china

వాణిజ్య యుద్ధం... కొరివితో తల గోక్కోవడమే

Updated By ManamSat, 09/22/2018 - 22:18

US-CHINAన్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శారీరక బరువునే కాకుండా ఇతర దేశాలతో వర్తక సంబంధాలలో అమెరికాకు అనవసర భారంగా పరిణమి స్తున్న వాటిని తగ్గించుకోవాలని చూస్తున్నారు. సుమారుగా 129 కిలోల బరువుండే ట్రంప్ అమెరికా ఇంతకుముందు కుదుర్చుకున్న ఒప్పందాలు, ఒడంబడికలపై తిరిగి చర్చలు జరిపేందుకు ఇష్టపడుతు న్నారు. ఆయన ఈ విషయంలో ప్రధానంగా చైనాను లక్ష్యంగా చేసుకున్నారు. చైనా ప్రధాని జిన్‌పింగ్ సుమారుగా 64 కిలోల బరువుంటారు. ట్రంప్ 200 బిలియన్ డాలర్ల విలువ చేసే చైనా దిగుమతులపై ఇటీవల రెండో విడత (10 శాతం) సుంకాలు విధించారు. దీనికి ప్రతిగా చైనా కూడా సుంకాల విధింపునకు దిగితే, తామూ మరిన్ని సుంకాలు విధిస్తామని అదే సమయంలో ట్రంప్ హెచ్చరించారు. అగ్ర రాజ్య అధినేత అలా హెచ్చరించగలిగిన స్థితిలోనే ఉన్నారు. ఎందుకంటే, అమెరికా నుంచి చైనా చేసుకుంటున్న దిగుమతుల కంటే, చైనా నుంచి అమెరికా చేసుకుంటున్న దిగుమతులు చాలా ఎక్కువ. చైనా స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి) 12.2 ట్రిలియన్ డాలర్లకన్నా  అమెరికా జి.డి.పి 19.3 ట్రిలియన్ డాలర్లు చాలా ఎక్కువ. ఆ విధంగా అమెరికా సామర్థ్యమే ఎక్కువ. శారీరకంగా, ఆర్థికంగా, స్వాభావికంగా ట్రంప్ బలమే ఎక్కువ. అమెరికా మేధా ఆస్తికి మెరుగైన సంరక్షణ అవసరమని ట్రంప్ కోరుకుంటున్నారు. ఆయన అలా కోరుకోవడంలో తప్పు లేదు. మేధా ఆస్తి హక్కులను రక్షించడంలో చైనా చరిత్ర బలహీనంగా ఉంది. దాన్ని సరైన మార్గంలో పెట్టేందుకు, మేధా ఆస్తి హక్కులు కాపాడుకునేందుకు చైనాతో వాణిజ్య యుద్ధానికి సైతం ట్రంప్ వెనుకాడదలచుకోలేదు. 

