UNO

చంద్రబాబు అమెరికా పర్యటన ఖరారు

Updated By ManamTue, 09/11/2018 - 10:28

Chandrababu Naiduఅమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమెరికా పర్యటన ఖరారైంది. ఈ నెల 23 నుంచి 26వ తేది వరకు నాలుగురోజులు చంద్రబాబు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితిలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. అనంతరం వివిధ వ్యాపారవేత్తలతో సమావేశం కానున్నారు. పర్యటనను ముగించుకొని ఈ నెల 27న అమెరికా నుంచి ఏపీకి తిరిగి రానున్నారు చంద్రబాబు.



ఐరాసలో భారతీయుడికి గౌరవం

Updated By ManamWed, 08/29/2018 - 04:25
  • అసిస్టెంట్ సెక్రటరీ జనరల్‌గా త్రిపాఠీ

  • యూఎన్‌ఈపీలో ఉన్నత పదవి 

  • పర్యావరణ అంశాలలో సుప్రసిద్ధుడు

imageఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితిలో భారతీయుడికి ప్రతిష్ఠాత్మక పదవి దక్కింది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ)లో అసిస్టెంట్ సెక్రటరీ జనరల్‌గా ప్రముఖ భారత ఆర్థికవేత్త, ఐక్యరాజ్యసమితి అధికారి అయిన సత్య ఎస్.త్రిపాఠీని నియమించారు. దాంతోపాటు ఆయన న్యూయార్క్ కార్యాలయ అధినేతగా కూడా ఉంటారు. ఈ మేరకు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరరెస్ నియామక ఉత్తర్వులు వెలువరించారు. ఇంతకుముందు యూఎన్‌ఈపీ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ పదవిలో ట్రినిడాడ్ టొబాగోకు చెందిన ఎలియట్ హారిస్ ఉండేవారు. 2017 నుంచి త్రిపాఠీ యూఎన్‌ఈపీలో 2030 ఎజెండా ఫర్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో సీనియర్ సలహాదారుగా ఉండేవారు. 

అభివృద్ధి ఆర్థికవేత్తగాను, న్యాయవాదిగాను 35 ఏల్ల అనుభవం ఉన్న త్రిపాఠీ 1998 నుంచి ఐక్యరాజ్యసమితిలో యూరప్, ఆసియా, ఆఫ్రికా ఖండాలలో పనిచేశారు. ప్రధానంగా సుస్థిర అభివృద్ధి, మానవహక్కులు, ప్రజాస్వామ్య పాలన, న్యాయ వ్యవహారాలపై ఆయన దృష్టిపెట్టారు. అంతకంటే ముందు ఆయన అభివృద్ధి చెందుతున్న దేశాలలో అడవుల నరికివేత వల్ల వెలువడే ఉద్గారాల తగ్గింపు, అడవుల క్షీణత లాంటి అంశాలకు సంబంధించి ఐరాసలో డైరెక్టర్‌గాను, ఎగ్జిక్యూటివ్ అధినేతగాను పనిచేశారు. దాంతోపాటు సునామీ అనంతర సహాయ కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యతలు కూడా చూశారు. ఒడిశాలోని బెర్హంపూర్ యూనివర్సిటీ నుంచి కామర్స్‌లో బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీలు చేయడంతో పాటు న్యాయవాద విద్యలోనూ మాస్టర్స్ చేశారు. అంతర్జాతీయంగా పర్యావరణ అంశాలపై ఆయన సుప్రసిద్ధులు. 



ఐరాసలో పాక్ అడ్డగోలు వాదన

Updated By ManamSat, 01/20/2018 - 14:13

lodhiఉగ్రవాదానికి పాక్ ఊతమిస్తోందంటూ ఐరాస వేదికగా భారత్ చేసిన ఆరోపణలకు సూటిగా సమాధానమివ్వలేని పాక్...కుల్‌భూషన్ జాదవ్ అంశాన్ని తెరమీదకు తెచ్చింది.  ఐరాసలో పాక్ ప్రతినిధి మలీహ లోధి మాట్లాడుతూ పాక్ గడ్డపై తీవ్రవాద చర్యలకు భారతే ఊతమిస్తోందని అడ్డగోలు వాదన చేశారు. దీనికి కుల్‌భూషణ్ జాదవ్ ఉదంతమే తార్కాణమని చెప్పుకొచ్చారు. కుల్‌భూషణ్ జాదవ్ వ్యవహారంతో పాక్‌లో తీవ్రవాదాన్ని భారత్ ప్రేరేపిస్తుండడం అనుమానాలకు తావు లేకుండా నిర్ధారణ అయ్యిందన్నారు.  

Read Related Article: ఐరాసలో పాక్‌ను ఏకిపారేసిన భారత్

పాకిస్థాన్ ఆలోచనా విధానంలో మార్పు రావాలని కోరుకునే వారు...తమ వైఖరిపై ఆత్మపరిశీలన చేసుకోవాలని వ్యాఖ్యానించింది. పాకిస్థాన్ తీవ్రవాదులకు స్వర్గధామంగా మారుతోందని ఐరాసలో అమెరికా, ఆఫ్గన్ ప్రతినిధులు చేసిన ఆరోపణలను కూడా పాక్ ప్రతినిధి లోథి తోసిపుచ్చారు. 





Related News