kondagattu

ఇది మాటలకందని ప్రమాదం..

Updated By ManamTue, 09/11/2018 - 18:32

PM Narendra modi, Kondagattu, Bus accident, shocking beyond words న్యూఢిల్లీ: తెలంగాణలో జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద మంగళవారం జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఇంత భారీ సంఖ్యలో ప్రజలు చనిపోవడం తననెంతో బాధ కలిగిస్తోందని అన్నారు. ఇది మాటలకందని ప్రమాదమని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. ఆర్టీసీ చరిత్రలోనే పెద్దప్రమాదమైన ఈ ఘటనపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాల్సిందిగా డిమాండ్ చేశారు. 

ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ రవాణా శాఖ మంత్రి, టీఎస్ఆర్టీసీ అధికారులను వెంటనే తొలగించాల్సిందిగా డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఆర్టీసీ తరపున 3 లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించినట్టు మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల బస్సు డిపో హనుమంతురావును సస్పెండ్ వేటు పడింది. కాగా, కొండగట్టు ఘాట్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు బోల్తాపడిన ఘటనలో 50మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. అంజన్న సన్నిధిలో తీవ్ర విషాదం

Updated By ManamTue, 09/11/2018 - 13:52
  • కొండగట్టు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం

  • ఆర్టీసీ బస్సు బోల్తా, 45మందికి పైగా మృతి

  • పెరుగుతున్న మృతుల సంఖ్య

  • మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

  • రాంసాగర్ నుంచి జగిత్యాల వెళుతుండగా ప్రమాదం

Kondagattu bus accident: 40 dead, 28 injured in Telangana

కొండగట్టు : జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలోని ఘాట్ రోడ్డు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 40మందికి పైగా మృతి చెందారు. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలంలోనే 26మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 21మంది మహిళలు, 20మంది పురుషులు, నలుగురు చిన్నారులు ఉన్నారు. బాధితులంతా జిగిత్యాల జిల్లాకు చెందినవారే.

తీవ్రంగా గాయపడినవారిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, వైద్యం అందిస్తున్నారు. మరోవైపు ఘ‌ట‌నాస్థ‌లంలోనే అత్య‌వ‌స‌ర చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్పీ సింధూ శర్మ, కలెక్టర్ శరత్ సంఘటనాస్థలానికి చేరుకుని, సహాయక చర్యలు సమీక్షిస్తున్నారు. మరోవైపు ప్రమాదంపై అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. 

అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 70మంది వరకూ ప్రయాణికులు ఉన్నట్లు సమచారం. కాగా శనివారంపేట నుంచి  ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు జగిత్యాల నుంచి రాంనగర్ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. 
Bus accident at Kondagattu Ghat Roadఅనంతలో కరువు యాత్ర

Updated By ManamTue, 01/23/2018 - 10:16

2019లో ఇరు రాష్ట్రాల్లో జనసేన పోటీ
ఒంగోలులో ఫ్లోరోసిస్ బాధితులను కలుస్తా
కొవ్వాడ అణు విద్యుత్‌పై అవగాహన యాత్ర

 సమస్యలపై పరిష్కారానికే రాజకీయాలు
 ఎవరి లబ్ధి కోసమూ పార్టీ పెట్టలేదు: పవన్
 ప్రస్తుతం సినిమాలపై దృష్టి లేదని ప్రకటన