డ్రాగన్ ప్రతి దాడి
కానీ, చైనా తెంపరితనంతో ప్రతీకార సుంకాల విధింపునకు దిగుతుందనడంలో సందేహం లేదు. సెప్టెంబర్ 24 నుంచి 60 బిలియన్ డాలర్ల విలువ చేసే అమెరికా దిగుమతులపై సుంకాల విధింపునకు అది రంగం సిద్ధం చేసుకుంది. దీనివల్ల మొదటగా నష్టపోయేది అమెరికన్ రైతులు. అమెరికన్ సోయాబీన్‌కు చైనా అతి పెద్ద కొనుగోలుదారుగా ఉంది. ధరను బాగా తగ్గించకుండా, ఇతర కొనుగోలుదార్లను చూసుకునేందుకు అమెరికన్ రైతులకు ఉన్న అవకాశాలు తక్కువ. వాణిజ్య యుద్ధం వల్ల రెండు దేశాలు నష్టపోకుండా ఉండడం కష్టం. చైనాలో యాపిల్, స్టార్‌బక్స్ తదితర అమెరికన్ కంపెనీలు పనిచేస్తున్నాయి. చైనా వాటికి ఎంతో కొంత తప్పకుండా నష్టం కలిగించగలదు. వాటికి చైనా పెద్ద మార్కెట్‌గా ఉంది. ప్రపంచ జి.డి.పిలో ప్రపంచ వాణిజ్య వాటా 50 శాతం పైగానే ఉంటుంది. కనుక, దానికి ఏ విధమైన అవాంతరం వాటిల్లినా ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. వాణిజ్య యుద్ధం వల్ల వాణిజ్య భాగస్వాముల సమతూకాలలో మార్పుచేర్పులుంటాయి. సోయాబీన్లను చైనా మరెక్కడి నుంచో కొనుగోలు చేస్తే, వస్త్రాలకు చైనా మరో వనరు చూసుకుంటుంది. అయితే, ఆశించిన స్థాయిలో ఉండగల సరఫరాదార్లను అది కనుగొనవలసి ఉంటుంది. పూర్తి స్థాయి వాణిజ్య యుద్ధం మొదలైతే ఎస్ అండ్  పి మార్కెట్ క్యాపిటలైజేషన్ 6 ట్రిలియన్ డాలర్లు తగ్గుతుందని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. అది ఇంకా అనేక విధాలుగా నష్టం వాటిల్లజేస్తుంది. 

ఉదాహరణకు, రుణ భారం అధికమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కంపెనీల రుణం 237 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఒక అంచనా. ప్రపంచ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు 69 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. కనుక, వాణిజ్య యుద్ధాల ఫలితంగా మార్కెట్ క్యాపిటలైజేన్ తగ్గితే, రుణాలను తిరిగి చెల్లించడంపైన కూడా దాని ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తక్షణం రుణాల చెల్లింపునకు ఒత్తిడి వస్తే కంపెనీలు అల్లల్లాడతాయి. ఇంకా అనేక రకాల సవాళ్ళు ఎదురవుతాయి. రూపాయి పతనాన్ని అరికట్టేందుకు భారతదేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రణాళికను రూపొందిస్తోంది. బహుశా, మూలధనాన్ని కాపాడుకోవడం ద్వారా అది ఆ పనికి శ్రీకారం చుట్టాల్సి ఉంటుంది. బ్యాంకుల ఏకీకరణ వల్ల ఆశించిన ఫలితం దక్కక పోవచ్చు. మన దేశంలో సుమారు 100 ప్రభుత్వ రంగ సంస్థలు నిరంతరం నష్టాలను పోగేస్తూనే ఉన్నాయి. పన్ను చెల్లింపుదార్ల నిధులతో అవి నెట్టుకొస్తున్నాయి. మూలధనాన్ని కాపాడుకోవాలనే అభిమతం ప్రభుత్వానికి లేకపోతే కరెన్సీ విలువ క్షీణించి తీరుతుందని ఆర్థిక నిపుణుల ఉవాచ.మళ్లీ రాజుకున్న సుంకాల వేడి

Updated By ManamWed, 09/19/2018 - 00:23
  • చైనాపైకొత్తగా 10 శాతం సుంకాలు విధించిన ట్రంప్ 

