road accident

తిరుచురాపల్లిలో ఘోర రోడ్డుప్రమాదం

Updated By ManamSun, 09/30/2018 - 11:24
  • ఎనిమిది మంది దుర్మరణం.. నలుగురికి గాయాలు

  • ఆగివున్న లారీని ఢీకొన్న స్కార్పియో వాహనం

Road accident, Lorry, Scorpio, family members killedచెన్నై: తమిళనాడులోని తిరుచురాపల్లి వద్ద ఆదివారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఇనుప లోడుతో రహదారి పక్కన నిలిచి ఉన్న లారీని స్కార్పియో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. చెన్నైకి చెందిన ఓ కుటుంబం శనివారం రాత్రి స్కార్పియో వాహనంలో తిరుచ్చి బయల్దేరింది.

అతివేగంతో దూసుకెళ్తున్న స్కార్పియో వాహనం తిరుచ్చి సమీపంలోని సమయపురం టోల్‌గేట్‌ వద్ద ఆగివున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది అక్కడిక్కడే మృతిచెందగా, గాయపడ్డ క్షతగాత్రులను తిరుచ్చిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషాదం: సంగీత దర్శకుడికి తీవ్ర గాయాలు.. కుమార్తె మృతి

Updated By ManamTue, 09/25/2018 - 15:20

BalaBhaskarప్రముఖ వయోలినిస్ట్, మ్యుజిషియన్ బాలభాస్కర్ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన ఒకటిన్నరేళ్ల కుమార్తె తేజస్వి బాల అక్కడికక్కడే మరణించగా.. బాలభాస్కర్, ఆయన భార్య లక్ష్మితో సహా డ్రైవర్ తీవ్ర గాయాలపాలయ్యారు. వారిలో బాలభాస్కర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తిరువనంతపురం శివారు ప్రాంతం పల్లిప్పురమ్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. త్రిస్సూర్‌లో ఓ దేవాలయాన్ని దర్శించుకొని తిరిగి వెళ్తుండగా.. వారు ప్రయాణిస్తున్న కారు ఓ చెట్టును ఢీకొని ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కాగా 17ఏళ్ల వయసులో ‘మాంగల్య పల్ల’కు అనే చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా మారిన బాలభాస్కర్.. ఆ తరువాత ‘మోక్షం’, ‘కన్నదిక్కదవతు’ అనే చిత్రాలకు సంగీతం అందించాడు. వయోలినిస్ట్‌గా ఉస్తాద్ జాఖీర్ హుస్సేన్, శివమణి, లూయిస్ బాంక్స్, హరిహరన్, ఫాజల్ ఖురేషి తదితర ప్రముఖులతో కలిసి పనిచేశారు బాలభాస్కర్. సిద్ధిపేటలో ఘోర ప్రమాదం

Updated By ManamFri, 09/14/2018 - 17:04
road accident in siddipet

హైదరాబాద్ : సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఏఎస్-లారీ ఒకదానికొకటి ఢీకొనడంతో అయిదుగురు దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడ్డ మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.  

మృతులు పాములపర్తికి చెందినవారుగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలిస్తున్నారు.  మృతుల కుటుంబీకుల ఆర్తనాదాలతో ఘటనా స్థలం విషాదకరంగా మారింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.కొండగట్టు ప్రమాదంపై హెచ్‌ఆర్సీలో పిటిషన్

Updated By ManamWed, 09/12/2018 - 13:44
Petition Against kondagattu bus accident In HRC

హైదరాబాద్ : జగిత్యాల జిల్లా కొండగట్టు ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై న్యాయవాది అరుణ్ కుమార్ బుధవారం మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రమాదానికి బాధ్యులైన అధికారులపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి, మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని  అరుణ్ కుమార్.. ఆ ఫిర్యాదులో మానవ హక్కుల కమిషన్‌ను కోరారు. మరోవైపు కొండగట్టు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 60కి చేరింది. ఆర్టీసీ చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదం

Updated By ManamTue, 09/11/2018 - 16:19
  • 51కి పెరిగిన మృతుల సంఖ్య

kondagattu bus accident: For the first time in the history of RTCకొండగట్టు : జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన బస్సు ప్రమాద దుర్ఘటన ఆర్టీసీ చరిత్రలోనే అది పెద్దదిగా చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 51మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 32మంది మహిళలు, 15మంది పురుషులు, నలుగురు చిన్నారులు ఉన్నారు. గాయపడ్డ మరో 37మందిని  జగిత్యాల, కరీంనగర్, హైదరాబాద్ ఆస్పత్రుల్లో చికిత్స అందచేస్తున్నారు. మృతుల్లో ఎక్కువమంది పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు చెందినవారు ఉన్నారు. బస్సు డ్రైవర్ శ్రీనివాస్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