pawan kalyan yatraకరీంనగర్, జనవరి 22 (మనం న్యూస్ బ్యూరో):
 అనంతపురం జిల్లాలో ఈ నెల 27 నుంచి కరువు యాత్ర చేపట్టనున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. సోమవారం తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామిని పవన్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన తన రాజకీయ ప్రణాళికను వివరించారు. పార్టీ కార్యాలయాలను అనంతపురం జిల్లా నుంచే ప్రారంభించామని, అక్కడి నుంచి ఏపీలో తన ప్రజాయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. అనంతరం ఒంగోలులో ఫ్లోరోసిస్, కిడ్నీ బాధితులను కలుస్తామని, విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోనూ పర్యటిస్తామని పేర్కొన్నారు. అలాగే కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టుకు వెళ్తామని, దీనిపై  అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందని అన్నారు. అయితే అనంతపురం పర్యటన పూర్తయిన తర్వాత ఇతర జిల్లాల పర్యటన తేదీలను ఖరారుచేస్తామని పవన్ వెల్లడించారు. 2019లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పుడే చెప్పలేమని, తమ పార్టీ బలమెంత అనేది ఎన్నికలకు రెండు నెలల ముందు తెలుస్తుందని, అప్పుడే నిర్ణయం తీసుకోగలుగుతామని చెప్పారు. అయితే తన రాజకీయాలతో చిరంజీవికి సంబంధం లేదని, కుటుంబంలో ఎవరి మద్దతు కోరలేదని, కోరబోనని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుతం సినిమాలపై ఇక తనకు దృష్టి లేదని వెల్లడించారు. తమ పార్టీని బీజేపీ అసలు గుర్తించడం లేదని, పార్టీ పెట్టడం ఎందుకు బీజేపీలో చేరాలని అమిత్ షా తనకు సూచించారని, ఆయన ప్రతిపాదనను తాను సున్నితంగా తిరస్కరించానని పవన్ చెప్పారు. సమస్యల పరిష్కారం కోసమే తాను రాజకీయాలు చేస్తానని, ఎవరికీ లబ్ధి చేకూర్చడానికి పార్టీ పెట్టలేదని వివరించారు. 
ఇరు తెలుగు రాష్టాల్లో చాలా సున్నితమైన సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి పోరాడుతామని అన్నారు. విధ్వంసపూరిత రాజకీయాలు చేయబోనని, తాను ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూసే వ్యక్తిని కాదని, జనసేన ప్రతి అడుగు నిర్మాణాత్మకంగా ఉంటుందని చెప్పారు. ఓటుకు నోటు అంశం తప్పని తనకు తెలిసినప్పటికీ రాజకీయంగా అస్థిరతకు కారణమవ్వడం ఇష్టంలేక మౌనంగా ఉన్నానని చెప్పారు. ఇప్పుడు ఈ పని అన్ని పార్టీలు చేస్తున్నదేనని అభిప్రాయపడ్డారు. కాగా, దశాబ్దాల పోరాటం తర్వాత ఆవిర్భవించిన తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిపై తమ పార్టీ బృందం అధ్యయనం చేస్తోందని చెప్పారు. అలాగే అన్ని జిల్లాల కార్యకర్తలతో చర్చించి.. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి సూచనలు చేస్తామని అన్నారు. తెలంగాణ అంటే తనకు ఎంతో ప్రేమ ఉందని, ఇక్కడ కూడా తనకు అభిమానులు ఉన్నారని, రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తామని వెల్లడించారు. తెలంగాణపై అవగాహన ఉన్న మేధావులతో జనసేన చర్చిస్తోందని, వారు పార్టీలోకి రాకపోయినా.. వారి సలహాలతో ముందుకు వెళ్తామని పవన్ చెప్పారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించనున్నట్లు వివరించారు.
కేసీఆర్‌ను కలిస్తే తప్పేంటి?
సీఎం కేసీఆర్‌ను కలవడంపై వచ్చిన ఆరోపణలను పవన్ కల్యాణ్ ఖండించారు. సీఎం కేసీఆర్‌కు తాను నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు ఆయనను కలవడంలో తప్పేంటని ప్రశ్నించారు. దశాబ్దాలుగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్ష కేసీఆర్ వల్లే సాకారమైందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజకీయ ఏకీకరణ చేసిన ఘనత ఆయనదేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన ఎంతగానో కష్టపడుతున్నారని, ఆయన చేయగలిగింది చేస్తున్నారని పవన్ చెప్పారు. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నో సవాళ్లు ఉన్నాయని, వాటి పరిష్కారానికి జనసేన చేయగలిగిన సాయం చేస్తుందని వెల్లడించారు.