  • వచ్చే ఏడాది నుంచి 25 శాతానికి పెంపు

US-CHINAవాషింగ్టన్: కొంత కాలంగా వాణిజ్య పరంగా చైనాను హెచ్చరిస్తూ వస్తున్న అమెరికా మంగళవారం అన్నంత పనీ చేసింది. చైనాకు చెందిన మరో200 బిలియన్ డాలర్ల విలువైన వస్తువుల దిగుమతులపై 10 శాతం సుంకాలను విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రం ప్ ప్రకటించారు. ఈ నెల 24 నుంచి ఈ సుంకాలు అమలు కానున్నట్లు ఆయన  తెలిపా రు. అయితే పెంచిన ఈ సుంకాలు ఈ ఏడాది చివరి వరకు మాత్రమే వర్తిస్తాయని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి సుంకా లు 25 శాతానికి పెరుగుతాయని ఆయన  వెల్లడించారు. చైనా అనుచిత వాణిజ్య విధానా ల్లో మార్పు తీసుకురానందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ కొత్త అదనపు సుంకాలు అమెరికన్ కంపెనీలు సము చితంగా చైనా కంపెనీల వ్వవహార శైలికి ప్రతిగా వ్యవహరించే అవకాశం కల్పిస్తాయని అన్నారు.  కాగా ఈ ఏడాది మొదట్లోనే 50 బిలియన్ డాలర్ల విలువైన చైనా వస్తువులపై 25 శాతం సుంకా లను అమెరికా విధించింది. చైనా నుంచి దిగు మతి చేసుకున్న వస్తువులను కొనుగోలు చేసే వారు ఆయా వస్తువుల ఖరీదులలో పెరుగు దలను క్రమంగా చవిచూస్తారు. ‘‘ఒక వేళ చైనా మా రైతులు, పరిశ్రమలపై ప్రతీకార చర్యలకు పాల్పడితే మేము వెంటనే మూడో దశలో భాగం గా 267 బిలియన్ డాలర్ల సుంకాలను అదనంగా విధిస్తాం ’’ అని ట్రంప్ చైనాను హెచ్చరించారు. గత కొన్ని నెలల నుంచి చైనా దాని అనుచిత వాణిజ్య విధానాలను మార్చుకోవాలని అమెరికా హెచ్చరిస్తూ వస్తోంది. ఆ దేశం తీసుకోవాల్సిన మార్పుల గురించి తాము ఎప్పటికప్పుడు తాము అనువైన అవకాశాలు కల్పించినట్లు అమె రికా పేర్కొంది. అయినా చైనా వాణిజ్య విధా నాల్లో మార్పురాలేదని అమెరివా ఆరోపించింది. చైనా అమెరికాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్దం కారణంగా ఇరు దేశాలు సుంకాలు, ప్రతి సుంకాలకు పాల్పడుతున్నాయి. తాజాగా విధిచిన సుంకాలపై చైనా దీటుగా స్పందిస్తూ అమెరికాకు ప్రతి సుంకాలు తప్పవని హెచ్చరిం చింది. అయితే ఈ పరిస్థితులపై చర్చించడానికి అమెరికా సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ తెలిపారు. చేనాను తాకిన సూపర్ టైపూన్

Updated By ManamSun, 09/16/2018 - 22:22
  • 24 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు

  • గ్వాంగ్‌డాంగ్‌ను తాకిన మంగ్‌ఖుట్ టైపూన్

  • ఫిలిప్పీన్స్‌కు కోలుకోలేని దెబ్బ

  • వివిధ ప్రమాదాల్లో 64 మంది మృతి

  • ఉత్తర కరోలినాలో కొనసాగుతున్న బీభత్సం

chinaబీజింగ్/ట్యగెగారో: ఫిలిప్పీన్స్‌లో బీభత్సం సృష్టించిన మంగ్‌ఖుట్ సూపర్ టైపూన్ ఆదివారం చైనాను తాకింది. దేశ దక్షిణ ప్రాంతంలోని గ్వాంగ్‌డాంగ్ రాష్ట్రంలోని జియాంగ్‌మెన్ నగరం వద్ద తీరం దాటింది. టైపూన్ ప్రమాద తీవ్రత నేపథ్యంలో 24 లక్షల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 400 విమానాల రద్దు చేశారు. సముద్రంలో చేపల వేటకువెళ్లిన 48 వేల జాలర్ల బోట్లను వెనక్కి రప్పించారు. గంటకు 162 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో ఇప్పటికే రక్షణ చర్యలు ప్రారంభించారు. కాగా,  ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత సంవత్సరంలో అతి పెద్దదైన మంగ్‌ఖుట్ టైపూన్ సూపర్ టైఫూన్ ధాటికి ఫిలిప్పీన్స్ ఉత్తర తీర ప్రాంతం చిగురుటాకులా వణికిపోయింది. అత్యధిక ప్రభావం పడిన లుజాన్ దీవితో పాటు ఇతర ప్రాంతాల్లో చోటు చేసుకున్న ప్రమాదాల్లో మృతుల సంఖ్య ఆదివారంనాటికి 64కి చేరుకుందని అధికారులు తెలిపారు.  అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. దాదాపు 50 లక్షల మందిపై తీవ్ర ప్రభావం చూపనుందని అధికారులు అంచనా వేశారు. ఫిలిప్పీన్స్‌లో బీభత్సం సృష్టించిన టైపూన్ తన దిశను మార్చుకుని హాంగ్‌కాంగ్, చైనా దిశగా ప్రయాణించడం ప్రారంభించింది. ఆదివారం సాయంత్రానికి  చైనా తీరాన్ని తాకింది. 20 అడుగుల ఎత్తు వరకు సముద్ర అలలు ఎగిసిపడు తాయన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు, అమెరికాలోని ఉత్తర కరోలినా కూడా భీకర హరికేన్ ‘ఫ్లారెన్స్’ ధాటికి విలవిలలాడుతోంది. వరదల్లో చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు నేవీ, కోస్ట్‌గార్డ్, పౌర, స్వచ్ఛంద సేవా బృందాలు పెద్ద సంఖ్యలో రంగంలోకి దిగాయి. వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన వారి సంఖ్య 11కు చేరిందని అధికారులు తెలిపారు. గంటకు 145 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని, భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. దాంతో ఉత్తర కరోలినాలోని నదులన్నీ ప్రమాదస్థాయిని మించి పొంగిపొర్లుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో ఒక్కరోజే 60 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసిందని తెలిపారు. అలీబాబా సంచలన నిర్ణయం

Updated By ManamSat, 09/08/2018 - 13:35

Jack Maబీజింగ్: చైనా అత్యంత సంపన్నుడు, అలీబాబా సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ జాక్ మా సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోమవారం జాక్ మా 54వ పుట్టినరోజు కాగా.. ఆ రోజున తాను రిటైర్‌మెంట్ తీసుకోనున్నట్లు ప్రకటించారు. విరమణ ముగింపు కాదని, మరో శకానికి ప్రారంభం అని తెలిపిన జాక్ మా.. తన తదుపరి సమయాన్ని ఫిలాంత్రఫీ కోసం కేటాయిస్తానని జాక్ మా వెల్లడించారు.

అయితే ఇంగ్లీష్ టీచర్ అయిన జాక్ మా.. 1999లో ఇ-కామర్స్ రంగంలోకి అడుగుపెట్టి అలీబాబా సంస్థను స్థాపించారు. తక్కువ కాలంలో ఈ సంస్థ వేగంగా అభివృద్ధి చెంది బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించింది. ఆ తరువాత 2013లో సీఈవో పదవి నుంచి తప్పుకున్న జాక్ మా.. ఆ తరువాత నుంచి కంపెనీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ తనకు ఆదర్శమని, బిల్‌గేట్స్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇంకా సంపన్నుడిగా ఎదగాలని కాదు. ముందుగానే రిటైర్ అవ్వాలని అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన జాక్ మా.. తాజాగా రిటైర్‌మెంట్ ప్రకటించి, అందరికీ షాక్ ఇచ్చాడు.చేతులు క‌లిపిన చైనా, ర‌ష్యా

Updated By ManamSat, 08/11/2018 - 15:29
china helps Russia thwart US bid to freeze bank’s assets

ఉత్త‌ర‌కొరియాపై మ‌ళ్లీ ఆంక్ష‌లు విధించేందుకు అమెరికా చేస్తున్న య‌త్నాన్ని చైనా, ర‌ష్యాలు అడ్డుకున్నాయి. ఆగ్రోసూయుజ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాంకు ఉత్త‌ర‌కొరియాకు సాయం చేస్తోంద‌ని అమెరికా ఆరోప‌ణ‌. దీంతో ఆ బ్యాంకుపై ఆంక్ష‌లు విధించాల‌ని గ‌త వారం ఐక్య‌రాజ్య‌స‌మితిని అమెరికా కోరింది.

