశౌర్య, షామిలి జంట‌గా న‌టించిన చిత్రం ‘అమ్మమ్మ గారిల్లు’. ఈ కుటుంబ క‌థా చిత్రం ద్వారా సుంద‌ర్ సూర్య ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మవుతున్నారు. స్వాజిత్ మూవీస్ ప‌తాకంపై రాజేశ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. క‌ల్యాణ ర‌మ‌ణ సంగీత‌మందించిన ఈ సినిమా ఈ నెల‌ 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ క‌మిటీ ఈ సినిమాకు 'క్లీన్‌ యు' సర్టిఫికెట్‌ను జారీ చేసింది. కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ చిత్రంగా తెర‌కెక్కిన ఈ సినిమాకి.. సింగిల్ క‌ట్ కూడా చెప్ప‌కుండా సెన్సార్ స‌ర్టిఫికెట్ జారీ చేశారు ఆ క‌మిటీ స‌భ్యులు.'ఆఫీస‌ర్‌'.. 'న‌వ్వే నువ్వు' వీడియో సాంగ్‌

Updated By ManamTue, 05/22/2018 - 16:25

rgvకింగ్ నాగార్జున క‌థానాయ‌కుడిగా సంచ‌లన ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ రూపొందించిన చిత్రం 'ఆఫీస‌ర్‌'. క‌ర్ణాట‌కకు చెందిన ఐపీఎస్ ఆఫీస‌ర్ కె.ఎం.ప్ర‌స‌న్న జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో మైరా స‌రీన్ క‌థానాయిక‌గా న‌టించింది. జూన్ 1న ఈ సినిమా తెరపైకి రానుంది. ఇదిలా ఉంటే.. ర‌విశంక‌ర్ సంగీత సార‌థ్యంలో రూపొందిన 'న‌వ్వే నువ్వు' అంటూ సాగే పాట తాలుకూ వీడియో సాంగ్ ప్రోమోని ఈ రోజు (మంగ‌ళ‌వారం) విడుద‌ల చేశారు. సిరాశ్రీ రచించిన ఈ పాట‌ను ర‌మ్య బెహ‌రా గానం చేశారు. తండ్రీ కూతుళ్ళ అనుబంధం నేప‌థ్యంలో రూపొందిన ఈ పాట తాలుకూ పూర్తి వీడియో చూడాలంటే సినిమా విడుద‌ల తేది వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే. ఇదిలా ఉంటే.. రేపు (బుధ‌వారం) ఈ పాట తాలుకూ లిరిక‌ల్ వీడియో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది.‘నా నువ్వే’.. కొత్త‌ రిలీజ్‌ డేట్

Updated By ManamTue, 05/22/2018 - 14:51

naaనందమూరి కల్యాణ్ రామ్, తమన్నా జంటగా నటించిన చిత్రం ‘నా నువ్వే’. జ‌యేంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి పి.సి.శ్రీ‌రామ్ ఛాయాగ్ర‌హ‌ణం అందించారు. ష‌ర్రెత్ సంగీతమందించారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 25న విడుద‌ల కావాల్సిన ఈ సినిమా కొన్ని కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డనుంద‌ని ఆ మ‌ధ్య 'మ‌నం న్యూస్' ప్ర‌స్తావించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా.. మే 25 నుంచి ఈ సినిమా విడుద‌ల వాయిదా ప‌డింద‌ని.. జూన్ 1న ఈ సినిమా తెర‌పైకి రానుంద‌ని చిత్ర వ‌ర్గాలు పేర్కొన్నాయి. అంతేగాకుండా.. ఈ విష‌యంపై చిత్ర యూనిట్ మంగ‌ళ‌వారం గానీ బుధ‌వారం గానీ అధికారిక ప్ర‌క‌ట‌న ఇవ్వ‌నుంది. ప్రేమ‌క‌థా చిత్రంగా తెర‌కెక్కిన ఈ సినిమాలో క‌ల్యాణ్ రామ్ టాక్సీవాలా పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా.. త‌మ‌న్నా రేడియో జాకీ పాత్ర‌లో సంద‌డి చేయ‌నుంది.