కొండగట్టు ఆంజనేయస్వామిని నమ్మితే అసాధ్యాలు కూడా సుసాధ్యమవుతాయని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. హైదరాబాద్ నుంచి సోమవారం ఉదయం కొండగట్టుకు బయలుదేరిన పవన్‌కు ఆయన భార్య అన్నా లెజినోవా హారతి ఇచ్చి.. బొట్టు పెట్టి సాగనంపారు. ఆయన కారుకు మహిళలు గుమ్మడికాయతో దిష్టి తీసి పంపారు. అంతకు ముందు పార్టీ మహిళా విభాగం ‘వీర మహిళ’ ఫేస్‌బుక్ పేజీని పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి కరీంనగర్ చేరుకున్న ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి పవన్ కల్యాణ్ కొండగట్టుకు చేరుకుని అంజన్న దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే అంజన్న దయ వల్లే. నేను 2009 ఎన్నికల ప్రచారానికి ఇక్కడికి వచ్చినప్పుడు నాకు విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం జరిగింది. ఆయన దయతో ప్రాణాలతో బయటపడ్డా. నేను సంపూర్ణ రాజకీయ జీవితంలోకి రావాలనుకున్నప్పుడు కొండగట్టు అంజన్నను దర్శించుకోవాలనుకున్నాను. అంజన్నను నమ్ముకుంటే అసాధ్యాలైనా సుసాధ్యం కావాల్సిందే. అందుకే ఇక్కడి నుంచే ప్రజా యాత్ర ప్రారంభిస్తున్నా’ అని చెప్పారు. కాగా, ఆలయ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని పవన్ చెప్పారు. ఈ సందర్భంగా ఆలయానికి రూ.11 లక్షల విరాళాన్ని అందజేశారు.
 2019లో పోటీపై క్లారిటీ ఇవ్వని పవన్!

Updated By ManamMon, 01/22/2018 - 18:18

pawan kalyanకరీంనగర్: కొండగట్టు నుంచి రాజకీయ యాత్రను ప్రారంభించిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దర్శనానంతరం కరీంనగర్‌‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు సమస్యల గురించి ప్రస్తావించారు. తెలంగాణ సమస్యలపై తమ బృందం అధ్యయనం చేస్తోందని పవన్ చెప్పారు. జనవరి 23,24తేదీల్లో అంటే రేపు, ఎల్లుండి పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. సమస్యలపై తెలంగాణలో అన్ని జిల్లాల కార్యకర్తలతో చర్చిస్తానని పవన్ చెప్పారు. సమస్యలపై కార్యకర్తలతో చర్చించిన తర్వాత ప్రభుత్వానికి సూచనలు చేస్తానని ఆయన వెల్లడించారు. జనవరి 27నుంచి అనంతపురంలో కరవు యాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వాలతో గొడవ పెట్టుకునే ఉద్దేశం తనకు లేదని పవన్ చెప్పడం విశేషం. ఏపీ ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవాల్సిన సమస్యలు ఉన్నప్పటికీ.. సమస్యకు పరిష్కారం కావాలన్న ఉద్దేశంతోనే సున్నితంగా వ్యవహరిస్తున్నట్లు పవన్ తెలిపారు. 2019లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు పవన్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ఎన్నికలకు రెండు నెలల ముందు తమ పార్టీ సామర్థ్యాలపై ఓ అవగాహనకు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని పవన్ కల్యాణ్ చెప్పారు.అంజన్నా.. చల్లగా చూడు

Updated By ManamMon, 01/22/2018 - 14:21

Pawan Kalyanకరీంనగర్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొండగట్టుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పూజారులు అతడికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా.. ప్రత్యేక పూజలు నిర్వహించి ఆంజనేయుడి ఆశీస్సులు తీసుకున్నారు పవన్ కల్యాణ్. 

ఈ సందర్భంగా ఆలయానికి 11లక్షల విరాళాన్ని అందజేశారు పవన్. అనంతరం మాట్లాడుతూ.., "ఆంజనేయ స్వామి అనుగ్రహంతోనే పార్టీని స్థాపించాను, స్వామి ఆశీస్సులతోనే 2009లో బతికి బట్ట కట్టాను. నన్ను చల్లగా చూడాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను, ఆలయ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తాను" అని పవన్ తెలిపారు. ఇదిలా ఉంటే మరోవైపు పవన్ రాకతో కొండగట్టు ప్రాంతం జనసంద్రంగా మారింది. వేలాదిగా వచ్చిన అభిమానులు పవన్‌తో చేయి కలిపేందుకు ఎగబడుతున్నారు.కొండగట్టుకు బయలుదేరనున్న పవన్ కల్యాణ్