అయితే, ర‌ష్యాకు చెందిన ఆ బ్యాంకుపై చ‌ర్య‌లు తీసుకోవ‌డాన్ని చైనా శుక్ర‌వారం ఖండించింది. త‌మ బ్యాంకుపై మోపిన ఆరోప‌ణ‌ల‌పై ర‌ష్యా అనుమానం వ్య‌క్తం చేసింది. దీంతోపాటు ఉత్త‌రకొరియాకు చెందిన మ‌రో మూడు ఆర్థిక సంస్థ‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న డిమాండ్‌ను తోసిపుచ్చాయి.

అమెరికాతో చ‌ర్చ‌ల‌కు ఉత్త‌ర‌కొరియా ముందుకు వ‌చ్చినందున ఆ దేశంపై ఆంక్ష‌లు స‌డ‌లించాల‌ని కూడా కోరాయి. కాగా, ఉత్త‌ర కొరియాపై మ‌రిన్ని ఆంక్ష‌లు విధించేందుకు అమెరికా ప్ర‌య‌త్నించ‌డం మూడు వారాల్లో ఇది రెండోసారి.అమెరికా ‘స్పేస్ ఫోర్స్’

Updated By ManamSat, 08/11/2018 - 00:23
  • చైనా, రష్యాలను ఎదుర్కొనేందుకే..

  • 2020లోగా ఏర్పాటుకు ప్రణాళికలు

  • కాంగ్రెస్ ఎదుట ప్రతిపాదనలు


imageవాషింగ్టన్: పదాతి దళాన్ని చూశాం! నౌకా దళాన్ని, వాయు సేనను కూడా చూశాం! భవిష్యత్తులో ‘అంతరిక్ష దళం’ను కూడా చూడాల్సి రావొచ్చు! చైనా, రష్యా నుంచి తన ఆధిపత్యానికి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న నేపథ్యంలో కొత్తగా ‘స్పేస్ ఫోర్స్’ ఏర్పాటు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ఈ మేరకు తన ప్రతిపాదనలను కాంగ్రెస్  ముందుంచారు. వాటికి ఆమోదం లభిస్తే త్వరలోనే ‘స్పేస్ ఫోర్స్’ కార్యరూపం దాల్చనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను కొద్దిరోజుల క్రితం ఆ దేశ రక్షణశాఖ మంత్రి మెక్ పెన్స్ చూచాయగా వెల్లడించారు.

‘‘రష్యా, చైనా అంతరిక్ష కార్యక్రమాలు సైనిక అవసరాలతో ముడిపడి ఉన్నాయి. అదే సమయంలో ఉత్తరకొరియా, ఇరాన్‌తోనూ ఇబ్బందులు ఉన్నాయి. ఆ హెచ్చరికలు చివరికి అంతరిక్షంలో ఘర్షణకు దారితీయొచ్చు. రష్యా కొద్ది రోజుల క్రితం యాంటీ శాటిలైట్ మిసైల్ సిస్టమ్ పీఎల్-19/నుడాల్‌ను పరరీక్షించింది. అలాగే చైనా కూడా ఇలాంటి పరీక్షలే నిర్వహించినట్లు తెలిసింది. ఎస్‌సీ-19 లేదా డీఎన్-3 పేరుతో అంతరిక్షంలోని శాటిలైట్లను పేల్చేసే పరిజ్ఞానాన్ని చైనా పరీక్షించింది.

image

వాటి వాలకాన్ని చూస్తుంటే అంతరిక్షంలో యుద్ధానికే సిద్దపడినట్లు అవగతమవుతోంది. మేం కూడా సిద్ధం కావాలని భావిస్తున్నాం. ప్రత్యేకంగా స్పేస్ ఫోర్స్ విభాగాన్ని ఏర్పాటుకు యోచిస్తున్నాం’’ అని పెన్స్ పేర్కొన్నారు.  ఇందుకు సంబంధించిన లోగోలను కూడా విడుదల చేశారు. ఓటింగ్ ద్వారా ఒక లోగోను ఎన్నుకోవాలని సూచించారు.  2020 నాటికి దీనికి కార్యరూపం ఇవ్వాలని భావిస్తున్నారు.గ్రేట్ వాల్ ఆఫ్ త‌మిళ్‌..సూప‌ర్ హిట్‌