Kondagattu bus accident: 51 dead, 37 injured in Telangana

ఆంజనేయస్వామికి ప్రీతిపాత్రమైన మంగళవారం కావడంతో కొండగట్టుపైన ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి వారి ఆలయానికి భారీగా వెళ్లిన భక్తులు త్వరగా రావాలనే తొందరలో సానివారంపేట నుండి జగిత్యాల వస్తున్న ఆర్టీసీ బస్సులో  పరిమితికి మించి ఎక్కారు. తిరుగు ప్రయాణీకులతో ఘాట్ రోడ్‌పై జగిత్యాల వస్తున్న ఆ బస్సు స్పీడ్ బ్రేకర్ వద్ద కుదుపుకు గురవడంతో ప్రయాణీకులు డ్రైవర్ వైపుకి ఒరగటంతో బస్సు అదుపు తప్పి సుమారు 30 అడుగుల లోతులో ఘాట్ రోడ్డు నుండి పడిపోయింది. అయితే బస్సు రాంగ్ రూట్‌లో రావడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానికులు వెల్లడించారు.

బస్సులో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడంతోనే ప్రమాదం జరిగిందని, మరోవైపు బస్సు బ్రేకులు కూడా ఫెయిల్ అవడంతోనే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 88 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. రెట్టింపు సంఖ్యలో ప్రయాణికులు ఉండడంతో ఒకరి మీద మరొకరు పడటంతో ఊపిరాడక అధిక సంఖ్యలో ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ మృతుల్లో 35మందిని పోలీసులు గుర్తించారు.

మృతుల వివరాలు:

1. లాంబ కోటవ్వ 65 ( హిమత్ రావుపేట)
2. బందం లసవ్వ 65 ( ముత్యంపేట)
3. బొల్లారం బాబు 54 ( శనివారంపేట)
4. లైసెట్టి చంద్రయ్య 45 (శనివారంపేట)
5. ఎండికల ఎంకవ్వ ( శనివారంపేట)
6.ఇంద్రికాల సుమ 30 (శనివారంపేట)
7. రాజవ్వ 56 (డబ్బు తిమ్మయ్యపల్లి)
8. ఉత్తమ్ నందిని (కొనపూర్)
9 మాల్యాల అనిల్19 (హిమత్ రావుపేట)
10. గాజుల చిన్నవ్వ 60 ( డబ్బు తిమ్మయ్యపల్లి)

11. నామాల మౌనిక 24 సం ( శనివారంపేట)
12. బైరి రిత్విక్ 3సం ( రామసాగర్)
13. పోలు లక్ష్మి 50 ( హిమత్ రావుపేట)
14. చెర్ల లక్ష్మి 45 ( హిమత్ రావుపేట)
15. గండి లక్ష్మీ 60 ( శనివారం పెట)
16. డబ్బు అమ్మయి 50 ( డబ్బు తిమ్మయ్యపల్లి)
17. బండపల్లి చిలుకవ్వ 76 
18. గోలి అమ్మాయి 44 ( శనివారం పేట)
19. తిప్పర్తి వెంకటరత్నం 56 ( తిరుమల పూర్)
20. కంకణాల ఎల్లవ్వ 70 (సండ్రలపల్లి

21. చెర్ల గంగవ్వ 75 (శనివారం పేట)
22. ఒడినల లసమవ్వా 55 ( తిమ్మయ్యపల్లి)
23. ఒడినల కాశిరం 65 ( తిమ్మయ్యపల్లి)
24 బొంగిని మల్లయ్య 55 (పెద్దపల్లి)
25. గోల్కొండ లచవ్వ 50( డబ్బు తిమ్మయ్యపల్లి) 
26.గోల్కొండ దేవవ్వ 63 ( డబ్బు తిమ్మయ్యపల్లి)
27.కొండ అరుణ్ సాయి 5 (కోరేం) 
28. బొంగోని మదనవ్వా 65(పెద్దపల్లి)
29. శమకురా మల్లవ్వ 38 (తిర్మల్పూర్)
30. సలేంద్ర వరలక్ష్మి 28 (శనివారంపేట)


31. కుంబల సునంద 45 (శనివారంపేట)
32. గుడిసె రాజవ్వ 50 ( శనివారం పేట)
33. పందిరి సతవ్వ 75 (హిమత్ రావుపేట)
34. దాసరి సుశీల 55 (తిరుమలపూర్)
35. రాగల ఆనందం 55 (రామసాగర్) 
36. నేదునూరి మదనవ్వ 75 ( హిమాత్రవుపేట)
37. చెర్ల హైమా 30 ( హిమాత్రవుపేట)
38. పిడిగు రాజవ్వ 30 (డబ్బు తిమ్మయ్యపల్లి)నేడు హరికృష్ణ పెద్ద కర్మ.. పూర్తైన ఏర్పాట్లు

Updated By ManamSat, 09/08/2018 - 09:22

Harikrishnaగత నెల 29న నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సినీ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి హరికృష్ణ  పెద్ద కర్మ ఇవాళ జరగనుంది. నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ గ్రాండ్ లాన్స్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికి జలవిహార్‌లో ఏర్పాట్లు పూర్తి కాగా, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దీనికి హాజరయ్యే అవకాశం ఉంది.