Updated By ManamMon, 01/22/2018 - 08:08

Pawan Kalyanహైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉదయం 9గంటలకు జనసేన పార్టీ ఆఫీస్ నుంచి కొండగట్టును బయలుదేరనున్నారు. మధ్యాహ్నం అక్కడ కొండగట్టు ఆంజనేనస్వామిని దర్శించుకున్న అనంతరం కరీంనగర్‌ పర్యటనకు వెళ్లనున్నారు.

తెలంగాణలో మూడు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఛలోరే చల్ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మంగళవారం ఉదయం ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటించనున్న పవన్, అక్కడి జనసేన కార్యకర్తలతో భేటీ కానున్నారు. ఆ తరువాత మంగళవారం మధ్యాహ్నం కొత్తగూడెంకు వెళ్లనున్న పవన్, రాత్రికి అక్కడే బస చేసి బుధవారం ఖమ్మంకు వెళ్లనున్నారు. ఇక బుధవారం పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 3గంటలకు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో జనసేన కార్యకర్తలతో భేటీ కానున్నారు.పవన్ టూర్ వివరాలను ప్రకటించిన జనసేన

Updated By ManamSun, 01/21/2018 - 19:42

pawankహైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొండగట్టు అంజన్న సాక్షిగా తన రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన రేపటి యాత్రకు సంబంధించి షెడ్యూల్‌ను జనసేన ప్రకటించింది. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి పవన్ జగిత్యాల జిల్లా కొండగట్టుకు వెళ్లనున్నారు. ఉదయం 9గంటలకు జనసేన పార్టీ ఆఫీస్ నుంచి కొండగట్టుకు పవన్ బయల్దేరతారు. మధ్యాహ్నం 3గంటలకు కొండగట్టుకు చేరుకోనున్నారు. అక్కడి ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేస్తారు. అక్కడే తన యాత్ర ప్రణాళికను వివరిస్తారు. అక్కడ నుంచి సాయంత్రం కరీంనగర్‌కు పవన్ వెళతారు. 23న ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆయా జిల్లాల జనసేన కార్యకర్తలతో భేటీ అవుతారు. 23వ తేదీ సాయంత్రం సుమారుగా 6.30కు ఖమ్మం జిల్లా కొత్తగూడెం చేరుకుని, రాత్రికి అక్కడే బస చేస్తారు. 24న ఉదయం 9.30గంటలకు పవన్ కొత్తగూడెం నుంచి భారీ ప్రదర్శనగా బయల్దేరి ఖమ్మం వెళతారు. అదేరోజు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో పర్యటిస్తారు. అక్కడి కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌కు పయనమవుతారు.

janasenaకొండగట్టు నుంచి పవన్ యాత్ర

Updated By ManamSat, 01/20/2018 - 19:54
pawankalyan

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుంచి తన రాజకీయ యాత్రను ప్రారంభించనున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. తన రాజకీయ పర్యటన ప్రణాళికను అక్కడే ప్రకటిస్తానని శనివారం సాయంత్రం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. తమ కుటుంబానికి కొండగట్టు ఆంజనేయస్వామి ఇలవేల్పుగా పేర్కొన్నారు. అందుకే కొండగట్టు నుంచి తన నిరంతర రాజకీయ యాత్రను ప్రారంభించడానికి కారణమని తెలిపారు. 2009లో ఎన్నికల ప్రచార సమయంలో పెను ప్రమాదం నుంచి తాను ఇక్కడే క్షేమంగా బయటపడ్డానని గుర్తు చేసుకున్నారు. సర్వమత ప్రార్థనల అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశీస్సుల కోసం, సమస్యల అధ్యయనం, అవగాహన కోసం ఈ యాత్రతో వస్తున్నట్లు తెలిపారు. తనను తెలుగు ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కొండగట్టుకు ఎప్పుడు వెళ్లేది పవన్ ఆదివారం ప్రకటిస్తారని సమాచారం. 
 

Related News