Updated By ManamFri, 08/10/2018 - 16:04

Great Wallచైనా రేడియో ఇంట‌ర్నేష‌న‌ల్‌కు చెందిన ఓ యాంక‌ర్‌..త‌మిళంలో మాట్లాడిన రెండు నిమిషాల వీడియో ఆన్‌లైన్‌లో హ‌ల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఉన్న యువ‌తి తెల్ల‌ని అనార్క‌లి వేసుకుని వ‌ణ‌క్కం అంటూ మాట్లాడ‌టం ప్రారంభించి త‌న పేరు నిహ్లానీ అని ప‌రిచ‌యం చేసుకుంది. విదేశాల్లో చైనీయుల ప‌లుకుబ‌డిని పెంచ‌డ‌మే ఈ వీడియో ఉద్దేశం.

అయితే, ఈ వీడియోను చూసి మ‌హింద్రా గ్రూపు చైర్మ‌న్ ఆనంద్ మ‌హింద్రా ఆ చైనా యువ‌తిని మెచ్చుకున్నారు. ఎంతో క‌ష్ట‌త‌ర‌మైన త‌మిళ భాష‌ను అన‌ర్గ‌ళంగా మాట్లాడినందుకు గాను.. గ్రేట్ వాల్ ఆఫ్ త‌మిళ్ పై విజ‌యం సాధించింద‌ని  పేర్కొన్నారు. 67 ల‌క్ష‌ల మంది ఫాలోయ‌ర్లు ఉన్న త‌న ట్విట‌ర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోను 50 వేల మంది వీక్షించ‌గా 3,600 లైక్‌లు వ‌చ్చాయి. ప్ర‌పంచ ప్రాచీన భాష‌ల్లో త‌మిళం కూడా ఒక‌టి. భార‌త్‌తోపాటు శ్రీ‌లంక‌, సింగ‌పూర్ దేశాల్లో ఈ భాష మాట్లాడేవారు ఉన్నారు.

 లంక-చైనా చెలిమితో భారత్ కలత

Updated By ManamSun, 08/05/2018 - 23:53

india-chinaముంబై: శ్రీలంకలో మరిన్ని నౌకాశ్రయాలలో ఇన్వెస్ట్ చేసేందుకు చైనా ముందుకు రావడాన్ని ఇండియా సునిశితంగా గమనిస్తోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తన అడుగుజాడలను పెంచుకునేందుకు ఈ ఏషియన్ పొరుగు దేశం చేస్తున్న ప్రయత్నం పట్ల భారత్ కలత చెందుతోంది. శ్రీలంకకు చైనా ఇటీవల ఒక యుద్ధ నౌకను కూడా కానుకగా ఇచ్చింది. ఆసియాలో అగ్ర రాజ్యాలైన ఇండియా, చైనాలకు శ్రీలంక నూతన రణరంగంగా పరిణమించడం ప్రారంభించింది. శ్రీలంకలో మూడు ముఖ్యమైన పోర్టులలో వచ్చే మూడేళ్ళలో చైనా, శ్రీలంక పోరట్స్ అథారిటీ, ఇండియాలు 70 కోట్ల డాలర్లకు పైగా ఇన్వెస్ట్ చేయనున్నాయి’’ అని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. శ్రీలంకకు చైనా ఇటీవల కానుకగా ఇచ్చిన యుద్ధ నౌక వివరాలు వెల్లడి కానప్పటికీ అది టైప్ 053 యుద్ధ నౌక లేదా టైప్ సి28ఎ నౌక లేదా (జలాంతర్గాములను ధ్వంసం చేసేందుకు ఉపయోగించే)  సి13బి కోర్వెట్ అయి ఉండవచ్చని మార్కెట్ పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే, చైనా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్న అత్యంత సాధారణ యుద్ధ నౌకలలో ఇవే ఉంటున్నాయి. హిందూ మహా సముద్ర ప్రాంతంలోకి చైనా చొచ్చుకురావడాన్ని నిశితంగా పరిశీలించవలసిన అవసరం ఉన్నప్పటికీ, సైనిక సహాయ ప్యాకేజీలలో భాగంగా నౌకలను ఇవ్వడం మామూలేనని, ఇండియా కూడా ఇటీవలి కాలంలో, ఒక నౌకను ఇచ్చిందని ఆ అధికారి తెలిపారు. శ్రీలంకలోని పోర్టులతోపాటు, ఇరాన్ లో చబ్బహార్ పోర్టులో రెండు బెర్తుల మేనేజ్ మెంట్, ఆపరేషన్ కు 50 కోట్ల డాలర్ల పెట్టుబడి పెడతామని ఇండియా మాట ఇచ్చింది.  సిట్వే, పాలేట్వా పోర్టుల వద్ద  మౌలిక వసతులను మెరుగుపరచే ప్రాజెక్టులలో మైన్మార్‌కు సహాయపడుతోంది. 