అయితే నెల్లూరు జిల్లాలో ఓ వివాహ వేడుక కోసం గత నెల 29న హరికృష్ణ కారులో వెళుతుండగా.. నార్కట్‌పల్లి సమీపంలో ఆయన కారు డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన హరికృష్ణను కామినేని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

Updated By ManamSat, 09/01/2018 - 09:07
Tamilnadu bus accident:eight killed

చెన్నై : తమిళనాడులోని సేలం సమీపంలోని మామందూరు వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు  ఢీకొన్న దుర్ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందగా, మరో 30మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి .. సేలం నుంచి ధర్మపురికి ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు ..... బెంగళూరు నుంచి సేలం వెళుతున్న బస్సును ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కికక్కడే మరణించగా, మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. కాగా క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. మృతుల్లో నలుగురు కేరళ, ముగ్గురు కర్ణాటక, ఒకరు తమిళనాడుకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. కాగా మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మరోవైపు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం

Updated By ManamFri, 08/31/2018 - 09:06

road accidentసిద్ధిపేట : శుభకార్యానికి హాజరై మరికాసేపట్లో ఇంటికి చేరుకుంటామనగా వారిని మృత్యువు కబళించింది. సంగారెడ్డి జిల్లా సిద్ధిపేటలో  ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్దికుంట సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున తుఫాను వాహనం అదుపు తప్పి లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది.

ఈ దుర్ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరందరికి సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.  కాగా బాధితులు హైదరాబాద్‌ ఎస్సార్ నగర్‌కు చెందినవారుగా గుర్తించారు. కర్ణాటకలో ఓ శుభాకార్యానికి హాజరై నగరానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.అతివేగంతోనే హరికృష్ణ కారుకు ప్రమాదం

Updated By ManamWed, 08/29/2018 - 13:50
  • ప్రమాదం జరిగిన సమయంలో 160 కిలోమీటర్ల వేగం

  • సీటు బెల్టు పెట్టుకుని ఉంటే ప్రమాదం తప్పేది

Nandamuri Harikrishna death: over speed

నల్గొండ : అతివేగం వల్లే నందమూరి హరికృష్ణ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి లోనైనట్లు జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు. ఆయన బుధవారం రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ...‘అతివేగం వల్లే హరికృష్ణ కారుకు ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనం 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. 

వాటర్ బాటిల్ కోసం వెనక్కి తిరగడంతో వాహనం అదుపుతప్పింది. దీంతో డివైడర్‌‌ను ఢీకొని వాహనం 15 మీటర్ల దూరం  ఎగిరిపడటంతో కారులో నుంచి హరికృష్ణ బయట రోడ్డుపై పడిపోయారు. సీటు బెల్ట్ పెట్టుకుని ఉంటే ప్రమాదం తప్పేది.’ అని తెలిపారు. కాగా ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు నెల్లూరు వెళుతున్న హరికృష్ణ వాహనం నల్గొండ జిల్లా అన్నేపల్లి వద్ద ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.
 తమ్ముడు చూడాలనుందన్నారు.. ఇంతలోనే వదిలి వెళ్లారు

Updated By ManamWed, 08/29/2018 - 10:14

Harikrishnaసినీ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆయనతో తమ అనుబంధాన్ని చెప్పుకుంటూ పలువురు సినీ ప్రముఖులు హరికృష్ణకు తమ సంతాపాన్ని ప్రకటించారు. 

‘‘ ‘చాలా రోజులు అయ్యింది తమ్ముడు నిన్ను చూసి, కలవాలి తమ్ముడు’ కొన్ని రోజుల క్రితం నాతో ఈ మాటలు మాట్లాడిన ఆయన ఇప్పుడు దూరంగా వెళ్లిపోయారు. చాలా బాధగా ఉంది. నిన్ను మిస్ అవుతున్నా అన్నయ్య‘‘ అంటూ అక్కినేని నాగార్జున ట్వీట్ చేశారు. హరికృష్ణ హఠాన్మరణం చాలా బాధించిందని, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కుటుంబానికి తమ సంతాపం అంటూ పలువురు ప్రముఖులు తెలిపారు. వారిలో మోహన్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేశ్ బాబు, మంచు మనోజ్, నాని, కాజల్ అగర్వాల్, రామ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, సాయి బెల్లంకొండ, జెనీలియా, రకుల్ ప్రీత్ సింగ్, లక్ష్మీ మంచు,  దేవీ శ్రీ ప్రసాద్, శ్రీనువైట్ల, పూజా హెగ్డే, గౌతమి, శరత్ కుమార్, దర్శకుడు మారుతి, అనసూయ, గోపిచంద్ మలినేని తదితరులు ఉన్నారు.

 

Related News