కాగా.. 'నా నువ్వే'తో పాటు జూన్ 1న నాగార్జున 'ఆఫీస‌ర్‌', విశాల్ 'అభిమ‌న్యుడు', రాజ్ త‌రుణ్ 'రాజుగాడు' కూడా విడుద‌ల‌కు సిద్ధం కానున్నాయి.బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న చ‌ర‌ణ్‌

Updated By ManamTue, 05/22/2018 - 14:11

charanమెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్, యాక్ష‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో డి.వి.వి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. కియ‌రా అద్వానీ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబెరాయ్ విల‌న్‌గా న‌టిస్తుండ‌గా.. ప్ర‌శాంత్‌, స్నేహ‌, ఆర్య‌న్ రాజేశ్‌, అన‌న్య‌, న‌వీన్ చంద్ర ఇతర కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఇదిలా ఉంటే.. బ్యాంకాక్‌లో ఈ సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. తాజా స‌మాచారం ప్రకారం.. ఆ షెడ్యూల్ పూర్త‌య్యింద‌ని తెలిసింది. ఈ షెడ్యూల్‌లో చరణ్, కియ‌రాపై కొన్ని రొమాంటిక్, కామెడీ సన్నివేశాలను చిత్రీకరించారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా త‌దుప‌రి షెడ్యూల్ ఇండియాలో ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. 'రంగ‌స్థ‌లం' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత చ‌ర‌ణ్ న‌టిస్తున్న సినిమా కావ‌డంతో.. ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.నాగ్‌, చైతుతో పూరి చిత్రం?

Updated By ManamTue, 05/22/2018 - 13:54

nag'శివ‌మ‌ణి', 'సూప‌ర్' చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న క‌థానాయ‌కుడు నాగార్జున‌, ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడో సినిమా రాబోతుందా? అవున‌నే వినిపిస్తోంది టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. ఇటీవ‌లే త‌న త‌న‌యుడు ఆకాశ్ పూరిని క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ పూరి తెర‌కెక్కించిన 'మెహ‌బూబా' విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. సినిమా ఫ‌లితం ఎలా ఉన్నా.. ఆకాశ్ న‌ట‌న‌కు మంచి పేరు వ‌చ్చింది. అలాగే పూరి శైలి కూడా కాస్త మారింద‌నే స‌మీక్ష‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలోనే.. ఓ వైవిధ్య‌మైన క‌థ‌ను త‌యారు చేసుకుని నాగ్‌కు ఆ స‌బ్జెక్ట్ వినిపించార‌ట పూరి. క‌థ న‌చ్చ‌డంతో.. నాగ్ కూడా ఈ సినిమా చేసేందుకు ఆస‌క్తి చూపించార‌ట‌. అంతేగాకుండా.. ఈ సినిమాలో నాగ్‌తో పాటు ఆయ‌న త‌న‌యుడు నాగ‌చైత‌న్య కూడా న‌టించే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాపై క్లారిటీ వ‌స్తుంది. ఇదిలా ఉంటే.. నాగ్ కొత్త చిత్రం 'ఆఫీస‌ర్' జూన్ 1న విడుద‌ల కానున్న సంగతి తెలిసిందే.'వ‌చ్చాడ‌య్యో సామి'.. ఫుల్ వీడియో సాంగ్‌

Updated By ManamTue, 05/22/2018 - 13:41

banసూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం 'భ‌ర‌త్ అనే నేను'. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాలో ముఖ్య‌మంత్రి భ‌ర‌త్ రామ్‌గా మ‌హేశ్ సంద‌డి చేశారు. కియరా అద్వానీ క‌థానాయిక‌గా న‌టించిన ఈ సినిమాని డి.వి.వి.దాన‌య్య నిర్మించారు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందించిన ఈ చిత్రం ఏప్రిల్ 20న విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలోని పాపుల‌ర్ సాంగ్ 'వ‌చ్చాడ‌య్యో సామి' పాట తాలుకూ ఫుల్ వీడియో సాంగ్‌ను చిత్ర బృందం అధికారికంగా విడుద‌ల చేసింది. మ‌హేశ్ త‌దిత‌రుల‌పై చిత్రీక‌రించిన ఈ పాట వైపు మీరూ ఓ లుక్కేయండి మ‌రి..
Related News