శ్రీలంక పోర్టుల అభివద్ధికి ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా చైనా ఇబ్బడిముబ్బడిగా లాభపడే’’ అవకాశం ఉందని అభిజ్ఞ వర్గాలవారు తెలిపారు. అయితే, శ్రీలంకలో చైనాకు చెందిన వివిధ ప్రాజెక్టులు అభిశంసనకు గురయ్యాయి. శ్రీలంకను ఒక సైనిక స్థావరంగా చైనా ఉపయోగించుకునే అవకాశముందని అమెరికా, ఇండియా, జపాన్ లు ఆందోళన వ్యక్తం చేశాయి. వచ్చే మూడేళ్ళలో శ్రీలంకలో చైనా, ఇండియాలు రెండూ  కొత్త పెట్టుబుడలు పెట్టబోతున్నాయి. ఉత్తర శ్రీలంకలోని కనకేశన్ తురై పోర్టు ఉన్నతీకరణకు ఇండియా 4 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. దానితో అది కమర్షియల్ పోర్టుగా రూపాంతరం చెందుతుంది. ఎక్స్ పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ద్వారా దానికి ఆర్థిక సహాయం అందిస్తోంది. హంబన్ టోటా పోర్టు ప్రాజెక్టుకు చైనా నుంచి శ్రీలంక కోశాగారం 974 మిలియన్ డాలర్లను అందుకున్నట్లు చెబుతున్నారు. అక్కడ పోర్టు అభివద్ధి పనికి చైనా ఇప్పటికే 146 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. శ్రీలంకలోని కనకేశన్ తురై పోర్టు 2004 డిసెంబర్ లో వచ్చిన సునామీ, 2008లో సంభవించిన నిషా తుపానులో బాగా దెబ్బతినిపోయింది.  దాని పునర్నిర్మాణానికి ఎక్స్ పోర్ట్ -ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్ బ్యాంక్) ఈ ఏడాది జనవరిలో 45.27 మిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేసింది. దీనితో శ్రీలంకలో వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఇండియా చేస్తున్న సహాయం 1.4 బిలియన్ డాలర్లకు చేరినట్ల యిందని నివేదికలు సూచిస్తున్నాయి. కొలంబో నౌకాశ్రయ విస్తరణ ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్ లో భాగమైన ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ నిర్మాణానికి శ్రీలంక పోరట్స్ అథారిటీ 100 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనుంది. గాలె హార్బర్ ను టూరిజం పోర్టుగా మార్చే ప్రణాళికలు కూడా ఊపందుకున్నాయి. నెదర్లాండ్స్ కు చెందిన కన్సల్టెన్సీ సంస్థ మారిటైమ్ అండ్ ట్రాన్స్ పోర్ట్ బిజినెస్ సొల్యూషన్స్ శ్రీలంకకు మారిటైమ్ రంగ మాస్టర్ ప్రణాళికను రూపొందించి ఇచ్చింది. ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ నిధులు సమకూర్చిన ఆ ప్రాజెక్టు పూర్తి కావస్తోందని చెబుతున్నారు. శ్రీలంకకు చెందిన క్రూజ్ లైనర్ వ్యాపారాన్ని ప్రోత్సహించాలని శ్రీలంక ప్రభుత్వం భావిస్తున్న దష్ట్యా కొలంబో పోర్టుకు మరిన్ని మౌలిక వసతుల సదుపాయాలు తోడుకానున్నాయి.  ఫలితంగా, అక్కడ మరిన్ని క్రూజ్ లైనర్లరు నిలిపి ఉంచడం సాధ్యపడుతుంది.చైనాలో రీ ఎంట్రీకి గూగుల్‌ యత్నం

Updated By ManamFri, 08/03/2018 - 11:53
google-china

చైనా నిబంధ‌న‌ల‌ను త‌ట్టుకోలేక బ‌య‌ట‌కు వ‌చ్చిన గూగుల్ తిరిగి అక్క‌డ కార్య‌క‌లాపాలు నిర్వ‌హించేందుకు స‌న్నాహాలు ప్రారంభించింది.  డ్రాగ‌న్‌ సెన్సార్‌షిప్‌, హ్యాకింగ్ కార‌ణంగా 2010లో అక్క‌డి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అక్క‌డ గూగుల్ సెర్చ్ ఇంజిన్‌, గూగుల్ మెయిల్, ప్లే యాప్ స్టోర్‌ త‌దిత‌రాలు ప‌నిచేయ‌క‌పోవ‌డంతో మ‌రో ప్ర‌త్యామ్నాయంతో అడుగు పెట్టేందుకు చైనా అధికారుల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతోంది.

బ్లాక్‌ లిస్టెడ్‌ సెర్చ్‌ అనే మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. దీని కోసం ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టంకు మార్పులు చేసి చైనా అధికారులకు చూపించింది.  అయితే, ఈ వార్తలపై గూగుల్‌ స్పందించ‌లేదు. గూగుల్ ప్ర‌య‌త్నాల‌పై చైనా మాన‌వ హ‌క్కుల సంఘం తీవ్రంగా స్పందించింది. చైనా సెన్సార్‌షిప్‌న‌కు గూగుల్ అంగీక‌రించ‌డం ఇంట‌ర్‌నెట్ స్వ‌తంత్ర‌త‌కు చీక‌టి రోజుగా అభివ‌ర్ణించింది.సుష్మపై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు

Updated By ManamThu, 08/02/2018 - 17:11
sushma-rahul

న్యూఢిల్లీ : కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ  తీవ్ర విమర్శలు చేశారు. చైనా ఒత్తిడికి సుష్మ తలొంచారంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా  భారత్‌, చైనా మధ్య డోక్లామ్‌ వివాదంపై సుష్మా స్వరాజ్ బుధవారం లోక్‌సభలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. డోక్లామ్ వివాదం గత ఏడాదే సద్దుమణిగిందంటూ, దాంట్లో ఎలాంటి మార్పులేదని ఆమె ప్రకటన చేశారు. 

దీంతో సుష్మా స్వరాజ్ ప్రకటనపై రాహుల్ అసహనం వ్యక్తం చేస్తూ చూస్తుంటే చైనా శక్తి ముందు ఆమె తలొగ్గడం ఆశ్చర్యంగా ఉంది అని ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. ఆమె వ్యాఖ్యలు జవాన్లను మోసగించేవిగా ఉన్నాయని అన్నారు. రాహుల్ ఈ మేరకు ట్విట్ చేస్తూ ‘డోక్లామ్‌లో మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించిన చైనా’ అనే కథనాన్ని కూడా షేర్ చేశారు.
 

Related News